English | Telugu

2021లో ధ‌నుష్ పంచ‌చిత్ర ప్ర‌ణాళిక‌

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ముందుకు సాగుతున్నారు కోలీవుడ్ స్టార్ ధ‌నుష్. కేవ‌లం త‌మిళ చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా.. అన్య‌భాష‌ల్లోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్నారు ఈ టాలెంటెడ్ హీరో.

ఇదిలా ఉంటే.. 2021 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ ధ‌నుష్ కి ఎంతో ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. త‌న కెరీర్ లో ఎన్న‌డూ లేని విధంగా ఐదు చిత్రాల‌తో (క‌థానాయ‌కుడిగా) ఈ ఏడాది సంద‌డి చేయ‌నున్నారు ధ‌నుష్.  

ఆ సినిమాల వివ‌రాల్లోకి వెళితే.. కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ న‌టించిన `జ‌గ‌మే తంతిర‌మ్` త్వ‌ర‌లోనే ఓటీటీలో రిలీజ్ కానుండ‌గా.. ఏప్రిల్ 9న మారి సెల్వ‌రాజ్ డైరెక్ష‌న్ లో న‌టించిన `క‌ర్ణ‌న్` విడుద‌ల కానుంది. ఇక ఆగ‌స్టు 6న ఆనంద్ ఎల్. రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న హిందీ చిత్రం `ఆత్రంగి రే` జ‌నం ముందుకు రానుండ‌గా.. ఇదే సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో సెల్వ‌రాఘ‌వ‌న్ కాంబినేష‌న్ లో చేస్తున్న `నానే వ‌రువేన్`, కార్తిక్ న‌రేన్ డైరెక్టోరియ‌ల్ కూడా థియేటర్స్ లో సంద‌డి చేయ‌నున్నాయి. మొత్త‌మ్మీద‌.. ధ‌నుష్ అభిమానుల‌కు ఇది ఆనందాన్నిచ్చే అంశ‌మ‌నే చెప్పాలి.

2011, 2013, 2015 క్యాలెండ‌ర్ ఇయ‌ర్స్ లోనూ ధ‌నుష్ ఐదేసి సినిమాల‌తో ప‌ల‌క‌రించిన వైనం ఉంది. అయితే ఆయా సంవ‌త్స‌రాల్లో ఒక‌ట్రెండు చిత్రాల్లో అతిథి వేషాల్లో ప‌ల‌క‌రించారు. హీరోగా మాత్రం పంచ‌చిత్ర ప్రణాళిక‌తో ప‌ల‌క‌రించ‌డం 2021లోనే చోటుచేసుకోనుండ‌డం విశేష‌మ‌నే చెప్పాలి. మ‌రి.. ఈ చిత్రాలు ధ‌నుష్ కి ఎలాంటి ఫ‌లితాల‌ను అందిస్తాయో చూడాలి.