వైఎస్సాఆర్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం.. చేసింది ఎవరంటే?

సూరీడు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన వెన్నంటే ఉన్న అనుచరుడు. సురీడు మీద అతని ఇంట్లో దాడి జరిగింది. జూబ్లీహిల్స్‌లోని అతని నివాసంలోకి బలవంతంగా ప్రవేశించి క్రికెట్ బ్యాట్‌తో అటాక్ చేశాడు. బ్యాట్‌తో విచక్షణారహితంగా కొట్టడంతో సురీడుకు తీవ్ర గాయాలయ్యాయి.  ఇంతకీ సురీడు మీద దాడి చేసింది ఎవరో తెలుసా? అతని అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్‌రెడ్డి. గతేడాది కూడా సురీడు మీద దాడి చేశాడు అతని అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి. సురీడు కుటుంబంలో కొంతకాలంగా కలహాలు ఉన్నాయి. తన కూతురును అల్లుడు వేధిస్తున్నాడంటూ గతంలో సురేంద్రనాథ్‌రెడ్డి మీద గృహహింస కేసు పెట్టాడు సురీడు. ఆ కేసును విత్‌డ్రా చేసుకోవాలంటూ సురేంద్రనాథ్ పలుమార్లు సురీడు మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎంత చెబుతున్నా కేసు ఉపసంహరించుకోకపోవడంతో సురీడు మీద కోపం పెంచుకున్నాడు సురేంద్రనాథ్. తాజాగా, జూబ్లీహిల్స్‌లోని సూరీడు ఇంటికొచ్చి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్యాయత్నం చేశాడు అతని అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి. సురీడు కుమార్తె గంగా భవానీ ఫిర్యాదు మేరకు సురేంద్రనాథ్‌రెడ్డిపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. సురీడు. వైఎస్సార్ హయాంలో ఆయన వెంటే ఉంటూ నిత్యం కనిపించేవారు. వైఎస్ మరణం తర్వాత సురీడు కనుమరుగయ్యారు. జగన్ సీఎం అయినా సురీడు ముందుకు రాలేదు. చాలా కాలం తర్వాత ఇటీవల మల్లీ ప్రజల ముందుకు వచ్చారు. రైతు రణభేరి సభలో ప్రత్యక్షమై రేవంత్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. అన్నేళ్ల తర్వాత సురీడు మళ్లీ రాజకీయ తెరపైకి రావడంతో అంతా ఆసక్తి కనబరిచారు. అప్పట్లో వైఎస్సార్ వెంట ఉన్నట్టే.. ఇకపై రేవంత్‌రెడ్డి వెంబడి ఉంటారని ప్రచారం జరిగింది. కట్ చేస్తే.. లేటెస్ట్‌గా అల్లుడి చేతిలో తీవ్రంగా గాయపడి ఈ విధంగా మళ్లీ వార్తల్లో నిలిచారు సురీడు.

మురికి కాలువలో.. మృత దేహం.. 

ఉదయం పది గంటల వరకు పడుకోవడానికి అది పట్నం కాదు. ఒక మాములు జిల్లా కేంద్రం. ఎప్పుడు జనాలతో రద్దీగా ఉండే కోర్టు బస్టాండ్ ప్రాంతం. అలాగని అర్ధరాతి కాదు. ఉదయం 4:30 గంటలు. ఒంటరిగా ఉన్న ఒక మహిళా దగ్గరికి ముందుగా వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇక అంటే ఆ ఏం జరిగిందో.. తెలియదు గానీ ఆ మరుసటి రోజు ఆ మహిళా డెడ్ బాడీగా ప్రత్యక్షం అయింది.          ఆమె వయసు 30 లేదా 40 ఉంటుంది. పెళ్లి అయింది. ఏంజరిగిందో లేదో తెలియదు గానీ. కరీంనగర్ పట్టణంలోని కోర్టు బస్టాప్ పక్కన ఓ మురికి కాలువలో ఆమె మృతదేహమై కనిపించింది. రద్దీగా ఉండే ప్రదేశంలోనే ఏకంగా బస్టాప్ పక్కనే ఆమె మృతదేహాన్ని పడేయడం తీవ్ర కలకలం రేపింది. ఎక్కడైనా మర్డర్ చేసి ఆమె శవాన్ని అక్కడ పడేశారా? లేక అక్కడే ఆమెను మర్డర్ చేశారా ? అన్న  విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంగళవారం ఉదయం ఆమె మృతదేహాన్ని గుర్తించగా, రాత్రి అయినప్పటికీ నిందితులు ఎవరో ఎందుకు మర్డర్ చేశారో తెలియలేదు. దీంతో ఘటనలో కీలక ఆధారమైన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.    కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద మంగళవారం ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం అయ్యింది. కరీంనగర్ లోని కోర్టు చౌరస్తా వద్ద జగిత్యాల వెళ్లే బస్టాప్ పక్కనే ఓ మురికి కాలవ ఉంది. ఓ ఆటో డ్రైవర్ ఆమె మృతదేహాన్ని చూసి స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా, అక్కడికి వచ్చి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు , పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకే మృతదేహాన్ని కాలువ లోపలి వైపునకు తోసిసినట్టు పోలీసులు గుర్తించారు. దగ్గరగా వెళ్లి చూస్తే తప్ప మురికి కాలువలో మృతదేహం ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఆమె మృతదేహం పక్కన పడి ఉన్న మద్యం సీసాతోపాటు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఆ మురుగు కాలవలోకి ఒకరు దూరడమే కష్టం. అలాంటిది ఆమె మృతదేహాన్ని అందులో ఎలా పడేశారు? మృత దేహం దగ్గర ఉన్న సీసాలు, చెప్పులు ఉండడం వల్ల పలు సందేహాలు పోలీసులను వెంటాడుతున్నాయి.  ఆమె ఛామనచాయ రంగు, గులాబీ కుర్తా, పైజమా, నీల రంగు ప్యాంటు ధరిచి ఉందనీ, సిలువ బొమ్మతో పుస్తెల తాడు కూడా ఉందనీ, ఎడమ చేయిపై టాటూ కూడా ఉందని ఆమె ఆనవాళ్లను పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఒంటిపై మాత్రం ఎలాంటి గాయలు లేవని పోలీసులు తెలిపారు.   ఆ ప్రాంతం లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా, తెల్లవారుజామున 4.30 గంటల సమయం నుంచి 5.15 గంటల సమయంలో ఆమె అదే ప్రాంతంలో తిరిగినట్టు కనిపించింది. ఆమె వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు సీసీ కెమెరా లో రికార్డ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురే ఆ మహిళను ఉదయం 5.15 గంటల తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే కరోనా వాళ్ళ చనిపోయిన వారికంటే.. ఒక మనిషిని మరో మనిషిని చంపినా మరణల రేట్ ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక కారణం చేత తండ్రిని చంపినా కొడుకు, కూతుర్ని చంపిన తండ్రి, వదినను చంపినా మరిది, భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య అంటూ వార్తలు విటునే ఉంటాం లాంటి వార్తల తోనే మన రోజు తెల్లారుతుంది. 

తెలంగాణలో ధియేటర్స్ క్లోజ్? 

సినిమా హాల్స్ మూసేయండి.  తెలంగాణ సర్కారుకు వైద్య అధికారుల నివేదిక. ఈ విషయం పై ఎంత ఆలస్యం చేస్తే అంత ముప్పు తప్పదు అంటున్న వైద్యులు. మూసివేత వద్దనుకుంటే ధియేటర్ కెపాసిటీని తగ్గించండి.  కేసులు పెరగడానికి సినిమాలు కూడా కారణమే ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు. జనం ఎక్కడ ఉంటే అదే దాని పెట్టుబడి. ఆ ప్రదేశాలే కరోనా కు పుట్టిన ఇల్లు. కరోనా రోజురోజుకూ కోరలు చేస్తున్నాయి. దేశం లో తెలుగు రాష్ట్రాల్లో కేసులు కుప్పలా పెరుగుతున్నాయి. స్కూల్స్ లో.. హాస్టల్ లో జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కరోనా మహమ్మారి మళ్ళీ తన పాగా వేస్తూ విరుచుకుపడుతుంది. ఒక వైపు పిల్లను స్కూల్ కి పంపాలంటే తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.. మరో వైపు ప్రజల్లో గత సంవత్సరం కింద ఉన్న భయం, ఉప్పెనలా మళ్ళీ స్టార్ట్ అయింది. నేపథ్యంలో తెలంగాణలో స్కూల్స్ కి తాళం వేసింది.. ఇది ఇలా ఉండగా కరోనా వ్యాప్తి చెందడానికి ఎన్నో కేంద్రాలు ఉన్నాయి, వైన్స్ లు, బార్లు, జిమ్ములు, మెట్రో ట్రైన్స్, కోచింగ్ సెంటర్స్, బస్సులు  వీటన్నితో పాటు ముఖ్యం గా సినిమా ధియేటర్స్  మరి వీటి మాట ఏమిటి ..? అటు ప్రజల్లోనూ.. ఇటు వైద్యులోను ప్రశ్నలు మెదులుతున్నాయి.  ఇప్పుడు రాష్ట్రంలో రెండో వేవ్ కొనసాగుతోందని గుర్తు చేసిన ఆరోగ్య శాఖ అధికారులు, పరిస్థితి ఇలానే ఉంటే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంపూర్ణ లాక్ డౌన్ తర్వాత  వరుసగా కొత్త సినిమాలు వస్తుండటంతో, 90 శాతం వరకూ థియేటర్లు నిండిపోతున్నాయని, సినిమా హాల్స్ లో మాస్క్ లు లేకుండా. పక్కపక్కనే కూర్చోవడం, డోర్స్ క్లోజ్ చేసి ఎయిర్ కండిషనింగ్ అమలు చేస్తుండటం వల్ల కూడా కేసులు పెరగడానికి కారణమని అధికారులు తమ నివేదికలో తెలిపారు. సినిమా హాల్స్ తో పాటు  ప్రజలు అధికంగా ఉండే వివిధ కార్యకలాపాల ప్రదేశాలపై  కూడా తాత్కాలికంగా నిషేధం విధించాలని ప్రభుత్వానికి సూచించామని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన నివేదికను అనుసరించి నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలోనూ ఆరోగ్య శాఖ కొంత అసహనంగానే ఉన్నట్టు సమాచారం. స్కూళ్ల మూసివేతపై నిర్ణయం తీసుకోవాలని తాము పది రోజుల క్రితమే నివేదిక ఇచ్చినా, ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నదని అంటున్న అధికారులు, సినిమా హాల్స్ విషయంలో సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలని కోరుతున్నారు.  

సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ.. 

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్‌ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. జస్టిస్‌ బోబ్డే ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ.. హోంశాఖకు పంపనుంది. హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్‌ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ పదవి అలంకరించిన తొలి తెలుగు వాడిగా జస్టిస్‌ ఎన్వీ రమణ గుర్తింపు పొందనున్నారు. జస్టిస్ ఎన్‌వీ రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న జన్మించారు. సుప్రీం కోర్టులో 2017 ఫిబ్రవరి 2న నియమితులయ్యారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం అంటే, 2022 ఆగస్టు 26 వరకూ ఆయనకు సర్వీసు ఉంది. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు.2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న దిల్లీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. అనంతరం 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  

డియర్ ఇమ్రాన్.. ఇట్లు మీ మోదీ..

భారత ప్రధాని మోదీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ రాశారు. పొరుగునే ఉన్న పాక్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని చెప్పారు. అయితే, నమ్మకమైన వాతావరణాన్ని మాత్రం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదానికి తావులేని వాతావరణాన్ని కూడా కల్పించాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పైనే ఉందని మోదీ లేఖలో తెలిపారు.  పాకిస్తాన్ నేషనల్‌డే సందర్భంగా ప్రధాని మోదీ పాక్ ప్రధానికి లేఖ రాశారు. ‘‘ఓ పొరుగు దేశంగా మీతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం. దీనికోసం విశ్వసనీయ వాతావరణాన్ని కల్పించాల్సి ఉంది. అంతేకాకుండా ఉగ్రవాదానికి తావులేని వాతావరణం కూడా కల్పించాలి.’’ అని మోదీ ఆ లేఖలో రాశారు. ఒకవైపు పాక్‌కు చురకలు పెడుతూనే మరోవైపు కొవిడ్ కట్టడి విషయంలో ఇమ్రాన్ చేస్తున్న ప్రయత్నాలను పొగిడారు. కొవిడ్‌కు ముకుతాడు వేసే క్రమంలో ఇమ్రాన్ ప్రభుత్వం చేసిన పోరాటాన్ని మోదీ అభినందించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న పాక్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు చెప్పారు.  సడెన్‌గా ప్రధాని మోదీ.. పాక్ ప్రధానికి లేఖ రాయడంపై చర్చనీయాంశమైంది. అయితే, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని.. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా లేఖ రాశారని పీఎంవో వర్గాలు స్పష్టం చేశాయి. 

టీఆర్ఎస్ లో సాగర్ కిరికిరి?

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది. నామినేషన్లు మొదలయ్యాయి. అధికార పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని తేల్చడం లేదు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుతో అభ్యర్థి ఎంపికకై ఆచితూచి అడుగులు వేస్తోంది గులాబీ పార్టీ. తమ సిట్టింగ్ స్థానమైన సాగర్ లో ఏ మాత్రం తేడా వచ్చినా.. పార్టీ భవిష్యత్ పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అభ్యర్థి ఎంపిక కోసం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో పార్టీలో జోష్ వచ్చినా.. నల్గొండ జిల్లా నేతల మధ్య వర్గపోరు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. జిల్లా నేతలు ఏకతాటిపై లేకపోవడం వల్లే నాగార్జున సాగర్ అభ్యర్థి ఎంపిక కొలిక్కి రావడం లేదని చెబుతున్నారు.  నాగార్జున సాగర్ టికెట్ విషయంలో నల్గొండ టీఆర్ఎస్ లో మూడు ముక్కలాట జరుగుతుందని తెలుస్తోంది. సాగర్​ టికెట్​ కోసం సీనియర్లు ఫైట్​ చేస్తున్నారని చెబుతున్నారు. యాదవ, రెడ్డి కులంలో టికెట్ ఇవ్వాలో సీఎం కేసీఆర్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ సెగ్మెంట్​లో యాదవ కులం ఓట్లు ఎక్కువుండగా.. రెడ్డి లీడర్లు బలంగా ఉన్నారు. దీంతో ఏ కులం వాళ్లకు టికెట్ ఇస్తే బాగుంటుదని నిఘా వర్గాల నుంచి కేసీఆర్​ ఇప్పటికే రిపోర్టు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. యాదవ కులం నుంచి నోముల నర్సింహయ్య కొడుకు భగత్​తో పాటు గురువయ్య యాదవ్, ఓయూ విద్యార్థి నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నోముల కొడుక్కే టికెట్​ ఇవ్వాలని, సామాజికవర్గం ఓట్లతో పాటుగా సానుభూతి కలిసి వస్తుందని మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి పట్టుపడుతున్నారని చెబుతున్నారు.  మంత్రి జగదీశ్​రెడ్డి మాత్రం రెడ్డి కులం నుంచి ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, ఎంసీ కోటిరెడ్డి పేర్లను ప్రతిపాదిస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. తన క్లాస్ మేట్ అయిన కోటిరెడ్డికి టికెట్ కోసం జగదీశ్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్​ .. తమ బంధువైన గురవయ్య యాదవ్​ కోసం సీఎం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంతో సాగర్ అభ్యర్థిని కేసీఆర్ ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. నల్గొండ జిల్లా నేతలతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని.. గుత్తా, మంత్రి జగదీశ్​రెడ్డితో పాటు జిల్లా నేతలను ప్రగతిభవన్​ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది.  మరోవైపు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఏడుగురు మంత్రులను సాగర్ లో  మకాం వేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మండలానికో ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా నియమించగా.. వారంతా అభ్యర్థి లేకుండానే ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేశారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు, జగదీశ్​రెడ్డి, నిరంజన్​రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, పువ్వాడ అజయ్​, గంగుల కమలాకర్​ను సాగర్ లో మోహరించేందుకు గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారట. మంత్రులకు టార్గెట్​ పెట్టి ప్రచారం చేయించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి పోల్ మేనేజ్ మెంట్ విపక్షాలకు చుక్కలు చూపించింది. దీంతో నాగార్జున సాగర్ పోల్ మేనేజ్ మెంట్ బాధ్యతలన్నీ పల్లాకే అప్పగించారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

కరోనా డోసు తీసుకున్నా.. సీఎం భార్యకు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలో రోజురోజుకు వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని వదలడం లేదు వైరస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మీ థాకరే కరోనా సోకింది.  ఆమెను  హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఉద్దవ్ థాకరే దంపతులు ఈ నెల 11న ముంబైలోని జేజే ఆసుపత్రిలో కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు. రెండు రోజుల క్రితమే వారి కుమారుడు, పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే కూడా కరోనా బారినపడ్డారు. కరోనా నుంచి కోలుకున్న కొన్ని నెలలకే మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే మరోమారు ఆ మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అయిన ధనంజయ్ ముండే ఉద్ధవ్ థాకరే కేబినెట్‌లో సామాజిక న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గతేడాది జూన్‌లో కరోనా బారినపడిన మంత్రి కోలుకున్నారు. తాజాగా  తనకు మరోమారు వైరస్ సోకిందని, గత కొన్ని రోజులుగా తనను కలిసినవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. భయపడాల్సింది ఏమీ లేదని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని మంత్రి ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి  చెలరేగిపోతోంది. మంగళవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 28,699 కొత్త కేసులు నమోదయ్యాయి. 132 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు 2.12 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది. పలు జిల్లాల పరిధిలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తోంది. కరోనా కట్టడిలో ప్రజలు సహకరించాలని, అత్యవసరాలకు తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. లాక్‌డౌన్ విధించే పరిస్థితి తీసుకురావొద్దని హెచ్చరించింది.

దోచెయ్.. దాచెయ్! ఇసుకలో క్విడ్ ప్రోకో.. 

ఏపీలో ఇసుక దందా. ప్రకృతి ప్రసాదిత ఇసుకంతా ప్రైవేటు పరం. క్విడ్ ప్రోకో అంటోంది ప్రతిపక్షం. టెండర్లంటూ సర్కారు సమర్ధింపు. ఇందులో ఏది నిజం? ఏది ప్రచారం?. కాస్త లోతుగా పరిశీలిస్తే ఇసుక నుంచి కాసుల తైలం పిండుకునే విధానం బయటకు వస్తుంది అంటున్నారు విపక్ష నేతలు. జగన్ ఆస్తుల కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తికే పరోక్షంగా ఇసుక రీచ్‌లు అప్పగించారని ఆరోపిస్తున్నారు. ఇసుక టెండర్ల వెనుక నడిచిన క్విడ్ ప్రోకో గురించి పూస గుచ్చినట్టు వివరిస్తున్నారు.  ఇసుకపై జగన్ సర్కార్ ముందు నుంచి డ్రామాలే చేసింది. మొదట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక ఉచిత సరఫరా అన్నారు. ఆ తర్వాత మాట మార్చారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తే.. ప్రస్తుత జగన్ సర్కారు ఇసుకను అంగడి సరుకుగా మార్చేసింది. ఇప్పుడు ఏకంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇసుక రీచులను ఒకే కంపెనీకి అప్పగించారు. నూతన ఇసుక విధానంలో భాగంగా ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు స్వీకరించింది ప్రభుత్వం. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు ఒకటిగా.. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలు ఒక జోన్‌గా.. రాయలసీమ, ప్రకాశం జిల్లాలు మరో జోన్‌గా టెండర్లు పిలిచారు. మూడు జోన్లలోనూ ఒకే సంస్థ ముందు నిలవడం ఆశ్చర్యంగా మారింది. ఇసుక టెండర్లను జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ చేజిక్కించుకోవడంతో.. ఆ సంస్థతో గనుల శాఖ ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు, స్టాక్ యార్డ్ నిర్వహణ, అమ్మకాల్లో ఏప్రిల్ 1 నుంచి జేపీ పవర్ వెంచర్స్‌దే గుత్తాధిపత్యం. ఇసుక టెండర్లలో L1గా నిలిచిన జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌.. జగన్ కేసుల్లో A3గా ఉన్న వ్యక్తికి చెందిన కంపెనీయే అంటున్నారు. తెర వెనుక పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో జరిగిందని.. అందుకే మూడు జోన్లూ.. జగన్‌రెడ్డికి కావలసిన వ్యక్తి కంపెనీకే దక్కాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు, జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ 3,504 కోట్ల నష్టాల్లో ఉందంటూ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ చూపిస్తున్నారు. గత 7 ఏళ్లుగా ఆ కంపెనీ నష్టాల్లో ఉంది. అలాంటి కంపెనీకి మొత్తానికి మొత్తం ఇసుకు రీచులన్నీ దక్కడం యాదృచ్చికమేమీ కాదంటున్నారు. ఇదంతా జగన్ కనుసన్నల్లో జరిగిన క్విడ్ ప్రోకో డీల్ అని ఆరోపిస్తున్నారు.  తెరపైన జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్. తెర వెనుక రాంకీ గ్రూప్. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పెదబోట్ల గంగాధర శాస్త్రి. అతను రాంకీ గ్రూప్‌లో గత 25 ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న ఉద్యోగి. ఇతను రాంకీ గ్రూప్‌కి చెందిన కంపెనీలన్నింటిలోనూ డైరెక్టర్‌గా ఉన్నాడని అంటున్నారు. ఆ రాంకీ గ్రూప్ ఛైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. ఇతను జగన్మోహన్‌రెడ్డి ఎదుర్కొంటున్న సీబీఐ, ఈడీ కేసుల్లో A3 నిందితుడు. ఇప్పటికే అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టారు జగన్. ఆ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక‌ృష్ణారెడ్డి. అప్పటి క్విడ్ ప్రోకో కేసులో మాదిరే.. ఇప్పుటి ఇసుక రీచుల్లోనూ పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిందనేది ప్రతిపక్షాల ఆరోపణ.  నూతన ఇసుక విధానం అంటూ ఇప్పటి వరకూ మూడు సార్లు పాలసీ ఛేంజ్ చేశారు. నిలకడలేని నిర్ణయాలతో ఏపీలో నిర్మాణరంగం కుదేలైంది. పనులు లేక కూలీలు రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఏకంగా ఇసుకను ప్రైవేటు పరం చేశారు. తన అనునాయులకు రీచులు దారదత్తం చేశారు. ఆస్తుల కేసులో సహనిందితుడికి పరోక్షంగా ఇసుకను కట్టబెట్టి.. జగన్‌రెడ్డి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. మరి, 3వేల కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్‌కు ఇసుక రీచుల కాంట్రాక్టులన్నీ కట్టబెట్టడం వెనుక మతలబు ఏంటి జగన్మోహనా?

అమరావతిపై జగన్ మరో సంచలనం

అమరావతికి సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి  కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఏపీ మున్సిపల్ యాక్ట్ 1994 ప్రకారం ఏపీ పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం మంగళగిరి మున్సిపాలిటీ, దాని పరిధిలోని 11 గ్రామ పంచాయతీలు... తాడేపల్లి మున్సిపాలిటీ, దాని పరిధిలోని 10 గ్రామ పంచాయతీలు కూడా కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పేరిట కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఏపీ పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.  సీఎం జగన్ కార్యాలయం ఇప్పటివరకు తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక తాడేపల్లితో పాటు, మంగళగిరి మున్సిపాలిటీలను ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. తద్వారా తాడేపల్లి మున్సిపల్ పరిధి మరింత పెరిగింది. ఇప్పుడు మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల కలయికతో కార్పొరేషన్ రూపుదిద్దుకుంది.

కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు 

దేశంలో కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మహమ్మారి కట్టడికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నిర్ధారణ పరీక్షలు, బాధితుల గుర్తింపు, చికిత్సపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నూతన మార్గదర్శకాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 30 వరకు ఇవి వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలని.. పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. ఆ తర్వాత వారు ఎవరెవరిని కలిశారో గుర్తించాలని.. పాజిటివ్‌ కేసులను బట్టి కంటైన్మెంట్‌ జోన్‌లను గుర్తించాలని ఆదేశించింది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో పొందుపర్చాలని, కంటైన్మెంట్‌ జోన్‌లలో ఇంటింటికి తిరిగి పరీక్షలు చేయాలని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.  బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రద్దీప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. మాస్క్‌లు ధరించడం, సామాజికదూరం పాటించడం వంటి నిబంధనలను ఉల్లంఘించకుండా చూడాలి. ఉల్లంఘించిన వారిపై అవసరమైతే జరిమానా వంటి చర్యలు కూడా తీసుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించవచ్చని  చెప్పింది. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల రాకపోకలపై ఎలాంటి నిషేధం ఉండదని.. వ్యక్తులు, సరకు రవాణా కోసం రాష్ట్రాల మధ్య ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.  కంటైన్మెంట్‌ జోన్‌ వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉందని కేంద్రం తెలిపింది. అయితే ప్రయాణికుల రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, స్కూళ్లు, విద్యాసంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్‌ సెంటర్లు తదితర వాటిల్లో మాత్రం నిర్దేశిత ప్రమాణాలు  అమల్లో ఉంటాయని వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను భారత్‌ ప్రారంభించిందని చెప్పిన కేంద్రం.. ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతోందని వెల్లడించింది.ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి చైన్‌ను విడగొట్టాలంటే టీకానే ఆధారం. అందువల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టిపెట్టాలి. అర్హులైన వారందరూ టీకా వేయించుకునేలా చూడాలని రాష్ట్రాలను కేంద్ర సర్కార్ ఆదేశించింది. 

అఖిల భారత పిరికి సంఘం అధ్యక్షుడు జగన్!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్ సభ వేదికగా కేంద్రమంత్రి  ప్రకటనతో జగన్ సర్కార్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్న జగన్... ఎందుకు మాట్లాడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మాట తప్పం.. మడమ తిప్పమని చెప్పే జగన్... ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అఖిల భారత పిరికి సంఘానికి అధ్యక్షుడని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. హోదా కాదు కదా కేంద్రం నుంచి కప్పు కాఫీ కూడా జగన్‌రెడ్డి సాధించలేడని సైటైర్ వేశారు. గుంపుగా వైసీపీలో 22 మంది ఎంపీలు ఉండి ఏం లాభం? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా లేదని కేంద్రం తేల్చేసిందన్నారు. మెడలు వంచి హోదా సాధిస్తా అని తొడకొట్టిన జగన్‌రెడ్డి ఎక్కడ? అని నిలదీశారు. కనీసం నోరిప్పి అడిగే ధైర్యం కూడా లేదయ్యా జగన్‌రెడ్డీ నీకు?’ అని బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

400 మంది పోటీ! సాగర్ లో నిజామాబాద్ సీన్ రిపీట్?

లోక్ సభ ఎన్నికల్లో కవిత ఘోర పరాజయం.. సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్.. కారణం పసుపు రైతులు.. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 178 మంది నామినేషన్ వేయడమే. కవిత టార్గెట్ గా రైతులు ఎన్నికల సమరంలోకి దిగడంతో అధికార పార్టీకి అనూహ్య ఓటమి తప్పలేదు. అప్పటి నిజామాబాద్ స్ట్రాటజీ.. ఇప్పుడు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో రిపీట్ కాబోతోంది. అప్పుడు పసుపు రైతులు కవితకు షాకిస్తే.. ఇప్పుడు తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితికి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.  నల్గొండ జిల్లా  నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ అమరవీరుల ఐక్య వేదిక సభ్యులు నామినేషన్లు వేసేందుకు సిద్దమవుతున్నారు. సుమారు 400 మంది నామినేషన్ దాఖలు చేయనున్నట్లు అమరవీరుల ఐక్యవేదిక అధ్యక్షులు రఘుమా రెడ్డి తెలిపారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని ఆయన ఆరోపించారు. అమరవీరుల ఆశయాల సాధన కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రఘుమారెడ్డి చెప్పారు. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. అమరవీరుల కుటుంబాలకు సాయం చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. మాట తప్పారని రఘుమారెడ్డి ఆరోపించారు.  2019 లోక్ సభ ఎన్నికల్లో పుసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పోటీ చేసిన నిజామాబాద్ ఎంపీ స్థానానికి 178 మంది నామినేషన్ వేశారు. పసుపు రైతుల సమస్య జాతీయ స్తాయిలో చర్చానీయంశం చేశారు. పసుపు రైతులు పోటీ చేయడం వల్లే నిజామాబాద్ లో కవిత ఓడిపోయారు. ఇప్పుడు సాగర్ లోనూ 400 మంది పోటీ చేస్తామని ప్రకటించడంతో అధికార టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది

జలుబుతో కరోనాకు చెక్!

జలుబు వైరస్‌తో కరోనా పరార్. అవును, మీరు చదివింది నిజమే. జలుబు ముందు కరోనా బలాదూర్ అంటున్నారు సైంటిస్టులు. ఇది ఊహో, అంచనానో కాదు. యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్‌గోవ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగ పూర్వకంగా ఈ విషయం నిరూపించారు. జలుబు వైరస్‌కు, కరోనా వైరస్‌కు మధ్య పోటీ పెడితే.. అందులో జలుబు వైరసే గెలిచింది. ఆ ప్రయోగంతో సైంటిస్టుల్లో కొవిడ్‌పై పోరాటంలో విజయం సాధించగలమన్న నమ్మకం పెరిగింది.  జలుబుకు కారణం రైనో వైరస్. ఇది శ్వాసకోస కణజాలంపై దాడి చేస్తుంది. శాస్త్రవేత్తలు రైనో వైరస్‌ను, కరోనా వైరస్‌ను శ్వాసకోస తలంపై ఒకేసారి ప్రయోగించారు. తమ కణజాలాన్ని ఇన్ఫెక్ట్ చేసేందుకు రెండు వైరస్‌లు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. అనూహ్యాంగా జలుబు వైరస్సే గెలిచింది. కణజాలాన్ని ముందుగా రైనో వైరసే ఇన్ఫెక్ట్ చేసి.. కరోనాకు స్థానం లేకుండా చేసింది. మొదటి దశలో జలుబు వైరస్‌దే అప్పర్ హ్యాండ్ కావడంతో.. సెకండ్ లెవల్ టెస్ట్‌కు సిద్ధమయ్యారు సైంటిస్టులు. శ్వాసకోస కణజాలంపై ముందుగా కరోనా వైరస్‌ను ప్రవేశపెట్టి ఇన్ఫెక్షన్ స్థిరపడేందుకు 24 గంటల గడువిచ్చారు. ఆ తరువాత.. జలుబు వైరస్‌ను ప్రవేశపెట్టారు. ఆశ్చర్యకరంగా.. ఈసారి కూడా జలుబు వైరస్‌దే విజయం. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం రైనో వైరస్‌కు ఉందని దాదాపు నిర్థారణకు వచ్చారు.  అయితే.. ఇందులోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. జలుబు వైరస్ వల్ల కలిగే రోగ నిరోధక శక్తి తాత్కాలికమే. జలుబు తగ్గిపోగానే కరోనా వైరస్ మళ్లీ దాడి చేసే ప్రమాదం లేకపోలేదు. ఈ ప్రయోగం భవిష్యత్తులో కరోనాకు శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా చేసే ప్రయత్నాలకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. 

ఆ ఒక్క ట్వీట్ 18 కోట్లు పలికింది.. స్పెషాలిటీ ఏంటంటే..

ఈరోజుల్లో దేశ ప్రధానులు, అధ్యక్షుల నుండి సెలబ్రిటీలు స్పోర్ట్స్ పర్సన్స్ వరకు ఒక్క ట్వీట్ చేసారంటే ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. ఇక ట్రంప్ వంటి పొలిటీషియన్ అయితే ఇక ఆ రచ్చ మాములుగా ఉండదు. ఇంకోపక్క నేతలు, సెలబ్రిటీల మధ్య తమ ఫాలోవర్ల సంఖ్యకు సంబంధించి ప్రతి నిత్యం పోటీనే...   ఇది ఇలా ఉండగా ట్విట్టర్ లాంచ్ చేసిన తరువాత ప్రపంచంలో మొట్టమొదటి ట్వీట్‌ను పోస్ట్ చేసి ఈరోజుకి సరిగ్గా 15 ఏళ్లు గడిచాయి. 2006 మార్చి 22న ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే "జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విటర్" అనే ఒక మెసేజ్‌ను ట్వీట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు ట్విట్టర్ అలాగే జాక్ డోర్సే వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్విటర్ కూడా ఒకటి. ఇది ఇలా ఉండగా. మొట్టమొదటి ట్వీట్‌ చేసి 15 ఏళ్లు గడుస్తున్న  సందర్భంగా జాక్ డోర్సే ఈ నెల ఆరో తేదీన తాను చేసిన మొదటి ట్వీట్ ను వేలానికి పెట్టారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ట్వీట్‌ ఏకంగా రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ ట్వీట్ యొక్క డిజిటల్ సెర్టిఫికెట్ ను బ్రిడ్జ్ ఒరాకిల్ కంపెనీ సిఇవో సినా ఎస్తావి సొంతం చేసుకున్నారు. దీంతో ఈ వార్త కాస్తా..  ఒక్కసారిగా ట్విటర్‌లోనే ట్రెండ్ అయింది. అయితే వేలం ద్వారా వచ్చిన ఈ సొమ్ము మొత్తాన్ని జాక్ డోర్సే చారిటీకి విరాళంగా ఇవ్వనున్నారు.  

గొర్రెను కాదు ఇంకో పులిని ఇవ్వండి..

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ఎంపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు  2019 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 22 మంది గొర్రెలను గెలిపించారని.. ఆలా గెలిచినవాళ్లు  రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం పోరాడడం లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఇవాళ అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వచ్చే తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేస్తామన్నారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలు కూడా ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని ఆయన చెప్పారు. తిరుపతి ఎన్నికలలో వైసీపీ ధన బలంతో గెలవాలని చూస్తోందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండెక్కి కూర్చొన్న సీఎం జగన్ పొగరు దించాలంటే తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ గెలవాలని ఆయన చెప్పారు. విజ్ఞులైన తిరుపతి ఓటర్లు న్యాయం, ధర్మం కోసం టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని అచ్చెన్న పిలుపునిచ్చారు. రేపు ఉదయం నెల్లూరులో టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మీ నామినేషన్‌ వేస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని ఆయన కోరారు. అంతేకాకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి జగన్ సర్కార్ వైఫల్యాలపై ప్రజలకు వివరంగా చెబుతారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.   మరోపక్క సంక్షేమ కార్యక్రమాల పేరిట  వైసీపీ ప్రభుత్వం పది రూపాయలు ఇచ్చి.. ప్రజల నుండి మాత్రం 100 రూపాయలను లాగేసుకుంటోందని అచ్చెన్న ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు వంటి అంశాలను రాష్ట్ర సర్కార్ కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆయన మండిపడ్డారు. "టీడీపీ తరుఫున ఇప్పటికే మూడు పులులు ఉన్నాయి.. ఏపీ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో నిరంతరం ఈ మూడు పులులు గళం విప్పుతున్నాయి.. వీరికి అదనంగా మరో పులిని చేర్చండి" అని అచ్చెన్నాయుడు తిరుపతి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.  

కేబినెట్ లోకి పల్లా! వాణిదేవీకి కీలక పదవి

తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రజా వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ రెండు సీట్లలో విజయం సాధించింది. నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానం నుంచి వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీజేపీకి సిట్టింగ్ స్థానమైన   హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు కూతురు వాణిదేవీ సంచలన విజయం సాధించారు. నిజానికి ఈ రెండు సీట్లలో గులాబీ పార్టీకి ఏమాత్రం గెలిచే అవకాశం లేదని అంతా భావించారు. అందుకే అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే ప్రచారం జరిగింది.  కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీకి మొదట వెనుకంజ వేసినా.. సీఎం సూచనతో రంగంలోకి దిగారంటున్నారు. ఇక హైదరాబాద్ స్థానంలో వాణిదేవీని చివరి నిమిషంలో బరిలోకి దింపారు గులాబీ బాస్.  ప్రతికూల పరిస్థితిల్లో పోటీలో దిగి విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణిదేవీకి కీలక పోస్టులు దక్కనున్నాయని తెలుస్తోంది. తనకు నమ్మకస్తుడిగా ఉన్న పల్లాను కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. కొంత కాలంగా పాలనతో పాటు పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ అంతా ఆయన డైరెక్షన్ లోనే జరిగింది. కేబినెట్ లో లేకపోయినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయనదే హవా నడుస్తుందనే చర్చ ఉంది. తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఎమ్మెల్సీగా గెలవడంతో పల్లా ఇమేజ్ మరింత పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా వ్యూహాల ముందు విపక్షాలు చిత్తయ్యాయని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంపై తీవ్ర కోపంగా ఉన్న ఉద్యోగులను మచ్చిక చేసుకోవడంలో పల్లా సక్సెస్ అయ్యారని అంటున్నారు. పోల్ మేనేజ్ మెంట్ లోనూ విపక్షాలకు పల్లా చుక్కలు చూపించారనే చర్చ జరుగుతోంది. మొత్తంగా తమకు కష్టమనుకున్న సీటులో గెలిచి.. వరుస ఓటములతో డీలా పడిన పార్టీలో జోష్ వచ్చేలా చేసిన పల్లాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం. కేసీఆర్ మంత్రివర్గంలో ప్రస్తుతం ఖాళీలు లేవు. పల్లాను తీసుకుంటే ఒకరిని తొలగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే... ఆయన సామాజికవర్గానికే చెందిన మంత్రికి ఉద్వాసన ఖాయమంటున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డికి షాక్ తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటి నుంచి కేసీఆర్ పై విమర్శలు వస్తున్నాయి. భూదందాల్లోనూ ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలతోనూ మల్లారెడ్డికి పొసగడం లేదు. అంతేకాదు గత లోక్ సభ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడికి ఎంపీ టికెట్ ఇచ్చినా.. గెలిపించుకోలేకపోయారు మల్లారెడ్డి. దీంతో పల్లాను తీసుకోవడం కోసం మంత్రివర్గం నుంచి మల్లారెడ్డిని తప్పించడం ఖాయమని చెబుతున్నారు.  ఇక బీజేపీ సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్ లో టీఆర్ఎస్ పోటీ చేయడం లేదనే ప్రచారం జరిగింది. అభ్యర్థులు లేకపోవడంతో పోటీ నుంచి తప్పుకుని నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని కూడా అన్నారు. కాని అనూహ్యాంగా బరిలోకి దిగిన వాణిదేవీ... అద్భుత విజయం సాధించారు. నిజానికి హైదరాబాద్ స్థానంలో పోటీకి వాణిదేవీ సిద్దం కావడమే సంచలనం అంటున్నారు. ఓడిపోయే సీటు అని తెలిసినా ఆమె ఎందుకు పోటీ చేస్తున్నారో అంటూ విపక్షాలు సెటైర్లు కూడా వేశాయి. అయినా ధైర్యంగా పోటీ చేసిన వాణీదేవీ.. అనూహ్య  విజయం సాధించారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ విక్టరీకి వాణీదేవీ అభ్యర్థిత్వమే కారణమని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. అందుకే వాణిదేవీని ఎమ్మెల్సీతో సరిపెట్టకుండా కీలక పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అధినేతకు ఇదే సూచన చేశారని తెలుస్తోంది. వాణిదేవీకి ఏ పదవి కట్టాబెట్టాలన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. పలు విద్యాసంస్థలకు అధినేతగా ఉన్న వాణిదేవీకి విద్యాశాఖ మంత్రి అయితే సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితాఇంద్రారెడ్డిని రెండో దశలో కేబినెట్ లోకి తీసుకున్నారు. తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా ఆమె నిలిచారు. దీంతో ఆమెను తప్పిస్తే బాగుండదనే చర్చ గులాబీ నేతల్లో జరగుతుందట. కేబినెట్ బెర్త్ కాకుండా వాణిదేవీకి శాసనమండలి చైర్మెన్ పదవి ఇవ్వాలని సూచన కొందరు నేతలు చేశారంటున్నారు. ప్రస్తుతం మండలి చైర్మెన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంగా ఉంటున్నారు. దీంతో ఆయనకు రెస్ట్ ఇచ్చి.. వాణిదేవీకి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విజయాలు సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి,  సురభి వాణిదేవీలకు కీలక పదవులు దక్కడం మాత్రం ఖాయమంటున్నాయి టీఆర్ఎస్, తెలంగాణ భవన్, ప్రగతి భవన్ వర్గాలు. 

తెలంగాణలో స్కూల్స్ క్లోజ్ 

తెలంగాణలో విద్యా సంస్థలు మూత పడ్డాయి. కరోనా విజృంభణతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య కళాశాలలు మినహా మిగతా అన్ని రకాల పాఠశాలలు ,కళాశాలలను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. విద్యాసంస్థలు మూసి వేయాలని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు సబితా. విద్యార్థులు ,తల్లిదండ్రుల  క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసి వేస్తున్నామని తెలిపారు. పొరుగు రాష్ట్రాలలో విద్యాసంస్థలు మూసివేసినందున.. తెలంగాణ లో కూడా విద్యాసంస్థలను క్లోజ్ చేయాలని నిర్ణయించామన్నారు. ఆన్ లైన్ లో తరగతులు కొనసాగుతాయన్నారు సబితా ఇంద్రారెడ్డి.  తెలంగాణలో ప్రస్తుతం కరోనా పంజా విసురుతోంది. 15 రోజుల నుంచి రోజుకు 3 వందలకుపైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఏకంగా 4 వందలు క్రాస్ అయ్యాయి. అందులో దాదాపు సగానికిపైగా కేసులు గురుకులాల్లలోనే వచ్చాయి.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 700 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. పరిస్థితి చేజారిపోకుండా ఉండాలంటే పదో తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను మూసివేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వైరస్ వ్యాప్తికి ఇవి వాహకాలుగా మారుతున్నాయని భావిస్తున్న వైద్యాధికారులు ఈ సూచన చేశారు. నిజానికి పిల్లల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండడంతో వారికి వైరస్ సంక్రమించినా లక్షణాలు బయటపడవు. దీంతో వారి నుంచి కుటుంబ సభ్యులకు, వారి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల మూసివేతే సరైన పరిష్కారమని చెప్పారు.  సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. విద్యాసంస్థల మూసివేతతో పాటు లాక్ డౌన్ అంశంపై చర్చించారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

ఏప్రిల్ లో 45 ఏళ్లు దాటిన వారికి టీకా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విలయ తాండవం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చిందనే అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తమవుతోంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం 60 ఏండ్లు పైబడిన వారికి, 45 ఏండ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇస్తున్నారు. 45 ఏండ్లు దాటిన వారందరికి టీకా ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ సిద్దమవుతోంది. 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు వారికి ఏప్రిల్‌ ఒకటి నుంచి టీకాలు అందించనున్నట్లు ప్రకటించింది.  కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా మొదటి దశలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు పంపిణీ చేసింది. రెండో దశలో 60 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 నుంచి 59 సంవత్సరాల వారికి టీకాలు ఇస్తున్నారు. రెండో దశలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న తరుణంలో..యువత, 45 ఏళ్లు పైబడిన వారిని కూడా టీకా కార్యక్రమం కిందికి తీసుకురావాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్థించాయి. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి తాజా ప్రకటన వెలువడింది.    ‘45 లేక అంతకంటే ఎక్కువ వయస్సున్న ప్రతి ఒక్కరు టీకా వేయించుకునే నిమిత్తం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నాను. కరోనా వైరస్ టాస్క్‌ ఫోర్స్, నిపుణులు ఇచ్చిన సూచనలను అనుసరించి కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ చెప్పారు.  మార్చి 22 నాటికి కేంద్రం 4,84,94,594 టీకా డోసులను పంపిణీ చేసింది.  సోమవారం  ఒక్కరోజే 32,53,095 మందికి టీకాలు అందించింది.     

తండ్రి లై*గిక వేధింపులు.. కాల్చి చంపిన కూతురు... 

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వసంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని.. అని ఎన్ని పాటలు రాసిన, ఎన్ని శిక్షలు వేసిన ఎన్ని ప్రభుత్వాలు మరీనా..  మారాడు లోకం మారాడు కాలం. దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోనీ.. మారదు లోకం.. మారదు కాలం.. అదే నిజం అదే కొందరి దుర్మగుల నైజం.. కసాయి కోతులకు తెగిపడుతున్న మహిళా కుత్తికెలు ఎన్నో.. మగాడి చీకటి చాటున వెలుగు చూడని మగువల మానాలు ఎన్నో.. అన్న, తమ్ముడు, బావ, మరిది, మామ, తాత, పేరు పేగు  బంధం ఏదైతేనేమి అందరూ మగాలే.. వారికీ కావాల్సిందే మగువలే.. మహిళపై నిత్యం దాడులు భారత దేశాన్ని మహిళా ఏడుపు దేశం గా చెప్పాలి.    ఆమె తల్లి లేదు. కన్నాతండ్రి దగ్గరే పెరిగింది. కానీ తండ్రి కూతురిపై యమా కింకరుడయ్యాడు. నిత్యం వేధింపులకు గురవుతూ ఉండేది. మేడలో తాళి పడితే తండ్రి బాధ తప్పుతుందనుకుంది. మేడలో తాళి మరింత బరువుగా మారింది. పెళ్లి జీవితం విడాకులు తీసుకుని యూటర్న్ తీసుకుని. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చింది. దాంతో మళ్లీ ఆ కసాయి తండ్రి కూతురిపై వేధింపులు స్టార్ట్ చేశాడు. ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేశాడు. దీంతో ఆమె ఓ దారుణ నిర్ణయం తీసుకుంది. కన్నతండ్రిని సజీవ దహనం చేయాలని డిసైడ్ అయింది. అందుకు పథకం వేసింది.   ఓ సాయంత్రం తన తండ్రిని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లింది. ఫుల్ గా మద్యం తాగించింది. తినిపించి.  ఆ తర్వాత హుగ్లీ నది ఒడ్డుకు తీసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న ఆ తండ్రి బెంచిపై కూర్చుని నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ఆ మహిళ తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను అతనిపై పోసి నిప్పంటించింది. కోల్‌కతాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలు సంచలనంగా మారాయి. పోలీసుల విచారణలో నిందితురాలు తన తండ్రి అకృత్యాలను వెల్లడించింది. చిన్న వయసు నుంచి తండ్రి పెడుతున్న బాధలు తట్టుకోలేక అతడిని చంపేసినట్టు అంగీకరించింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.