English | Telugu

తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే మలైకా ఇలా చేస్తుందని అనుకోలేదు

ప్రముఖ బాలీవుడ్ నటీమణి మలైకా అరోరా(malaika arora)తండ్రి అనిల్ అరోరా గత నెలసెప్టెంబర్ పదకొండు న ముంబైలోని తన నివాసంలో టెర్రస్ మీద నుంచి దూకి ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో జరిగిన ఈ సంఘటనతో ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తం షాక్ కి గురయ్యింది. ఇక మలైకా అయితే తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయింది.ఎప్పుడు సరదాగా ఉండే మలైకా దాదాపుగా  బ‌య‌టి ప్ర‌పంచానికి కూడా దూరమైందని చెప్పవచ్చు.

 కానీ నవరాత్రి సందర్భంగా మొన్న శుక్రవారం ప్రఖ్యాత జ్యువెలరీ బ్రాండ్ నిర్వహించిన  ఈవెంట్‌కు మలైకా హాజరయ్యింది. బంగారు అంచుతో కూడిన అందమైన ఐవరీ చీర,మ‌ల్టీ లేయర్డ్ పెర్ల్ నెక్లెస్, పచ్చ లాకెట్టు వంటి  సాంప్రదాయ ఆభరణాలు ధరించి కార్పెట్‌పై నడుస్తూ కెమెరాలకు పోజులిచ్చింది.ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వ‌డంతో అభిమానులు, నెటిజ‌నుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తన్నాయి. సాంప్రదాయ సంతాప దినాలు దాటకముందే ఈవెంట్ కి ఎలా హాజరయ్యావు, మీ తండ్రి ఇప్పుడే మరణించారు. ఇప్పటికే సంతాపాన్ని ముగించారా, ఆమె ఆంత సులభంగా ఈవెంట్ లో ఎలా పాల్గొంది. కుటుంబంలో విషాదం అయిన‌ వెంటనే ఉత్సవాల్లో కనిపించడం సిగ్గు చేటు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.అయితే మ‌లైకాకు మ‌ద్ధ‌తు ప‌లికిన అభిమానులు లేక‌పోలేదు. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే పదిహేను,ఇరవై రోజుల తర్వాత మనమందరం తిరిగి పనికి వెళ్తాం. అదే విధంగా ఆమె పనిని  గౌరవిద్దాం. పబ్లిక్ లైఫ్ లో ఉండే వ్యక్తులను అన్ని సమయాల్లో పరిశీలించాల్సిన అవసరం లేదు. దుఃఖాన్ని తట్టుకుంటూ తన జీవితాన్ని గడపడానికి ఆమెకు అనుమతి ఉందని అంటూ పలువురు   మ‌ద్ధ‌తు  తెలుపుతున్నారు.

మలైకా తెలుగులో పవన్ కళ్యాణ్(pawan kalyan)వన్ మాన్ షో గబ్బర్ సింగ్ లోని కెవ్వు కేక అనే ఐటెం సాంగ్ లో చేసింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ని 1998 లో వివాహం చేసుకున్న మలైకా 2017 లో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తన కంటే వయసులో చాలా చిన్నవాడైన దివంగత శ్రీదేవి భర్త బోని కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది.