ఈటలకు అన్యాయం.. కొత్త పార్టీపై తీన్మార్ మల్లన్న క్లారిటీ

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్.. ఈ పేరు తెలంగాణలో ఇప్పుడు ఓ వైబ్రేషన్.. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో విజయ తీరం వరకు వెళ్లారు తీన్మార్ మల్లన్న. సామ్యానుడిగా పోటీ చేసి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో మల్లన్నకు సాధించిన ఓట్లతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. యుద్ధం ఇంకా మిగిలే ఉందని చెప్పారు. కేసీఆర్ ను గద్దే దించే వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు. సామాన్యుడు సీఎం సీటులో కూర్చూనే వరకు విశ్రమించబోనని చెప్పారు. మల్లన్న ప్రకటనతో ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారా అన్న చర్చ తెరపైకి వచ్చింది. పార్టీ ఏర్పాటుపై ఢిల్లీలో ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఎమ్మెల్సీ ఫలితాల మరుసటి రోజే మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్లు చేశారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాను గాయపడినా మనసు మార్చుకోలేదని.. కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషిని గుర్తు పెట్టుకోవాలంటూ మరింత మంట రాజేశారు రాజేందర్. దీంతో  బీసీ నినాదంతో తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందా? మంత్రి ఈటల,  తీన్మార్ మల్లన్న ఒకే జెండా కిందకు రాబోతున్నారా? కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పోరాడబోతున్నారా అన్న ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగానే మల్లన్నకు సంబంధించి మరో చర్చ కూడా చక్కర్లు కొడుతోంది. మల్లన్న బీజేపీలో చేరి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మల్లన్నకు సపోర్ట్ చేసిందనే చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అండదండలు మల్లన్నకు ఉన్నాయన్న వాదన కొందరు చేస్తున్నారు.  సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై  స్పందించారు తీన్మార్ మల్లన్న.  తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు. తన భవిష్యత్ గమనం గురించి క్లారిటీ ఇచ్చారు. మంత్రి ఈటల రాజేందర్‌పై మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరుగుతోన్న మాట వాస్తవమన్నారు. ఈటలకు జరుగుతోన్న అన్యాయాన్ని గతంలోనే ఖండించానని మల్లన్న గుర్తుచేశారు. ఈటలను రాజకీయంగా కలవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. బీజేపీ నేత బండి సంజయ్ తనకు లక్ష  ఓట్లు వేయిస్తే .. మరి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఆయన ఓట్లు వేయించలేకపోయాడని ప్రశ్నించారు. బండి సంజయ్, తాను ఒకే కులమైతే ఏంటని, తమ సిద్ధాంతాలు వేరని తెలిపారు. తాను కులానికి చెందిన వ్యక్తిని కాదని దయచేసి తనపై కుల ముద్ర వేయొద్దని సూచించారు తీన్మార్ మల్లన్న.   కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల డబ్బులు తనకెందుకని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న. తనకు ప్రజలే ఓట్లు, నోట్లు ఇచ్చారని చెప్పారు. తన  అనుచరులు ఒక్క రోజు టీ తాగకుంటే.. 5కోట్లు జమ అవుతాయన్నారు. బీజేపీ సహా ఏ పార్టీలోను చేరే ప్రసస్తే లేదని మల్లన్న తేల్చి చెప్పారు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని సాగర్ ఓటర్లకు పిలుపుచ్చారు. 45 కేజీల సీఎం కేసీఆర్ శరీరంతో తనకు ద్వేషం లేదన్నారు. కేసీఆర్ మెదడు తీసుకునే నిర్ణయాలనే నేను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా 6వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నానని చెప్పారు.  ఢిల్లీలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రచారం ఒట్టిదేనన్నారు. అసెంబ్లీ అంటే తెలియని వారిని  తనతో పాటు అసెంబ్లీ గడప తొక్కిస్తానని తిన్మార్ మల్లన్న ప్రకటించారు.

స్వెరోస్ చిచ్చు.. ఐపీఎస్‌పై రచ్చ.. మౌనమేల కేసీఆర్?

స్వెరోస్. కొంతకాలంగా మారుమోగుతున్న పేరు. స్వెరోస్ వర్సెస్ బీజేపీ. స్వెరోస్ వర్సెస్ హిందుత్వ సంస్థలు. స్వెరోస్ వర్సెస్ దళిత సేన. ఇలా స్వెరోస్ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. స్వెరోస్ సమావేశంలో హిందూ దేవుళ్లను పూజించనంటూ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ప్రతిజ్ఞతో వివాదం రాజుకుంది. మా దేవుళ్లను, మా మతాన్ని అవమానిస్తారా అంటూ కమలనాథులు స్వెరోస్‌పై కస్సుమన్నారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్‌గా కోదాడలో బండి సంజయ్‌పై దాడికి యత్నించారు స్వెరోస్ సభ్యులు. దీంతో.. వివాదం మరింత ముదిరింది. ఓవైపు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా స్వెరోస్ ర్యాలీలు తీస్తుంటే.. మరోవైపు స్వెరోస్‌కు వ్యతిరేకంగా హిందుత్వ సంస్థలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. తాజాగా, ప్రవీణ్‌పై ఆరోపణలు చేసిన దళిత సేన నేత హమారా ప్రసాద్‌పైనా దాడి చేశారు స్వెరోస్ సభ్యులు.  స్వెరోస్ కేంద్రంగా ఇంత రచ్చ జరుగుతున్నా ఇప్పటి వరకూ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు, ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఈ దాడులను ఖండించడం లేదు. ఐపీఎస్‌గా ఉన్న వ్యక్తి.. తన కనుసన్నల్లో నడుస్తున్న స్వెరోస్ సభ్యులు ఇలాంటి దాడులకు తెగబడుతున్నా అడ్డుకునే ప్రయత్నం కానీ, వారిని అదుపు చేసే చర్యలు కానీ చేయక పోవడం అనుమానాస్పదంగా మారింది. అంటే, ప్రవీణ్ కుమార్ ఈ దాడులను ప్రోత్సహిస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు.  ఐపీఎస్ ప్రవీణ్ కుమార్. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఒకప్పుడు డైనమిక్ ఆఫీసర్. సడెన్‌గా ఖాకీ యూనిఫాం నుంచి ఫార్మల్ డ్రెస్‌లోకి మారిపోయారు. పోలీస్ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై గురుకులాల అధికారిగా చేరిపోయారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి తొమ్మిదేళ్లుగా అక్కడే పని చేస్తున్నారు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. పూర్వ విద్యార్థుల సంఘమంటూ ఆయన ఏర్పాటు చేసిన స్వెరోస్.. గురుకులాలను దాటేసి గ్రామాల్లో విస్తరించింది. ఇప్పుడు ఊరూరా స్వెరోస్ సంఘాలు ఉన్నాయి. ఓ వర్గం వారంతా స్వెరోస్‌ చెంతన చేరారు. హిందూ మతానికి పోటీగా సమాంతర వ్యవస్థ నడుపుతున్నారనేది బీజేపీ ఆరోపణ.  ఐపీఎస్ అయిన ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తొమ్మిదేళ్లుగా అదే సంస్థలో తిష్ట వేసి ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు కొందరు. సాధారణంగా ఏ ఉద్యోగంలోనైనా మూడేళ్లకు ఒకసారి బదిలీలు కామన్. తప్పనిసరి అయితే.. మరో రెండు, మూడేళ్లు అక్కడే ఉంచుతారు. అలాంటిది ఏకంగా తొమ్మిదేళ్లు ఒకే సంస్థ బాధ్యతలు అప్పగించడమేంటని తప్పుబడుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉండి.. స్వెరోస్ లాంటి ఎన్జీవో నడపడం నిబంధనలకు విరుద్ధమనీ అంటున్నారు. అధికారులు సంస్థలు రూపంలో తమ పరపతిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ప్రభుత్వ పెద్దల అండా,దండా పుష్కలంగా ఉందని అంటున్నారు. ప్రవీణ్ కుమార్ బావ మెతుకు ఆనంద్.. టీఆర్ఎస్ పార్టీ తరఫున వికారాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు.  కొంత కాలంగా స్వెరోస్ కారణంగా ప్రవీణ్ కుమార్ కేంద్రంగా ఇంత రచ్చ జరుగుతున్నా.. ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు సర్కారు సపోర్ట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. చిన్న అలగేషన్ వస్తేనే వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు.. అలాంటిది స్వెరోస్ కేంద్రంగా వందల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నా.. ప్రభుత్వం వాటిపై విచారణకు ఆదేశించకపోవడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఒక్క అధికారి కోసం ప్రభుత్వం ఇంతగా మౌనం ఎందుకు వహిస్తోందని.. ఇది కులాల, మతాల విధ్వేషంగా మారుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు. ముందుముందు.. స్వెరోస్, ప్రవీణ్ కుమార్, బీజేపీ, హిందుత్వ సంస్థలు, దళిత సేన వివాదం ఏ తీరాలకు చేరుతుందో...

రాజమండ్రి కాలేజీలో 175మందికి కరోనా

అది రాజమండ్రిలోని తిరుమల ప్రైవేట్ జూనియర్ కాలేజ్‌. అందులో కరోనా కలకలం. కాలేజ్ హాస్టల్‌ను కొవిడ్ మహమ్మారి కమ్మేసింది. ఒకరు, ఇద్దరు కాదు.. ఒకే కాలంలో ఏకంగా 175 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కాలేజ్‌ హాస్టల్లోనే ప్రభుత్వ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  కొవిడ్‌ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. పాజిటివ్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. మార్చి మూడోవారం నుంచి కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొవిడ్‌పై సర్వత్రా మళ్లీ ఆందోళన పెరుగుతోంది. స్కూళ్లు, కాలేజీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు కరోనా వస్తుండటం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పాజిటివ్‌ కేసుల భారీగా పెరగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. మాస్క్‌ ఉంటేనే పాఠశాలలు, స్కూళ్లు, కాలేజీలోకి అనుమతించాలని విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాజమండ్రిలోని జూనియర్ కాలేజీ హాస్టల్‌లో 175మందికి కొవిడ్ పాజిటివ్ రావడం స్థానికులను కలవరానికి గురి చేస్తోంది. రాజమండ్రి ఘటనతో రాష్ట్రమంతా ఉలిక్కిపడుతోంది.

జగన్ ను తిట్టిన ఐఏఎస్ కే బీజేపీ టికెట్ 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారింది. తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తుండగా... జగన్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు తిరుపతి ఎన్నికను అస్త్రంగా మార్చుకోవాలని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ  ప్రయత్నిస్తోంది. ఆధ్యాత్మిక కేంద్రంమైన తిరుపతిలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. జనసేనతో కలిసి పోటీ చేస్తున్న కమలదళం.. తిరుపతిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను రంగంలోకి దింపింది. సిన్సియర్ అధికారిగా పేరున్న  రత్నప్రభ పోటీ చేస్తుండటంతో తిరుపతి ఎన్నిక మరింత రంజుగా మారింది.  తిరుపతి ఉపఎన్నికలో రత్నప్రభను పోటీలో దింపడానికి బీజేపీకి పెద్ద లెక్కో ఉందంటున్నారు. రత్నప్రభ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బద్ద వ్యతిరేకి అని తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో రత్నప్రభ కూడా ఒక బాధితురాలే. జగన్ సీబీఐ కేసులో నిందితురాలిగా చేర్చబడ్డ ఐఏయస్ అధికారి రత్నప్రభకు.. తర్వాత హైకోర్టు విముక్తి ప్రసాదించింది. నిజాయితీగా పనిచేసిన రత్నప్రభ.. సీబీఐ కేసు ఎదుర్కోవడంతో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఆ కోపాన్ని ఆమె జగన్ పై నేరుగానే చూపించారు. కోర్టు ఆవరణలోనే చివాట్లు పెట్టారు. వైఎస్ కుటుంబంపై ఆగ్రహంగా , జగన్ అంటే చిర్రుత్తుకొచ్చే రత్నప్రభను కావాలనే బీజేపీ ఇప్పుడు తిరుపతిలో టికెట్ ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్.  2013 నవంబర్ లో  ఇందు టెక్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన వస్తున్న రత్నప్రభకు జగన్ ఎదురయ్యారు. ఈ సందర్భంగా  జగన్ పై ఆమె  తీవ్ర ఆగ్రహంతో మహంకాళిగా ఊగిపోయారు. వాట్ మిస్టర్ జగన్.. వాటీజ్ దిస్ నాన్ సెన్స్..  మీరెవరో నాకు తెలియదు... మిమ్మల్ని నేనుప్పుడు చూడలేదు.. మీవల్ల మీమందరం సమస్యలో పడ్డాం. . ఈ గొడవలతో మాకేం సంబంధం లేదు.. రూల్స్ ప్రకారమే మేం ముందుకు వెళ్లాం.. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఆదేశాలిస్తే.. మేం పాటించాం.. మాకెందుకీ సమస్యలు.. మీ కారణంగా మేమమంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.. ఇంతకాలం నిజాయితీగా బతికి.. మీ కారణంగా ఆభాసుపాలయ్యామంటూ జగన్ ను రత్నప్రభ కడిగిపారేశారు. కోర్టు ఆవరణలోనే, అందరూ చూస్తుండగానే  రత్నప్రభ సీరియస్ కామెంట్లు చేయడంతో అవాక్కైన జగన్.. మంచి రోజులు వస్తాయ్ మేడమ్ అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఏంటీ వచ్చేది అంటూ రత్నప్రభ  అక్కడి నుంచి వెళ్లిపోయారు.  ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం స్పష్టించింది. కోర్టులో రత్నప్రభ ఆవేశాన్ని చూసిన వారు.. జగన్ పై ఆమెకు ఎంత కోపం ఉందో బయటపడిందని అప్పటి ప్రత్యక్ష సాక్షులు చెబుతారు.     ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కత్తి చంద్రయ్య కూతురే రత్నప్రభ..  సిన్సియర్ అధికారిగా పేరు. కర్ణాటక కేడర్ కు చెందిన రత్నప్రభ.. వైఎస్సార్ హయాంలో డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చారు. ఐటీ మరియు రెవెన్యూ శాఖల ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందు టెక్ ప్రాజెక్టు అనే సంస్థకు శంషాబాద్ వద్ద 250 ఎకరాల స్థలం కేటాయించారు. వైఎస్ మరణం తరువాత.. ఆ కేటాయింపుల విషయంలోనే  అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ కేసులు నమోదయ్యాయి. రత్నప్రభ పేరును చార్జ్ షీట్లో ఏడవ ముద్దాయిగా చేర్చారు. కానీ ఆమె తాను ప్రభుత్వాధికారిగా ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించాను తప్ప, స్వయంగా ఆ నిర్ణయం తీసుకోలేదని, ఆ వ్యవహారంలో తను ఎటువంటి ప్రయోజనమూ పొందలేదని హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆమె వాదనలో ఎకీభవించిన కోర్టు ఆమెను కేసుల నుండి తొలగించింది.    సీబీఐ కేసుల నుంచి బయటపడినా... కోర్టులు తిరిగిన పరిస్తితును రత్నప్రభ మర్చిపోలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. నిజాయితీగా పనిచేసినా కోర్టు కేసుల్లో చిక్కుకోవడం ఆమె జీర్ణించుకోలేకపోయారంటున్నారు. తన కారణంగా రత్నప్రభ ఇబ్బండి పడ్డారనే విషయం జగన్ కు కూడా తెలుసని చెబుతున్నారు. జగన్ గురించి పూర్తి తెలుసు కాబట్టే ఆమెను తిరుపతి బరిలో నిలిపారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ వల్ల తాను పడిన ఇబ్బందులను రత్నప్రభ చెబితే... వైసీపీకి కష్టమేననే చర్చ జరుగుతోంది. అంతేకాదు సిన్సియర్ ఐఏఎస్ గా గుర్తింపు పొందిన రత్నప్రభకు జనాల నుంచి మంచి స్పందన వస్తుందని కమలదళం ఆశలు పెట్టుకుంది. ఇలా అన్ని పరిశీలించాకే... తిరుపతికి రత్నప్రభ పేరును బీజేపీ పెద్దలు ఖరారు చేశారని తెలుస్తోంది. మరీ తిరుపతి ప్రచారంలో రత్నప్రభ జగన్ ను టార్గెట్ చేస్తారా.. చేస్తే వైసీపీ ఇబ్బందులు తప్పవా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.. చూడాలీ మరీ తిరుపతిలో ఏం జరగబోతోందో...

ఈ కరోనా న్యూస్ చదివితే.. గుండె గుబేల్..

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ టెన్షన్. కొత్తరకం స్ట్రెయిన్‌లతో కలవరం. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలి పోతున్నారు జనం. ప్రజల భయానికి తగ్గట్టే కేసుల సంఖ్యా భారీగా పెరుగుతోంది. అందులో అనేకం కొత్త రకం కరోనా వైరస్ వల్ల వచ్చినవే కావడం మరింత ఆందోళనకరం. మార్చి 18 నాటికి దేశంలో 400గా ఉన్న కొత్త రకం కేసులు.. గత ఐదు రోజుల్లో దాదాపు రెట్టింపయ్యాయి. కొత్త రకం వైరస్ వ్యాప్తి మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త రకం స్టెయిన్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.   ఇప్పటివరకు 18 రాష్ట్రాల్లో కొత్తరకం స్ట్రెయిన్‌లను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో విదేశాల్లో బయటపడిన కొత్తరకాలే కాకుండా మరిన్ని స్ట్రెయిన్‌లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే, పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విజృంభణకు కారణం ఈ కొత్తరకం స్ట్రెయిన్‌లే అని చెప్పేందుకు ఇంకా సరైన ఆధారాలు లభించలేదని తెలిపింది.  విదేశాల నుంచి వస్తోన్న వారిలో పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 10,787 పాజిటివ్‌ శాంపిళ్లను కేంద్ర ఆరోగ్యశాఖ సేకరించి, పరీక్షించి విశ్లేషించింది. వీటిలో 736 శాంపిళ్లలో బ్రిటన్‌ రకం, 34 శాంపిళ్లలో దక్షిణ ఆఫ్రికా రకం, 1 శాంపిల్‌లో బ్రెజిల్‌ రకం స్టెయిన్ గుర్తించారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఇలాంటి కొత్త రకాలు స్టెయిన్‌లు కనిపించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. గత డిసెంబర్‌లో మహారాష్ట్రలో విశ్లేషించిన నమూనాలతో పోల్చి చూస్తే, కొత్త మ్యుటేషన్ల నమూనాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు కేంద్రం తెలిపింది. గతంలో గుర్తించిన మ్యుటేషన్‌ రకాలతో ఇవి సరిపోలడం లేవని.. రోగ నిరోధకతను తట్టుకొని వైరస్‌ తీవ్రత పెరుగుదలకు ఇలాంటి మ్యుటేషన్లు కారణమవుతాయని కేంద్రం అభిప్రాయపడింది.   ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తోంది. 3 కోట్లకు పైగా కేసులతో అమెరికా ప్రపంచంలోనే ప్రధాన స్థానంలో నిలిచింది. బ్రెజిల్ సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. 1.17కోట్ల కేసులతో  ఇండియా మూడో స్థానంలో ఉంది. అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్‌లో కొవిడ్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇండియా తర్వాత.. రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఇటలీ, స్పెయిన్, టర్కీ, జర్మనీ వరుసగా టాప్ 10 జాబితాలో ఉన్నాయి.  దేశంలో బుధవారం నమోదైన కేసులు నాలుగు నెలల గరిష్ఠానికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా ఆరు వారాలుగా తగ్గుతూ వచ్చిన కేసులు గత వారం రోజులుగా పెరుగుతున్నాయని వెల్లడించింది. ఇక ఐరోపాలో జర్మనీ, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు మరోసారి ఆంక్షలు ప్రకటించాయి. సెకెండ్ వేవ్ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుప్పకూలేలా చేశాయి. బుధవారం సెన్సెస్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. ఉదయం 49,786తో ప్రారంభమైన సెన్సెక్స్‌ 49,120 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 871 పాయింట్లు నష్టపోయి 49,180 వద్ద స్థిరపడింది. ఇక 14,712 దగ్గర మొదలైన నిఫ్టీ.. 265 పాయింట్లు పతనమై.. 14,549 దగ్గర ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో, దేశీయ సూచీలు సైతం ఢమాల్. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. స్థిరాస్తి, లోహ, ఆటో, బ్యాంకింగ్‌, పీఎస్‌యూ, ఆర్థిక, మౌలిక రంగాల్లోని షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. 

జస్టిస్ రమణపై జగన్ ఫిర్యాదు.. తోసిపుచ్చిన సుప్రీంకోర్టు 

సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై వైఎస్ జగన్ చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమరావతి భూముల విషయంలో చేసిన ఈ ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.  అమరావతి భూముల విషయంలో జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబరు 6న సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్-హౌస్ ప్రొసీజర్‌లో విచారణ జరిపి, తగిన విధంగా పరిశీలించి, సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఇన్-హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనది, ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదు. ఈ ఆరోపణలను అఫిడవిట్ ద్వారా కూడా జగన్ సుప్రీంకోర్టుకు సమర్పించారు.. అని సుప్రీంకోర్టు ప్రకటన విడుదల చేసింది.  భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్‌వీ రమణను నియమించాలని జస్టిస్ బాబ్డే కేంద్ర ప్రభుత్వానికి బుధవారం సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 24న జస్టిస్ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 

టోల్ గేట్ వద్ద.. 26 కిలోల గోల్డ్ .. 

స్మగ్లర్లు రూట్ మార్చారు. విమానాశ్రయాల్లో తనికీలు స్ట్రిక్ అయ్యావడంతో గోల్డ్ స్మగ్లింగ్ కి ఆటంకంగా మారిందని. స్మగ్లర్లు నేరుగా టేక్ ఏ వై తో బై రోడ్టోపై వస్తున్నారు. రూట్ మార్చిన కేటుగాలకు టోల్ గేట్ వద్ద పోలీసుల వేటు తప్పలేదు.    తాజాగా చౌటుప్పల్ టోల్ గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కోల్‌కతా నుంచి చెన్నైకి తీసుకెళ్తున్న ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనిఖీల్లో భాగంగా భారీగా బంగారం పట్టుబడింది. రూ.12 కోట్ల విలువైన 26 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని చెన్నైలో  డెలివరీ చేయాలంటూ మాఫియా ముఠాకు అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కారు ఎయిర్‌బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి బంగారం ఎలా వచ్చింది? హైదరాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   

తలైవి.. రాజకీయ శివంగి..

'తలైవా' అంటే రజనీకాంత్ అని చాలామందికి తెలుసు. మరి, 'తలైవి' అంటే? "తలైవి" ఈ పేరు ఇప్పుడు కోలివుడ్ సిల్వర్ స్క్రీన్‌పై సంచలనం. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపణం. 'పురచ్చితలైవి'గా ఖ్యాతిగాంచిన జయలలిత పొలిటిక్ స్టోరీనే ఈ తలైవి సినిమా. ఏప్రిల్ 23న రిలీజ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాతే విడుదల. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్.. తమిళ పాలిటిక్స్‌లో ప్రకంపణలు సృష్టిస్తోంది. 'అమ్మ'ను మరోసారి గుర్తు చేస్తోంది.  జస్ట్ 3 నిమిషాల ట్రైలర్. ఆడపులి జయలలిత రాజకీయ ప్రస్థానంలోని అనేక కోణాలను టచ్ చేస్తోంది. సినీ రంగం నుంచి సీఎం సీటు వరకూ జయ చేసిన పోరాటాన్ని, ఆరాటాన్ని, అవమానాన్ని, అందలాన్ని.. అన్నిటినీ టచ్ చేసింది తలైవి ట్రైలర్. ఈ మూడు నిమిషాలు.. ఆరుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత పాలనను గుర్తుకు చేసింది. ఇక మూడు గంటల సినిమాలో.. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఎపిసోడ్ మొత్తం కళ్లకు కట్టడం ఖాయం.  కంగనా రనౌత్. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. జయలలిత లీడ్ రోల్‌లో రచ్చ రచ్చ చేసింది. ఫిజికల్ పర్సనాలిటీలో సరిపోలక పోయినా.. ఆటిట్యూడ్, అగ్రెసివ్‌నెస్‌లో అచ్చం అచ్చు గుద్దినట్టు జయలలితను గుర్తు చేసింది. ఆనాడు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జయలలితకు జరిగిన దుశ్శాసన పర్వాన్ని మరోసారి ఈ తరం ప్రేక్షకుల ముందు సాక్షాత్కరింపజేశారు. అసెంబ్లీలో జయలలిత చీర లాగే సీన్‌లో కంగనా నటన అద్భుతం. ట్రైలర్‌లోనే ఆ సీన్ అంత బీభత్సంగా పండితే.. ఇక సినిమాలో మరింత సెన్సేషనలే. ఎమ్జీఆర్ అంతిమయాత్ర సమయంలో జయలలితకు జరిగిన అవమానాన్ని కూడా ట్రైలర్‌లో చూడొచ్చు. ఎమ్జీఆర్ పార్థీవదేహం దగ్గర నుంచి జయలలితను లాగి పారేసే ఘటన.. ట్రైలర్‌లో చూపించారు.  జయలలిత సినిమా కెరీర్.. ఎమ్జీఆర్‌తో సన్నిహితం, సాన్నిహితం.. ఏఐఏడీఎంకేలో ఎంట్రీ.. ఎమ్జీఆర్ మరణం.. సీఎంగా సంచలనం.. ఇలా జయలలిత జీవితంలోని అన్ని యాంగిల్స్‌తో ఫుల్లీ ప్యాక్డ్ పవర్‌ఫుల్ మూవీగా ఉండనుంది తలైవి. ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. "మహా భారతానికి మరో పేరు జయ" అనే డైలాగ్ అదుర్స్. "నన్ను అమ్మగా చూస్తే నా హృదయంలో మీకు చోటుంటుంది. నన్ను కేవలం ఒక ఆడదానిగా చూస్తే.." అనే ఇన్‌కంప్లీట్ డైలాగ్‌తో ట్రైలర్‌ను ఎండ్ చేయడం ట్రైలర్‌కే హైలైట్. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. ఈ టైమ్‌లో "తలైవి" ట్రైలర్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇది ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశముందని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి. అధికార అన్నాడీఎంకేకి తలైవి అనుకూలం కానుంది. తమిళనాట ఏఐఏడీఎంకే, బీజేపీలు కలిసి పోటీ చేస్తుండటం.. బీజేపీ సానుభూతిపరురాలిగా ముద్ర ఉన్న కంగనా రనౌత్ నటించడం.. ఎన్నికల వేళ 'పురచ్చితలైవి'ని తమిళ ప్రజలకు గుర్తు చేసేలా కీలక సమయంలో తలైవి ట్రైలర్ రిలీజ్ చేయడం.. అంతా అధికార పార్టీ పొలిటికల్ స్ట్రాటజీలో భాగమేనంటున్నారు విమర్శకులు. తలైవి.. జస్ట్ 3 నిమిషాల సినిమా ట్రైలరే అయినా.. అది జయలలిత జీవిత గాధ అవటం.. అది రిలీజ్ అయిన సమయం, సందర్భం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను విశేషంగా ప్రభావితం చేయనుంది. తలైవినా.. మజాకా... 

నన్ను గెలిపిస్తే..  ఓటర్లని మూన్ పైకి..  

ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టడానికి రాజకీయ నాయకులూ చేసే ప్రయత్నం అంత ఇంత కాదు. మీ కులానికి ఏది చేస్తాను అని ఒక నాయకుడు అంటే, మరో పార్టీ నాయకుడు ఈ మతాన్ని దేశంలో లేకుండా చేస్తాను అని చేస్తుంటారు. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో తనను గెలిపిస్తే హైదరాబాద్ కి  ఓడరేవు తెపిస్తాను అని నటుడు శ్రీకాంత్  చెప్పినట్లు. ప్రస్తుతం ఎన్నికల్లో అలాంటి హామీలను తనదాన్నేలా పోటీపడ్డారు ఒక స్వతంత్ర అభ్యర్థి. ఇంతకీ ఆ ఘనుడు ఎవరని అనుకుంటున్నారా.. మీరే చూడండి..  సమయంలో ఓటర్లను ఆకట్టుకునే హామీలు ఇవ్వడంలో తమిళనాడుకు మరే రాష్ట్రం సాటిరాదు. ఊహించని విధంగా ఉచితాలు ఇవ్వడం తమిళనాడులోనే ప్రారంభమైందనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మధురై నుంచి పోటీ  చేస్తున్న శరవణన్ అనే స్వతంత్ర అభ్యర్థి ఇచ్చిన హామీకి అందరూ ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఇది ఆషామాషీ హామీ కాదు. తనను ఎన్నికలలో గెలిపిస్తే తన నియోజకవర్గ ప్రజలను విడతల వారీగా చంద్రమండలానికి తీసుకువెళతాను అని హామీ ఇస్తూ పెద్ద సాహసమే చేశాడు ఆ అభ్యర్థి. అంతేకాదు, దీనికి సంబంధించిన కార్యాచరణ గురించి కూడా క్లియర్ గా చెప్పాడు. చంద్రమండలంకు తీసుకెళ్లేందుకు మధురై సమీపంలో ఒక రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన చెబుతున్నాడు. అంతేకాదండోయ్... ఇంట్లో ఆడవాళ్ళ శ్రమను గుర్తించిన ఆయన ఆడవారికి వారి పనులకు సాయం చేసేందుకు ప్రతి ఇంటికి ఒక రోబోను కూడా ఇస్తానని మరో హామీ ఇచ్చాడు. అలా వైకుంఠ పురం సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్లు పెద్ద బ్యారమే ఇది..అన్నట్లు ఈ అభ్యర్థిది పెద్ద గుండెనే.. ఆయన హామీలకు నియోజకవర్గంలోని ఓటర్లు కూడా షాక్ కు గురవుతున్నారట. మరి, ఈ స్థాయిలో హామీలిచ్చిన ఈయనకు ఏమేరకు ఓట్లేస్తారో చూడాలి!   

కాలేజీలు తెరిస్తే సీజ్! 

కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండటంతో విద్యాసంస్థలను మూసి వేసింది తెలంగాణ సర్కార్. మెడికల్ కాలేజీలు తప్ప మిగితా అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్  కింద విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కొన్ని ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లు పాటించడం లేదు. సర్కార్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ క్లాసులు నిర్వహిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఇంటర్‌ బోర్డు స్పందించింది. ఇంటర్మీడియట్‌ కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కళాశాలలు మూసేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ప్రత్యక్ష తరగతులు లేనప్పటికీ ఆన్‌లైన్‌ బోధనను కొనసాగించాలని చెప్పారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్   నేపథ్యంలో డిగ్రీ , పీజీ పరీక్షల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి త్వరలో రీషెడ్యూల్ చేస్తామని వెల్లడించారు. మరోవైపు స్కూళ్లు మూత పడటంతో పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరుగుతాయా?లేదా అనే సందిగ్దత నెలకొంది. దీనిపై  విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. పరీక్షలపైనా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. 

బ్యాంకులు బంద్.. పది రోజులు ఫసక్..

వరుస పండగలు. వరుస సెలవులు. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ మధ్య.. ఈ పది రోజుల్లో కేవలం 4 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. మిగతా ఆరు రోజులు బ్యాంకులకు సెలవు. నాలుగో శనివారం, రెండు ఆదివారాలు, హోలీ, గుడ్‌ఫ్రైడే, బాబూ జగ్జీవన్‌రాం జయంతి ఉండటంతో ఆరురోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వరుస సెలవులతో బ్యాంకు శాఖలతో నేరుగా పని ఉండే ఖాతాదారులకు ఇబ్బంది తప్పకపోవచ్చు. ఖాతాదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. నెలాఖరు కావడంతో ఉద్యోగుల వేతనాలు, చెక్‌లు ఇతర చెల్లింపులు వంటి వాటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. పది రోజుల్లో.. మార్చి 30, 31, ఏప్రిల్‌ 3.. ఈ మూడు రోజులు మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఏప్రిల్‌ 1న బ్యాంకులకు వర్కింగ్ డే అయినా కూడా ఆ రోజు కొత్త ఆర్థిక సంవత్సరం (అకౌంటింగ్‌ ఇయర్) ప్రారంభం కానుండటంతో బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ జరగవు. ఆన్‌లైన్‌ సేవలు, ఏటీఎంలలో నగదు లావాదేవీలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు.

పులివెందుల to పాలేరు..

తెలుగువన్ చెప్పిందే మరోసారి నిజమైంది.  తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారని నెల రోజుల క్రితమే వెల్లడించింది తెలుగు వన్. పాలేరులో పోటీ చేయాలని నిర్ణయించింది కాబట్టే... ఖమ్మం వేదికగా కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్నారని ప్రత్యేక కథనం ఇచ్చింది. ఇప్పుడు తెలుగు వన్ చెప్పినట్లే.. వైఎస్ షర్మిల ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించింది. దివంగత సీఎం వైఎస్సార్‌కు పులివెందుల ఎలాగో, తనకు పాలేరు అలా అని ఆమె తెలిపింది.  బుధవారం ఖమ్మం జిల్లా నేతలతో  లోటస్‌పాండ్‌లో సమావేశమైన షర్మిల.. తన పోటీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. మరోవైపు షర్మిల పార్టీ ప్రకటనకు సంబంధించిన బహిరంగ సభకు ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సభకు పోలీసులు అనుమతినిస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 9న ఖమ్మంలో షర్మిల సభ నిర్వహించనున్నారు. ఈ లోగా ప్రభుత్వం కరోనా దృష్ట్యా ఏవైనా ఆంక్షలు విధిస్తే? ఎలా అన్న కోణంలో నేతలు ఆలోచిస్తున్నారు. సభ నిర్వహణ కోసం మైదానానికి అవసరమైన అనుమతి వచ్చినప్పటికీ, పోలీస్ శాఖ నుంచి మాత్రం ఇంకా అనుమతి రాలేదు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, తాము మాత్రం సభ నిర్వహించి తీరుతామని, తమను ఎవరూ ఆపలేరని షర్మిల స్పష్టం చేస్తున్నారు.  వైఎస్ షర్మిలకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, తూడి దేవందర్ రెడ్డి సహా పలువురు నేతలు ఆమెకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కుడా షర్మిల పార్టీలో చేరారు. పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ఆమెకు సలహాదారులుగా ఉన్నారు. ఉద్యమ గాయకుడు ఏపూరు సోమన్న కూడా షర్మిల పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డీజీపీగా పనిచేసిన స్వరణ్ జిత్ సేన్ దంపతులు మంగళవారం లోటస్ పాండ్ కు వెళ్లి షర్మిలకు మద్దతు తెలిపారు. 

డైపర్లో గోల్డ్.. 

ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు గడసరి అత్త, సొగసరి కోడలు అనే టైటిల్స్ విన్నాం.. కానీ అత్త కోడళ్ళు ఇద్దరు దొంగలే అన్న టైటిల్ విన్నారా.. అయితే చూడండి. ఎవరు లేని ఇండ్లే వారి టార్గెట్ .. మెల్లిగా ఇంట్లోకి దూరడం ఇంటి యజమాని ఇంట్లో ఉన్నట్లే టీవీ పెట్టి ఇంట్లో ఉన్న వస్తువులు బంగారం తోచుకోవడమే వారి వృత్తి. అలీబాబా అరడజను దొంగల గురించి విన్నాం గానీ.. ఆ ఆడదొంగల గురించి అందులోనూ.. అత్త కోడళ్ల దొంగల గురించి వినలేదంటారా.. ? అయితే చదవండి మీకే తెలుస్తుంది.  వ్యక్తి తన ఇంటికి తలుపులు వేసి పని మీద బయటకు వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి తన ఇంటి బలుపు తెరిచే ఉంది. పైగా ఇంట్లోంచి టీవీ సౌండ్ కూడా వినిపిస్తోంది. ఆ వ్యక్తి  ఒక్క సరిగా  తాను వచ్చింది తన ఇంటికేనా అని షాక్ తిన్నాడు. దీంతో తనకి అనుమానం వచ్చి ఆలోచన తట్టి.. పక్కింటి వాళ్లను కేక పెట్టి ఇంటి బయట కాపు కాయమన్నాడు. అతను  ఇంట్లోకి వెళ్లగానే, ఎవరు మీరు.?ఎందుకు వచ్చారు.? ఇలా అడగకుండా లోపలికి రావచ్చా?’ అని ఇద్దరు మహిళలు ఆ ఇంటి యజమానికి  ప్రశ్నల  వేసి పరీక్షించారు. దీంతో అతడు కాంగ్గుతున్నాడు. నా ఇంటికి నేను అడిగి రావడమేంటని? అసలు మీరు ఎవరంటూ ? నా ఇంట్లో మీరేం చేస్తున్నారు?‘ అంటూ బదులు ప్రశ్న వేశాడు. దీంతో వాళ్లిద్దరూ కాస్త టెన్షన్ తో పాటి చెమటలు పట్టాయి. ఆ తర్వాత దైర్యం చేసి అతడిని లోపలికి లాగబోయారు. ఈ లోపే అతడు వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాడు. బయట ఉన్న వారి సాయంతో వారిని పట్టుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు బస్టాండ్ సమీపంలో నివసించే పచ్చిపాల కోటేశ్వరరావు ఆటో డ్రైవర్. తన ఇంటికి తలుపులు వేసి ఏదో పనిమీద బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. దీంతో అనుమానంతో బయట పక్కింటి వాళ్లను ఉంచి లోపలికి వెళ్లి చూస్తే ఇద్దరు మహిళలు కనిపించారు. ‘అడగకుండా లోపలికి ఎందుకొచ్చావు‘ అంటూ ఇంటి యజమానినే నిలదీశారు. దీంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేయగా.. అతడిని పట్టుకుని లోపల కట్టేసే ప్రయత్నం చేశారు. కోటేశ్వరావు తప్పించుకుని బయటకు వచ్చాడు. బయట ఉన్నవారికి విషయం చెప్తే వాళ్లంతా కలిసి ఆ ఇద్దరు మహిళలను అదుపులో ఉంచి. పోలీసులకు సమాచారం అందించారు.  ఆ ఆడవాళ్లు ఇద్దరు విజయవాడ లోని మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, సాత్వితలు అని తేలింది. ఇద్దరూ స్వయాన అత్తాకోడళ్లేననీ, దొంగతనాలే వృత్తిగా చేస్తున్నారని తేలింది. నెల రోజుల క్రితమే సాత్విత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ డైపర్లో కూడా బంగారు ఆభరణాలను ఉంచడాన్ని చూసి అంతా నోటిమీదావేళ్ళు వేసుకున్నారు. తలుపులు వేసి ఉన్న ఇళ్లల్లోకి దూరి, ఇంట్లో టీవీ ఆన్ చేసి మరీ దొంగతనాలకు పాల్పడుతుంటారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.    

తిరుపతి అభ్యర్థిగా పనబాక నామినేషన్ 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు నామినేషన్లు మొదలు కావడంతో రాజకీయ వేడి పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. తిరుపతి లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా  పనబాక లక్ష్మి నెల్లూరులో నామినేషన్ వేశారు. నెల్లూరు వీఆర్సీ కూడలి నుంచి తెలుగు దేశం పార్టీ నేతలు , కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కీలక నేతలు యనమల, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు.. పనబాక లక్ష్మికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో వైసీపీ విఫలమైందని ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో విఫలమైన వైసీపీ ఎంపీలకు పదవుల్లో కొనసాగేందుకు అర్హత లేదని మండిపడ్డారు. ఢిల్లీలో బలంగా గళం వినిపించేందుకు పనబాక లక్ష్మిని గెలిపించాలని టీడీపీ నేతలు కోరారు.   వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు చనిపోవడంతో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ప్రకటించింది అధికార పార్టీ. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత ఫిజియోతెరపిస్టుగా ఉన్నారు గురుమూర్తి. బీజేపీ ఇంకా అభ్యర్థని ఖరారు చేయలేదు. కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ బీజేపీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మరోసారి పోటీ చేయబోతున్నారు. ఏపీ పీసీసీ నుంచి ఏఐసీసీకి  ఆయన ఒక్క పేరే వెళ్లింది. కాంగ్రెస్‌ పార్టీకి ఓటెయ్యాలంటూ ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు.     తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 30వ తేదీ. 31న పరిశీలన, ఏప్రిల్‌ 3వ తేదీ వరకూ ఉపసంహరణకు గడువు ఉంది. ఏప్రిల్‌ 17న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి.

అమీర్‌ఖాన్‌కు కరోనా.. బాలీవుడ్‌పై కొవిడ్ పంజా

బాలీవుడ్ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆయన కొవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. వైద్యుల సూచలన మేరకు ప్రస్తుతం అమీర్‌ఖాన్ హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. అమీర్‌ఖాన్ ఇల్లు, ఆఫీసు సిబ్బందికి సైతం కొవిడ్ టెస్టులు చేస్తున్నారు.  మహారాష్ట్రలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. ముంబైలో ఉండే బాలీవుడ్‌ సెలబ్రిటీలపైనా కరోనా పంజా విసురుతోంది. ఇటీవల నటుడు అషిశ్‌ విద్యార్థి, రణ్‌బీర్‌ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌, ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలిలకు కరోనా సోకగా.. లేటెస్ట్‌గా స్టార్ హీరో అమీర్‌ఖాన్ కొవిడ్ భారిన పడటం కలకలం రేపుతోంది. ప్రజలంతా మరింత జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. కరోనా ముందు అంతా సమానమే. ప్రధాని అయినా.. రోజు వారీ కూలీ అయినా.. ఎవరినైనా కరోనా కమ్మేయవచ్చు. వైరస్ ముందు చిన్నా పెద్దా తారతమ్యాలు ఉండవు. దేశంలో కొవిడ్ కేసులు ఎక్కువవుతుండగా.. ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. పలువురు ప్రముఖులు కరోనా భారిన పడుతుండటం మరింత కలకలం రేపుతోంది. 

పోలీస్ కాదు క్రిమినల్.. అంబానీ కేసులో అన్ని సంచలనాలే 

మహారాష్ట్రలో ప్రకంపనలు స్పష్టిస్తున్న ముకేష్ అంబానీ కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. మాజీ పోలీస్ అధికారి సచిన్‌ వాజే క్రిమినల్‌ వ్యవహారమంతా  బయటపడుతోంది. ఈ కేసులో తాజాగా ఎన్‌ఐఏ మరిన్ని కొత్త విషయాలను కనిపెట్టింది. పేలుడు పదార్థాలతో స్కార్పియోను కనుగొన్న తర్వాత సచిన్‌ వాజే స్వయంగా వికోర్లి స్టేషన్‌కు ఫోన్‌ చేసి.. ముఖేశ్‌ హిరేన్‌ ఫిర్యాదుతో నమోదు చేసిన వాహన చోరీ కేసును దర్యాప్తు చేయవద్దని కోరారని గుర్తించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న స్కార్పియో యజమాని మన్‌సుక్‌ హిరేన్‌.. ఫిబ్రవరి 18వ తేదీన తన స్కార్పియో పోయిందని వికోర్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 25న ఆ కారు అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో ప్రత్యక్షమైంది. ఆ రోజు సచిన్‌ వాజే నేతృత్వంలో క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ చాలా చురుగ్గా ఈ దర్యాప్తులో పాల్గొంది. ఈ కేసు కూడా సీఐయూకే అప్పజెప్పారు.  ఫిబ్రవరి 27వ తేదీన సచిన్‌ వాజే వికోర్లి పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేశాడు. 18వ తేదీన మన్‌సుక్‌ హిరేన్‌ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన స్కార్పియో కేసు దర్యాప్తును ఆపేయాలని కోరాడు. బాంబు బెదిరింపుల కేసు దర్యాప్తు తన చేతిలో ఉండటంతో.. ఇక 18వ తేదీన వాహన చోరీ దర్యాప్తును కూడా ఆపేస్తే తన పాత్ర బయటపడదని వాజే భావించాడు.   సచిన్ వాజేకు సంబంధించిన సంచలన అంశాలు బయటికొస్తున్నాయి. తప్పుడు పేరు, ఆధార్‌ కార్డు సాయంతో ముంబయిలోని  ట్రైడెంట్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వాజే బసచేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వేరేవాళ్ల ఆధార్‌కార్డుపై ఫొటోను మార్చి ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అంతే కాదు ఆ హోటల్‌కు కొన్ని భారీ బ్యాగులను కూడా వాజే తీసుకొచ్చినట్లు సీసీటీవీ పుటేజీల్లో తేలింది. వాజే హోటల్లో బసచేసినప్పుడు ఎవరెవరు కలిశారనే అంశాన్ని ఎన్‌ఐఏ పరిశీలిస్తోంది. దీంతోపాటు 100 రోజులు అక్కడ ఉండేలా గదిని బుక్‌ చేసినట్లు సమాచారం.  మరోపక్క సచిన్‌ వాజే వ్యాపార భాగస్వామి, కార్‌ డీలర్‌ ఆశీష్‌నాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఒక వోల్వో ఎక్స్‌సీ90 మోడల్‌ లగ్జరీ కారును స్వాధీనం చేసుకొన్నారు. థానేలోని ఓ ఆటోమొబైల్‌ కంపెనీ కార్యాలయంలో, భీవండీలోని గోదాముల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. ఈ కంపెనీల్లో రెండునెలల క్రితం వరకు వాజే డైరెక్టర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇక్కడే మన్‌సుక్‌ను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ముఖేశ్‌ అంబానీకి బెందిరింపుల కేసుతో మహారాష్ట్ర సర్కారు.. ముంబయి క్రైం బ్రాంచ్‌లో ప్రక్షాళన చేపట్టింది. సచిన్‌ వాజే ఇంటి నుంచి సీసీటీవీ డీవీఆర్‌ను తీసుకొచ్చిన అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రియాజుద్దీన్‌ ఖాజీని నేడు బదిలీ చేశారు. వాజే మరో సహచరుడు ప్రకాశ్‌ హవాల్దాను వేరోచోటుకు పంపించారు. మరో 86 మందిని బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది.  

ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి..

బీహార్ అసెంబ్లీ  రణరంగాన్ని తలపించింది. స్పీకర్‌ను తన స్థానం వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న విపక్ష సభ్యులను నిలువరించేందుకు మార్షల్స్‌తో పాటు సభలోకి పోలీసులను పిలిపించారు. దీంతో అసెంబ్లీలో తీవ్క ఉద్రిక్తత నెలకొంది. కొందరు భద్రతా సిబ్బంది ఎమ్మెల్యేలపై చేయి చేసుకున్నారు. వారిని బయటకు ఈడ్చిపడేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  నితీశ్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రంలోని సాయుధ పోలీసు బలగాలను మరిన్ని అధికారాలను కల్పించే బిహార్‌ స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ బిల్లు-2021 ను తీసుకొచ్చింది. దీనిపై విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వారెంటు లేకుండా పోలీసులు ఎక్కడైనా తనిఖీ చేసేలా, ఎవరినైనా అరెస్టు చేసేలా అధికారమిచ్చే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  విపక్ష పార్టీలు సభలో నుంచి వాక్ అవుట్ చేసిన సమయంలో సభలో ఈ బిల్లను ఆమోదించారు.   ఆ తర్వాత సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. శాసనసభలో స్పీకర్ తన చైర్ వద్దకు వెళ్లకుండా విపక్షాలకు చెందిన మహిళ సభ్యలు పొడియంను చుట్టూ చేరారు. మరోవైపు వెల్‌లోకి వచ్చిన ఇతర విపక్ష సభ్యులు అక్కడ గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలోనే సభలో కొందరు అధికార, ప్రతిపక్ష సభ్యలు మధ్య వాగ్వాదం జరిగింది. సభను అదుపు చేయడం కష్టంగా మారడంతో సభను  వాయిదా వేశారు.  అయినా ఆర్జేడీ సభ్యులు సభలోనే ఉండిపోయారు.  దీంతో సభలో ఉన్న ఆర్జేడీతో పాటు ఇతర విపక్ష సభ్యులను బయటకు పంపేందుకు మార్షల్స్ ప్రయత్నించారు. వారికి సహకరించేందుకు పోలీసులను కూడా లోనికి తీసుకొచ్చారు.  మార్షల్స్, పోలీసులు విపక్ష సభ్యులను బయటకు తీసుకెళ్లే సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. కొందరు పోలీసులు ఎమ్మెల్యేలపై చేయి చేసుకున్నారు. వారిని సభలో నుంచి బయటకు లాక్కుని వెళ్లారు. మహిళ ఎమ్మెల్యేల  జట్లు పట్టి బయటకు లాక్కొచ్చారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యే గాయపడగా, కొందరు స్పృహ కోల్పోయారు. ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలను షేర్ చేసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.. నితీశ్ కుమార్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కౌన్ బనేగా ఎస్ఈసీ?

వడ్డించే వాడు మనవాడైతే.. పదవులు కోరి వరిస్తాయి. ఏపీలో అదే జరుగుతోంది. కీలక పదవుల్లో తన అనునాయులనే నియమించుకుంటున్నారు సీఎం జగన్. ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మిలు ఇలా ప్రధాన్య పోస్టులు పొందినవారే. ఇప్పుడు ఆ కోవలోనే.. కాబోయే ఎస్‌ఈసీ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎస్ఈసీ అంటే లూప్ లైన్ పోస్టుగా ఉండేది. కానీ, నిమ్మగడ్డ ఎపిసోడ్‌తో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఖతర్నాక్ అనే రేంజ్‌లో ఆ పదవికే పవర్ తీసుకొచ్చారు రమేశ్‌కుమారు. ఈ రెండేళ్లలో సీఎం జగన్‌కు ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఎస్ఈసీనే. అంతటి పవర్‌ఫుల్ పోస్టులో నెక్ట్స్ ఎవరు రాబోతున్నారనేది మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్.  ఎస్ఈసీగా నిమ్మగడ్డ మార్చి 31న రిటైర్ కాబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు పేర్లతో ప్యానెల్‌ రెడీ చేశారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని.. నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు శామ్యూల్‌.. ఏపీ పునర్విభజన చట్టం అమలు బాధ్యతలు నిర్వహిస్తున్న రిటైర్డ్‌ అధికారి ఎల్‌.ప్రేమ్‌చంద్రారెడ్డి పేర్లతో జాబితా సిద్ధం చేశారు. ఈ ముగ్గురిలో శామ్యూల్ రేసులో ముందున్నారు. సీఎం జగన్ సైతం శామ్యూల్‌పైనే ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.  శామ్యూల్.. వాన్‌పిక్‌ స్కాం కేసులో నిందితుడు. ఆయన 2014లోనే రిటైర్ అయ్యారు. అప్పట్లోనే శామ్యూల్ చీఫ్ సెక్రటరీ పోస్టుకు పోటీ పడినా.. వాన్‌పిక్‌ కేసులో సహనిందితుడిగా ఉండడంతో అప్పటి ప్రభుత్వం ఆయన్ను సీఎస్‌ పోస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఆ విషయంలో ఆయన కేంద్ర అడ్మినిస్ర్టేటివ్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో.. సీసీఎల్‌ఏగానే పదవీ విరమణ చేశారు శామ్యూల్‌. జగన్‌ సీఎం అయిన కొద్దిరోజులకే ముఖ్యమంత్రి సలహాదారుడిగా మళ్లీ యాక్టివ్ అయ్యారు శామ్యూల్. వైసీపీ ఎన్నికల హామీ అయిన నవరత్నాల పథకాల పర్యవేక్షణ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఇప్పుడు ఎస్ఈసీ రేసులో నిలిచారు. ఎస్ఈసీ జాబితాలో ఉన్న మరో ఇద్దరూ కీలకమైన అధికారులే. సీఎస్‌గా పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన సలహాదారుగా ఉన్న నీలం సాహ్నితో పాటు ఇటీవలే రెండేళ్ల సర్వీసు పొడిగింపు పొందిన ప్రేమ్‌చంద్రారెడ్డి ప్యానెల్‌లో ఉన్నారు. ముగ్గురూ సమర్థులైన అధికారులే కావడంతో వీరిలో ఎవరిని ఎస్ఈసీ వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎస్ఈసీ ఎంపిక అధికారం రాష్ట్ర గవర్నర్‌దే. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టప్రకారం.. ప్రభుత్వ సలహా మేరకు ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ నియమించాలి. అయితే, ఇందులో వయసుకు సంబంధించి వివాదమూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ చట్టం ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. ఇందులో ఏది ముందైతే అది. దీని ప్రకారం శామ్యూల్, ప్రేమ్‌చంద్రారెడ్డిల వయసు 67 ఏళ్లు. నీలం సాహ్ని ఏజ్ మాత్రం 65 ఏళ్లలోపే. ఒకవేళ గవర్నర్ ఏపీ చట్టాల ప్రకారం నియామకం చేపడితే ఎస్ఈసీగా శామ్యూల్‌‌కు అవకాశం దక్కొచ్చు. అదే, కేంద్ర నిబంధనల ప్రకారమైతే నీలం సాహ్నికి ఆ పదవి వరిస్తుంది. ముగ్గురిలో ఎవరికి వచ్చినా.. వారు ప్రభుత్వానికి అనుకూలమే అంటున్నారు. ఆ ఒక్కరు ఎవరనేది త్వరలోనే తేలనుంది. 

ఆ ఎన్నికలు నావల్ల కాదు..

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేతులెత్తేశారు. ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని.. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో తాను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఉత్తర్వులు ఇచ్చారు. 4 వారాల ఎన్నికల కోడ్ విధించాలన్న బాధ్యతనూ నెరవేర్చలేనని అన్నారు. పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడంలో నిమగ్నమై ఉన్నారని ఎస్ఈసీ తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. మార్చి 31తో తన పదవీ కాలం పూర్తవుతుండటంతో.. నూతన ఎస్ఈసీపైనే బాధ్యతలన్నీ ఉంటాయని చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని.. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని చెప్పారు. హైకోర్ట్ తీర్పునకు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నామని నిమ్మగడ్డ తెలిపారు. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరమే పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.