తెలంగాణలో ముందంజలో వున్న అభ్యర్ధులు

      సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణా లో టీఅర్ఎస్ అభ్యర్ధులు ముందంజలో కొనసాగుతున్నారు.   తెలంగాణా లో ఆధిక్యంలో వున్న అభ్యర్దులు:  * మెదక్ పార్లమెంట్‌లో కేసీఆర్ ముందంజ * జగిత్యాలలో కాంగ్రెస్ ముందంజ * ఘోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజ * కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం. * గద్వాల్‌లో డీకే అరుణ ఆధిక్యం. * నిజామాబాద్ లోక్‌సభలో కవిత ఆధిక్యం. * అంబర్‌పేటలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి 452 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. * వేములవాడ చొప్పదండి స్థానాల్లో టీడీపీ ఆధిక్యం * మల్కాజ్‌గిరి లోక్‌సభకు టీఆర్ఎస్ ఆధిక్యం. * ఆలేరు, కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం * వరంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కడియం ఆధిక్యం.

ఓట్ల లెక్కింపు: వెనుకబడిన ప్రముఖులు

    రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలలో మాజీ మంత్రులు అంతా వెనకబడిపోతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, డీకీ అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సునీతా లక్ష్మారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, రఘువీరారెడ్డి తదితరులు వెనుకంజలో ఉన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, సంగారెడ్డిలో మాజీ విప్ జగ్గారెడ్డి, బాల్కొండలో అనిల్ తదితరులు వెనకబడిపోయారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 53 స్థానాలలో ..కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలలో,టీడీనీ 15, బీజేపీ 8, ఎంఐఎం 1, బీస్పీ ఒకస్థానంలో, సీమాంధ్రలో టీడీపీ 80, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 66, బీజేపీ 3, జై సమైక్యాంధ్ర పార్టీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి.

సార్వత్రిక ఎన్నికలు: ఉత్తర్ ప్రదేశ్, కర్నాటకలో బీజేపీ దూకుడు

      ఢిల్లీ పీఠంలో అధికారంలోకి రావాలంటే ఉత్తర ప్రదేశ్‌లో మెజారిటీ సాధించడం చాలా ముఖ్యం ఇప్పుడు బీజేపీ ఆ బాటలో ముందుకు దూసుకుపోతోంది. ఉత్తర ప్రదేశ్‌తోపాటు బీజేపీకి కంచుకోట లాంటి కర్నాటకలో కూడా ముందడుగులో వుంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో కాషాయ పార్టీ ఆధిక్యంలో ఉంది. లక్నో సహా పలు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, సమాజ్వాది పార్టీ 3, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.కర్ణాటకలోనూ బీజేపీ ముందంజలో ఉంది. అధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నందన్ నిలేకనిపై బీజేపీ అభ్యర్థి అనంతకుమార్ ఆధిక్యంలో ఉన్నారు.

నగరిలోరోజా ...హిందూపురంలో బాలకృష్ణ ముందంజ

      సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి ఎన్నికల బరిలో దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రోజా ఆధిక్యంలో ఉన్నారు. తన సమీప టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై ఆమె ముందంజలో కొనసాగుతున్నారు. సీమంధ్రలోటీడీపీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. * రేపల్లె, ఒంగోలులో ఆధిక్యం ప్రదర్శిస్తున్న టీడీపీ అభ్యర్థులు * హిందూపురంలో బాలకృష్ణ ముందంజ * నగరిలో వైసీపీ అభ్యర్థి రోజా ముందంజ * ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి ముందంజ * చిత్తూరు లోక్‌సభ టీడీపీ ఆధిక్యం * పెనమలూరు, మచిలీపట్నంలో టీడీపీ ఆధిక్యం. * కర్నూలు లోక్‌సభ టీడీపీ ఆధిక్యం. * బాపట్ల, నరసారావుపేటలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం.

లీడింగ్ లో కొనసాగుతున్న ప్రముఖులు

ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రముఖుల జాబిత:   వారణాసి  - నరేంద్ర మోడీ - బిజెపి రాయబరేలీ - సోనియా గాంధీ - కాంగ్రెస్ అలహాబాద్ - మురళీమనోహర్ జోషి -బిజెపి ఝాన్సీ ఉమాభారతి - బిజెపి మధర - హేమామాలిని - బిజెపి మీరట్ - నగ్మా - కాంగ్రెస్ బెంగళూరు సౌత్ - అంనతకుమార్ - బిజెపి ఫిలిబిత్ - మేనకా గాంధీ - బిజెపి నాజానంద్ గామ్ - అభిషేక్ సింగ్ - బిజెపి జ్యోతిరాధిత్య సింథియా - కాంగ్రెస్ చింద్వార - కమల్‌నాథ్ -  కాంగ్రెస్ కడప - అవినాష్ రెడ్డి  -వైఎస్ఆర్ సిపి

సార్వత్రిక ఎన్నికలు: సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్

  సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందరూ ఊహించినట్టుగానే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో వుంది. సీమాంధ్ర పార్లమెంట్ స్థానాల్లో 12 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో వుంది. వైసీపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ 58 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, వైసీపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. బీజేపీ 2 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో వుంది. తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో వుంది. కాంగ్రెస్ 10 పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, టీఆర్ఎస్ 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో వుంది. టీడీపీ బీజేపీ కూటమి 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో వున్నారు. తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 53 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, కాంగ్రెస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. టీడీపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఎంఐఎం రెండు స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో వున్నారు.

హిందూపురంలో బాలకృష్ణ దూకుడు

      దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ పండుగ అంగరంగ వైభవంగా మొదలైంది. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ లీడ్‌లో వున్నారు. భారీ ఆధిక్యం సాధించే దిశగా దూసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది. హిందూపురం నందమూరి వంశానికి పెట్టని కోటలా వుంది. ఎన్టీఆర్ కూడా అక్కడి నుంచి పోటీ చేసి విజయాలు సాధించారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తాన్న నమ్మకం అందరిలోనూ వుంది. ఇప్పుడు ఆ నమ్మకం నిజమవుతోంది. ఇప్పుడు అందరి దృష్టీ బాలకృష్ణ ఎంతటి సంచలన విజయం సాధిస్తారన్న విషయం మీదే కేంద్రీకృతమై వుంది. బాలకృష్ణ సాధించబోయే మెజారిటీ మీదే ఇప్పుడు అందరి ద‌ృష్టీ కేంద్రీక‌‌ృతమై వుంది. బాలక‌‌ృష్ణ హిందూపురం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా నిలుస్తారన్న నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

దేవుడా.. నువ్వే కాపాడాలి దేవుడా..

      దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ హడావిడి జరుగుతూ వుండగా, ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలల పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం టెన్షన్‌తో అల్లాడిపోతున్నారు. ఓటరు దేవుడు ఎలాగూ కరుణించేశాడు. ఇప్పుడు అభ్యర్థులకు ఆకాశంలో వున్న దేవుడి అవసరం వచ్చి పడింది. దాంతో 99 శాతం మంది అభ్యర్థులు ఇప్పుడు గుళ్ళూ గోపురాల చుట్టూ తిరిగే పనిలో వున్నారు. గురువారం నాడు దేశవ్యాప్తంగా అనేకమంది అభ్యర్థులు తమ ఇష్టదేవతలకు ప్రత్యేక పూజలు చేయించడంలో బిజీగా వున్నారు. మొక్కుబడులు తీర్చకుంటున్నారు. గంటలకు గంటలు దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శుక్రవారం ఉదయం చాలామంది రాజకీయ నాయకులు తమ ఇష్టదైవాల దేవాలయాలను సందర్శించి మరోవిడత ప్రత్యేక పూజలు చేయించారు. ఆకాశంలో దేవుడు కరుణించినా, ఓటరు దేవుడి కరుణ వుంటేనే ఎవరైనా గెలిచేది.. ఆ ఓటరు దేవుడు ఎవరిని కరుణించిందీ కొద్దిసేపట్లో తెలిసిపోతుంది.    

కాకినాడ ఈవీఎంల కేంద్రం వద్ద అర్ధరాత్రి కలకలం

      కాకినాడ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఉంచిన కౌంటింగ్ కేంద్రాల దగ్గర అపరిచిత వ్యక్తులు కొన్ని ఈవీఎంలను తీసుకుని కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఒక అపరిచిత వ్యక్తి గురువారం అర్ధరాత్రి ఒక కారులో కొన్ని ఈవీఎంలను తీసుకుని కౌటింగ్ కేంద్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు ఆ కారును అడ్డుకున్నారు. అసలు ఈవీఎంలు బయటి నుంచి లోపలకి వెళ్ళడం ఏమిటని ప్రశ్నిచారు. అందుకు కారులో వున్న వ్యక్తి ఈవీఎంలను టెస్టింగ్ కోసం తీసుకొస్తున్నామని చెప్పాడు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎవరూ స్పందించలేదు. పోలీసులు ఆ వ్యక్తితో పాటు అతను తెచ్చిన ఈవీఎంలను, కారును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.