అయోధ్య వివాదానికి ముగింపు... నవంబర్ 17లోపు తుది తీర్పు

దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టులో తుది వాదనలు ముగిశాయి. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని... నిర్మోహి అఖాడ, రాంలాల్‌ విరాజ్‌మని‌, సున్నీ వక్ఫ్‌ బోర్డుకు సమానంగా పంచుతూ...  అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ... దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం విచారణ జరిపింది. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింది. 2019 ఆగస్ట్ 6నుంచి అక్టోబర్ 16వరకు మొత్తం 40రోజులపాటు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... తీర్పును రిజర్వు చేసింది. అయితే, చివరి రోజు సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఇరుపక్షాలు తమ వాదనలను బలంగా వినిపించాయి. హిందువుల నమ్మకం ప్రకారం ఇది రామజన్మభూమిగా కొనసాగుతోందని, అలాగే రామాలయానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని హిందూ వర్గమైన రాంలాలా విరాజ్‌మని తరపున న్యాయవాదులు వాదించారు. అనంతరం సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపించిన లాయర్లు... బాబర్ వచ్చి మసీదును నిర్మించాక... ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరిగేవని ధర్మాసనానికి విన్నవించారు. ఈ పిటిషన్లతోపాటు పలు వ్యక్తిగత, హిందూసభ, వీహెచ్‌పీ తదితర పిటిషన్లపైనా వాదనలు జరిగాయి. అయితే, వాదనలు వినిపించేందుకు బుధవారం సాయంత్రం 5గంటల వరకు గడువిచ్చిన సీజేఐ.... గంట ముందే విచారణ పూర్తయినట్లు ప్రకటించారు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మూడ్రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు. అయితే, వాదనల సందర్భంగా సుప్రీంలో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణలో భాగంగా సీజేఐతో ఇటు హిందూ, అటు ముస్లిం తరపు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. హిందూ మహాసభ తరపు లాయర్... ధర్మాసనం ముందుంచిన... అయోధ్య రీవిజిటెడ్ పుస్తకాన్ని ముస్లింల తరపు లాయర్ చించేయడంతో.... రగడ జరిగింది. దాంతో సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాగైతే విచారణను మధ‌్యలోనే నిలిపివేస్తానని హెచ్చరించారు. సుప్రీంకోర్టు చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన కేసుల్లో ఇది రెండోది. 1972లో ప్రాథమిక హక్కులపై దాఖలైన పిటిషన్‌పై 68రోజులపాటు విచారణ జరగగా, 13మంది జడ్జిల ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆ తర్వాత ఆధార్‌ కేసుపై 38 రోజులపాటు విచారణ జరిగింది. అయితే, అయోధ‌్య కేసుపై 40రోజులపాటు విచారణ జరగడంతో... సుప్రీం చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సాగిన రెండో కేసుగా రికార్డులకెక్కింది. మొత్తానికి వివాదాస్పద అయోధ్య భూమిపై వాదనలు ముగియడంతో... తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే, నెలరోజుల్లోపే తీర్పును వెలువరిస్తానని సీజేఐ ప్రకటించడం... అలాగే రంజన్ గొగోయ్... నవంబర్ 17న పదవీ విరమణ చేయనుండటంతో... ఆలోపే... తీర్పు వెలువరించనున్నారు.

పోలవరంపై మేఘా ఐటీ రైడ్స్ ఎఫెక్ట్... ఈడీ కూడా ఎంటరైతే పరిస్థితేంటి?

మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై పెద్దఎత్తున ఐటీ దాడులు జరగడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు అకస్మాత్తుగా వచ్చి నాలుగైదు రోజులపాటు మేఘా కార్యాలయాల్లోనూ, మేఘా ఫ్యామిలీ నివాసాల్లోనూ రోజుల తరబడి సోదాలు చేయడం సాదాసీదా విషయం కాదంటున్నారు. పైగా ఐటీ దాడుల సమయంలో కేంద్ర బలగాలను వినియోగించడం చూస్తుంటే మేఘా చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలంటున్నారు. మేఘాలో ఐటీ దాడులు సాధారణంగా కనిపించడం లేదని, కనీసం హైదరాబాద్ లోని ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా... ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి తనిఖీలు చేయడమంటే ఎఫెక్ట్ భారీగా ఉండొచ్చని కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఐటీ దాడుల్లో దొరికిన పత్రాలు, ఆధారాలపై అనేక రకాల వదంతులు బయటికొచ్చినా అధికారుల నుంచి మాత్రం అధికారిక సమాచారం రాలేదు. అయితే, మేఘా కృష్ణారెడ్డికి... తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో మేఘా కంపెనీ చేపడుతోన్న ప్రాజెక్టులపైనా ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ లో సింగిల్ బిడ్డర్ గా నిలిచి మేఘా కంపెనీ పోలవరం కాంట్రాక్టును దక్కించుకోవడంతో... ఆ ప్రాజెక్టు భవిష్యత్ ఏంటనే చర్చ జరుగుతోంది. మేఘా కంపెనీపై కేవలం ఐటీ దాడులతోనే ఆగదని, ఈడీ కూడా దృష్టిపెట్టే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈడీ కూడా మేఘాపై దృష్టిపెడితే పోలవరం ప్రాజెక్టు పనులు చిక్కుల్లోనే పడినట్లేనన్న టాక్ వినిపిస్తుంది. జగన్ ప్రభుత్వం... నవంబర్ నుంచి పోలవరం పనులు చేపడతామని చెబుతున్న నేపథ్యంలో.... ఒకవైపు మేఘాపై ఐటీ దాడులు... మరోవైపు కోర్టు కేసులు... అడ్డంకిగా మారడం ఖాయమంటున్నారు. మొత్తానికి మేఘాపై ఐటీ దాడుల ఎఫెక్ట్... కచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పనులపై పడటం ఖాయమంటున్నారు.

విజయానికి చేరువలో ఆపరేషన్ వశిష్ట.. బోటు నిజంగానే బయటకు రాబోతోందా?

  గోదావరి బోటు ఘటన జరిగి నెల రోజులు కావోస్తున్నా ఇప్పటికి బోటు బయటకు రాలేదు.నిన్న ఆపరేషన్ వశిష్ట మళ్ళీ ప్రారంభించిన సత్యం బృందం ఆపరేషన్ వశిష్ట పార్ట్ 2 విజయవంతమవుతున్నట్లే అనిపిస్తోంది. ధర్మాడి సత్యం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం కనిపిస్తుంది. గోదావరి వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో పెద్ద లంగర్ కు రాయల్ వశిష్ట బోటు తగిలింది. ప్రస్తుతం దాన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.  రాయల్ వశిష్ట బోటును కచ్చులూరు మంద వద్ద వెలికి తీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపుగా ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో పంట్లు సాయం తోటి కావాల్సినటువంటి ఐరన్ రోప్ లో నైలాన్ తాళ్ళు బలమైన లంగరుల తోటి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కచ్చులూరుకు సత్యం బృందం చేరుకుంది. అక్కడకు చేరుకున్న తర్వాత మూడు నాటు పడవల్లో విడివిడి గా మూడు బృందా లు మూడు లంగర్లు చిన్న లంగర్ లు తీసుకుని బోటు మునిగిన ప్రాంతంలో  లంగరు వేస్తూ గాలించే ప్రయత్నం చేసింది సత్యం బృందం. అయితే కొద్ది సేపటి క్రితమే ఒక బరువైన వస్తువు లంగర్ కు చిక్కినట్లు సత్యం బృందం వెల్లడిస్తోంది.బోటును బయటకు లాగటానికి కావాల్సిన ఐరన్ రోపులను,నైలాన్ తాడుల సహయంతో,పంటు సహయంతో లంగర్ కు తగిలిన బలమైన వస్తువును ఎట్టి పరిస్థితిలో బయటకు తీసేందుకు ఇరవై ఐదు మంది ఉన్న బృందంతో సిద్ధమైయ్యింది.ఎట్టి పరిస్థితిలో ఈ రోజు బోటును బయటకు తెచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.ఈ రోజు ఐనా బోటుకు ఏ ఆటంకాలు లేకుండా బయటకు వస్తోందో లేదో వేచి చూడాలి.

రాష్ట్ర విభజన తర్వాత శిక్షణ పూర్తి చేసుకున్న తొలి డీఎస్పీల టీమ్...

  పోలీసులకు వారాంతంలో సెలవులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు ఏపీ హోంమత్రి సుచరిత. డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలను అరికట్టాలని సూచించారు. మంగళగిరి ఆరవ పోలీస్ బెటాలియన్ లో ఇవాళ డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత శిక్షణ పూర్తి చేసుకున్న తొలి డీఎస్పీల టీమ్ ఇదే. ఈ టీమ్ లోని మొత్తం ఇరవై ఐదు మంది డీఎస్పీలలో పదకొండు మంది మహిళలు ఉన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీల నుంచి హోంమంత్రి సుచరిత గౌరవ వందనం స్వీకరించారు. వృత్తిపరమైన సవాళ్లను అధిగమించి ప్రజాసేవ దిశగా ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు ఆమె. గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.  సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కొత్త డీఎస్పీలకు చెప్పారు డిజిపి సవాంగ్. విధి నిర్వహణలో అనేక సవాళ్లు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయని, వాటన్నింటిని విజయవంతంగా ఎదుర్కోవాలంటే ధైర్యం, సంకల్పం మరియు ఉన్నత విలువలతో వ్యవహరించవలసినటువంటి అవసరముంది అన్నారు. మన జనాభాలో డెబ్బై శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు అని, అందువలన గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలపై లోతైన అవగాహన మీరు కలిగి వుండవలసినటువంటి అవసరం ఉందని అందుకోసం విస్తృతంగా గ్రామాల్లో మీరు పర్యటించాలి అని, వారితో మమేకమవ్వాలి అని సూచించారు. 

ఆ జిల్లా టీడీపీ కార్యకర్తలకు అసలేమైంది?.. ఆశ్చర్యంలో ఉన్న చంద్రబాబు

  రాజకీయ ప్రస్థానంలో పద్నాలుగేళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండి, నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం సొంతం చేసుకున్న మన చంద్రబాబు ఇటీవల తెల్లవారుజాము వరకు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారట. వివరాళ్లోకి వెళ్తే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు చంద్రబాబు ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా సమీక్షలు అపాయింట్ మెంట్ లతో బిజీగా ఉండేవారు. కొత్త రాష్ట్రం కనుక కష్టపడాలని ధోరణిని చంద్రబాబు తన కార్యాచరణలో చూపించేవారు. అర్ధరాత్రి వరకు కూడా సమీక్షలు నిర్వహించిన సందర్భాలున్నాయి. ఈ హడావుడిలో పడి ఆయన టిడిపిని పూర్తిగా విస్మరించారని పార్టీ నేతలే చెబుతున్నారు. అప్పట్లో ఆయనను కలిసేందుకు కార్యకర్తలు వస్తే అపాయింట్ మెంట్ సులభంగా దొరికేది కాదట, చివరకు మంత్రులు కూడా గంటల తరబడి చంద్రబాబును కలవడం కోసం నిరీక్షించేవారు. ఆయన దర్శనం దొరకని వారు నిరాశతో వెనుదిరిగిన సందర్భాలు కూడా ఉండేవి. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరాజయం తర్వాత చంద్రబాబు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటున్నారు.  తాజాగా ఆయన జిల్లాల వారీగా పార్టీ సమీక్ష నిర్వహించడం ప్రారంభించారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలో ఆయన సమీక్షలు నిర్వహించారు. విశాఖలో రెండ్రోజుల పాటు సమీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా మొదటి రోజు పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని మధ్యాహ్నం వరకు నిర్వహించారు. సాయంత్రం నాలుగైదు నియోజక వర్గాల సమీక్షలు చేపట్టారు. అవి పూర్తయ్యేసరికి సమయం రాత్రి పది గంటలు అయింది. ఇంకా రెండు మూడు నియోజక వర్గాల సమీక్షలు మిగిలిపోయాయి. దీంతో చంద్రబాబు రేపు ఉదయం సమీక్ష నిర్వహిద్దాం అని చెప్పినప్పటికీ కార్యకర్తలు అంగీకరించలేదు. ఎంత టైమైనా సమీక్షలు పూర్తి చేయాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆయా నియోజక వర్గాల సమీక్షలు నిర్వహించారు చంద్రబాబు. పార్టీ అధినేత వైఖరి పట్ల కార్యకర్తలో వచ్చిన మార్పుకి ఇదొక నిదర్శనం అని చెప్పాలి.  విశాఖపట్టణం టిడిపి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. విమానాశ్రయానికి చంద్రబాబు విచ్చేసినప్పుడు ఆయన ప్రయాణించిన దారి పొడవునా కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. ఈ పరిణామం చంద్రబాబుని కూడా ఉత్సహపరిచింది. సాధారణంగా చంద్రబాబే తెల్లవారుజాము వరకు సమీక్ష నిర్వహిస్తూ ఉంటారు. గతంలో అలాంటి పరిస్థితి వస్తే కార్యకర్తలు నేతలు విసుక్కునేవారు. కాని ఈ సారి రివర్స్ లో కార్యకర్తలే ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. సమీక్షలు నిర్వహించాలని పట్టుబట్టడం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చ నీయాంశంగా మారింది. ఉదయం మళ్లీ పది గంటలకే సమీక్ష నిర్వహించాల్సి ఉండటంతో రాత్రి ఆలస్యమైతే ఇబ్బందులు ఎదురవుతాయని పార్టీ నేతలు కొందరు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయినా కార్యకర్తల మాత్రం వినిపించుకోలేదట. దీనికి తోడు ఒక నియోజక వర్గ సమీక్ష పూర్తయిన వెంటనే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు చంద్రబాబుతో సెల్ఫీల కోసం ఎగబడటంతో అనూహ్య జాప్యం జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి విశాఖ టూర్ అక్కడి కార్యకర్తల జోష్ తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్పష్టమవుతోంది.  

మున్సిపల్ కమిటీలను ప్రకటించేందుకు జంకుతున్న టీఆర్ఎస్...

  టీఆర్ఎస్ మున్సిపల్ కమిటీలను అధికారికంగా ప్రకటించకపోవడానికి ముందున్న మున్సిపల్ ఎన్నికలే అసలు కారణమని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. అనేక మంది పార్టీ పదవులను ఆశిస్తున్నారని ఇప్పుడు ఆ పదవులను ప్రకటిస్తే అసంతృప్తులు ఇతర పార్టీలో చేరే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఒకరికి పదవి ఇస్తే మరో తొమ్మిది మంది అసంతృప్తికి లోనయ్యే పరిస్థితి నెలకొందని అంతిమంగా అది మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. అందుకోసమే టీఆర్ఎస్ పెద్దలు పార్టీ మున్సిపల్ కమిటీలను ప్రకటించలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. మరి కొన్ని చోట్ల మెజారిటీ ఎమ్మెల్యేలు మున్సిపల్ కమిటీల కూర్పుని పూర్తి చేసి కూడా వాటిని ప్రకటించేందుకు జంకుతున్నారు. మునిసిపల్ వార్డులకు ఎవరెవరు బాధ్యులు అనేది నోటిమాటగా చెప్పడమే గానీ వారి పేర్లను మాత్రం అధికారికంగా ప్రకటించే సాహసం చేయడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా విలువైందని పదవులు రాని వారు ఆగ్రహిస్తే మొదటికే మోసం వస్తుందని అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆశావహులకు కౌన్సిలర్ టికెట్లు దక్కని వారికి పార్టీ పదవులు ఇచ్చేసి అందరినీ సర్దుబాటు చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన మున్సిపల్ ఎన్నికలయ్యేదాకా మెజారిటీ మునిసిపాలిటీల్లో టిఆర్ఎస్ కమిటీలను ప్రకటించే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి ఇబ్బడిముబ్బడిగా చేరిన నాయకులను సర్దుబాటు చేయటం గులాబీ పార్టీ నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారినట్టు కనిపిస్తోంది. మరి మున్ముందు ఈ సమస్య ఎలాంటి మలుపులు తీసుకుంటుందో దానికి ఎలాంటి పరిష్కారం తీసుకురాబోతోందో వేచి చూడాలి.

తెలంగాణలో మరోసారి ఎల్ఆర్ఎస్ అమలు చేయనున్న ప్రభుత్వం...

తెలంగాణలో మరోసారి ఎల్ఆర్ఎస్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి ముప్పై నాటికి ఉన్న స్థలాలకు క్రమబద్ధీకరణ అవసరం కల్పించారు. అయితే కొత్తగా ఏర్పడిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోనే ఈ అవకాశం కల్పిస్తోంది. దరఖాస్తులు చేసుకోవటానికి తొంభై రోజుల గడువు విధించింది. కొత్త మునిసిపాలిటీలు కార్పొరేషన్ ల పరిధిలో ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనధికార లేయవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి ముప్పైకి ముందు ఏర్పాటు చేసిన అనధికార లేయవుట్ లనే క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేసింది. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తులను డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ క్రమబద్ధీకరిస్తుంది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లు హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో ఉంటే, హెచ్.ఎం.డీ.ఏనే క్రమబద్ధీకరిస్తోందని వెల్లడించింది. మార్కెట్ విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ రుసుములు ఉంటాయి. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారిలో పార్కుల వంటి వాటికి స్థలాన్ని కేటాయించే అవకాశం లేకపోతే దరఖాస్తు దారుడు ఆ స్థలానికి సంబంధించిన రుసుములు కూడా కట్టాలి. దరఖాస్తులు ఆన్ లైన్ లోనే సమర్పించాలి, తొంభై రోజుల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కెట్ విలువలో పది శాతం లేదా పది పేర్ల లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని డీటీసీపీ లేదా హెచ్ఎండీఏ లేఖ జారీ చేసిన తదుపరి చెల్లించాలి. డబ్బు చెల్లించిన ఆరు నెలల్లోగా ఎల్ఆర్ఎస్ అనుమతి ఇస్తారు. తిరస్కరించిన వాటిని అప్పిలేట్ అథారిటీకీ దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు ఎల్ఆర్ఎస్ లో క్రమబద్ధీకరణ నుంచి కొన్నింటిని మినహాయించారు. నదులు, నాలాలు, చెరువుల పరిధి, చెరువులు, కుంటల, ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్ పరిధిలోని శిఖం భూముల్లో వెలిసిన లేయవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు. సహజ వాయువు చమురు పైప్ లైన్ ల పరిసరాల్లో ఉన్న భూములను కూడా క్రమబద్ధీకరించరు. నోటిఫై డెవలప్ మెంట్ ప్లాన్ లో పారిశ్రామిక ప్రాంతాలు రిక్రియేషనల్ యూజ్ జోన్, వాటర్ బాడీ, ఓపెన్ స్పేస్ కింద గుర్తించిన స్థలాలలోనూ క్రమబద్ధీకరణ జరగదు. క్రమబద్ధీకరణకు పద్నాలుగు, పది, రెండు వేల పంతొమ్మిదిన ఉన్న భూమి విలువను పరిగణనలోకి తీసుకుంటారు.

ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రభుత్వం...

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది, కార్పొరేషన్లు, బోర్డుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనుంది. స్థానిక సంస్ధల ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న సాంకేతిక అడ్డంకులను అధిగమించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. చేనేత కార్మిక కుటుంబాలకు ప్రకటించిన ఆర్థిక సాయానికి ఆమోదం తెలియజేసింది. మరోవైపు మత్స్యకారుల సంక్షేమం విషయంలో మరో నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది సర్కార్. ఇక డ్వాక్రా మహిళల కోసం వైఎస్సార్ క్రాంతి పథకాన్ని మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. వివాదంగా ఉన్న పోలవరం రాజధాని నిర్మాణం, పీపీఏల వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం పదిహేను అంశాలతో కూడిన అజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ ప్రారంభమైంది. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయటంతో పాటుగా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చేదిశలో కూడా ఈ కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కాబట్టి దీంట్లో భాగంగా చేనేత కార్మికులకు ఏటా ఇరవై నాలుగు వేల రూపాయలు ఆర్ధికసాయం ఇవ్వాలన్న అంశానికి  సంబంధించిన వ్యవహారాల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు విధి విధానాలు ఖరారు చేయనున్నారు. కాబట్టి ఈ పథకాన్ని డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నారు. అలాగే సంక్షేమ కార్పొరేషన్ ల ద్వారా వివిధ వర్గాలకు వాహనాల పంపిణీ, అంటే ఇసుక రవాణాకు సంబంధించి ఆరు వేల వాహనాలను సబ్సీడీ ద్వారా కార్పొరేషన్ ల సాయంతో లబ్ధి దారులకు అంధించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ వ్యవహారం మీద చర్చించటంతో పాటుగా ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ని ఏర్పాటుచేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో దానికి ఇవాళ క్యాబినేట్ ఆమోదం తెలపనుంది. మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో యాభై శాతం మేర ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒక కార్పొరేషన్ ని,వివిద అంశాలకు సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నారు. వాటర్ గ్రిడ్ కు సంబంధించి నలభై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లతో ఒక పథకాన్ని రూపొందించబోతున్నారు.

కష్టాల్లో ఎయిర్ ఇండియా.. మూకుమ్మడి రాజీనామాకు సిద్దమైన పైలెట్లు

  ఎయిరిండియా పీకల్లోతు సంక్షోభంలో మునిగింది. ఓ పక్క ఇంధన కస్టాలు వెంటాడుతుంటే మరోపక్క పైలెట్లు  సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. మూకుమ్మడి రాజీనామాలకు దిగారు, మొన్నటి జట్టు సంక్షోభం మరిచిపోకముందే ఎయిరిండియా క్రైసిస్ దేశీయ విమానయాన రంగంలో సంక్షోభానికి కారణం అవుతోంది.కష్టాల్లో ఎయిరిండియా ఉంది. మూకుమ్మడి రాజీనామాకు రెడీ అయిన పైలెట్లు, ఆర్ధిక సంక్షోభంలో ఎయిరిండియా.ఎయిర్ ఇండియా భారంగా ఎగురుతోంది. ఇప్పటికే ఓ పక్క ఇంధన కష్టాలు వెంటాడుతున్నాయి. మరోపక్క పైలెట్లు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు.వేతనాల పెంపు ప్రమోషన్లపై ప్రభుత్వ వైఖరే ఇందుకు కారణమంటున్నారు.  ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్ మూతతో కష్టాల్లో ఉన్న విమానయాన రంగానికి ఇప్పుడు ఎయిరిండియా సంక్షోభం తలనొప్పిగా మారింది .తమ డిమాండ్ల సాధన కోసం ఎయిర్ బస్ ఎ త్రీ ట్వంటీ పైలెట్లు నూట ఇరవై మంది ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే పైలెట్ల మూకుమ్మడి రాజీనామా వల్ల విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగదంటోంది ప్రభుత్వం. పైలెట్లు సరిపడా ఉన్నారంటోంది. మొన్నటికి మొన్న జెట్ ఎయిర్ వేస్ మూతపడగా తాజాగా ఎయిరిండియాను నష్టాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది .అయితే అరవై వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎయిరిండియా విక్రయాన్ని కచ్చితంగా పూర్తి చేయాలని భావిస్తోంది కేంద్రం.ఇందులో భాగంగా ఇన్వెస్టర్లకు అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను సవరించడం పై కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం ఎయిర్ ఇండియా నుంచి కేంద్రం పూర్తిగా నిష్క్రమించే అవకాశముండగా దాదాపు తొంభై ఐదు శాతాన్ని విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. కొనుగోలుదారులపై భారీ రుణభారం పడకుండా చూడటం ప్రైవేటీకరణ ప్రక్రియ నిబంధనల సడలింపు గట్టి చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.  ఎయిరిండియా ప్రైవేటీకరణ తర్వాత కూడా ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం వాటాలను తనదగ్గరే ఉంచుకుంటుందన్న నిబంధన కారణంగా ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. వాటాలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు కంపెనీ నిర్వహణకు అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు లాకిన్ వ్యవధిలేకుండా కొన్ని వాటాలను తక్షణం విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించనుంది.అసలే నష్టాలతో కుదేలైన ఎయిరిండియాను నడిపించడానికి అవసరమైన నిధులను సమీకరించడానికి ఈ నిబంధన సమస్యగా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావించాయి. ఎయిరిండియాకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు కాబట్టి కొత్త యజమాని తాను కోరుకున్న వాటాలను విక్రయించుకుంటే గానీ నిధులు సమకూర్చుకోవడం కుదరదు.అందుకోసం లాకింగ్ నిబంధనను పక్కన పెట్టి ఆలోచనలో ఉన్నారు. నిజానికి ఎయిరిండియాను విక్రయించేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలూ జరిగాయి ,రెండు వేల ఒకటిలో ఒకసారి మళ్లీ రెండు వేల పధ్ధెనిమిదిలో మరోసారి కేంద్రం ప్రయత్నించింది. కానీ ఈ రెండూ విఫలం కావడంతో ముచ్చటగా మూడో సారి ప్రయత్నిస్తూ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాను గట్టెక్కించేందుకు కేంద్రం రెండు వేల పదహారు, పదిహెడు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు, రెండు వేల పదిహెడు ,పధ్ధెనిమిదిలో పధ్ధెనిమిది  వందల కోట్లు, రెండు వేల పధ్ధెనిమిది, పంతొమ్మిదిలో మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల మేర నిధులు సమకూర్చింది.

కాశ్మీర్ లో మళ్ళీ నిలిచిపోయిన ఫోన్ సర్వీసులు...

  నిన్న మొన్నటి దాకా అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో ఇప్పుడు కొంత మెరకు ప్రశాంత వాతావరణం నెలకొంది అనే చెప్పుకోవాలి. కాశ్మీర్ లో మొబైళ్లు అందుబాటులోకి వచ్చిన గంటల వ్యవధి లోనే ఎస్ఎంఎస్ సర్వీసులు నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నాం అంటున్నారు అధికారులు. రాజస్థాన్ ట్రక్ డ్రైవర్ ను ఉగ్రవాదుల చంపివేయడంతో సైన్యం అప్రమత్తమైంది. మరోవైపు కాశ్మీర్ లో జన జీవనం సాధారణ స్థితికి వచ్చింది. డెబ్బై రెండు రోజుల తరువాత ఫోన్ లు పని చేస్తున్నాయన్న ఆనందం కశ్మీరీలకూ కొన్ని గంటలు కూడా లేకుండా పోయింది. ఉదయం ఫోన్ ను పునరుద్ధరించిన అధికారులు సాయంత్రానికి ఎస్సెమ్మెస్ ల సర్వీసులు నిలిపేశారు. రాజస్థాన్ ట్రక్ డ్రైవర్ హత్యతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు సరిహద్దుల్లో కూడా సైన్యం నిఘా పెంచింది. చొరబాటుదార్ల కదలికలపై కన్నేసింది. ఆగస్టు ఐదు తర్వాత కశ్మీర్ లో ఫోన్ లు బంద్ చేసిన ప్రభుత్వం సోమవారమే పునరుద్ధరించింది. పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ సర్వీసులు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే మూడు నెలలుగా బిల్లు కట్టలేదనే కారణంగా మొబైల్ ఆపరేటర్లు సర్వీసులు నిలిపేశారు. ఫోన్ లు బంద్ చేసిన కాల్స్ కి కూడా బిల్లులు రావడంతో కాశ్మీరీలు గగ్గోలు పెడుతున్నారు. అటు ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ల పై వచ్చే నెలలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇంటర్నెట్ సర్వీసులు కూడా త్వరలో అందుబాటు లోకి తెస్తామని గవర్నర్ చెబుతున్న అధికారులు మాత్రం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. అటు కాశ్మీర్ లో సాధారణ జన జీవనానికి ఎలాంటి ఆటంకం లేదని చెబుతున్నారు. ప్రజా రవాణా బాగానే ఉందని, వీధి వ్యాపారాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. మళ్ళీ ఫోన్ సర్వీసులు కాశ్మీరీ ప్రజలకు ఎప్పుడు చేరువవునున్నాయో వేచి చూడాలి.

బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టో పై తీవ్రంగా మండిపడుతున్న కాంగ్రస్ నేతలు...

మహారాష్ట్ర ఎన్నికల వేడి దేశాన్ని తాకింది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ లు ఇస్తున్న హామీలు వివాదాస్పదంగా మారుతున్నాయి.వీర్ సావర్కర్ పేరు భారతరత్నకు సిఫారసు చేస్తామన్న బీజేపీ ప్రకటన రాజకీయంగా దుమారం రేపుతోంది. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కమలనాథులు తాము మరోసారి అధికారంలోకి వస్తే వీరసావర్కర్ కు భారత రత్న వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీని పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ దేశాన్ని దేవుడే ఇక రక్షించాలంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. సావర్కర్ తరవాత గాడ్సే పేరును కూడా ప్రతిపాదిస్తారేమోనని  వామపక్షాలు మండిపడ్డాయి.  మహారాష్ట్ర లో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తే హిందుత్వ సిద్ధాంత రూపకర్త వీర్ సావర్కర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న కోసం ప్రయత్నిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. సావర్కర్ తో పాటు మహాత్మ పూలే సావిత్రిబాయి ఫూలే కు భారత రత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని కూడా వెల్లడించింది. సావర్కర్ పేరును భారత రత్నకు ప్రతిపాదించాలనే బిజెపి ఆలోచనపై విపక్షాలు మండిపడుతున్నాయి. గాంధీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విద్యార్థులకు ఎగ్జామ్ లో ప్రశ్నలు ఇచ్చిన దేశంలో సావర్కర్ లాంటి వారికి భారత రత్న కూడా వస్తుందంటూ కాంగ్రెస్ ఎగతాలి చేసింది. మహత్మ గాంధి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారత రత్న ఎలా ప్రతిపాదిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. మరో వైపు గాంధీ నూట యాభైవ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఆయన్ను పొట్టన పెట్టుకున్న వారిని అత్యున్నత పురస్కారాలతో గౌరవిస్తారా అంటూ ప్రశ్నించింది. వామపక్షాలు కూడా బిజెపి మ్యానిఫెస్టో హామీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వీరసావర్కర్ తరువాత గాంధీని హత్య చేసిన గాడ్సే కూడా భారత రత్న ఇస్తారేమో నని సిపిఐ విమర్శించింది. రెండుదేశాల సిద్ధాంతాన్ని బలపరిచి గాంధీ హత్యలో భాగస్వామిగా ఉన్న వ్యక్తికి భారత రత్న ఎలా ప్రతిపాదిస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ప్రశ్నించింది. మొత్తాని కి మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా బిజెపి మ్యానిఫెస్టోలో చేసిన ప్రస్తావన అగ్ని రాజేసింది.ఇక మ్యానిఫెస్టోనే ఇంత గోడవలకు తావునిస్తే ఎన్నికలు ఇంకేలా జరగబోతాయన్నది చూడాల్సి ఉంటుంది.

మేడిపండులా మారిన ఓరుగల్లు నగరం...

ఓరుగల్లు నగరాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేస్తామన్న రాజకీయ నాయకుల హామీలు మాటలకే పరిమితమయ్యాయా, స్మార్ట్ సిటీ అని గొప్పలు చెప్పుకుంటున్న వరంగల్ నగర పరిస్థితి మేడిపండులా ఉందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈ కాలనీలు చూస్తే స్మార్ట్ సిటీ ఎంత స్మార్ట్ గా ఉందో అర్ధమైపోతోంది. వరంగల్ నగరంలో ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో మొత్తం నూట ఎనభై మూడు మురికివాడలు ఉన్నాయి. వీటిలో శివారు ప్రాంతాల్లో ఉన్న బస్తీల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గుంతలమయమైన దారులు, రహదారికి రెండు వైపులా పారుతున్న మురుగు నీరు, మురికి కూపాలను తలపించే రోడ్లు, దోమలు ముసురుతూ, డంపింగ్ యార్డు లాంటి పరిసరాలు ఇది అక్కడి వారి దుస్థితి. ఆ రోడ్డు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు దూరం నుంచి చూసినా చాలు వెంటనే ముక్కును మూసుకుంటాం. ఇది వరంగల్ నగరానికి ఏ మారుమూలనో ఉంటే సరే, కాని నగరం నడిబొడ్డున ఉన్న కాలనీ ఇది. ఒకటో రెండో మురికివాడలు కాదు, వరంగల్ కార్పొరేషన్ పరిధిలో నూట ఎనభై మూడు మురికివాడల్లో ఇదే పరిస్థితి. కనీసం నెలకు ఒక్కసారైనా ఫాగింగ్ చేయడం లేదు. అందుకే దోమలు మురికివాడలను ఆవాసాలుగా చేసుకొని జనాలు రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. అధికారులు పొరపాటును కూడా అటు కన్నెత్తి చూడటం లేదు. వరంగల్ నగరాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేరడమేమోగానీ మొదట కనీస వసతులు కల్పించాలని స్థానికులు వేడుకుంటున్నారు. మరి అధికారుల్లో ఎప్పటికి చలనం వస్తుందో చూడాలి.

నిర్మలా సీతారామన్ కు తప్పని ఇంటిపోరు!!

  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు ఇంటిపోరు ఎదురవుతోంది. మాంద్యం వేళ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఆమె భర్త పరకాల ప్రభాకర్ కు నచ్చడం లేదు. పివి, మన్మోహన్ విధానాలు పాటించాలని నేరుగానే సలహా ఇస్తున్నారు. వీరిద్దరి మద్య వాగ్వాదం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అవుతోంది. పివి, మన్మోహన్ విధానాలే దేశానికి శ్రీరామరక్ష అని పరకాల ప్రభాకర్ అంటున్నారు. గత ఐదేళ్ళలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం అని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం విరుగుడుకు తీసుకోవలసిన చర్యలపై పరకాల ప్రభాకర్ తన అభిప్రాయంను ఓ ప్రముఖ పత్రికా ఎడిటోరియల్ పేజీకి ఆర్టికల్ రూపంలో వెల్లడించారు. ఎ లోడ్స్టర్ టూ స్టీర్ ద ఎకానమీ పేరుతో ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కు వ్యాసాన్ని రాశారు. చాలా అంశాల్లో అందులో వ్యక్తం చేశారు. దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది, వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని పరకాల విమర్శించారు. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ విధానాలే బాగున్నాయి. పివి, మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలను బీజేపీ ప్రభుత్వం అనుసరించాలని సలహా ఇచ్చారు. నెహ్రూ ఆర్థిక విధానాల్లో బీజేపీ విమర్శించడాన్ని కూడా పరకాల తప్పుబట్టారు. అధికార పార్టీ చర్య ఆర్ధిక విమర్శగా లేదని రాజకీయ దాడిగానే మిగిలిపోయిందని ఆ విషయాన్ని బిజెపి ఇంకా గుర్తించటం లేదని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా తిరస్కరణ ధోరణిలోనే వెళుతుందని ప్రభాకర్ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖత చూపడం లేదని దేశంలో ఒక రంగం తర్వాత మరో రంగానికి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగం నలభై ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడమే కాకుండా వివిధ రంగాల్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని పరకాల ప్రభాకర్ కేంద్రంపై ఓ స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజానికి పరకాల ప్రభాకర్ మాత్రమే కాదు, నిన్నటికి నిన్న నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న అభిషేక్ బెనర్జీ అప్పుడెప్పుడో ఇదే ఘనత సాధించిన అమర్త్యసేన్ రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఇలాంటి ప్రముఖులెందరో కేంద్ర ప్రభుత్వ విధానాలని విమర్శించారు. వారితో పోలిస్తే పరకాల అభిప్రాయాలకు పెద్దగా విలువ ఇవ్వాల్సిన పనిలేదు. కానీ నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ అనే హోదా ముందుకొస్తోంది, ఆ కారణంగానే హాట్ టాపిక్ అవుతోంది.

కేసీఆర్ ఫాంహౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య...

  కేసీఆర్ ఫాంహౌస్ లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు అధికారుల వేధింపులే కారణమని ప్రచారం జరుగుతోంది. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్  తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ పన్నెండవ బెటాలియన్ కి చెందిన వ్యక్తి. నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటేశ్వరుల ఆత్మహత్యకు పై ఆధికారుల వేదింపులని ఒక రకం ప్రచారం జరుగుతుంటే కుటుంబంలో ఇబ్బందుల వల్ల అని కూడా మరో వైపు ప్రచారం జరుగుతుంది. వెంకటేశ్వర్లు గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో జరిగిన కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటనపై  సిద్దిపేట పోలీస్ కమిషనర్  జోయల్ డేవిస్ స్పందించారు. కానిస్టేబుల్ మద్యం మత్తులోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అతను గత కొంతకాలంగా విధులకు హాజరుకావడం లేదని, అతని భార్య విజ్ఞప్తి తో తిరిగి విధుల్లోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని కమీషనర్ వెల్లడించారు.

టీడీపీని వదలి వెల్లాలనుకునే నేతల పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న అయ్యన్న........

  పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకు వలస నాయకులకూ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.కొందరు నేతలు పార్టీ వీడతారని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో మాటల తూటాలు పేలుతున్నాయి.ట్విట్టర్ లో ఘాటైన విమర్శలకు దిగుతున్నారు వివరాళ్లోకి వెళ్తే ఉలుకూ లేదు పలుకూ లేదు అంటారు కదా అచ్చం అలాగే ఉంది విశాఖ తెలుగు దేశం పార్టీల పరిస్థితి టీడీపీని వీడుతున్న కొందరు నేతలను ఉద్దేశించి పార్టీ సీనియర్ నేత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యా నించినా మరెవరూ స్పందించకపోవటం చర్చ నీయాంశంగా మారింది. ప్రస్తుతం విశాఖ టీడీపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టిడిపి ద్వారా ఉన్నత పదవులు పొందిన కొందరు నేతలు పార్టీని వీడుతారని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే జిల్లాలో కొందరు నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతుంది.దీంతో కేడర్లోను అయోమయం నెలకొంది. ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు ఉండరో అనేది అర్థం గాక తెలుగు తమ్ముల్లు తలలు పట్టుకుంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన వర్గీయులు పార్టీ మారడం ఖాయమని మధ్య విస్తృతంగా ప్రచారం జరిగింది. గంటా కూడా టీడీపీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఇతర కార్యక్రమాలకు మాత్రం రెక్కలు కట్టుకొని వాలిపోతున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు.మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్య ఎలాంటి సఖ్యత ఉందనేది విశాఖ టీడీపీలో ఎవరిని అడిగినా చిటికెలో చెప్పేస్తారు. ఈనేపధ్యంలో ఏమైందో తెలియదు గానీ హఠాత్తుగా అయ్యన్న ట్విట్టర్ ద్వారా ఘాటైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చ నీయాంశంగా మారింది. అవకాశవాదులే తరచూ పార్టీలు మారతారని అలాంటి చీడపురుగులు ద్రోహులను తరిమికొట్టినప్పుడే రాజకీయాలకు పట్టిన మురికి వదులుతుందని అయ్యన్న పాత్రుడు చాలా ఘాటైన పదజాలాన్ని ప్రయోగించారు. కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి లాంటి పార్టీని వదిలిపోయి పిరికిపందలు పార్టీకి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.తాను మరణించినా ఒకే జెండాతో పోతానని నాలుగు పార్టీల జెండాలను కప్పుకోనని అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.అయితే అయ్యన్న పాత్రుడు తన ట్వీట్లో ఎవరి పేరు ప్రస్తావించకుండానే తీవ్ర విమర్శలు చేయడంతో ఆయన ప్రత్యర్థులు ఏమి మాట్లాడలేకపోతున్నారు కానీ ఎన్ని విమర్శలొస్తున్నా పార్టీ వీడతారని ప్రచారం జరుగుతున్న నేతలెవ్వరూ బహిరంగంగా తాము టీడీపీని వీడతామని గాని వీడడంలేదని గానీ గట్టిగా ఖండించక పోవడంతో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం తప్పులమీద తప్పులు చేస్తుండడం పై టిడిపి నేతలు దృష్టి పెట్టకుండా ఇలా స్వపక్షంలోనే పరస్పరం విమర్శలు చేసుకోవడం ఏమిటీ అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద విశాఖ టీడీపీలో నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతుండడం పార్టీ కేడర్ ను గందరగోళంలోకి నెట్టేస్తుంది. కొంత మంది నేతలు టీడీపీని వీడతారని పక్కా సమాచారం ఉంది కాబట్టే అయ్యన్నపాత్రుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారనేది ఖచ్చితంగా తెలియాలంటే మాత్రం మరి కొన్ని రోజులు వేచి చూడాలి అప్పుడే కదా పార్టీల ఉండేదెవరు పార్టీలు మారేది ఎవరు అని మనకు స్పష్టమవుతోంది.    

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రఫుల్ పటేల్ ఎదురుకున్న షాక్.......

  వాస్తవానికి దావూద్ గ్యాంగ్ బినామీ ఆస్తులు చాలా రోజుల క్రితమే బయటపడ్డాయి. కానీ డీ గ్యాంగ్ తో లింకున్న నేతల పేర్లు మాత్రం ఇప్పుడే బయటకొచ్చాయి. ప్రఫుల్ పటేల్ కు మిలీనియం డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది. ప్రఫుల్ తో పాటు ఆయన భార్య వర్ష ఇందులో భాగస్వాములు, ముంబైలో విలాసవంతమైన ఏరియాలో దావూద్ కుడి భుజం ఇక్బాల్ మిర్చికి వందల కోట్ల విలువైన స్థలముంది. రెండు వేల ఏడులో మిలీనియం డెవలపర్స్ కు మిర్చి కుటుంబానికి మధ్య డీల్ కుదిరింది. ఇక్బాల్ మిర్చికి చెందిన స్థలంలో ప్రఫుల్ పటేల్ సంస్థ సీజే హౌస్ అని ఖరీదైన అపార్ట్ మెంట్ ను నిర్మించింది. అందులో రెండు ఫ్లోర్ లను ప్రతిఫలంగా ఇక్బాల్ మిర్చి కుటుంబానికి కేటాయించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్ లలో ప్రఫుల్ పటేల్ స్వయంగా సంతకం చేశారు. అదే పత్రాలపై ఇక్బాల్ మిర్చి భార్య హజరా కూడా సంతకాలు చేశారు. రెండు వేల ఏడు నాటి డాక్యుమెంట్ లను ఈడీ సంపాదించింది. ఈ ఆస్తులు ఎలా వచ్చాయన్న విషయం పై ఇక్బాల్ మిర్చి కుటుంబ సభ్యులను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. వాళ్ళను ప్రశ్నించినప్పుడు ప్రఫుల్ పటేల్ పేరు బయటకు వచ్చింది. అయితే రెండు వేల ఏడు నాటి విషయాలను ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నిస్తున్నారు ప్రఫుల్ పటేల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు రాజకీయ లబ్ధి పొందటానికి ఈ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. కావాలనే డాక్యుమెంట్ లను మీడియాకు ఈడీ లీక్ చేసిందని మండిపడ్డారు. ఇక్బాల్ మిర్చితో తాను ఎలాంటి ల్యాండ్ డీల్ చేయలేదంటున్నారు ప్రఫుల్ పటేల్. రెండు వేల ఏడులో ఈ డీల్ కుదిరినప్పుడు ఇక్బాల్ మిర్చి భార్య హజరా పై ఎలాంటి కేసులు లేవన్నారు. అంతా చట్టపరంగానే జరిగిందన్నారు. హజ్రా విధిగానే ఆదాయపు పన్ను చెల్లించారని కూడా తెలిపారు. తనపై కేసులో వెనుక రాజకీయ కుట్ర ఉందని అంటున్నారు ప్రఫుల్ పటేల్. కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈడీ విచారణకు ఈ నెల పధ్ధెనిమిది వ తేదీన హాజరవుతానని తెలిపారు ప్రఫుల్ పటేల్. పోలింగ్ కు కేవలం ఐదు రోజుల ముందు ఆయనకు ఈడీ పిలుపు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రఫుల్ పటేల్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అత్యంత సన్నిహితుడు. మన్మోహన్ కేబినెట్ లో ఆయన విమానయాన శాఖ నిర్వహించారు. ఎయిర్ బస్ కుంభకోణంలో ఆయన్ను ఇప్పటికే సీబీఐ ఈడీ అధికారులు విచారించారు. తాజాగా దావూద్ గ్యాంగ్ తో బిజినెస్ డీల్స్ లో ఆయన చిక్కుకోవడం ఎన్సిపికి పెద్ద దెబ్బగా మారింది.ఇక ఈ టేన్షన్ నుంచి ప్రఫుల్ పటేల్ ఎలా బయటపడతారో వేచి చూడాలి.    

ఎవరికి ఏ స్థానాలు ఇవ్వాలో తెలియక అయోమయంలో పడ్డ గులాబీ వర్గ నేతలు....

  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో నెలకొన్న పరిస్థితి మందెక్కువయితే మజ్జిగ పల్చన అన్న సామెతను తలపిస్తోంది. వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దూకుడు ప్రదర్శించింది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. తొలుత గ్రామ, ఆ తర్వాత మండల, పట్టణ కమిటీలను ఎన్నుకొంది. ఇక మిగిలింది మున్సిపాలిటి, మున్సిపల్ కార్పొరేషన్ ల కమిటీలే అయితే మండల కమిటీల ఎన్నికలు పూర్తయి నెల గడిచినా మునిసిపల్ కమిటీలను మాత్రం ప్రకటించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయా నియోజక వర్గాల పార్టీ ఇన్ చార్జిలు సాహసించటం లేదు. ఒక్కో పదవికి పదిమందికీ తక్కువ కాకుండా ఆశావహులు పోటీగా ఉండడం మెజారిటీ కార్యకర్తలు తమకు కీలక పదవులు కావాలని ఒత్తిడి తెస్తుండడంతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెజారిటీ మున్సిపాల్టీల్లో కనీసం వార్డు కమిటీలను కూడా అధికారికంగా ప్రకటించలేదు పరిస్థితి ఏర్పడినట్లు గులాబీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి చాలాయేళ్ళపాటు సంస్థాగత ఎన్నికల లేవు. ఉద్యమం తొలి దశలో ఉన్నప్పుడు పార్టీ పదవులు తీసుకొనేందుకు చాలా చోట్ల కార్యకర్తలే దొరకలేదు. కాలక్రమేణ ఉద్యమం ఊపందుకోవడం టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదగడంతో పార్టీ పదవులకు పోటీ ఏర్పడుతూ వస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పోటీ మరింత తీవ్రంగా మారింది. దీంతో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారితో పాటు మధ్య మధ్యలో ఇతర పార్టీల నుంచి చేరిన వారితో కారు పార్టీలో ఓవర్ లోడ్ అయిందట దీంతో ఎవరెవరికి ఏ ఏ సమీకరణాలతో పదవులివ్వాలో తేల్చుకోలేని పరిస్థితి నెలకొందనే చర్చ టీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, మంచిర్యాల, లక్సెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి, మందమర్రి, క్యాతన్ పల్లి, నస్పూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలున్నాయి. వీటిలో కొన్నింట టీఆర్ఎస్ వార్డు కమిటీలను పూర్తి చేశారు. మెజారిటీ మునిసిపాలిటీల్లో వార్డు సమన్వయ కమిటీలు, పట్టణ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆశావహులు అందరినీ ఆ కమిటీల్లో సభ్యులుగా చేశారు. కానీ వార్డు మున్సిపల్ అధ్యక్షులను మాత్రం అధికారికంగా ఖరారు చేయడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ చార్జిలను ఆశావహుల్లో ఎవరడిగినా నీకే ఇస్తామని వారు చెబుతున్నారని సమాచారం. బెల్లంపల్లి మున్సిపాలిటీ అధ్యక్ష పదవి కోసం అయిదారుగురు పోటీలో ఉన్నారు. వీళ్లంతా ఎమ్మెల్యే చిన్నయ్య వెంటపడుతున్నారు. అందరూ కావాల్సినవారే కావడంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట ఇతర మున్సిపాలిటీల్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.ఇక ఎవరెవరికి ఏ స్థానాలు ఇస్తారో వేచి చూడాలి.  

సచివాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న రాయలసీమ న్యాయవాదులు...

  సీమ సెగ అమరావతికి తాకింది, హైకోర్టును తమ ప్రాంతంలో పెట్టాలనీ వెలగపూడి సచివాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు లాయర్లు. ఒక వైపు సచివాలయంలో కేబినెట్ జరుగుతుంటే, మరో వైపు ఈ ఆందోళన జరగడం చర్చనీయాంశమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని రాజధానిని ఇక్కడ పెట్టారు కాబట్టి హై కోర్టు తమ ప్రాంతంలో పెట్టాలని డిమాండ్ చేశారు న్యాయవాదులు. రాయలసీమలో హై కోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమకు చెందినటువంటి న్యాయవాదులు విధులు బహిష్కరించి వారు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ న్యాయవాదులు మాట్లాడుతూ, అధికార వికేంద్రీకరణ ప్రకారం రాజధాని అమరావతిలో ఉంది కాబట్టి రాయలసీమకు హైకోర్టునైనా అక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ఏవిధంగా ఒకేచోట హైదరాబాద్ అభివృద్ది చెందిందో అక్కడ నుంచి ఒక్కసారిగా మనమంతా బయటకు రావటం జరిగిందని రాజధాని లేకుండా , హైకోర్ట్ లేకుండా ఇన్ని రోజులు బయట ఉన్నామని, ఆ పరిస్థితి మరల ఇప్పుడు రాకుండా ఉండాలంటే అన్ని చోట్ల అభివృధ్ధి చేయాలని, దానికోసం రాయలసీమకు హైకోర్ట్ ఇచ్చి అన్ని ప్రాంతాలను అభివృధ్ధి చేయాలని కోరారు. కోర్ట్ రాజధాని మధ్యలో ఉండాలనేది సర్కారు వారి దురాలోచన అని, రాజధానికి మధ్యలో హైకోర్ట్ లేకుండా దేశంలో పదకొండు రాష్ట్రాల్లో ఉన్నాయని అన్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాల్లోనే రాజధాని ఒకచోట ఉంటే హైకోర్ట్ ఒకచోట ఉందని అటువంటిది అమరావతిలో రాజధాని ఉన్నప్పుడు రాయలసీమలో హైకోర్ట్ ఇవ్వటానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టును గాని రాజధానిని గాని ఏదో ఒకటి మాత్రం ఏర్పాటు చేయాలి అని వెంటనే దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లేక పోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.    

కొనసాగుతున్న గోదావరిలో మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు...

  తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గోదావరి వరద తగ్గటంతో ధర్మాడి సత్యం టీమ్ రంగంలోకి దిగి ఆపరేషన్ కొనసాగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోట్ వెలికితీత పనులు మళ్లీ రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే నిన్నంతా దేవీపట్నం నుంచి కేవలం ఐరన్ రోప్ లతో పాటు తాళ్లు అన్నీ తీసుకొని అలాగే ధర్మాడి సత్యం బృందంకి సంబంధించి ఒక ఇరవై ఐదు మంది బృందం దేవీపట్నం నుంచి కచ్చులూరుకు రావడం జరిగింది. మళ్లీ పంటల మీద ఉన్న రోప్ అంతటిని కూడా గోదావరి మధ్యలోకి ఎక్కడైతే ప్రమాదం జరిగిందని చెప్తున్నారో ఆ ప్రమాద ఘటన జరిగిన స్థలం దగ్గర నుంచి రోప్ లు వేసుకొని రావటం జరుగుతుంది. గోదావరి వరద ఉధృతి తగ్గు ముఖం పట్టడంతో గోదావరి లోతు కూడా తగ్గింది. ఘటన జరిగిన సమయంలో చూసినట్లయితే రెండు వందల పదిహేను అడుగుల వరకు ఉన్న గోదావరి వరద నీటి మట్టం ఇప్పుడు సుమారు ముప్పై నుండి నలభై అడుగుల వరకు దాని నీటి మట్టం తగ్గడం జరిగింది. స్తుతం మొత్తం నూట డెబ్బై నుంచి నూట ఎనభై అడుగుల వరకూ కూడా లోతు ఉండే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. రోప్ సాయంతోటి యాంకర్ లన్నింటినీ కూడా గోదావరిలోకి దింపడం జరిగింది. గోదావరిలోకి దింపిన తర్వాత అక్కడి నుంచి ఘటన ఎక్కడ అయితే జరిగిందో దానికి పదిహేను మీటర్లకి ముందు నుంచి ఈ యాంకర్ లన్నింటినీ వేయటం జరిగింది. ప్రస్తుతం నాలుగు యాంకర్ లను ఉపయోగిస్తున్నారు, ఈ నాలుగు యాంకర్లను కూడా పై నుంచి లాక్కొని వచ్చి అక్కడ నుంచి కూడా కిందకి లాక్కురావడం జరుగుతది. ఎక్కడైతే పట్టుబడతదో ఆ పట్టుపట్టిన తరువాత అప్పుడు రోప్ సాయంతో లాగుతారు. ఇప్పటికే బోటు వెలికితీతకు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు కాగా తర్వాత సుమారు ఎనిమిది లక్షల వరకు కూడా ఖర్చు కావటం జరుగుతది. అయితే ధర్మాని సత్యానికి సంబంధించిన బాలాజీ మెరైన్ సంస్థ ఇరవై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే పది లక్షల ఖర్చు చేసిన కారణంగా ఒకవేళ బోటు తీయలేని పక్షంలో మొత్తం నష్టం వాటిల్లుతుందేమో అని  చెప్పి ఎలాగైనా బోటును బయటకు తీయాలనే కృతనిశ్చయంతో సత్యం బృందం మొత్తం ప్రయత్నించడం జరుగుతున్నది.