ఏపీ మంత్రికి 14 రోజులైనా తగ్గని కరోనా.. హుటాహుటిన హైదరాబాద్ అపోలోకు

ఏపీలో పులువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా సోకి ఇప్పటికే కోలుకున్నసంగతి తెలిసిందే. వీరిలో కొందరు హైదరాబాద్ మరి కొందరు చెన్నై హాస్పిటల్స్ లో చేరి చికిత్స తీసుకున్న విషయం తెల్సిందే. అయితే ఎపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా సోకి ఇంకా తగ్గలేదు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వెల్లంపల్లికి సెప్టెంబర్ 28వ తేదీన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటి నుండి ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే 14 రోజులు గడిచిన తర్వాత కూడా వెల్లంపల్లికి ఇంకా కరోనా తగ్గకపోవడంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.

జగన్ కు ఝలక్

కోరి కష్టాలు తెచ్చుకున్న జగన్   సీఎం సీటుకే ఎసరు తెస్తున్న పిటిషన్   జగన్ అంచనాలు తల్లకిందులు   ఒక్కతాటిపైకి వచ్చిన న్యాయవ్యవస్థ   జగన్ తీరును ఖండించిన ఢిల్లీ బార్ అసోసియేషన్   అదే బాటలో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేయన్   రహస్యాలు లీక్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే   151 సీట్ల తిరుగులేని మెజారిటీతో అధికారం కైవసం చేసుకున్న యుశ్రారైకా పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు తన మొండితనంతో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఎన్వీ రమణపై ఆరోపణతో, జగన్ రాసిన లేఖ ఇప్పుడు ఆయన సీటుకే ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. చీఫ్ జస్టిస్‌కు జగన్ లేఖ రాయడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది కాబట్టి, ఆయనను తక్షణం సీఎం పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలయిన పిటిషన్ ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసింది. ఇది ఆయన స్వయంకృతమే.   జగన్మోహర్‌రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలని జీఎస్ మణి, ప్రవీణ్‌కుమార్ యాదవ్ అనే సీనియర్ న్యాయవాదులు, తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ రమణకు వ్యతిరేకంగా రాసిన లేఖను విడుదల చేయడాన్ని, వారు తమ పిటిషన్‌లో ప్రస్తావించారు. మరోవైపు జగన్ లేఖ, దాని విడుదల తీరుపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా తీవ్రపదజాలంతో విరుచుకుపడింది. న్యాయ వ్యవస్థపై పెత్తనం చేసే ప్రయత్నంలో భాగంగానే.. జస్టిస్ రమణపై సీఎం జగన్ లేఖ రాశారని మండిపడింది.   రమణతోపాటు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు చేసి, లేఖలు రాయడం గర్హనీయమని ఖండించింది. ఇది న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు, జరిగిన కుట్రగానే భావిస్తున్నామని పేర్కొంది. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న జస్టిస్ రమణ అత్యంత సమర్ధతగల, నిజాయితీపరుడయిన న్యాయమూర్తి అని స్పష్టం చేసింది. అటు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేయన్ కూడా, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ బాట పట్టింది. జగన్ తీరు న్యాయవ్యవస్థను బెదిరించేలా ఉందని, ఇది రాజ్యాంగ-న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని, అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జోసఫ్ అరిస్టాటిల్ ఖండించారు. జగన్ చర్య అవాంఛనీయమని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేదని వ్యాఖ్యానించారు.   తాజా పరిణామాలు పరిశీలిస్తే.. భారత న్యాయవ్యవస్థ అంతా ఒక్కతాటిపైకి వచ్చినట్లే కనిపిస్తోంది. తమపై రాజకీయ వ్యవస్థ పెత్తనం చేయడాన్ని, న్యాయవ్యవస్థ జీర్ణించుకోలేకపోతోందని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ లేఖలో వాడిన పదజాలం స్పష్టం చేస్తోంది. ఇలాంటి చర్యలను ఇప్పుడే ఎదుర్కొనకపోతే, భవిష్యత్తులో న్యాయవ్యవస్థ అందరికీ చులకన అవుతుందని, న్యాయమూర్తులను విలువ ఉండదని భావించినట్లు బార్ అసోసియేషన్ స్పందన స్పష్టం చేస్తోంది. ప్రధానంగా.. వివిధ ఆరోపణలతో జైల్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడు, సుప్రీంకోర్టు- హైకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదు చేయడాన్ని, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ జీర్ణించుకోలేకపోయినట్లు కనిపిస్తోంది. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే, దేశంలో ఇక ఏ న్యాయమూర్తి స్వేచ్ఛగా తీర్పులివ్వకపోగా, తమపై సుప్రీంకోర్టుకు ఎలాంటి ఫిర్యాదులు వెళతయోనన్న భయంతో బతికే పరిస్థితి ఏర్పడుతుందని ముందుగానే ఊహించినట్లు స్పష్టమవుతోంది.   అయితే ఈ మొత్తం వ్యవహారంలో, తాను లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రమణ నైతిక-సాంకేతిక ఇబ్బందులలో  ఇరుక్కుంటారని జగన్ అంచనా వేశారు. ప్రధానంగా ఆయనకు చీఫ్ జస్టిస్ పదవి దక్కదని ఇప్పటికీ ఊహిస్తున్నారు. కానీ ఇది అటు తిరిగి ఇటు తిరిగి, తన పదవికే ఎసరు తెచ్చేలా చేస్తుందని అంచనా వేసినట్లు లేదు. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ చురుకుగా, క్రియాశీలకంగా పనిచేస్తుంది. గతంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రమణ వ్యవహార శైలిపై, ఢిల్లీ బార్ అసోసియేషన్‌కు బాగా అవగాహన ఉంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, రమణ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అవి ప్రజల అభిమానం కూడా చూరగొన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో, ఢిల్లీ బార్ అసోసియేషన్ ఏకోన్ముఖంగా జగన్ చర్యను ఖండించడం, జస్టిస్ రమణకు నైతిక స్ధైర్యం కలిగించే అంశమే.   సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయవాదుల పిటిషన్ నేపథ్యంలో, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లంరెడ్డి కూడా ఇరుకున పడాల్సి వచ్చింది. చీఫ్ జస్టిస్‌కు సీఎం రాసిన లేఖ వివరాలను, ఆయనే మీడియాకు విడుదల చేశారు. ప్రభుత్వ  రహస్యాలను కాపాడతానని  రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం జగన్.. లేఖ వివరాలు వెల్లడించి, దానిని ఉల్లంఘించారన్నది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన ఎదుర్కోనున్న ప్రధాన అభియోగం.  అసలు చీఫ్ జస్టిస్‌కు ముఖ్యమంత్రి రాసిన లేఖ, ప్రభుత్వ సలహాదారుకు ఎలా వచ్చింది? ఆయన ఏ అధికారంతో వాటిని విడుదల చేశారన్న అభియోగం ఇటు కల్లం రెడ్డికి సంకటప్రాయమే. పాపం.. ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుని, సలహాదారుగా ప్రశాంతంగా కాలం గడపుతున్న కల్లం రెడ్డి చివరకు ఈ వివాదంలో చిక్కుకున్నారు.  -మార్తి సుబ్రహ్మణ్యం  

సింహాచలం దేవస్థానం సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ పాలూరి నరసింగ రావు బుధవారం సస్పెండ్ అయ్యారు.    దేవాదాయ కమిషనర్ పి అర్జున రావు బుధవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో, నరసింగ రావును సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేసారు. దేవస్థానంలో జరుగుతున్న అనేక అవకతవకలకు కారణమైన నరసింగ రావు, అనేక విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని, ముఖ్యంగా, దేవస్థానానికి సంబంధించిన 13 ఎకరాల భూమి విషయంలో హై కోర్ట్ యధా స్థితి (స్టేటస్ కో) ఇచ్చినప్పటికీ ఆ భూమి ఇతరులు చదును చేయడానికి నరసింగ రావు చట్ట విరుధంగా అది ఆక్రమించినవారికి సాయంచేస్తున్నదని తన దృష్టికి వచ్చినందున నరసింగ రావు ను వెంటనే సస్పెండ్ చేస్టజున్నట్లు ప్రకటించడం జరిగిందని కమిషనర్ తెలియజేసారు.    ఈ సస్పెన్షన్ ఆయనపై ఎంక్వైరీ అయ్యేవరకు కొనసాగుతుందని, తదుపరి అవసరమైన చర్యలు ఆ దేవాలయ ఎక్క్సిక్యూటివ్ ఆఫీసర్ తీసుకుంటారని కమిషనర్ తెలియజేసారు. నరసింగ రావు ప్రస్తుతమున్న పోస్టులో కొనసాగితే ఆయనపైనే జరుగుతున్న ఎంక్వైరీ ఏ కాకుండా, దేవాలయ భూములు ఫై జరుగుతున్న ఎంక్వైరీలలో కూడా అయన జోక్యం చేసుకునే అవకాశం ఉండడంవల్ల ఆయనను వెంటనే సస్పెండ్ చేయడం జరిగిందని అర్జున్ రావు తెలియజేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీకి పోతే బడికి పోయొచ్చినట్లుందట..

తెలంగాణాలో రెండు రోజుల పాటు నిన్న, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ సమావేశాల పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. తనకు మాత్రం ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి వెళుతున్నట్లుగా లేదని, స్కూలు కు పోయి హెడ్మాస్టర్‌ చెప్పే పాఠాలు విని వస్తున్నట్లుగ అనిపిస్తోందని జగ్గారెడ్డి అన్నారు. భారీ వర్షాలతో ఒకపక్క పంటలు నష్టపోయి రైతులు, మరోపక్క హైదరాబాద్‌ నగరం మునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. అసెంబ్లీలో ఆ అంశాలపై అసలు చర్చే లేదని ప్రభుత్వ తీరును అయన తీవ్రంగా విమర్శించారు. శాసనసభ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ ఎప్పుడు పెడతరో.. ఎప్పుడు బంద్ జేస్తరో తెలియట్లేదు. బీఏసీ సమావేశాలు లేవు.. అజెండాలూ లేవు. ఈ రాష్ట్రంలో చాలా చిత్రమైన పాలన నడుస్తోంది’’ అని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కనీసం తమ నియోజకవర్గాల్లోని రైతుల ఇబ్బందుల గురించీ కూడా సభలో ప్రస్తావించలేదన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. చదువు వచ్చిన వేలుముద్రగాళ్లుగా మారారని అయన తీవ్రంగా విమర్శించారు. ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం బిల్లులను ఆమోదించుకునేందుకే ప్రస్తుత శాసనసభ సమావేశాన్ని పెట్టారని, అసలు ఆ బిల్లులపైన కూడా చర్చించలేదని అయన విమర్శించారు.   అసలు ఇంత హడావుడిగా జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌ విశ్వనగర అభివృద్ధికి రూ.72 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం కేసీఆర్‌ అంటున్నారని, అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే.. దాన్ని నమ్మేట్లుగా ఉందా? అని నిలదీశారు. హైదరాబాద్‌లో వేల కోట్లు ఖర్చు చేశారన్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే.. తన నియోజవర్గంలో జరిగిన అభివృద్ధి ఎక్కడో చూపాలన్నారు. హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లన్నీ‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డి హయాంలో కట్టినవేనన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించి.. తెలంగాణ ఉద్యమం వల్ల నిలిచిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారన్నారు. గడ్డిపోచ తప్పు చేస్తే.. ఏకంగా గడ్డిమోపునే తగలబెట్టిన చందంగా ధరణి వ్యవహారం ఉందని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల ఆస్తులను తీసుకొచ్చి ప్రయివేటు యాప్‌లో పెట్టి ఏం చేస్తారని అయన సర్కారు ని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చిన్న సమస్యలకు కూడా సీఎం దగ్గరికి వెళ్లి నిలదేసేవాళ్లు. ప్రస్తుత అసెంబ్లీతో ప్రజలకు ఏమాత్రం మేలు జరగదు. దుబ్బాక ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించి సీఎం కేసీఆర్‌కు దెబ్బ కొడితే అపుడు ఆయన ప్రజల వద్దకు వస్తడు. అలాకాకుండా రూ. 5 వేలే తీసుకుని ఓటేశారో ఆ డబ్బులతోనే బతకాల్సి వస్తది అని అయన ప్రజలను హెచ్చరించారు.

ఏపీలో పాలెగాళ్ళ పాలన.. జగన్ సర్కార్ పై రఘురామరాజు ఫైర్

వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "జగన్‌ నీరో చక్రవర్తిలా మారారు. రోడ్లు లేకపోయినా గన్నవరం వెళ్లేందుకు అయనకు హెలికాఫ్టర్‌ ఉంది. మరి ప్రజల సౌకర్యము కోసం ఇంటింటికీ హెలికాఫ్టర్స్‌ పథకం పెడతారా? ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని రాష్ట్రపతికి లేఖ రాశా. అసలు జగన్‌ మనసు తెలియకనే వైసీపీలో చేరా. ప్రస్తుతం ఏపీలో పాలెగాళ్ల పరిపాలన నడుస్తోంది. ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి ఒక పాలెగాడు. మా నియోజకవర్గం నరసాపురంలో ఓ పాలెగాడు ఆవ భూముల్లో అవినీతి చేశారు. అలాగే అమరావతి రైతులపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరం. పిచ్చి మాటలు మాట్లాడటం మంచిది కాదు. సీఎం బాబాయ్ ఆవ భూముల్లో అవినీతి చేశారని ప్రజలు అనుకుంటున్నారు. పార్లమెంట్‌లో మీ సామాజికవర్గం వారికి పదవులు ఇచ్చారు. అంతేకాకుండా జగతి పబ్లికేషన్స్‌లో ఎంపీ బాలశౌరి పెట్టుబడులపై సీబీఐకి ఫిర్యాదు చేశా. త్వరలో విచారణ కూడా జరుగుతుంది" అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

జగన్ లేఖపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది.   హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడంతో ఆ పార్టీ నేతలు న్యాయమూర్తులపైనా, న్యాయవ్యవస్థపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అయితే ఏకంగా పార్లమెంట్ లో న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇంకో అడుగు ముందుకేసి..  ఏపీ హైకోర్టును జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సీజేఐకి లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం మీడియా ముఖంగా వెల్లడించి సంచలనం రేపారు. అయితే, జగన్ లేఖను ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తప్పపట్టింది. న్యాయవ్యవస్థపై పెత్తనం చెలాయించే ప్రయత్నంలో భాగంగానే కాబోయే సీజేఐ స్థానంలో ఉన్న జస్టిస్ రమణపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.   జగన్ లేఖను ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, జగన్ చర్యలు న్యాయ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ మండిపడింది. జస్టిస్ రమణ ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అని.. ఎలాంటి ఆధారాలు లేకుండా న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికింది. కోర్టుల స్వతంత్రతను దెబ్బదీసేలా జగన్ వ్యవహరించారని, న్యాయ వ్యవహారాల్లో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టుగా తాము భావిస్తున్నామని తెలిపింది. ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడటం అత్యంత దారుణమని మండిపడింది. ఇది కచ్చితంగా కోర్టును ధిక్కరించడం కిందికే వస్తుంది. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న అపార నమ్మకాన్ని దెబ్బతీసే ఈ దుష్ట ప్రయత్నాన్ని ఢిల్లీ కోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది అని పేర్కొంది.    న్యాయమూర్తులపైనా, న్యాయవ్యవస్థపైనా బహిరంగ విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా దూకుడు తగ్గిస్తారో లేక అధికారంలో ఉన్న మమ్మల్ని ఆపే హక్కు ఎవరికీ లేదంటూ ఇలాగే దూకుడుగా వెళ్తూ ముందు ముందు పెద్ద సమస్యలు కొని తెచ్చుకుంటారో చూడాలి.

విలవిలలాడిన విశ్వనగరం! కేసీఆర్ పాలనకు సాక్ష్యం?

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గొప్పగా చెబుతున్న విశ్వనగరం విలవిలలాడింది. భారీ వర్షానికి అల్లాడి పోయింది. సిటీలో గల్లీ ఏరైంది.. కాలనీ చెరువైంది.. రహదారి సాగరమైంది. హైదరాబాద్ నగరం కనివిని ఎరుగని జల విలయాన్ని చూసింది. భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. భారీ వర్షానికి బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతున నీళ్లు నిలిచాయి. కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంట్లు సెల్లార్లలోకి వరద నీరు చేరడంతో వాహనాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.    నగరంలో కుండపోతగా కురిసిన వర్షానికి పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాంద్రాయణగుట్ట బండ్లగూడ మహ్మద్‌నగర్‌లో ఓ వెంచర్‌ ప్రహరీ కూలి.. ఇళ్లపై పడటంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పాతబస్తీలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు.  అతన్ని ఎవరూ రక్షించలేని పరిస్థితి నెలకొంది. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోయాయి. పాతబస్తీలో పరిస్థితి దారుణంగా ఉంది. వందలాది మంది వరద నీటిలోనే ఉన్నారు. బిల్టింగులపైకి చేరి సాయం చేయాలని, రక్షించాలని కేకలు పెట్టారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. వరద ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో హెలికాప్టర్లను ఉపయోగించారు. పాతబస్తీలో సహాచర్యల  కోసం ఎన్డీఆర్ఎఫ్ కు తోడుగా సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాల్సి వచ్చింది.               హైదరాబాద్ మహానగరంలో మధ్యాహ్నమే కారు చీకట్లు కమ్ముకున్నాయి. సగం నగరం అంధకారంలో మునిగిపోయింది. గ్రేటర్‌ పరిధిలో 800 ఫీడర్లు ఉండగా దాదాపు 400 ఫీడర్లలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.ప్రతిచోటా గంటల కొద్దీ సరఫరా నిలిచిపోయింది. కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తుండడం, వర్షం తగ్గకపోవడంతో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రంతా కరెంట్ లేక నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని జనాలు చెబుతున్నారు.    వరద ఉధృతికి పలు జాతీయ రహదార్లు స్తంభించిపోయాయి. హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. పలు కార్లు నీట మునిగాయి. రోడ్డుకు ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోవడం, వరద తీవ్రత మధ్య వాహనదారులకు ఇళ్లకు చేరడం కష్టమైంది.  భారీ వర్షం, వరదతో నగరం జనం నరకం చూశారు.  హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని డల్లాస్‌లా తయారు చేస్తాం.. పాతబస్తీని ఇస్తాంబుల్ గా మారుస్తామని  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  2015 ఫిబ్రవరిలో ప్రకటించారు. .ఇప్పుడు కూడా సమయం వచ్చినప్పుడల్లా గ్రేటర్ ను ఎంతో అభివృద్ధి చేస్తామని చెబుతుంటారు కేసీఆర్. ఆరేండ్లలో హైదరాబాద్ లో దాదాపు 60 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అయితే భారీ వర్షానికి హైదరాబాద్ లో పరిస్థితి చూస్తే.. నగరం ఎలా అభివృద్ధి చెందిందో జనాలకు అర్థమైపోయింది. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.                        హైదరాబాద్ నగరంలో పరిస్థితికి ప్రధాన కారణం  నాళాలు, నగర శివారులో ఉన్న చెరువులు కబ్జాకు గురికావడమే. చెరువులు కబ్జా కావడంతో వాటి కట్టలు తెగి వరద నీరు ప్రవహిస్తోంది.  నీళ్లు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వరదంతా లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. రోడ్ల వెంట నీళ్ల వెళ్లడానికే ఏర్పాట్లు లేకపోవడంతో ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. డ్రైనేజీలను పట్టించుకునే వారే లేకపోవడంతో అవన్ని వరదతో పొంగి ప్రవహించాయి. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలేవి బల్దియా తీసుకోకపోవడంతో సిటీ జనాలకు శాపంగా మారింది. రోడ్లు, కాలనీలు, డ్రైనేజీలన్ని ఏకమయ్యాయి. కార్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటే హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో ఊహించుకోవచ్చు.    ఆరేండ్లలో60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ డబ్బులతో హైదరాబాద్ లో ఏం చేశారో ఎవరికి అర్ధం కావడం లేదు. ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏ నిర్మించారో చెప్పాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. వరద నీరు పోయే నాలాలు విస్తరించలేదు, కొత్త కాల్వలకు గతి లేదు.. రోడ్లన్ని గుంతలుగానే ఉన్నాయి. మరి 60వేల కోట్లతో ఏం చేశారనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. డల్లాస్ , ఇస్తాంబుల్ చేయడం కాదు ముందు వరద నీరు పోయే మార్గాలు చూడాలని సీఎం కేసీఆర్ పై ఫైరవుతున్నారు ప్రజలు.    ఓల్డ్ సిటీ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తామని, ఇస్తాంబుల్​లా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఐదేండ్ల కింద ప్రకటించింది. కానీ అడుగు కూడా ముందుకు పడలేదు. ఇరుకైన రోడ్లు, చెత్తతో నిండిన మురికివాడలు, డ్రైనేజీలను తలపించే బస్తీలు కనిపిస్తున్నాయి. రాజసౌధాలు, వారసత్వ సంపదగా ఉన్న మసీదులు, కట్టడాలను 150కి పైగా గుర్తించిన ఇస్తాంబుల్ ప్రభుత్వం.. వాటిని రక్షించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించింది. కానీ మన నగరంలో 200కు పైగా ఉన్న కట్టడాలు, కోటలు, మసీదులు, దేవాలయాల పరిరక్షణ అంశాన్ని ప్రభుత్వం  గాలికొదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి. నాలాల్లో పూడికతీత కూడా తీయకపోవడంతో వర్షానికి వరద నీరు పోయే మార్గం లేక.. ఆ వరదంతా కాలనీలను, ఇండ్లను ముంచెత్తింది. ఓల్ట్ సిటీలోని కొన్ని కాలనీల్లోని జనం రాత్రంగా ఇండ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారంటే.. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.    హైదరాబాద్ దుస్థితిపై విపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని మండిపడుతున్నాయి. విశ్వనగరం చేస్తామంటూ హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. డల్లాస్ చేస్తామంటూ సిటిని ఖల్లాస్ చేశారని  ఫైరవుతున్నారు. ఇస్తాంబులే చేస్తామన్న పాతబస్తీని సముద్రంలా మార్చారని మండిపడుతున్నారు.    ఇప్పటికైనా కేసీఆర్ గొప్పలు కట్టిపెట్టి గ్రేటర్ పై ఫోకస్ చేయాలని సిటీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.  ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటే చాలని, లండన్, డల్లాస్ , ఇస్తాంబుల్ సిటీ తరహా సౌకర్యాలు తమకు అవసరం లేదని చెబుతున్నారు.

హైదరాబాద్ కు దగ్గరలో తీవ్ర వాయుగుండం.. మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం

నిన్నటి నుండి కురుస్తున్న అతి భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతోంది. తాజాగా తీవ్ర వాయుగుండం హైదరాబాద్ కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో వచ్చే 12 గంటలలో ఇది తీవ్ర అల్పపీడనంగా మారి బలహీనపడుతుందని వాతావరణ శాఖ చెపుతోంది. దీని ప్రభావంతో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.   ఇది ఇలా ఉండగా ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో న‌గ‌రంలోని రోడ్ల‌న్నీ చెరువులను తలపిస్తున్నాయి . కొన్ని చోట్ల అపార్ట్మెంట్ సెల్లార్లు నీటితో నిండిపోగా… మరి కొన్ని చోట్ల నాలాలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నిన్న ఒక్క రోజులో 32సెం.మీ వ‌ర్ష‌పాతం నమోదవడంతో లోత‌ట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ఇంట్లో నుండి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.   ఇది ఇలా ఉండగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో కురుస్తున్న భారీ వ‌ర్షాలతో.. వ‌ర‌ద ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలో ఉన్న అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్యాల‌యాల‌కు ఈరోజు, రేపు రెండ్రోజుల పాటు సెలవులు ప్ర‌క‌టించింది. త‌ప్ప‌నిస‌రి సేవ‌లు మిన‌హా అన్ని ర‌కాల కార్యక‌లాపాల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది. అంతేకాకుండా ప్రజలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జైలులో ఆత్మహత్య చేసుకున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు

కోటి 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అరెస్టయిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు చంచల్‌గూడ జైల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజులుగా ఏసీబీ ఈ కేసు పై ఎంక్వైరీ చేస్తోంది. ఇటీవలే ఆయన ఇళ్లల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.   దాదాపు 19 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని క్లియర్ చేయడానికి నాగరాజు లంచం డిమాండ్ చేస్తున్నారని అప్పట్లో ఎసిబి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో నెల రోజులుగా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇక తాను ఈ కేసు నుంచి బయటపడటం సాధ్యం కాదని భావించడం వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకొని ఉంటారని తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

‘దేవుడి’ సన్నిధిలో దైవజ్ఞసమ్మేళం!

స్వరూపుల వారి సేవలో సర్కారు శాఖ   ఆ సాములోరి స్పెషాలిటీ ఏమిటో?   ఆయన నడిచే దేవుడు. శంకరాచార్య అంశలో విశాఖలో కళ్లు తెరచిన ఓ మహా తపస్వి. తన కఠోర తపస్సుతో.. ఒక నేతను పాలకుడిగా మార్చిన దైవాంశ సంభూతుడు. మరి అంతటి మహాత్ముడిని సేవించి తరించడం పాలకుల విధి. కర్తవ్యం. బాధ్యత కూడా! పాలకుల సేవిస్తున్నారంటే, భృత్యులు కూడా వారిని అనుసరించాల్సిందే. అందుకేనేమో.. తెలుగడ్డపై ఎంతోమంది పీఠాధిపతులు, వారి ఆశ్రమాలు ఉన్నప్పటికీ, సదరు స్వామి వారి పీఠంలోనే సర్కారీ శాఖ అధికార కార్యక్రమం నిర్వహించి తరించిపోయింది.   అసలు కథేమిటంటే.. సర్కారు ఏలుబడిలోని దేవదాయ ధర్మదాయ శాఖ కొద్దిరోజుల క్రితం,  ‘జగన్గురు’వయిన.. జగద్గురు స్వరూపానంద స్వామి వారి విశాఖ చినముషిడివాడ శారదాపీఠంలో ‘దైవజ్ఞ సమ్మేళం’ జరిగింది. దీనిని రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ నిర్వహించింది. దీనికి దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్,  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ డైరక్టర్ కృష్ణశర్మ, దేవాలయ పాలనా సంస్థ డైరక్టర్ ద్రోణంరాజు రామచంద్రరావు హాజరయ్యారు. సరే..  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ డైరక్టర్ కృష్ణశర్మ అంటే పూర్వాశ్రమంలో.. ఆ ఆశ్రమంలో అర్చక స్వామి కాబట్టి.. సాములోరి  సన్నిధిలో ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహిద్దామన్న ఆలోచన ఉండవచ్చు. తప్పులేదు. తనకు పదవి ఇప్పించినందుకు ఆపాటి కృతజ్ఞత, గురుభక్తి ప్రదర్శించడంలో ఆక్షేపణ ఏమీ కాదు. అది వేరే విషయం.   ఈ సందర్భంగా స్వామివారు పంచాంగాలపై పంచాయతీలు వద్దని, పండుగలు నిర్ణయించే అంశంలో పంచాంగ కర్తలంతా.. ఏకాభిప్రాయానికి రావాలని హితవు పలికారు. అంతవరకూ బాగానే ఉంది. పండుగల తేదీపై పండితుల మధ్య, చాలా ఏళ్ల నుంచి పంచాయతీ నడుస్తోంది. కాబట్టి స్వామి వారి హితోక్తులు వారిపై ప్రభావం చూపిస్తే, ఇకపై పండితులంతా స్వామి వారు సెలవిచ్చినట్లు.. ఒకే తేదీ ప్రకటిస్తారని ఆశించడంలో తప్పులేదు. కానీ..  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ వారు,  విశాఖలోని ‘జగన్గురువు’ గారి పీఠంలోనే ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించాలన్న ప్రశ్నలు,  కొత్తగా తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలో చాలామంది పీఠాథిపతులున్నారు. ఆశ్రమాలూ ఉన్నాయి. కానీ, సర్కారు వారు కేవలం స్వరూపానందుల వారి ఆశ్రమంలోనే, ఈ  దైవజ్ఞసమ్మేళం నిర్వహించారన్న ప్రశ్నలు హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రమోషన్ వ్యవహారాల వల్ల.. ఎవరి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. దేవదాయ శాఖ ఉన్నతాధికారులకంటే, సర్కారు వారి సేవలో తరించక తప్పదు. కానీ, ఒక ప్రైవేటు పీఠాథిపతి పీఠంలోనే అధికారిక కార్యక్రమం నిర్వహించి, స్వామి వారి సేవలోనూ తరించడం ఏమిటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.   ఇప్పటికే స్వామి వారి పీఠం ముందున్న.. పోలీసు పోస్టు, బుగ్గకారు, సెక్యూరిటీ వాతావరణం చూస్తే, అదేదో ఒక మంత్రి గారి బంగ్లా వాతావరణం దర్శనమిస్తుంది. ఇప్పుడిక సర్కారీ శాఖలు కూడా అక్కడికే తరలివెళితే.. ఇక దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే పెడితే నిక్షేపంలా ఉంటుందన్నది కొందరి వ్యాఖ్య. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఏ దేవదాయ కమిషనరు కూడా ఇప్పటివరకూ ఒక పీఠంలో అధికార కార్యక్రమాలు నిర్వహించడం గానీ, కార్యక్రమాల రూపకల్పన, నిర్ణయాలలో ఏ ఒక్క పీఠాధిపతి ఆశ్రమానికి అధికారులు వెళ్లి వారి అనుమతి తీసుకున్న దాఖలాలు, చరిత్ర ఎన్నడూ లేదు. ఎలాగూ ఆ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు కాబట్టి, ఆ కార్యాలయాలేవో పీఠంలోనే ప్రతిష్ఠిస్తే అధికారులకు సమయం, ఇంధన ఖర్చులూ మిగిలిపోతాయి కదా అన్నది బుద్ధిజీవుల ఆలోచన.   ఎలాగూ విశాఖకు రాజధానిని తరలిస్తున్నందన, కమిషనర్, జేసీ, ఏసీల కార్యాలయాల వరకూ పీఠంలోనే పెడితే.. వారికి దిశానిర్దేశం ఇచ్చేందుకు, స్వామి వారికి కూడా కొంత సౌకర్యంగానే ఉంటుంది కదా? ఏమంటారు? పాలకులు ఈ దిశగా ఆలోచిస్తే, ఒక్క ఎండోమెంటు శాఖ మాత్రమే కాకుండా.. అనంతకోటి  భక్తుల జన్మలు కూడా చరితార్ధమవుతాయి. ఓసారి ఆలోచించి చూద్దురూ?! -మార్తి సుబ్రహ్మణ్యం

జస్టిస్ రమణపై.. బాబు స్పందించరేం?

బీజేపీ మదిలో సీజేగా మరో ప్రముఖుడు? అయినా ఇంకా బీజేపీ పల్లకీ మోస్తారా? అధినేత తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి అప్ప ఆర్భాటమే తప్ప బావబతికుంది లేదన్నట్లు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత తాపత్రయపడినా, తల్లకిందులు తపస్సు చేసినా.. ‘కమలం క వల నేతలు’ ఆయనను దగ్గరకు రానీయరు. ఇది ఇప్పటి పరిణామాల బహిరంగ రహస్యం. తాజాగా జస్టిస్ రమణకు వ్యతిరేకంగా.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో, ఇప్పటివరకూ బాబు స్పందించకపోవడమే ఆశ్చర్యం. చిన్న చిన్న అంశాలకే ప్రకటనలు, ట్వీట్ల ద్వారా  స్పందించే చంద్రబాబు- ఆయన తనయుడు లోకేష్.. అత్యంత కీలకమైన ఈ అంశంపై మాత్రం మౌనం వహించడం విశేషమే కాదు. ఆశ్చర్యమే!  దానితో ఆయన జస్టిస్ రమణ వ్యవహారంలో,  ఎటు వైపున్నారన్న సందేహం తెరపైకొచ్చింది.  మరికొద్ది నెలల్లో జస్టిస్ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆయనపై ఆరోపణలు చేస్తూ.. సుప్రీంకోర్టు సీజేకి ఇచ్చిన ఫిర్యాదు, దేశంలో సంచలనం సృష్టించింది. దానిపై అన్ని వర్గాల్లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. పైగా చంద్రబాబు.. జస్టిస్ రమణ ద్వారా, హైకోర్టు న్యాయమూర్తిని ప్రభావితం చేస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వర్ల రామయ్య వంటి సీనియర్లు స్పందించారు. జైలుకు వెళ్లొచ్చిన ఒక నిందితుడు, న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం ఏమిటని నిప్పులు చెరిగారు. కానీ, ఈ అంశంపై అటు చంద్రబాబు గానీ, ఆయన తయుడయిన లోకేష్ గానీ ఎక్కడా స్పందించకపోవడం, పార్టీ వర్గాలను విస్మయపరిచింది. ప్రతి అంశంపై రోజుకు రెండు మూడు ట్వీట్లు, ప్రకటనలు చేసే ఆ ఇద్దరు.. జిస్టిస్ రమణ వ్యవహారంపై, మౌనంగా ఉండటమే నేతలను విస్మయపరుస్తోంది. పోనీ.. అది న్యాయవ్యవస్థకు సంబంధించినది కాబట్టి మౌనంగా ఉన్నారనుకున్నా.. సీఎం ఫిర్యాదులో బాబు ప్రస్తావన కూడా ఉంది. కనీసం దానిపై కూడా స్పందించకుండా, బాబు మౌనంగా ఉండటంపై తమ్ముళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా తమ అధినేత లక్ష్యంగా జరుగుతున్న పరిణామాలని, ఆయన భుజంపై తుపాకీ పెట్టి ఢిల్లీకి గురిపెట్టారని తెలిసి కూడా, బాబు మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బహుశా ఈ వ్యవహారంలో.. కేంద్రంలోని బీజేపీ జోక్యం ఉందని భావిస్తున్నందుకే, బాబు మౌనంగా ఉంటున్నారన్న మరికొన్ని వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. పైగా..చీఫ్ జస్టిస్ పదవికి బీజేపీ పరిశీలనలో రమణ కాకుండా, మరో ఒకరిద్దరు న్యాయమూర్తులు ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా ఈ సమాచారం తెలిసిన బాబు.. అందుకే  ఈ వ్యవహారంపై స్పందించకుండా, వ్యూహత్మకంగా మౌనంగా ఉన్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ తాను స్పందిస్తే.. కచ్చితంగా రమణకు అనుకూలంగా-జగన్‌కు వ్యతిరేక ంగానే గళం విప్పాల్సి ఉంటుంది. అప్పుడు వైసీపీకి అది మరో ఆయుధమవుతుంది. ఇన్ని కోణాలు పరిశీలించిన తర్వాతనే, బాబు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని సీనియర్లు చెబుతున్నారు. ఆరోపణల నేపథ్యంలో రమణ అవకాశం కోల్పోతే, అది ఒక తెలుగువాడికి దూరమయిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ తెరవెనుక చక్రం తిప్పుతోందన్న చర్చ జరుగుతోంది. అయినా, ఒక రాజకీయపార్టీ అధినేతగా స్పందించాల్సిన చంద్రబాబు, మౌనంగా ఉండటం కేవలం బీజేపీకి భయపడేనంటున్నారు. గతంలో సుప్రీంకోర్డు జడ్జీలు ప్రెస్‌మీట్ పెట్టిన అంశం, ఆ తర్వాతి పరిణామాలపై కాంగ్రెస్ స్పందించిన విషయాన్ని, టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణలో మావోయిస్టుల అలజడి! పాత రోజులు రాబోతున్నాయా?

తెలంగాణలో మావోయిస్టులు మళ్లీ బలపడుతున్నారా? కేసీఆర్ సర్కార్ కు, పోలీసులకు సవాల్  విసరబోతున్నారా?. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో జనాల్లో ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ నేతలపై దాడులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలుస్తున్న పోస్టర్లు, పోలీసుల హడావుడితో మావోయిస్టుల బలోపేతంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.  పోలీసుల కూంబింగ్ తో  కొన్ని రోజులుగా ఏజెన్సీలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయినా మావోయిస్టుల కదలికలు కనిపిస్తుండటం ఏజెన్సీలో అలజడి రేపుతోంది.  పోలీసుల కూంబింగ్ సాగుతుండగానే ములుగు జిల్లాలో తాజాగా మావోయిస్టుల వాల్ పోస్టర్లు వెలిశాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోస్టర్లు, కరపత్రాలు దర్శనమిచ్చాయి. ఏటూరు నాగారం మండలం షాపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట గోడలకు ఈ వాల్ పోస్టర్లు  అంటించారు. కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదని, ప్రజలు సమస్యలు అడిగితె అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని లేఖల్లో ఆరోపించారు మావోలు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పెంచుతూ . అక్రమ కేసులు పెడుతూ  కేసీఆర్ ప్రజలను బలి చేస్తున్నారని మావోయిస్టులు మండిపడ్డారు.                         తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టు ల ఏరివేతకు  పోలీసు బలగాలతో అడవులను జల్లడ పట్టడం ఆపాలని లేఖలో  డిమాండ్ చేశారు. కూంబింగ్స్ ఆపకుంటె టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు భీమేశ్వర రావుకు పట్టిన గతే పడుతుందని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. మాజీ మావోయిస్టు ముద్రబోయిన సంపత్ తన బొలేరో వాహనం లో పోలీసులను తిప్పడం పద్ధతి కాదని హెచ్చరించారు. పద్దతి మార్చుకోకపోతే ఆయనకు ప్రజల చేతులో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు. మూడు రోజుల క్రితమే  ములుగు జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. వెంకటాపురం మండలం భోదాపురంలో టీఆర్ఎస్ పార్టీ నేత భీమేశ్వర్ రావును హతమార్చారు.  భీమేశ్వర్ ఇంటిపై దాడి చేసిన మావోయిస్టులు కత్తితో పొడిచి, తుపాకీతో కాల్పులు జరిపి ఆయనను హత్య  చేశారు.  టీఆర్ఎస్ నేతను హత్య చేసిన అనంతరం అక్కడ లేఖ వదలి వెళ్లారు మావోయిస్టులు. తమ ఉనికి చాటుకోవాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ నేతను మావోయిస్టులు హత్య చేసి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే టీఆర్ఎస్ నేతను చంపినా ములుగు జిల్లాలోనే తాజాగా మావోయిస్టులు మరోసారి వార్నింగ్ లేఖ వదలడం పోలీసు వర్గాలను మరింత కలవరపరుస్తోంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా మావోయిస్టుల కదలికలు తగ్గినట్లు కనిపించింది. కేసీఆర్ సర్కార్  పాలనలో తొలి ఐదేండ్లు మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి ఘటనలు జరగలేదు. కాని ఇటీవల తెలంగాణలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. మావోల పేరుతో గ్రామాల్లో వాల్ పోస్టులు, కరపత్రాలు విడుదలయ్యాయి.  వివిధ జిల్లాల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. బలగాలతో ఎక్కడికక్కడ కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. జూలై 12న ఆసీఫాబాద్‌ జిల్లా తిర్యాణి అడవుల్లో పలువురు మావోయిస్టు సభ్యులు తప్పించుకు పోయారు. మళ్లీ 15న తొక్కిగూడెంలోనూ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే ఎదురు కాల్పుల సమయంలో పోలీసులకు దొరికిన డైరీలో కీలక అంశాలు తెలిసినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు 600 మంది పోలీసు బలగాలతో తిర్యాణి అటవీ ప్రాంతాన్ని దాదాపుగా అష్టదిగ్భంధనం చేశారు.మావోయిస్టు కీలక నేత మైలారపు అడెల్లు లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది.  డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. జూలై , సెప్టెంబర్ లో  రెండు సార్లు ఆసిఫాబాద్‌లో పర్యటించారు డీజీపీ. తిర్యానిలోని మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలను పరిశీలించారు. పోలీసు అధికారులతో మావోయిస్టుల కదలికలపై ఆరాతీశారు. నెల రోజుల్లో రెండుసార్లు డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీలో పర్యటించడం ఆసక్తి రేపింది. అక్టోబర్ తొలి వారంలోనూ  ములుగు జిల్లా వెంకటాపురంలో డీజీపీ మహేందర్‌రెడ్డి  పర్యటించారు. సీఆర్పీఎఫ్‌ డీజీ ఆనంద్‌ ప్రకాష్‌ మహేశ్వరి, తెలంగాణ నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలను నియంత్రించేందుకు చేపట్టనున్న వ్యూహా ప్రణాళికపై చర్చించారు. సంయుక్తంగా నక్సల్‌ కదలికలను నియంత్రించాలని ఈ సందర్భంగా అధికారులు నిర్ణయించారని సమాచారం.  ఇక  ఇటీవలే మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుపోతున్నారనే ప్రచారం జరిగింది.గణపతి లొంగుబాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చర్చ జరిగింది. గణపతి తర్వాత మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు జన జీవన స్రవంతిలో కలుస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే డీజీపీ మహేందర్ రెడ్డి రెండు సార్లు ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడంతో గణపతి లొంగుబాటుపై చర్చేందుకే వెళ్లారని కూడా భావించారు. కాని అలాంటిదేమి జరగలేదు. గణపతి లొంగుబాటు వార్తలను ఖండిస్తూ మావోయిస్టులు లేఖను కూడా విడుదల చేశారు. గణపతి లొంగుబోతున్నారని ప్రభుత్వమే కట్టుకథ అల్లిందని అందులో ఆరోపించారు. మావోయిస్టు అగ్రనేతలెవరు లొంగిపోయే పరిస్థితి లేదని మావోయిస్టులు లేఖలో స్పష్టం చేశారు.  పోలీసుల కూంబింగ్, డీజీపీ పర్యటన తర్వాత మావోయిస్టులు మరింత దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. నెల రోజులుగా ఎక్కడో ఓ చోట మావోయిస్టుల కదలికలకు సంబంధించిన ఆధారాలు లభిస్తున్నాయి. తెలంగాణ బార్డర్  లో మావోల కదలికలు పెరిగాయని కేంద్ర ఇంటలిజెన్స కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. చత్తీస్ గఢ్ నుంచి భారీగా మావోియిస్టులు తెలంగాణకు వచ్చారని అలర్ట్ చేసిందని తెలుస్తోంది. ఇటీవలే మావోయిస్తులు గుంపులు గుంపులుగా తెలంగాణ వైపు వస్తున్నట్లుగా ఉన్న వీడియో బయటికి వచ్చింది. ఏజెన్సీలో పోలీసులు అమర్చిన నిఘా కెమెరాల్లో  మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రం దిశగా వస్తున్న విజువల్స్ రికార్డయ్యాయి. పోలీసులే ఆ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మావోయిస్టుల గుంపు భారీగా ఉండటం పోలీసు వర్గాలను ఆందోళనకు గురి చేసిందని చెబుతున్నారు.   వందలాది మంది పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే ములుగు జిల్లాలో జరుగుతున్న మావోయిస్టుల వరుస చర్యలతో ఏజెన్సీలో భయాందోళన నెలకొంది. భీమేశ్వరరావు హత్యతో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు భయంభయంగా బతుకున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీకి చెందిన ముఖ్య నేతలంతా ఇతర ప్రాంతాలకు వెళ్లారని తెలుస్తోంది. గ్రామాల్లో ఉన్న పార్టీల కార్యకర్తలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ లో గడుపుతున్నారట. మొత్తంగా ఏజెన్సీలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలతో మళ్లీ పాత రోజులు వచ్చినట్లుగా కనిపిస్తున్నాయని గిరిజనులు, ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల కవాతులు, బుల్లెట్ల శబ్దాలు మళ్లీ వినాల్సి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పొలం కంచెగా బతుకమ్మ చీరలు! కేటీఆర్ ఇలాఖాలోనే! నాసిరకమే కారణమా?

దసరా పండుగకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తోంది. నాలుగేండ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం.. ఈసారి కూడా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణి జరుగుతోంది. బతుకమ్మ చీరలను ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్..  దసరాకు ఇచ్చే కానుకగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటారు. బతుకమ్మ చీరల పంపిణి సీఎం కేసీఆర్ కు కూడా చాలా ఇష్టమైన పథకమని చెబుతారు. అందుకే కేటీఆర్ కూడా చీరల తయారీని స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ప్రతి ఏటా బతుకమ్మ చీరల డిజైన్లను పెంచుతున్నారు. ఈసారి నాలుగు వందలకు పైగా వివిధ డిజైన్లలో బతుకమ్మ చీరలను సిద్ధం చేసినట్లు చేనేత శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశామని చెప్పారు.   అయితే కేసీఆర్ సర్కార్, కారు పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న బతుకమ్మ చీరలే  వారికి అప్రతిష్టను తీసుకొస్తున్నాయనే చర్చ జరుగుతోంది. బతుకమ్మ చీరలు ఓ గ్రామంలో తోటకు కంచెగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గండిలచ్చపేట గ్రామంలో ఓ వ్యక్తి తమ ఇంటి వద్ద తోటను పశువులు పాడుచేయకుండా ఉండడానికి బతుకమ్మ చీరలను కంచెగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించగా  గత ఏడాది వచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకోకుండా అలాగే ఉంచి ఇలా ఉపయోగించినట్లు తెలిపాడు. బతుకమ్మ చీరలన్ని సిరిసిల్ల జిల్లాలోనే తయారవుతున్నాయి. మంత్రి కేటీఆర్ స్పెషల్ ఫోకస్ చేసే బతుకమ్మ చీరలు.. ఆయన సొంత జిల్లా, నియోజకవర్గంలోనే పొలానికి కంచెగా మారడం టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందిగా మారింది.  మొదటి సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణి సందర్భంగా ఎక్కడ చూసినా పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. ప్రభుత్వం భారీగా ప్రకటనలు ఇవ్వడంతో తీసుకోవడానికి మహిళలు ఇష్టపడ్డారు.  బతుకమ్మ చీరల కోసం మహిళలు ఎగబడ్డారు. మహిళలను అదుపు చేసేందుకు అధికారులు కొన్ని ప్రాంతాల్లో పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఊహించినట్లుగా చీరలు లేకపోవడం, నాసిరకంగా ఉండటంతో బతుకమ్మ చీరలపై మహిళల ఆసక్తి పోయినట్లు చెబుతున్నారు. అందుకే రెండో సంవత్సరం నుంచి బతుకమ్మ చీరల క్రేజీ తగ్గిపోయిందని తెలుస్తోంది. గత సంవత్సరం చాాలా బతుకమ్మ చీరలు పంచకుండా మిగిలిపోయాయని అధికారుల లెక్కల్లో తెలుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మిగిలిపోయిన చీరలు కట్టలుగా ఉన్నట్లు చెబుతున్నారు.  ఈసారి అయితే పరిస్థితి మరి దారుణంగా తయారైందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బతుకమ్మ చీరలు తీసుకునేందుకు మహిళలు ముందుకు రాకపోవడంతో  పంపిణి కేంద్రాలు వెలవెలబోయాయి. కొన్ని ప్రాంతాల్లో చీరలు తీసుకునేందుకు రావాలంటూ గల్లిగల్లీ తిరిగి అధికారులు చాటింపు వేయించారని చెబుతున్నారు.  కొన్ని ప్రాంతాల్లో రండమ్మ రండి అని సిబ్బంది అరిచినా .. చీరల పంపిణి కేంద్రాల వైపు ఎవరూ రాలేదని చెబుతున్నారు. మహిళలు రాకపోవడంతో చేసేది లేక కొన్ని గ్రామాల్లో అధికారులే ఇంటింటికి వెళ్లి బతుకమ్మ చీరలను పంపిణి చేస్తున్నారని తెలుస్తోంది. బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండటమే మహిళల నిరాసక్తతకు కారణమంటున్నారు. బతుకమ్మ చీరల నాాణ్యతపై మహిళలు బహిరంగగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. చీరలు పంచేందుకు వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీ. ఎమ్మెల్యేలతో కొన్ని ప్రాంతాల్లో మహిళలు వాగ్వాదానికి దిగుతున్నారు. నాసిరకం చీరలు మాకు అవసరం లేదంటూ వెళ్లిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని తెలుస్తారు. మహిళల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో అధికార పార్టీ నేతలు చీరల పంపిణికి వెళ్లడం లేదని సమాచారం. దీంతో గతంలో  గ్రామాల్లో సందడిగా సాగిన బతుకమ్మ చీరల పంపిణి.. ప్రజాప్రతినిధులు రాకపోవడంతో ఈసారి అధికారులు, స్థానిక నేతలే సాదాసీదాగా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణి చేస్తుందని, నాసిరకంగా ఉన్నయంటూ చీరలపై రాద్ధాంతం చేయడం సరికాదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉండటంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కొందరు గులాబీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా చెప్పుకునే, కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించే బతుకమ్మ చీరలపై ప్రజల్లో వ్యతిరేకత రావడం అధికార పార్టీకి  నష్టం కలిగించేదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఏడాది ఆరంభంలోనే కరోనా వ్యాక్సిన్.. తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న ప్రస్తుత సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఒక తీపి కబురు అందించారు. వచ్చే ఏడాది ఆరంభం లోనే కరోనా వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ప్రకటించారు. అయితే ఈ వ్యాక్సిన్ ను ఎలా పంపిణీ చేయాలనే దానిపై నిపుణులు ప్రస్తుతం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సిన తయారీ కోసం ఇప్పటికే ప్రపంచంలోని పలు సంస్థలు తీవ్ర పరిశోధనలు చేస్తున్నాయి. కాగా కొన్ని సంస్థల క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు కూడా చేరుకొన్నాయి. మరో పక్క భారత్ కు చెందిన భారత్ బయోటెక్, కాడిలా సంస్థలు కూడ వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోదనలు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ కు చెందిన వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది .   ఇది ఇలా ఉండగా దేశంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 72 లక్షలకు చేరుకొంది. గడచిన 24 గంటలలో 66,732 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా కరొనతో 816 మంది చనిపోవడంతో... దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,09,150కి చేరింది. దేశంలో గత 24 గంటల్లో 71559 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఎపి సీఎం హద్దులు దాటారు.. చర్యలు తీసుకోండి.. సుప్రీం కోర్టులో పిటిషన్

ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్ట్ జస్టిస్ రమణతోపాటు, ఎపి హైకోర్టు న్యాయమూర్తుల పై చీఫ్ జస్టిస్ బాబ్డే కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను ప్రెస్ మీట్ లో వెల్లడించడాన్ని తప్పు పడుతూ ఎపి సీఎం జగన్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని సుప్రీం కోర్టులో న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ పిటిషన్ దాఖలు చేసారు. మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడంతో పాటు, వాటిని బహిర్గతం చేయడం ద్వారా న్యాయస్థానాలపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని లాయర్ తన పిటిషన్ లో ఆరోపించారు. అంతేకాకుండా న్యాయవ్యవస్థను తప్పుబడుతూ న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వైసిపి నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నా సీఎం జగన్ అడ్డుకోవడంలేదని... ఇందుకుగాను ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది సునీల్‌ కుమార్ సింగ్ ఆ పిటిషన్ లో కోరారు. అంతేకాకుండా భవిష్యత్తులో న్యాయవ్యవస్థకు సంబంధించి ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించకుండా చూడాలని.. ఈ చర్యలకు కారణమైన సీఎం జగన్ పై ఎందుకు చర్య తీసుకోకూడదో వెల్లడించేలా షోకాజ్ నోటీస్ ఇవ్వాలని సుప్రీం కోర్టును పిటిషనర్ కోరారు.  న్యాయస్థానాలను కించపర్చేలా వ్యవహరించినందుకు ఏపీ సీఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా పిటిషనర్ సుప్రీం కోర్టు ను కోరారు. న్యాయమూర్తులను భయాందోళనకు గురిచేసేలా జగన్, ఆయన పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ చర్యల వల్ల న్యాయస్థానాలపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం వుందన్నారు. కాబట్టి న్యాయవ్యవస్థను కాపాడాలని...భవిష్యత్తులో న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని సునీల్‌ కుమార్ సింగ్ తన పిటిషన్ లో కోరారు. ఈ నెల 10న ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం మీడియా సమావేశాన్ని ఆయన తన పిటిషన్ లో ప్రస్తావిస్తూ, చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు జగన్ ఓ లేఖ రాశారని, అందులో తదుపరి సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న మరో న్యాయమూర్తి ఎన్వీ రమణపై పలు ఆరోపణలు చేశారని అయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీల పై ఉన్న క్రిమినల్ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించాలన్న కేసును ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తున్న వేళ, ఈ ఆరోపణలు వచ్చాయని, అది కూడా ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి చేశారని గుర్తు చేస్తూ, ఆయనపైనా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని సునీల్ కుమార్ సింగ్ తెలియజేశారు. తన చర్యల ద్వారా వైఎస్ జగన్ "దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారని, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారని, దేశపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ద్వారా అస్థిరపరచాలని" చూస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. 

విజయవాడలో దారుణం.. ప్రేమించలేదని యువతిని సజీవ దహనం

  విజయవాడ నగరంలో నిన్న రాత్రి ఒక దారుణమైన ఘటన జరిగింది. విజయవాడలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తనను ప్రేమించడం లేదని, అంతేకాకుండా తనపై పోలీసులకు కంప్లెయింట్ చేసిందని.. నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిపై ఆ ఉన్మాది పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. దీంతో ఆ అభాగ్యురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే నిందితుడికి సైతం మంటలు అంటుకోవడంతో అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన ఓ యువతి (24) విజయవాడలోని ఓ కరోనా కేర్ సెంటర్ లో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె తనతో పాటు కలిసి పనిచేసే యువతులతో కలిసి ఆస్పత్రికి దగ్గరలోనే ఒక గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. అయితే గత కొద్ది రోజులుగా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆ యువతి చుట్టూ తిరుగుతూ తనను ప్రేమించాలని తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.   అయితే కొద్ది రోజులుగా అతడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతడిని పిలిసి వార్నింగ్ ఇవ్వడంతో.. ఆమె జోలికి వెళ్లనని అతను లిఖితపూర్వకంగా తెలిపినట్లు సమాచారం. దీంతో ఆ యువతి కూడా తన కంప్లైంట్ ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో పోలీసులు హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోని నాగభూషణం.. నిన్న రాత్రి డ్యూటీ అనంతరం యువతి ఒంటరిగా నడుచుకుంటూ రూముకు వెళ్తుండగా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వారిద్దరి నడుమ వాగ్వాదం జరిగింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం నాగభూషణం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆ యువతిపై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆ యువతి మంటలు అంటుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో నిందితుడికి కూడా మంటలు అంటుకున్నాయి. అయితే తీవ్రగాయాలైన అతడిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అతడిని అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న గవర్నర్ పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్! రాజకీయ వర్గాల్లో ఆసక్తి

ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి హస్తినకు వెళ్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ను జగన్ కోరినట్లు తెలుస్తోంది. అయితే అపాయిట్మెంట్ ఖరారైందని ఇంకా పీఎంవో ఆఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ను జగన్ రెండో సారి కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.   వారం రోజుల్లోనే రెండోసారి జగన్ ఢిల్లీ వెళ్లడం వెనుక ఆంతర్యమేంటన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్రపతి, ప్రధానిని  కలిసి జగన్ ఏం చర్చించబోతున్నారన్నది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిణామాలు, రాజకీయ విషయాలపై ప్రధాని, రాష్ట్రపతితో జగన్ చర్చించనున్నారని సమాచారం. ముఖ్యంగా సుప్రీంకోర్టు సీజేకు ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై ప్రధాని, రాష్ట్రపతితో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై ఆరోపణలతో ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖను రాష్ట్రపతి, ప్రధానికి జగన్ ఇస్తారని చెబుతున్నారు. వీటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులపై మోడీతో చర్చించనున్నట్టు సమాచారం.   ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ రావాలని కేంద్ర పెద్దల నుంచి ఫోన్ వచ్చిందా..? లేకుంటే జగనే ఢిల్లీ వెళ్తున్నారా..? అనేదానిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఏపీ సర్కార్ నేరుగా తీవ్రమైన ఆరోపణలు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సమస్య తీవ్రంగా ఉండటంతో ఆ విషయంపై జగన్ తో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు పిలిచి ఉండవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.

మండలి ఎన్నికల్లో ఫేక్ ఓటర్లు! టీఆర్ఎస్ పై ఈసీకి ఫిర్యాదు

తెలంగాణ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఫేక్ ఓటర్లు ఉండబోతున్నారా? మండలి ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ అక్రమాలు చేస్తోందా?. తెలంగాణలో ఇదే ఇప్పుడు హాట్ చర్చగా మారింది. టీఆర్ఎస్ పార్టీ నకిలీ ధ్రువపత్రాలు పెట్టి బోగస్ ఓట్లు నమోదు చేయిస్తుందని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న అక్రమాలకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఆయన బుద్దభవన్ లో ఎన్నికల అధికారులకు సమర్పించారు. కొన్ని డాక్యుమెంట్లు, ఫోన్ కాల్స్ , చిత్రాలను కూడా తన ఫిర్యాదుకు జత చేశారు. సీనియర్ అడ్వకేట్ ఉమేశ్ చంద్రతో కలిసి వచ్చి ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు తన ఫిర్యాదును అందించారు తీన్మార్ మల్లన్న. మంత్రి మల్లారెడ్డి కాలేజీల కేంద్రంగా అక్రమ బాగోతం నడుస్తుందని ఆధారాలతో సహా ఎన్నికల అధికారులకు వివరించారు.    తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో ఎన్నిక జరగనుండగా.. అక్టోబర్ 1 నుంచి ఆ ఆరు జిల్లాల్లో ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతోంది. అయితే ఇక్కడే అధికార పార్టీ కుట్రలకు తెరలేపినట్లు తీన్మార్ మల్లన్న ఆరోపిస్తున్నారు. మండలి ఎన్నికలు లేని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన పట్టభద్రులతో ఇక్కడ ఓట్లు నమోదు చేయిస్తున్నారని చెప్పారు. మల్లారెడ్డి యూనివర్శిటీలు, కాలేజీల కేంద్రంగా  అక్రమ బాగోతం జరుగుతుందని తెలిపారు. మల్లారెడ్డి కాలేజీలో పనిచేసే సిబ్బందిని ఇందుకు వినియోగిస్తున్నారంటూ.. కొందరు పట్టభద్రులతో వారు మాట్లాడిన ఆడియో కాల్స్ ను వినిపించారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో మండలి ఓటరుగా ఉన్నవారితోనే ఇక్కడ అప్లయ్ చేయిస్తున్నట్లు ఆ ఆడియాలో స్పష్టంగా ఉంది. అంతేకాదు హైదరాబాద్ లో అప్లయ్ చేస్తే.. నిజామాబాద్ లో ఓటు పోతుంది కదా అని ఒకరు అనుమానం వ్యక్తం చేయగా..  అలాంటేదేమి ఉండదు.. అంతా మేము చూసుకుంటామంటూ మల్లారెడ్డి మనుషులు చెప్పడం ఆడియాలో ఉంది. ఈ ఆడియోలను కూడా ఎన్నికల అధికారికి సమర్పించారు తీన్మార్ మల్లన్న.   ఇతర జిల్లాల వారితో ఫేక్ ఓటర్లు నమోదు చేయించడమే కాదు.. మరింతగా మంత్రి మల్లారెడ్డి బరి తెగించారని మల్లన్న ఆరోపిస్తున్నారు. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు కూడా మల్లారెడ్డి కాలేజీలోనే తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ తయారు చేసిన నకిలీ గ్రాడ్యూయేట్ సర్టిఫికేట్లతోనూ ఓటర్లను నమోదు చేయిస్తున్నారంటూ .. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను  ఎన్నికల అధికారికి ఇచ్చారు.  రెండు నియోజకవర్గాల్లో కలిసి రెండు లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు నమోదు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుందని నవీన్ కుమార్ ఆరోపించారు. మల్లారెడ్డి కాలేజీల్లోనే ఇదంతా జరుగుతుందని, ఇందు కోసం ప్రత్యేకంగా కొందరిని నియమించారని చెప్పారు. లోకల్ ఎన్నికల అధికారులు కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారని శశాంక్ గోయెల్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు మల్లన్న.    ఎమ్మెల్సీ ఎలక్షన్ ల కు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలను తయారు చేస్తున్న మంత్రి మల్లారెడ్డి, అతని యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న, ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేయిస్తున్న మల్లారెడ్డిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసానని చెప్పారు . అడ్డ దారిన ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ గుర్తింపును  రద్దు చేయాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పార్టీలు ఉంటే ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు మల్లన్న.   వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీలో ఉండబోతున్నారు తీన్మార్ మల్లన్న. ఆయన ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. ఓటర్ల నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సందర్భంలోనే అక్రమ ఓటర్ల సమాచారం తనకు చేరడంతో.. లోతుగా అధ్యయనం చేసినట్లు.. అందులో అదికార పార్టీ ఫేక్ బండారం బయటపడినట్లు మల్లన్న అనుచరులు చెబుతున్నారు. గత లోక్ సభ ఎన్నిక్లలో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మండలి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వరంగల్ లేదా హైదరాబాద్ ఏదో ఒక స్థానం నుంచి రాజశేఖర్ రెడ్డి బరిలో ఉండటం ఖాయమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందుకే రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో బోగస్ ఓట్లు నమోదు చేయిస్తున్నారని చెబుతున్నారు.    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి తప్పదని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెాజార్టీ ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు కేసీఆర్ సర్కార్ పనితీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు వివిధ సర్వేల్లోనూ తేలింది. అధికార పార్టీ నేతలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. అయితే అధికార పార్టీగా ఉండి మండలి ఎన్నికల్లో ఓడిపోతే.. పరువు పోతుందనే భయంతోనే టీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే అడ్డదారిలో గెలిచేందుకు ఇలా బోగస్ ఓటర్లను స్పష్టిస్తున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో ఎన్నికల అధికారులు పారదర్శకంగా, కఠినంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

జడ్జీలను దూషించిన కేసు సీబీఐకి.. ఇకనైనా సైలెంట్ అవుతారా.. మరింత రెచ్చిపోతారా..

ఏపీలో న్యాయవ్యవస్థ పై, అలాగే న్యాయమూర్తుల పై అటు సోషల్ మీడియాలోను ఇటు మీడియా ఎదుట అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. దీని పై విచారణను ఎనిమిది వారాల్లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసు విషయంలో సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.    రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయన్న కారణంతో వైసీపీకి చెందిన కొంత మంది నేతలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున న్యాయవ్యవస్థపైన, న్యాయమూర్తుల పైన దాడికి దిగిన సంగతి తెల్సిందే. మరో పక్క ఆ పార్టీకి చెందిన మంత్రులు… ఎంపీలతో పాటు, స్పీకర్ కూడా మీడియా ముందు న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ పార్టీ కార్యకర్తలు మరింత బరి తెగించి.. న్యాయమూర్తుల్ని చంపుతాం.. నరుకుతాం అని సోషల్ మీడియాలో బెదిరింపులతో కూడిన పోస్టింగ్‌లు పెట్టారు. అయితే వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ అప్పట్లో సీఐడీకి ఫిర్యాదు చేశారు. అయితే తాము అలాంటి పోస్టింగ్‌లు పెట్టిన వారందరికీ అండగా ఉంటామని ఎంపీ విజయసాయిరెడ్డి అదే సమయంలో బహిరంగంగా ప్రకటించారు.   కారణమేదైనా కానీ.. సీఐడీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇంత వరకూ ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు సరికదా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. దీంతో సీఐడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే పోలీసులు వెంటనే కేసులు నమోదు చేసి అర్థరాత్రిళ్లు వెళ్లి మరీ అరెస్ట్ చేస్తున్నారు. అదే న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం సీఐడీ పట్టించుకోలేదు. అసలు హైకోర్టు ఆదేశాలను సైతం పక్కన పడేశారంటే.. ఏపీ పోలీస్ ఏ రేంజ్ లో వర్క్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ నందిగం సురేష్ వంటి పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు.   అంతేకాకుండా సామాజిక మాధ్యమాలలో తాజాగా జడ్జీలను దూషించిన వారిపై కూడా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు ఆదేశింది. ఇప్పటికే రెండు విడతలుగా 93 మందికి నోటీసులు జారీ చేశారు. హైకోర్టు తాజా ఆదేశాలతో ఇపుడు మరి కొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.   ఇది ఇలా ఉండగా ఇప్పటికే న్యాయవ్యవస్ధపై సీఎం జగన్ యుద్ధం ప్రకటించారు. న్యాయమూర్తుల పేర్లు తీసుకుని మరీ రచ్చ చేస్తున్నారు. పార్టీ నాయకులే ఆ రేంజ్ లో రెచ్చిపోతుంటే.. ఇంకా కింద స్థాయి కార్యకర్తలు ఇంకా చెలరేగిపోఏ అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి వారికి బహిరంగంగానే భరోసా ఇవ్వడంతో పాటు మరోపక్క సీఎం జగన్, మోదీల మధ్య స్నేహం కుదిరిందన్న వార్తల నేపథ్యంలో ఈ కేసు ఎంతవరకు తేలుతుందో వేచి చూడాలి.