English | Telugu

తొలిసారి త‌ల్ల‌వుతున్న టాప్ సింగ‌ర్‌!

 

దేశంలోని టాప్ సింగ‌ర్స్‌లో ఒక‌రైన శ్రేయా ఘోష‌ల్ తొలిసారి త‌ల్లి కాబోతున్నారు. త‌న భ‌ర్త శిలాదిత్య‌తో క‌లిసి ఈ విష‌యాన్ని ఆమె ప్ర‌క‌టించారు. త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఫొటోలో ఆమె త‌న పెరిగిన పొట్ట‌ను చూపించారు. బ్లూ డ్ర‌స్ ధ‌రించిన ఆమె బాల్క‌నీలో న‌వ్వుతూ కెమెరాకు పోజిచ్చారు.

ఈ గుడ్ న్యూస్‌ను పంచుకున్న శ్రేయా ఘోష‌ల్‌, "బేబీ శ్రేయాదిత్య రాబోతోంది! ఈ న్యూస్‌ను మీతో పంచుకోవ‌డానికి శిలాదిత్య‌, నేను ఎంతో థ్రిల్ అవుతున్నాం. మా జీవితాల్లో కొత్త అధ్యాయానికి ప్రిపేర‌వుతున్న వేళ మీ అంద‌రి ప్రేమ‌, ఆశీస్సులు కావాలి." అని రాసుకొచ్చారు.

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని శ్రేయ కొలీగ్స్‌, అభిమానులు ఆమె పోస్ట్‌ను అభినంద‌న‌ల సందేశాల‌తో నింపేశారు. ఫేమ‌స్ సింగ‌ర్ శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, "కంగ్రాచ్యులేష‌న్స్ శ్రేయ‌, శిలాదిత్య" అని కామెంట్ చేయ‌గా, సోఫీ చౌద‌రి, "ఇది చాలా చాలా అమేజింగ్‌!! అమిత‌మైన ప్రేమ‌, అభినంద‌నాలు మై డార్లింగ్" అని పోస్ట్ చేసింది. 

చాలా కాలం పాటు శిలాదిత్య‌తో డేటింగ్ చేసిన శ్రేయా ఘోష‌ల్ 2015 ఫిబ్ర‌వ‌రి 5న ఆయ‌న‌తో మూడు ముళ్లు వేయించుకున్నారు. టాలీవుడ్‌లో ఎన్నో పాట‌ల‌ను మ‌ధురంగా ఆల‌పించిన ఆమె లేటెస్ట్ సింగిల్ 'అంగ‌నా మోరీ' ఇటీవ‌లే విడుద‌లైంది.