జనం మొగ్గు ఎటో తేలిపోయింది! .. చంద్రబాబు చుట్టూ ఐఏఎస్, ఐపీఎస్ ల ప్రదక్షిణలు

జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుంది వంటి ప్రశ్నలకు సాధారణంగా ఎవరైనా సర్వేల మీద ఆధారపడతారు. అయితే జనం మూడ్ ఏమిటన్నది తెలుసుకోవడానికి వారికి సర్వేలు అక్కర్లేదు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయం వారు  అందరి కంటే ముందే పసిగట్టేయగలరు. వాళ్లే ఐఏఎస్ అధికారులు. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే.. బాబూస్.  అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పడానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల అధికారుల విధేయత స్థాయిని బట్టి ఇట్టే చెప్పేయ వచ్చు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల తీరు గమనిస్తే రాబోయే ప్రభుత్వం ఎవరిదన్నది ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు సాధ్యమైనంతగా ప్రభుత్వానికి దూరం జరుగుతున్నారు. ఇంత కాలం చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా ప్రభుత్వం ఇంత చెప్తే అంత చేసి విపక్షాన్ని చీకాకు పెట్టేందుకు మాత్రమే తమ అధికారాన్ని వాడిన అధికారులంతా.. ఇప్పుడు విపక్ష నేత కరుణాక్ష వీక్షణాల కోసం పడిగాపులు కాస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాలుగేళ్లుగా జగన్ కరుణాకటాక్షాల కోసం పరిధి దాటి మరీ పనులు చేసిన కొందరు అధికారులు ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తే చాలు.. గప్ చిప్ గా తెలంగాణ రాజధానికి చేరుకుంటున్నారు. రహస్యంగా ఆయనతో భేటీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో తాము వ్యవహరించిన తీరుకు క్షమాపణలకు కోరుకోవడమే కాదు.. అలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ ఇస్తున్నారు. జగన్ సర్కార్ ఒత్తిడితోనే తాము  తెలుగుదేవం పార్టీకి వ్యతిరేకంగా చేయాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు.   బరితెగించి మరీ ఇంత కాలం జగన్ కు భజన చేసిన అధికారులే ఇప్పడు బాబు ప్రాపకం కోసం కాళ్లా వేళ్లా పడుతున్నారు. ఈ తీరే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది.  చంద్ర‌బాబు రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు స‌క్సెస్ కావ‌డం, అదే సమయంలో సీఎం జగన్ సహా, వైసీపీ చేపట్టిన కార్యక్రమాలపై జనం విముఖత చూపుతుండటం.. జగన్ సభలకే జనం కరవౌవుతున్న పరిస్థితి, గడపగడపకు లో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజా నిరసన ఎదురు అవుతుండటంతో  అధికారులకు విషయం అర్ధమైపోయింది.   బాబు-ప‌వ‌న్ భేటీతో జగన్ కు మరో చాన్స్ అసాధ్యం అన్న స్పష్టత వచ్చేసింది. దీంతో వచ్చేది తెలుగుదేశం సర్కారేనని నిర్ధారించుకున్న అధికారులు ప్లేట్ ఫిరాయించేందుకు రెడీ అవుతున్నారు. నిబంధనల మేరకు నడుచుకున్న అధికారులు యథావిథిగా తమ ఉద్యోగ ధర్మం తాము నిర్వర్తిస్తుంటే.. పరిధి దాటి ఎక్స్ ట్రాలు చేసిన వారు మాత్రం ఇప్పడు గాబరా పడుతున్నారు. వచ్చే ప్రభుత్వం తమపై చర్యలు తీసుకోవడం ఖాయమని భయపడుతున్నారు. అందుకే ముందుగానే తమ ఎక్స్ ట్రాలకు కారణాలను చంద్రబాబుకు వివరణ ఇచ్చుకుని కొంచెం సేఫ్ అవుదామని తాపత్రేయ పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు హైద‌రాబాద్లో చంద్ర‌బాబుని ర‌హ‌స్యంగా కలిశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్ర‌భుత్వ  ఆదేశాల‌తో తాము అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డంలేద‌ని చంద్రబాబు ముందు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారని అంటున్నారు.   తెలుగుదేశం ప్ర‌భుత్వంలో తాము నిర్వర్తించిన విధులు, తమ ప్రతిభను  గుర్తు చేస్తూ  గత నాలుగేళ్లుగా తమ పనితీరు అధ్వానంగా ఉండటానికి కారణం జగన్ సర్కార్ అసమర్థతా, అనుచిత ఒత్తిడే కారణమని వివరణ ఇచ్చుకుంటున్నారు.   అలాగే తెలుగుదేశం పార్టీలోనే  కొనసాగుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొహం చాటేసిన సీనియర్ నేతలు కూడా ఇప్పుడు మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు అడుగులు కదుపుతున్నారు.   అవకాశం దొరికితే చంద్రబాబును కలిసి తాము ఇంత కాలం ఒకింత సైలెన్స్ మెయిన్ టైన్ చేయడానికి కారణాలను చెప్పుకుని మళ్లీ పార్టీలో పూర్వపు స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించేశారు. వీలైతే చంద్రబాబును, కుదరకపోతే లోకేష్ ను కలిసి  తాము ఇక‌పై యాక్టివ్ గా ఉంటామ‌ని న‌మ్మ‌బ‌లుకుతున్నారు. ఇప్పడు నారా లోకేష్ పాదయాత్ర వారికి తమ పలుకుబడిని ప్రదర్వించేందుకు ఒక అవకాశంగా లభించిదని భావిస్తున్నారు. అలాగే వివిధ కారణాల వల్ల  పార్టీ మారిన వారు మళ్లీ తెలుగుదేశం గూటికి చేరేందుకు తమదైన శైలిలో, స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించేశారు.  

చిలుకా చిలుకా పలుకవా?

చిలుకా చిలుకా పలుకవా? అంటూ ఓ పాట ఉంది. బీహార్ పోలీసులు ఓ చిలుకను బంధించి  అదే పాట పాడుతున్నారు. ఆ చిలుక చేత మాట్లాడించి.. ఆ చిలుక పలుకుల ద్వారా మద్యం మాఫియా గుట్టు బయటపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఔను నిజమే లిక్కర్ మాఫియా కేసులో పోలీసులు ఓ రామచిలుకను అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ ఆ రామచిలుకను ఎందుకు అరెస్టు చేశారంటే అది నిందితుల పెంపుడు చిలుకట. ఆ చిలుకను విచారించి మద్యం మాఫియా కేసును ఛేదిస్తామంటున్నారు. బీహార్ లోని గురువా పోలీసులు ఈ వింత విచారణ చేస్తున్నారు. మద్యం దందాపై విషయంలో వారు ఓ ఇంటిపై దాడి చేశారు. అయితే పోలీసుల దాడి గురించి ముందే తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. దీంతో ఆ ఇంట్లో పోలీసులకు వారి పెంపుడు చిలుక మాత్రమే దొరికింది. దీంతో పోలీసులు దానిని అదుపులోనికి తీసుకున్నారు. ఇంతకీ విశేషమేమిటంటే అది మాట్లాడుతుంది. పోలీసులు ఏ మడిగినా కటోరే.. కటోరే అంటూ బదులిస్తోంది. ఇంకా విచారిస్తే.. నిందితులకు సంబంధించి బోలెడు వివరాలు రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు రామచిలుకను బంధించి విచారణ పేరున సాగిస్తున్న ప్రహసనంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  గతంలో జానపద కథల్లో విన్నాం రాక్షసుడి ప్రాణం రామచిలుకలో ఉంది.. ఆ రామ చిలుక చెట్టు తొర్రలో ఉంది అని.. ఇప్పుడు మాత్రం నిందితుల గుట్టుముట్లన్నీ రామచిలుక నోట్లో ఉన్నాయి. ఆ రామచిలుక పోలీసు స్టేషన్ లో ఉంది అంటున్నారు. .

సర్కార్ వారి జీవోలకు అర్థాలే వేరులే!

అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య ఒక చక్కని సత్యాని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసే జీవోలన్నీ అమలవుతాయని ఎవరికైనా ఓ చెడ్డ,  దురాభిప్రాయం ఏదైనా ఉంటే, ఆ అభిప్రాయాన్ని వెంటనే తుడిచేసుకోండని నిండు సభలో గొంతెత్తి మరీ చెప్పారు. జీవోలన్నీ జీవోలు కాదు, అందులో కొన్ని ఉత్తుత్తి జీవోలుంటాయని రోశయ్య సర్కార్ వారి సీక్రెట్   ఓపెన్ చేశారు. నిజమే  సమయ సందర్భాలను బట్టీ రాజకీయ అవసరాలను బట్టీ, ప్రభుత్వం జీవోలు జారీచేయడం ఎప్పటినుంచో ఉన్నదే.. అయితే, అన్ని జీవోలను అలా తీసి పక్కన పెట్టే పరిస్థితి ఉండదు.  కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఉత్తుత్తి జీవోలే  కాదు, రాజ్యాంగ విరుద్ధమైన జీవోలు కూడా వచ్చి పోతున్నాయి. అవును  జగన్ రెడ్డి విచిత్ర సర్కార్ జారీ చేసే జీవోల్లో ఎన్ని పని చేస్తాయో.. ఎన్ని రాజ్యాంగ బద్దంగా ఉంటాయో.. చెప్పడం కష్టం. అనేక జీవోలను కోర్టు కొట్టి వేస్తే.. కొన్ని జీవోలను ప్రభుత్వం తనకు తానే రద్దు చేసుకుంటూ ఉంటుంది. మరోవంక మరికొన్ని జీవోలను పబ్లిక్ డొమైన్  లో లేకుండా  చీకటి కొట్లో దాచేస్తుంది.  తాజాగా జగన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు ఒకే రోజు కాలం చేశాయి..  అందులో ఒకటి ఫ్లెక్సీ బ్యాన్ విధిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు పక్కన పెట్టింది. అలాగే, రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఐదు శాతం పేదలకివ్వాలంటూ గతంలో ఇచ్చిన జీవోను ప్రభుత్వమే ఉపసంహరించుకుంది. అర్థాంతరంగా తనువు చాలించిన ఈ జంట జీవోలకు ఒక చిన్నపాటి చరిత్ర వుంది. ఎప్పుడో చాలా కాలం క్రితం  విశాఖ బీచ్‌లో ప్లాస్టిక్  వ్యర్ధాలను  ఏరివేసేందుకు ఓ స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముఖ్యాతిధిగా పాల్గొన్నారు. మైక్  ముందు నిలబడి తమదైన స్టైల్లో గంభీర ఉపన్యాసం చేశారు.  అదే ఊపులో ( గిట్టని వాళ్ళు పూనకం అంటారు)  ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంటుంది. అధికారులు ముందు వెనక చూసుకోకుండా ఫ్లెక్సీలను నిషేధిస్తూ జీవోను తెచ్చారు. దీంతో ఫ్లెక్స్ ల మీద ఆధారపడి బతుకుతున్న వ్యాపారులు తమ బతుకు తెరువు మీద బండరాయి పడిందని  ఆందోళనకు గురయ్యారు. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అదే రోజు నుంచే  బ్యాన్ అమల్లోకి వస్తుందన్నారు కానీ ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. చివరికి ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తుందన్నారు.  కానీ కొంత మంది కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు ఆ జీవో చెల్లదని.. సింగిల్ యూజ్ ఫ్లెక్సీలు ఉంటే.. వాటిపైనే నిషేధం అమలవుతుందని స్పష్టం చేసింది. అసలు ఫ్లెక్సీలు ప్లాస్టిక్ కాదని.. సింగిల్ యూజ్ కానే కాదని వ్యాపారులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. అయినా. జగన్ రెడ్డి ప్రభుత్వం (బహుశా సహజసిద్ద దురహకారంతో కావచ్చును) నథింగ్ డూయింగ్  ముఖ్యమంత్రి మాట తప్పరు మడమ తిప్పరు అని మొండి కేసింది. ఇక చేసేది  లేక వ్యాపారాలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు జీవో చెల్లదని తీర్పు ఇవ్వడంతో పాటుగా, సర్కార్ నెత్తిన నాలుగు అక్షింతలు కూడా వేసింది. అలాగే  ఏపీలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే 5 శాతం జగనన్న కాలనీలకు చందా ఇచ్చుకోవాల‌ని గతంలో జీవో ఇచ్చారు. స్థలం రూపంలో అయినా లేదా డబ్బు రూపంలో నా అన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇష్టం అని జీవోలో పేర్కొన్నారు. అంటే ప్ర‌తి వెంచ‌ర్ లో 10 శాతం సామాజిక అవ‌స‌రాల కోసం కేటాయిస్తున్న దానికి అద‌నంగా మ‌రో 5 శాతం స్థ‌లం వ‌ద‌లాల్సి ఉంది. అయితే ఇది చట్ట విరద్ధమని.. చాలా మంది కోర్టు కెళ్లారు. చివరికి జగన్ రెడ్డి ప్రభుత్వం స్వహస్తాలతో సదరు జీవోను వెనక్కి తీసుకుంది. అఫ్కోర్స్ జీవో అమలు కాలేదు కానీ, కావాల్సిన వారికి కావలసిన మేళ్ళు జరిగాయని అంటారనుకోండి అది వేరే విషయం. ఉత్తుతి జీవోనే అయినా ఉత్తినే వెనక్కి తీసుకోలేదని చాలా మంది చేతులు తడిపిన తర్వాతనే జీవో వెనక్కి వెళ్లిందని అనేవాళ్ళు ఉన్నారు. అయినా డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని  వాళ్ళకు మాత్రం తెలియదా ఏంటి?   నిజానికి, ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలకు  అనుగుణంగా తెచ్చిన జీవోలేన్ని? అడ్డదారిన పట్టుకొచ్చిన జీవో లెన్ని? అందులో బతికిన వెన్ని? ఉన్నవెన్నిఅని లెక్కతీస్తే, పక్కాగా మాలిన జీవోలు ఓ పుంజీడు అయినా ఉంటాయో లేదో అనుమానమే అంటున్నారు అధికారులు. అందుకే జగన్ రెడ్డి ప్రభుత్వం జీవోలకు ముసుగులు వేస్తుంది. సీక్రెట్ గా ఉంచుతుందని అంటున్నారు. నిజానికి  అస్మదీయులకు మేళ్ళు చేసేందుకు సీక్రెట్ గా తెచ్చిన జీవోలను జగన్ రెడ్డి ప్రభుత్వం సీక్రెట్ గానే ఉంచుతోందని అంటున్నారు. అందులో కొన్ని జీవోలు వెలుగు చూస్తే, ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులు, చిన్నా పెద్ద కాంట్రాక్టులు ఇలా ఒకటని కాదు, సర్కార్ వారి అవినీతికి అద్దం పట్టే అనేక జ్వోలు వెలుగు చూస్తాయని అంటునారు. అయితే అది ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మాత్రం జరగదు గాక జరగదని అంటున్నారు .

ఇరకాటంలో ఈటల రేవంత్ మాటల మరమ్మేంటి?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో  బీజేపీలో చేరిన ఈటల నిరాశకు గురయ్యారని, ముఖ్యంగా బీజేపీలోనూ కోవర్టులున్నారనే విషయం అర్థమై ఆయన లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవలసినపరిస్థితి వచ్చిందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చల్లో ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి. నిజానికి  కేసీఆర్ కోవర్టులు అన్నిపార్టీలలో ఉన్నారు. అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ లో కొంచెం చాలా ఎక్కువగానే ఉన్నారు. ఆ విషయాన్నీ స్వయంగా రేవంత్ రెడ్డి లేదా అద్దంకి  దయాకర్ వంటి అయన అనుచరులు బహిరంగంగా, పేర్లతో సహా బయట పెడుతూనే ఉన్నారు. నిజానికి, కోవర్టుల చర్చతోనే కాంగ్రెస్ పార్టీలో రచ్చ మొదలైంది. సీనియర్  జూనియర్ వివాదం పురుడు పోసుకుంది. అధిష్టానం జోక్యం చేసుకున్నా చల్లారని స్థాయిలో కోవర్టు మంటలు గాంధీ భవన్ లో ఎగిసి పడుతున్నాయి. అయినా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చల్లో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.    ముఖ్యంగా బీజేపీలో నాయకులు, శ్రేణుల్లో అయితే ఈ చర్చ మరింత జోరుగా సాగుతోంది. నిజమే, రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా బీజేపీ చేరిన నాయకులకు, ముఖ్యంగా రాజకీయాల్లో అనేక ఎత్తుపల్లాలు చూసి వచ్చిన ఈటల రాజేందర్ వంటి సీనియర్  నాయకులకు ఆశించిన స్థానం, గౌరవం దక్కడం చాలా కష్టమే. సో.. ఈటల గానీ, రేవంత్ రెడ్డి ప్రస్తావించిన మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్ వెంకట స్వామి వంటి వారు బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్నమాట వాస్తవం కావచ్చును. కానీ  వారికి మరో ప్రత్యామ్నాయం కూడా లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది కానీఅదే రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో  బీఆర్ఎస్  ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటే అనే పర్సెప్షన్ ప్రజల్లో నాటుకు పోయింది. అందువలన కేసేఆర్ వ్యతిరేకులకు మరోమార్గం లేకుండా పోయిందని అంటున్నారు. మరో వంక బీజేపీ ముఖ్య నేతలు మాత్రం  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మరో కోణంలో చూస్తున్నారు. రేవంత్ రెడ్డి  మాట తీరు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ కు అద్దం పడుతోందని  అంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ గుర్తించడమే లేదని బీజేపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తన పరిస్థితి ఏమిటో తనకే తెలియని అగమ్యగోచర స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన ఈటల మాటలకు వక్రభాష్యం చెపుతున్నారని అంటున్నారు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని మాత్రమే గుర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదని అంటున్నారు. అదలా ఉంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా అనేక విషయాలు ముచ్చటించిన రేవంత్ రెడీ, ఈటలతో పాటుగా, కేసీఆర్ ను  గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు.. ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరని, పేర్కొన్నారు.  బీజేపీ కేసీఆర్ ఒక్కటే అన్న విషయం ఈటల రాజేందర్ మాట్లల్లో స్పష్టమైంది కాబట్టి ప్రజలు దీనిపై ఆలోచించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  ఈటల రాజేందర్, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటివారు బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరు. కేవలం కేసీఆర్ ను మాత్రమే వ్యతిరేకిస్తారు. బీజేపీ ఐడీయాలజీతో ఆ ముగ్గురికి సంబంధం లేదు. బీజేపీలో కూడా కోవర్ట్ లు ఉన్నారని ఈటల అన్నారంటే ఏదో అసంతృప్తి ఉన్నట్లే కదా? ఈటల ముందుకు రాలేక  వెనక్కి పోలేని స్థితిలో ఉన్నారని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పరిస్థితి అంతకంటే గొప్పగా ఏమీ లేదనీ అందుకే సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న రేవంత్ రెడ్డి, బీజేపీలోని ఈటల, వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి సీనియర్ నాయకులకు ఒక నిగూఢ సందేశం ఇచ్చారని కొందరు అంటున్నారు. ఏమైనా, ఓ వంక ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య గణతంత్ర వివాదం పతాక స్థాయికి  చేరిన నేపధ్యంలో రేవంత్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగానే మరో చర్చకు ఆస్కారం కల్పించారని అంటున్నారు.

గణతంత్ర వేడుకలు వేదికగా గవర్నర్ వర్సెస్ సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ల మధ్య గత మూడేళ్ళుగా సాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. గణతంత్ర దినోత్సవం వేడుకల విషయంలో తలెత్తిన వివాదం కోర్టు తలుపులు తట్టింది. గణతంత్ర వేడుకలను కేంద్ర ప్రభుత్వం సూచించిన పద్దతిలో నిర్వహించాలని రాష్ట్ర  హై కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. పెరేడ్ గ్రౌండ్ లో ప్రజల సమక్షంలో ఘనంగా జరగవలసిన ఘణతంత్ర వేడుకలను రాజ్ భవన్  కే పరిమితం చేసింది. నిజానికి, జాతీయ రాజకీయాలపై కన్నేసిన కేసేఆర్  అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు, గవర్నర్ పై ఉన్న విభేదాల కారణంగా గణతంత్ర దినోత్సవానికి ప్రజలను దూరం చేశారు.  రాజకీయాలకు అతీతంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు, ముఖ్యమంత్రి కేసీఆర్  భారత రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని అవమానించిన తీరు పట్ల తీవ్ర అభ్యతరం తెలియచేస్తున్నారు. రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రి  దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.   మరోవంక  గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు . గవర్నర్ రాజ్యాంగ పదవిలో ఉంటూ ఓ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని మంత్రులు, అధికార బీఆర్ఎస్ ముఖ్య నేతలు భగ్గుమంటు న్నారు. ముఖ్యంగా, ఆమె చేసిన  ఫామ్ హౌస్  వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల్లో కాక రేపుతున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్  లో స్పందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కన్నా, దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని తెలిపారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతుందన్నారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజున  సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.  అలాగే  తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరోక్షంగా గవర్నర్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. గత ఎనిమిది సంవత్సరాల్లో రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు, వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని అయినా  కొందరికి తెలంగాణ రాష్ట్రంలో  జరుగుతున్న అభివృద్ధి, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కళ్లకు కనపడటం లేదని, వాళ్లందరూ కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు.  కాగా, గణతంత్ర వేడుకలపై ప్రభుత్వానికి నిబంధనలు తెలుసని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా మాట్లాడారన్నారు. గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాస్తామన్నారు. గవర్నర్ తమిళిసై విషయంలో రాష్ట్రపతి కల్పించుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  మరోవంక తెలంగాణ గవర్నర్ తమిళి సై మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య రిపబ్లిక్ డే వేడుకలు జరగకుండా చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చానన్నారు. ఖమ్మంలో  ఐదు లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని, ఆ సభకు లేని కరోనా నిబంధనలు గణతంత్ర వేడులకే గుర్తు వచ్చాయా? అని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి రాజ్‌భవనంపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడంలేదని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. దీంతో మరోమారు, గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం ఢిల్లీ కోర్టుకు చేరింది. బంతి ఇప్పడు కేంద్రం కోర్టులో వుంది. కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది? కోర్టు అంతిమ తీర్పు ఏమిస్తుంది? రాజ్యాంగానికి, త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని దృష్టిలో ఉంచుకుని, కొందరు సోషల్ మీడియాలో సూచిస్తున్న విధంగా  సుప్రీం కోర్టు  సుమోటోగా జోక్యం చేసుకుంటుందా? కేసేఅర్ ప్రభుత్వాన్ని వివరణ కోరుతుందా? రాజకీయంగా, ముఖ్యంగా జాతీయ రాజకీయ పరమపద సోపాన పటానికి నిచ్చెనలు వేస్తున్న బీఆర్ఎస్  అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్  రాజకీయ ప్రస్థానంపై  ఎలాంటి ప్రభావం చూపుతుంది.. చూడవలసి వుంది.

ఎంపీ అవినాశ్ అజ్ణాతంలోకి?!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. అజ్ణాతంలోకి పారిపోయేందుకు పక్కాగా ప్లాన్ చేసుకున్నారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఆ ప్లాన్ తోనే  ఆయన..  సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులకు  అయిదు రోజుల బిజీ షెడ్యూల్ ఉంది.. ఆ తర్వాత  హాజరవుతానంటూ ..  సమాచారం ఇచ్చారని అంటున్నారు?  అయితే  ఈ విషయాన్ని ముందుగానే  పసిగట్టిన సీబీఐ.. అప్రమత్తమై.. ఆగమేఘాల మీద కోర్టును ఆశ్రయించి.. వైఎస్ ఆవినాష్ రెడ్డి అరెస్ట్‌కు వారెంట్ తీసుకుని   అరెస్ట్ చేసి... హైదరాబాద్‌కు తీసుకు వచ్చి... విచారించేందుకు సీబీఐ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అంటున్నారు. ఈ విచారణలో భాగంగానే వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.   2019 మార్చిలో మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే   వివేకా గుండెపోటుతో మరణించారంటూ వైసీపీ  కీలక  నేత విజయసాయిరెడ్డి తొలుత మీడియా సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత వైయస్ వివేకానందరెడ్డిని గోడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపారంటూ  పోలీసులు కేసు నమోదు చేశారు.  వివేకా హత్య కేసులో.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో తన తండ్రి  వివేకా హత్య కేసులోని పాత్రదారులు, సూత్రధారులు ఎవరో తేల్చాలంటూ.. ఆయన కుమార్తె  సునీత.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించింది. ఆ క్రమంలో సీబీఐ విచారణలో వివేకా మాజీ కార్ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. వైఎస్ అవినాష్, ఆయన తండ్రి    భాస్కరరెడ్డితోపాటు పలువురు పేర్లను  వెల్లడించారు.  ఆ తర్వాత  వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై కేసులు పెట్టేందుకు పలువురు వ్యక్తులు రంగంలోకి దిగడం.. అలాగే  వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె  సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డిల ప్రమేయం ఉందంటూ పలువురు ఆరోపణలు గుప్పించడం.. వంటి ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. అలాగే ఈ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు సైతం  బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో సీబీఐ దర్యాప్తు  వేగం నెమ్మదించింది.   ఈ నేపథ్యంలో తన తండ్రి హత్య కేసు విచారణ.. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ..  సునీత.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  దీంతో ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి సుప్రీం కోర్టు బదిలీ చేసింది.   ఈ నేపథ్యంలో   వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఈ విషయాన్ని గమనించిన   అవినాశ్ .. విదేశాలకు చెక్కేసేందుకు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.  ఓ వేళ.. అతడిని అరెస్ట్ చేయకున్నా... అతడి పాస్‌పోర్ట్‌ను   సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేసే అవకాశం ఉందని చర్చ సైతం కడప జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా అవినాష్ విజ్ణప్తి మేరకు సీబీఐ విచారణకు మరో తేదీని నిర్ణయించింది. ఈ నెల 28న అంటే  శనివారం విచారణకు రావాలంటూ రెండో సారి నోటీసులు జారీ చేసింది. సీబీఐ దూకుడు చూస్తుంటే అవినాష్ అరెస్టు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణ తప్పించుకునేందుకు ఆయన అజ్ణాతంలోకి వెళతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఆయన విదేశాలకు వెళ్లిపోయే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. ఏది ఏమైనా వివేకా హత్య కేసులో అవినాష్ చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుందని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ లో కొత్త కోణం ..గమనించారా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆ వ్యాఖ్య చేసిన సమయ, సందర్భాలు వేరు కావచ్చును. కానీ, ఎవరైనా వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని అయన చేసిన వ్యాఖ్యలు, ఇక దేహి అంటే కుదరదని ఎస్సీ, ఎస్టీ లకు చేసిన హిత బోధ, అదే విధంగా వ్యక్తి ఆరాధన గురిచి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయనలో ఎక్కడో అక్కడ రగులుతున్న రాజకీయ ఆకాంక్షలకు అద్దం పడుతున్నట్లు ఉన్నాయి.  నిజానికి, నిన్నమొన్న జరిగిన జనసేన తెలంగాణ కార్యకర్తలు, కార్య నిర్వాహకుల సభలోనే, పవన్ కళ్యాణ్  కొత్త ఆలోచనలకు ముసుగు తీశారు. పొత్తుల విషయంలో స్పష్టత ఇస్తూనే, రాజకీయ కొత్త కోణాన్ని అవిష్కరించారు. ఎక్కడా ఎక్కాలో  కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలనే నానుడి తిరగేసి, ఎక్కడ తగ్గాలోనే కాదు, ఎక్కడ ఎక్కాలో కూడా తెలియాలనే అర్థం వచ్చే విధంగా మాటల గారడీ చేశారు. పొత్తుల విషయంలో ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంత దూరం అనే సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా ఏపీలో బీజేపీ పొత్తు వుంది, ఉంటుంది అంటూనే, అవసరం అయితే కొత్త పొత్తులు ఉంటాయని అన్నారు.   ఇక ప్రస్తుతానికి వస్తే,   బుధవారం(జనవరి 25) మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో.. అంతే ప్రమాదకరమన్నారు. అలాగే, ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారని.. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని పేర్కొన్నారు.సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాదు.. సమగ్రంగా చూడాలని అన్నారు. జనాభాకు తగ్గట్టు బడ్జెట్‌లో కేటాయింపులు జరగాలని అభిప్రాయపడ్డారు. మన కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు దాదాపు 22 శాతం జనాభా ఉన్నా.. నిధులు ఇవ్వాలని ఇంకా కోరాలా అని ప్రశ్నించారు. ఇకపై దేహి అంటే కుదరదని.. పోరాటాలు చేసి తీసుకోవాలన్నారు.  నిజమే పవన్ కళ్యాణ్ ఎస్సీ,ఎస్టీలను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అనుకోవచ్చును కానీ, అందులో రాజకీయ ధ్వనులున్నాయని, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు సంబంధించి పవన్ కళ్యాణ్, బయటి శత్రువుల కన్నా మనతోటి ఉండే శత్రువులనే ముందుగా కనిపెట్టాలని.. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు, నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండేవాడే నాయకుడు అంటూ అయన చేసిన ముక్తాయింపు, పవన్ కళ్యాణ్ లో కొత్త కోణాన్ని అవిష్కరించాయని అంటున్నారు.  కాగా.. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మరోమారు, వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్ట్టీలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో రూ. 20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలని ప్రశ్నించారు. ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా ఆచరణలో పెట్టాలి కదా అని నిలదీశారు. ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లు ఖర్చు చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికి రాకుండా దారి మళ్లించి మోసం చేస్తారా అని పవన్‌ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవును, పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల్లో నిజం వుంది. అలాగే, ఆయన చేసిన వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ధ్వనించిన రాజకీయ వ్యాఖ్యానం... పవన్  కళ్యాణ్ లో మరో కోణాన్ని అవిష్కరించిందని, సినిమా భాషలో చెప్పాలంటే, మరో  నటుడిని రాజకీయ తెరకు పరిచయం చేసిందని అంటున్నారు.

లోకేష్ విజయోస్తు .. ధర్మ యుద్ధానికి శ్రీకారం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ‘యువగళం’ పేరిట చేపట్టే పాదయాత్ర  శుక్రవారం (జనవరి 27) కుప్పం నుంచి ప్రారంభమవుతోంది. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు, వందో ..రెండొందల కిలోమీటర్లో కాదు. ఏకంగా  4 వేల కిలోమీటర్లు,400 రోజులు..అంటే 15 నెలలకు పైగా సాగే సుదీర్ఘ పాద యాత్రకు, టీడీపీ యువనేత శ్రీకారం చుడుతున్నారు.  సరే, ఆయన ఇంత  కఠిన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అధికారం కోసమా? అంటే, కాదనలేము. కానీ, అది పాక్షిక సత్యం మాత్రమే. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు పట్టభిషిక్తుదయ్యాడు, కానీ, రావణ సంహారం జరిగింది మాత్రం రామచంద్రుని పట్టాభిషేకం కోసం కాదు, రాక్షస పాలన అంతమొందించేందుకే వానర సేన సాయంతో శ్రీరాముడు రావణ సంహారం కావించారు. ఇక ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు ప్రత్యేకించి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. రావణాసురుడు మాయలేడి వేషంలో సీతమ్మోరిని అపహరిస్తే, ఈనాటి  రావణుడు ‘ఒక్క ఛాన్స్’తో  ‘చీట్’చేసి  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. అందుకే రావణ పాలనని అంతమొందించేందుకే లోకేష్, ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారని అనుకోవచ్చు.  ఇక లోకేష్ పాదయాత్ర ఏ విధంగా జరుగుతుంది, ఆయన యాత్ర పొడుగునా ఎన్నెని అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుంది, అనేది ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకు జీవో నంబర్1 తెచ్చింది. పాదయాత్రకు అనుమతి నిరాకరించింది. అయినా, కోర్టు అనుమతితో లోకేష్ ముందడుగు వేస్తునారు. లోకేష్ పాదయాత్ర తొలి అడుగు పడక ముందే జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంతలా ఉలిక్కిపడుతోంది.. అవరోధాలు సృష్టిస్తోంది, అంటే ముందు ముందు..అడుగడుగునా ఇంకెన్ని అవరోధాలు సృష్టిస్త్గుందో వేరే చెప్ప నక్కరలేదు. అయినా... పులి కడుపున పుట్టిన పులి బిడ్డ లోకేష్ ..మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. అవును, లోకేష్’కు తన ముందుంది సీదాసాదా మార్గం కాదని తెలుసు.నిజానికి, ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు, గత  మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన చూసి,అనుభవిస్తున్న అందరికీ, లోకేష్ ముందున్నది, ‘కంటకాకీర్ణ’ మార్గమనే విషయం అర్థమవుతూనే వుంది.  అయినా, ఆనాడు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తాత నందమూరి తారక రామా రావు, తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తండ్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన చైతన్య యాత్రల స్పూర్తితో .. ‘యువగళం’ పాదయాత్రకు లోకేష్  శ్రీకారం చుడుతున్నారు. విజయ శంఖారావం పూరిస్తున్నారు. తెలుగు ప్రజల దీవెనలతో విజయుడై తిరిగొస్తారు.   లోకేష్ విజయయాత్ర పై ఎవరికీ ఎలాంటి అనుమనాలు లేవు. ధర్మో రక్షిత రక్షితః .. ధర్మకోసం చేసే ధర్మ పోరాటం ఆదిలో అవరోధాలు ఎదుర్కున్నా అంతిమ విజయం సాధించి తీరుతుంది.  అయినా, అడుగడునా కష్టాలు తప్పవని తెలిసీ కన్నకొడుకును యుద్ద భూమికి పంపడం ఏ తల్లికైనా ఎంత కష్టమో, ఏ తండ్రికైనా ఇంకెంత బాధాకరమో వేరే చెప్పనకరలేదు. అందునా పాదయాత్ర కష్ట సుఖాలు స్వయంగా అనుభవించిన చంద్రబాబు నాయుడికి, ఆయన కష్టాలు చూసి మానసిక వ్యధను అనుభవించిన లోకేష్  మాతృ మూర్తి భువనేశ్వరికి కన్న కొడుకును పాదయాత్రకు ఆశ్వీదరించి సాగనంపడం ఎంతగా బాధించి ఉంటుందో వేరే చెప్పనక్కర లేదు. అయినా, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆ దుఃఖాన్ని దిగమింగుకుని, లోకేష్ ను ఆశ్వీదరించి అక్షింతలు వేసి సాగనంపారు, చంద్రబాబు దంపతులు. అలాగే, లోకేష్ శ్రీమతి బ్రాహ్మణి, నిండా పట్టుమని పదేళ్ళు అయినా లేని కుమారుడు దేవాన్ష్‌ను, కుటుంబాన్ని వదిలి  400 రోజులు   దూరంగా ఉండడం ఎంత కష్టమో. బ్రాహ్మణి, దేవాన్ష్’ కు అంతకు మించిన బాధ.అయినా కుటుంబ సభ్యులు అందరూ ... లోకేష్ కు వీడ్కోలు పలికిన సందర్భంలో  హైదరాబాద్’లోని ఆయన ఇంటిలో ఉద్విగ్న.. ఉద్వేగభరిత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడి వాతావరణం ఒక విధంగా గుండె గొంతుకలోన కొట్లాడుతోంది .. గీతాన్ని గుర్తుకు తెచ్చింది.  తొలుత లోకేశ్‌ తమ ఇంట్లోని పూజ గదిలో తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామికి కుటుంబంతో కలిసి పూజ చేశారు. అనంతరం తల్లిదండ్రులు భువనేశ్వరి, చంద్రబాబుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. భువనేశ్వరి ఆయన్ను గట్టిగా హత్తుకున్నారు. అత్తామామల పాదాలకూ లోకేశ్‌ మొక్కారు. భార్య బ్రాహ్మణి హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. కారు బయల్దేరే ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టారు. లోకేశ్‌ తన కొడుకు దేవాన్ష్‌ను గాఢంగా హత్తుకుని ముద్దు పెట్టారు. నిజానికి, ఈ దృశ్యాలు అయిన వారినే కాదు అందరిని కదిల్చి వేశాయి. ఒకే రీతిన ఉద్వేగానికి గురిచేశాయి. తెలుగు దేశం కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. జేజేలు పలికారు. పేదలు దీవెనలు అందించారు ...  ధర్మ రక్షణ కోసం కష్టాలను లెక్క చేయకుండా కదిలిన ‘యువ గళానికి ... ప్రజా దీవేనలే శ్రీరామ రక్ష.. లోకేష్ విజయోస్తు ..అంటున్నారు.

కుంగిపోతున్న జోషిమఠ్.. ఛార్ ధాం యాత్ర అనుమానమే!

చార్ ధాం యాత్రపై నీలి నీడలు ముసురుకున్నాయి. జోషిమఠ్ కుంగిపోతుండటంతో ఈ యాత్ర సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే చార్ ధాం యాత్రకు వెళ్లాలంటే జోషిమఠ్ దాటుకునే వెళ్లాలి. కానీ ఇక్కడి రోడ్లు, భవనాలు, హోటళ్లు ఇసుమంతైనా సురక్షితం కాదని నిపుణులు అంటున్నారు. అయినా అవి సురక్షితమా కావా అన్న విషయాన్ని అధికారికంగా నిపుణుల కమిటీ తేల్చాల్సి ఉంది. జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ కు వెళ్లే రహదారికి చీలికలు వచ్చాయి. బద్రీనాథ్ నేషనల్ హైవే కుంచించుకు పోతోంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి.  ఆ కారణంగా రోడ్ల భద్రత కరవైంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమకుండ్ సాహెబ్, బద్రీనాథ్ ధాం, గోవింద్ ఘాట్, మనా పాస్ కు వెళ్లాలంటే జోషిమఠ్ గుండానే  వెళ్లాలి. ఏటా ఏప్రిల్ నుంచి మే మధ్యకాలంలో జరిగే చార్ ధాం యాత్ర కోసం పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఈ రహదారి వెంట ప్రయాణిస్తుండటంతో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జాం  అవుతుంది.   ఇంత ట్రాఫిక్ ను   జోషిమఠ్ రహదారులు ఇప్పుడు తట్టుకోగలవా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.   బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రోడ్ల పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ, నివేదిక సిద్ధం చేస్తున్నారు. హేలంగ్-మర్వారీ బైపాస్ ద్వారా చార్ ధాం యాత్రకు వెళ్లే ప్రత్యామ్నాయ అవకాశం ఉన్నా ఈ టన్నెల్  నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఈ ఏడాది చార్ ధాం యాత్ర కు అనుమతి అన్నది అనుమానమేనని అంటున్నారు. 

కుక్క పిల్లకు బర్త్ సర్టిఫికేట్..

పెంపుడు కుక్కలను సొంత కుటుంబ సభ్యులుగా చూసే వారు కోకొల్లలు. తమ పెంపుడు శునకాలకు బర్త్ డే చేసే వాళ్లను చూశాం,పెళ్లిళ్లు, పేరంటాలూ ఘనంగా చేయడమూ తెలుసు, సీమంతం వేడుకలు నిర్వహించి మురిసిపోయిన వారినీ చూశాం. ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోయినప్పుడు దానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించి, తన ఇంటి ఆవరణలో దాని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏటా వర్థంతి నిర్వహించి ఊరంతటికీ భోజనాలు పెడుతున్న కుటుంబం గురించి కూడా విన్నాం. అయితే పెంపుడు కుక్కుకు పుట్టిన సంతానానికి బర్త్ సర్టిఫికెట్ చేయించి.. తమ కుటుంబంలోకి మరో జీవి వచ్చిందంటూ సంబరాలు చేసుకున్న వ్యక్తి ఉదంతం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి వాడు అన్న సంగతి తెలియకపోయినా.. సదరు వ్యక్తి వ్యక్తి తన పెంపుడు శునకానికి పుట్టిన కుక్క  బర్త్ సర్టిఫికెట్ పై ఆ కుక్క చేత వేలి (కాలి) ముద్ర కూడా వేయించాడు.  ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలూ అంతర్జాలంలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. మనుషుల మధ్య అనుబంధాలు కరవైపోతున్న రోజులలో.. వయస్సు మళ్లిన తల్లిదండ్రులకు ఓల్ ఏజ్ హోంలే బెటర్ అంటున్న తనయులున్న నేటి సమాజంలో.. పెంపుడు కుక్కను కూడా సొంత కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకుంటూ.. ఆ కుక్కకు పుట్టిన పిల్లను కుటుంబంలోకి వచ్చిన మరో సభ్యునిగా భావించి సంబరాలు చేసుకోవడమే కాకుండా.. బర్త్ సర్టిఫికేట్ చేయించి  ఆ బుల్లి జీవిని కుటుంబంలో ఒకటిగా ప్రకటించిన వ్యక్తిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జంతు ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. 

రాజకీయ రోహిణి కార్తె ముందుగానే వచ్చేసింది...?

శివరాత్రి (ఫిబ్రవరి 18) వచ్చేస్తోంది. శివ శివా అంటూ చలి వెళ్లిపోతుంది. ఇక అక్కడి నుంచి హీట్ పెరిగిపోతుంది. అదే సమయంలో (ఫిబ్రవరి 17) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పుట్టిన రోజు.. అదే రోజున నూతన సచివాలయం ప్రారంభోత్సవం. ఇక అక్కడి నుంచి రాష్ట్రంలో మండే ఎండలకు పోటీగా పొలిటికల్ హీట్  పరుగులు తీస్తుందని అందుకు సంబంధించి సంకేతాలు స్పష్టమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  ముఖ్యమంత్రి కేసేఆర్  ఆరు నూరయినా, నూరు ఆరైనా.. మూడవ సారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని గట్టి  పట్టుమీదున్నారు. మరో వంక కేంద్రంలో హ్యాట్రిక్  కోసం ఆరాట పడుతున్న కమల దళం బీజేపీ, రాష్ట్రంలోనూ అధికారాన్ని అందుకునేందుకు అంతే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కేసేఆర్ రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధిస్తే, కేంద్రంలో ముచ్చటగా మూడవసారి ప్రధాని పీఠం కోసం నరేంద్ర మోడీ సాగిస్తున్న,హ్యాట్రిక్   యాగానికి బ్రేకులు పడే అవకాశం లేకపోలేదు. అందుకే, కేసేఆర్ అడుగులు జాతీయ రాజకీయాల వైపు పడకుండా అడ్డుకునేందుకు బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా వ్యుహాలు రచిస్తున్నారు. ఇటు మోడీ షా  అటు కేసీఆర్ ఎవరికి వారు వ్యూహ.. ప్రతి వ్యూహాలు రచిస్తూ పొలిటికల్ హీట్‌ను పీక్స్ కు తీసుకుపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు.  నిజానికి రాష్ట్రంలో ఇప్పటికే  పొలిటికల్ హీట్ సాధారణ ఉష్ణోగ్రతలను దాటేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగంగా కేంద్రంపై ప్రకటించిన యుద్ధం పతాక స్థాయికి చేరింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి  రాష్ట్రంలో ఉనికి లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, గణతంత్ర దినోత్సవాన్ని కూడా రాజకీయ రొంపిలోకి లాగారు. రాజ్యాంగ వ్యవస్థల(గవర్నర్)తోనూ విభేదాలను పెంచుకున్నారు.ఈ విభేదాల కారణంగా, గణతంత్ర దినోత్సవం సైతం రాజకీయ రణతంత్రంగా మారింది. చివరకు గణతంత్ర వేడుకల విషయంలోనూ రాష్ట్ర హై కోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. రాజకీయ విభేదాలు రాజ్యాంగ విధులకు అవరోధంగా మారే పరిస్థితి వచ్చిందంటే, రాజకీయ ఉష్ణోగ్రతలు ఏ స్థాయికి చేరుకున్నాయో వేరే చెప్పనక్కర లేదు.  ఈ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీతో పోరు విషయంలో ఇక చావో రేవో తేల్చుకునేదుకు సిద్డమయ్యారనే విషయం స్పష్టమైంది. అందుకే  ఆయన నిండా మునిగినోనికి చలేంటి అన్న రీతిలో  పొలిటికల్ హీట్‌ను మరింత రాజేస్తున్నారు. ఫిబ్రవరిలో కొత్త సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించిన తర్వాత ఏ క్షణమైనా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల దిశగా అడుగులు వేసే అవకాశాలను ఒక వైపు పరిశీలిస్తూనే.. ఇంకోవైపు బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు కేసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే తన ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు వరుసగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను, బీజేపీ హిందుత్వ రాజకీయాలను, రాహుల్ గాంధీకి దీటుగా ఎండగడుతున్నారు. తగ్గేదే లే అంటూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.  ఇదలా ఉంటే, ఫిబ్రవరిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఎన్నికల’ బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రతువు ముగిసిన వెంటనే  కేసీఆర్ బీఆర్ఎస్  విస్తరణ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి 17వ తేదీన కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించిన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టినట్లు సమాచారం. అంతకు మందే ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ కార్యక్రమాన్ని రాజకీయంగా కూడా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభ నిర్వహణకు ప్లాన్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సభ నిర్వహణకు కమల నాధులు పూనుకున్నారు. ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన తరహాలో, అన్ని జిల్లా కేంద్రాలలో భారీ బహిరణ సభలకు భారాస సిద్డంవుతున్నట్లు తెలుస్తోని. అందుకు కౌంటర్ గా  బీజేపీ దండు కూడా తెలంగాణ దండయాత్రకు సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ఫిబ్రవరిలోనే పొలిటికల్ హీట్ పీక్ కు చేరుతుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

జగన్ ఓటమి ఒక్కటే మార్గం!

ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు, విశ్లేషషణలు చేస్తున్న, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతవరకు, రాజధాని సమస్య పరిష్కాం కాదని, రాజధాని లేని రాష్ట్రం అనే తలవంపులు పోవాలంటే, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి, జగన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఒక్కటే మార్గమని కుండ బద్దలు కొట్టారు. అమరావతికి చెందిన కొందరు రైతులు కడపలో డీఎల్ ను కలిసారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీం కోర్టులోనూ జగన్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురైనా, ఆయన అమరావతిని రాజధానిగా అంగీకరింఛక పోవచ్చని డీఎల్ చెప్పారు. నిజానికి   అమరావతి అభివృద్ధికి జగన్ రెడ్డి  చేయగలిగింది కూడా ఏమీ లేదని, రాష్ట్ర ఖజానా నిండుకున్న నేపధ్యంలో మిగిలిన సంవత్సరం పై చిలుకు కాలంలో  కోర్టు ఆదేశాలను అనుసరించి అమరావతిని అభివృద్ధి చేయడం అయ్యే పని కాదని ఆయన స్పష్టం చేశారు.  అయితే ప్రభుత్వం కోణంలో అమరావతి రాజధాని కాకపోయినా.. ప్రజలు మాత్రం అమరావతినే రాజధానిగా భావిస్తున్నారని డీఎల్ చెప్పుకొచ్చారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి  గత ప్రభుత్వ హయాంలో తీసుకున నిర్ణయాలను అమలు చేయాలని రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళ్ళిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి అక్కడా  మొట్టికాయలు తప్పవని  డీఎల్ జోస్యం చెప్పారు. మంత్రులు అమరావతి గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని, అప్పుడే రాష్ట్రానికి మంచి రోజులోస్తాయని  అమరావతి ఏకైక రాజధానిగా నిలుస్తుందని డీఎల్ చెప్పు కొచ్చారు.  ఇక  2019 ఎన్నికల ముందు వైసీపీ లో చేరిన డీఎల్ ప్రస్తుతం టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత వీర శివారెడ్డి తనతో పాటుగా డీఎల్ టీడీపీలో చేరుతున్నారంటూ వెల్లడించారు. అయితే, డీఎల్ కు సంబంధించి సీటు పైన హామీ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. డీఎల్ మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ టీడీపీ అభ్యర్ధిగా సీనియర్ నేత సుధాకర్ యాదవ్ ఉన్నారు. టీడీపీ -జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశం లేదు. సీటు పైన స్పష్టత వచ్చిన తరువాతనే డీఎల్ టీడీపీలోకి వెళ్తారని తెలుస్తోంది.

రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించి తీరాల్సిందే.. కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు అల్టిమేటమ్

తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా   రిపబ్లిక్ వేడుకల నిర్వహణకు కేసీఆర్ కోవిడ్ సాకు చూపడం అపహాస్యం పాలైంది. ఎంత సీఎం అయినా ఇష్టారీతిగా వ్యవహరించడానికి వీలులేదని తేటతెల్లమైంది. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గట్టిగా మొట్టి కాయలు వేసింది. బీఆర్ఎస్ సభ నిర్వహించుకోవడానికి అడ్డు రాని కోవిడ్.. గణతంత్రవేడుకలకు ఎలా అడ్డొచ్చిందని ప్రశ్నించింది. కోవిడ్ సాకు చూపి రిపబ్లిక్ డే వేడుకలు ఆపడం సరికాదని తెలంగాణ హైకోర్టు కేసీఆర్ సర్కార్ కు తేల్చి చెప్పింది. రిపబ్లిక్ డే వేడుకలపై తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గణతంత్ర దినోత్సవ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించి తీరాల్సిందేనని తెలంగాణ కోర్టు విస్పష్టంగా చెప్పింది.  తెలంగాణలో రిపబ్లిక్‌ డే వేడుకలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు బుధవారం(జనవరి 25) విచారణ జరిపింది.  పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలు జరిపి తీరాల్సిందేనని  ఆదేశించింది.  అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని,  కొవిడ్ 19 సాకుగా చూపి వేడుకలను ఆపడం సరికాదని కోర్టు తెలంగాణ సర్కార్ కు అక్షింతలు వేసింది.    కరోనా ప్రభావం ఉన్నందున జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం చెబుతున్నట్లు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నట్లయితే.. కొవిడ్‌ ఆంక్షలు ఎక్కడున్నాయో చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.   గణతంత్ర దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన జాతీయ పండగ అని.. దేశభక్తిని చాటిచెప్పే పండగ అని వ్యాఖ్యానించింది. గణతంత్ర స్ఫూర్తిని చాటేలా ఘనంగా వేడుకలు జరపాలన్న హైకోర్టు... పరేడ్‌ కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  గణతంత్ర దినోత్సవాల నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 19న ఇచ్చిన మార్గదర్శకాలన్నింటినీ పాటించాలని ఆదేశించింది. అంతకు ముందు వాదనల సందర్భంగా ఖమ్మం సభకు అడ్డు రాని కోవిడ్ రిపబ్లిక్ డే వేడుకలకు అడ్డు వచ్చిందా అని ప్రశ్రించింది.  ఇలా ఉండగా హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. కోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టు వంటిదని పేర్కొంది. ఇష్టారీతిగా,  రాజ్యాంగబద్దంగా గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయాలని భావించిన కేసీఆర్ కు హైకోర్టు తీర్పుతో ఎదురు దెబ్బ తగిలిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కోవిడ్ సాకు చూపి  కరోనా సాకు చూపి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించలేమని చెప్పడాని పెద్ద జోక్ అని పేర్కొన్న బండి జనం కేసీఆర్ ను జోకర్ గా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.  

లోకేష్ పాదయాత్రకు సంఘీభావం.. కుప్పంకు జూనియర్ ఎన్టీఆర్?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. యువగళం పేరిట చేపట్టనున్న పాదయాత్ర కుప్పం నుంచి శుక్రవారం (జనవరి 27) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ కార్యక్రమంలో అటు నారా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీలు హాజరవుతున్నాయని తెలుస్తోంది.  మరోవైపు టీడీపీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం తరలిరానున్నాయి.  అయితే ఈ పాదయాత్ర ప్రారంభంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ సైతం హాజరు కానుందని  తెలుగుదేశం శ్రేణులుఅంటున్నాయి.  అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి  హీరోలు నందమూరి కల్యాణ్ రామ్, తారకరత్న,  అలాగే చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్‌  ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరుకానున్నారని సమాచారం.   ఇక జూనియర్ ఎన్టీఆర్.. సినిమాల్లో నటిస్తూ.. బీజి బీజిగా ఉన్నా  వైపు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విషయంలోనే కాదు.. టీడీపీపై జగన్ అండ్ కో వ్యవహారిస్తున్న తీరుపై తనదైన శైలిలో ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు.  ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరును జగన్ ప్రభుత్వం మారిస్తే.. ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.  అలాగే ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు.. గోల్డెన్ గ్లోబల్ పురస్కారం దక్కించుకున్న సందర్భంలో ఆ చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణిలతో పాటు చిత్ర యూనిట్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ శుభాకాంక్షల సందేశంలో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకున్నా  జూనియర్ ఎన్టీఆర్...   థ్యాంక్స్ మామయ్య అంటూ రీట్విట్ట్ చేశారు.  గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబు ఫ్యామిలీలో ఒకింత దూరం పాటిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఎన్టీఆర్ ధ్యాంక్యూ మావయ్యా అన్న స్పందన ఆ ప్రచారానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లైంది. అలాగే పార్టీలో  1995 ఆగస్టు సంక్షోభం విషయంలో ఇప్పటి వరకూ ఉన్న అపోహలను, అనుమానాలను ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్  షో నివృత్తి చేసేసింది. నాడు మొత్తం తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ కుటుంబం కలిసి తీసుకున్న నిర్ణయమని ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ విస్పష్టంగా ప్రకటించి అన్నిఅనుమానాలకూ తెరదించేశారు. దీంతో  మరోవైపు.. నందమూరి, నారా కుటుంబాలు మొత్తం కలిసి ఉన్నాయని .. వీరి మధ్య ఎలాంటి ఆపోహాలు, అగాధాలు లేవని బాలయ్య ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్   చంద్రబాబు అభినందనలకు ధ్యాంక్యూ మావయ్యా అంటూ వరుస పెట్టి మరీ సంభోదిస్తూ రిప్లై ఇచ్చారని అంటున్నారు. అలాగే అదే నాటునాటుపాట ఆస్కార్ కు నామినేషన్ లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని మళ్లీ చంద్రబాబు చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరును ట్వీట్ చేయడమే కాకుండా ఆయనకు ట్యాగ్ కూడా చేశారు. ఈ పరిణామాలతో  జూనియర్ ఎన్టీఆర్ తో దూరం అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో  మరోవైపు నారా లోకేశ్ చేపట్టనున్న పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఆ క్రమంలో ఈ పాదయాత్రను సూపర్ సక్సెస్ చేసే విధంగా పావులు కదుపుతోంది. ఇంకోవైపు ఈ పాదయాత్రకు కండిషన్లుతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు. అయితే నారా లోకేశ్ పాదయాత్రకు కండిషన్‌తో కూడిన అనుమతులపై టీడీపీ శ్రేణులే కాదు.. పసుపు పార్టీ అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభ కార్యక్రమానికి జూనియర్ హాజరు కానున్నారన్న వార్త తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది.   

బీజేపీకి ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ గుడ్ బై

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ బిజెపికి రాజీనామా చేశారు. ఈ మేరకు వారిరువురూ వేర్వేరుగా బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డాకు రాజీనామా లేఖలు పంపారు. వీరిరువురూ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి  ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్)లో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ను వీడి 2015లో బిజెపిలో చేరిన గిరిధర్ గమాంగ్ కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయిన సంగతి విదితమే. ప్రగతి భవన్ లో జరిగిన ఈ భేటీలో   గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు పాల్గొన్నారు. అప్పటి నుంచీ గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో సహా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జరుగోంది. వీరి రాజీనామాతో ఆ ప్రచారం వాస్తవమేనని తేలింది. బీఆర్ఎస్ కార్యకలాపాలను తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన  నేపథ్యంలో ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఆయన బీజేపీకి రాజీనామా చేయడంతో ఒడిశాలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ఆరంభం కానున్నాయి. ఇంతకీ ఈ గిరిధర్ గమాంగ ఎవరంటే..  1999లో అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన  ఒకే ఒక్క ఓటు వేసిన వ్యక్తి. 1999 ఏప్రిల్ 17 న అవిశ్వాస పరీక్షలో 13 నెలల నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్. ఈయన 9 సార్లు పార్లమెంటుకు ఎన్నియ్యారు. కాగా, గమాంగ్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే  వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్షలో చివరి నిమిషంలో పార్లమెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒ ఒక్క వోటు కారణంగానే  నాటి బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ  తరువాత కొద్ది రోజులకే ఆయన కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమయ్యారు. తన కుమారుడికి కాంగ్రెస్ తగు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోిస్తూ.. 2015లో బీజేపీ గూటికి చేరారు.  ఇప్పుడు ఆయన బీజేపీకి రాజీనామా చేసి కుమారుడు శిశిర్ గమాంగ్ తో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఆయన  బీఆర్ఎస్ ఒడిశా శాఖ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పడు ఆయన రాజకీయాలలో పెద్దగా క్రియాశీలంగా లేరు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ రాజకీయ భవిష్యత్ కోసమే బీజేపీని వీడి బీఆర్ఎస్ గూటికి చేరారని పరిశీలకులుఅంటున్నారు. 

ప్రసాదం కౌంటర్ లో దొంగలు పడ్డారు

తిరుమల వెంకన్న దేవుడు మహిమగల దేవుడు. ఆయన లీలలు ఇన్నీ అన్నీ కాదు. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. మొక్కులు తీర్చుకుంటారు. కానుకలు సమర్పించుకుంటారు. వెంకన్న  దేవుని ఆదాయమ లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది.  ఆ నిధులన్నీ ఎటు పోతున్నాయో ఏమవుతున్నాయో, ఎప్పటికీ ఒక శేష ప్రశ్న గానే ఉండి పోతోంది. ఇవన్నీ ఒకెత్తు అయితే వెంకన్న దేవుని లీలల కంటే, కొండ మీద జగనన్న దేవుని లీలలే ప్రముఖంగా పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన గారి బాబాయ్ గారు,     సుబ్బారెడ్డి  టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి ఒక దాని వెంట ఒకటిగా ఎన్నో అపశ్రుతులు, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. భక్తుల హృదయాలను కలతకు గురు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం   కొండపై ఉన్న టీటీడీ వసతి గృహాలలో రూము రెంట్ ను అడ్డగోలుగా పెంచేశారు. భక్తులు గగ్గోలు పెట్టారు. అయినా జరిగింది ఏమీ లేదు. చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టారు. అంతకు మించిన మరో పెద్ద సమస్యను తెరమీదకు తెచ్చారు.  గదుల అద్దె వివాదం పూర్తిగా సమసి పోక ముందే, మరో వివాదం తెరపై కొచ్చింది. నిబంధనలు కాదు, ఆగమ శాస్త్ర విరుద్ధంగా శ్రీవారి ఆలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టింది, చిత్రాలు తీసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటికి గానీ ఘనత వహించిన టీటీడీ ప్రభువులు ఏమి జరిగిందనేడి గుర్తించనే లేదు. ఇంకా చిత్ర  విచిత్రం ఏమంటే, టీటీడీ చైర్మన్ సుబ్భారెడ్డి డ్రోన్ మాయను తెలుసుకునేందుకు అర్జెంటుగా ఒక కమిటిని వేశారు. ఆ కమిటీ, హైదరాబాద్  కు చెందిన   ఫలానా కంపెనీ  డ్రోన్ కొండ మీద  చక్కర్లు కొట్టిందని కనిపెట్టేసింది.  చైర్మన్ అదంతా తమ ఘనతగా చెప్పుకున్నారు. కానీ, అసలు జరిగింది, ఏమిటంటే, అది ఎవరో చేసిన తప్పుకాదు, స్వయంగా టీటీడీ కార్యనిర్వహణ అధికారి, (ఈఓ) ధర్మారెడ్డి అనుమతి ప్రకారం జరిగిన పుణ్య కార్యమని తెలిసింది. ఇందుకు సంబంధించి  తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్‌  కంపెనీకి  పర్మిషన్ ఇచ్చింది వాస్తమేనని అన్నారు. కారిడార్ ఏర్పాటు చేసుకునేందుకు అన్నదానం దగ్గర నుంచి గార్బెజ్ సెంటర్ వరకు డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్‌ పర్మిషన్ అడిగితే ఇచ్చామని చెప్పారు. ఆ ప్రాంతంలో మాత్రమే సర్వేకు అనుమతి ఉందన్నారు. అయితే వాళ్లు అత్యుత్సాహంతో ఇది చేశారా? ఎవరైనా ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి వీడియోను క్రియేట్ చేశారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఆ వీడియోను ఫోరెన్సిక్ డిపార్టమెంట్‌కు పంపించి ఎలా చేశారనేది గుర్తించడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. వైరల్ అయిన వీడియోలు నిజమైనవా లేక ఫేక్ వీడియోలా అని తేలాల్సి ఉందని చెప్పారు. అత్యుత్సాహంతో చేసినా, ఏ విధంగా చేసినా తప్పు తప్పేనని అన్నారు. కానీ అసలు  డ్రోన్ కొండమీదకు రావడం ఏమిటి? అందుకు సంబంధించి కనీసం చైర్మన్ కు ముందస్తు సమాచారం లేక పోవడం ఏమిటి? అంత జరిగినా, ఈఓ ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం  ఏమిటి? అంటే ఈ ప్రశ్నలు వేటికీ సమాధానం లేదు.  అదలా ఉంటే ఇప్పుడు తాజాగా మరో వివాదం, మరో విషాదం వెలుగు చూసింది. తిరుమల లడ్డూ కౌంటర్‌లో దొంగతనం జరిగింది. కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కౌంటర్ నెంబర్ 36 వద్ద ఈ ఘటన జరిగింది. కౌంటర్ బాయ్ నిద్ర మత్తులో వుండగా దొంగ లోపలికి చొరబడి రూ.2 లక్షలు చోరి చేసినట్లు టీటీడీ గుర్తించింది. దీనిపై తిరుపతి వన్‌టౌన్ పోలీసులకు టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నారు. ఇతను గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అయితే  ఇది ఇంటి దొంగల పనే అని అంటున్నారు. దొంగతనానికి పాల్పడింది పాత దొంగే అనే సీసీ కెమెరాలు చెపుతున్నాయంటే, ఇది ఇంటి దొంగల పనే అని అంటున్నారు. నిజానికి, ఇలాంటి సంఘటనలు పై వారి అసీస్సులతోనే జరుగు తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు నివాసంలో ఎమోషనల్ సీన్స్

నారా లోకేష్ తన నివాసం నుంచి పాదయాత్ర కోసం బయలు దేరారు. ఆ సమయంలో ఆయన నివాసం వద్ద ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. భార్య బ్రాహ్మణి లోకేష్ కు వీర తిలకం దిద్ది సాగనంపారు.    తల్లి భువనేశ్వరి    ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికారు. లోకేష్ తండ్రి చంద్రబాబు, మామ బాలకృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని    ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.  నారా లోకేష్ తన నివాసం నుంచి పాదయాత్ర కోసం బయలు దేరారు. ఆ సమయంలో ఆయన నివాసం వద్ద ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. భార్య బ్రాహ్మణి లోకేష్ కు వీర తిలకం దిద్ది సాగనంపారు.    తల్లి భువనేశ్వరి    ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికారు. లోకేష్ తండ్రి చంద్రబాబు, మామ బాలకృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని    ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. లోకేష్ కోసం ప్రత్యేకంగా  కార్వాన్ వాహనం సిద్ధం చేశారు. పాదయాత్రలో విశ్రాంతి, పార్టీ నేతలతో సమీక్షల కోసం కార్వాన్‌లో అధునాతన ఏర్పాట్లు చేశారు. ఈ కార్వాన్ వాహనం హైదరాబాద్ నుంచి కుప్పం బయలుదేరింది.    తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ ఆధ్వర్యంలో చంద్రబాబు నివాసం నుంచి భారీ  బైక్ ర్యాలీతో లోకేష్ జూబ్లీహాల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన లోకేష్ అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని కడపకు బయలుదేరి వెళ్లారు. కడప నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుంటారు. గురువారం (జనవరి 26) ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేరుకుంటారు. శుక్రవారం ఉదయం కుప్పంలోని వరద రాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన యాత్ర 400 రోజుల పాటు నాలుగువేల కిలోమీటర్లు సాగనుంది. ఆయన యాత్ర విజయవంతం చేయడానికి తెలుగుదేశం అన్ని ఏర్పాట్లూ చేసింది. 

భారత్ తో కాళ్లబేరానికి పాకిస్థాన్.. ఎందుకంటే?

భారత్‌తో మూడు ప్రత్యక్ష యుద్ధాలు, అనే  పరోక్ష యుద్ధాలు చేసిన పాకిస్థాన్‌  ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తోంది.   బుద్ధి వచ్చిందని,   అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఇటీవల పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహజా షరీఫ్‌ ఓ ప్రకటన చేశారు.  భారత్‌ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని  ప్రకటించారు. ఆయన ప్రకటనలో  నిస్సహాయత ఉంది. అదినిజం. అలాగే కపటత్వమూ ఉంది. అదీ వాస్తవమే.  కాశ్మీర్‌తో సహా వివిధ కీలక సమస్యల మీద ‘నిజాయతీ’గా చర్చలు జరిపి, వీటికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని   షరీఫ్‌ అంటున్నారు.   అదే పాకిస్థాన్ లోని కపటత్వాన్ని ప్రపంచానికి మరో సారి ఎత్తి చూపింది. కాశ్మీర్‌ మీద చర్చించడానికి ఏమీ లేదు. కాశ్మీర్‌ భారత్‌లోని భాగమని, ఆర్టికల్‌ 370 రద్దుతో ఇది మరింత ధృవపడింది. కాశ్మీర్‌ మొదటి నుంచి భారతదేశంలో అంతర్భాగమనీ ఆర్టికల్‌ 370 రద్దు కూడా భారతదేశ అంతరంగిక వ్యవహారమని పాక్ ప్రపకటన శాంతి చర్చల ప్రతిపాదన ప్రకటనలో అంగీకరించి ఉంటే.. ఆ దేశంలో మార్పు వచ్చిందనీ, వస్తోందనీ ఒకింత విశ్వాసం  కలిగేది. కానీ ఆయనా పని చేయలేదు. పాకిస్థాన్ విషయంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవలసిన అంశాలు ఉన్నాయన్నపాత పాటనే ఆయన పాడారు. అన్నిటికీ మించి భారత్ లో అశాంతి నింపడం, శాంతి భద్రతల సమస్య సృష్టించడం, మారణహోమం సృష్టించి అస్థిరత నెలకొల్పడం లక్ష్యంగా పాక్ భూభాగంలో శిక్షణ పొంది దొంగచాటుగా సరిహద్దులు దాటి వస్తున్న ఉగ్ర చొరబాట్ల గురించి ఆయన శాంతి చర్చల ప్రతిపాదన ప్రకటనలో ప్రస్తావించలేదు.   ఎందుకంటే వాస్తవంగా  ఈ విషయాలేవీ  ఆయన చేతుల్లో లేవు. ఆయన నియంత్రించలేరు.   కాశ్మీర్‌ సమస్యను రావణ కాష్టం లాగా మార్చడంపైనా అక్కడి సైనికాధికారుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాశ్మీర్ కారణంగానే దేశంలో వారి పెత్తనం కొనసాగుతోంది. అందుకే భారత్ పాక్ ప్రతిపాదనకు స్పందించలేదు.   భారత్ తో చర్చలకు ప్రయత్నాలు చేయడం కంటే తమ అంతర్గత సమస్యలను పరిష్కరించు కోవడం మీద దృష్టి కేంద్రీకరించడం మేలని అన్యాపదేశంగానైనా పాక్ ప్రధానికి భారత్ విస్పష్టంగా చెప్పింది.    భారత్‌ ఇప్పటికే పాకిస్థాన్‌తో చర్చలకు ససేమిరా  అని తేల్చి చెప్పేసింది.   అయితే పాక్ బేలగా భారత్ను బతిమలాడుకోవడానికి కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. గోధుమ పిండి  కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇదివరకటి మాదిరిగా యూరోపియన్‌ దేశాల నుంచి ఆ దేశానికి   ఎగుమతులూ జరగడం లేదు.   ఏవిధమైన సహాయమూ అందడం లేదు. అమెరికా నుంచి కూడా చాలా చాలా పరిమిత స్థాయిలోనే   విదేశీ మారక నిల్వలు దాదాపు అడుగంటి పోయాయి. దీంతో ఇక రానున్నరోజులలో దిగుమతులు కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది.  దేశంలో వ్యవసాయ రంగం   కుదేలైపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 60 శాతం, అంతకు మించి పెరిగిపోయాయి.  చైనా, యు.ఏ.ఇ, సౌదీ అరేబియా వంటి మిత్ర దేశాలు పాకిస్థాను సహాయం చేయడానికి ముందుకు వచ్చినా తక్షణసమస్యల నుంచి గట్టెక్కే అవకాశం లేదు.   ఆఫ్ఘనిస్థాన్‌ చెందిన తాలిబన్లతో పాకిస్థాన్‌ సంబంధాలు పూర్తిగా దెబ్బతిని పోయాయి. ఈ పరిస్థితుల్లో పాక్ కు భారత్ సహకారమే దిక్కు. అందుకే పాకిస్థాన్ ఇంత బేలగా భారత్ తో శాంతి చర్చల కోసం పాకులాడుతోంది. బతిమలాడుకుంటోంది.  

తెలంగాణలో పోటీకి జనసేన సై

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చేశారు. ఏపీలోనే కాదు, తెలంగాణ శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లోనూ జనసేన పోటీ  చేస్తుందని స్పష్టం చేశారు. నిజానికి గత కొంత కాలంగా జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయినా, అంత క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేల్చేశారు. పూర్తి క్లారిటీ ఇచ్చారు. జగిత్యాలలో నిర్వహించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహకుల సమావేశంలో ఆయన, ఎలాంటి అనుమానం లేకుండా వచ్చే ఎన్నికల్లో 7 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, పొత్తుల విషయంలోనూ ఆయన స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషం, రాకున్నా ఓకే, ఒంటరిగానే పోటీ చేస్తాం.. జనసేన తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాలి.. కనీసం 10 మంది జన సైనికులు అసెంబ్లీలో ఉండాలనేది, తన ఆకాంక్ష అని అన్నారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఒక ఆశయం కోసం తాను పోరాడుతున్నట్లు పవన్‌ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో తాను లేనని, ఇక్కడి ప్రజల నుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నానన్నారు. తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల నుంచి తాను స్ఫూర్తి పొందానన్నారు. ఆలాగే  జనసేన తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ అని అంటూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో  బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాలను విని తాను గళం విప్పానని గతాన్ని గుర్తు చేస్కున్నారు. అలాగే పరోక్షంగానే అయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ కు సున్నితంగా చురకలంటించారు. తెలంగాణ  రాష్ట్ర  సాధన వరకు పోరాటాలు చేసింది, తెలంగాణ సాధించింది తెలంగాణ  ప్రజ లే అంటూ, భారాస నేతలు ప్రవచించే,  కేసేఆర్  ఒక్కడే  చావు నోట్లో తలపెట్టి  తెలంగాణ సాధించారనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. అయితే అదే సమయంలో  కొత్తగా వచ్చిన రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఏదో సాధించాలని ముందుకు వెళ్తోంది ..  అందుకు నేను ఎదురు చూస్తున్నాను, అంటూ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిన రీతిలో కేసేఆర్ ప్రభుత్వాన్నిపవన్ కళ్యాణ్ టార్గెట్ చేయలేదు. అఫ్కోర్స్ అన్నప్రాసన రోజే ఆవకాయ  ఆశించలేము అనుకోండి.. ముందు ముందు ఎలా ఉంటుంది అనేది చూడవలసి వుందని పరిశీలకులు అంటున్నారు.   అయితే తెలంగాణలో జనసేనతో ఎవరు పొత్తు పెట్టుకుంటారు. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతోంది. అదే సమయంలో తెలుగు దేశం, జనసేన పొత్తుకు ఇరు పక్షాల నుంచి సుముఖత వ్యక్త మవుతోంది. ఒక ప్రకటన మినహా మిగిలిన క్రతువంతా ఆల్మోస్ట్ కంప్లీటై పోయిందని పొలిటికల్ సర్కిల్స్  లో వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎవరి మెడలో మూడు ముళ్ళు వేస్తారు, అనేది ఆసక్తికరంగా మారింది. అయితే  తెరాస భారాసగా పేరు మార్చుకుని ఏపీలో ఎంట్రీ ఇచ్చిన నేపధ్యం ఒక  వైపు  కొద్ది రోజుల వ్యవధిలో టీడీపీ, జనసేన తెలంగాణ రాజకీయ వేదిక మీదకు వచ్చిన నేపధ్యం మరోవైపు .. చూస్తుంటే, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజకీయం ముందు ముందు మరింత ఆసక్తి దాయకంగా మారుతుందని అంటున్నారు.