అమ్మకానికి రాజ్యసభ సీట్లు

  మరోసారి ఓ కాంగ్రెస్ ఎంపి సంచనల వ్యాఖ్యలతో వివాదాస్పదమయ్యాడు. 100 కోట్లు ఉంటే రాజ్యసభ సభ్యుడు కావచ్చు అంటూ ప్రకటించిన సదరు ఎంపి తనకు మాత్రం కేవలం 80 కోట్లకే ఆ అవకాశం దక్కిందని ప్రకటించాడు. హర్యన నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు భీరేందర్ సింగ్ ఈ సంచలన వ్యాఖలు చేశారు. అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగుతుందని గుర్తించిన సింగ్ వెంటనే నాలుక కరుచుకున్నా ఈ లోపు జరగాల్సి న నష్టం జరిగిపోయింది.. దీంతో లోక్ సభ సమావేశాలు దగ్గర పడుతున్ననేపధ్యంలో బిజిపికి కాంగ్రెస్ ను విమర్శించటానికి మరో అస్త్రం దొరుకినట్టయింది. ఇప్పటికే ఈ విషయం పై స్పందించిన బిజిపి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టింస్తుందని తీవ్రంగా విమర్శించింది.

పది జిల్లాల తెలంగాణే..?

  కేంద్రం తెలంగాణ విషయం తేల్చేయటానకే సిద్దం అయింది. రేపు జరగనున్న సీడబ్ల్యూసి మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే వినిపిస్తున్న వార్తల ప్రకారం పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సీయంతో సహా రాష్ట్ర నాయకత్వానికి ఆ దిశగా సంకేతాలను కూడా అందించినట్టుగా తెలుస్తుంది. దీంతో సీమాంద్ర నాయకత్వం ఆలోచనలో పడింది. రేపు ప్రకటన సమైక్యాంద్రకు వ్యతిరేకంగా ప్రకటన వెలువడిన నేపధ్యంలో తమ కార్యచరణ ఎలా ఉండాలి అన్న దానిపై చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్నసంకేతాలను బట్టి పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రన్నే రేపు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది అన్న వార్త బలంగా వినిపిస్తుంది.

లక్ష కోట్లు: కొండాపై జగన్ ఆగ్రహం

      కొండా సురేఖ తీరుపై పార్టీ నేతలతో చంచల్ గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన పై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ పై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన విమర్శలు నేపధ్యంలో వైయస్ఆర్.  కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ, పార్టీ సీనియర్ నేతలు మైసూరా రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు జైలులో ఉన్న జగన్ ని కలిసి, దాదాపు గంటకు పైగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహ౦ జగన్ వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. కొండా సురేఖ, ఇతర తెలంగాణ నేతల హెచ్చరికలు, సమైక్యాంధ్ర నేతల రాజీనామాల అంశం కూడా చర్చకు వచ్చింది.

రేపే విడుదల

  తెలంగాణ పై తేల్చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది.. రేపు 4 గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించనున్న అధిష్టానం ఆ తరువాత వెంటనే ఐదున్నర గంటలకు  సిడబ్ల్యూసి మీటింగ్ కూడా నిర్వహించడానికి రెడీ అవుతుంది.. వర్కింగ్ కమిటీ మీటింగ్ పూర్తవగానే నిర్ణయం వెలువడుతుందన్నారు రాష్ట్రవ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. ఇప్పటికే సీమాంద్ర ప్రాంతంలో భారీ ఆందోలనలు జరుగుతుండటంతో కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపుతున్నారు. ఇప్పటికే 1200 బలగాలు సీమాంద్ర ప్రాంతాల్లో ఉండగా, మరో 1000 బలగాలను రాష్ట్రనికి పంపుతున్నారు. ఇప్పటికే డిజిపి, ఛీఫ్ సెక్రటరీలతో చర్చించిన కేంద్ర హోంశాఖ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవటానికి రెడీ అవుతున్నారు. రేపు ప్రకటన వెలువడనున్ననేపథ్యంలో పరిస్థితులు క్షణ క్షణానికి మారుతున్నాయి.

జగన్ రిమాండ్ పొడిగింపు

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసు నిందితుల రిమాండును సిబిఐ ప్రత్యేక కోర్టు ఆగస్టు 12 వరకు పొడిగించింది. జగన్ తదితరులను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. జగన్, విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందం, గాలి జనార్ధన్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరుల రిమాండును పొడిగించారు.   జగన్ ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసుల్లో కోర్టుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోనేరు రాజేంద్ర ప్రసాద్, నిత్యానంద రెడ్డిలు హాజరయ్యారు.

కొండా లేఖతో వైకాపా పరువు పాయె

  వైయస్ కుటుంబానికి అత్యంత ఆప్తురాలుగా పేరొందిన కొండా సురేఖ వ్రాసిన బహిరంగ లేఖతో వైకాపా పరిస్థితి మరింత దారుణంగా మారింది. సమైక్యాంధ్ర కోరుతూ ఆ పార్టీ నేతల రాజీనామాలతో తెలంగాణా ప్రజలలో ఆ పార్టీ పట్ల చులకన భావం ఏర్పడగా, “జగన్ మోహన్ రెడ్డిలో తండ్రికి ఉన్న ఒక్క మంచి లక్షణం కూడా లేదని, యంయల్సీ టికెట్లను రూ 7 కోట్లకు అమ్ముకొని కేవలం లక్ష కోట్లు సంపదనే ధ్యేయంగా అతను పార్టీని ఒక ప్రైవేట్ లిమిటడ్ పార్టీగా జైల్లోంచే నడిపిస్తున్నాడని” సురేఖ వ్రాసిన బహిరంగ లేఖతో ఇరు ప్రాంతలలో ఆపార్టీ పరువు గంగలో కలిసిపోయింది. ఈ ఆరోపణలు వేరేవరయినా చేసి ఉంటే ప్రజలు అంతగా పట్టించుకొనే వారు కారేమో. కానీ, వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా మెలిగిన సురేఖే ఇంత తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రజలు నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. అగమ్యగోచరంగా ముందుకు సాగుతున్నపార్టీపై ఈ ఆరోపణలు మరింత తీవ్ర వ్యతిరేఖ ప్రభావం చూపనున్నాయి. తెలంగాణాను వ్యతిరేఖించడం వలన ఆగ్రహంతో ఉన్న తెరాసకు, వైకాపాకు బద్ధ శత్రువయిన తేదేపాకు ఇవి ఆయాచిత అస్త్రాలుగా లభించడంతో ఇక ఆ రెండు పార్టీలు వైకాపాపై మరింత చెలరేగిపోవచ్చును. ఈ నెల 31న జరగనున్న మూడవ దశ పంచాయితీ ఎన్నికల మీద ఆమె లేఖ తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక షర్మిల పాదయత్ర త్వరలో ముగియనున్నందున ఆమె గనుక పార్టీ పగ్గాలు చేప్పట్టి పార్టీని మళ్ళీ గాడిలో పెడితే తప్ప పార్టీకి ఇటువంటి కష్టాలు సమస్యలు తప్పకపోవచ్చును. ఈ రోజు కోర్టు జగన్ మోహన్ రెడ్డి రిమాండును వచ్చే నెల 12 వరకు పొడిగించింది. అతనితో బాటు అదే కేసుల్లో అరెస్టయిన విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందం, గాలి జనార్ధన్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరుల రిమాండును కూడా ఆగస్ట్ 12 వరకు పొడిగించింది.

పురంధేశ్వరి, లగడపాటి ఇళ్ళ ముట్టడి

      సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. సమైక్యాంధ్ర జేఏసీ సోమవారం కేంద్రమంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించింది. వివిధ జిల్లాల్లో ఉన్న కేంద్రమంత్రులు పురంధరీశ్వరి, కావూరి సాంబశివ రావు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి.. ఎంపీలు సబ్బం హరి, సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, కొనకళ్ల నారాయణ, చింతా మోహన్, బొత్స ఝాన్సీ, శివప్రసాద్, రాయపాటి సాంబశివరావుల ఇళ్లను జేఏసీ నాయకులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వీరంతా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లగడపాటి ఇంటి ముందు ఐకాస నేతలు టెంట్లు వేశారు. ఏపీఎన్జీవోలు లగడపాటి ఇంటిపైకి ఎక్కారు. ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పురంధరీశ్వరి ఇంటి వద్ద కూడా ఆందోళనకర వాతావరణం నెలకొంది.

లక్ష కోట్ల ఆస్తి జగన్ లక్ష్యం: కొండా సురేఖ

  రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమంధ్రకు చెందిన వైకాపా శాసనసభ్యుల రాజీనామాలతో ఆ పార్టీలో సంక్షోభం మొదలయింది. ఆ పార్టీకి చెందిన కొండా సురేఖ, మురళి, మహేందర్ రెడ్డి తదితరులు విజయమ్మతో రెండు సార్లు భేటీ అయినప్పటికీ పార్టీ రాష్ట్ర విభజనపట్ల తన ధోరణి మార్చుకొనేందుకు ఇష్టపడక పోవడంతో వారు పార్టీని వీడేందుకు సిద్దపడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు కొండా సురేఖ విజయమ్మను, జగన్ మోహన్ రెడ్డిని, పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ ఒక బహిరంగ లేఖ వ్రాసారు.   క్లుప్తంగా లేఖలో సారాంశం: మేము స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనే వైకాపాలో చేరిన సంగతి మీకు తెలుసు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ‘మాట తప్పకు, మడమ తిప్పకు,’ అనే సిద్ధాంతం పాటిస్తే, ఇప్పుడు మీరు ఇద్దరూ కూడా తద్విరుద్ధంగా ‘మాట తప్పుతాము, మడమ తిప్పుతాము’ అనే కొత్త సిద్ధాంతం అవలంభిస్తున్నారు. తెలంగాణాపై పార్టీ ఇచ్చిన మాటను మరిచి ఇప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమంధ్ర నేతలు రాజీనామాలు చేయడం కేవలం సీమంధ్ర ప్రాంతంలో వీలయినన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోవడానికే కదా?   ఇప్పుడు వైకాపా తన పూర్తి నిజస్వరూపాన్నిబయటపెట్టుకొని తమది పక్కా సమక్యవాద పార్టీ అని ఋజువు చేసుకొంది. మీ నిర్ణయం వలన తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడం కోసం రేయింబవళ్ళు కృషిచేసిన మా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఈవిధంగా చేసి మమ్మల్ని మీరిద్దరూ కూడా చాలా అవమానించారు. కొద్ది నెలల క్రితం జరిగిన యంయల్సీ ఎన్నికలలో సీట్లను రూ.7కోట్లకు అమ్ముకోవడం చూస్తే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం లక్ష కోట్ల రూపాయలు సంపాదించడమేనని స్పష్టం అవుతోంది. జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉంటూనే పార్టీని తప్పుడు మార్గంలో నడిపిస్తూ పార్టీని సర్వ విధాల భ్రష్టు పట్టిస్తున్నారు.”

ముఖ్యమంత్రి కిరణ్ పై మండిపడ్డ సోనియా!

      సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మండిపడినట్లు సమాచారం. రాష్ట్ర విభజన బాధ్యత భారాన్ని తాను మోయలేనని చెప్పినప్పుడు సీఎం కిరణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం వార్ రూమ్ భేటి సంధర్బంగా ఆజాద్ తో కిరణ్ విభజన బాధ్యతను మోయలేనని చెప్పడంతో..ఆయన ఈ విషయాన్ని సోనియా గాంధీతో చెప్పాలని అన్నారు. దాంతో కిరణ్ ఆజాద్ జోక్యంతో సోనియాని కలుసుకున్నారు. తన అభిప్రాయాన్ని చెప్పి, రాజీనామా లేఖను ఇవ్వడంతో కిరణ్ పై సోనియా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. ఇన్నాళ్లు తమకు అనుకూలంగా ఉంటున్నట్లు ఎందుకు వ్యవహరించారని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎందుకు చెప్పారని సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీసినట్లు చెబుతున్నారు. ఆతరువాత కిరణ్ హైదరాబాద్ కి తిరిగి వచ్చేసారు. ఈ  పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

రేపే తెలంగాణపై ప్రకటన..!!

        తెలంగాణ పై తేల్చే దిశగా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యుపిఎ వడి వడిగా అడుగులు వేస్తుంది.. గతం వారం రోజులగా తెలంగాణపై విస్త్రుత స్ధాయిలో జర్చలు జరిపిన కాంగ్రెస్‌ అదిష్టానం ఇప్పటికే తెలంగాణపై అభిప్రాయ సేకరణ పూర్తియందని ప్రకటించింది.. ఇక మిగిలింది కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం చెప్పడమేనని చెప్పినని నేతలు ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు.   ఈ విషయంపై కాంగ్రెస్ యూపిఎలో తన భాగస్వామ్యపక్షాలయిన ఇతర పార్టీలతొ చర్చించనుంది. యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 29న ఏర్పాటవుతుందని తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 31వ తేదీన ఏర్పాటవుతున్నట్లు సమాచారం వచ్చింది. కానీ, ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు సిడబ్ల్యుసి సమావేశం జరుగుతుంది. సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు, మూడు రోజుల తర్వాత సిడబ్ల్యుసి సమావేశం నిర్వహిస్తారని భావించారు. కానీ, అదే రోజు సిడబ్ల్యుసి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై తేల్చేయాలని కాంగ్రెసు భావిస్తోంది. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం సిడబ్ల్యుసి రాష్ట్ర విభజనకు ఆమోద ముద్ర వేస్తే అధికారిక ఆమోదం లభించినట్లవుతుంది. ఆగస్టు 5నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్ననేపధ్యంలో,  వీలైతే ఈలోగానే తెలంగాణపై తుది నిర్ణయం ప్రకటించాలని ప్రయత్నింస్తుంది కేంద్రం. యూపిఎ లోని ప్రదాన భాగస్వామ్యపక్షాలనైన శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, ఫారూఖ్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ, ముస్లీంలీగ్ పార్టీలు ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించగా.. మిగిలిన పార్టీ మద్దతు అవసరం పడకపోవచ్చు అనే ధైర్యంతో ఉంది యుపిఎ.

ముందస్తుకు ఈసి ఏర్పాట్లు

      దేశంలో రాజీకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతుండటంతో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌ సభ ఎన్నికలు కూడా ఉండవొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు..   ఈ నేఫథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్‌ సభ ఎలక్షన్స్‌ కూడా వస్తే కావాల్సిన వనరులను సమకూర్చుకునేందుకు రెడీ అవుతుంది కేంద్ర ఎన్నికల కమీషన్‌.. రెండు చోట్ల ఒకే సారి ఎలక్షన్లు జరిగితే ఇప్పుడున్న ఇవియం మిషన్లు సరిపోవని భావించిన కమీషన్‌ మరో 2 లక్షల మిషన్లకు ఆర్డర్‌ ఇచ్చింది. డిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, మిజోరంలకు సెప్లెంబర్‌ అక్టోబర్‌ నెలలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది.. ఈలోగా ప్రస్థుతం ఆర్డర్‌ ఇచ్చిన ఇవియంలు అందుబాటులోకి వస్తాయిని భావిస్తుంది ఈసి.

ఆ సంతకాలు నిజమైనవే

      నరేంద్రమోడి వీసా వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. గుజరాత్‌ అల్లర్ల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మోడికి అమెరికా వీసా ఇవ్వొదంటూ పలువురు పార్లమెంట్‌ సభ్యులతో పాటు, రాజ్యసభ సభ్యులు ఒబామకు లేఖరాశారన్న వార్త కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించింది. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా సిపిఎం పార్టీకి చెందిన సీతారాం ఏచూరి, సిపిఐ ఎంపి అచ్యులన్‌, డిఎంకె ఎంపి రామలింగంలు ఆ లేఖలో ఉన్నవి తమ సంతకాలు కాదని. ఫోర్జరీ సంతకాలని ప్రకటించారు.   అయితే ఆ లేఖలను పరీక్షించిన ఫోరెన్సిక్‌ నిపుణులు అందులోని సంతాకాలు,చేతిరాత అసలైదని అని ప్రకటించడంతో ఇప్పుడు మరోసారి వివాదం మొదలైంది. ఇన్నాళ్లు అవి మా సంతాకాలు కాదంటూ చెపుతూ వచ్చిన ఎంపిలు ఫోరెన్సిక్‌ నివేదికతో ఖంగుతున్నారు.. అయితే ఈ విషయం పై మోడి స్పందించక పోవడం విశేషం.

31న యుపిఎ సమన్వయ కమిటీ మీటింగ్‌

      తెలంగాణ పై తేల్చే దిశగా కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యుపిఎ వడి వడిగా అడుగులు వేస్తుంది.. గతం వారం రోజులగా తెలంగాణపై విస్త్రుత స్ధాయిలో జర్చలు జరిపిన కాంగ్రెస్‌ అదిష్టానం ఇప్పటికే తెలంగాణపై అభిప్రాయ సేకరణ పూర్తియందని ప్రకటించింది.. ఇక మిగిలింది కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం చెప్పడమేనని చెప్పినని నేతలు ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ యూపిఎలో తన భాగస్వామ్యపక్షాలయిన ఇతర పార్టీలతొ చర్చించనుంది. ఈ నెల 31న యుపిఎ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమవేశంలో భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చే అభిప్రాయాలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకునేందుకు  రెడీ అవుతుంది. ఆగస్టు 5నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్ననేపధ్యంలో,  వీలైతే ఈలోగానే తెలంగాణపై తుది నిర్ణయం ప్రకటించాలని ప్రయత్నింస్తుంది కేంద్రం. యూపిఎ లోని ప్రదాన భాగస్వామ్యపక్షాలనైన శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, ఫారూఖ్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ, ముస్లీంలీగ్ పార్టీలు ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించగా.. మిగిలిన పార్టీ మద్దతు అవసరం పడకపోవచ్చు అనే ధైర్యంతో ఉంది యుపిఎ.

అంగీకరించే ప్రసక్తే లేదు : ములాయం

      తెలంగాణ పై కాంగ్రెస్‌ తేల్చేస్తుంది అన్న ఊహాగానాల మధ్య ములాయం మరో బాంబు పేల్చారు..తాము చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరూకమని చెపుతూనే.. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి ని అభినందించారు. చిన్నరాష్ట్రాల వల్ల దేశ ప్రగతి దెబ్బతింటుందన్నారు.   అసలు కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు ఎందుకు మొగ్గు చూపుతుందో అర్ధంకావటం లేదని.. తెలంగాణ ఏర్పాటు జరిగితే మరిన్ని రాష్ట్రాల్లో అలాంటి ప్రతిపాదనలు వస్తాయన్నారు.. ఇప్పటికే తెలంగాణ నేపధ్యంలో గుర్ఖాలాండ్‌లో కూడా మరోసారి ఉద్యమాలు ఊపందుకున్నాయి.. ఇలాంటి పరిణామాలే మరిన్నిజరుగుతాయని ములాయం అభిప్రాయపడ్డారు.. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ను, మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్, బీహార్‌ నుంచి జార్ఖండ్‌ను వేరుపడగా ఇప్పుడు ఆ రాష్ట్రల ప్రగతి కుంటుపడిందని, కాబట్టి అక్కడి పరిస్ధితులను సమీక్షించుకొని రాష్ట్ర ఏర్పాటులో ముందడుగు వేయాలని కోరారు.. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరించమన్న ములాయం పార్లమెంట్‌లో బిల్లు పెడితే వ్యతిరేకిస్తామన్నారు.

స‌మైఖ్యం కోసం డిఐజీ రాజీనామ‌

  ఇన్నాళ్లు తెలంగాణ కోరుతూ నాయ‌కులు ఉద్యోగులు త్యాగాలు చేశారు ఇప్పుడు సీన్ మారింది. కేంద్ర తెలంగాణ‌కు అనుకూలంగా సంకేతాలు ఇస్తున్న నేప‌ధ్యంలో ఇప్పుడు త్యాగాలు చేయ‌డం సీమాంద్ర ప్రజ‌ల వంతు అయింది.. గతంలో ఓ మ‌హిళ డిఎస్పీ రాజీనామ చేయ‌టం అప్పట్లో సంచ‌ల‌నం సృష్టించింది.. ఇప్పుడు మ‌రోసారి అంలాటి రాజీనామనే తెర మీద‌కు వ‌చ్చింది.రాష్ట్ర విభ‌జ‌న‌ను నిర‌సిస్తూ డిఐజి ఇక్బాల్ రాజీనామ చేశారు. తెలంగాణ పై నిర్ణయం తీసుకునే క్రమంలో భాగంగా రాయ‌ల‌సీమ‌ను విభ‌జించే ప్రయ‌త్నం కేంద్రం చేస్తుండ‌టంతో అందుకు నిర‌స‌న‌గా ఇక్బాల్ రాజీనామ చేశారు. సిన్సియ‌నర్ ఆఫీస‌ర్‌గా మంచి పేరున్న ఇక్బాల్‌కు ఇంకా 5 సంవ‌త్సరాల‌కు పైగా ప‌ద‌వీ కాలం మిగిలే ఉంది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసిన ఇక్బాల్ ఇటువంటి నిర్ణయం తీసుకోవ‌టం అంద‌రిని ఆశ్చర్యానికి గురిచేసింది.

కిర‌ణ్‌కుమార్ రెడ్డి రాజీనామా..?

  తెలంగాణ అంశం పై కేంద్ర ఏదో ఒక‌టి తేల్చేయ‌డానికి రెడీ అవుతుంటే అందుకు ప్రతిగా స‌మైఖ్యవాదులు కూడా త‌మ ద‌గ్గర ఉన్న ఆఖ‌రి అస్త్రల‌ను సిద్దం చేస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్న కిర‌ణ్‌కుమార్ రెడ్డి కూడా విభ‌జ‌న త‌ధ్యం అయిన ప‌క్షంలో రాజీనామాకు సిద్దప‌డిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి.. ఒక వ‌ర్గం మీడియా అయితే ఇప్పటికే కిర‌ణ్‌కుమార్ రెడ్డి త‌న రాజీనామాను స‌మ‌ర్పించార‌ని కూడా చెపుతుంది.. దిగ్విజ‌య్‌సింగ్, గులాం న‌బి ఆజాద్ ల‌తో జ‌రిగిన భేటిలో త‌న నిర్ణయాన్ని క‌రాఖండిగా చెప్పారు.  విభ‌జ‌న అనివార్యం అయితే త‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటా అని కూడా చెప్పిన‌ట్టుగా స‌మాచారం. త‌రువాత సోనియాతో జ‌రిగిన భేటిలో కూడా ఇదే విష‌యం చెప్పిన కిర‌ణ్‌.. త‌న రాజీనామాను కూడా అందించిన‌ట్టుగా చెపుతున్నారు.. దీని తోడు కిర‌ణ్‌కుమార్ రెడ్డి శ‌నివారం స‌చివాల‌యానిక రాక‌పోవ‌డం, అన్ని అధికారిక కార్య‌క్ర‌మాలు ర‌ద్దు చేసుకోవ‌టంతో ఈ వాద‌న‌లుకు మ‌రింత బ‌లం చేకూరుతుంది.. కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించకపోయినప్పటికీ రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రణాళికను కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రాన్ని విభ‌జిస్తే కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉండాల్సింది. కిరణ్ కుమార్ రెడ్డి అందుకు అంగీకరించకపోతే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.

అది ఆజాద్ జాదూనే..!

  కేంద్ర తెలంగాణ విష‌యంలో స్పష్టమైన వైఖ‌రితో ఉంది అన్న వాద‌న బ‌లంగా వినిపిస్తున్న నేప‌ధ్యంలో ఇప్పుడు సీమాంద్ర నాయ‌కుల నుంచి కొత్త వాద‌న వినిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న పరిణామాల‌న్నింటి వెనుక కేంద్రలోని ముఖ్య నాయకుడు ఆజాద్ హ‌స్తం ఉన్నట్టుగా ఆరోపిస్తున్నారు ప‌లువురు నేత‌లు.. గ‌తంలో ఆంద్రప్రదేశ్ ఇంచార్జ్‌గా వ్యవ‌హారించిన స‌మ‌యంలో కూడా ప‌లు వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో తెలంగాణ‌తో పాటు రాష్ట్రంలో విద్వేశాల‌ను రెచ్చగొట్టిన ఆజాద్ మ‌రోసారి తెరవెనుక త‌తంగా న‌డిపిస్తున్నార‌న్న వాద‌న ఉంది.. ఆజాద్ వ‌ల్లే అస‌లు ఎవ‌రు కోర‌ని రాయ‌ల్ తెలంగాణ అంశం తెర మీద‌కు వ‌చ్చింది అంటున్నారు. ప్రత్యేఖ తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఎం ఐ ఎం పార్టీ అస్తిత్వంమే ప్రశ్నార్ధకం అవుతుంది అందుకే తొలినుంచి ఆ పార్టీ విభ‌జ‌న‌ను వెతిరేఖిస్తూ వ‌స్తుంది.. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ దూరంగా ఉన్న ఎం ఐ ఎం పార్టీ ఆజాద్ తోక‌లిసి ఈ నాట‌కం ఆడిస్తున్నట్టుగా చెపుతున్నారు.. రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఉన్న ముస్లింల‌తో క‌లిపితే కొత్త గా ఏర్పడే రాష్ట్రంలో ముస్లిం శాతం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక ఆజాద్ ఈ ప్రతిపాతద‌న తెచ్చిన‌ట్టుగా చెపుతున్నారు..

బోన‌మెత్తిన భాగ్యన‌గ‌రం

  సికింద్రాబాద్ బోనాల సంద‌ర్భంగా భాగ్యన‌గ‌రం కొత్త శోభ సంత‌రించుకుంది.. ఆషాడం జాత‌ర‌గా పేరొందిన ఉజ్జయినీ మ‌హంకాళి అమ్మవారి భోనాలు ఆదివారం ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు మహా హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. తెలంగాణాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ ఉత్సవాల్లో తొలి రోజు భ‌క్తులు అమ్మవారికి భోనాల‌తో పాటుర సాక స‌మ‌ర్పిస్తారు.. రెండో రోజ‌యిన సోమ‌వారంనాడు రంగం నిర్వహిస్తారు.. అవివాహిత మ‌హిళ చెప్పే భ‌విష్యవాణి విన‌టానికి ఎంతో ప్రత్యేక‌త ఉంది. రంగంలో భాగంగా దేశ ప‌రిస్థితులు, వ‌ర్షాలు ఇలా అనేక విష‌యాల‌ను అమ్మవారే చెపుతార‌ని న‌మ్ముతారు భ‌క్తులు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల్ని ప్రతిబింబించే ఈ జాతరలో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరతో పాటు సికింద్రాబాద్‌లోని 40 దేవాలయాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు జరుతున్నాయి.ఈ రోజు ఉద‌యం నుంచి సికింద్రాబాద్ అమ్మవారి ఆళ‌యానికి విఐపిల తాకిడి కూడా బాగా ఉంది.. ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌, రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, వైకాప అధ్యక్షులరాలు విజ‌య‌మ్మ, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇంకా చాలా మంది నాయ‌కులు నాయ‌కులు అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.