పోలవరం రివర్స్ టెండరింగ్ తో ఆదాపై అనుమానాలు .. కూపీ లాగుతున్న బీజేపీ!!

  నిన్న మొన్నటి దాకా ఏపీలో హాట్ టాపిక్ గా నడచిన అంశం 'పోలవరం రివర్స్ టెండరింగ్'.  ఏపిలో రివర్స్ టెండరింగ్ పై కాషాయదళం కన్నేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్ల రూపాయలు ఆదా అయిందని స్వయంగా సిఎం జగన్ ప్రధాని దగ్గర ప్రస్తావించారు. నిజంగా అంత జరిగుంటే మరి రాష్ట్రంలో వైసీపీ నేతలకు కనీసం సమాచారం ఎందుకు లేదు అన్న కోణంలో బిజెపి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.  అన్ని కోట్లు ఆదా అయ్యాయని సర్కారు ఎందుకు ప్రచారం చేయటం లేదు అన్న విషయం పై చర్చకి తెరతీసింది.  జగన్ ప్రభుత్వం ఒక పక్క నవరత్నాలు అమలు చేసే పనిలో ఉండగా మరోపక్క రివర్సు టెండరింగ్ లో నిధులు ఆదా చేసే అంశాలపై కూడా దృష్టి పెడుతూ రెండు కళ్లుగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొన్నటికి మొన్న జగన్ ఢిల్లీ వెళ్లి మరీ ప్రధాని దగ్గర రివర్సు టెండరింగ్ అంశాన్ని ప్రస్తావించారు. రివర్సు టెండరింగ్ ద్వారా ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా చూస్తామని మోదీకి చెప్పినట్లు వార్తలొచ్చాయి .ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది .అయితే రివర్స్ టెండరింగ్ లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి. పనులకు సంబంధించిన వాస్తవ లెక్కలు ఎలా ఉన్నాయి. నాణ్యత ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారనే విషయాలు ఇంత వరకూ ఎక్కడా బయటికిరాలేదు.మోదీ దగ్గర జగన్ ప్రస్తావించిన రివర్సు టెండరింగ్ అంశాలపై ఏపీ బీజేపీ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఢిల్లీలో జగన్ ఏం చెప్పారు, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏంటనే విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ చెప్పినట్లే వందల కోట్లు ఆదా అయ్యయా అది ఎలా సాధ్యమైందనే సమాచారాన్ని ప్రభుత్వ వర్గాలతో పాటు ఇతరత్రా నిపుణుల ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.కొన్ని సందర్భాల్లో బిజెపి నేతలు ఒకడుగు ముందుకేసి బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటున్న వైసీపీ నేతల నుంచి కూడా సమాచారం తీసుకొంటున్నారు.  టిడిపి హయాంలో పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో రివర్సు టెండరింగ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు నిధులు ఆదా చేస్తే జగన్ సర్కార్ విజయం సాధించినట్లే.ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఇదంతా జరిగితే ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ,కానీ ఏపీ సర్కార్ ఎక్కడా ఈ విషయంలో పెద్దగా ప్రచార ఆర్భాటం చేయడంలేదు.మంత్రుల దగ్గర కూడా తగినంత సమాచారం ఇవ్వడంలేదు. అధికారులు కూడా ఈ విషయంలో తడబడుతున్నారు. దీంతో ఈ అంశంపై ఏపీ బీజేపీ ఫోకస్ చేసింది.నిజంగా జగన్ సర్కారు ఖజానా సొమ్మును కాపాడిన ఆ విషయాలు ఇప్పట్లో తెలిసే అవకాశం లేదు ఎందుకంటే పనులు పూర్తయిన తరవాత బిల్లుల చెల్లింపులు కూడా జరిగిన తర్వాత కానీ వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు.కాని జగన్ అప్పుడే ఈ విషయాలను ఎలా చెప్పారనే అంశంపై బిజెపి నేతలు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు వచ్చాక అధిష్ఠానానికి నివేదిక పంపడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయని  బీజేపీ లో ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు ప్రశ్నలకు ఇక జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మహాబలిపురం లో ఇరు దేశాల బంధం బలపడబోతోందా?

  మోదీ ఏ పని చేసినా ఏదో ఒక అర్ధం ఉంటుంది అని అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మోదీ డ్రాగన్ దేశంతో భేటీలో ఏదైనా వ్యూహం దాగుందా అనే అంశం అందరిని ఆలోచనలో పడేసింది. కశ్మీర్ విషయంలో అనవసరమైన జోక్యం ఓ వైపు, సరిహద్దుల్లో కవ్వింపులు మరో వైపు అన్నట్లుగా భారత్ కు వ్యతిరేకంగా ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్న చైనా వైఖరిలో మార్పు సాధ్యమవుతుందా అని అందరిలో వెల్లువడే పశ్న. మహాబలిపురం వేదికగా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల సమావేశం కొత్త చరిత్రకు నాంది పలుకబోతున్నారా అని వేచి చూస్తున్నారు. పాకిస్థాన్ ను ఒంటరి చేసే వ్యూహానికి అంతా సిద్దం చేస్తున్నారా ఇలాంటి సందర్బాలలో అంతర్జాతీయంగా మారిన పరిణామాలతో చైనా వైఖరి ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా అవకాశం వచ్చిన సమయంలో భారత్ కు వ్యతిరేకంగా పావులు కదిపే డ్రాగన్ దేశం ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ కు అన్ని విధాలుగా మద్దతిస్తున్న చైనా ఇప్పుడు భారత్ పై తన వైఖరిని మార్చుకుందా సరిహద్దు కయ్యాలకు చెక్ పడబోతుందా అనే  చర్చ జరుగుతోంది. దీనికి కారణం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రెండు రోజుల భారత పర్యటన చెన్నై సమీపం లోని మహాబలిపురంలో ఇరు దేశాధినేతలు కలుసుకోబోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ జిన్ పింగ్ భేటీ ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే కశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తరువాత చైనా సహకారం తోనే పాకిస్థాన్ ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తీసుకెళ్లింది. అక్కడి కూడా పాకిస్థాన్ కు వంత పాడింది. అదే కశ్మీర్ విషయం లో ఏం జరుగుతుందో పరిశీలిస్తున్నామంటూ జిన్ పింగ్ చెబుతున్నారు అయితే చైనా చర్యలకు భారత్ దీటుగా సమాధానమిచ్చారు. ఇప్పుడు ఇద్దరు నేతలు సమావేశం అవుతుండడంతో ఈ అంశం చర్చకు రాబోతుందని చెబుతున్నారు. అయితే ఇద్దరి భేటీకి చెన్నైలోని మహాబలిపురం వేదికగా మారింది. వేదిక కూడా రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి భారతగా మారుతుంద ని చెబుతున్నారు. రెండ్రోజుల పాటు జరిగే సమావేశాల్లో మోదీ జిన్ పింగ్ మధ్య కీలక చర్చలు సాగుతాయని చెబుతున్నారు.  గతంలో జింపింగ్ వచ్చినప్పుడు మోదీ గాంధీ అశ్రమానికి తీసుకెళ్లారు. శాంతి అహింస సత్యం లాంటి ధర్మాల గురించి వివరించారు అయితే ఇప్పుడు పల్లవుల కాలం నాటి నగరం మహాబలిపురం వేదికగా మార్చుకోవటం ఆసక్తిరేపుతోంది. అటు రెండు దేశాల దౌత్యాధికారుల సైతం ఇది భారత్ చైనాల మధ్య బంధం మరింత బలోపేతం చేసే దిశగా తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తారని అంటున్నారు. చారిత్రకంగా ప్రాధాన్యమున్న మహాబలిపురానికి చైనా తో సన్నిహిత సంబంధాలున్నాయి.ముఖ్యంగా పదమూడు వందల ఏళ్ల క్రితం ఇక్కడి నుంచి చైనాకు రాకపోకలు సాగేలా చెబుతారు జిన్ పింగ్ తో భేటీకి ప్రధా ని మోదీ మహాబలిపురం ఎంచుకోవటానికి రెండు కారణాలు ఉ న్నాయి. ఒకటి చైనా తో ఉన్న బంధం రెండు ప్రపంచాని కి దేశం లో మరిన్ని ప్రాంతాల్ని పరిచయం చేయాలనే ఉద్దేశం అయితే పదమూడు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని పల్లవులు పాలించిన సమయంలో చైనా బౌద్ధమత గురువు కాంచీపురాని సందర్శించినట్లు చెబుతారు. అంతేకాదు చైనాలో జేయిన్ బౌద్ధాన్ని విస్తరించిన బోధిధర్మ కూడా మహాబలిపురం నుంచి చైనాకు వెళ్లినట్టు చెబుతున్నారు. అప్పట్లో పల్లవులు మహాబలిపురాన్ని వాణిజ్య తీర ప్రాంతగా మార్చుకున్నారు. పల్లవులు చోళుల సమయంలో ఇక్కడి నుంచి చైనాలోని సౌతీస్ట్ ప్రాంతాలకు వాణిజ్యం కూడా నడిచిందని చెబుతున్నారు. దౌత్యపరంగా, వాణిజ్య పరంగా చైనాతో మహాబలిపురానికి మంచి సంబంధాలున్నాయి, అయితే పదమూడు వందల ఏళ్ల క్రితం నాటి బంధాన్ని మళ్లీ కొనసాగించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే దాయాది పాక్ సహకారం అందించకుండా చైనాను కట్టడి చేయడం తో పాటు సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడం ఈ సమావేశం కారణంగా కనిపిస్తోంది అందుకే మోదీ జిన్ పింగ్ భేటీ పై ఆసక్తికర చర్చ సాగుతోంది .ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య ఎలాంటి ఒప్పందాలు ఎంవోయూలు లేవంటోంది విదేశీ మంత్రిత్వ శాఖ.ఇక ఈ భేటీతో ఇరు దేశాల మధ్య బలోపేతం ఎర్పడబోతోందా లేదా చూడాలి. 

ఆర్మీలో చేరాలనుకునే వారికి తీపి కబురు చెప్తున్న సింగరేణి యాజమాన్యం

  ఆర్మీలో చేరాలని చాలా మంది యువతకు ఆశ ఉంటుంది. ప్రతి ఏటా జరిగే ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో వేల సంఖ్యలో యువత పాల్గొంటోంది. సరైన అవగాహన శిక్షణ లేక పోవడంతో చాలా మంది ఎంపిక కాలేకపోతున్నారు. అతి కొద్ది మంది మాత్రమే ఆర్మీకీ ఎంపికవుతున్నారు . ఆర్మీలో చేరాలనుకునే యువకుల ఆకాంక్షను తీర్చేందుకు సింగరేణి యాజమాన్యం వినూత్న ప్రయోగం చేస్తోంది. ఇందు కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది. దీని కోసం అర్హత గల నిరుద్యోగ యువతకు జూలై మాసంలో ప్రాథమిక అర్హత పరీక్షలను సింగరేణి నిర్వహించింది.కోల్ బెల్ట్ లో ఔత్సాహిక యువతకు పకడ్బందిగా శిక్షణ అందిస్తోంది. కరీంనగర్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఉండటంతో లక్ష్యం నెరవేరేలా ఫ్రీ ఆర్మీ రిక్రూట్ మెంట్ సెంటర్ల ద్వారా యువతను సన్నద్ధం చేస్తోంది.అందులో ప్రతిభ కనబరిచిన నాలుగు వందల యాభై మందిని ఎంపిక చేసింది ఆ బృందం. వీరికి గత రెండు నెలలుగా రెసిడెన్షియల్ తరహా లో ఉచిత శిక్షణ ఇస్తుంది.సింగరేణిలోని పదకొండు ప్రాంతాలకు నుంచి ఎంపిక చేసిన నాలుగు వందల యాభై మంది అభ్యర్థులకు రీజియన్ల వారీగా మూడు క్యాంపుల్లో శిక్షణ ఇస్తున్నారు. శారీరక శిక్షణ మాత్రమే కాదు, రాతపరీక్షల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు శిక్షణ తరగతులు కొనసాగుతున్నయి. అభ్యర్ధులు ఉదయం ఐదు గంటలకు లేచి ఆరుగంటల కల్లా ఫిజికల్ యాక్టివిటీకి సిద్ధం కావాల్సి ఉంది. వ్యాయామంతో పాటు పరిగెత్తడం దూకడం బిస్కీలు తీయటం వంటివి చేయిస్తున్నారు. తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు లెక్క లు, సైన్స్, రీజనింగ్, ఇంగ్లిష్, సబ్జెక్టును బోధిస్తున్నారు. మధ్యాన్న భోజనం తర్వాత మూడున్నర నుంచి ఆరు గంటల వరకు తిరిగి ఫిజికల్ యాక్టివిటీ ఆటలు నిర్వహిస్తున్నారు. రాత్రి ఏడున్నరకు భోజనం పెడుతున్నారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్ఫూర్తిదాయక పాఠశాల రివిజన్, రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాత పరీక్షలో శిక్షణ ఇవ్వటానికి రిటైర్డ్ ఉపాధ్యాయుల బృందాలను నియమించారు. కావలసిన పూర్తిస్థాయి మెటీరియల్ ను సమకూర్చారు. ఫ్రీ ఆర్మీ రిక్రూట్ మెంట్ శిక్షణ ఇవ్వడం రాష్ట్రంలోనే ప్రథమం అని ప్రభుత్వ సంస్థలు ఇటువంటి చొరవ చూపడం అరుదని ఆర్మీ రిక్రూట్మెంట్ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.  

ఆర్టీసీ సమ్మెలో బీజేపీ వ్యూహం సఫలమవుతుందా?

  ఆర్టీసీ సమ్మెపై రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. ఒకపక్క ఈ టెన్షన్ కొనసాగుతుంటే బీజేపీ కొత్త వ్యూహలతో కేసీఆర్ కు మరొక ఆందోళన కూడా పెరిగిపోతోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులకు మద్దతుగా బీజేపీ లీడ్ తీసుకుంటోంది. తామున్నామని భరోసా ఇస్తోంది. ప్రభుత్వాని కి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాడుతామని ప్రకటించింది. గవర్నర్ ను కూడా కలిసి ఫిర్యాదు చేయడంతో రాజకీయం మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు మద్దతుగా బీజేపీ పూర్తి స్థాయిలో పోరాటం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఉద్యోగుల్లో అంతంత మాత్రం గానే ఉన్న మద్దతును ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండి పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్య మంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలను గవర్నర్ వద్దకు తీసుకెళ్లి తమ వాదన వినిపించే అవకాశం కల్పించారు.బిజెపి నేతలు కూడా గవర్నర్ కు ప్రత్యేకంగా వినతి పత్రం ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయాన్ని ప్రభుత్వం తీరును వివరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ మద్దతు ఆర్టీసీ కార్మికులకు ధైర్యాన్నిస్తోంది. కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ అగ్గితో తలగోక్కున్నాడని త్వరలోనే ఒళ్ళు కాల్చుకుందని హెచ్చరిస్తున్నారు. టీచర్లు, రెవిన్యూ ఉద్యోగులు, ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగు లు అందర్నీ కేసీఆర్ అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు.యాభైవేలమంది ఆర్టీసీ ఉద్యోగుల్లో తొలగిస్తామంటే బిజెపి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు బీజేపీ నేత.  తెలంగాణలో రాజకీయంగా బలపడాలని లక్ష్యంతో బీజేపీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులకు చేరువైతే బలం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంచనాతో ఉన్నరు.ఇప్పుడు వివిధ వర్గాల్లో పట్టుపెంచుకోవడం కీలకమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికి ఆర్టీసీ సమ్మె వారికి బాగా ఉపయోగపడుతోంది. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో పోరాటం చేయటం ద్వారా తామే ప్రత్యామ్నాయమని నిరూపించాలనుకుంటున్నారు. అందుకే లక్ష్మణ్ కేసీఆర్ పై చేసే విమర్శల విషయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవడం లేదు. బీజేపీ దూకుడు విషయంలో టిఆర్ఎస్ కూడా కొద్ది రోజులుగా ఆందోళన చెందుతోంది. తెలంగాణలో ఆ పార్టీకి పెద్దగా బలం బలగం లేదని టీఆర్ ఎస్ నేతలు నమ్ముతున్నారు.కానీ ఆ పార్టీ అగ్ర నాయకత్వం వ్యూహాల విషయంలో మాత్రం టీఆర్ఎస్ పెద్దలకు కాస్తంత టెన్షన్ గా ఉంది. అందుకే మొదట్లో బిజెపిని పెద్దగా పట్టించుకోవద్దని తమ పార్టీ నేతలకు సూచించినా ఆ తరవాత మాత్రం కౌంటర్ లు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు బీజేపీ  నేతలు ఆర్టీసీ సమ్మె విషయాన్ని గవర్నర్ వద్దకు తీసుకువెళ్ళారు. కేంద్రం వద్దకు తీసుకు వెళ్లే అవకాశం ఉందటున్నారు. ఆర్టీసీలు కేంద్రానికి కొంత వాటా ఉంటుంది. కెసిఆర్ దూకుడు తగ్గించి ఆర్టీసీ కార్మికులకు మేలు చేస్తే రాజకీయంగా ఉపయోగమని బిజెపి నేతలు అంచనా వేసుకుంటున్నారు. అదే జరిగితే కేసీఆర్ పై పైచేయి సాధించినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ పై తమదైన శైలిలో ఘాటైన విమర్శలు చేయడంలో వెనక్కు తగ్గట్లేదు బీజేపీ నేతలు. 

ఓటమెరుగని నేత ఇప్పుడు నిజంగానే సన్యాసం తీసుకోబోతున్నారా?

  డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పరుచూరు నియోజకవర్గంలో తిరుగులేని నేత. నిన్నటి వరకూ ఓటమెరుగని నేతగా ఉన్న దగ్గుబాటి మొన్నటి ఎన్నికల్లో తొలి సారి ఓడిపోయారు. వైసిపి అధికారంలోకి రావడంతో పరుచూరు నియోజకవర్గ ఇన్ చార్జి గా కొనసాగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను తనదైన శైలిలో ముందుకు తీసుకు పోతున్నారు. అవినీతి మరక అంటని నేత అయిన దగ్గుబాటికి ఇప్పుడు ఓ సమస్యొచ్చి పడింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన రాజకీయాల్లో కొనసాగే విషయం పై చాలాసార్లు తర్జన భర్జన పడ్డారు అని తెలుస్తోంది.ముప్పై అయిదేళ్లుగా తిరుగులేని నేతగా ఉన్న ఆ సీనియర్ నేతకు సమస్యొచ్చిపడింది. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే ఓసారి రాజకీయ సన్యాసం చేసిన ఆయన మరోసారి అదే అస్త్రం ప్రయోగించ పోతున్నారా లేక వారసుడి  కోసం సర్ధుకుపోతారా అనే అంశం పై చర్చ కొనసాగుతోంది. ఇటీవల నియోజక వర్గ రాజకీయ సమీకరణాల కూడా మారాయి. దగ్గుబాటికి తెలీకుండా పార్టీ నిర్ణయాలు జరగడంతో ఆయన మనస్తాపం చెందారని సమాచారం. అయితే పార్టీ అధిష్టానం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జోక్యంతో కొన్ని వివాదాలు అక్కడితో సర్ధుమనిగాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ తో దగ్గుబాటి ఇటీవల భేటీ అయ్యారు. ఆయన నియోజక వర్గ సమస్య లతో పాటు తన మనసులో మాట ఆయన ముందు పెట్టారు.భర్త ఒక పార్టీ భార్య ఒక పార్టీలో ఉండడంతో రాజకీయంగా సమస్యలొస్తున్నాయి. పురంధేశ్వరి ఇటీవల కాలంలో వైసిపి సర్కార్ పై విమర్శలు చేశారు. దీంతో దగ్గుపాటి టార్గెట్ గా మారారు. ఆయనపై పార్టీ నేతలే విమర్శ లు చేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో కూడా సమస్య లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.  తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తన కొడుకు హితేష్ రాజకీయాల్లో కొనసాగుతారని జగన్ తో భేటీలో దగ్గుబాటి తన భావాన్ని వెల్లడించారు. అయితే జగన్ మాత్రం దగ్గుబాటికి సర్దిచెప్పారట. ఇప్పటి కిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సమాధానమిచ్చారు జగన్. దగ్గుపాటి వెంకటేశ్వరావు ఇప్పటికే  ఒకసారి రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా కొడుకు హితేష్ కు పౌరసత్వం సమస్య రావడంతో దగ్గుబాటి రంగంలోకి దిగారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోగా తాజా రాజకీయ పరిణామాలతో మరోసారి దగ్గుబాటి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. మొత్తానికీ దగ్గుబాటి పాలిటిక్స్ కు దూరంగా జరగడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. త్వరలోనే దగ్గుపాటి పరుచూరు లో అనుచరులు అభిమాను లతో సమావేశం కాబోతున్నారని తెలుస్తుంది. ఈ మీటింగ్ లో దగ్గుబాటి తన రాజకీయ సన్యాసంపై ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకీ పురందేశ్వరి రాజీనామా చేసే అవకాశం అవసరం లేదు. దీంతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందన్న భావనలో దగ్గుబాటి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక రాజకీయాల్లో దగ్గుబాటి కనిపించే అవకాశాలు తక్కువ అని సమాచారం. ఇక ఈ ఇంటి రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయో వేచి చూడాలి.

మరో గొప్ప పథకానికి శ్రీకారం చుట్టిన జగన్

  'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్నపెద్దల మాటను సార్ధకం చేసే పనిలో పడ్డారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్తూరు జిల్లా లో 'వైఎస్సార్ కంటి వెలుగు' పథకాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా అధికారికంగా ప్రారంభించారు. ఈ పధకం తాను ప్రారంభంచటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తన భావాలను వెల్లడించారు. 'వైయస్సార్ కంటివెలుగు' మరో విప్లవాత్మక పథకమన్నారు రోజా. ప్రజల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకు సీఎం జగన్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రెండు విడతల్లో డెబ్బై లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. రాష్ట్రంలోని కోట్లాది మందికి నేత్ర పరీక్షలకు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది అన్నారు. "ఎవరు కూడా చేపట్టనటువంటి విధంగా ఒక కొత్త పథకాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని ఈ రోజు ఆయన పరిపాలనకి మానవత్వాన్ని అద్దారు అని చెప్పడానికి ఈ కంటి వెలుగు పథకాన్ని నిదర్శనంగా చెప్పొచ్చు. రాజశేఖరరెడ్డి గారు ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపితే, తండ్రికి తగ్గ తనయుడిగా  జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేసి అంధత్వ నివారణ దినోత్సవం సందర్భంగా అంధత్వ నివారణ లక్ష్యంగా  మారీ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకి, అలాగే డెబ్బై లక్షల మంది విద్యార్థులు అందరికీ కూడా కంటి పరీక్షలు చేసి వారి కంటి సమస్యల్ని దూరం చేయాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ఈ కంటి వెలుగు పధకాన్ని వెలుగులోకి తీసుకువచ్ఛారు" అని రోజా పేర్కోన్నారు.    

రంగు పడుద్ది... అన్ని పార్టీలది అదే పైత్యం

  "ఏ పార్టీ తీరు చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్ని పార్టీలది అదే పైత్యం" అన్నట్టుంది ప్రస్తుత రాజకీయ పార్టీల పరిస్థితి. పేర్లు వేరు కానీ దాదాపు అన్ని పార్టీలది అదే తీరు. చివరికి ఓట్లేసి గెలిపించిన మనమే పెట్టాలి కన్నీరు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం కర్చీఫ్ వేస్తుంటాం. ఎందుకు? కాసేపు ఆ సీటులో కూర్చొని ప్రయాణం చేయాలని. మనకి తెలుసు ఆ సీటు శాశ్వతం కాదని. అయినా సీటు కోసం పోటీ పడతాం. కర్చీఫ్ వేసి సీటులో కూర్చొని ప్రయాణం చేస్తాం.. స్టాప్ రాగానే దిగిపోతాం. తర్వాత ఎవరో వచ్చి ఆ సీట్లో కూర్చుంటారు. అయినా ఆ కాసేపు కూర్చోవడం కోసం మనం కర్చీఫ్ వేయడం మానం, పక్కన వాళ్ళతో గొడవ పడటం మానం. "ఆర్టీసీ బస్సులో సీటు కోసం కర్చీఫ్".. ఇలాంటి కాన్సెప్ట్ నే రాజకీయ పార్టీలు ఫాలో అవుతున్నాయి. అధికారం శాశ్వతం కాదని తెలిసినా తాము అధికారంలో ఉన్నంత కాలం.. తమ పార్టీ జెండా రంగులే రాష్ట్రమంతా కనిపించాలని రంగులతో నింపేస్తున్నారు. బస్సుల నుంచి భవనాల వరకు వేటిని వదలకుండా పార్టీ జెండా రంగులతో కప్పేస్తున్నారు. ఏ ఒక్క పార్టీనో కాదు.. అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీల తీరు ఇలాగే ఉంటోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ రంగుల పైత్యం ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ పార్టీ జెండా రంగు గులాబీ. ఇంకేముంది తెలంగాణ అంతా గులాబీ మయం. బస్సులు, భవనాలు, చివరికి గుళ్లకు కూడా ఈ మధ్య గులాబీ రంగు దర్శనమిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఏపీ సంగతి సరేసరి. అప్పుడు చంద్రబాబుది.. ఇప్పుడు వైఎస్ జగన్ ది ఇద్దరిది ఒకటే తీరు. అన్నట్టు ఆఖరికి పుష్కారాల సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఈ రంగుల పిచ్చిని పక్కన పెట్టలేదు. నల్లగొండ జిల్లాలోని కృష్ణానదీ తీరాన అవతలి వైపు పుష్కర ఘాట్లకు పసుపు రంగు, ఇవతలి వైపు గులాబీ రంగు ఘాట్లు దర్శనమిచ్చాయి. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి వచ్చింది. గులాబీ రంగే కొనసాగుతోంది. కానీ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా. అందుకే పసుపు రంగు పోయి వైసీపీ జెండా రంగులు దర్శనమిస్తున్నాయి. అసలే జగన్ మొదటి సారి సీఎం అయ్యారు. ఇంకేముంది రాష్ట్రాన్ని పార్టీ జెండా రంగులతో నింపేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, త్రాగునీటి బోర్లు, ఇతర భవనాలు, ఆఖరికి స్మశానాలు కూడా వేటిని వదలకుండా రంగులతో నింపేస్తున్నారు. ఇంతటితో అయిపోలేదు.. సీఎం కూర్చునే కుర్చీల దగ్గర కూడా ఈ రంగుల గోలే. కేసీఆర్ కుర్చీలో గులాబీ టవల్, బాబు కుర్చీలో పసుపు టవల్, జగన్ కుర్చీలో తెలుపు టవల్ దర్శనమిస్తున్నాయి. ఇక సభలు ఏర్పాటు చేస్తే అవి కూడా పార్టీ రంగులతోనే నింపేస్తున్నారు. చుట్టూ కట్టే క్లాత్ నుంచి, డెకరేషన్ చేసే ఫ్లవర్స్ వరకు అన్నిట్లో పార్టీ జెండా రంగులు ఉండేలా చూసుకుంటున్నారు. అసలు ఈ రంగుల వల్ల ఏంటి ప్రయోజనం?.. ప్రజాధనం వృధా తప్ప. అధికారంలోకి రాగానే రంగులతో నింపేస్తారు. మరో పార్టీ అధికారంలోకి రాగానే.. ఈ రంగులను ఆ రంగులు కప్పేస్తాయి. ఇలా భవనాల రంగులు మారడం తప్ప ప్రజల బ్రతుకులు మారడంలేదు. రంగులు వేసినంత మాత్రాన నాయకులు ప్రజలకు దగ్గర కారు. రంగులు వెలిసిపోయినట్టే ప్రజలు కూడా నాయకుల్ని మర్చిపోతారు. రంగులు వేయడం మానేసి భవిష్యత్తుకి బాటలు వేయండి. ప్రజలకు మంచి చేయండి. అప్పుడు మీరు రంగులు వేయకుండానే ప్రజలు మీ పార్టీకి అండగా ఉంటారు. మిమ్మల్ని, మీ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇది అన్ని రంగుల పార్టీలకు మేమిస్తున్న ఉచిత సలహా అనమాట.

ఏపీ సీఎంతో మెగాస్టార్ భేటీ.. సైరా జగన్మోహన్‌రెడ్డి

  తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం.. అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. రాజకీయ ప్రముఖులు కూడా సైరాను ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి నారా లోకేష్ వంటి వారు సైరాపై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు చిరంజీవి సినీ రాజకీయ ప్రముఖుల్ని కలిసి సైరా చిత్రాన్ని వీక్షించాలని కోరుతున్నారు. ‘సైరా’ చిత్రాన్ని వీక్షించాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి సైరా చిత్రం చూడమని కోరనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. తాను నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా జగన్‌ను చిరంజీవి కోరనున్నారు. మరి జగన్ కు సైరా చూసే తీరిక దొరుకుతుందో లేదో తెలియదు కానీ.. చిరంజీవి ఆయనతో భేటీ కాబోతున్నారన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా జగన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మరోవైపు చిరంజీవి జగన్ తో భేటీ అంటున్నారు. దీంతో మెగా అభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొంది. అయితే దీని వెనుక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. సైరాకు ఏపీలో అదనపు షోలు కావాలని మంత్రి కన్నబాబు ద్వారా చిరంజీవి అడిగిస్తే.. జగన్ అంగీకరించారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు చిరంజీవి మర్యాదపూర్వకంగా జగన్ ని కలిసి, కృతఙ్ఞతలు తెలిపి, సైరా వీక్షించాల్సిందిగా కోరనున్నారని సమాచారం.

మద్దతు ఉపసంహరించుకుంటాం... కేసీఆర్ కి సీపీఐ వార్నింగ్

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్‌కు సీపీఐ వార్నింగ్ ఇచ్చింది. టీఆర్ఎస్‌కి మద్దతు ఉపసంహరించుకోవాలని కార్మికులు డిమాండ్ చేయడంతో ... హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌కు మద్దతుపై పునరాలోచిస్తామని సీపీఐ ప్రకటించింది. ఆర్టీసీ కార్మిక జేఏసీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న చాడ వెంకట్‌ రెడ్డి... ఆర్టీసీ కార్మికులకు సీపీఐ అండగా ఉంటుందని ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నికపై పడే అవకాశం కనిపిస్తోంది. ఉత్తమ్ కు షాకిచ్చి, ఎలాగైనాసరే హుజూర్ నగర్ లో గులాబీ జెండా పాతాలని కంకణం కట్టుకున్న టీఆర్ఎస్ ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే సీపీఐ మద్దతు తీసుకుంది. సీపీఐ కూడా అధికార పార్టీ అడిగేసరికి ఓకే చెప్పింది. అయితే, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో... టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచిస్తామంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటన చేశారు. అసలే, హుజూర్ నగర్ లో పార్టీ పరిస్థితి బాగాలేదని సర్వేలు చెబుతున్నాయి. మండలాలు, గ్రామాలు, వార్డులు వారీగా నేతలను రంగంలోకి దింపి ప్రజలను కలుస్తున్నా, గెలుపు అవకాశాల్లేవని కేసీఆర్ సర్వేల్లోనూ, ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ లోనూ తేలింది. ఇక, ఇప్పుడు ఒకవైపు ఆర్టీసీ సమ్మె ప్రభావం... మరోవైపు అంతోఇంతో బలమున్న సీపీఐ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ హెచ్చరించడంతో, టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. మరి సీపీఐ హెచ్చరికపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కేసు... తాత్కాలిక సిబ్బందికి పువ్వాడ వార్నింగ్

సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తుంటే.... ప్రభుత్వం మాత్రం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 55శాతం బస్సులను నడిపినట్లు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్‌... ఆ సంఖ్యను వందశాతానికి పెంచుతామన్నారు. డీఎస్పీ ఇన్‌‌‌ఛార్జ్‌గా ప్రతి డిపోలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటుచేసి బస్సులను నడుపుతామని పువ్వాడ తెలిపారు. ప్రతి బస్సులోనూ పాసులను కచ్చితంగా అనుమంతించాల్సిందేనన్న మంత్రి పువ్వాడ.... టికెట్ ధర కంటే అధికంగా వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాత్కాలిక సిబ్బందిని హెచ్చరించారు. ప్రతి బస్సులోనూ టికెట్ ధరల పట్టిక పెడతామని, అందులో ఉన్న ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా తాత్కాలిక సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికులు కూడా టికెట్ ధర కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని పువ్వాడ సూచించారు. కంట్రోల్ రూమ్ నెంబర్లను ప్రతి బస్సులోనూ పెడతామని, ఎవరైనా ఎక్కువ డబ్బులు అడిగితే, ఫిర్యాదు చేయ్యొచ్చని తెలిపారు. ఇక, దసరా పండగ కోసం సొంతూళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా... అవసరమైన మేర బస్సులను నడుపుతామని పువ్వాడ తెలిపారు. 14నుంచి స్కూల్స్ రీఓపెన్ కానున్న నేపథ్యంలో... అన్ని డిపోల నుంచి షెడ్యూల్ ప్రకారం అన్ని సర్వీసులను యథావిధిగా నడుపుతామన్నారు. ప్రస్తుతం 5వేలకు పైగా బస్సులను నడుస్తున్నాయన్న మంత్రి పువ్వాడ అజయ్.... ఇవాళ్టి నుంచి మొత్తం బస్సులను రోడ్లపైకి తీసుకొస్తామన్నారు. అయితే, 50శాతానికి పైగా బస్సులను నడుపుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా, రోడ్లపై మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాట్లు అరకొరగా ఉండటంతో... ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా పండగ కోసం సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు... తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ రైళ్లను ఆశ్రయిస్తుండటంతో... ట్రైన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

రివర్స్ టెండరింగ్‌లో మరో ట్విస్ట్... ఇసుకపై జేసీలకు అధికారం

పాలనలో పారదర్శకత చూపుతున్న ఏపీ సీఎం జగన్ మరో ముందుడుగు వేశారు. రివర్స్ టెండరింగ్ పటిష్టంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. బిడ్డింగ్ లో పాల్గొన్న మొదటి 60 శాతం మందికే రివర్స్ టెండరింగ్ లో ఛాన్స్ కల్పించనున్నారు. అలాగే, పది లక్షలు నుంచి వంద కోట్ల టెండర్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. జనవరి ఒకటి నుంచి కొత్త విధానం అమలు చేయనున్నారు. విధాన రూపకల్పన, పారదర్శకత శాశ్వతంగా ఉండే విధంగా పాలసీ రూపొందిస్తున్నారు. ఇక జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ సంబంధిత కార్యకలాపాల సమన్వయం కోసం ఐఏఎస్ అధికారిని నియమించారు. మరోవైపు, ఇసుక కొరతపైనా జగన్ దృష్టిపెట్టారు. ఇసుక సరఫరాపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ‌్యంలో చర్యలు చేపట్టారు. నూతన విధానం సక్రమంగా అమలుతోపాటు ఇసుక కొరత లేకుండా చేసేందుకు జాయింట్ల కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇసుక తవ్వకాల నుంచి సరఫరా వరకు అన్నీ జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలని జగన్ ఉత్తర్వులు జారీ చేసింది.

నీకంటే చిన్నవాడు చేశాడు... నువ్వెందుకు చేయలేవు... కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన అఖిలపక్షం

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని మరోసారి ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టంచేశారు. సమ్మె చేస్తోంది... కార్మికుల స్వలాభం కోసం కాదన్న అశ్వద్ధామరెడ్డి .. ప్రజల కోసం, సంస్థ కోసమేనని అన్నారు. అరెస్టులు చేసినా, జైళ్లలో పెట్టినా, పోరాటం ఆగదన్నారు. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల సమ్మె అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కేసీఆర్‌పై నేతలు నిప్పులు చెరిగారు. పది రోజుల్లోగా సమస్యకు పరిష్కారం చూపాలంటూ డెడ్‌లైన్ విధించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే... 19న తెలంగాణ బంద్‌కి పిలుపునిస్తామని అఖిలపక్షం హెచ్చరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నిప్పులు చెరిగారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను తొలగించే హక్కు ఎవరికీ లేదన్న కోదండరాం... ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ కు భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, టీఆర్ ఎస్ ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కూడా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతుంటే... ఎలా సెల్ఫ్ డిస్మిస్ అవుతారంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. నీకంటే చిన్నవాడైన ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి.... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే... నువ్వెందుకు చేయవంటూ కేసీఆర్‌ను చాడ వెంకట్ రెడ్డి నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లనే అడిగారని, గొంతెమ్మ కోర్కెలు కోరలేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేస్తే... ఇక్కడ కేసీఆర్ ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. దసరా పండక్కి కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా కేసీఆర్... ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ఉసురుపోసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి సర్కార్ మెట్టు దిగకపోవడం... కార్మికులు పట్టు వీడకపోవడంతో... ఆర్టీసీ సమ్మె... సకల జనుల పోరాటంగా మారుతోంది. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి రాజకీయ పార్టీలు, ఉద్యోగ ప్రజాసంఘాలు మద్దతు పలకడంతో ... సమ్మె రోజురోజుకీ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది.

కడప మాదిరిగా యురేనియం తవ్వకాలకు బలికాబోయిన ఆళ్లగడ్డ...

కర్నూ లు జిల్లా రైతుల కన్నుగప్పి పచ్చని పొలాలపై కాలకూటం విరజిమ్మే కుట్ర  జరుగుతోంది. గత నెలలో ఓ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు బోర్ల పేరుతో గుట్టుగా తవ్వకాలు జరిపారు. యురేనియం కోసమేనని రైతు లు పసిగట్టి వ్యతిరేకించే వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండగా నిలిచింది. దీంతో యురేనియం డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి.' సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపైన్ తో అఖిలప్రియ ప్రభుత్వం పై మరింత ఒత్తి డి తెచ్చారు. కడపులో మాదిరిగా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరపనున్నామని అఖిల పక్షం నేతలు తేల్చి చెప్పారు.నల్లమల్ల ప్రకృతి అందాలు పచ్చని పైర్లు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు శిల్ప సంపదకు ఆళ్లగడ్డ నిలయం. అలాంటి ఆళ్లగడ్డ ను సర్వనాశనం చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ పొలిమేరల్లో ఓ కాంట్రాక్టు సంస్థ అడుగుపెట్టింది. గలగల పారే వాగుల పచ్చని పొలాల మధ్య యంత్రాలనూ దింపింది. సంస్థ ప్రతి నిధులు యంత్రా లతో బోర్లు వేస్తునట్టు నటించి యురేనియం తవ్వకాల సర్వే పనులు మొదలు పెట్టారు. ఆరు వందల అడుగుల లోతు వరకు యురేనియం కోసం అన్వేషణ సాగించారు. బోర్లు వేస్తున్నామంటూ చుట్టు పక్కల రైతు లకు సంస్థ ప్రతి నిధులు చెప్పి బోల్తా కొట్టించారు. భూగర్భం లోంచి తీసి ల్యాబ్ కు పంపిన రాళ్ల ను చూసి రైతు లకు అనుమానం వచ్చింది.ఇప్పటికే కడప జిల్లా ప్రజల బతుకుల్లో యురేనియం విషం చిమ్ముతోంది. ఇంతలోనే మరో రాయలసీమ జిల్లా ను కూడా ఈ ముప్పు తాకనుందని రైతులు ఆందోళన చెందారు. సర్వే తవ్వకాల కు వ్యతిరేకంగా రైతు లు రోడ్డెక్కారు.మాజీ మంత్రి భూమా అఖిలప్రియ యురేనియం సర్వే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి వచ్చి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. యురేనియం సర్వే తవ్వకాల అనుమతులపై సంస్థ ప్రతి నిధులు రెవెన్యూ అధికారుల పొంతన లేని సమాధానమిచ్చారు. రైతుల పర్మిషన్ లేకుండా సర్వే తవ్వకాలు ఎలా జరుపుతారని భూమా అఖిలప్రియ సంస్థ ప్రతి నిధులను నిలదీశారు. దీంతో కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు యురేనియం సర్వే తవ్వకాల పనులు తాత్కాలికం గా నిలిపివేశారు. సర్వే పనులకు అనుమతి ఇవ్వా లని ఆళ్లగడ్డ తహసీల్దార్ కు లేఖ పంపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో దాదాపు ఇరవై గ్రామాల్లో పదిహే ను చోట్ల మళ్లీ యురేనియం సర్వే పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం యురేనియం సర్వే పనులు ఆపెయ్యాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ ను కాపాడేందుకు 'సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపెయిన్ ను ఉధృతం చేశారు.సంస్థ ప్రతి నిధులు డ్రిల్లింగ్ పనులు చేసే యంత్రాలను అక్కడి నుంచి తీసుకెళ్లారు .ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి యురేనియం తవ్వకాల సర్వేపై స్పందించారు. యురేనియం తవ్వకాలకు తాము వ్యతిరేకమన్నారు. రెండు వేల పధ్ధెనిమిది లో చంద్రబాబు యురేనియం తవ్వకాల కు అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణల యురేనియం తవ్వకాల ను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని విపక్షా లు ప్రయత్నిస్తున్నాయి. యురేనియం తవ్వకాల కు వ్యతిరేకం గా అఖిల పక్ష బృందం కడప జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రాంతాల్లో పర్యటించింది.ఆళ్లగడ్డ లో అఖిల పక్ష సమావేశం లో పాల్గొన్నారు. రాయలసీమ లో యురేనియం తవ్వకాల పై అఖిల పక్ష నేతలు ముక్త కంఠంతో వ్యతిరే కించారు. పులివెందుల ప్రజలు నరకం చూస్తున్న పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కడప జిల్లా మాదిరి గా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరగనివ్వమని హెచ్చరించారు. యురేనియం తవ్వకాల పై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ కడప జిల్లా లో యురేనియం బాధిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. యురేనియం తవ్వకాలు జరపకముందే మేల్కొన్న ఆళ్లగడ్డ ప్రజల ను రామకృష్ణ అభినందించారు. యురేనియం సర్వే తవ్వకాల వల్ల తమ భూముల రేట్లు పడిపోతున్నాయి అని ఆళ్లగడ్డ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కుట్ర లు చేసినా సర్వే పనులను అడ్డు కుంటామన్నారు. రైతు లు ప్రజా సంఘాలు అన్ని విపక్ష పార్టీ లు ఏకం కావడం తో జగన్ సర్కార్ కు యురేనియం సెగ తగిలింది ఇక జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

విషజ్వరాల పేరుతో ప్రైవేటు ఆసుపత్రిలో మొదలవుతున్న కొత్త దందా...

అమ్మో జ్వరాలు అనేలా చేశాయి ఈ సీజన్ లో వచ్చిన విష జ్వరలు.నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో విషజ్వరాలను ఆసరాగా చేసుకుని భారీ దందాకు తెరలేపాయి. సాధారణంగా వచ్చే విష జ్వరాలను డెంగీ గా చూపుతో ప్లేట్ లెట్స్ పేరుతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు కొందరు  ప్రైవేటు ఆసుపత్రి అధికారులు. అవసరమున్నా లేకున్నా టెస్టుల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేయడమే కాక పేదల జేబుల ను గుల్ల చేస్తున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా వ్యాపిస్తున్న విషజ్వరాల ప్రైవేటు ఆసుపత్రు లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా విజృంభిస్తున్న విష జ్వరాలు దందాకు భారీ ఊతమిస్తున్నాయి. పారిశుధ్య లోపంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ను సరిగ్గా పాటించకపోవడం తో దోమలు విపరీతం గా వ్యాపిస్తున్నాయి. ఈ దోమకాటు వల్లనే ఈ సీజన్ లో నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది విషజ్వరాల బారిన పడుతున్నారు. మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ తో పాటు ప్రమాదకరమైన డెంగీ జ్వరాల కూడా ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లా లో ఇప్పటి వరకు యాభై ఆరు డెంగ్యూ కేసులు ఇరవై ఐదు చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. వీరి దృష్టికి రాకుండా ఉన్న వారి సంఖ్య భారీగానే ఉంటుందని అంచనాలు వెల్లువడుతున్నాయి. పలుచోట్ల డెంగీ మరణాలు కూడా సంభవించాయి అయితే వీటిని ప్రభుత్వ లెక్కల్లో డెంగీగా నమోదు చేయడానికి అధికారు లు నిరాకరిస్తున్నారు.జ్వరాల బారిన పడిన ప్రజల్లో కొందరు ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతుండగా వ్యాధి తీవ్రత ను బట్టి ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే ప్రైవేటు ఆసుపత్రులకు అదునుగా మారుతోంది. ఒక పేషెంట్ తమ ఆసుపత్రి వచ్చాడంటే అతన్ని ఎలా పీల్చి పిప్పి చేయాలన్నా ముందస్తు ప్లాన్ చేసి ఆ ప్రకారంగా వైద్యం దశల వారీగా అందిస్తున్నారు. దీంతో పేషెంట్ కు ఖర్చు తడిసి మోపెడవుతుంది. ముందుగా ప్రైవేటు ఆసుపత్రి కి వెళ్లిన పేషెంట్ లకు టెస్టుల్ లోనే అసలు పరీక్ష మొదలవుతుంది. గతంలో గుర్తింపు పొందిన ల్యాబ్స్ లో పరీక్ష లు నిర్వహిం చేవారు. కానీ ఇటీవల కొత్త గా ప్రైవేటు ఆసుపత్రుల్లో ల్యాబ్స్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు అందులో అర్హులైన టెక్నీషియన్స్ లేక పోయినా వైద్యుల పర్యవేక్షణ లో టెస్టుల రిజల్ట్స్ ఇస్తున్నారు. తమ ట్రీట్మెంట్ అమౌంట్ టార్గెట్ గా తప్పుడు రిపోర్టు లు రోగులకిస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని రోగులను భయబ్రాంతులకు గురి చేస్తూ తదుపరి చికిత్స లు చేస్తున్నారు. అవసరం లేని ట్రీట్మెంట్ చేస్తూ అత్యవసర చికిత్స పేరుతో ఐసీయూ లో పెట్టి అదనపు డబ్బు వసూలు చేస్తూ రకరకాల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణ జ్వరం తో ఆసుపత్రి లో అడ్మిట్ అయితే కనీసం ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజును గుంజుతున్న ఆసుపత్రుల నల్లగొండ లో భారీగా పెరిగిపోయాయి.ఇక డెంగీ అనగానే ప్లేట్ లెట్స్ పేరుతో కొత్త తరహా దందాకు తెరలేపుతున్నారు. ఒక రోగికి సాధారణం గా ఒకటిన్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ప్లేట్ లెట్స్ ఉంటే సాధారణ స్థాయి లో ఉన్నట్టు లెక్క. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ని ల్యాబ్స్ లో రోగికి కావలసిన ప్లేట్ లెట్ కౌంట్ తక్కువ చూపుతూ అత్యవసర స్థితిని కృత్రిమం గా కల్పిస్తున్నారు. ప్లేట్ లెట్స్ పడిపోతే ప్రాణానికే ప్రమాదం అంటూ రోగిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఐసీయూ చికిత్స అందిస్తున్నారు. రోజు కు పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్లేట్ లెట్స్ ఎక్కించాలంటూ ఒక ప్యాకెట్ కు పదిహే ను వేల నుంచి ఇరవై వేల వరకు మరో రూపంలో వసూలు చేస్తున్నారు. కనీసం వారం రోజులు ఆసుపత్రి లో వుంచుకుని డబ్బు లు పిండేస్తున్నారు ఇలాంటి ఘటనే నల్లగొండ పట్టణం లోని డాక్టర్స్ కాలనీ లో చోటుచేసుకుంది.పట్టణాని కి చెందిన రూపక్ కుమార్ అనే వ్యక్తి సాయి శ్రీనివాస్ ఆసుపత్రుల్లో జ్వరం పేరుతో అడ్మిట్ కాగా ఆసుపత్రి ల్యాబ్ లో ప్లేట్ లెట్ కౌంట్ చాలా తక్కువ చూపారు. అనుమానం వచ్చిన రోగి బంధువు లు బయట మరో ల్యాబ్ లు చేపిస్తే సాధారణం గా ఉండాల్సిన కౌంట్ ఉంది దీంతో వీరు డీఎంఅండ్ హెచ్ వోకు ఫిర్యాదు చేశారు రంగం లోకి దిగిన డీఎంఅండ్ హెచ్ వో ఏ కొండలరావు సాయి శ్రీనివాస్ ఆసుపత్రి ని తనిఖీ చేస్తే అసలు బండారం బయటపడింది. ఆ ల్యాబ్ కు అనుమతి లేదని అందులో ఉన్న టెక్నీషియన్ కు అర్హత లేదని తేల్చి ల్యాబ్ ను సీజ్ చేశారు. ఇదే సందర్భం గా మరి కొన్ని ల్యాబ్స్ ను తనిఖీ చేయగా సాయితేజ డయాగ్నిస్టిక్ సెంటర్ లు కూడా ల్యాబ్ లు తప్పుడు నివేదిక ఇచ్చారని సీజ్ చేశారు. అధికారుల తనిఖీ ల విషయం తెలిసిన మరి కొన్ని ల్యాబ్స్ నిర్వహకులు వాటిని మూసి వేసి బయటకు వెళ్లిపోయారు. వాస్తవం గా డెంగీ నిర్ధారణ పరీక్ష అనేది జిల్లా లో ఎక్కడా ప్రైవేటు ఆసుపత్రుల్లో లేవని డీఎంఅండ్ హెచ్ వో కొండలరావు స్పష్టం చేస్తున్నారు. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని అనవసరంగా సామాన్య ప్రజల ను దోచుకోవద్దు అని చెబుతున్నారు. ఇక జిల్లా లోని ప్రైవేట్ ఆసుపత్రు లు ల్యాబ్ లు పోయినా తమ దాడులు కొనసాగుతాయని డీఎంఅండ్ హెచ్ వో కొండలరావు హెచ్చరిస్తున్నారు.డెంగీ కి భయపడాల్సిన పని లేదని తగ్గు ముఖం పట్టే జ్వరమే ఉంటుంద ని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. చికిత్స తీసుకోవడం లో నిర్లక్ష్యం ఉంటే కానీ లేదంటే శారీరకంగా నీరసంగా ఉంటే తప్ప ప్రాణాపాయం ఉండదని ప్రభుత్వ వైద్యు లు చెబుతున్నారు. విషజ్వరాలు వచ్చినపుడు సాధారణంగా ప్లేట్ లెట్స్ తగ్గిపోతుంటాయని మళ్లీ సాధారణ వైద్యం తోనే వాటంతట అవే పెరుగుతూ వస్తాయంటున్నారు వైద్యనిపుణులు.

ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ భేటీ...

ఏపీ ప్రభుత్వం మరి కాసేపట్లో హోం మంత్రితో చర్చలు జరపనున్నారు. .ఏపీ తెలంగాణ రాష్ట్రాల విభజన అంశాల పై కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాలతో ఈ సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరవుతారు. విభజన చట్టం లోని తొమ్మిది, పది షెడ్యూళ్లలో ప్రస్తావించిన ప్రభుత్వ సంస్థలూ ఆస్తులు, ఉద్యోగుల విభజన పై సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియ ఇంకా తీసుకోవాల్సిన చర్యల గురించి రెండు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇప్పటికే అపరిష్కృతంగా ఉన్న అంశాల  మీదనే ప్రధానంగా ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రట్రీలు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో చర్చిస్తున్నారు.   ఇప్పటికీ షడ్యూల్ తొమ్మిది, పది ఆ రేండు ఇన్స్ ట్యూషన్స్లో పొందుపరచిన , సంస్థల విభజన, ఆస్తుల విభజన, ఆ సంస్థల ఉద్యోగుల విభజన కూడా కొలిక్కి రావాల్సింది. దానితో పాటు  రాష్ట్రం వెలుపల కలిగినా ఉమ్మడి ఆస్తుల పంపకాలు కూడా జరగాల్సి ఉంది. అందులో  ఢిల్లిలో  ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భవనం కూడా ఒకటి. ఇలాంటివి ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాల మీద  ఈ సమావేశం చర్చ జరగనున్నది. ఈ  సమస్యలకు సానుకూల పరిష్కారంమే ఈ సమావేశ ముఖ్య ఉద్దశమని చెప్పుకోవచ్చు.  గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య లేకపోవడం కారణంగా కొన్ని అంశాల్లో ఒక ఏకాభిప్రాయం రాలేదు కానీ ఇప్పుడు పలు పర్యాయాలు కూర్చుని సమావేశాలల్లో అనేక విషయాల్లో ఏకాభిప్రాయానికి వచ్చారు.ఇరు రాష్ట్రాల మంత్రులు ఈ సమావేశంలో భాగంగా ఇప్పుడు చీఫ్ సెక్రటరీలు కేంద్ర హోం శాఖ దగ్గర కూర్చుని ఎలా పంచుకోవాలి, ఎలా ఏ విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది.కేంద్ర హోంశాఖ చెప్పడం ద్వారా ఈ ఆస్తుల పంపకాలు కానీ ఉద్యోగుల పంపకాలు కానీ ఆ  విభజన చట్టం లో పొందు పరిచిన వాయుదా పడ్ద అంశాల్ని కూడా వీలైనంత త్వరగా పరీష్కరించుకోవాలనే  ఉద్దేశం తో ఈ సెక్రటరీల సమావేశం జరుగుతుంది.  ఇప్పటికైన ఈ సమావేశంతో ఆ వాయిదాకేసులు ఓ కొలిక్కి వస్తాయో లేదో వేచి చూడాలి.

వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ జరుగునా లేదా?

వాల్తేరు డివిజన్ కోసం విశాఖలో పోరాటాలు ఉధృతం అవుతున్నాయి. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ డివిజన్ ను రద్దు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోన్ ప్రకటించినప్పట్నుంచి అసంతృప్తి కనిపిస్తోంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వాల్తేరు డివిజన్ పునరుద్దరణ కోసం ఉద్యమ బాట పట్టాయి.ఎన్నికల ముందు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించిన ఆంధ్ర ప్రజలు సంతోషంగా లేరు. అందులోనూ ఉత్తరాంధ్ర వాసులైతే తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. అందుకు ప్రధాన కారణం ఎంతో చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ లేకుండా జోన్ ప్రకటించటమే.వాల్తేరు డివిజన్ ను పునరుద్దరించాలని జోన్ ప్రకటించినప్పట్నుంచి డిమాండ్ లు ఎక్కువయ్యాయి. దీనిని గమనించిన కొన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ కోసం తరచూ రౌండ్ టేబుల్ సమావేశాలు ధర్నాలు చేస్తూ ప్రజాభిష్టం మేరకు పోరాటాలు చేస్తున్నాయి. తాము నిర్వహించే సమావేశాలకు పలు రాజకీయ పార్టీలను మేధావులను ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నాయి. వారి సలహాలు సూచనలు తీసుకుని పోరాటాలను ఉధృతం చేస్తున్నాయి. వాల్తేరు డివిజన్ ను కొనసాగించాలని సీఐటీయూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో మిగిలిన రాజకీయ పార్టీ లలో కదలిక ఏర్పడింది. ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటును గౌరవించకపోతే తాము వెనకబడిపోతామేమోనని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో రేపో మాపో ప్రధాన పార్టీలు కూడా ఉద్యమంలోకి వచ్చే అవకాశముంది. వాల్తేరు డివిజన్ లేకుండా ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వడం ప్రజలనూ వంచించడమేనని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ రావు విమర్శించారు.చిత్రమేంటంటే ప్రత్యేక రైల్వే జోన్ కావాలని వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చెయ్యాలని గతంలో ఆందోళన చేసిన టిడిపి, వైసిపి ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. బిజెపి నేతలు మాత్రం ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చారు కదా వాల్తేరు డివిజన్ లేకపోతే ఏమవుతుంది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కానీ వామపక్షా లు, ప్రజా సంఘాలు, కళాకారుడు మాత్రం వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చెయ్యా లని బలంగా కోరుకుంటున్నారు.ప్రత్యేక రైల్వే జోన్ ఉత్తరాంధ్ర లో చిరకాల వాంఛ అని ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామ ని విభజన చట్టం లో కూడా చెప్పార ని నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆశతో వాల్తేరు డివిజన్ ను ఎత్తేసి రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటించిందని విమర్శిస్తున్నారు.భారతదేశ చరిత్ర లోనే డివిజన్ ఎత్తేసి జోన్ ఇచ్చే ఘటనే లేదని గుర్తు చేస్తున్నారు. ప్రజల మనోభావాలను గుర్తించి వాల్తేరు డివిజన్ ను పునరుద్ధరణ చెయ్యాలని విశాఖ నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.ఇంతకు వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచంలో అధిక అప్పులు చేసిన దేశంగా పాక్...

పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అందినచోటల్లా అప్పు లు చేస్తున్నారు. ఆర్ధిక సాయం కోసం ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుండగానే అక్కడి పరిస్థితి ని తేటతెల్లం చేస్తూ తాజాగా కొన్ని నివేదికల వెలుగు లోకొచ్చాయి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది లోనే ఇమ్రాన్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల తొమ్మిది బిలియన్ల పాకిస్థానీ రూపాయల మేర అప్పు లు చేసింది. దీంతో అత్యధిక అప్పు లు చేసిన ప్రభుత్వంగా పాకిస్తాన్ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది.ఈ మేరకు స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్థాన్ ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయానికి రుణాల వివరాలు పంపింది. ఈ డేటా ప్రకారం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారం లోకొచ్చిన ఏడాది లోపే దాదాపు ఏడు లక్షల కోట్లు రుణంగా తీసుకున్నారు.రెండు వేల పధ్ధెనిమిది ఆగస్టు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు వరకు విదేశీ వనరుల ద్వారా రెండు లక్షల ఎనభై వేల నాలుగు వందల కోట్లు అప్పు గా పొందింది.మరో నాలుగు లక్షల డెబ్బై వేల ఐదు వందల కోట్లు స్వదేశీ వనరుల ద్వారా తీసుకుంది. ఇంతకు ముందు పాకిస్థాన్ లోని ఏ ప్రభుత్వమూ ఏడాదిలోపు అంత రుణం తీసుకున్నది లేదు. ప్రస్తుతం ప్రభుత్వ రుణం ముప్పై రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లకు చేరుకుంది.ఇమ్రాన్ అధికారంలోకి రాక ముందు పాకిస్థాన్ ఇరవై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల కోట్ల అప్పు ఉండేది. ప్రస్తుతం తొలి ఆర్థిక త్రైమాసాని కి పాకిస్తాన్ ఒక లక్ష కోట్ల మేర పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తొంభై ఆరు వేల కోట్లు వసూలు చేయగలిగింది. దీనికి అదనంగా మరో ఐదేళ్ళలో నలభై ఏడు శాతం పాకిస్థాన్ అప్పుల పెరగనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.సౌదీ అరేబియా, చైనా లాంటి దేశాలు పాకిస్థాన్ కు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ దాయాది దేశ ఆర్థిక వ్యవస్థ గాడి లో పడలేదు. ఈ ఏడాది జూన్ లో ఖతార్ నుంచి పాకిస్థాన్ మూడు ట్రిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజ్ అందుకుంది. గత పదకొండు నెలలు పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ముందుకొచ్చిన గల్ఫ్ దేశాల్లో ఖతార్ నాలుగోది. అంతకుముందు యూఏఈ కూడా రెండు ట్రిలియన్ డాలర్ల మేర సొమ్ములు సమకూర్చింది. మరోవైపు తమ ఆర్థిక వ్యవస్థల సంక్షోభాన్ని మంచి గాడిలో పెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఆరు బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద ప్రాథమిక ఒప్పందం చేసుకుంది. ఇలా పాక్ ప్రధాని పాక్ దేశాన్ని ఇంత అప్పుల పాలు చేయడం చూసి జనాలు నివ్వెరపోతున్నారు.

ఆర్టీసీ సమ్మెతో స్కూల్‌లకు మరో 2 రోజులు సెలవులను పొడిగించే ప్రయత్నంలో ఉన్న టీఎస్ ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ ఉండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను విస్తృతం చేస్తోంది. పండగలకు ఊరు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది టీఎస్ ప్రభుత్వం. అవసరమైతే విద్యాసంస్థల బస్సులను ప్రైవేట్ వాహనాలుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం అవసరమైతే దసరా సెలవులను రెండ్రోజులు పొడగించాలని కూడా యోచిస్తోంది. రానున్న రెండు మూడు రోజుల్లో కోటిన్నర మంది ప్రయాణించే అవకాశముంది కావున తాము ప్రయాణికులు కొరకు  ప్రత్యామ్నాయ  మార్గాలకు నాంది పలుకుతున్నట్లు తెలియజేస్తున్నారు టీఎస్ అధికారులు.  మరోపక్క సమ్మెపై వెనక్కి తగ్గబోమని జేఏసీ తాజా పరిణామాలపై చర్చించేందుకు సోమాజిగుడా ప్రెస్ క్లబ్ లో సమావేశమైంది. రాజకీయ పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు దీనికి హాజరయ్యారు.ఆర్టీసీ సమ్మె కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అవసరమైతే తెలంగాణ బంద్ కు పిలిపిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. దసరా సెలవు లను మరో రెండు రోజుల పాటు పొడిగించే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పండగ అయిపోవడంతో చాలా మంది ప్రయాణికులు తిరిగి సొంతూళ్ల కు పయనమవుతారు. ఈ నేపధ్యంలో బస్సుల కొరత ఉన్నందువలన  అవసరమైతే విద్యా సంస్థ లకు చెందిన బస్సులు ను వినియోగించుకునేందుకు వీలుగా రెండ్రోజుల పాటు సెలవుల్లో పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దాదాపు  ఎన్ని బస్సులను సిద్ధం చేయబోతున్నారు మరియు రెండ్రోజుల సెలవలను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్న నేపధ్యంలో ఇటు ప్రైవేట్ స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సుల వాడకం వల్ల ప్రయాణీకుల కష్టాల్లో కొంత మెరకు ఊరట కనిపిస్తుందా అనే అంశం పై పలు అనమానాలు వెల్లడవుతున్నాయి. ప్రభుత్వం ఈ సమ్మే పై చాలా కోపంగా ఉన్నట్లు తెలియజేస్తోంది.ఎట్టి పరిస్థితిలో తాము తమ నిర్ణయాన్ని వెనక్కు తగ్గేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశం పై ప్రభుత్వం ఎన్ని  ప్రత్యామ్నాయ మార్గాలని అయిన ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడానికి  సిద్ధంగా ఉన్నట్లు వెల్లడవుతోంది. ఈ సమ్మే పోరులో ఎవరు విజయం చేపడతారనేది చర్చనీయాంశంగా మారింది.

కేంద్రం మరో సంచలన నిర్ణయం!!

  1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి వలస వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన 5,300 కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పరిహారాన్ని ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద అందజేయనున్నారు. తాజాగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పీవోకే నుంచి వలస వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన  5,300 కుటుంబాలకు రూ.5.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. నిరాశ్రయులైన కుటుంబాలకు ఈ నిర్ణయంతో న్యాయం జరుగుతుంది.’’ అని పేర్కొన్నారు.