కంటైనర్ నుంచి 255 ల్యాప్ టాప్‌లు చోరీ
posted on Aug 25, 2025 @ 10:51AM
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగింది. ముంబయి నుంచి చెన్నైకి ఒక కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులను తరలిస్తున్న ఓ కంటైనర్లోని 255 ల్యాప్టాప్లను దుండగులు అపహరించారు. చిన్న కొత్తపల్లి వద్ద కంటైనర్ అలారం బ్రేక్ అయినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. చోరీకి గురైన ల్యాప్టాప్ల విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న ఎలక్ట్రానిక్ వస్తువుల రవాణా చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున చోరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కంపెనీకి చెందిన నాలుగు కంటెయినర్లలో ల్యాప్‌టాప్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తరలిస్తుండగా, అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్దకు రాగా.. కంటెయినర్ అలారం బ్రేక్ అయినట్లు కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందింది.
దీంతో కంపెనీ ప్రతినిధులు ల్యాప్‌టాప్స్ చోరీపై మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ల్యాప్టాప్ల విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఘటనపై చీరాల డీఎస్పీ మొయిన్ స్పందించారు. కంటైనర్ నుంచి ల్యాప్‌టాప్స్ చోరీ చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు