భ‌ర్త‌ అనుమానం... భార్య ప్రాణాల‌కే పెను ప్ర‌మాదం!

  మొన్న‌టి వ‌ర‌కూ భార్య‌లు త‌మ ప్రియుళ్ల‌తో క‌ల‌సి భ‌ర్త‌ల‌ను హ‌త‌మార్చ‌డం ఒక రేంజ్ లోజ‌రిగింది. ఫ‌స్ట్ నైట్ రోజు, హానీ మూన్ రోజు, పెళ్ల‌యిన కొన్నాళ్ల‌కు ఇలా వ‌రుస ఉదంతాలు న‌మోద‌య్యాయి. ఒక స‌మ‌యంలో గ‌త ఐదేళ్ల‌లో 780కి పైగా భ‌ర్త‌లు త‌మ భార్య‌లు హ‌త‌మార్చ‌డం ద్వారా చ‌నిపోయిన‌ట్టు తేల్చాయి ఎన్సీఆర్ రికార్డులు. ఈ రివ‌ర్స్ మేనియా ఏంటో అర్ధం కాక ఒక్కొక్క‌రూ బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకున్నారు. కాలం మార‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుందేమో అనుకున్నారు. ఇప్పుడిది య‌దాత‌థ స్థితి చేరిన‌ట్టు క‌నిపిస్తోంది. మ‌ళ్లీ భ‌ర్త‌లే భార్య‌లను అనుమానం కొద్దీ హ‌త‌మార్చే దృశ్యాలు క‌నిపిస్తున్నాయి. అది కూడా ప్రేమించి పెళ్లాడిన త‌మ ప్రియ భార్యామ‌ణుల‌ను వ‌రుస పెట్టున హ‌త‌మార్చే ఘ‌ట‌న‌లు న‌మోద‌వుతున్నాయి. నాగ‌ర్ క‌ర్నూల్ కి చెందిన ఒక భ‌ర్త త‌న భార్యకు వివాహేత‌ర సంబంధం ఉంద‌న్న అనుమానంతో ఆమెపై పెట్రోలు పోసి త‌గ‌ల‌బెట్టేసిన ఘ‌ట‌న న‌మోద‌య్యింది.  ప‌దేళ్ల క్రితం శ్రీశైలం- శ్రావ‌ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లున్నారు కూడా. కానీ శ్రావ‌ణిపై శ్రీశైలానికి అనుమానం. దీంతో త‌ర‌చూ వేధించేవాడు. ఈ పోడు ప‌డ‌లేక శ్రావ‌ణి- శ్రీశైలం నుంచి విడిపోయి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఉంటోంది. అయినా స‌రే శ్రీశైలం వేధింపులు ఆగేవి కావు. అప్ప‌టికీ ఆమె మ‌హిళా పోలీస్టేష‌న్లో కంప్ల‌యింట్ చేసింది. అలాగ‌ని శ్రీశైలం ఆమెపై వేధింపులు ఆప‌లేదు.  పెపెచ్చు చంప‌డానికి ప‌థ‌క‌ర‌చ‌న చేశాడు. ఈనెల 21న త‌న భార్య‌ను బైక్ పై సోమ‌శిల‌కు విహారంగా వెళ్లి వ‌ద్దామ‌ని తీస్కెళ్లాడు. ఆల్రెడీ త‌న వెంట  క‌త్తి, పెట్రోల్ తెచ్చిన శ్రీశైలం ఒక చోట ఆపి భార్య‌ను క‌త్తితో పొడిచి చంపి ఆపై పెట్రోలు పోసి త‌గ‌ల‌బెట్టేశాడు. త‌మ కూతురి జాడ క‌నిపించ‌క పోవ‌డంతో శ్రావ‌ణి త‌ల్లిదండ్రులు పోలీస్ కంప్ల‌యింట్ ఇవ్వ‌గా ఆ స‌రికే పోలీసుల‌కు లొంగిపోయాడు శ్రీశైలం. మ‌హేంద‌ర్ రెడ్డి స్వాతిది మ‌రో ప్రేమ పెళ్లి విషాద‌గాథ‌. మ‌హేంద‌ర్ రెడ్డి- స్వాతి ఇరువురూ వేర్వేరు కులాల వారు. ఇరుగుపొరుగున వీరికి ప్రేమ క‌ల‌సింది. త‌ర్వాత పెద్ద‌లు ఒప్పుకోక‌పోయినా పెళ్లి చేసుకున్నారు. గొడ‌వ‌ల‌య్యాయి. పంచాయితీలు జ‌రిగి త‌ర్వాత ఇరువురికీ యాద‌గిరి గుట్ట‌లో మ‌ళ్లీ పెద్ద‌ల స‌మ‌క్ష‌లంలో పెళ్ల‌య్యింది. మ‌హేంద‌ర్ రెడ్డి ప్ర‌ధాన అభ్యంత‌రం త‌న భార్య‌కు అప్పుడే క‌డుపు రావ‌డం. ఇది వ‌ర‌కే ఆమె గ‌ర్భం దాల్చ‌గా తీయించేశాడు. త‌ర్వాత కూడా ఆమె గ‌ర్భం దాల్చ‌గా దాన్ని కూడా వ‌ద్దంటాడు. దీంతో పారిపోయిన ఆమె పుట్టింటికి చేరింది. పెద్ద‌లు రాజీ చేయ‌డంతో మ‌ళ్లీ భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌.  వినాయ‌క‌చ‌వితికి పుట్టింటికి వెళ్లి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటానంది ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అయిన స్వాతి. ఎంత‌కీ ఒప్పుకోలేదు మ‌హేంద‌ర్ రెడ్డి. ఇలాక్కాద‌ని స్వాతిని పూర్తిగా అడ్డు తొల‌గించుకోవాల‌నుకున్నాడు మ‌హేంద‌ర్ రెడ్డి. దీంతో ఎక్సా బ్లేడు వంటి ప‌రిక‌రాలు తెచ్చుకుని ఇంట్లో దాచి పెట్టాడు. కావాల‌ని భార్య‌తో గొడ‌వ పెట్టుకుని.. గొంతు నులిమి చంపేసి ఆపై ఆమె మృత‌దేహాల‌ను కండ‌కండాలుగా న‌రికేశాడు. ఆపై ఆ విడిభాగాల‌ను మూసీలో ప‌డేశాడు.  ఆ త‌ర్వాత త‌న భార్య ఫోన్ నుంచి అంతా మంచేనంటూ ఆమె త‌ల్లిదండ్రుల‌కు మెసేజ్ లు పంపి అనుమానం రాకుండా చేశాడు. ఆపై ఆమె సోద‌రికి ఫోన్ చేసి, మీ చెల్లెలు క‌నిపించ‌లేద‌ని అన్నాడు. దీంతో ఆమె త‌న భ‌ర్త‌ను మ‌రిది వ‌ద్ద‌కు పంప‌గా.. అత‌డు కొంత సేప‌టి నుంచి స్వాతి క‌నిపంచ‌డం లేద‌ని అన్నాడు. ఇరువురు క‌ల‌సి పోలీస్ స్టేష‌న్ కి వెళ్లి కంప్ల‌యింట్ చేశారు. పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అర్ధం ప‌ర్ధంలేని స‌మాధానాలు చెప్ప‌డంతో.. మ‌హేంద‌ర్ రెడ్డిని మ‌రింత  డీటైల్డ్ గా విచారించారు. క‌ట్ చేస్తే అస‌లు నిషం క‌క్కేశాడు మ‌హేంద‌ర్ రెడ్డి. ఖ‌మ్మం జిల్లా మ‌ధిర‌లో మ‌రో ప్రేమ వివాహ విషాదగాథ‌. విజ‌య‌వాడ‌కు చెందిన సూర్య‌నారాయ‌ణ‌, మంగ‌ళ‌గిరికి చెందిన నాగ‌ల‌క్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఖ‌మ్మం వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు. వీరికి ఇద్ద‌రు కొడుకులు. మూడో మారు నాగ‌ల‌క్ష్మి గ‌ర్భం దాల్చింది. అయితే త‌న భార్య‌పై అనుమానం పెంచుకున్న భ‌ర్త ఆమెను తాగేసి వ‌చ్చి వేధించేవాడు. అంతే కాదు ప‌నికి కూడా స‌రిగా వెళ్లేవాడు కాడు.  అయితే అత‌డు భార్య‌పై పీక‌లోతు క‌క్ష పెంచుకుని ఆరోజు రాత్రి బాగా తాగేసి వ‌చ్చాడు. పిల్ల‌లిద్ద‌రూ నిద్రిస్తుండ‌గా.. ఆమెపై దాడి చేశాడు. ఆమె తీవ్ర ర‌క్త‌స్రావంతో పారిపోయంది నాగ‌ల‌క్ష్మి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను మ‌ధిర ఆస్ప‌త్రిలో చేర్చారు. అక్క‌డ ఒక ప్రయివేటు ఆస్ప‌త్రిలో ఆమె చికిత్స పొందుతుండ‌గా.. ప్ర‌స్తుతం నిందితుడు సూర్య‌నారాయ‌ణ మాత్రం ప‌రారీలో ఉన్నాడు. ఈ మూడు ఘ‌ట‌న‌ల్లో ముగ్గురిదీ ప్రేమ వివాహాలే. కానీ ఆ భ‌ర్త‌లు ఒక స‌మ‌యంలో త‌మ భార్య‌ల‌పై అనుమానం పెంచుకుని.. ఇదిగో ఇలా క‌డ‌తేర్చే య‌త్నం చేసిన ఉదంతాలు వెలుగులోకి వ‌చ్చాయి.

కంటైనర్ నుంచి 255 ల్యాప్ టాప్‌లు చోరీ

  బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగింది. ముంబయి నుంచి చెన్నైకి ఒక కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను తరలిస్తున్న ఓ కంటైనర్లోని 255 ల్యాప్టాప్లను దుండగులు అపహరించారు. చిన్న కొత్తపల్లి వద్ద కంటైనర్ అలారం బ్రేక్ అయినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. చోరీకి గురైన ల్యాప్టాప్ల విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న ఎలక్ట్రానిక్ వస్తువుల రవాణా చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున చోరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కంపెనీకి చెందిన నాలుగు కంటెయినర్లలో ల్యాప్‌టాప్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తరలిస్తుండగా, అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్దకు రాగా.. కంటెయినర్ అలారం బ్రేక్ అయినట్లు కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందింది.  దీంతో కంపెనీ ప్రతినిధులు ల్యాప్‌టాప్స్ చోరీపై మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ల్యాప్‌టాప్‌ల విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఘటనపై చీరాల డీఎస్పీ మొయిన్ స్పందించారు. కంటైనర్ నుంచి ల్యాప్‌టాప్స్ చోరీ చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు  

ట్రంప్ పాల‌న‌లో... భారీగా త‌గ్గిన అమెరికా వ‌ల‌స‌

  ట్రంప్ పాల‌న‌లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా వ‌ల‌స దారులు త‌గ్గిపోయారు. తాజా గ‌ణాంకాల ప్ర‌కారం ఒక‌టిన్న‌ర మిలియ‌న్ల మంది వ‌ల‌స‌దారులు రావ‌డం త‌గ్గింది. 1960 త‌ర్వాత ఆ స్తాయిలో త‌గ్గుద‌ల న‌మోదు కావ‌డం విశేషం.. మొన్నా మ‌ధ్య జేడీ వాన్స్ అన్న మాట ఏంటంటే, అమెరికా గ్రీన్ కార్డు పొంద‌డం అంటే, ప‌ర్మినెంటుగా ఇక్క‌డే ఉండిపోయే అవ‌కాశం ఏమీ కాద‌ని అన్నారు. దీంతో ఇదో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇదిలా ఉంటే వివాహ గ్రీన్ కార్డుల విష‌యంలో కూడా భారీ ఎత్తున ఆ ప్ర‌క్రియను క‌ఠిన త‌రం చేశారు. బేసిగ్గానే గ్రీన్ కార్డుల్లో క‌ఠిన నిబంధ‌న‌లు ఉంటాయి. హెల్త్, క్రైమ్ హిస్ట‌రీ మొత్తం చెక్  చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే అస‌లు అమెరికాలో ఒక వ్య‌క్తి రాక‌కు ఆస్కారం ఏర్ప‌రిచేది.. అత‌డు అమెరికా స‌మాజానికి ఏ విధ‌మైన నాణ్య‌మైన సేవ‌లు అందిస్తాడ‌నే ఆలోచ‌న‌తో. అత‌డి ఆరోగ్య‌మే స‌రిగా లేకుంటే అత‌డెలా సేవ‌లు చేయ‌గ‌ల‌డు? .అన్న‌ది స‌గ‌టు అమెరిక‌న్ స‌మాజం ప్ర‌శ్న‌. దానికి తోడు అమెరికాలో నానాటికీ ప‌ని చేసే వ‌య‌సుగ‌ల వారి సంఖ్య త‌గ్గిపోతూ వ‌స్తోంది. వ‌ల‌స ద్వారా మాత్ర‌మే వారు ఈ లోటు భ‌ర్తీ చేసుకోగ‌ల‌రు. అందుకే స్పేస్, సాఫ్ట్ వేర్, మెడిక‌ల్, లా వంటి రంగాల్లో భార‌త్, ఫుడ్, మ్యూజిక్, పాచిప‌ని వంటి రంగాల్లో మెక్సిక‌న్, ఇక ప్రొడ‌క్ట్ మేకింగ్ చైనీస్ పై అధికంగా ఆధార‌ప‌డుతుంటారు అమెరిక‌న్లు. ఈ ఈ దేశాల నుంచి వ‌ల‌స త‌గ్గిపోతే అమెరిక‌న్ స‌మాజంలో ఆయా రంగాల్లో ప‌ని సామ‌ర్ధ్యం ప‌డ‌కేస్తుంది. దీంతో అమెరిక‌న్ ఆర్ధిక వ్య‌వ‌స్త కుప్ప‌కూలిపోయే ప్ర‌మాద‌మేర్ప‌డుతుంది. తాజాగా విదేశీ ట్ర‌క్ డ్రైవ‌ర్ల విష‌యంలో ఒక కీల‌క నిర్ణ‌యం తీస్కుంది యూఎస్. ఫ్లోరిడాలో జ‌రిగిన ఒక ప్ర‌మాదంలో ముగ్గురు అమెరిక‌న్లు మ‌ర‌ణించారు. దీంతో విదేశీ ట్ర‌క్ డ్రైవ‌ర్ల వీసాల‌ను పునఃప‌రిశీలించి వీరిలో చాలా మంది వ‌ర‌కూ దేశం విడిచి వెళ్లిపోయేలా ప్లాన్ చేస్తోంది అమెరికా. వీళ్ల‌లో అధిక శాతం మంది భార‌త్ నుంచి వ‌చ్చిన సిక్కులే ఉంటారు. దీంతో ఇలాక్కూడా భార‌త్ కి ఇదొక ఇబ్బందిక‌ర‌మైన ప‌రిణామం. ఇలా ర‌క‌ర‌కాల ప‌రిస్థితుల్లో అమెరికాలోని డాల‌ర్ డ్రీమ్స్ కి భార‌తీయుల‌కు గండిప‌డేలా తెలుస్తోంది. ఒక‌ప్పుడు అంటే శాల‌రీ అంటే అమెరిక‌న్ శాల‌రీగా ఫీల‌య్యేవారు మ‌న‌వాళ్లు. కార‌ణం దాని డాల‌ర్ తో పోలిస్తే రూపాయి చాలా చాలా త‌క్కువ కాబ‌ట్టి.. అయితే అమెరిక‌న్లు వ‌ల‌స‌ను, గ్రీన్ కార్డుల‌ను, ఆఖ‌రికి అక్క‌డ పుట్టే వారికి ఇచ్చే పౌర‌స‌త్వం వంటి విష‌యాల్లో పెద్ద ఎత్తున ఆంక్ష‌లు విధిస్తుండ‌టంతో.. ఈ క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యేలా తెలుస్తోంది. ట్రంప్ బేసిక్ థియరీ ఏంటంటే మోస్ట్ విదేశీ టాలెంటెడ్ మాత్ర‌మే త‌మ దేశం రావాల‌ని. దానికి తోడు ఆయ‌న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నిన‌దిస్తుంటారు. అయితే వ‌ల‌స‌దారులు ఏమంటారంటే.. ఇమ్మిగ్రెంట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. నిజానికి ఇది కూడా ఒక ర‌కంగా నిజ‌మే. అమెరిక‌న్లు అమెరికాను గ్రేట్ అగైన్ చేయ‌డం ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు.  వారి హిస్ట‌రీ మొత్తం వ‌ల‌స‌దారుల వ‌ల్ల మాత్ర‌మే ఇంత భారీ అభివృద్ధి న‌మోద‌య్యింది. ఆయా దేశాల్లో స‌రైన ఆద‌ర‌ణ లేని టాలెంటెడ్ యూత్ ఇక్క‌డికొచ్చి ఎంతో శ్ర‌మించి ట్రిలియ‌న్ డాల‌ర్  కంపెనీలుగా వృద్ధి చేసి.. విప‌రీత‌మైన సంప‌ద సృష్టి చేశారు. దాని ద్వారా ఇటు అమెరికాకు అటు ఎంద‌రికో ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల వెల్లువ‌గా  మారింది. దీనంత‌టినీ ట్రంప్ క‌రిగించి.. కొత్త అమెరికా ప్ర‌పంచం పుట్టించాల‌ని చూస్తున్నాడు. అయితే ఇది జ‌రిగే ప‌నేనా? అన్న‌దే ఇక్క‌డ స‌స్పెన్స్ గా మారింది.

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...భక్తుల రద్దీ సాధారణం

  తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత వారం రోజులు దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కాస్తా త్వరగానే శ్రీవారి స్వామివారి దర్శనభాగ్యం కలుగుతుంది. సోమవారం ఉదయం స్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 4 కాంపాట్‌మెంట్లలో మాత్రమే వేచి ఉన్నారు.  ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు తిరుమల సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 72,119 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 25,294 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టీటీడీకి రూ.4.02 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ ఉదయం తిరుమల  శ్రీ వేంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.    వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.  దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కిషన్‌రెడ్డి  మాట్లాడుతూ దేశమంతటా మంచి వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సైనికులు పట్టుదలతో, అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. దేశ సైనిక శక్తి, దేశ భద్రత మరింత శక్తిమంతంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

సినీ పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం : సీఎం రేవంత్‌

  తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో ఆయను తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు కలిశారు. పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. టాలీవుడ్‌లో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం  కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని వారితో తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ  అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాని. పరిశ్రమలో నిర్మాతలు,కార్మికుల అంశం లో సంస్కరణలు అవసరం ఉందని సీఎం తెలిపారు. సినీ కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని..నిర్మాతలు,కార్మికులు,ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందన్నారు. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరమని..పరిశ్రమకు  ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామని సీఎం రేవంత్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఉన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డీవీవీ దానయ్య, వంశీ, గోపీ, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల, తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.  

లిక్కర్ స్కాంలో వైసీపీకి... నారాయణస్వామి టెన్షన్

  మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఒకప్పుడు మాట్లాడితే వైసీపీ నేతలు తెగ ఎంజాయ్ చేసారు. ఇప్పుడు అదే స్వామి మాట్లాడితే ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని భయపడే పరిస్థితి వచ్చింది. దాంతో అయన చుట్టు కోటరీగా లాగా చుట్టుకుని అయన నోరు తెరవడకుండా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎక్కడ తమ పేర్లు బయటపెడతారో అని భయపడుతున్నారంట పార్టీ పెద్దలు.  మొత్తం మీద ప్రస్తుతం వైసీపీ పెద్దలందరికీ నారాయణస్వామి ఫీవర్ పట్టుకుందంట.  వైసీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి  చిత్తూరు జిల్లాలో నారాయణస్వామి ఒక వెలుగు వెలిగారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాతో పాటు,  కీలక మైన ఎక్సెజ్ శాఖతో పాటు కమర్షియల్ ట్యాక్సెస్ మంత్రిగా అవకాశం కల్పించారు. దీంతో అయన తనకు తిరుగులేదన్నట్లు చెలరేగిపోయారు. కాని పదవీ కాలంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనలో సైతం డిప్యూటీ సీఎంకు వేదికపై  కుర్చీ ఇవ్వలేదు. క్యాబినేట్ మంత్రులు కుర్చీల్లో కూర్చోని పవర్ ఎంజాయ్ చేస్తుంటే అయన వెనుక నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మాజీ డిప్యూటీ సియం నారాయణస్వామితో అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్‌ను తెగ తిట్టిస్తూ వైసీపీ పెద్దలు ఆనందించారు. అంతేకాకుండా వారినే కాకుండా వారి కులాలను సైతం అయన చేత తిట్టించి తెగ అనందపడ్డారు. అసెంబ్లీలో సైతం ఆయన చెలరేగిపోతుంటే  జగన్ హ్యాపీ అయిపోయారు. ఇక ఎన్నికల ముందు జిల్లాకు చెందిన ముఖ్యనేత అయినప్పటికీ నారాయణస్వామిని అష్ట కష్టాలు పెట్టారు. ఏకంగా అయన్ని జీడి నెల్లూరు అసెంబ్లీ బరి నుంచి తప్పించి చిత్తూరు ఎంపి అభ్యర్థిగా ప్రకటించారు. చివరకు నారాయణస్వామి నానా తంటాలు పడి.. పార్టీలో అవమానాలు ఎదుర్కొంటూ  కూతురికి జీడి నెల్లూరు టికెట్ ఇప్పించుకోగలిగారు. అయితే ఉహించని రీతిలో రాష్ట వ్యాప్తంగా కూటమి గాలిలో కూతురు ఓటమి పాలయ్యింది. ఓటమి తర్వాత అయన  తన కూతురు రాజకీయ ఓటమికి కారణం పార్టీ లోని సీనియర్ నాయకులతో పాటు స్థానికంగా ఉన్న వారి అనుచరులే అని అగ్రహం వ్యక్తం చేసారు..కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కాంపై సిట్ విచారణ ముమ్మరమైంది.   చిత్తూరు జిల్లాకు చెందిన వారే అందులో కీలకం అయ్యారు.రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అయన కూమారుడు మోహిత్ రెడ్డి , భాస్కర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీతో పాటు కిరణ్ కూమార్ రెడ్డి వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. అయితే తన వరకు కేసు రాదనుకున్న నారాయణస్వామికి సైతం సిట్ ఉచ్చు బిగుసుకుంది. నెల క్రితం అయనకు సిట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో అనారోగ్య కారణాల వల్ల వాట్సాప్ లో పంపిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాజాగా అయన ఇంటికి వచ్చింది సిట్ బృందం. సుమారు అరుగంటల పాటు విచారణ జరిపింది.  విచారణలో మద్యం పాలసీ మార్పులో ఎక్సైజ్ శాఖా మంత్రిగా నారాయణస్వామి పాత్ర, అన్ లైన్ ద్వారా మద్యం బుకింగ్ లు మార్చి మ్యాన్ వల్ చేయడం, ప్రభుత్వ మద్యం దుకాణాల  ఏర్పాటు, డిజిటల్ చెల్లింపులకు ఎందుకు అనుమతించలేదు అన్న అంశాలపై వందకు పైగా ప్రశ్నలు అడగటమే కాకుండా టెక్నికల్ టీమ్స్ ద్వారా అయన గాడ్జెట్స్ ను పరిశోధించడం..రెవెన్యూ అధికారుల సమక్షంలో అయన వాంగ్మూలము రికార్డు చేయడం జరిగిందని తెలుస్తోంది. అయితే అయన చాలా ప్రశ్నలకు అంతా పైవారు చెప్పినట్లే చేశానని సమాధానం ఇచ్చారంట.  ఏదేమైనా మొత్తం వ్యవహారం సీరియస్ అయ్యింది.. నారాయణస్వామి ఎవరి పేర్లు చెప్పారనే ఉత్కంఠ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది విచారణ తర్వాత నారాయణస్వామి ఇంటి బయటకు వచ్చినప్పుడు  వైసిపి నేతలు హైడ్రామా క్రియెట్ చేసారు. ముఖ్యంగా నారాయణస్వామి ,అయన కూతురు మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఉదయం సిట్ బృందం వచ్చిందని తెలిసినప్పటికి పెద్దగా ఎవ్వరూ అక్కడికి రాలేదు. అయితే విచారణ ముగిసే సమయానికి పుత్తూరు కు చెందిన వైసీపీ నేతలు వచ్చి మీడియాతో ఎక్కడ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడతారో అని  మీడియాతో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో ఒకానొక దశలో సీరియస్ అయిన నారాయణ స్వామి మీడియాతో మాట్లాడి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఈసందర్భంగా  సిట్ అధికారులు తనకు సహాకరించారని ,వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని వివరణ ఇచ్చారు. సిట్‌కు వ్యతిరేకంగా ఒకమాట కూడా మాట్లాడలేదు..దాంతో పాటు భవిష్యత్ లో కూడా సిట్ కు సహాకరిస్తానని చెప్పడం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదంట.. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో  మద్యం స్కామ్ లో కీలక నేతలు అరెస్ట్ కావడంతో  పాటు మరికొన్ని కేసులు చుట్టుకుంటుడంతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆడుదాం ఆంద్రాతో రోజా, ఎపిక్ కార్డుల ఇష్యూ తో భూమన కరుణాకర్ రెడ్డి టీమ్‌లకు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించి ఎక్సెజ్ శాఖ మాత్యులుగా ఐదు సంవత్సరాలు ఉన్న నారాయణ స్వామి అన్ని విషయాలు బయటపడితే నెక్ట్ ఎవ్వరు అనే కొణంలో చర్చ నడుస్తుంది. మొదట్లో ఇదేమి పెద్ద వ్యవహారం కాదు అన్న రీతిలో పట్టించుకోని వైసీపీకి ఇప్పుడు లిక్కర్ స్కాం పెద్ద తలనొప్పిగా మారింది. మొత్తం మీద వైసీపీ నేతలకు నారాయణ స్వామి ఫీవర్ గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తోందిప్పుడు.

బాలకృష్ణకు అరుదైన అంతర్జాతీయ గౌరవం

  లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా మరియు యుఎఇలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ, వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకదాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణ కి ప్రదానం చేస్తున్నారు - భారతీయ సినిమాలో అత్యంత ఘనమైన ఆయన వారసత్వం ఇప్పుడు డబ్ల్యూబీఆర్ గోల్డ్ ఎడిషన్‌లో నమోదు అవుతుంది. ఈ ప్రత్యేక గుర్తింపు బాలకృష్ణ అపూర్వమైన సినిమా జైత్రయాత్ర కి అత్యంత గౌరవప్రదమైన ఘనతగా నిలుస్తుంది - 50 ఘనమైన సంవత్సరాలు ప్రముఖ హీరోగా కొనసాగిన అద్భుతమైన మైలురాయి, ఇది ప్రపంచ సినిమాలో  కూడా అత్యంత అరుదైన సంఘటన గా నిలుస్తుంది. తన  కెరీర్ అంతటా, బాలకృష్ణ గారు తన తండ్రి, లెజెండరీ నందమూరి తారక రామారావు  శాశ్వత వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, టాలీవుడ్‌లో తన  ఆల్ రౌండర్ ప్రతిభతో, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన కళపట్ల అవిరామమైన నిబద్ధతతో తనదైన గుర్తింపును సాధించుకున్నారు. ఆయన ప్రయాణం ఉత్సాహం, క్రమశిక్షణ మరియు శాశ్వత కళాత్మకతకు సాక్ష్యం, ఇది అన్నితరాల సినిమా ప్రేమికులను  వారికి అభిమాన పాత్రులను చేసింది. అందరు కళాకారులలాగానే, బాలకృష్ణ  మార్గంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు, కానీ ఆయన స్థిరత్వం, ధైర్యం మరియు విభిన్న పాత్రలతో నిరంతర ప్రయోగాలు ఎప్పటికప్పుడు మారుతున్న పరిశ్రమలో ఆయనను విజేతగా నిలిపాయి.ఆయన గౌరవాల జాబితాకు బాలకృష్ణ గతంలో సినిమా మరియు సమాజానికి చేసిన సేవలకు భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ భూషణ్‌తో సత్కరించబడ్డారు.  అంతేకాకుండా, ఆయన విమర్శకులచే ప్రశంసించబడిన మరియు వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రం భగవంత్ కేసరి ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ డబ్ల్యూబీఆర్ గోల్డ్ ఎడిషన్‌లో చేరిక ఒక గుర్తింపు కంటే ఎక్కువ - ఇది అర్ధ శతాబ్దానికి పైగా స్టార్‌డమ్‌ను పునర్నిర్వచించిన ఐకానిక్ నటుడి ప్రపంచవ్యాప్త ఉత్సవం. ఆయన ఆరోగ్య సేవలు మరియు సామాజిక కారణాలకు చాంపియన్ అయిన కరుణామయ నాయకుడు మరియు తరాలను స్ఫూర్తిపరిచే సాంస్కృతిక రాయబారి. ఈ గౌరవంతో, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అసాధారణ సాధనలలో అద్భుత మైలురాళ్లను మాత్రమే కాకుండా వ్యక్తులను నిజమైన లెజెండ్‌లుగా చేసే మానవ విలువలు మరియు సేవలను గుర్తించే తన మిషన్‌ను బలపరుస్తుంది. భారతీయ సినిమాలో హీరోగా ఆయన అసాధారణ సేవలకు గుర్తింపుగా.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో బాలయ్య చేరికను ఘనమైన గుర్తింపుగా, డబ్ల్యూబీఆర్ సీఈఓ ఆగస్టు 30వ తేదీన హైదరాబాదులో  స్వయంగా బాలకృష్ణ కి అందిస్తున్నారు.

దగ్గుపాటి ఇంటి ముట్టడికి జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నం.. అనంతలో ఉద్రిక్తత

  అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని ముట్టడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే దుగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించనున్నారనే ముందస్తు సమాచారంతో అనంతపురం పోలీసులు అప్రమత్తమయ్యారు.  ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నివాసంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసులు మోహరించారు. ఆ క్రమంలో ఆ ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల్లో బ్యారికేడ్లను ఉంచారు. మరోవైపు అనంతపురంలోకి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇంకోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. ముందస్తు సమాచారంలో.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు. అలా చేయకుంటే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసంతోపాటు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరించింది. బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే.. ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీడీపీ అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అనంతపురంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ యాంత్రాంగం చర్యలు చేపట్టింది.  జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఒక ఆడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.  అయితే తాజాగా చంద్రబాబు సారథ్యంలో కేబినెట్ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో పలువురు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం పట్ల సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వారి వైఖరి కారణంగా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తడంతో.. వెంటనే నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అదే విధంగా విమర్శలకు తావివ్వకుండా నడుచుకోవాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచన చేసినట్లు సమాచారం.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి : కేటీఆర్

  పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు. హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం 20 నెలల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి, తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా అని కేటీఆర్ నిలదీశారు. అభివృద్ధి-సంక్షేమంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల పోలిక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కేటీఆర్ అన్నారు. 2014లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించి, ఇళ్లలో, షాపులలో కనిపించే ఇన్వర్టర్లు, జనరేటర్లను కనిపించకుండా చేశారని చెప్పారు.  హైదరాబాద్ ను కులం, మతం, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా, అన్నదమ్ములుగా ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. హిందూ ఆడబిడ్డలకు దసరా కానుకలు, ముస్లిం పేదలకు రంజాన్ తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చి పండుగలకు ప్రాధాన్యతనిచ్చినట్టు తెలిపారు. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్ ను కేసీఆర్ గారు మార్చారని, అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లేశారని అన్నారు. హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ వృద్ధి అతలాకుతలం హైడ్రా అరాచకాలతో  హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. కూకట్ పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా తన ఇల్లు కూల్చి వేస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పని చేస్తుందని ఆరోపించారు. పేదవాళ్ల కడుపు కొట్టడం, బిల్డర్లను బెదిరించడం, ఆర్ఆర్ టాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వర్సెస్ కాంగ్రెస్ 20 నెలల పాలన బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్లో నాయకులు వేలు పెట్టలేదని, కబ్జాలు, గూండాగిరి చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారని దుయ్యబట్టారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టిండా అని ప్రశ్నించారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 70 వేల కోట్లు వేస్తే, రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. 200 ఉన్న పెన్షన్ ను కేసీఆర్ ప్రభుత్వం 2000 చేస్తే, రేవంత్ ఏం చేసిండని అడిగారు. ప్రజల కోసం కాదు, స్వార్థం కోసమే శేరిలింగంపల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా, తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకోరోజు తన మీద కేసులంటూ రేవంత్ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని ఆయన ప్రశంసించారు.

సురవరం పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

  సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి  హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు  నివాళి అర్పించారు. సురవరం  కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు, సుధాకర్ ను చూసి భావోద్వేగానికి గురయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సురవరం పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి సురవరం అని కొనియాడారు. సురవరం లేనిలోటుపూడ్చలేనిదని, ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చంద్రబాబు మాట్లాడుతు దేశం రాష్ట్రానికి తీరని నష్టం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో కలిసి పోరాటం చేశామన్నారు.

శ్రీశైలం డ్యామ్‌పై ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్

  నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ పై  ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్ టీమ్ అత్యాధునిక ఆయుదాలతో రాత్రుల సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి చిమ్మ చీకటిలో దట్టమైన కొండల నడుమ ఉన్న శ్రీశైలం డ్యామ్ పై ఆక్టోపస్ పోలీసు బలగాలు మోహరించి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ ఏపి మంగళగిరి డీఎస్పీ రంగబాబు ఆద్వర్యంలో 38  మంది ఆక్టోపస్ టీమ్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.  శ్రీశైలం డ్యామ్ బద్రత  తీవ్రవాదుల కదలికలు గమనిస్తూ అనుకోకుండా డ్యామ్ పై చొరబడితే వారి చెర నుంచి అధికారులను వ్యక్తులను ఎలా కాపాడుకోవాలనే ఆంశంపై  తీవ్రవాదుల చర్యలను ఎలా ఎదురుకోవాలనే ప్రక్రియను రియల్ గా అత్యాదునిక ఆయుదాలతో చాకచక్యంగా ఉగ్రవాదులను ఎలా మట్టు పెట్టాలి, వారి నుంచి ఎలా బయటపడాలనే ప్రక్రియ అత్యద్భుతంగా ఉత్కంట వాతావరణంలో హైటెంక్షన్ పరిస్దితుల ప్రక్రియ మాక్ డ్రిల్ ను ఆక్టోపస్ పోలీసు బలగాలు నిర్వహించారు. శ్రీశైలం డ్యామ్ ఘాట్ రోడ్డు సమీపంలోని వ్యూపాయింట్ నుంచి కొండలు గుట్టలు దిగుచూ చీకట్లో అర్ధరాత్రి వరకు ఆక్టోపస్ పోలీసు బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించగా శ్రీశైలం డ్యామ్ పరిసరాలు మొత్తం చికటి వాతావరణం నిశబ్దమైన వాతావరణంలో ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్, శ్రీశైలం టూటౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి  తమ పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు చతేశ్వర్ పుజారా గుడ్‌బై

  అంతర్జాతీయ క్రికెట్‌కు చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లలకు  గుడ్‌బై చెబుతున్నట్లు  సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భారత జట్టుకు ఆడాలన్న కలను నెరవేర్చుకోవడంలో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, గ్రౌండ్‌లో అటుగుపెట్టిన ప్రతిసారి నా శయశక్తులా ఆడేందుకు ప్రయత్నించడటం మాటాల్లో చెప్పలేను అని పేర్కొన్నారు.  రాజ్‌ కోట్‌ పట్టణం నుంచి కుటుంబంతో కలిసి వచ్చిన ఓ కుర్రాడు.. భారత క్రికెట్‌లోకి అడుగు పెట్టాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఎందరో సహకరించారు.. ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్టులు, 5 వన్డేలు ఆడిడారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు పుజారా సాధించారు.  

ఒకే ఇంట్లో నలుగురు ఆడ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు

  చదువుతో పేదరికాన్ని జయించొచ్చని  నిరూపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు అక్క చెల్లెళ్ల ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వేపమాకులపల్లికి చెందిన  గౌరమ్మకు నలుగురు ఆడ బిడ్డలు పదేళ్ల కిందట భర్త చనిపోవడంతో కూలీ పనులు చేస్తూ బిడ్డలను చదివించారు.పెద్దకుమార్తె వీణాకుమారి 2014లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు.  వాణి 2016లో ఎస్జీటీ టీచర్‌గా ఎంపికయ్యారు. నెల క్రితం వనజాక్షి కానిస్టేబుల్ జాబ్‌కి  సెలక్ట్ అయ్యారు. తాజాగా డీఎస్సీలో శిరీష ఎస్జీటీ పోస్ట్ సాధించారు. అయితే ఆ తల్లి పేరును, వంశ గౌరవాన్ని నిలిపిన నలుగురు కుమార్తెలు (దేవతలు) నిజంగా సరస్వతులే.తల్లి దినసరి కూలిగా పనిచేస్తూ పెంచి, పెద్ద చేసి ఉన్నత చదవులు చదివించింది.   ఆర్థిక వనరులు లేక కుటుంబ ఇబ్బందులతో ఇలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే సాధ్యంకాని రీతిలో వీరు మనకు మన పిల్లలకు భావి భారత పౌరులకు స్పూర్తి దాయకం. వెయ్యి ఏనుగుల బలం, వారి ధృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం చూస్తే మనం నమ్మలేని నిజాలుగా ఉన్నాయి, ఒకే కుటుంబంలో ఇద్దరు పోలీస్, మరో ఇద్దరు ఉపాధ్యాయిని లు కావడమే గొప్ప. ఆ విధంగా పెంచి పోషించిన ఆ మాతృమూర్తికి శతకోటి వందనాలు అలాగే ఇంతటి అత్యున్నత స్థాయికి చేరుకున్న ముగ్గురు అక్క చెల్లెళ్లకు అభినందనలు.  

భార్యను ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు

  మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్‌కు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి అలియాస్ జ్యోతి  ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు క్యాబ్ డ్రైవర్‌గా  పని చేస్తున్నాడు. గతంలో అదే ఇంట్లో సంవత్సరం ఉన్న ఈ జంట ఖాళీ చేసి వెళ్లి... మళ్లీ అదే ఇంట్లోకి  25రోజుల క్రితమే వచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ భర్త మహేందర్ రెడ్డి తన గర్భవతైన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఏ చిన్న ఆధారం కూడా లభించకుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి  నల్లని ప్లాస్టిక్స్ లలో చుట్టి మూసి నదిలో పడ వేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అమ్మాయి బావ పోలీసులకు సమాచారాన్ని అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని... ఇంట్లో లభించిన చాతి భాగంలో ఉన్న భాగం మాత్రమే పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాళ్లు చేతులు తల వేరుచేసి ఎక్కడో వేసినట్లు తెలుస్తుంది. చేతులు భుజాల వరకు, కాళ్లు గజ్జల వరకు, అలాగే తల కట్ చేసినట్లు సమాచారం... మిగతా పార్ట్స్ కోసం పోలీసులు మూసీ నదిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కూతురు హత్యకు గురైనట్లు తెలియగానే స్వాతి తల్లి కన్నీరు మున్నీరుగా వినిపించింది. స్వాతి తల్లి డిగ్రీ చదువుతున్న నా కూతురికి ఇంటి పక్కనే ఉంటున్న మహేందర్ మాయమాటలు చెప్పి ప్రేమ అనే వలలో దింపాడని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది . నా కూతురు అతని ప్రేమ నిజమని నమ్మింది. మేము వద్దని వారించిన కూడా అతనే పెళ్లి చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన తర్వాత మంచిగా ఉండమని చెప్పి బంగారం, డబ్బు లిచ్చి పంపామని తెలిపింది. కొన్ని రోజుల నుంచి నా కూతుర్ని చిత్ర హింసలు పెడుతున్నట్లుగా చెప్తుంది.  మహేందర్ తనను ఎప్పుడైనా చంపు తాడని భయం వ్యక్తం చేసిందని తనతో చెప్పిందని తల్లి వాపోయింది. మహేందర్ తన తల్లిదండ్రులతో కలిసి తన కూతుర్ని చంపేశాడని స్వాతి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని రోజుల నుంచి నా కూతురుతో ఫోను కూడా మాట్లాడ నివ్వలేదు..దొంగ చాటుగా నా కూతురు ఫోన్ లో మాట్లాడితే కొట్టేవాడు.నా కూతుర్ని కిరాతకంగా చంపిన మహేందర్ కి ఉరిశిక్ష వేయాలని స్వాతి తల్లి కోరింది.

పేదలు, బహుజనుల కోసం పోరాడిన నేత సురవరం : సీఎం రేవంత్

  హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి సురవరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేతలు, అభిమానులు సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు సుధాకర్‌రెడ్డి పార్థివ దేహాన్ని మఖ్దూం భవన్‌లో ఉంచనున్నారు. అధికారిక లాంఛనాలు పూర్తయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నారు.  అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సుధాకర్‌రెడ్డి రాజీపడని సిద్దాంతలతో రాజకీయాల్లో ఎదిగానని సీఎం రేవంత్ తెలిపారు.విద్యార్థి నేత నుంచి జాతీయ స్థాయి నేతగా ఆయన ఎదిగిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ నేతగా ఎదగడం గర్వకారణమన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సిద్ధాంతాలను ఎప్పుడూ వీడలేదని గుర్తుచేశారు. సుధాకర్‌రెడ్డిని ప్రజలు గుర్తుంచుకునేలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పేరు ఉండేలా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  సధాకర్ రెడ్డి లేఖ పేరకే తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టినట్లు తెలిపారు. సురవరం భౌతిక కాయానికి రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సురవరం మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని, ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు కేటీఆర్ తెలిపారు.   

నిండు గర్భిణీ భార్యను ముక్కలుగా... నరికి చంపిన కసాయి భర్త

  ఓ భర్త గర్భిణీతో ఉన్న భార్యను అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కవర్లో వేసి ఎక్కడెక్కడో పడేసి... పోలీసులు చేతికి చిక్కకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు... ఈ ఘటన రాచ కొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ కి చెందిన స్వాతి(22 అలియాస్ జ్యోతి) అనే యువతి...అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. ఈ ప్రేమ జంట జీవనోపాధి కొరకు గత 25 రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బోడుప్పల్ లోని బాలాజీ నగర్ లో అద్దెకు ఉంటు న్నారు.మహేందర్ రెడ్డి రాపిడో నడుపు తున్నాడు. ఈ ఇద్దరీ మధ్య ఏం జరుగు తోంది తెలియదు కానీ భర్త మహేందర్ తన భార్య స్వాతిని హత్య చేయడమే కాకుండా ముక్కలు ముక్కలుగా కట్ చేసి... కవర్లో వేసుకుని ఎక్కడెక్కడో పడేశాడు. అయితే ఇతని కదలికలపై అనుమానం వచ్చి... స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. గతంలో ఈ జంట  ఇదే ప్రాంతంలోని ఇదే ఇంట్లో ఓ పది నెలలు ఉండి వెళ్ళి నట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. మళ్ళీ ఈ ప్రేమ జంట 25రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఉంటున్నారని స్థానికులు చెబు తున్నారు. వీరు ప్రేమ వివాహం ఎప్పుడూ చేసుకు న్నారనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాళ్ళు, చేతులు, తల వేరు చేసి ఎక్కడో వేసినట్లు తెలుస్తుంది. అవి ఇంకా పోలీసులకు దొరకనట్లు తెలుస్తుంది. ఛాతీ భాగం మాత్రమే లభ్య మైంది. చేతులు భుజాల వరకు, కాళ్ళు గజ్జల వరకు, అలాగే తల కట్ చేసినట్లు సమాచారం... లభ్యమైన  భాగాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించిన... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగం గా మిగతావిడి భాగాల కొరకు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

శుభమా అని శుభలేక ఓపెన్ చేస్తే

వెడ్డింగ్ కార్డ్ వాట్సప్ లో వచ్చింది కదాని ఓపెన్ చేస్తే మీ అకౌంట్లో డబ్బు ఖాళీ అవుతుందని మీకు తెలుసా? పిచ్చి పలు రకాలు అన్నట్టు మోసం కూడా అంతే. ఇందుకోసం రకరకాల ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇందుకు మహారాష్ట్ర హింగోలీకి చెందిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయి అడ్డంగా బుక్ అయిపోయారు. ఆగస్టు 30న పెళ్లి.. ఉందంటూ వాట్సప్ లో ఒక ఇన్విటేషన్ వచ్చిది. పెళ్లికి రండి. ఆనందం గేట్లు తెరవడానికి తాళం ప్రేమ అంటూ కవిత్వం అందంగా కనిపించడంతో ఆ వ్యక్తి దాన్ని ఓపెన్ చేశారు. అదొక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ. అంటే ఏపీకే. దాన్ని క్లిక్ చేయగానే అతడి డేటా మొత్తం పొందారు సైబర్ మోసగాళ్లు. ఇక అక్కడి నుంచి అతడి ఖాతా నుంచి ఏకంగా లక్షా 90 వేల రూపాయల వరకూ ఖాళీ చేశారు. తర్వాత అసలు విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే పోలీస్టేషన్లో కంప్లయింట్ చేశారు.  శుభమాని శుభలేఖ చూస్తే ఈ అశుభం ఏంటో అర్ధం కావడం లేదని వాపోవడం పలువురు బాధితుల వంతు అవుతోంది. కొత్త కొత్త దారుల్లో జనాల్ని బురిడీ కొట్టించి ఇదిగో ఇలా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అందుకే గుర్తు తెలియని నెంబర్ల నుంచి వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటి ఆహ్వాన పత్రికులు, డాక్యుమెంట్లు, వీడియోలు, లింకులు, ఫైళ్లు వస్తుంటాయి. వీటి జోలికి పోతే ఇక అంతే సంగతులు. ఒక్కసారి ఇలాంటి ఇన్విటేషన్ వంటివి డౌన్ లోడ్ చేసుకుంటే ఖేల్ ఖతం. ఫోన్ మొత్తం హ్యాక్ అవుతుంది. డబ్బులొకటే కాదు.. మన సమాచారం మొత్తం వారి పరమై పోతుంది. తద్వారా మన డాటా మొత్తం వారి కంట్రోల్ లోకి వెళ్లి పోతుంది. తర్వాత వాటిని అడ్డు పెట్టుకుని.. బ్లాక్ మెయిల్ చేస్తారు. కాబట్టి తస్మార్ట్ జాగ్రత్త! రీసెంట్ గా ఎస్బీఐకి చెందిన ఒక రివార్డ్ లింకు కూడా సరిగ్గా ఇలాగే సర్క్యులేట్ అవుతోంది. దాన్ని గానీ తెలిసీ తెలియక ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు. ఇలాంటివి వచ్చినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలని చూస్తే.. ఫర్ సపోజ్ ఇన్విటేషన్ వస్తే.. దానికి అది ఏ రకమో చివరి అక్షరాలు తెలియజేస్తాయి. ఉదాహరణకు వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ పంపిస్తే వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌. పీడీఎఫ్‌ అని, ఏపీకే ఫైల్‌ అయితే వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌. ఏపీకే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఏపీకే అని ఉంటే డౌన్‌లోడ్‌ చేయవద్దని సూచిస్తారు నిపుణులు. ఒక వేళ    తెలిసిన వారి నుంచి వచ్చిన మెసేజ్ అయినా సరే.. ఒకసారి పరిశీలించాకే దాన్ని తెరవాలంటున్నారు టెకీ ఎక్స్ పర్ట్స్.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

  తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. నిన్నశనివారం  దర్శనానికి 24 గంటల సమయం పడితే.. నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. నిన్న శ్రీవారిని 83,858 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు వచ్చిందని టీటీడీఅధికారులు తెలిపారు.  నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్మనం టికెట్లు ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం అదే నెల సంబంధించి వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. నిన్న వృద్ధులు , దివ్యాంగుల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. భక్తులు దళారులను నమ్మవద్దని వైబ్‌సైట్ లేదా యాప్‌లోనే బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.