గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం: 35 మంది మృతి

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్‌లో వున్న టి.ఆర్.పి. గేమ్ జోన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది చిన్నపిల్లలు వున్నారు. మంటల్లో చిక్కుకున్న చాలామంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతాయన్న భయం వ్యక్తమవుతోంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ అగ్నిప్రమాదం పట్ల ప్రధాని నరేంద్రమోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. మృతులకు సంతాపం, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

మీ రాజకీయాలు తగలెయ్య.. నా కూతుర్ని కాపాడండయ్యా!

కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్ళి రెండు నెలలు దాటిపోయింది. కవిత ఎన్నిరకాల కారణాలు చెప్పి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎప్పటికప్పుడు వినాయకుడి పెళ్ళిలాగా వాయిదా పడుతూనే వుంది. అంతేకాకుండా..  పురుగుమీద పుట్రలాగా ఈడీ కేసుకు తోడు, సీబీఐ కేసు కూడా చేరి మూలిగే అక్క మీద తాటికాయ పడ్డట్టుగా పరిస్థితి మారింది. తల్లి దగ్గర లేకుండానే కవిత పిల్లల పరీక్షలు ముగిశాయి. బీఆర్ఎస్‌కి స్టార్ కాంపైనర్ లేకుండానే ఎలక్షన్లు ముగిశాయి. తెలంగాణ ప్రజలు కవిత అనే ఒక కేరెక్టర్ వుంది అనే విషయం కూడా మెల్లగా మర్చిపోతున్నారు. ఈడీ, మోడీ, బోడి ఎవరొచ్చినా మమ్మల్నేమీ చేయలేరు...  మా జోలికి వస్తే తెలంగాణ సమాజం మొత్తం తిరగబడుతుంది. మీద పడి రక్కుతుంది అని బిల్డప్పు ఇచ్చుకున్న కవితను ప్రస్తుతం జనం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. మందుబాబులు మందు కొట్టడం ఎంతమాత్రం మానలేదు.. అరె.. మన మందు కోసం కవితమ్మ జైల్లోకి వెళ్ళింది కదా.. ఆమెకి మద్దతుగా మందు కొట్టడం ఆపేద్దాం అని ఎవరూ అనుకోవడం లేదు. తెలంగాణ జనం కవిత అరెస్టుని లైట్‌గా తీసుకున్నారు.. ఓకే.. కవితని జనం పట్టించుకోకపో్తే పట్టించుకోకపోయారు.. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి.  చివరికి కవిత తండ్రి కేసీఆర్, కవిత అన్న కేటీఆర్ కూడా కవిత అరెస్టుని లైట్‌గా తీసుకున్నట్టు అనిపిస్తోంది.  ఢిల్లీలో చక్రం తిప్పుతా, నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టుగా మాట్లాడిన కేసీఆర్, తన కుమార్తెని విడిపించుకునే విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు తప్ప, కవితని విడిపించడానికి రాజకీయంగా చాణక్యం ఏదైనా చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టులేరు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే, అసలు తన కూతురు అరెస్టు కాలేదు అన్నట్టుగానే వుంది. మరోవైపు కేటీఆర్ అయితే, పాపం ఆయనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అర్జెంటుగా ఎలా కూలదోయాలా అన్న ఆలోచనలోనే వున్నారు తప్ప, తోబుట్టువును బయటకి తీసుకురావడానికి తన తండ్రి మీద ఒత్తిడి తేవాలన్న ఆలోచనలో ఉన్నట్టులేరు. ఇక హరీష్‌రావుకి, గానీ సంతోష్‌రావుకి గానీ కవిత జైల్లో వుండటం పెద్ద బాధ కలిగించే విషయం కాదు. వీళ్ళంతా కవిత విషయంలో చాలా రిలాక్స్.గా వున్నారు. కానీ, ఒక్క మనిషి మాత్రం కవిత అరెస్టు అయినప్పటి నుంచి కుమిలిపోతూ వున్నారు. ఆమె ఎవరో కాదు.. కవిత మాతృమూర్తి శోభ! అల్లారుముద్దుగా పెంచిన కన్న కూతురు జైల్లో వుంటే, ఇటు భర్త, అటు కొడుకు ఇద్దరూ కవితని విడిపించడానికి రాజకీయంగా ఏం చేయాలన్నది ఆలోచించకుండా మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలా అనే ఆలోచిస్తూ వుండటం ఆమెకు ఎంతమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. ఇద్దర్నీ ఎంత బతిమాలినా కొంచెం వెయిట్ చెయ్యి, పరిస్థితులు అన్నీ అవే సర్దుకుంటాయి అని చెబుతున్నారట. ఎంత ఒత్తిడి చేసినా ఎలక్షన్లు అయ్యాక పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారతాయి. అప్పుడు కవితని విడిపించడం ఈజీ అవుతుందని చెబుతూ ఆమెని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారట. ఆమె మాత్రం జైల్లో కూతురు ఎలా వుందో, ఎన్ని బాధలు పడుతోందో అని మనోవేదనతో కుమిలిపోతూ వున్నట్టు సమాచారం.

సోనియా, రాహుల్ కాంగ్రెస్ కు ఓటు వేయలేదు!

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శనివారం (మే 25) జరిగిన ఆరో విడత పోలింగ్ లో కాంగ్రెస్ అగ్రనేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. న్యూఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో  తల్లీ కుమారులిద్దరూ తమ ఓటు వేశారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. తమ జీవితంలో తొలి సారిగా కాంగ్రెస్సేతర పార్టీకి తమ ఓటు వేశారు. అయితే ఇందులో వారిని తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా  ఈ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అంటే ఇండియా కూటమి అభ్యర్థిగా ఆప్ నాయకుడు సోమనాథ్ భారతి నిలబడ్డారు. దీంతో సోనియాగాంధీ,  రాహుల్ గాంధీ తమ ఓటును సోమనాథ్ భారతికి వేశారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే వీరిరువురూ  కాంగ్రెస్ కు కాకుండా మరో పార్టీకి ఓటు వేసిన సందర్భం ఇదే మొదటిది. 

విభ‌జ‌న గాయాలు ఇప్ప‌టికీ ప‌చ్చిగానే ఉన్నాయి! న‌ష్ట‌పోతోంది సీమాంధ్ర ప్ర‌జ‌లే!

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప‌దేళ్ల త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌లు అంశాల‌కు కాలం చెల్లుతుంది. అయితే ఏపీ నేత‌లు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు త‌డిబ‌ట్ట వేసుకొని నిద్దుర‌పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ రాజధాని నగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది. అధికారిక వర్గాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విభ‌జ‌న పూర్తి కాలేదు.  1. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్‌లో జాబితా చేశారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు, కార్పొరేషన్‌లు ఉన్నాయి.  చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి. రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా భిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనపై సిఫార్సులు చేసినప్పటికీ, ఈ అంశం అపరిష్కృతంగానే ఉంది.  2. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ ఈ ఏడాది జూన్ 2వతేదీ నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ, 2016వ సంవత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయం, దాదాపు రాష్ట్ర పరిపాలన కార్యాలయాలను ఏపీలోని అమరావతికి మార్చారు. అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ప్రపంచ స్థాయి రాజధానిని అభివృద్ధి చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు.  ఏపీకి ఇప్ప‌టికీ పూర్తిస్థాయి రాజ‌ధాని అందుబాటులోకి రాలేదు.  మ‌రో వైపు ఉమ్మ‌డి రాజ‌ధాని విష‌యంపై ఏపీ చేతులు ఎత్తేసింది. 3. ఆర్టీసీ ఆస్తుల వివాదం ఇప్ప‌టి వ‌ర‌కు తేల‌లేదు. విభ‌జ‌న చ‌ట్టంలో ఆర్టీసీ ఆస్తుల‌ను 10 ఏళ్ల‌లోగా ప‌రిష్క‌రించుకోవాలని.. చెప్పారు. ఆ త‌ర్వాత‌.. అని ఎక్క‌డా చెప్ప‌లేదు. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం తెలంగాణాలోని ఆర్టీసీ ఆస్తుల్ని పూర్తిగా తీసుకునేలా చ‌క్రం తిప్పుతోంది. ఇది ఏపీ ఆర్టీసీకి ఇబ్బందిక‌రంగా మారింది. హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరింది. దానికి టీఎస్‌ఆర్‌టీసీ నిరాకరించింది. షీలా భిడే ప్యానెల్ ఇచ్చిన హెడ్‌క్వార్టర్స్ నిర్వచనం ప్రకారం ఆర్టీసీ ఆస్తులు తమకు చెందినవని టీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు చెందినవేనని, తెలంగాణ గడ్డపై ఉన్న ఆస్తుల్లో ఏపీకి వాటా ఎలా ఇస్తామని తెలంగాణా నేత‌లు చెబుతున్నారు.  ఆర్టీసీ ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం వాటా ఇవ్వాల్సిందేనని ఏపీ నేత‌లు చెబుతున్నారు. ఆర్టీసీ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఓ కొలిక్కి రాలేదు.  4. హైద‌రాబాద్‌లోని ఏపీ భ‌వ‌నాలు.. కార్యాల‌యాల విష‌యం కూడా తేల‌లేదు. 5. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, తెలంగాణా నుంచి  6,111 కోట్ల రూపాయల విద్యుత్ బ‌కాయిలు రావాల్సి ఉంది. విభజన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించి బకాయిల చెల్లింపు విషయంలో  రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు.  6. ఉద్యోగుల పంపిణీ కూడా అలానే ఉంది.  రాష్ట్ర విభజన తర్వాత 144 మంది తెలంగాణ ఉద్యోగులు 2014 నుంచి ఏపీలో పనిచేస్తున్నారు. వీరిని వెనక్కి తీసుకురావాలని, తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ అధికారుల సంఘం మే 18వతేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందించింది.  7. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చారు. అదేమిటంటే,  జూన్ 2 త‌ర్వాత‌ త‌మ ప‌రిధిలో ఉన్న అన్ని కార్యాల‌యాల‌ను తెలంగాణ‌లో క‌లిపేయాలని లిఖిత పూర్వ‌క ఆదేశాలు ఇచ్చారు. ఏపీకు పదేళ్లపాటు ఇచ్చిన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ ప్రభుత్వ అతిథి గృహం వంటి భవనాలను జూన్ 2వతేదీ తర్వాత స్వాధీనం చేసుకోవాలని సి.ఎం. అధికారులకు ఆదేశించారు.  ఆంధ్ర రాష్ట్ర సమస్యలను జగన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. వైసీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్‌లో నోరెత్తలేదు.  విభజన హామీల‌న్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య ఆస్తుల విభజన, విద్యుత్‌ బిల్లుల బకాయిలు వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. విభ‌జిత రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. అలా ప‌దేళ్ళు గ‌డిచిపోయాయి.  అయితే రాష్ట్రం ఇబ్బందులు త‌న‌కేమీ ప‌ట్ట‌నట్టుగా కేంద్రం ఉద్దేశ‌పూర్వ‌కంగానే నిర్లక్ష్య వైఖ‌రి అవ‌లంభిస్తోంది.  తెలుగువారు రెండు ముక్క‌లు కావ‌డం. త‌ద్వారా ఢిల్లీ స్థాయిలో వారి ప‌లుకుబ‌డి, ప్రాభ‌వం త‌గ్గింది. అస‌లు ప్రాంతీయ పార్టీల‌ను క‌నుమ‌రుగు చేసేందుకు జాతీయ పార్టీలు  ఉమ్మ‌డిగా చేసిన కుట్ర‌లో భాగ‌మే రాష్ట్ర విభ‌జ‌న  అని ఆంధ్ర మేధావులు చెబుతున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీలు రెండు రాష్ట్రాల‌ను త‌మ రాజ‌కీయ ప్ర‌యోగ‌శాల‌లుగా మార్చేశాయి. అయితే ఈ ఆట‌లో కాంగ్రెస్ తీవ్రంగా న‌ష్ట‌పోయింది.  బీజేపీ ఏమాత్రం ప్ర‌యోజ‌నం పొంద‌గ‌ల‌దనేది భ‌విష్య‌త్తులో తేల‌నుంది. ఒక‌టి మాత్రం నిజం ఈ క్రూర‌మైన రాజ‌కీయ క్రీడ‌లో దారుణంగా న‌ష్ట‌పోయింది మాత్రం సీమాంధ్ర ప్ర‌జ‌లు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

మోడీకి ఆర్ఎస్ఎస్ సెగ?.. మెజారిటీ తగ్గితే రిప్లేస్ మెంటేనా?

ఈ సారి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఎన్డీయే కూటమి కొలువుదీరినా ప్రధానిగా మోడీకి గతంలో ఉన్నంత సీన్ ఉండదా? అంటే ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి ఔనన్న మాటే వినిపిస్తోంది. గత ఎన్నికలలో  బీజేపీ సొంతంగా గెలుచుకున్న సీట్ల కంటే ఈ సారి ఏ మాత్రం తగ్గినా మోడీ రీప్లేస్ మెంట్ విషయంలో బీజేపీలో, బీజేపీ పొలిటికల్ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ లో విస్తృత చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారాన్ని అందుకునే స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న ప్రబలమైన శక్తి ఆర్ఎస్ఎస్ అన్న విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. అందుకే రైటిస్టుల్లో లెఫ్టిస్టుగా పేరు పొందిన వాజ్ పేయి కూడా తన నిర్ణయాలు, విధానాల అమలు విషయంలో ఆర్ఎస్ఎస్ అనుమతి, సలహాలు, సూచనలూ తీసుకునే వారని ఆయన కేబినెట్ లో పని చేసిన వారే కాదు, ఆయన సహచరుడిగా గుర్తింపు పొందిన అద్వానీ కూడా పలు సందర్భాలలో చెప్పారు.  ఇక ప్రస్తుతానికి వస్తే గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పలు నిర్ణయాల విషయంలో ఆర్ఎస్ఎస్ సలహాలూ, సూచనలనూ ఇసుమంతైనా ఖాతరు చేయకుండా వ్యవహరించిందని బీజేపీ వర్గాలే అంటుంటాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ తో రాజకీయంగా ఎదిగిన వారిని ఒక్కొక్కరినీ మెల్లిమెల్లిగా పక్కన పెడుతూ మోడీ పార్టీలో ఏకైక నేతగా ఎదిగేందుకు ప్రయత్నించారనీ, అందుకు ఆయనకు అమిత్ షా పూర్తిగా సహకరించారనీ అంటారు. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్న అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను పక్కన పెట్టే విషయంలో ఆర్ఎస్ఎస్ అభ్యంతరాలను ఇసుమంతైనా పట్టించుకోలేదని చెబుతారు. వయస్సు సాకుగా చూపి అద్వానీ, జోషీలను పక్కన పెట్టేసిన మోడీ, షా ద్వయం.. ఇప్పుడు ఏడు పదుల వయస్సుకు చేరువైన మోడీ విషయంలో మాత్రం వయస్సు విషయానికి పట్టింపు లేదన్నట్లుగా మాట్లాడడాన్ని ప్రత్యేకంగా ఎత్తి చూపుతున్నారు.  ఇంత కాలం వేచి చూసే ధోరణి అవలంబించిన ఆర్ఎస్ఎస్ ఇక మోడీ విషయంలో సీరియస్ గా ఆలోచించకతప్పదన్న నిర్ణయానికి వచ్చిందన్న అభిప్రాయం బీజేపీ వర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది.  ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ పెర్మార్మెన్స్ ఏ మాత్రం తగ్గినా ఆ ప్రభావం నేరుగా మోడీపైనే పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అన్నిటికీ మించి ఈ సారి బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధించడంలో విఫలమై.. అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి వస్తే ఆర్ఎస్ఎస్ కచ్చితంగా ప్రత్యామ్నాయ నేతను తెరపైకి తీసుకువచ్చే అవకాశలే మెండుగా ఉన్నాయని రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మంద బలం ఉంటే భయంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అణిగిమణిగి ఉంటాయే తప్ప.. బీజేపీ సొంత బలం  సన్నగిల్లితే మాత్రం భాగస్వామ్య పక్షాలేవీ కూడా మోడీ నాయకత్వాన్ని అంగీకరించే అవకాశాలు లేవని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ లో బీజేపీ పెద్దగా పెర్మార్మ్ చేయలేదనే పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. యోగేంద్ర యాదవ్ వంటి స్ట్రాటజిస్టులు అయితే బీజేపీ సొంతంగా గెలుచుకునే స్థానాలు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల తరువాత బీజేపీలో పెనుమార్పులు సంభవించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  

రోజా @ చంద్రముఖి-3

మనందకీ ఒక పదం బాగా తెలుసు... ‘‘పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ’. ఈ పదాన్ని ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న పరిస్థితులతో ముడివేసి ‘పూర్తిగా చంద్రముఖి-3లా మారబోతున్న రోజా’ అని మార్చి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ నాయకురాలు రోజా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోకి జంప్ అవబోతున్నారు. జగన్ చెవిలో రోజాపువ్వు పెట్టి, తాను చంద్రముఖి-3లా మారి ‘లక లక లక’ అనబోతున్నారు. రోజా అంటే ఒక చంద్రముఖి కాదు.. మొత్తం ముగ్గురు చంద్రముఖులూ రోజాలోనే కొలువై వున్నారు. తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు రోజా చంద్రముఖి-1లా వుండేవారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన తర్వాత ఆమె చంద్రముఖి-2లా మారారు. ఈ దశలో ఆమె ఏ రేంజ్‌లో విశ్వరూపం చూపారో అందరికీ తెలిసిందే. రోజా చంద్రముఖి-2 వెర్షన్ ముగియబోతోంది. త్వరలో ఆమె చంద్రముఖి-3లా మారనున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, మాంఛి ఓటమి చవిచూసిన తర్వాత రోజా చంద్రముఖి-3లా మారి బీజేపీలోకి ప్రవేశించబోతున్నారు. తనతోపాటు వైసీపీ కూడా ఓడిపోబోతోందన్న క్లారిటీకి వచ్చిన రోజా, తన రాజకీయ మనుగడ కొనసాగాలంటే, తాను ఇంతకాలం వేసిన వెర్రి వేషాలకు పడే శిక్ష నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరడం తప్ప మరో గత్యంతరం లేదని ఫిక్సయినట్టు తెలుస్తోంది. రోగికి కావల్సింది అదే, వైద్యుడు చెప్పిందీ అదే అన్నట్టుగా... బీజేపీకి కూడా కావలసింది వైసీపీ నుంచి ఇలాంటి నాయకులే. అందువల్ల రోజాకి చంద్రముఖి-3 హోదా ఇవ్వడానికి బీజేపీ నాయకత్వం సుముఖంగా వున్నట్టు సమాచారం. రోజా బీజేపీలో చేరే విషయమై కేంద్రంలోని అగ్ర నాయకత్వంతో కూడా మాటామంతీ జరిగినట్టు తెలుస్తోంది. అయితే అతి త్వరలో ‘పూర్తిగా చంద్రముఖి-3లా మారిన రోజా’ని చూడబోతున్నామన్నమాట!

అధికారం తలకెక్కి జనాలను విస్మరిస్తే.. జరిగేదదే!

రాజకీయ నాయకులు అధికారం తలకెక్కి ప్రజలను విస్మరిస్తే.. ఎంతటి నాయకుడికైనా పరాభవం తప్పదు. ప్రతిష్ట మసకబారక తప్పదు.  అధకారంలో ఉండగా తనను తాను కారణజన్ముడిగా మిలినిన మనుషులంతా మామూలు జీవులేనన్న భావన తలకెక్కి వారిని చులకనగా చూస్తే.. జనం తగిన బుద్ధి చెబుతారు. అధికారం నుంచి ఓటు అనే ఆయుధంతో కిందకి దించి వాళ్ల కళ్లు నేలమీదకు వచ్చేలా చేస్తారు. అధికార మదంతో  ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎందరో నాయకులు ఎన్నికలలో పరాజయంతో  తత్వం బోధపరుచుకున్నారు. కొందరికి తత్వం బోధపడదనుకోండి అది వేరే సంగతి. అలాంటి వారు ప్రజా జీవితానికి శాశ్వతంగా దూరం అవుతారు. అధికారంలో ఉండగా నా మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించిన నేతలకు ప్రజాస్వామ్యం వారి స్థానం ఏమిటో తప్పకుండా చూపుతుంది.  తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి2014లో రాష్ట్రం సాధించే వరకూ అవిశ్రాంతంగా రాజకీయ పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇందకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేసట్టి.. ఐదేళ్ల కాలంలో జగన్ అహంకారంతో వ్యవహరించిన తీరుపై ప్రజా తీర్పు ఏమిటన్నది మరో పది రోజుల్లో వెల్లడి కానున్నది. కేసీఆర్ విషయానికి వస్తే తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఆయన రాష్ట్రంలో విపక్షం ఎందుకు నేనుండగా అన్నట్లుగా వ్యవహరించారు. ప్రజలు తన పాలనలో సుభిక్షంగా ఉన్నారని ఆయనకు ఆయనే నిర్ణయించుకుని.. ఇంకా నిరసనలూ, ఆందోళనలేమిటని హుంకరించారు. ధర్నా చౌక్ అవసరమే లేదన్నారు. విపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడమే పాలన అన్నట్లుగా వ్యవహరించారు. కూసీఆర్ వైఖరికి జనం సరైన రీతిలో బుద్ధి చెప్పారు. ఎన్నికలలో ఓడించి అధికారం నుంచి దింపేశారు. తెలంగాణ జాతి పితగా కితాబులందుకున్న ఆయన ఓటమి తరువాత సొంత పార్టీ నేతల నుంచే ధిక్కారాన్ని ఎదుర్కొన్నారంటే అందుకు ఆయన వ్యవహరించిన తీరే కారణం.   తెలంగాణ సాధన ఉద్యమమే ఊపిరిగా ఉద్యమకారులకు ఆదర్శంగా నిలిచారు. బలిదానాలను ఆపలేకపోయినా వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని ఆయనే చెప్పుకున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత ఆయనలోని మరో కోణం బయటపడింది.  తీరు మారింది. వైఖరి మారింది.ప్రతిపక్షం లేకుండా చేయడానికి చాణిక్యనీతి వాడారు. బలిదానం చేసిన కుటుంబాలకు  ఇచ్చిన హామీలను విస్మరించారు. నీళ్లు, నియామకాలు అన్న తెలంగాణ ఆకాంక్ష సారాన్ని విస్మరించారు.  ఉద్యమ సమయంలో తాను స్వయంగా తెలంగాణ ద్రోహులుగా విమర్శలు చేసిన వారికి తన కొలువులో పెద్ద పీట వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పదేళ్లలో ప్రజానేతగా కేసీఆర్ తన ప్రభను తానే మసక బార్చు కున్నారు. ప్రజా తిరస్కారానికి గురయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2019లో పగ్గాలు చేపట్టిన జగన్ అయితే స్వల్ప కాలంలోనే ప్రజలకు దూరమయ్యారు. వారిని చూడటం ఇష్టం లేకో, లేక ప్రశ్నించి నిలదీస్తారన్న వెరుపో కానీ పరదాలు కట్టుకుని మరీ తిరిగారు. ఎక్కడికక్కడ వందిమాగధులను పెట్టుకుని భజన చేయించుకున్నారు. బటన్ నొక్కి సొమ్ములు విదిలిస్తే ప్రజలు విశ్వాసంగా ఉంటారని తలచారు. అన్ని విధాలుగా ప్రజలను చులకన చేశారు.  ఎవరైనా తన విధానాలను విమర్శిస్తే కేసులు, అరెస్టులు, అవీ కాకపోతే దాడులతో వేధించారు. ఇప్పుడు ప్రజా తీర్పు వ్యతిరేకంగా ఉంటుందన్న భయంతో వణికిపోతున్నారు. 

  రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు 

రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హేమతో పాటు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, అశీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివానీ జైశ్వాల్, వరుణ్ చౌదరి తదితరులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి.  బెంగళూరు రేవ్ పార్టీ కేసును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏ2 నిందితుడు అరుణ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన వాసుతో పాటు పార్టీకి హాజరైన వ్యక్తులకు సంబంధించి పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు.బెంగుళూరులో హేమ పట్టుబడిన నేపథ్యంలో  హేమ చేసే వీడియోలు వివాస్పమౌతున్నాయి. తాను హైదరాబాద్ లోని  ఒక ఫామ్ హౌజ్ లో చిల్ అవుతున్నానని ఒకసారి, తాను బిర్యానీ వండినట్టు మరోసారి వీడియో విడుదల చేశారు. ఇవి ఫేక్ వీడియోలను పలువురు అనుమానం వ్యక్ల చేశారు. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని హేమ చెబుతున్నా

 అల్లు అర్జున్ నంద్యాల పర్యటనపై  ఈసీ  సీరియస్ 

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడడంతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్ గా స్పందించింది. భారీ జనసమీకరణ జరుగుతోందని సమాచారం అందించలేదనే కారణంతో ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించింది. ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజులను ఉన్నతాధికారులు వీఆర్ కు పంపించారు. ఈమేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ పైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల 11న తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు. హీరో వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా భారీ ఎత్తున జనం గుమికూడడంపై ఈసీ సీరియస్ గా స్పందించింది.విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంలో, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడంలో విఫలమైన పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు ఈసీ నుంచి నోటీసులు అందుకున్న ఎస్పీ, డీఎస్పీ.. ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. దీనిపై స్థానిక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయడంతో హీరో అల్లు అర్జున్ తో పాటు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు.

అల్లు అర్జున్ కెరీర్ పై సీనీ రాజకీయ రంగాల్లో విస్తృత చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు అధికారంలోకి వస్తారు. ఏ పార్టీ పరాజయాన్ని మూటకట్టుకుంటుంది అన్న చర్చలతో పాటు మరో వ్యక్తి గురించి కూడా రాజకీయ, సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఆ వ్యక్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీకి దగ్గర బంధువు.. అలా చెప్పే కంటే.. మెగాస్టార్ చిరంజీవికి స్వయానా మేనల్లుడు. అటువంటి అల్లు అర్జున్   ఎన్నికల సందర్భంగా తన మిత్రుడు అంటూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి కి మద్దతుగా నంద్యాల వెళ్లి మరీ ర్యాలీలో పాల్గొన్నారు.  మరో వైపు జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినప్పటికీ ఆయనకు ఒక ట్వీట్ ద్వారా మద్దతు ప్రకటించి ఊరుకున్న అల్లు అర్జున్ పనిమాలా నంద్యాల వరకూ వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థి శిల్పాకు మద్దతు ప్రకటించి రావడం సంచలనం సృష్టించింది. దీంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు పొసగడం లేదా అన్న అనుమానాలు సైతం సర్వత్రా వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో మాటల యుద్ధం కూడా జరిగింది. అది పక్కన పెడితే ఓట్ల లెక్కింపు జరిగి, ఫలితాలు ప్రకటించే జూన్ 4వ తేదీ సమీపిస్తున్న కొద్దీ అల్లు అర్జున్ పై రాజకీయ సినీ రంగాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.     ఒక వేళ శిల్పా ఓడిపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఏమిటి అన్నదే ఈ చర్చ. ఎందుకంటే పోలింగ్ సరళిని చూసిన తరువాత రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం కూటమే అన్న భావన సర్వత్రా బలపడింది. అందుకు తగ్గట్టుగా వైసీపీ శ్రేణులు, నేతల ప్రకటనలు కూడా ఓటమిని అంగీకరించేసినట్లుగానే ఉన్నాయి.  దీంతో  వైసీపీ అధికారం కోల్పోయినా, గెలిచే  కొన్ని సీట్లలో నంద్యాల లేకపోతే అల్లు అర్జున్ ఇమేజ్  బాగా డ్యామేజ్ అవుతుందని అంటున్నారు.  అదే సమ యంలో  జూనియర్ ఎన్టీఆర్  కున్న   సంయమనం కూడా అల్లు అర్జున్   పాటించలేదని అంటు న్నారు.  ఎందుకంటే వైసీపీ తరఫున గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లు ఎన్టీఆర్ కు చాలా సన్నిహిత స్నేహితులు. వారిరువురూ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు కూడా చేశారు.  అయితే ఆ ఇద్దరి తరఫునా ప్రచారం చేయడానికి కానీ, మద్దతు పలకడానికి కానీ ఎన్టీఆర్ ముందుకు రాలేదు. అసలు తన స్నేహితులు ఇద్దరూ వైసీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ వారికి అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు అటువైపు చూడనే లేదు. అయితే అందుకు భిన్నంగా బన్ని అనవసర ఆర్భాటం చేసి మరీ శిల్పాకు మద్దతుగా నంద్యాల వెళ్లారని సినీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. బన్నీ తీరు కచ్చితంగా ఆయన కెరీర్ పై ప్రభావం తప్పకుండా పడుతుందని చర్చించుకుంటున్నారు.  

రైతుని వరించిన అదృష్టం, పొలంలో దొరికిన విలువైన వజ్రం!

కర్నూలు జిల్లాలో ఓ రైతు పంటపడింది. పొలంలో అతడికి విలువైన వజ్రం దొరికింది.  ఇటీవల కురిసిన వర్షాలకు వజ్రం బయటపడింది. పొలం పనులు చేస్తుండగా కంటపడిన వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. విషయం తెలిసి వ్యాపారులు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. ఆ వజ్రాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాపారులు పోటీ పడడంతో వేలం నిర్వహించారు. ఇందులో పెరవల్లికి చెందిన ఓ వ్యాపారస్థుడు రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, బహిరంగ మార్కెట్ లో ఆ వజ్రం విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఏటా వర్షాకాలం తొలకరి సమయంలో కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు, కూలీలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు వెతుకుతుంటారు. దీనికోసం ప్రత్యేకంగా భూమిని లీజుకు తీసుకుని, కూలీలను పెట్టి వెతికించే వాళ్లు కూడా ఉన్నారు. ఒక్క విలువైన వజ్రం దొరికితే దశ మారిపోయే అవకాశం కావడంతో రైతులు కూడా తమ పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఈ సంవత్సరం కురుస్తున్న తొలకరి వర్షాలతోనూ వజ్రాలు లభిస్తున్న కొందరు రైతుల పంట పండుతోంది.  రాయలసీమ జిల్లాలలో ఈ సీజన్ అదృష్టాన్ని పరీక్షించుకునే సీజన్. ప్రతి ఒక్కరూ పొలాలలో వజ్రాల వేట కొనసాగిస్తారు. ఇక నక్క తోక తొక్కిన అదృష్టవంతులకు వజ్రాలు దొరుకుతాయి. ఎంతోమందిని ఇక్కడ దొరికే వజ్రాలు బికారుల నుండి అమీర్ లుగా మారుస్తున్నాయి. తొలకరి వర్షాల సమయంలో రాయలసీమ జిల్లాలలో ఎంతోమంది వ్యవసాయ కూలీలు, కొందరు గొర్రెల కాపరులు, వ్యవసాయం చేసుకునే రైతులకు వజ్రాలు దొరికిన అనేక ఉదంతాలు ప్రతీ సంవత్సరం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. భూమిలో దొరికే విలువైన వజ్రాలు, గుప్త నిధులు వంటివి చట్టప్రకారం ప్రభుత్వ ఖజానాకు చేర్చాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూముల్లో దొరికినా సరే అది ప్రభుత్వ ఆస్తేనని చట్టాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రైతుకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అధికారులు.. తమకు పట్టనట్టు ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. - ఎం.కె.ఫ‌జ‌ల్‌  

చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్?

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది... నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు... ఇదీ ఇప్పటి వరకు చాలామంది చూస్తున్న దృక్కోణం! కానీ,  ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్న కోణం మరొకటి వుంది.. అదే ‘‘చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్?’’ ఈసారి ఎన్నికలలో నాలుగు వందల స్థానాలు సాధించాలని బీజేపీ ఊహల పల్లకీలో విహరిస్తోందిగానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని విడతల పోలింగ్ సందర్భంగా బీజేపీ సొంతగా దుమ్ముదులిపేసింది అని చెప్పుకునే స్థాయిలో ఓట్లు పడలేదు. ఎన్డీయేలో భాగస్వాములుగా వున్న పార్టీలు కొన్ని తమ సత్తాను చాటగలిగాయిగానీ, బీజేపీకి తాను ఊహిస్తున్న స్థాయిలో సీట్లు వస్తాయన్న ఆశ కనిపించడం లేదు.. ఒక వేళ బీజేపీకి రావలసిన మెజారిటీ కంటే చాలా తక్కువ స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈసారి ప్రధానమంత్రి పదవి మోడీకి, బీజేపీ నాయకుడికి కాకుండా ఎన్డీయేలో భాగస్వాములుగా వున్న మిగతా పక్షాల్లో వున్న సమర్థుడైన నాయకుడికి ప్రధానమంత్రిగా అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించే అవకాశం వుంది. ఆ నాయకుడు చంద్రబాబు ఎందుకు కాకూడదు? దేశ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోపాటు, ఇండియా భాగస్వామ్య పక్షాలతోపాటు, ఈ రెండు కూటములలోనూ లేని పార్టీల నుంచి కూడా మద్దతు కూడగట్టగల శక్తి వున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆమాటకొస్తే బీజేపీలో కూడా మోడీ, అమిత్ షా మినహా చాలామంది చంద్రబాబు అభిమానులు వున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడిన చంద్రబాబు చరిత్రను గుజరాత్ బ్యాచ్ మరచిపోయి వుండొచ్చేమోగానీ, బీజేపీ మరచిపోదు. ఒకవేళ ప్రధానమంత్రి అభ్యర్థి మారాల్సి వచ్చిన పక్షంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరు లేరు. ఈ మాట అంటే కొంతమందికి కోపాలు వస్తే వచ్చాయిగానీ, అందర్నీ కలుపుకుని వెళ్ళే విషయంలోగానీ, నీతివంతమైన రాజకీయాలు నడపడంలోగానీ, ప్రజాస్వామిక విలువలను, లౌకిక విలువలను పాటించడంలోగానీ, సుదీర్ఘ అనుభవం విషయంలోగానీ, దేశాన్ని ముందుకు నడిపే విజన్‌లోగానీ, ట్రబుల్ షూటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌లోగానీ నరేంద్ర మోడీ కంటే చంద్రబాబు ఒక మెట్టు పైనే వుంటారు. అందుకే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అవ్వాల్సిన ఒక కీలక అంశం.. ‘చంద్రబాబు.. వైనాట్ ప్రైమ్ మినిస్టర్’!

ఏపీ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారిందిః చంద్ర‌బాబు ఆందోళన

కాంబోడియా, భారత్ మధ్య  అక్రమ మాన‌వ‌ రవాణా రాకెట్ నడుస్తోంది. ఉద్యోగాల పేరిట ఎర వేసి 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఇక్క‌డి నుంచి తీసుకెళ్ళి, ఆన్ లైన్ స్కాం ఎలా చేయాలో వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారు. బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  మన యువతను మోసం చేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్ల ఆటకట్టించాలని, ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు. వీలైనంత త్వరగా బాధితులను కాంబోడియా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు సాయపడాలని జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట కాంబోడియాకు మానవ అక్రమ రవాణా పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ్యభిచారం కోసం మహిళల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మహిళలు, బాలలు, వృద్ధులపై నేరాలు విపరీతంగా పెరిగాయి. ఆర్థిక, సైబర్‌ నేరాలు ఎక్కువయ్యాయి. హత్యాయత్నాలు, అపహరణలు పెరిగాయి. జాతీయ నేర గణాంక సంస్థ గణాంకాలు విశ్లేషిస్తే మన రాష్ట్రంలోని దారుణ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయ‌ని చంద్ర‌బాబునాయుడు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుతోంది. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత ఆ ముఠా చేతిలో బందిగా వుంది. ఫెడెక్స్ , టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారు. ఐటీ ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షన్నర వరకు వసూలు చేసి  కంబోడియాకు త‌ర‌లిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే యువ‌త ట్రాప్‌లో ప‌డిపోతోంది.  కంబోడియాలో రక్షించిన దాదాపు 60 మంది భారతీయులతో కూడిన మొదటి బ్యాచ్‌ స్వదేశానికి చేరుకుంది.  అందులో పలువురు ఏపీ వాసులు ఉన్నారు. కంబోడియా సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి బయటపడి స్వరాష్ట్రానికి చేరుకున్న పలువురికి విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విశాఖపట్నం పోలీసులు స్వాగతం పలికారు. త‌మ‌ను చైనీస్ ఆపరేటర్లకు విక్రయించి,  హింసించారు.సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడేలా ఒత్తిడి చేశారు, చీకటి గదులలో ఉంచి పనిచేయాలని హింసించిన‌ట్లు బాధితులు చెప్పారు.    అక్రమ రవాణాకు గురైన యువకుల విడుదల కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిందని, హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసిందని, దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు కొనసాగించడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించింది.   - ఎం.కె. ఫ‌జ‌ల్‌

కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరాలంటే చంద్రబాబే దిక్కు!?

ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం కూటమి విజయం ఖారారైపోయింది. ఈ విషయాన్ని పోలింగ్ కు ముందు.. అంటే షెడ్యూల్ విడుదల కావడానికి ముందు వెలువడిన దాదాపు డజన్ ప్రముఖ సర్వే సంస్థలు చెప్పేశాయి. పోలింగ్ సరళి, పోలింగ్ తరువాత వైసీపీ నేతలు, శ్రేణుల భాష, బాడీ లాంగ్వేజ్ కూడా తెలుగుదేశం కూటమిదే అధికారమని చెప్పకనే చెప్పేశాయి. అధికారికంగా ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. కనీసం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావాలన్నా జూన్ 1 వరకూ ఎదురు చూడక తప్పదు. అప్పటి వరకూ ఎవరి అంచనాలు వారివి. ఎవరి ధీమా వారిది అనే భావించాల్సి ఉంటుంది. అయితే  అయితే ప్రశాంత్ కిషోర్ సహా  ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్టులు మాత్రం ఇప్పటికే తమ అభిప్రాయంగా ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం సునాయాసమని చెప్పారు. తాజాగా ఆ జాబితాలోకి సీనియర్ పోల్ అనలిస్ట్ యోగేంద్ర యాదవ్ చేరారు.  ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో  ఏపీలో ని పాతిక లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం కూటమి కనీసం 15 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.  ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళిని విశ్లేషించిన ఆయన తెలుగుదేశం అండ లేకుండా కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరే అవకాశాలు చాలా తక్కువ అని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఘనంగా చెప్పుకుంటున్నట్లుగా సొంతంగా మూడు వందలకు పైగా స్థానాలలో విజయం సాధించే అవకాశాలు మృగ్యమన్నదే తన అభిప్రాయమని అన్నారు. ఆయన చెప్పిన ఈ మాటలు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆయన ఇటీవల వరుసగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్పడమే కాకుండా కేంద్రంలో బీజేపీ సొంతంగానే అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన స్థానాలలో విజయం సాధిస్తుందని చెప్పారు.  అయితే యోగేంద్రయాదవ్ మాత్రం బీజేపీ అగ్రనేతలు ప్రకటనలు చేస్తున్నట్లుగా ఎన్డీయే కూటమి 400 స్థానాలలో విజయం సాధించే అవకాశం లేదని కుండబద్దలు కొట్టేశారు.  బీజేపీకి కంచుకోటలాంటి ఉత్తర ప్రదేశ్ లోనే ఆ పార్టీ భారీగా   సీట్లను కోల్పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.   యోగేంద్రయాదవ్ అంచనా ప్రకారం బీజేపీ సొంతంగా 240 నుంచి 260 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మరో 35 నుంచి 40 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందనీ, దాంతో మొత్తంగా ఎన్డీయేకు 275 నుంచి 305 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మేజిక్ ఫిగర్ 272 అన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో బీజేపీ సొంతంగా 303 స్థానాలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆ పరిస్థితి ఎంత మాత్రం లేదని యోగేంద్రయాదవ్ అభిప్రాయపడ్డారు. సో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతుపై ఆధారపడక తప్పదనీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలో  సీట్ల పరంగా ఎక్కువ స్థానాలు సాధించే పార్టీ తెలుగుదేశమేననీ చెప్పిన ఆయన కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరాలంటే, సుస్థిరంగా కొనసాగాలంటే తెలుగుదేశంపై ఆధారపడక తప్పదని యోగేంద్రయాదవ్ చెప్పారు.  

అభ్యర్థులకు చెమట్లు పట్టిస్తున్న నోటా!

నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) కీలకం కాబోతోంది. బారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్న నియోజకవర్గాలను పక్కన పెట్టేస్తే.. హోరాహోరీగా పోటీ జరిగిన నియోజకవర్గాలలో మాత్రం నోటా గెలుపు ఓటములను కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు వారు పలు ఉదాహరణలు కూడా చూపుతున్నారు.  దీంతో ఏపీలో ఇప్పుడు పలు నియోజకవర్గాల అభ్యర్థులకు నోటా టెన్షన్ పట్టుకుంది. నోటా కోటాలో ఎన్ని ఓట్లు పడి ఉంటాయన్న చర్చ విపరీతంగా జరుగుతోంది. 2014 ఎన్నికలలో నోటా ఓట్లు పెద్దగా ప్రభావం చూపలేదు కానీ, 2019 ఎన్నికలలో  నోటాకు పడిన ఓట్లు గణనీయంగా పెరిగాయి. 2024 ఎన్నికలలో కూడా అదే జరిగితే.. ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశమే ఇప్పుడు అభ్యర్థులకు చెమటలు పట్టిస్తోంది.  ఉదాహరణకి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 2014లో నోటాకు 14వేల457 ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఆ సంఖ్య 48వేల621కి పెరిగింది.  గిరిజన ప్రాంతాలలో పెరిగిన అక్షరాస్యత ఓటర్లు  నోటా వైపుకు మొగ్గు చూపేలా చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారంలో  ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే గిరిజనులలో అక్షరాస్యులు నోటావైపు మొగ్గు చూపుతున్నారని భావిస్తున్నారు. అరకు నియోజకవర్గాన్నే తీసుకుంటే.. అక్కడ 2019 ఎన్నికలలో నోటాకు వచ్చిన ఓట్ల విషయంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.   దీంతో ఇప్పుడు నోటా ఓటు అభ్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. కొన్ని సందర్బాలలో  విజయం సాధించిన అభ్యర్థికి, పరాజయం పాలైన అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇందుకు ఉదాహరణగా  చోడవరం నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థి మెజారిటీ నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువగా ఉన్నాయి.     

 దేశంలో ఆరో విడత పోలింగ్ షురూ... ఓటు వేసిన రాష్ట్రపతి, కేంద్రమంత్రులు

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది ఇప్పటివరకు అయిదు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది.  ఆరవ విడత పోలింగ్ లో . ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఢిల్లీలో ఉదయం 9 గంటల వరకూ సగటున 10 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలో 8.94 శాతం పోలింగ్ నమోదవగా పశ్చిమ బెంగాల్‌లో గరిష్ఠంగా 16.54 పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో 889 మంది కాండిడేట్ల భవిష్యత్తును 11 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు.  కాగా, ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ఓటు వేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావ్ ఇందర్‌జిత్ సింగ్, మంత్రి జైశంకర్ బీజేపీ నేత మేనకా గాంధీ, సంబిత్ పాత్ర, మనోహర్ ఖట్టర్, మనోజ్ తివారీ, మహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్, మాజీ క్రికెటర్ బీజేపీ నేత గౌతం గంభీర్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోస్టల్ బ్యాలెట్టే ఫలితం చెప్పేసింది! వైనాట్ తెలుగుదేశం విన్ 175!!

ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. జూన్ 4వ తేదీన ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 38 వేల 865 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా రెండో స్థానంలో  నంద్యాల జిల్లా  నిలిచింది. ఇక్కడ 25 వేల 283 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పడ్డాయి. ఆ తరువాతి  కడప జిల్లా 24 వేల 918 పోస్టల్ బ్యాలెట్లు పపోలయ్యాయి. ఇక అత్యల్పంగా నరసాపురంలో 15 వేల 320 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలోనూ సగటున తక్కువలో తక్కువ 3 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్  వివరాలు పూర్తిగా రావడంతో ఏ జిల్లాలో ఎన్ని  టేబుల్స్ ఏర్పాటు చేయాలి..? ఒక్కో టేబుల్‌లో ఎన్ని లెక్కించాలని అనే అంశంపై రిట ర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారం ఇచ్చింది. ఇలా ఉండగా పోస్టల్ ఓట్ల లెక్కింపు విషయంలో ఒకింత వివాదం తలెత్తింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేని ఓట్లు లెక్కించాలా వద్దా అన్నదానిపై మీమాసం నెలకొంది. అయితే గెజిటెడ్ ఆఫీసర్ సతకం చేసిన సీల్ లేకపోయినా పోస్టల్ ఓట్లను పరిగణనలోనికి తీసుకోవాలని తెలుగుదేశం కూటమి గట్టిగా పట్టుబట్టింది. ఇందుకు ఎన్నికల కమిషన్ మౌఖికంగా అంగీకారం కూడా తెలిపింది. అయితే ఆ అంగీకారం రాతపూర్వకంగా కావాలని తెలుగుదేశం కూటమి పట్టుబడుతోంది. వాస్తవానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. గెజిటెడ్ ఆఫీసర్ ద్వారానే పోస్టల్ బ్యాలెట్ విడుదల అవుతుంది, ఆయన ఇవ్వకుండా ఎవరికీ పోస్టల్ బ్యాలెట్ అందే అవకాశమే లేదనీ అంటున్నారు. ఆ కారణంగానే సంతకం సీల్ వంటి టెక్నికాలిటీస్ తో సంబంధం లేకుండా పోలైన ఓట్లన్నీ లెక్కించాలని తెలుగుదేశం కూటమి డిమాండ్ చేస్తోంది.  అదలా ఉంచితే..  ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో పోలైన పోస్టల్ ఓట్లను బట్టి చెప్పే యవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఏపీ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా భారీగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఒటు హక్కు వినియోగించుకున్నారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో నియోజకవర్గానికి సగటున మూడు వేలకు పైగా పోలైన ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. అధికార పార్టీయే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు వినియోగించుకున్న ఓటు కచ్చితంగా తమకు వ్యతిరేకంగానే అని నమ్ముతోంది. ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ కూడా వైసీపీ గట్టెక్కే పరిస్థితి లేదన్న భావన ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతోంది. అదే సమయంలో నెటిజనులు భారీగా పోలైన పోస్టల్ ఓట్లను ఉటంకిస్తూ.. జగన్ చెప్పిన వైనాట్ 175 రివర్స్ అవుతుందేమో అంటున్నారు. వారు జగన్ వైనాట్ 175 అని వైసీపీ గెలిచే సీట్ల గురించి మాట్లాడితే.. ఇప్పుడు అది రివర్స్ అయినట్లు కనిపిస్తోందనీ, వైనాట్ తెలుగుదేశం విన్ 175 అన్నట్లుగా పరిస్థితి ఉందనీ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఓ రేంజ్ లో వైసీపీని ట్రోల్ చేస్తున్నారు.  

వేటగాళ్లకే జగన్ మద్దతు! జూన్ 4 తర్వాత మంచి రోజులు వస్తాయి

వైసీపీ నేతలు ఓటమి భయంతోనే హింసకు పూనుకున్నారు. జూన్ 4న బాక్సులు బద్దలైయ్యేలా ప్రజా ఆమోదంతో టీడీపీ అఖండ మెజార్టీతో గెలవబోతుంది అని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ధీమా వ్యక్తం చేశారు. అధికారులు భయపడాల్సిన అవసరంలేదు. లీవ్‌లు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరంలేదు. నిష్పక్షపాతంగా పనిచేయాలి అని మహ్మద్ ఇక్బాల్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే రాష్ట్రంలో డబ్బుల పందేరంతో పాటు, అరాచకం సృష్టించి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేశాడు.  పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, నరసరావుపేటలతో పాటు చాలా చోట్ల విధ్వంసం, రక్తపాతం సృష్టించారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పిన్నెల్లి, పెద్దారెడ్డి లాంటి వేటగాళ్లకు మద్దతు తెలుపుతున్న జగన్ పాలన‌లో అరాచ‌కాల గుట్టును ఆయ‌న‌ విప్పారు. 1. పిన్నెల్లి అరాచకం ప్రజలందరూ చూసినా గుర్తు తెలియని వ్యక్తులని 324 కేసు పెట్టడం దారుణం. వెంటనే 307 కేసు పెట్టి ఉంటే పిన్నెల్లికి బెయిల్ వచ్చేది కాదు.  శేషగిరిరావును హత్య చేయాలని చూసినా కేసు పెట్టలేదు. వైసీపీ గుండాల అరాచకంతో శేషగిరిరావు ఊరి విడిచి పోలాల్లో ఉంటున్న పరిస్థితి వచ్చింది.   2. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యంగా 74 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు.    3. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులుకు తెగబడ్డారు. 4. వైసీపీ దాడులతో 100 ముస్లిం కుటుంబాలు సొంత ఊరు విడిచిపోయారు.  5. బీసీ వ్యక్తి చంద్రయ్యను సినిమా తరహాలో దారుణంగా గొంతుకోసి చంపారు.  6. నియోజకవర్గంలో పిన్నెల్లి ఇష్టానుసారంగా దోచుకున్నాడు. దాదాపు రూ. 2000 కోట్లు కొల్లగొట్టాడు. అడ్డు అదుపు లేకుండా భరితెగించి ప్రవర్తించాడు. తెలంగాణ బార్డర్ లో చెక్ పోస్టులు పెట్టి కమీషన్‌లు దండుకున్నాడు. రక్తపాతం సృష్టించిన పిన్నెల్లి లాంటి నేతలను సౌమ్యశీలులు అంటున్న జగన్ రెడ్డి విజ్ఞత ఏమనాల‌ని  మహ్మద్ ఇక్బాల్ ప్ర‌శ్నిస్తున్నారు.  జగన్ రెడ్డి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాడు. పోలీసులు, రెవెన్యూ డిపార్ట్ మెంట్లలో తాబేదారులను నియమించుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ప్రజాస్వామ్యంగా గెలవలేమని భావించి దండుకున్న డబ్బులను పంచి గెలవాలని జగన్ రెడ్డి కుట్ర చేశాడు. ఎర్రగొండపాలెం, పుంగనూరులో చంద్రబాబు పై దాడులు చేయించి మళ్లీ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ మాత్రమే ఉండాలని ఎలక్షన్ జరగనివ్వకూడదని వైసీపీ నేతలు యత్నించారు. లేని కారుచిచ్చు రగిలించి రక్తపాతాన్ని సృష్టించారు. డీఎస్పీ చైతన్య లాంటి అధికారులు వంత పాడటంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ సానుకూల పరులు సొంత ఊరు విడిచి పోయిన పరిస్థితికి తెచ్చారు. జగన్ రెడ్డి అన్ని వ్వవస్థలను సర్వ నాశనం చేశాడు. విద్యావస్థను భ్రష్టుపట్టించి బైజూస్ కు వేల కోట్లు కట్టబెట్టి కమీషన్ లు దండుకున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడు. 2019 నుండి 2024వరకు ఇసుక, మద్యంలో దోపిడీలపై రికార్డులను దగ్ధం చేయకుండా ఈసీ చర్యలు తీసుకోవాలి. కిందిస్థాయి పోలీసులు భయపడకుండా ఎలక్షన్ కమిషన్ మనోధౌర్యం కల్పించాలి. కింది స్థాయిలో పోలీసులు డ్యూటీలకు వెళితే తిండిలేని పరిస్థితి ఉంది. లా ఆండ్ ఆర్డర్‌లను కలెక్టర్లు, ఎమ్మార్వోలు కూడా కాపాడాలి. ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందించి 307 కేసులు పెట్టించాలి.   అధికారులు తప్పులకు తావులేకుండా ఎలక్షన్ కౌంటిగ్ వద్ద నిర్భయంగా పనిచేయాలి. దాడులు చేసేవారిని ముందే పసిగట్టి శిక్షించాలి. ఒత్తిడిలో ఉన్న అధికారులు బయటకు రావాలి. జూన్ 4 తరువాత మంచిరోజులు వస్తాయి అంటున్నారు మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్. - ఎం.కె. ఫ‌జ‌ల్‌