English | Telugu

బాలీవుడ్ బాట‌లో `డ్రైవింగ్ లైసెన్స్`!

ఓ స్టారో హీరోకి, అత‌ని అభిమాని అయిన ఓ మోటర్ వెహిక‌ల్ ఇన్స్ పెక్ట‌ర్ కి మ‌ధ్య సాగే ఇగో క్లాష్ వారి జీవితాల‌ను ఎలా మార్చింది? అనే పాయింట్ తో తెర‌కెక్కిన మ‌ల‌యాళ చిత్రం `డ్రైవింగ్ లైసెన్స్`. 2019 క్రిస్మ‌స్ సీజ‌న్ లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన ఈ సినిమాలో స్టార్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించ‌గా.. అత‌ని అభిమానిగా సూర‌జ్ క‌నిపించారు. లాల్ జూనియ‌ర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. విక్ట‌రీ వెంక‌టేశ్, మాస్ మ‌హారాజా ర‌వితేజ.. ఇలా ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు ఈ రీమేక్ కోసం వినిపించాయి. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

కాగా, ఇప్పుడీ చిత్రం బాలీవుడ్ బాట ప‌ట్ట‌నుంద‌ని స‌మాచారం. మాతృక‌లో పృథ్వీరాజ్ చేసిన పాత్ర‌ని అక్ష‌య్ కుమార్, సూర‌జ్ పోషించిన పాత్ర‌ని ఇమ్రాన్ హ‌ష్మి చేయ‌బోతున్నారు. రాజ్ మెహ‌తా డైరెక్ట్ చేయ‌నున్న ఈ సినిమాని క‌ర‌ణ్ జోహార్ నిర్మించ‌నున్నారు. మ‌రి.. ఒరిజ‌న‌ల్ లాగే ఈ రీమేక్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తుందేమో చూడాలి.