ముందస్తుకు ఈసి ఏర్పాట్లు
posted on Jul 29, 2013 @ 11:09AM
దేశంలో రాజీకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతుండటంతో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి.. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా ఉండవొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు..
ఈ నేఫథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్ సభ ఎలక్షన్స్ కూడా వస్తే కావాల్సిన వనరులను సమకూర్చుకునేందుకు రెడీ అవుతుంది కేంద్ర ఎన్నికల కమీషన్.. రెండు చోట్ల ఒకే సారి ఎలక్షన్లు జరిగితే ఇప్పుడున్న ఇవియం మిషన్లు సరిపోవని భావించిన కమీషన్ మరో 2 లక్షల మిషన్లకు ఆర్డర్ ఇచ్చింది.
డిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, మిజోరంలకు సెప్లెంబర్ అక్టోబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.. ఈలోగా ప్రస్థుతం ఆర్డర్ ఇచ్చిన ఇవియంలు అందుబాటులోకి వస్తాయిని భావిస్తుంది ఈసి.