ఆపరేషన్ వశిష్టను నిలిపివేయాలని ఆదేశం.. అయోమయంలో సత్యం బృందం!!

  ఆపరేషన్ వశిష్టకి మళ్ళీ  ఆటంకాలు ఎదురైయ్యాయి.ఈ సారి ఆటంకం ప్రకృతి వల్ల వచ్చింది కాదు, ప్రభుత్వం వల్ల ఏర్పడింది.తాత్కాలికంగా బోటును వెలికి తీసే పనులు నిలిపి వేయాలని ధర్మాడి సత్యం బృందానికి అధికారుల నుంచి ఆదేశాలందాయి. ఉదయం నదిలోకి వెళ్లి లంగర్ లను వేసి బోటును లాగే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ ఆదేశాలిచ్చారు దీంతో ధర్మాడి సత్యం బృందం అయోమయంలో పడింది. ఇటు అధికారులు బోట్లు వెలికి తీసేందుకు కాకినాడ నుంచి మరో బృందం తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో కచ్చులూరులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం కచ్చులూరులో బోటును వెలికి తీసే పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మధ్యాహ్నం మూడు గంటలకు కాకినాడ బృందం కచ్చులూరుకు చేరుకుంటుందని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా కచ్చులూరులో బోటును వెలికి తీసే పనిలో నిమగ్నమైంది ధర్మాడి సత్యం బృందం. బోటుకు లంగరు వేసి బయటకు లాగి కొట్టింది గోదావరి ఒడ్డు నుంచి రెండు వందల మీటర్ల దూరంలో నూట ఇరవై అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించింది ధర్మాడి సత్యం బృందం. సత్యం బృందంలో దాదాపు ఇరవై ఐదు మంది అనుభవజ్ఞులతోనూ, మరికొంతమంది మత్స్యకారులున్నారు పూర్తి సాంప్రదాయ పధ్ధతిలోనే బోటును వెలికితీయాలని భావించింది ధర్మాడి సత్యం బృందం. కానీ తాజాగా అధికారుల ఆదేశాలతో బోటు వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి .ఇంతకీ అధికారులూ ఆపరేషన్ వశిష్టను ఎందుకు నిలిపివేశారు, అధికారు లు వచ్చే వరకు పనులు ఎందుకు నిలిపివేయమన్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.ఖచ్చితంగా ఈ రోజును బయటకు తీసే పట్టుదలతో ఉన్న సత్యం బృందానికి పది పదిహేను పది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో అధికారులకు ఆ ఒక మెసేజ్ ఐతే వచ్చింది. కాకినాడ పోర్టు నుంచి నిపుణుల వస్తున్నారు వారు వచ్చే వరకు కూడా ఎక్కడ పనులు అక్కడే ఆపి ఉంచాలని చెప్పి చెప్పడం తొట్టి వీరందరూ కూడా ఈ పనులు నిలిపివేశారు. మూడు గంటల వరకు కూడా వారు రాకపోవడంతో పనులు మళ్లీ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని ఆలోచనలో పడ్డారు బృందం సిబ్బంది. మూడు గంటల తరువాత అంటే దాదాపు గంటా రెండు గంటలకు మించి అంటే ఐదు గంటల తరవాత ఇక్కడ  లైటింగ్ సహకరించదని మళ్లీ ఆపరేషన్ మొత్తం పూర్తిగా నిలిపి వేసి దేవీ పట్నానికి వెళ్లి పోయేటువంటి పరిస్తితి ఉంటుంది బృందం వెల్లడిస్తోంది. ఇలాంటి సందర్భంలో పూర్తిగా కూడా ఈ రోజు పనులన్నీ కూడా ఆగిపోవటంతో రాయల్ వశిష్ట  బోటు వెలికి తీసే కార్యక్రమం ఆగిపోవచ్చని వెల్లడిస్తున్నారు సత్యం బృందం. కాకినాడ పోర్టు నుంచి ఎందుకు నిపుణులును ఇప్పుడు రమ్మంటున్నారో వారు వచ్చే వరకు ఎందుకు పనులను నిలిపివేయ్యాలంటున్నారు అనేది ప్రశ్నార్ధకరంగా మారింది.ఎంత త్వరగా బోటును బయటకు తిసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న సత్యం బృందానికి ప్రభుత్వం ఎందుకు ఆటంకాలు తలపెడుతోందో తెలాల్సి ఉంది. ప్రభుత్వం వైఖరికి తీవ్రంగా మండి పడుతున్నారు బాధిత కుటుంబాలు.అసలు బోటు బయటకు వస్తుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మిగలనుంది.

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి అందుకోసమే వెళ్ళారా..?

  చూడబోతే చుట్టాలూ రమ్మంటే కోపాలు అన్న సామెతను తలపించేలా ఉందట హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డికి అందిన ఆహ్వానం వ్యవహారం. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు వర్గాలు ఆధిపత్య పోరు మామూలే అన్నట్టుగా ఉంటుంది, సొంత పార్టీ నేతలే ఒకరి మీద మరొకరు నేరుగానే విమర్శ చేసుకుంటారు. బహిరంగ వేదికల మీదే తిట్టిపోస్కుంటారు. మామూలుగా అయితే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారు. అదేమంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువంటారు, ఎవరు ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ తమ పార్టీలో ఉంటుందని చెబుతారు. కాంగ్రెస్ లోని ఈ బలహీనతలే ఎదుటి పార్టీకి బలంగా చెప్తారు. ఎన్నికల్లోనూ వారిని వారే ఓడించి కుంటారని అపవాదుంది కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్లేమో గాని హస్తం పార్టీ నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. అయితే కలహాల విషయంలో రాజీ అవ్వకపోయినా ఎన్నికలొస్తే మాత్రం కలిసి పని చెయ్యడానికి రెడీ అవుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక వేళ హస్తం పార్టీ నేతలు తమ మధ్య విభేదాలను పక్కన బెట్టి ఐక్యతను ప్రదర్శిస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు హుజూర్ నగర్ కు తరలివెళ్లారు, వారు మండలాల వారీగా మోహరించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నారు, అధికార టీ.ఆర్.ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ శ్రేణులను రంగంలోకి దింపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతి నిధులు తమ బలగంతో వెళ్ళి పల్లెపల్లెనా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి తామే దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి ప్రచారాన్ని సాగిస్తున్నారు, ఇక తన సొంత నియోజక వర్గం కావడం ఆయన సతీమణి పోటీలో ఉండడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. నేతలందరినీ ఆయనే సమన్వయం చేస్తున్నారు, ఇంత వరకు బాగానే ఉన్నా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్తారా లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా జరిగింది. ఆయన ప్రచారానికి వెళ్లకపోవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి హుజూర్ నగర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత పరిణామాలు పార్టీలో పెద్ద దుమారమే రేపాయి. ఏకంగా ఉత్తమ్ ను టార్గెట్ చేయడంతో పార్టీలోని సీనియర్లంతా ఏకమయ్యారు. రేవంత్ రెడ్డి మీద మాటల దాడి చేశారు, దీంతో పార్టీలో సీన్ ఉత్తమ్ వర్సెస్ రేవంత్ గా మారిపోయింది. పీసీసీ చీఫ్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలన్న రేవంత్ వ్యవహారంపై ఉత్తమ్ కూడా గుర్రుగా ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి రేవంత్ వెళ్తారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి రేవంత్ ను ఉత్తమ్ ఆహ్వానిస్తారా అనే సందేహాలు కూడా తలెత్తాయ్. దీనిపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుండగానే రేవంతరెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల పధ్ధెనిమిది, పంతొమ్మిది తేదీల్లో ఆయన ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారట. మొత్తమ్మీద హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఉత్తమ్, రేవంత్ మధ్య గ్యాప్ ఏర్పడడం ఒకరినొకరు పలకరించుకోకుండా ఉండటం వంటివి జరిగాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం విషయమై ఎవరు మెట్టుదిగారు, రేవంత్ రెడ్డిని హుజూరునగర్ ప్రచారానికి ఎవరైనా ఆహ్వానించారా లేక ఆయనే వెళుతున్నారా అనే విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నేతలు స్వచ్ఛందంగా వెళ్లి ప్రచారం చేస్తున్నారని అలాగే రేవంత్ రెడ్డి కూడా వెళుతున్నారని ఉత్తమ్ వర్గం చెబుతోంది. అయితే యూత్ లో రేవంత్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఉత్తమ్ పద్మావతిని స్వయంగా ఇంటికెళ్లి ఆయన ప్రచారానికి రావాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇంటికొచ్చి మరీ ఆహ్వానించడంతో రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళాలని అనుకున్నట్లు చెబుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతల మధ్య వచ్చిన యూనిటీ ఆ తరవాత కూడా అలానే ఉంటుందో లేదో చూడాలి . 

పన్నెండేళ్ల క్రితం వైఎస్సే పక్కన పెట్టాడు.. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా?

  నిన్న జరిగిన ఎపి క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై దేవినేని ఉమ మాట్లాడుతూ, నిన్న క్యాబినెట్ లో ఒక తీర్మానం చేయబడింది అని 2007లో ఆనాటి ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ జీవో ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాస్తే ఐఎంపీఆర్ సంబంధిత శాఖ కోర్టులో కేసులు వేసే విధంగా, ప్రాసిక్యూట్ చేసే విధంగా ఆనాడు జీవో తీసుకొచ్చారని అన్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా, స్థానిక మీడియా ప్రధాన ప్రతిపక్షాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోజు పోరాటం చేస్తే ఆ జీవోను పక్కనబెట్టారు అని ఉమ అన్నారు. మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత ప్రమాణ స్వీకారం నాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, ఈటీవీ, టివీ5 ఇవన్నీ ఎల్లోమీడియా అని వాటి సంగతి తేలుస్తా అని జగన్ అన్నారని దాంట్లో భాగంగా నాలుగు నెలలులోనే తండ్రి ఇచ్చిన జీవోకే నగిషీలూ చెక్కాడన్నారు దేవినేని ఉమ. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కొత్త కొత్త అర్ధాలిచ్చే విధంగా ఎవరు అయినా వార్తలు రాస్తే సంబంధిత శాఖ అధికారులు పరువు నష్టం దావా వేయాలని, కోర్టుకెళ్లాలని, ప్రాసిక్యూట్ చేయాలని జగన్ సూచించారని అన్నారు. దీనిపై నిన్న క్యాబినెట్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధిత శాఖలు, ప్రిన్సిపల్ సెక్రెటేరియట్స్ అందరికీ అధికారాన్ని ఇస్తూ తీర్మానం చేశారని ఇది చాలా దురదృష్టకరమని, ప్రతి సామాన్యుడు ఈరోజున ఎటువంటి అన్యాయం జరిగినా మీడియా ద్వారానే నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అలా ప్రశ్నించే వారి అందరిపై జగన్ కేసులు పెట్టాలని చూస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. 

ఏపీలో కార్మికులకు వరాల జల్లు కురిపిస్తున్న జగన్ సర్కార్.....

  ఏపీలో ఆర్టీసీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది జగన్ సర్కార్. ఇప్పటికే సంస్థను ఆర్టీసీ విలీనం చేసిన ప్రభుత్వం తాజాగా వెయ్యి కోట్లతో కొత్త బస్సులను కొనాలని నిర్ణయించింది. నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. ఆర్టీసీ బలోపేతం పై నిఘా పెట్టింది ఏపీ సర్కార్. సంస్థల్లో కొత్త బస్సులను కొనాలని నిర్ణయించారు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. పాడైపోయిన బస్సుల స్థానంలో మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కొత్త బస్సులు తీసుకువాలని నిర్ణయించారు. ఇందు కోసం వెయ్యి కోట్ల టాంబ్ లోన్ తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిన్న అమరావతిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ బలోపేతంపై చర్చించారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన భేటీలో చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వేల సాయం, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం పది వేలకు పెంచాలని నిర్ణయించారు. నిపుణుల కమిటీ సూచనలతో ఆర్టీసీలో కొత్త బస్సులు కొనాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. డిసెంబర్ ఇరవై ఒకటిన వైఎస్సార్ నేతన్న హస్తం పేరుతో పథకం ప్రారంభించనుంది. మరోవైపు లా కోర్సులు చేసి కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టే జూనియర్ లాయర్ లకు నెలకు ఐదు వేల స్టైఫండ్ ఇచ్చేందుకు ఓకే చెప్పింది జగన్ సర్కార్  . బార్ అసోసియేషన్ లో నమోదైన మూడేళ్లలోపు ఉన్న జూనియర్ లాయర్లకు ప్రోత్సాహం ఇవ్వనుంది ప్రభుత్వం. మరోవైపు హోంగార్డుల జీతాలను నెలకు పధ్ధెనిమిది వేలు నుంచి ఇరవై వేల మూడు వందలకు పెంచేందుకు కేబినెట్ ఒప్పుకుంది.ఆర్టీసీ బలోపేతానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి జగన్ సర్కార్ కార్మికుల మనసు దోచుకుంటోంది అనే చెప్పుకోవాలి. ఇవి కేవలం మాటలకే పరిమితమవుతాయా లేక నిజంగా చేతల్లోకి వస్తాయా అనేది మాత్రం వేచి చూడాలి. 

పొలిట్ బ్యూరోలో పలు కీలక అంశాలపై చర్చించనున్న టీడీపీ నేతలు...

  భవిష్యత్ కార్యాచరణ కోసం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. కోడెల శివప్రసాద్ తో పాటు గోదావరి పడవ ప్రమాదం మృతులకు సంతాపం తెలపనున్నారు తెలుగు తమ్ముళ్ళు. అలాగే తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న నేతలు.. ఈ సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చలు జరపనున్నారు నేతలు. వీటితో పాటు భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చలు జరపనున్నారు.  పార్టీ సంస్థా గత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ కమిటీలు మండల స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ కమిటీలను నియమించాలని కొద్ది రోజులుగా పార్టీ అధినేత కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యనాయకులతో భేటీలు కూడా జరుగుతున్నాయి. పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఈ సారీ పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలనే ఒక కొత్త ఆలోచన తలపెట్టిన నేపధ్యంలో దానికి సంబంధించి ఒక ఎన్నికల కమిటీని కూడా నియమించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించుకుందని, దానిలోని ఆంక్షలను ఈ రోజు పొలిట్ బ్యూరోలో ప్రధానంగా చర్చించనున్నారు పార్టీ నేతలు.  వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటునటువంటి కొన్ని నిర్ణయాలపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా కొన్ని ఆందోళన కార్యక్రమాలను, కొన్ని నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టింది. కొన్ని పథకాలను నిలిపి వేయడం వల్ల ప్రజలపై భారం పడుతుందనేటువంటి ఆలోచనతో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇకముందు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నారు.వీటితో పాటు రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాల పరంగా ఎటువంటి పనులతో ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉందనే అంశంపై కూడా ప్రధానంగా పొలిట్ బ్యూరోలో చర్చిస్తారని సమాచారం.  ముఖ్యంగా నిర్మాణ రంగంలోని  ఇసుక కొరత కారణంగా లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితి నెలకొంది. రియలెస్టేట్ పడిపోయినటువంటి కారణంతో మొత్తం రెవిన్యూ పడిపోయినటువంటి పరిస్థితి వచ్చిందని ఇలా ప్రభుత్వం తీసుకుంటునటువంటి నిర్ణయాల వల్ల ప్రజలపై ఎటువంటి భారం ఉంటుందని ,ప్రభుత్వం ఏరకంగా నష్టపోతుందనే అంశాలపై చర్చలు జరపనున్నారు నేతలు. రాష్ట్రం ఏరకంగా నష్టపోతుందనే అంశాలపై కొంత లోతుగా చర్చించేందుకు ఈ రోజు పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం పధ్ధెనిమిది మంది పొలిట్ బ్యూరో సభ్యులకు గానూ పదమూడు మంది దాదాపు ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. కొంతమంది అనారోగ్య కారణాలతో ఈ రోజు మీటింగ్ కి రాలేకపోయారు. దాదాపు రెండు మూడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది.మొత్తం మీద ఈ భేటీలో చాలా ముఖ్యమైన అంశాల పై చర్చలు జరపబోతున్నారని సమాచారం.

పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్టీ

    ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది పోలవరం ప్రోజెక్టు వ్యవహారం. నిర్మాణ పనులు మొదలై ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి, అయినా నేటికీ అసంపూర్తిగానే మిగిలింది. ఆర్ధిక సాంకేతిక కారణాల సంగతెలా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల పోలవరం పనులు నత్త నడకన సాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పడింది, ఈ తరుణంలో పోలవరం పనులను కొలిక్కి తెచ్చేందుకు టిడిపి ప్రయత్నం చేసింది. అప్పటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నాయి. అవన్నీ తట్టుకొని దాదాపు డెబ్బై శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది కదా అనుకుంటున్న సమయంలోనే ఎన్నికలొచ్చాయి.టిడిపి ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒక్కసారిగా బ్రేక్ పడింది. పైపెచ్చు ప్రాజెక్టు పనుల్లో అనేక అక్రమాలు జరిగే భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు గుప్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. పోలవరం విషయంలో తామేదో గొప్పలు సాధించినట్టు అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గొప్పలు పోతున్నారు కానీ, ప్రజల్లో మాత్రం అనేక సందేహాలు తలెత్తాయి. ప్రాజెక్టు పనులు తిరిగి ఎప్పుడు మొదలవుతాయో అనేది సస్పెన్స్ గా మారింది రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతుందా లేక కేంద్రానికి వదిలేస్తుందో అన్న సంశయం అటు అధికారవర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చోటుచేసుకుంది. ఇదంతా ఒకెత్తయితే కేంద్రం మాత్రం పోలవరం పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నివేదికలు రప్పించుకుంటూనే మరో పక్క బీజెపీ రాష్ట్ర నేతల ద్వారా కూడా సమాచారం రాబడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు పోలవరంలో అనేక అక్రమా లు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది. దీనికి తోడు వర్షాకాలం కావడంతో పనులను ఆపేస్తున్నామని మళ్లీ నవంబర్ లోనే తిరిగి నిర్మాణం మొదలవుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు కానీ, ఎక్కడా ఆశాజనకంగా లేదు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదని ప్రతి పక్ష నేతలు వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొంతకాలంగా బీజేపీ నేతలు చేపడుతున్న పోలవరం యాత్రలు ఆసక్తికరంగా మారాయి. ఆగస్టులో బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావు పోలవరాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులతో కాంట్రాక్టు ఏజెన్సీలతో సమావేశమై ప్రాజెక్టు స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలవరం పర్యటనకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పార్టీ అధిష్ఠానానికి పంపించారు. ఈ నెలలో బిజెపి రాష్ట్ర బృందం మరోసారి పోలవరం యాత్రను చేపట్టింది. కొవ్వూరు నుంచి బయలుదేరి వెళ్లిన ఈ బృందంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సహా ఇతర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పలు వివరాలు సేకరించారు, ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి ఒక నివేదిక అందజేశారు. ఈ నివేదికలో పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయి, ఎప్పటి నుంచి పనులు నిలిపివేశారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి వంటి పలు అంశాలను ఈ నివేదికలో వారు పొందుపరిచారట. ఆ నివేదికనే అప్పటికప్పుడు అధ్యయనం చేసిన కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారుకు తాఖీదులు పంపారు. తాజా పరిస్థితులలో ఈ నెల ఇరవైయ్యవ తేదీ తరువాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్వహించాలని కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇదిలా ఉంటే బిజెపి నేతలు పోలవరం టూర్ చేపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరసపెట్టి కమలనాథులు ఎందుకు పోలవరం యాత్ర చేస్తున్నారు, దీని వెనకున్న మర్మం ఏంటి, అనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందో అని అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటు టిడిపి వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు మాకి ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయితే చాలని ప్రజలు, ముఖ్యంగా రైతాంగం బలంగా కోరుకుంటోంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ ఎప్పుడు ఊపందుకుంటాడేయో.  

భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్న ఏపీ పోలీసులు...

  ఈ మధ్య కాలంలో మత్తు ద్రవ్యాల విక్రయం అధికమవుతోంది. ప్రభుత్వం ఎన్ని సోదాలు, ఎన్ని తనిఖీలు చేపట్టినా మత్తు ద్రవ్యాల రవాణాకు అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రభుతం రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ద్రవ్యాల రవాణా తగ్గుముఖం పట్టదని స్పష్టమవుతోంది.సాధారణంగా మనకు ఎక్కువ మోస్తారు లో పట్టుబడేది గంజాయి. కృష్ణా జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.  ఉంగుటూరు మండలం ఆత్కూరు పీఎస్ పరిధిలోని పొట్టిపాడు టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా టెంపో ట్రావెల్స్, మినీ బస్ లో గంజాయిని అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబట్టారు. అరకు నుండి కర్ణాటక రాష్ట్రం మైసూర్ కు వెళ్తున్న టెంపో ట్రావెలర్స్ మినీ బస్ లో గంజాయి తరలిస్తున్నారు. దాదాపు రెండు వందల నలభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పది మంది నిందితుల్ని అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు గన్నవరం పోలీసులు.  మరో వైపు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నలభై కేజీల గంజాయి పట్టుబడింది. దీనిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.వీరి పై కఠిన చర్యలు చేపట్టి ఇలాంటి మత్తు పదార్ధాలు ఎంతటి ప్రమాదకరమో తెలియజేసే చర్యలు చేపట్టేలా పోలీసుల చర్యలు తీసుకోవాలి. పోలీసులు తనిఖీలు ఇంకాస్త ముమ్మురం చేయ్యాలని ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు చేపడితే కానీ వీటిని నిష్క్రమించలేమని వెల్లడవుతోంది.ఇక జగన్ సర్కార్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

కేశవరావు తో సీఎం కేసీఆర్ ఆర్టీసీ పై చర్చలకు సిద్ధంగా ఉన్నారా?

  నేడు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పార్లమెంటరీ పార్టీనేత కే కేశవరావు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి మరి కేసీఆర్తో సమావేశమయ్యారు కేకే. తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతున్న ఆర్టీసీ సమ్మెపై ఇద్దరు చర్చించనట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఆర్ఎస్ నేతల్లో కేకే ఒక్కరే మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వం కార్మికుల మధ్య చర్చలు జరగాలన్నారు. చర్చలకు మధ్యవర్తిగా ఉంటానని ఆయన ప్రకటించారు. కేసీఆర్, కేకే మీటింగ్ లో హోమ్ మంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. సీఎం చాంబరులో కేశవరావుతో పాటు హోం మంత్రి మహమద్ అలీ సమావేశమయ్యారు.  ఉదయం సీఎం ఆఫీసు నుంచి కేకే కు పిలుపు రావడంతో కేకే ప్రగతి భవన్ కు వెళ్లారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ తరపున టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు చాలా మంది సీనియర్లు మంత్రుల ఎంతమంది ఉన్నప్పటికీ చర్చలు జరగాలి చర్చకు మధ్యవర్తిగా వహిస్తానని ముందుకొచ్చింది మాత్రం కేశవరావు ఒక్కరే. కాని కేశవరావు ముందుకొచ్చిన తర్వాత కార్మికుల నుంచి మంచి ఫలితం వచ్చింది. కార్మికులు కేశవరావు మధ్యవర్తిగా ఉంటే మాకేం అభ్యంతరం లేదు చర్చకు మేం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.కానీ ప్రభుత్వం నుంచి కేశరావుకి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఆయన సీఎంను కలిసేందుకు సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినట్టుగా కూడా కేశవరావునే స్వయంగా చెప్పారు. కానీ సీఎం అందుబాటులోకి రాలేదు కాబట్టి ఆ చర్చలు జరగలేదు. మంచి జరుగుతుందంటే తను ఇప్పుడు కూడా చర్చ జరిపేందుకు మధ్యవర్తి వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేశవరావు వెల్లడించారు.ఇక చర్చలు జరిగి సమ్మేకు ఒక పరిష్కారం వస్తోందో లేదో వేచి చూడాలి.  

సిఎస్ ను కలవనున్న ఆర్టీసి కార్మికులు...

  కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై ఈ విధంగానే కొనసాగుతుంది. పదమూడవ రోజు ఆర్టీసి కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది, రోజుకో తరహాలో కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చర్చల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్న  కోర్టు సూచనల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు సిద్ధమని కార్మిక సంఘాలు చెప్తున్నా చర్చలకు ససేమిరా అంటున్నారు తెలంగాణ సిఎం కెసిఆర్. రేపు మరోమారు ఆర్టీసి కార్మికుల సమ్మెపై విచారణ చేపట్టబోతోంది హైకోర్టు. చర్చల సారాంశం ఏంటని ప్రశ్నించబోతోంది, చర్చల పురోగతిని కోర్టు ముందు ఉంచాలని కోర్టు గతంలోనే సూచించినా ఎలాంటి పురోగతి లభించలేదు. అయితే రేపటి విచారణలో ఇరువర్గాలూ ఎలాంటి వాదన వినిపించబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది. తమ వాదనను కోర్టుకు గట్టిగానే వినిపించాలని ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు సిఎం కెసిఆర్. నిన్నటి సమావేశంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని అధికారులకు వివరించారు సీఎం. మరోవైపు కాసేపట్లో సీఎస్ ను కలవబోతోంది ఉద్యోగ సంఘాల జెఎసి. తమ సమస్యలను  సియస్ దృష్టికి తీసుకొస్తూనే ఆర్.టి.సి కార్మికుల సమ్మెను ప్రత్యేకంగా ప్రస్తావించనుంది. మరోవైపు సీఎంతో భేటీ అయ్యారు ఎంపీ కేశవరావు. కెసిఆర్ ఆదేశిస్తే కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధమని గతంలో కేకే ప్రకటించిన నేపధ్యంలో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందన్న అంశం ఆసక్తికరంగా ఉంది.

ప్రమాదకరంగా మారిన గన్నవరం చుట్టుపక్కల సెల్ టవర్లు...

  ఏపీ సీఎం జగన్ హెలికాప్టర్ ప్రయాణాలపై అధికారులు, పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్ పోర్టు చుట్టు పక్కల ప్రాంతాల్లో కొన్ని మార్పులకు సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్టు చుట్టుపక్కలున్న సెల్ టవర్ ల వల్ల భద్రతాపరమైన ఇబ్బందులను గుర్తించిన సిబ్బంది, ఎయిర్ పోర్ట్ అథారిటీ దృష్టికి తీసుకువచ్చారు. గన్నవరం రన్ వే పనులు పూర్తయిన క్రమంలో చుట్టు పక్కల సెల్ టవర్ ల వల్ల కొన్ని ఇబ్బందులను గుర్తించారు. రన్ వే సమీపంలో ఆరు సెల్ టవర్లున్నాయి, ఇప్పుడు ఈ టవర్ ల ఎత్తు తగ్గించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఏరోడ్రమ్ మీటింగ్ కమిటీ ఏఈఎంసీ సమావేశంలో రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ కుమార్ సెల్ టవర్ ల ఎత్తు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్ టవర్ ల రెడ్ లైట్లు వెలిగేలా చూడాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సూచించారు. మరోవైపు విజయవాడ ఎయిర్ పోర్టులో ఇటీవలే రన్ వేను రెండు వేల రెండు వందల ఎనభై ఆరు మీటర్ ల నుంచి మూడు వేల మూడు వందల అరవై మీటర్ లకు విస్తరించారు. అయితే భారీ విమానాలు ఎయిర్ బస్ 320, బోయింగ్ 747, బోయింగ్ 777 విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సమయంలో సెల్ టవర్ లు ఇబ్బందికరంగా ఉన్నాయని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు గుర్తించారు. గన్నవరం, బుద్ధవరం ప్రాంతాల మధ్య ఉన్న ఆరు సెల్ టవర్ లు విమానాలకు తగిలే అవకాశముందని అంచనా వేశారు. సెల్ టవర్ ల నిర్వాహకులకు మూడు నెలల గడువు ఇచ్చి జనవరిలో నోటీసులు పంపించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సమస్య కేవలం సీఎంకే కాదు, త్వరలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం డైరెక్ట్ విమానాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సెల్ టవర్ లు ఎత్తు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రన్ వే పరిసరాలతో పాటు విమానాశ్రయం చుట్టూ జంతు వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు డంప్ చేయడం వల్ల విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పక్షులు ఢీ కొనే అవకాశముంది. అందుకే ఎయిర్ పోర్ట్ చుట్టు పక్కల వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తమ రోడ్ బాగుచేయాలని వింతగా నిరసన తెలిపిన స్థానికులు...

విజయనగరం జిల్లా కొమరాడ, కూనేరు జాతీయ రహదారి పై స్థానిక గ్రామాల ప్రజలు వినూత్న నిరసన తెలిపారు. పిల్లల్ని స్కూలుకు ఎడ్లబండి లో పంపి స్ధానికులు నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా విద్యార్థులను ఎడ్ల బండిపై పాఠశాలకు పంపిస్తూ నిరసన తెలిపారు. రోడ్లు పాడవడం తో ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని స్థానికులు అంటున్నారు. నిరసనలో భాగంగా స్థానికులు మాట్లాడుతూ, ద్వారపల్లెం నుండి కూనేరు, కొమరేడు వరకూ నాటు బళ్ళతో పది రూపాయల చార్జీలు పెట్టి ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది అన్నారు. ఎందుకంటే పిల్లలు చదువులకు వెళ్ళడానికి ఇబ్బందులు పదుతున్నారని, గిరిజనులు వైద్యం అందక అవస్థలు పడుతున్నారని, రోడ్లకు బస్సులు రాని కారణంగా ఈరోజు ఇలా ప్రయాణం చేస్తున్నామని అన్నారు. తమపై ప్రభుత్వం మొండి వైఖరిని చూపకుండా చిత్తశుధ్ధి ఉంటే వెంటనే తమ గ్రామానికి వెళ్ళే రోడ్డు మార్గానికి మరమ్మత్తులు చేపట్టాలని, మరమత్తులు చేసి వెంటనే ఆర్టీసి బస్సులలో ప్రజలను ప్రయాణించేలా చేసి వారు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తుల్ని చేయమని విజయనగరం జిల్లా కొమరాడ, కూనేరు స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైఎస్ తో నెహ్రూ... జగన్ తో అవినాష్... మళ్లీ పార్టీ మారతారంటూ ప్రచారం

  తెలుగుదేశానికి కృష్ణాజిల్లాలో మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితమే ఈ మాట వినిపించినప్పటికీ, ఈ మధ్య చంద్రబాబు పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు ఆందోళనలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొనడంతో... పార్టీ మారే ఆలోచనను దేవినేని అవినాష్ విరమించుకున్నారేమోనన్న టాక్ వినిపించింది. అయితే, దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. తాజాగా దేవినేని అవినాష్.... టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో త్వరలోనే అవినాష్ వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. అవినాష్ తండ్రి దివంగత దేవినేని నెహ్రూకి కృష్ణాజిల్లాలో రాజకీయంగా పట్టుంది. జిల్లావ్యాప్తంగా దేవినేని కుటుంబానికి అభిమానులు, అనుచరులు ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవినాష్ ... అతి తక్కువ సమయంలోనే యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి వార్తల్లో నిలిచారు. ఇక, 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అవినాష్.... ప్రస్తుత మంత్రి కొడాలి నానికి గట్టిపోటీనిచ్చారు. నువ్వానేనా అన్న స్థాయిలో దడ పుట్టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయంతో అవినాష్ చూపు వైసీపీ వైపు మళ్లింది. అసలు ఎన్నికలకు ముందు అవినాష్ ... వైసీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక, కొడాలి నానికి దీటైన అభ్యర్ధిగా అవినాష్ ను భావించిన చంద్రబాబు... గుడివాడ నుంచి బరిలోకి దింపారు. అయితే, వైసీపీలో హోరుగాలిలో అవినాష్ ఓటమి పాలైనా... యూత్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.   ఇక, దేవినేని నెహ్రూ కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దేవినేని నెహ్రూ... ఆ తర్వాత ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. దేవినేని నెహ్రూ... వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే కావడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. అయితే, 1995 ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ లో చేరి, వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. అలాగే, వైఎస్ ఫ్యామిలీతో దేవినేని నెహ్రూ కుటుంబానికి సత్సంబంధాలు ఉండటంతో... అవినాష్ వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ దేవినేని అవినాష్... వైసీపీలో చేరితే అది టీడీపీ నష్టమేనని చెప్పాలి. ఎందుకంటే దేవినేని నెహ్రూ కుటుంబానికి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులు, అభిమానులు ఉన్నారు. వాళ్లంతా అవినాష్ వెంట నడిచే అవకాశముంది.

అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో ఉన్న సీఆర్డీఏ అధికారులు...

  కరకట్ట వెంబడి అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. ప్రముఖ శైవక్షేత్రం తాళ్లాయపాలెంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. శైవక్షేత్రం పక్కనే నిర్మించిన క్యాంటీన్లు, బాత్రూంలను కూల్చివేస్తున్నారు. సీఆర్డీఏ అధికారి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. కరకట్ట వెంబడి ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.  సీఆర్డీఏ అధికారులు ఇప్పటికే ఒకటి రెండు అక్రమ కట్టడాలకు సంబంధించి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లకి నోటీసులు అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పాతూరి కోటేశ్వరరావుకి సంబంధించిన అక్రమ కట్టడాన్ని తొలగించే క్రమంలో ర్యాంపు లాంటిది ఉంటే గతంలోనే సీఆర్డీఏ అధికారులు తొలగించారు. కాబట్టి ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది.  శైవక్షేత్రం ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను ప్రస్తుతం సీఆర్డీయే అధికారులు తొలగిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద కృష్ణానది కరకట్ట లోపలకు ఉన్న అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో ఆ అక్రమ కట్టడాలను తొలగించే దిశగానే ప్రభుత్వం కొనసాగుతోందని వెల్లడవుతోంది. ఒకేసారి అన్ని కాకుండా ఒక్కొక్కటిగా వీలునుబట్టీ అలాగే అక్కడున్న పరిస్థితులను అంచనా వేసుకుంటూ, అక్రమ కట్టడాల కూల్చివేత దిశగా చర్యలు తీసుకుంటుంది.  దీంట్లో భాగంగా తాళ్లాయపాలెంలో అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారానికి సంబంధించిన పనులు ప్రస్తుతం అక్కడ జరుగుతున్నాయి. శైవక్షేత్రంకి సమీపంలోనే ఉన్న బాత్ రూంలు,క్యాంటీన్ లను కూడా ప్రస్తుతం అక్కడ కట్టడాల కూల్చివేత వ్యవహారం  జరుగుతోంది .మొత్తంగా చూస్తే ఒక్కొక్కటిగా అంటే కొంత మంది లింగంనేని గెస్ట్ హౌస్ కి సంబంధించి ప్రస్తుతం చంద్రబాబునాయుడు ఎక్కడ నివాసం ఉన్నారో ఆ స్థలాన్ని ఉన్న భవనం కూడా అక్రమ కట్టడాలుగా  భావించి  తొలగించాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు అధికారులు.మొత్తం మీద అక్రమ కట్టడాలపై నిజమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందా లేదా కక్ష సాధింపు చర్యలు చేపట్టే పనిలో ఉందా అనేది చర్చనీయాంశంగా మారింది.

స్వరాష్ట్రంలో ఉద్యోగుల ఆత్మహత్యలా? కేసీఆర్ తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత!

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలిపై పార్టీలో అసంతృప్తి పెరుగుతుందనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు ఎవరికీ నచ్చడం లేదని అంటున్నారు. ఎవరైనా ఏదైనా మంచి చెబితే వాళ్లను వెంటనే దూరం పెట్టేస్తున్నారని... మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా... అధికారులైనా ఇదే పరిస్థితి అంటూ చెప్పుకుంటున్నారు. కేసీఆర్ వ్యవహారశైలి, తీరు నచ్చక అసలు మాట్లాడేందుకకే ఎవరూ సాహిసించడం లేదని అంటున్నారు. కేసీఆర్ తీరుపైనా, ఆయన నిర్ణయాలపై స్వయంగా కేటీఆర్ కూడా అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఒక్కొక్కటిగా కేసీఆర్ చేస్తున్న తప్పులు కొండలా పేరుకుపోతున్నాయని, ఆయన నిర్ణయాలు... అటు పార్టీకి... ఇటు ప్రభుత్వానికి చేటు చేస్తున్నాయని టీఆర్ఎస్ నేతలే వాపోతున్నారట. కొత్త సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ నిర్మాణం... కాళేశ్వరం వృథా పంపింగ్, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం... ఇలా అనేక నిర్ణయాలు చాలా మందికి నచ్చడం లేదట. ఇక, కొన్ని నిర్ణయాలైతే ఎవరికీ మింగుడుపడటం లేదని అంటున్నారు. అసలు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు రావడానికి కేసీఆరే కారణమంటున్నారు. హిందూగాళ్లు బొందుగాళ్లు అంటూ కేసీఆర్ చేసిన కామెంట్సే.... బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు తెచ్చిపెట్టాయని అంటున్నారు. ఇక, యూపీఏ అధికారంలోకి వస్తుందన్న అతి నమ్మకంతో కేసీఆర్ ముందుకు తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ వ్యూహం బెడిసికొట్టిందంటున్నారు. కేసీఆర్ వ్యవహార శైలి కారణంగానే కేంద్రం, రాష్ట్రం మధ్య సత్సంబంధాల్లేవని అంటున్నారు. ఇక, ఆర్టీసీ సమ్మె విషయంలోనూ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రమంతా రగిలిపోతోందని, మరీ ఇంత కఠిన వైఖరి మంచిది కాదని అంటున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఏదోఒకరకంగా సమ్మె విరమింపజేయకుండా... ప్రభుత్వం ఇలా మొండిగా వ్యవహరించడం సరికాదంటున్నారు. అసలు కేసీఆర్ నిర్ణయాలను గులాబీ నేతలే జీర్జించుకోలేకపోతున్నారట. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు సాధించిన స్వరాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాము అనుకోలేదని వాపోతున్నారట. కనీసం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మె విరమింపజేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ సమ్మె ఉగ్రరూపం దాల్చితే మాత్రం ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరని టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి, కిందస్థాయి నేతలు, కేడర్ మనోభావాలు కేసీఆర్ వరకు చేరతాయో లేదో చూడాలి.

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.! త్వరలోనే యువరాజుకి పట్టాభిషేకం?

కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని... కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారంటూ ఎప్పట్నుంచో విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు... ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఎక్కువగా వినిపించింది. ప్రధాని మోడీ సైతం... కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారంటూ ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణలు ఎలాగున్నా, తొందర్లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాట టీఆర్ఎస్ వర్గాల్లోనూ వినిపించింది. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్ కు ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో తిరుగుబాటు రావొచ్చనే భయంతో కేసీఆర్ వెనకడుగు వేశారని చెబుతారు. అందుకే ముందుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి టీఆర్ఎస్ నాయకగణమంతా కేటీఆర్ చుట్టూ తిరిగేలా చేశారని అంటారు. ఒకవిధంగా చెప్పాలంటే, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేది కేటీఆరే. టికెట్ల దగ్గర్నుంచి... మంత్రి పదవుల వరకు... అన్నింటిలోనూ కేటీఆర్ మార్క్ కనబడుతుంది. అయితే, కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపడతారనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ కూడా తన పదవికి తనయుడు కేటీఆర్ కు కట్టబెట్టాలని సీరియస్  గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ములాయం-అఖిలేష్ మాదిరిగా... పార్టీకి గౌరవాధ్యక్షుడిగా, ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ... జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ మెల్లగా సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల నుంచి కేసీఆర్ కు ఊహించని కామెంట్స్ ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక, మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి, మీరు గౌరవంగా తప్పుకోండంటూ అమిత్ షా వ్యాఖ్యానించినట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కేంద్ర నాయకత్వం కేసీఆర్ ను టార్గెట్ చేసిందని, దాంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ సన్నిహితులైన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా ఉండటంతో... అన్నీ చక్కబడగానే... పార్టీలో ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, యువరాజు పట్టాభిషేకం జరగడం ఖాయమని అంటున్నారు.  

నల్గొండలో హమాలీ కార్మికుల మధ్య ఉధృక్తతకు దారీ తీస్తున్న ఘర్షణ...

  గత కొన్ని రోజులుగా హమాలీ కార్మికుల మధ్య ఘర్షణ జరుగుతోంది. నల్గొండలో హమాలీ కార్మికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఒకరి పై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. రాళ్లు విసురుకుంటూ రోడ్ల పై పరుగులు పెట్టారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న ప్రజలు హడలిపోయారు. హమాలీ కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.దీంతో ఎవరు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా మొన్నటి దాకా సీపీఎం అనుబంధ సంఘం సీఐటీయూ యూనియన్ లో ఉన్న కొందరు ఇటీవల టీఆర్ఎస్ కార్మిక విభాగంలో చేరారు. దీంతో లోడింగ్ అన్ లోడింగ్ విషయంలో కొద్ది రోజులుగా రెండు యూనియన్ల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ రోడ్ లోని ఒక సిమెంట్ ట్రేడింగ్ షాప్ ముందు టీఆర్ఎస్ కేవీకి చెందిన హమాలీలు అన్ లోడింగ్ చేస్తున్నారు. వీరిని సీఐటీయూకు చెందిన హమాలీలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఒకరి పై ఒకరు దాడికి దిగారు. ఘర్షణలో పలువురు గాయపడ్డారు.ఈ సంఘటనను చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు.ఈ ఘర్షణ పై పోలీసులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలానే వదిలేస్తే ఇంకా పరిస్థితులు ఉధృక్తం అవుతాయని వెల్లడిస్తున్నారు అక్కడి ప్రజలు.  

మద్యం దుకాణాల దరఖాస్తులతో ఆశ్చర్యానికి గురైన అధికారులు...

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులకు భారీ స్పందన చూసి ఆశ్చర్యపోతున్న అధికారులు. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ రాత్రి పన్నెండు గంటల వరకు కొనసాగింది. మొత్తం నలభై ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి తొమ్మిది వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. బుధవారం ఒక్క రోజే ఇరవై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం కన్నా అదనంగా నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. దరఖాస్తు దారులతో ఎక్సైజ్ కార్యాలయాలన్నీ కిటకిటలాడాయి. ఎక్సైజ్ అధికారులు టెండర్ల స్వీకరణ పరిశీలనలో బిజీ అయిపోయారు.  ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక దరఖాస్తులొచ్చాయి. వరంగల్లో రెండు వందల అరవై ఒక్క దుకాణాలకు గాను ఏడు వేల ఐదు వందల ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ జిల్లాలో నూట డెబ్బై మూడు మద్యం దుకాణాలకు గాను ఒక వెయ్యి మూడు వందల పంతొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా లోనూ పోటా పోటీగా దరఖాస్తులు సమర్పించారు. ఏపిలో లిక్కర్ పై నియంత్రణ విధించడంతో అక్కడి వ్యాపారులు తెలంగాణా బాటపట్టారు. ఏపీ నుంచి మద్యం వాప్యారులు తెలంగాణాకి వచ్చి పోటా పోటీగా టెండర్లు వేశారు. ఒకరు ఓకే టెండర్ వేయాలనే నిబంధన ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్ గా మారి భారీగా టేండర్లు వేసినట్టు తెలుస్తోంది. అనంతపూర్, గుంటూరు, సత్తెనపల్లి, మాచర్ల, కర్నూలు, విజయవాడ, నంద్యాల ప్రాంతాల వ్యాపారులు గ్రేటర్ శివార్ల లోనే ఏకంగా రెండొందలకు పైగా దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం.

నెల్లూరు జిల్లాను గడగడలాడిస్తున్న వర్షం...

  గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నెల్లూరు తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీటితో రహదార్లు మూసుకుపోవడంతో పలు గ్రామాలలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ఆత్మకూరు పరిధిలోని ఆరు మండలాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సోమశిల జలాశయం నుంచి పది వేల క్యూసెక్ ల వరద నీరు సంఘంలోని పెన్నా ఆనకట్ట వద్దకు చేరుతుంది. పెన్నా వద్ద ఉన్న రోడ్డుపై ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు గేట్లను మూసివేశారు. దీనితో సంఘం నుండి పొదలకూరు, చేజర్ల మండలాల్లోని గ్రామాలకు వెళ్లేందుకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామంలోని చేనేత కార్మికుల ఇళ్ళల్లో వర్షపు నీరు చేరడంతో మగ్గం గుంతలు నిండి పోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మర్రిపాడు మండలం సన్నువారిపల్లి వద్ద బోగేరు వాగు పొంగిపొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కృష్ణాపురం గ్రామంలోని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడంతో కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రాయలసీమ ప్రాంతం నుండి వస్తున్న వరద ప్రవాహానికి జిల్లాలోని పడుతున్న వర్షాలు తోడవడంతో సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం జలాశయంలో డెబ్బై మూడు టిఎంసిల నీరు నిల్వ ఉండగా ఇన్ ఫ్లో పదకొండు వేల క్యూసెక్యుల నీరు వస్తుంది. అవుట్ ఫ్లో పన్నెండు వేల క్యూసెక్యుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.ఇప్పటి వరకూ కరీఫ్ లో ఎలాంటి వర్షాలు లేని నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన వర్షాలు ఇప్పటి వరకు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి పదకొండు గంటల నుంచి ప్రారంభమైన వర్షాలూ నిన్న పగలు దాకా కురిసి కొంచం తగ్గుముఖం పట్టినట్లు తెలిస్తోంది. దీంతో ప్రజలు కొంచం ఊపిరి పీల్చుకున్నారు.పగలు వర్షం కురవకపోగా రాత్రి పెద్ద ఎత్తున ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయి.మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అని చెప్పవచ్చు.కేవలం సుల్లూరు పేట నియోజక వర్గం తప్ప మిగతా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్లా వర్షాలు కురుస్తున్నాయి.

విద్యార్ధులకు పోలీసుల ఆయుధాల ఉపయోగం పై జ్ఞానాన్ని ప్రదర్శించిన పోలీసు అధికారులు.....

  పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు చేరువయ్యేలా పోలీస్ శాఖలో వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పోలీసులు వినియోగించే ఆయుధాలు వాటి పని తీరు వంటి వాటి పై ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు వివరిస్తున్నారు. విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్ లో ఈ ప్రదర్శనను డిజిపి గౌతం సవాంగ్ ప్రారంభించారు. సాధారణ తుపాకి నుంచి ఏకే ఫార్టీ సెవన్ వరకు వివిధ రకాల ఆయుధాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. వీటి గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటే పోలీసులు కూడా ఓపిగ్గా వివరిస్తున్నారు. టిఫిన్ బాక్స్ లు, సూట్కేసులు, డస్ట్ బిన్ లో అమర్చే బాంబుల నిర్వీర్యం గురించి ప్రత్యేకంగా వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు భవనాలు కూలినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఉపయోగించే పనిముట్లను అక్కడ ప్రదర్శనకు ఉంచారు. సెవన్ పాయింట్ సిక్స్ టూ ఎమ్ఎమ్ఎస్ఎస్జీపీ టూ ఇది షార్క్ షూటింగ్ గన్. ఈ ఆయుధానికి పై భాగంలో ఉండే టెలిస్కోప్ దూరంగా ఉన్న వ్యక్తిని పది రెట్లు పెద్దగా చేసి చూపిస్తుంది. దాని ద్వారా శత్రువులను మట్టుబెట్టవచ్చు వివరించారు . నైన్ ఎంఎం పిస్టల్ బ్లాక్ నైన్టీన్ దీన్లో నైన్ ఎంఎం బుల్లెట్లు పదిహేను రౌండ్లు ఉంటాయని యాభై అడుగుల దూరంలో ఉన్న శత్రువులను టార్గెట్ చేయవచ్చు అని దీనిపై భాగంలో గెగోటాక్టికల్ లైట్ ఉంటదిఅని విద్యార్ధులకు వివరించారు . చీకట్లో ఉన్నప్పుడు ఐఆర్ అతినీలలోహిత కిరణాలు శత్రువులపై పడేలా చేయవచ్చు. ఎత్తైన ప్రదేశాల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్న వాటిని మట్టుబెట్టడానికి యాభై యొక్క ఎంఎం మోర్టార్ ను ఉపయోగిస్తాము అని అల్లర్లు జరిగే సందర్భాల్లో యాంటీ రాయిట్ గన్ ను ఉపయోగిస్తామని పోలీసులు ప్రదర్శనలో వెల్లడించారు. తాము వాడే వస్తువుల పై కొంత పరిజ్ఞానాన్ని ప్రజలకు, విద్యార్ధులకు చాలా ఓపిగ్గా సమాచారం ఇచ్చారు పోలీసులు.ఈ ప్రదర్శన చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఇతర ప్రజలు కూడా ఆసక్తిగా తరలి వస్తున్నారు.