జగన్ పాలనపై ఆర్ఎస్ఎస్ ఎటాక్.. ఇక మూడినట్టేనా? 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం కులం ఏమిటి, మతం ఏమిటి? ఇది అనవసరమైన ప్రశ్న.అయితే, గడచిన రెండు సంవత్సరాలకు పైగా సాగుతున్న  జగన్ రెడ్డి పాలనలో ఈ ప్రశ్న తరచూ వినవస్తూనే వుంది. అందుకు కారణం అయన పాలనలో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అన్యమత ప్రచారం. మత మార్పిడులు. క్రైస్తవులే లేని గ్రామాల్లో చర్చిల నిర్మాణం జరుగుతోంది. ఒకప్పుడు ఒకరిద్దరుగా సైకిల్ మీద వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేస్తే ఇప్పుడు ఏసీ బసులలో ఒకే సారి 30- 40 మంది ఊరుమీద పడి ప్రచారం సాగిస్తున్నారు. అది నేరం. అయినా, అడిగే నాధుడు లేడు.ముఖ్యమంత్రి మావాడు, ప్రభుత్వమే తమదన్న భావన క్రైస్తవ సమాజంలో  బలపడుతోంది. అందుకే. మత ప్రచారం మహా జోరుగా సాగుతోంది. క్రైస్తవ గ్రామాలు వెలుస్తున్నాయి, ఇందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక, క్రైస్తవ అనుకూల విధానాలే కారణం అనేది అంతటా వినవస్తున్న ఆరోపణ.   హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి.దేవుళ్ళ రథాలు  తగలబడి పోతున్నాయి. విగ్రహాలు ద్వంసమవుతున్నాయి. ఇంతవరకు ఇంచు మించుగా 150 పైగా దేవాలయాల పై దాడులు జరిగాయి. పవిత్ర రామతీర్ధం దేవాలయంలోని  రాములోరి విగ్రహం తలను తెగనరికిన దుండగులు ఎవరో ఇంతవరకు తేలలేదు. అంతర్వేది రథాన్ని దగ్ధం చేసిన దుండగుల ఆచూకీ దొరకలేదు. విజయవాడ కనక దుర్గమ్మ రథం నుంచి వెండి సింహం ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియదు. అసలు ప్రభుత్వం ఆ నేరాలను నేరాలుగా పరిగణించడం లేదు. మంత్రులు హిందువుల మనోభావాలను దెబ్బతీసినా, హిందూ దేవుళ్ళను దుర్భాషలాడినా, ముఖ్యమంత్రి కనీసం మందలించిన సందర్భం లేదు.   అందుకే జగన్ రెడ్డి మతం ఏమిటన్న చర్చ మళ్ళీ మళ్ళీ జరుగుతోంది.అయితే, ఈ ప్రశ్నకు జగన్ రెడ్డి తల్లి, విజయమ్మ చాలా స్పష్టంగానే సమాధానం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి,వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా తమ కుటుంబం మొత్తం క్రైస్తవ కుటుంబం అని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. అంతే కాదు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, మెజారిటీ ప్రజలు హిందువులు కాబట్టి, హిందూ వేడుకల్లోనో పాల్గొంటామని చక్కగా చెప్పారు. తప్పు కాదు. అయితే, తమ మత విశ్వాసాలను ఇతర మతాల మీద రుద్దే ప్రయత్నం ఎవరు చేసినా తప్పే.  అలాంటి ప్రయత్నం ప్రభుత్వమే చేయడం,తప్పే కాదు,నేరం కూడా.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం అలాంటి నేరమే చేసింది, చేస్తోంది అంటోంది ... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక, ‘ఆర్గనైజర్ ‘ జులై 17 సంచికలో ‘ఆర్గనైజర్’ తొలి  సారిగా జగన్ రెడ్డి సాగిస్తున్న మత  రాజకీయాల మీద మండిపడింది.విశ్లేషనాత్మక కథనాన్ని ప్రచురించింది. నిజానికి జగన్ రెడ్డి, రిలిజియస్ ఎజెండా గురించి, ‘జాగృతి’ వంటి స్థానిక సంఘ్ పరివార్ పత్రికలలో, సోషల్ మీడియా సైట్స్’లో చాలా కథనాలు వచ్చాయి. అదలా ఉంటే ‘ఆర్గనైజర్’, ఎలాంటి సందేహాలకు తావులేకుండా “రాష్ట్రంలో మతమార్పిడులే అజెండాగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలన సాగుతోంది” అని కుండబద్దలు కొట్టింది. జగన్ రెడ్డి ఒక్కరే కాదు, ఆయన కుటుంబ సభ్యులు పాశ్చాత్య క్రిస్టియన్‌ మిషనరీ అజెండాను అమలు చేస్తున్నారని పేర్కొంది.నిజమే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కూడా ఇలాగే, క్రైస్తవ మత ప్రచారానికి ప్రభుత్వం ఊత మిచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలలో చర్చిల నిర్మాణం, మరమ్మతులకు ప్రభుత్వ నిధులు కేటాయించిన విషయం కోర్టు విచారణలు వరకు వెళ్ళింది. ప్రజ్ఞా భారతి చైర్మన్ హనుమాన్ చౌదరి, హైకోర్టులో కేసు వేశారు. అలాగే, ఏడుకొండలను రెండు చేసి అన్యమత ప్రచారానికి, కొండ మీద చర్చి నిర్మాణానికి కూడా వైఎస్ ప్రభుత్వ హయాంలో ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు, అనుమానాలు వినవచ్చాయి. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం ఎందుకనో  వెనకడుగు వేసింది.  ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం అయితే, ఏకంగా చర్చిల నిర్మాణానికి టెండర్లే పిలిచింది.  ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత పవిత్ర కార్యంగా భావిస్తున్న మతమార్పిడి వ్యవహారం, క్రైస్తవీకరణ కుట్రలు  దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మయ్యాయి. ఈ నేపధ్యంలోనే, ఆర్గనైజర్’ పత్రిక జగన్ రెడ్డి పాలన దేశ విచ్చిన్నపోకడలు పోతోందని పేర్కొంది. అలాగే, అధికారం కోసం జగన్‌ కుటుంబం ప్రమాదకరమైన హిందూ వ్యతిరేక అజెండాను అనుసరిస్తోందని  ఆరోపించింది. జగన్ ఒక్కరే కాదు, జగన్‌ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ అనిల్‌ కుమార్‌ ఈ అందరూ కూడా క్రైస్తవీకరణలో భాగస్వాములే అని ‘ఆర్గనైజర్’పత్రిక పేర్కొంది. ప్రపంచ క్రైస్తవీకరణకు కృషి చేస్తున్న క్రైస్తవ్ మిషనరీలతో వైఎస్ కుటుంబానికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని పత్రిక ఆరోపించింది. నిజానికి, ఇది కూడా పాత ఆరోపణే, వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన కుమార్తె వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనీల్ అంతర్జాతీయ మత ప్రచారకుని స్థాయికి ఎదిగారని కేఏ పాల్ వంటి వారు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.ఇదే విషయాన్ని ఆర్గనైజర్ మరో మారు ప్రస్తావించింది. ఆర్‌ఎ్‌సఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో జగన్‌పై ప్రత్యేక విమర్శనాత్మక కథనం రావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.ఇది దేనికి సంకేతం అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 

అనిల్ మంత్రి ప‌ద‌వి ఊస్ట్‌!.. ఇండికేష‌న్ ఇచ్చేసిన జ‌గ‌న్‌!..

నోరున్నోడికే మంత్రి ప‌ద‌వి. జ‌గ‌న్ న‌మ్మిన సిద్దాంతం. ఎంత తిడితే అంత మంచి కేబినెట్ పోస్ట్. జ‌గ‌న్ ఆచ‌రించిన విధానం. కేవ‌లం, తిట్లే ప్రాతిప‌దిక‌న మంత్రి ప‌ద‌వులు పంచేశార‌నే విమ‌ర్శ ఆయ‌న‌పై బ‌లంగా ఉంది. రెండేళ్లుగా శాఖ‌ల‌ ప‌ని తీరుక‌న్నా.. టీడీపీపై ఎదురుదాడి చేయ‌డ‌మే ఏకైక ఎజెండాగా ప‌ని చేస్తున్నారు ప‌లువురు మంత్రివ‌ర్యులు. జ‌గ‌న్ క‌ళ్ల‌ల్లో ఆనందం చూసేందుకు, త‌మ ప‌ద‌విని ఐడేళ్ల పాటు ప‌దిలంగా కాపాడుకోడానికి.. కొంద‌రు మంత్రులు బూతులు మాట్లాడ‌టానికి కూడా వెన‌కాడ‌లేదు. ఆ రేసులో కొడాలి నాని అంద‌రికంటే ముందు ఉంటే.. అనిల్ కుమార్ యాద‌వ్ నెంబ‌ర్ 2 ర్యాంక్ కొట్టేశార‌ని అంటుంటారు. అయితే, ఇంత‌లా జ‌గ‌న్‌ను వెన‌కేసుకొచ్చినా కూడా అనిల్‌పై ముఖ్య‌మంత్రి అసంతృప్తిగా ఉన్నార‌ట‌. తాజా ప‌రిణామాలు ఆ నోరున్న మంత్రిపై జ‌గ‌న్ నోరు పారేసుకునేలా చేశాయ‌ట‌. అదిప్పుడు ఏకంగా అనిల్ మంత్రి ప‌ద‌వికే ఎస‌రు పెట్టింద‌ని అంటున్నారు. రెండున్న‌రేళ్ల త‌ర్వాత కేబినెట్లో మార్పులు జ‌రిగితే.. ముందు దేవాదాయ‌శాఖ‌మంత్రి వెల్లంప‌ల్లి, ఆ త‌ర్వాత జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ ప‌ద‌వులే ఊడిపోనున్నాయ‌ట‌. ప‌ద‌వులు కోల్పోయే జాబితాలోనూ అనిల్‌ నెంబ‌ర్ 2గానే ఉండ‌టం విశేషం.  మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు స‌మ‌యం దగ్గర పడేకొద్దీ ప‌లువురు మంత్రుల్లో గుబులు పెరుగుతోంది. ఇన్నాళ్లూ త‌న ప‌ద‌వికేం కాదంటూ బిందాస్‌గా ఉన్న అనిల్‌.. ఇప్పుడు ఎక్క‌డ త‌న సీటుకు ఎస‌రు వ‌స్తుందోన‌ని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న‌లో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపించ‌డం.. ఇటీవ‌ల జ‌రిగిన పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఆ శాఖ మంత్రికి త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌క‌పోవ‌డం.. అందుకు ఇండికేష‌న్లుగా భావిస్తున్నారు.  సీఎం జ‌గ‌న్‌ పోల‌వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న ఆసాంతం అనిల్ కుమార్ ముఖ్య‌మంత్రి ప‌క్క‌నే లేకుండా.. అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే ప‌క్క‌న ఉండి.. ఆ త‌ర్వాత చాలా వెన‌కాలే ఉండిపోవాల్సి వ‌చ్చిందంటున్నారు. అధికారులతో సీఎం జరిపిన సమీక్షలో మంత్రికి అంత‌గా ప్రాధాన్యం ల‌భించ‌లేదు. ప్రాజెక్ట్ సందర్శనలో కూడా ఇతర మంత్రులు ముందుకొచ్చారే కానీ, అనిల్ వెనకబడిపోయారు. ఇక హెలికాప్ట‌ర్‌తో ఏరియల్ వ్యూ విషయంలోనూ మంత్రి అనిల్‌ను ప‌క్క‌న పెట్టేశారు సీఎం జ‌గ‌న్‌. ముఖ్య‌మంత్రి, ఇతర అధికారులు మాత్రమే హెలికాప్టర్ ఎక్కారు. అనిల్ కి ప్లేస్ మిస్ అయింది. కేవలం హెలికాప్టర్ లోనేనా? లేక, కేబినెట్‌లో కూడా అనిల్‌కు ప్లేస్ మిస్ అయిన‌ట్టేనా అనే అనుమానాలు పెరిగాయి, యువ‌త‌కు ప్రాధాన్యం పేరుతో.. బీడీఎస్ చ‌దివిన అనిల్‌కు కీల‌క‌మైన‌ జ‌ల‌వ‌న‌రుల శాఖ క‌ట్ట‌బెట్ట‌డంపై మొద‌ట్లోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆయ‌న నోరు, మాట తీరు చూసి.. ఇలాంటి వారిని కూడా మంత్రుల‌ను చేస్తారా అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. జ‌నం అనుకున్న‌ట్టుగానే.. జ‌గ‌న్ కోరుకున్న‌ట్టుగానే.. రెండేళ్లుగా నోటికి ప‌ని చెప్ప‌డం మిన‌హా, త‌న మంత్రిత్వ శాఖ ప‌ని చేయ‌డం త‌క్కువేనంటారు. జ‌గ‌న్ కోరుకున్న‌దీ అదేన‌నుకోండి. అంతా త‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గాలంటే.. అనిల్ లాంటి క‌ట్ట‌ప్పలే మంత్రులుగా ఉండాల‌నేది జ‌గ‌న్ సిద్దాంతం అంటారు. క‌ట్ట‌ప్ప రోల్‌లో తెగ‌ జీవించేసిన అనిల్‌కు తెలంగాణ మంత్రుల రూపంలో ఊహించ‌ని షాక్ త‌గిలింద‌ని చెబుతున్నారు. ఆ బ‌ట‌ర్ ఫ్లై ఎఫెక్ట్ మూలంగానే ఇప్పుడు ఆయ‌న మంత్రి ప‌ద‌వికి గండం వ‌చ్చింద‌ని అంటున్నారు.  రెండు రాష్ట్రాల జలవివాదంలో తెలంగాణ మంత్రులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌ను, జ‌గ‌న్‌ను నోటికొచ్చిన‌ట్టు తిట్టారు. నీళ్ల విష‌యమే అయినా.. ఆ శాఖ మంత్రిగా అనిల్ ఏపీ త‌ర‌ఫున‌ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోయారు. అందుకే జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అనిల్‌ను అప్ప‌టిక‌ప్పుడు సైడ్ చేసేసి.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని జగన్ రంగంలోకి దింపార‌ని తెలుస్తోంది. అందుకే, ఇటీవ‌ల తెలంగాణ ఆరోప‌ణ‌ల‌పై.. మంత్రి అనిల్ కాకుండా, స‌ల‌హాదారు స‌జ్జ‌లనే స్పందిస్తున్నార‌ని అంటున్నారు. కావాల‌నే మంత్రి అనిల్‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని చెబుతున్నారు. రెండున్న‌రేళ్ల త‌ర్వాత కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగితే.. అనిల్ ప‌ద‌వి కృష్ణాలో క‌లిసిపోవ‌డం ఖాయ‌మంటున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు సందర్శ‌న‌లో ఆ మేర‌కు ఇండికేష‌న్ కూడా ఇచ్చేశార‌ని.. త్వ‌ర‌లోనే అనిల్‌కుమార్‌కు షాక్ త‌ప్ప‌ద‌ని చ‌ర్చించుకుంటున్నారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి పోతుంద‌నే భ‌యంలో అనిల్ మ‌రింత‌గా త‌న నోటికి ప‌ని చెబుతారా? లేక‌, అన్నీమూసుకొని కూర్చుంటారా? చూడాలి.....

తెలంగాణలో కుండపోత వానలు.. జనాలు ఇండ్ల నుంచి రావొద్దన్న కేసీఆర్ 

తెలంగాణ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తూర్పు తెలంగాణలో కుండపోత వానలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం 25 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. గురువారం కూడా కుండపోతగా వాన పడుతూనే ఉంది.  చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్ని నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలేశారు. దీంతో తూర్పు తెలంగాణలో వరద బీభత్సం కొనసాగుతోంది.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి  పొంగిపొర్లుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ నుంచి 1 లక్షా 93వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదలడంతో జిల్లాలోని గోదావరీ పరివాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలోనూ గోదావరి ఉధృతి పెరుగుతుండగా.. మురో పుణ్యక్షేత్రమైన కోటిలింగాలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వెల్గటూరు మండలం కోటిలింగాలను ధర్మపురి సీఐ. ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. జాలర్లు, గొర్లకాపరులు, రజకులు, భక్తులు ఇలా ఎవ్వరూ కూడా గోదావరీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకూడదని... హెచ్చరించారు. ధర్మపురి, వెల్గటూర్ మండలాల్లో రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమై ప్రమాద హెచ్చరికలను జారీచేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా చాలా ప్రాంతాలు నీటమునగ‌డంతో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద పెరుగుతున్నందున వెంట‌నే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రాకూడ‌ద‌ని సీఎం కేసీఆర్ సూచించారు.ఆయా ప్రాంతాల టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు. గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో... మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల వాల్లు కూడా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణలోకి వరద ఉదృతి పెరగనున్నదని  గోదావరి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో వుంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ వుండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ ప్రాంతాల అన్నిస్థాయిల లోని టిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు తెలంగాణ భవన్ కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు. గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా, పార్టీ కార్యకర్తలు నేతలంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిఎం ఆదేశించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితిల్లో  ప్రజలు అత్యంత అప్రమత్తంగా వుంటూ ఎవరి జాగ్రత్తలు వాల్లు తీసుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్యే కాదు రాష్ట్ర స్థాయి పదవి..! క్లారిటీ ఇచ్చిన కేసీఆర్..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జీగా ఉన్న పౌడి కౌశిక్ రెడ్డి అధికార పార్టీలో చేరారు. బుధవారం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో  గులాబీ కండువా కప్పుకున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి 61 వేల ఓట్లు సాధించారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. అయితే ‘ఆడియో లీక్’ల వ్యవహారంలో ఇరుక్కొని  ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.  టీఆర్ఎస్ లో చేరాల్సిన పరిస్థితులొచ్చాయి.  అయితే అధికార పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ వస్తుందా రాదా అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. నిజానికి ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే టీఆర్ఎస్ నేతలతో కౌశిక్ రెడ్డి టచ్ లోకి వచ్చారనే ప్రచారం జరిగింది. ఓ కార్యక్రమంలో కేటీఆర్ ను ఆయన కలవడం సంచలనంగా మారింది. కౌశిక్ రెడ్జి కారెక్కనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాను పార్టీ మారడం లేదని కౌశిక్ రెడ్డి చెబుతూ వచ్చారు. ఇంతలోనే ఆడియో లీక్ కావడం.. కాంగ్రెస్ సీరియస్ గా స్పందించడంతో సీన్ మారిపోయింది. కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి చాలా రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఆడియో లీక్ కాకున్నా.. ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరేవాడని వాళ్లు చెబుతున్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో గులాబీ పార్టీలోనూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆడియో లీక్ కాకుండా ఉంటే కౌశిక్ రెడ్డికి ఖచ్చితంగా టీఆర్ఎస్ టికెట్ వచ్చేదని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను బరిలోకి దింపకపోవచ్చనే అభిప్రాయపడుతున్నారు. కౌశిక్ రెడ్డి చేరిక సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయి. కౌశిక్ రెడ్డిని ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. కానీ హుజూరాబాద్ టికెట్ పై మాత్రం సీఎం క్లారిటీ ఇవ్వలేదు. ‘కౌశిక్ రెడ్డి రాజకీయాల్లో ఒక యువకుడు. అతడు అపారమైన ప్రజా సేవ చేయగలడు. తన రాజకీయ వృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఆయనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అతడి పురోగతికి నేను మంచి మార్గం వేస్తానని హామీ ఇస్తున్నా’ అని  కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికే పరిమితం కాదు.. ఆయన సేవలు రాష్ట్రానికి మొత్తం ఉపయోగించుకుంటామని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలను బట్టి కౌశిక్ రెడ్డిని హుజురాబాద్ బరిలో దింపకుండా.. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి క్రికెట్ ప్లేయర్. జాతీయ స్థాయిలోనూ ఆయన ఆడారు. కేసీఆర్ ఈ విషయం కూడా చెప్పారు. దీంతో క్రీడలకు సంబంధించిన శాప్ చైర్మన్ గా కౌశిక్ రెడ్డిని నియమించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచనలో టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారని అంటున్నారు. అందుకే రెండు, మూడు సార్లు కౌశిక్ రెడ్డిని రాష్ట్ర స్థాయిలో ఉపయోగించుకుంాటమని కేసీఆర్ చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

తెలంగాణ‌లో మైక్రోసాఫ్ట్‌ డేటాసెంటర్‌.. ఏపీకి అథోగ‌తే..నా? చంద్ర‌బాబు ఉండి ఉంటేనా..

తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి. డేటా సెంట‌ర్‌కు హైద‌రాబాద్ కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇప్ప‌టికే వ‌చ్చిన‌ అమెజాన్‌, వాల్‌మార్ట్‌ల డేటా సెంట‌ర్లతో పాటుగా.. తాజాగా మైక్రోసాఫ్ట్ సైతం 15వేల కోట్ల పెట్టుబ‌డితో డేటా సెంట‌ర్ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చింది. హైద‌రాబాద్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు ఇది అద‌నం. హైదరాబాద్‌లో అనేక సానుకూల అంశాలు ఉండటంతో దిగ్గజ కంపెనీలు తమ డేటా సెంటర్ల ఏర్పాటుకు నగరానికి వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగానికి హైదరాబాద్‌ ముఖ్య కేంద్రంగా మారడం, సాంకేతిక నిపుణులకు కొర‌త లేక‌పోవ‌డం, ప్రభుత్వ ప్రోత్సాహం.. ఇలా అనేక‌ అంశాలు క‌లిసిరావ‌డంతో హైద‌రాబాద్‌కు కంపెనీలు క్యూ క‌డుతున్నాయి.  హైద‌రాబాద్‌కు ఈ స్థాయిలో పెట్టుబ‌డులు రావ‌డం అంద‌రికీ సంతోష‌క‌రమే. హైద‌రాబాద్ సంగ‌తి స‌రే.. మ‌రి, ఏపీ ప‌రిస్థితి ఏంట‌నేది ఇక్క‌డి వారి ఆవేద‌న‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఒక్క పెట్టుబ‌డి కూడా రావ‌డం లేదేంట‌నే బాధ‌. హైద‌రాబాద్ ఆ రేంజ్‌లో డెవ‌ల‌ప్ కావ‌డానికి, ఐటీ హ‌బ్‌గా మార‌డానికి అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను హైద‌రాబాద్ ర‌ప్పించింది చంద్ర‌బాబు నాయుడే. హైద‌రాబాద్‌లో సైబ‌ర్ ట‌వ‌ర్స్ నిర్మించి.. ఐటీ కంపెనీల‌ను ర‌ప్పించి.. పెట్టుబ‌డుల కేపిట‌ల్‌గా మార్చింది.. అక్ష‌రాల చంద్ర‌బాబే. సైబ‌రాబాద్ నిర్మాత చంద్ర‌బాబునాయుడు. ఆ రోజుల్లో సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను, ప్ర‌భుత్వ పాల‌సీల‌ను చూసే ఐటీ ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చింది. ఆనాడు ఆయ‌న నాటిన విత్త‌నాలే.. ఇప్పుడు మ‌హావృక్షాలై అభివృద్ధి ఫ‌లాలు ఇస్తున్నాయి.  రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌వ్యాంధ్రను మ‌ళ్లీ పునాదుల నుంచి నిర్మించే  ప్ర‌య‌త్నాలు చేశారు చంద్ర‌బాబు. ఏపీకి అంత‌ర్జాతీయ స్థాయిలో రాజ‌ధానిని రూపొందించేందుకు కృషి చేశారు. హైద‌రాబాద్ మాదిరే విశాఖ‌ప‌ట్నంను ఐటీ హ‌బ్‌గా మార్చేందుకు మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేశారు. దావోస్‌లో ప్ర‌పంచ‌ పెట్టుబ‌డుల స‌మావేశాల‌కు హాజ‌రై ఏపీకి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు. దావోస్‌లో చంద్ర‌బాబును చూసి గుర్తుప‌ట్టిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌.. ఆయ‌న్ను ప‌ల‌క‌రించ‌డం.. చంద్ర‌బాబుతో క‌లిసి డిన్న‌ర్‌ చేయ‌డం గుర్తుండే ఉంటుంది. ఇదంతా 2015 విష‌యం.  ఆ త‌ర్వాత‌ సీఎం చంద్ర‌బాబు ఆహ్వ‌నం మేర‌కు.. విశాఖ‌లో జ‌రిగిన అగ్రిటెక్ స‌ద‌స్సుకు సైతం హాజ‌ర‌య్యారు బిల్‌గేట్స్‌. ఆ బిల్‌గేల్స్ సంస్థ మైక్రోసాఫ్టే ఇప్పుడు హైద‌రాబాద్‌లో డేటా సెంట‌ర్ ఏర్పాటు చేస్తోంది. భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రిలయన్స్‌ జియోతో మైక్రోసాఫ్ట్‌తో క‌లిసి ప‌ని చేస్తోంది. ఆ రిల‌య‌న్స్ సంస్థ సైతం చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు తిరుప‌తిలో 15వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మైంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రిల‌య‌న్స్‌కు భూములు కూడా కేటాయించింది. అయితే, సీఎం జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డంతో.. అంతా త‌ల‌కిందులైంది. చంద్ర‌బాబు హ‌యాంలో వ‌చ్చిన అనేక కంపెనీలు, పెట్టుబ‌డులు వెన‌క్కి వెళ్లిపోయాయి. రిల‌య‌న్స్ సైతం తిరుప‌తి భూముల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి తిరిగిచ్చేసి.. జ‌గ‌న్‌కో దండమంటూ తిరిగెళ్లిపోయింది.  జ‌గ‌న్ గ‌ద్దె నెక్క‌డంతో.. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి క‌నుమ‌రుగైంది. విశాఖకు ఐటీ కంపెనీలు గుడ్‌బై చెప్పాయి. వైజాగ్‌లో ఇప్పుడు భూదందా మిన‌హా.. ఐటీ హ‌డావుడి ఏమాత్రం లేదు. చంద్రబాబు హ‌యాంలో వ‌చ్చిన పెట్టుబ‌డులు అట‌కెక్కేశాయి. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అరాచ‌క పాల‌న మిన‌హా అభివృద్ధి, పెట్టుబ‌డుల ఊసే లేదంటున్నారు. అందుకే, హైద‌రాబాద్‌కు పోటీ లేకుండా పోయిందంటున్నారు. హైద‌రాబాద్‌కు మైక్రోసాఫ్ట్ డేటా సెంట‌ర్ రాక‌తో.. మ‌రోసారి తెలుగువారంద‌నికీ అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ఐటీ ప‌రిశ్ర‌మ కోసం చేసిన కృషిని మ‌రోసారి గుర్తు తెచ్చుకుంటున్నారు. తెలుగునేల‌కు ఐటీతో అనుబంధం కొన‌సాగిన‌న్నాళ్లూ.. అంద‌రి మ‌దిలో చంద్ర‌బాబు మెదులుతూనే ఉంటారు. అంత‌టి చెద‌ర‌ని ముద్ర వేశారు మ‌రి.

ఆడవాళ్లు మీకు జోహార్లు.. వధువును హెలికాప్టర్లో తీసుకెళ్లిన వరుడు..

ఒకప్పుడు మన దేశం మాతృస్వామిక దేశం.. అది రాను రాను పితృసామిక దేశంగా అవతరిండిచి. గతంలో ఆడవాళ్లను చాలా గౌరవంగా చూసుకునే సంప్రదాయం మనది.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన మహిళలపై నిత్యం దాడులతో వెలుగొందుతున్న దేశం గా మారింది.. ఎంత లా అంటే.? తల్లిదండ్రులు ఆడపిల్లలని కనాలంటే ఆలోచించేంతలా.. తన కడుపులో ఆడపిల్ల ఉందంటే గర్భంలోనే చంపేసెంతలా తయారు అయింది. ఎందుకంటే ఆడవాళ్లకు ఈ సమాజంలో రక్షణ లేకపోవడం అందుకు ఒక కారణం అయితే.. ఆ ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే వరకట్నం సమస్య మరొకటి.. కానీ  తాజాగా ఒక వ్యక్తి  పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. అంతేగాక.. మహిళలకు గౌరవం ఇస్తూ ఆమెను మహరాణిలా హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకెళ్లాడు. ఆడపిల్లను అంతా తక్కువగా చూస్తారు. అయితే, అతడు మాత్రం అలా కాదు. తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అతడు ఓ యువతిని పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. ఆమెను హెలికాప్టర్‌లో మహరాణిలా ఇంటికి తీసుకొచ్చాడు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.  పానీపట్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ రామ్ కుమార్ సైనీకి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరు కొడుకులకు కట్నం తీసుకోకుండానే పెళ్లి చేశాడు. మూడో కుమారుడు మనీష్ సైనీకి సైతం కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. తన కొడుకులకు కట్నం తీసుకోకూడదనే అతడి భార్య రమ్‌కాలీ కోరికను వారు సాంప్రదాయంలా పాటిస్తున్నారు. ఇటీవల రామ్ కుమార్.. అతడి మూడో కొడుకు మనీష్ సైనికి జింద్‌లోని నర్వానాకు చెందిన మోనికా సైనీతో పెళ్లి చేశాడు.ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు అందరు సమాజం లో ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజంగా వాళ్ళ కుటుంబానికి సెల్యూట్ చెయ్యాలి.  ఆడబిడ్డ గొప్పతనం తెలిపేందుకు తన చిన్న కోడలిని హెలికాప్టర్‌లో తీసుకురావాలని రామ్‌కాలీ కొడుకును కోరింది.తండ్రి మాటను జవదాటని రాముడిలా అతడు మోనికాను హెలికాప్టర్‌లో తన ఇంటికి తీసుకొచ్చాడు. తమ కుటుంబంలో ఆడ, మగా అనే తేడా ఉండదని, అందరినీ సమానంగా చూస్తామని సైనీ కుటుంబికులు తెలిపారు. తల్లి కోరిక మేరకు సైనీ ఢిల్లీలో హెలికాప్టర్లను అద్దెకు ఇచ్చే ఓ సంస్థను సంప్రదించాడు. వధువరులిద్దరూ హెలికాప్టర్ నుంచి ఠీవిగా దిగడాన్ని చూసి ప్రజలు సైతం మురిసిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన హర్యానా లో జరిగింది..  తాజాగా కేరళ రాష్ట్రము లో వరకట్న నిషేధ చట్టాన్ని మారిందా పకడ్బందీగా రూపొందించడానికి చర్యలు తీసుకుంటుంది.. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచిస్తే తల్లి గర్భం లో చనిపోయే ఆడవాళ్లు కనీసం ఈ ప్రపంచాన్ని చూస్తారు.. ఆడపిల్లలు పుట్టనిద్దాం.. చదవనిద్దాం అనే నినాదం అందరు అమలు చేస్తే ఈ దేశ ప్రగతి ముందుకు వెళుతుంది.. ఆడామగా తేడాలేని సమాజం కోసం అందరు కృషి చెయ్యాలి..   

మెసేజ్ ఫార్వర్డ్ చేసిన టీచర్ సస్పెండ్.. జగనన్న పాలన ఇంత అరాచకమా? 

ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడుతున్నాయి. ఇందుకు సంబంధించి గతంలో చాలా ఘటనలు వెలుగు చూశాయి. పోలీసుల తీరుపై కోర్టులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా ప్రభుత్వం మాత్రం తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మరో అరాచక ఘటన జరిగింది. వాట్సాప్ మెసేజ్ ను ఫార్వర్డ్ చేసినందుకు ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం దుమారం రేపుతోంది.  విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్‌. నాయుడును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మెసేజ్ ను ఆయన ఫార్వడ్ చేసినందుకే ఆయనపై వేటు వేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ పై విమ‌ర్శ‌లు చేస్తూ ట్వీట్ చేశారు. విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్‌. నాయుడును సస్పెండ్ చేశారంటూ ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సప్‌లో సందేశాలు పంపుతున్నారని ఫిర్యాదు రావ‌డంతో ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు నారా  లోకేష్ తెలిపారు   .'సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే, విద్యాబుద్ధులు నేర్పే గురువులకు త‌న చీప్ లిక్క‌ర్ అమ్మే మ‌ద్యం దుకాణాల ముందు డ్యూటీవేసిన వైఎస్ జ‌గ‌న్ గారిని ఏం చెయ్యాలి?' అని లోకేశ్ నిలదీశారు.  'సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠ‌శాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్. నాయుడు గారిని సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ‌ని హరిస్తోంది వైకాపా ప్రభుత్వం' అని ఆయ‌న మండిప‌డ్డారు.'మాస్టారిపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివెయ్యాలి. జగన్ రెడ్డి పాలనలో టీచర్లను వేధించడం పరిపాటిగా మారింది. ఉపాధ్యాయుల స‌మ‌స్యల పరిష్కారం కోసం చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది' అని లోకేశ్ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీచర్ పై విధించిన సస్పెన్షన్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. 

ప్రియురాలు  కరోనా మరణం.. తట్టుకోలేక ప్రియుడు మృతి.. 

ప్రేమంటే చంపడమే కాదు, చావడం కూడా ,ఒక అమ్మాయి ప్రేమించలేదని ఆ అమ్మాయి పై దాడి చేయడమే కాదు.. అవసరం అనుకుంటే ప్రేమించిన అమ్మాయి కోసం  మరంచడానికి కూడా సిద్ధంగా ఉండడం అని కూడా నిరూపించాడు ఒక వ్యక్తి.  బట్ అలా చనిపోవడం తప్పు. కానీ.. అతను తన ప్రియురాలు లేదనే మాట తట్టుకోలేడు అందుకే అలా మరణించాడు. మ్యాటర్ లోకి వెళితే.. తాను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి కరోనా బారిన పడింది. తన ప్రియురాలు కోలుకోవాలి అని ప్రియుడు కోరుకున్నాడు. కానీ ఆ దేవుడు అతని కోరికను వినిపించుకోలేదు. మూడు రోజుల క్రితం అతని ప్రియురాలు మరణించదని  తట్టుకోలేకపోయిన యువకుడు తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన విశాఖలోని గాజువాకలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.    పరవాడ మండలం దేశపాత్రునిపాలేనికి చెందిన దట్టి కృష్ణారావు, శాంతి దంపతుల కుమారుడు రోహిత్‌కుమార్‌ (25) ఇంటర్‌ వరకు చదివి గాజువాకలోని ఓ హోటల్‌లో ఆన్‌లైన్‌ పార్శిల్‌ సర్వీసు పని చేస్తున్నాడు. ఆరుగురు ఫ్రెండ్స్‌తో కలిసి కణితి రోడ్డులోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకూ సహచర మిత్రులతో పార్శిల్‌ సర్వీసు కొనసాగించిన రోహిత్ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఏదో మూడ్ ఆఫ్ తో వర్క్ మానేసి రూమ్ కి వెళ్ళాడు. ఫ్రెండ్స్ అందరు ఏదో చిన్న బాధలో ఉన్నట్లు ఉన్నాడు అనుకున్నారు. రూంకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాడు లే అని అనుకున్నారు.  కట్ చేస్తే సాయంత్రం రోహిత్ మిత్రులు రూమ్ కి వచ్చారు. డోర్ ఓపెన్ చేసి చూడగా  రోహిత్‌ సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతున్నాడు. అందరు ఒక్కసారిగా షాక్ తిన్నారు. మెల్లిగా షాక్ లో నుండి తేరుకుని వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లీదండ్రులు పరుగున సంఘటన స్థలానికి వచ్చారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. తనకు కొడుకు అనకాపల్లికి చెందిన యువతిని ప్రేమించాడని, ఆమె మూడురోజుల క్రితం గుంటూరులో కరోనాతో చనిపోయిందని రోహిత్ తండ్రి కృష్ణారావు తెలిపారు. ఆమె మరణంతో రోహిత్ కుంగిపోయాడని, ఆ విషయం తట్టుకోలేకే ఈ పని చేశాడని. తాము మరో సంబంధం చూసి పెళ్లి చేస్తామని ఎంత నచ్చజెప్పినా ఆ విషాదంలోని నుంచి తేరుకోలేకపోయాడని పేర్కొన్నారు. ఆ డిప్రెషన్‌తో తమ కొడుకు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆయన పోలీసులకు తెలిపారు. గాజువాక పోలీసులు రోహిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ  కిరీటం తరహాలో గొర్రె కొమ్ములు.. యుగాంతానికి సంకేతం అంటూ కామెంట్స్..

మాములుగా ఏ  గొర్రెకు అయినా రెండే కొమ్ములు ఉంటాయి. ఈ గొర్రెకు మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  ఐదు కొమ్ములు ఉన్నాయి. ఒకే గొర్రెకు ఐదు కొమ్ములు  ఉండటంతో ఈ గొర్రెను జనం  వింతగా చూశారు. అంటే కాదు దాన్ని చూడగానే కొంతమంది  అది యుగాంతం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారికి మరో సంకేతం వచ్చింది. ఈ సారి ఐదు కొమ్ములు గల గొర్రె భూమిని అంతం చేసేందుకు పుట్టింది. ఆ గొర్రెను చూసిన నెటిజనులు అంటున్నారు. ఆ గొర్రె బర్త్ ప్లేస్  నైజీరియా. అక్కడ పెరుగుతున్న ఈ గొర్రె ఇటీవలే వార్తల్లోకి ఎక్కింది. నెత్తి మీద కింగ్ కిరీటం  పెట్టినట్లుగా ఆ గొర్రె కొమ్ములు భలే అందంగా ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు సైతం దాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. ఒకరకంగా ఆ గొర్రె టూరిస్ట్ ప్లేస్ గా మారింది. ఈ గొర్రె గురించి తెలుసుకోవాలనుకుంటే కొంచం ముందుకు వెళ్ళాలి.. మరింకెందుకు ఆలస్యం పదండి ముందుకు.. జులై 21న బక్రీద్ నేపథ్యం నైజీరియాలోని లాగోస్‌లోని ఓ మార్కెట్‌లో గొర్రెల గోనుగోలు  జోరుగా సాగింది. ఈ సందర్భంగా మార్కెట్ లోకి  ఓ వ్యక్తి తీసుకొచ్చిన గొర్రె అందరినీ ఆకట్టుకుంది. అలరించించి. సాధారణంగా గొర్రెకు రెండే కొమ్ములు ఉంటాయి. అయితే, ఆ గొర్రెకు మాత్రం ఐదు కొమ్ములు ఉండటంతో దాన్ని వింతగా చూశారు. వింతగా చూడడమే కాదు అది ఈ భూమిని నాశనం చేయడానికి వచ్చిందని మాట్లాడుకున్నారు.అంతే కాదండోయి కొందరు ఆ గొర్రెకు ఫొటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కిరీటం తరహాలో ఆ గొర్రె కొమ్ములు ఉన్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది యుగాంతానికి సంకేతమని అంటున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ముస్లింలు జరుపుకొనే మరో ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి. ఈ పండుగను ‘ఈద్ ఉల్ అద్హా’ అని కూడా పిలుస్తారు. బక్రీద్ పండుగ త్యాగానికి గుర్తుగా భావిస్తారు. ఏటా హజ్ యాత్ర చివర్లో ఈ పండుగను నిర్వహిస్తారు. అల్లాహ్ ఆదేశంతో ఇబ్రహీం అనే ప్రవక్త తన ఏకైక కుమారుడిని సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆయన త్యాగానికి సంతోషించిన అల్లాహ్.. అతడి కుమారుడి బదులు గొర్రెను ఉంచుతాడు. అప్పటి నుంచి బక్రీద్‌ను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. మరి రెండు గొర్రెల ధర రూ.4.5 లక్షలట, బక్రీద్ సందర్భంగా గొర్రెను బలిచ్చి.. దాని మాంసాన్ని మూడుగా విభజిస్తారు. ఒక భాగం తమ కుటుంబానికి కేటాయిస్తారు. మిగతా రెండు భాగాలను బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారికి, పేదలకు పంచుతారు. అందుకు బక్రీద్ రోజున మేకలు, గొర్రెలకు అంత డిమాండు ఉంటుంది.

భారత జాతీయ జెండాకు వందేళ్లు... పింగళి వెంకయ్యకు శతకోటి వందనాలు..

త్రివర్ణ పతాకం.. భారతదేశ జాతీయ జెండా. త్రివర్ణ పతకాన్ని చూస్తే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. దేశ భక్తి ఎగిసిపడుతుంది. భారతమాతకు సెల్యూట్ చేస్తోంది. అంతటి త్రివర్ణపతాకానికి పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ లోని బెజవాడ. కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు గ్రామానికి చెందిన పింగళి వెంకయ్య.. భారత జాతీయ జెండాను రూపొందించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. తర్వాత కొన్ని మార్పులు చేసి జూలై 22న అధికారింగా ఆమోదించారు. అంటే జాతీయ జాతీయ జెండాకు ఆమోదముద్ర పడి ఇవాళ్టికి వందేళ్లు.  1921 మార్చి 31వ తేదీన ఏపీ విజయవాడలోని నేటి బాపూ మ్యూజియంలో మహాత్మాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. అప్పటికే గాంధీ, పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపకల్పనపై పలుమార్లు మాట్లాడారు. ఈ సమావేశంలోనే వెంకయ్యకు జాతీయ పతాక రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన మూడు గంటల వ్యవధిలోనే తన సహ అధ్యాపకుడు అయిన ఈరంకి వెంకటశాస్త్రి సహకారంతో జెండా నమూనా తయారుచేసి గాంధీకి అప్పగించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో పాటు చరఖా రాట్నం చిహ్నం అందులో ఉంది. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో గాంధీ పలు సూచనలు చేశారు.ఇలా ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల మధ్యలో రాట్నం గుర్తుతో జాతీయ పతాకం తయారు చేశారు.  1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభల్లో సిక్కులు పతాకంలోని రంగుల గురించి సమస్య లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం అజాద్‌, భోగరాజు పట్టాభి సీతారామయ్య, తారాసింగ్‌, దత్తాత్రేయ బాలకృష్ణతో కూడిన కమిటీ సూచనల ప్రకారం.. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న పతాకంపై రాట్నం ఉండేలా వెంకయ్య జెండాలో మార్పులు చేశారు. ఈ మార్పును కాంగ్రెస్‌ జాతీయ మహాసభ ఆమోదించింది. జాతీయ పతాకానికి, పార్టీ జెండాకు మధ్య వ్యత్యాసం ఉండాలనే ఆలోచనతో.. 1947 జులై 22న ప్రకటించిన ప్రకారం జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగుల పట్టీలతో.. మధ్యలో నీలిరంగులో అశోకుని ధర్మచక్రం ఉండేలా నిర్ణయం తీసుకొని మార్పులుచేశారు. ఈ చారిత్రక ఘట్టాలకు పునాది పడింది విజయవాడలో కావటం మనకు గర్వకారణం.  భారత ఉపఖండం బ్రిటిష్ సామ్రాజ్య వలస పాలనలోకి రావటానికి ముందు విజయనగర సామ్రాజ్యం మొదలుకుని మొఘలుల సామ్రాజ్యం వరకూ అనేక రాజ్యాలు, సంస్థానాలుగా ఉండేది. ఆయా రాజ్యాలు, సంస్థానాలకు వేటి జాతీయ జెండా వాటికి ప్రత్యేకంగా ఉండేవి. మొదట ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారత్ మీద బ్రిటన్ పాలన సాగేది. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ జెండానే ఎక్కువగా వినియోగించేవారు.అప్పుడే ఆలోచన పడింది. 1857 సిపాయిల తిరుగుబాటుతో ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి బ్రిటన్ సామ్రాజ్యం నేరుగా భారతదేశాన్ని తన పరిపాలన కిందకు తీసుకువచ్చింది. అప్పుడే ఇతర బ్రిటిష్ వలస దేశాల తరహాలోనే భారతదేశానికి మొట్టమొదటిగా ఒక జాతీయ జెండా వచ్చింది. వాటి మీద బ్రిటిష్ సామ్రాజ్య జెండా 'యూనియన్ జాక్' తప్పనిసరిగా ఉండేది. 19వ శతాబ్దం చివరలో భారతదేశంలో స్వాతంత్య్ర కాంక్ష.. జాతీయోద్యమం ఊపందుకునే సమయంలోనే భారత జాతీయ జెండా ఆలోచనలు బలపడ్డాయి. ఆ మేరకు జెండా రూపకల్పనలు జరిగాయి. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పతాకాన్ని.. 1906 ఆగస్టు 7న ఇప్పటి కోల్‌కతాలోని పార్సీ బగాన్ కూడలిలో ఆవిష్కరించినట్లు చెప్తారు. అది కూడా త్రివర్ణ పతాకమే. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వర్ణాలు ఉండేవి. పైన ఎనిమిది కమలం పువ్వులు, మధ్యలో 'వందే మాతరం' నినాదం కింద సూర్య, చంద్రుల బొమ్మలు ఉండేవి. రెండో జాతీయ పతాకాన్ని.. 1907లో దేశబహిష్కరానికి గురైన మేడం కామా తదితర విప్లవకారులు పారిస్‌లో ఆవిష్కరించారు. ఇది కూడా దాదాపు మొదటి పతాకం లాగానే ఉండేది. కాకపోతే పై భాగంలో కమలానికి బదులు.. ఇందులో సప్తరుషులకు గుర్తుగా ఏడు నక్షత్రాలను చేర్చారు. ఈ పతాకాన్ని బెర్లిన్‌లో జరిగిన సోషలిస్ట్ సదస్సులోనూ ప్రదర్శించారు. స్వాతంత్య్ర పోరాటం కీలక మలుపు తిరిగిన 1917లో మూడో జాతీయ పతాకం రూపొందింది. స్వపరిపాలన ఉద్యమం సందర్భంగా అనిబీసెంట్, లోకమాన్య తిలక్‌లు దీనిని ఆవిష్కరించారు. ఇందులో ఏడు ఎరుపు గీతలు, ఐదు ఆకుపచ్చ గీతలు ఒకదాని తర్వాత ఒకటి అడ్డంగా పరిచివుంటాయి. వాటిపైన సప్తరుషుల చిహ్నంగా ఏడు నక్షత్రాలు.. ఒక వైపు మూలన బ్రిటన్ జాతీయ పతాకం, రెండో మూలన సూర్య, చంద్రుల చిహ్నాలు ఉన్నాయి.  స్వాతంత్య్ర ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 1921లో బెజవాడలో సమావేశమైంది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి ఆ సదస్సులో గాంధీజీకి చూపారు. దేశంలో రెండు ప్రధాన మతస్తులైన హిందువులు, ముస్లింలకు గుర్తుగా.. ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. అందులో చరఖాను చేర్చాల్సిందిగా లాలా హన్స్‌రాజ్ సూచించారు. గాంధీజీ ఈ జెండాలోని ఎరుపు, ఆకుపచ్చ రంగులకు తోడు.. మిగతా మతాల వారికి గుర్తుగా తెలుపు రంగును చేర్చాలని సూచించారు. ఈ పతాకాన్ని స్వాతంత్య్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉపయోగించారు. జాతీయ పతాకం చరిత్రలో 1931 మరో మైలురాయి. త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా నిర్ణయిస్తూ కాంగ్రెస్ సదస్సులో తీర్మానం చేశారు. ఎరుపు రంగును కాషాయ రంగుగా మార్చారు. అందులోని చరఖాను తొలగించి.. నేతాజీ సుభాశ్‌చంద్రబోస్ బ్రిటిష్ వారి మీద పోరాడటానికి స్థాపించిన భారత జాతీయ సైన్యం రెండో ప్రపంచ యుద్ధంలో తన జాతీయ జెండాగా ప్రదర్శించింది. 1947లో తెలుపు రంగు మీద చరఖా స్థానంలో అశోకుడి ధర్మచక్రాన్ని చేర్చారు. ఈ చక్రం ముదురు నీలం రంగులో ఉంటుంది. 1906లో కోల్‌కతాలో 22వ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు నిర్వహించారు. 'ది గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌'గా పిలిచే దాదాబాయి నౌరోజి సభకు అధ్యక్షత వహించారు. సభ ప్రారంభానికి ముందు బ్రిటిష్‌ వారి పతాకమైన యూనియన్‌ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడంతో పింగళి వెంకయ్య కలత చెందారు. ఆ క్షణంలోనే మనకంటూ ప్రత్యేకంగా జాతీయ జెండా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఆయన మనసులో మెదిలింది. ఆ సభలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్‌ విషయ నిర్ణయ సమితి సభ్యునిగా నియమించారు. అనంతరం జాతీయ జెండా ఆవశ్యకత వివరిస్తూ వెంకయ్య దేశవ్యాప్తంగా పర్యటించి 1916లో 'ఏ నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా' అనే ఆంగ్ల పుస్తకం రచించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య.. మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరు.. పింగళి 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో జాతీయ పతాకాలు వినియోగించారు. కానీ, పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై 'రాట్నం' గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సూచనమేరకు రాట్నం స్థానంలో అశోకచక్రం వచ్చి చేరింది. ఏప్రిల్‌ 13, 1936 నాటి ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్ముడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 50 ఏళ్ల పాటు అది కొనసాగింది. వెంకయ్య సన్నిహితులు ఆయన్ను జపన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జనద వెంకయ్య అని పలు రకాలుగా పిలుచుకునేవారు. వెంకయ్య గొప్ప దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయిత కూడా. 1911-44 వరకు బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుంచి 1944 వరకు నెల్లూరులో మైకా గురించి పరిశోధనలు చేశారు. బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. 1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు.

పోలీసు పహారాలో అర్ధరాత్రి ఇండ్ల కూల్చివేత.. సీఎం జగన్ ఇంటి సమీపంలో అరాచకం

తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలోని అమరారెడ్డి కాలనీలో పోలీసుల పహారాలో ఇళ్లు తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 200 ఇళ్లు వరకూ కూల్చేసిన అధికారులు. మిగిలిన వాటిని కూడా తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఒకరోజు ముందు తేదీతో  సాయంత్రం ఆరు గంటలకు నోటీసు ఇచ్చి వెంటనే కూల్చివేతలకు దిగారు. ఇంట్లో ఉన్నవారు గడువు కావాలని వేడుకున్నా కనికరించలేదు.  వినకపోవడంతో బాధితులు ప్రొక్లెయినర్‌కు అడ్డుగా పడుకున్నాడు. పోలీసులు వచ్చి లాగేయడంతో  ఓ యువకుడు ఇంట్లోకి వెళ్లి ఉరేసుకునే ప్రయత్నం చేశాడు.  అతని సోదరి గుర్తించి కేకలు వేయడంతో పోలీసులు వెళ్లి తలుపులు తీసి అతన్ని బయటకు తీసుకొచ్చారు.అంతకుముందు అతని తల్లి రాజ్యలక్ష్మి స్పృహ తప్పి పడిపోవడంతో అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.  కూల్చివేతలకు నిరసనగా బాధితుల అరుపులు కేకలతో ముఖ్యమంత్రి నివాస ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది.కూల్చివేతలు సమయంలో ఇళ్లలో ఉంటున్న వారిని ఎవరినీ పోలీసులు బయటకు రానీయడం లేదు. వస్తే కేసులు పెడతామని బెదిరింపులకు దిగారు. రాత్రికి రాత్రి ఖాళీ చేయకపోతే ఉదయానే స్టేషన్‌కు తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎదురు మాట్లాడితే ఏ కేసులో ఇరికిస్తారో అనే భయం గృహ యజమానులను వెంటాడుతోంది.బాధితులు జిల్లా కలెక్టర్‌ను కాలనీ వాసులు కలిసి ఇళ్లు ఖాళీ చేసేందుకు నాలుగు నెలల సమయం కావాలని విజ్ఞప్తి చేశారు.  కొంత సమయం ఇస్తే తామే స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేసి వెళతామని చెప్పినట్లు కాలనీ వాసులు  తమ గోడును వెళ్లబోసుకున్నారు. అయినా పట్టించుకోని పోలీసులు.. రాత్రికల్లా బలవంతంగా జెసిబిలు తీసుకొచ్చి కూల్చివేతలకు దిగారు. దీంతో ఇదెక్కడి న్యాయమని గృహ యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నివాసం వెనక పేదల ఇళ్ల కూల్చివేతలపై పోరాడుతున్న శివశ్రీ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇంటిని కూల్చివేస్తున్నామని, గురువారం లోగా ఖాళీ చేసి వెళ్లాలని మంగళవారం నోటీసులు అంటించిన అధికారులు గతరాత్రి కూల్చివేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవడం వల్లే తన ఇంటిని కూల్చివేశారని, అధికారులు తనపై కక్ష సాధిస్తున్నారని శివశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ శివశ్రీ వీడియో విడుదల చేశారు. నోటీసు ఇవ్వడానికి ముందు ఇంట్లో ఉంటున్న శివశ్రీ అనే యువతిని పోలీసులు పట్టుకెళ్లారు.స్థానికులు  అఖిలపక్ష నాయకులు వెళ్లి గొడవచేయడంతో మధ్యాహ్నం రెండుగంటల సమయంలో వదిలేశారు. కక్షసాధింపుగా సాయంత్రం ఆరుగంటలకు వెళ్లి ఆమె ఇంటిని కూల్చివేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు. కూల్చివేతల కోసం వందలాది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, బూరుగ వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు జంగాల సాంబశివరావు తదితరులు అక్కడకు చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈలోపు ఇన్‌ఛార్జి కమిషనర్‌ హేమమాలిని సంఘటనాస్థలానికి రావటంతో సమయం ఇవ్వాలని కోరినా వినకుండా అర్థరాత్రి 11 గంటల సమయంలో శివశ్రీ ఇంటిని కూల్చివేశారు. 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌‌కు బిగ్ షాక్.. ఏం జరగబోతుందో? 

తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శిగా పని చేస్తూ స్వచ్చంద పదవి విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కరీంనగర్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయి సుధ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన రెండు రోజులకే ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు రావడం చర్చగా మారింది. కేసు వివరాల్లోకి వెళితే..  ఈ ఏడాది మార్చి నెలలో పెద్దపల్లి జిల్లా జూలపెల్లి మండలం ధూళికట్ట గ్రామంలో ‘స్వేరో’స్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌.ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా.. స్వేరోస్ సభ్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్ బాబు ఓ ప్రతిజ్ఞ చేయించారు. ‘హిందు దేవుళ్లు అయిన రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించమని, గౌరీ మీద, గణపతి మీద ఇతర హిందు దేవతల మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించమని, శ్రాద్ధ కర్మలు పాటించమని, పిండదానాలు చేయబోమంటూ.. హిందూ విశ్వాసాలకు వ్యతిరేకంగా చేసిన ప్రతిజ్ఞలో స్వేరోస్ సభ్యులతో పాటు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎడమ చేతి చాచి ప్రతిజ్ఞ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆర్.ఎస్ ప్రవీణ్‌ కుమార్‌పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.  ఈ ఘటన తర్వాత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఆందోళన చేశాయి. సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కేంద్రానికి కూడా కొందరు ఫిర్యాదు చేశారు. తనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా ప్రవీణ్ కుమార్ మాత్రం బహిరంగంగా స్పందించలేదు.ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి.. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీశారని, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా.. దేవుళ్లను అవమానించి, కించపరిచే విధంగా ప్రతిజ్ఞ చేశారంటూ కరీంనగర్ త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో మార్చి 16న ఫిర్యాదు చేశారు.  అయినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. కరీంనగర్ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి.  మరో న్యాయవాది యెన్నంపల్లి గంగాధర్ సహాయంతో ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును బుధవారం విచారించిన న్యాయమూర్తి సాయిసుధ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా త్రీ టౌన్‌ పోలీసులను ఆదేశించారు.

మళ్లీ గ్రేటర్ రాయలసీమ నినాదం! జగన్ పై ఫైరవుతున్న సీమ జనం..  

గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్లీ ఊపందుకుంటుందా? రాయల సీమ సమస్యలను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారా? అంటే ఆ ప్రాంత జనాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో తెరపైకి వచ్చిన గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్లీ వినిపిస్తోంది.  తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల వివాదం, బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం గెజిట్ తో భవిష్యత్ లో ఈ ప్రాంతానికి నష్టం కల్గుతుందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. దీంతో గ్రేటర్ రాయలసీమతోనే తమ హక్కులను కాపాడుకుంటామనే ఆలోచనకు ఆ ప్రాంత ప్రజలు వచ్చారని తెలుస్తోంది.  కృష్టా జల వివాదంపై మాట్లాడిన మాజీ మంత్రి, రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి నేత మైసూరా రెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇద్దరు ముఖ్యమంత్రులు ఘర్షణకు దిగారని.. దానివల్ల రాయలసీమ నీటి ప్రాజెక్టులను గందరగోళంలోకి నెట్టేశారని మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్న ఆయన.. వీరికి ఎందుకు భేషజాలు అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు, వీరిద్దరూ తెగేదాక లాగడం వల్లనే పరిస్థితి ఇంతదాకా వచ్చిందన్నారు మైసూరా రెడ్డి. పోలవరంపై ఐదు రాష్ట్రల ముఖ్యమంత్రులు కలసి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు సీఎం‌లు మాట్లాడుకోలేరా? అని వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి మూడు టీఎంసీలు మాత్రమే వినియోగించాలని, ఇష్టానుసారం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంటే సీఎం జగన్ ఎందుకు మట్లాడరని మైసూరారెడ్డి ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వం జారీచేసిన గెజిట్ వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందని మైసూరా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్ సీమ ప్రాంతానికి గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కు మంచిది కాదని అన్నారు.ఈ పరిస్థితి వల్ల.. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అంశం తెరపైకి వస్తోందని అన్నారు. తమకు కూడా రాష్ట్రం ఏర్పడితే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం జనాల్లో వస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చిన ఈ గెజిట్ ను జగన్  ప్రభుత్వం ఆహ్వానించడం పూర్తిగా తప్పేనని మైసూరా రెడ్డి మండిపడ్డారు. గెజిట్‌ను స్వాగతించే ముందు ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయలేదని అన్నారు. రాయలసీమను జగన్ చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదంటూ మైసూరా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చట్టబద్దత కల్పించాలని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించాలని ప్రతిపక్షనేతగా జగన్ డిమాండ్ చేసింది నిజం కాదా? అని అడిగారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రభుత్వం ఉండుంటే.. రాయలసీమ ప్రజలకు ఇంత అన్యాయం జరిగేది కాదు కదా అని అన్నారు. కేసీఆర్, జగన్ లు రాజకీయ లబ్ది కోసం కీచులాడుకుని  జట్టును కేంద్రం చేతిలో పెట్టారని వ్యాఖ్యానించారు. ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకోకపోవటం వలనే బోర్డులు మితిమీరి జోక్యం చేసుకున్నాయన్నారు. శ్రీశైలం జలాశయాన్ని తెలంగాణ ఖాళీ చేస్తుంటే... ఆంధ్రా పాలకులు నిద్రపోతున్నారని మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆంధ్రా ఆగమాగముంది.. జగన్ పాలనపై కేసీఆర్ సెటైర్లు..

ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలనపై ఇప్పటికే చాలా ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై జనాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏపీలో ప్రస్తుతం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్న అప్పు తేవాల్సిన పరిస్థితి ఉంది. రుణం దొరకకపోతే ఆ నెలకు వేతనాలు లేనట్టే. పరిమితికి మించి అప్పులు తెచ్చారంటూ జగన్ రెడ్డి సర్కార్ తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ కూడా మొట్టికాయలు వేసింది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా  రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉంటుదోనన్న ఆందోళన నెలకొంది. ప్రధాన ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీతో ఇతర పార్టీలు కూడా జగన్ అస్తవ్యస్థ, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్ ను గండంలోకి నెట్టారని చెబుతున్నారు.  తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తుందని చెప్పిన కేసీఆర్.. ఆంధ్రా పరిస్థితి మాత్రం దారుణంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ప్రజలు.. విభజన తర్వా త కూడా తెలంగాణ వాళ్లుగా చెప్పుకోవడానికి ఇష్టపడే వారు కాదన్నారు.  కాని ప్రస్తుతం ఆ సీన్ మారిపోయిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుండగా.. ఆంధ్రా మాత్రం ఆగమాగం అవుతుందన్నారు. అందుకే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ప్రజలు కూడా ఇప్పుడు తెలంగాణవాసులమని చెప్పుకుంటున్నారని చెప్పారు. గతంలో ఏపీలో వరి ఎక్కువగా పండేదని, ప్రస్తుతం తెలంగాణకు కనీస దూరంలో కూడా  లేదని తెలిపారు.  తెలంగాణ వాళ్లకు పండించడం రాదు.. పాలన చేసుకోవడం రాదని మాట్లాడేవారని.. కాని ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందే జనాలు గమనిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. జగన్ సర్కార్ తీసుకున్న మెజార్టీ నిర్ణయాలు వివాదాస్పదం కావడం, కోర్టులు కొట్టివేయడం వంటి ఘటనలు జరిగాయి. కొన్ని రోజులుగా  ఏపీలో నెలకొన్న పరిస్థితులను  బట్టే కేసీఆర్.. ఈ కామెంట్లు చేశారని తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.  మరోవైపు ఆంధ్రాను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మరో వాదన కూడా వస్తోంది. ఇటీవల కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం సాగుతోంది. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా కేంద్రానికి ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో కేంద్ర సర్కార్ ఎంటరై బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ ఇచ్చింది. అయినా తెలంగాణ సర్కార్ దూకుడుగానే వెళుతోంది. సుప్రీంకోర్టులో పోరాటానికి సిద్ధమైంది. జల వివాదం నేపథ్యంలోనే గతంలో మిత్రుడిగా చెప్పుకున్న జగన్ టార్గెట్ గా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని కొందరు భావిస్తున్నారు. 

మ‌న్సాస్‌లో రివేంజ్ పాలిటిక్స్‌!.. రాచ‌క్రీడ‌లో ఉద్యోగులు బ‌లి?

రాజుల హ‌యాంలో రారాజులా బ‌తికారు. ద్రోహుల కాలంలో జీతాల‌కూ ఇబ్బంది ప‌డుతున్నారు. అశోకుడి హయాంలో ఏ ఇబ్బందీ రాలేదు. సంచ‌యిత రాక‌తో ఇక్క‌ట్లు మొద‌ల‌య్యాయి. ఇది మ‌న్సాస్ ట్ర‌స్టులో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారి నుంచి వస్తున్న మాట. వంద‌లాది మంది ఉద్యోగులు. వేలాది మందికి చ‌దువులు చెప్పే ఉపాధ్యాయులు. అక్ష‌ర సేద్యం జ‌రుగుతున్న మ‌న్సాస్ విద్యాల‌యాల్లో ప్రస్తుతం ఆక‌లి కేక‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనిది దాదాపు ఏడాదిన్న‌ర‌గా మ‌న్సాస్ ఉద్యోగుల‌కు జీతాలు రావ‌డం లేదంటున్నారు. రాజుల ఖ‌జానాలో కాసులు లేక కాదు.. పాల‌కుల్లో చిత్త‌శుద్ధి లేక‌.  మ‌న్సాస్ పీఠంపై అడ్డ‌గోలు జీవోల‌తో సంచ‌యిత‌ను తీసుకొచ్చి కూర్చోబెట్టింది.. ట్ర‌స్టు ప‌ర్య‌వేక్ష‌ణ కోసం కాదు.. మ‌న్సాస్ ఆస్తుల‌ను స్వాహా చేయ‌డం కోస‌మ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌న్సాస్‌కు ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా ఉన్న ఖ‌రీదైన భూముల‌ను అడ్డంగా దోచుకునేందుకు.. తాడేప‌ల్లి పెద్ద‌లు ఆడిన గ‌జ‌ప‌తుల ఆట‌లో సంచ‌యిత ఓ పావు మాత్ర‌మే అంటారు. అశోక్‌ను దెబ్బ‌తీయ‌డం, ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో భ‌ద్రంగా ఉన్న‌ భూముల లెక్క‌ల చిట్టా బ‌య‌ట‌కు తీయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ రెండేళ్లు పావులు క‌దిపారని అంటున్నారు. ఎక్క‌డా, ఏ కోషానా మ‌న్సాస్ ట్ర‌స్టు ప్రాభ‌వం కోసం ప‌ని చేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అస‌లు, మ‌న్సాస్ కార్య‌క్ర‌మాల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని.. అందుకే నెల‌ల త‌ర‌బ‌డి ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. క‌డుపు కాలిన ఆ ఉద్యోగులంతా ఇప్పుడు జీతాల కోసం ధ‌ర్నాల‌కు దిగుతున్నారు. కోర్టు ఆదేశాల‌తో.. మ‌న్సాస్ పీఠం నుంచి సంచ‌యిత వైదొలిగి.. అశోక్ గ‌జ‌ప‌తిరాజు రావ‌డంతో ఉద్యోగ‌ల్లో కాస్త‌ ధైర్యం వ‌చ్చింది. పాత రోజులు, మంచి రోజులు మ‌ళ్లీ వ‌స్తాయ‌నే ఆశ‌ చిగురించింది.  సిబ్బంది ఒక‌లా త‌లిస్తే.. ప్ర‌భుత్వం మ‌రోలా ప్ర‌తీకారం తీర్చుకుంటోంది. పెండింగ్ జీతాలు రిలీజ్ చేయాలంటూ.. ఇటీవ‌ల‌ వంద‌లాది మంది ఉద్యోగులు మ‌న్సాస్ కార్యాల‌యాన్ని చుట్టుముట్టి.. ధర్నా చేశారు. ఉద్యోగుల క‌డుపుమంట‌.. మాజీ ఛైర్‌ప‌ర్స‌న్ సంచ‌యిత‌కు క‌ళ్ల‌మంట‌లా క‌నిపించింది. అశోక్ గ‌జ‌ప‌తిరాజే మ‌న్సాస్ సిబ్బందిని రెచ్చ‌గొడుతున్నారంటూ ఆరోపించారు సంచ‌యిత‌. మ‌రోవైపు, జీతాల కోసం కార్యాల‌యాన్ని చుట్టుముట్టిన ఉద్యోగుల‌పై కేసులు పెట్టడంతో మ‌రింత క‌ల‌క‌లం చెల‌రేగింది. జీతాలు ఆప‌డం, అడిగితే కేసులు పెట్ట‌డ‌మంతా.. ఎంపీ విజ‌య‌సాయి డైరెక్ష‌న్‌లో.. ఈవోతో ఆడిస్తున్న జ‌గ‌న్నాట‌క‌మ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌న్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా ఉద్యోగులంద‌రికీ వెంట‌నే జీతాలు విడుద‌ల చేయాలంటూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఆదేశించారు. అకౌంట్‌లో డ‌బ్బులు కూడా ఉన్నాయి. ఇక శాల‌రీ ప‌డుతుంద‌న‌గా.. మ‌న్సాస్ ఈవో ఆ శాల‌రీ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించార‌ని తెలుస్తోంది. ఉద్యోగుల‌ జీతాలు ఆపేసి.. అశోక్‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తున్న ఈవో వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాల‌కుల అడుగుల‌కు ఈవో మ‌డుగులు ఒత్తుతున్నారంటూ ఉద్యోగులు మండిప‌డుతున్నారు.  ఇన్నేళ్ల‌లో సిబ్బంది జీతాల సమస్య ఇప్పటివరకు మాన్సాస్‌కి రాలేదని సంస్థ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జీతాల చెల్లింపుని అధికారులు సమస్యగా భావించటం సరికాదన్నారు. సిబ్బంది లేకపోతే సంస్ధలకు మనుగడే ఉండదన్నారు. సిబ్బంది పనిచేసేది జీతాల కోసమేన‌ని.. వారికి ఈవో ఇబ్బందులు కలిగించటం భావ్యం కాదన్నారు. జీతమడిగితే కేసులు పెడతారా? జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా? అని మండిప‌డ్డారు మ‌న్సాస్‌ చైర్మన్‌ అశోక్ గజపతిరాజు.  ఇలా, మ‌న్సాస్ కేంద్రంగా జ‌రుగుతున్న రాజ‌కీయ క్రీడ‌లో.. ఉద్యోగులు బ‌లిప‌శువులుగా మారుతున్నారని అంటున్నారు. కోర్టు ఆదేశాల‌తో మ‌ళ్లీ మ‌న్సాస్ ప‌గ్గాలు చేప‌ట్టిన అశోక్ గ‌జ‌ప‌తిరాజును ఇబ్బందుల‌కు గురి చేసేందుకు.. పాల‌కులు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు. మ‌రి, ఈ రాజుల యుద్ధంలో గెలుపు, ఓట‌ములు ప‌క్క‌న‌పెడితే.. శిక్ష మాత్రం ఉద్యోగుల‌కు ప‌డుతుండ‌టం ఆందోళ‌న‌క‌ర అంశం.

కేతేపల్లి మర్డర్ ఆడియో టేపు.. లీక్ 

పాలు ఇవ్వడం మాత్రమే కాదు.. పాలించడం కూడా తెలుసు అని సినిమా డైలాగ్ వినేవుంటారు. అది అక్షరాల నిజం. కానీ నేటి యువత ఆ మాటలు పఠియించుకోవడం లేదు. ప్రేమ ముసుగులో ఎన్నో ఘోరాలు చేస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చిన , ఎన్ని శిక్షలు వేసిన ఈ దాడులు మాత్రం ఆగడం లేదు..జీవితాన్ని మరిచి ఉన్న దాడులు చేస్తున్నారు ఆవేశంలో ప్రాణాలు తీస్తున్నారు. యువతిని అకారణంగా రేప్‌ చేసి.. ఆపై చంపేశారు దుర్మార్గులు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు యువకులు పీకలదాకా తాగి.. చిత్రహింసలకు గురి చేసి మరీ హతమార్చారు. ఎవ్వరికీ హాని చేయని మైనర్‌ బాలిక ఆర్తనాదాలు చేసినా.. మద్యం మత్తులో ఉన్న ఆ నీచులు  కనికరించకుండా పొట్టనపెట్టుకున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మైనర్ బాలికను.. పవన్‌ మాయమాటలు చెప్పి అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై చిత్రహింసలకు గురి చేశాడు. ఎక్కడ తమ బాగోతం బయటపెడుతుందోనన్న బెంగతో బాలిక మెడకు చున్నీచుట్టి చంపేశారు. ఆ సమయంలో నిందితుడు పవన్‌.. బాలిక బావ రాజుకు ఫోన్‌ చేశాడు. అమెను చంపేసి జైలుకు వెళ్తానని అతనికి తెగేసి చెప్పాడు. ఆమె బావ వద్దని చెప్పాడు. ఇప్పుడు వదిలిపెట్టు అని చెప్పాడు అయినా ఆ మూర్ఖుడు వినకుండా బాలికను చిత్రవధ చేశాడు. ఆ సమయంలో కాపాడమని బాలిక ఆర్తనాదాలు చేసిన ఆడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ వైరల్ ఆడియో టేపు ఇప్పుడు మీడియాకు  లభించింది. కొప్పోలు గ్రామంలో ఈనెల 13వ తేదీన మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. ఆ ఘటన రాష్ట్రాన్ని అంత ఒక్క సారి ఆందోళనలో పడేసింది. ఊరు చివర్లో ఉన్న వ్యవసాయ భూముల్లో అనుమానాస్పదంగా పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక మెడకు చున్ని చుట్టి ఉండటంతో పాటు డెడ్‌ బాడీ పక్కనే మద్యం బాటిళ్లు పడి ఉండటం పలు అనుమానాలకు దారి తీసింది. కేతే పల్లి ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఈ విషయంలో కేతేపల్లి ఎస్‌.ఐ రామకృష్ణ విచారణ సరిగ్గా చేయలేదంటూ నిందితుడిని కాపాడాలనే అతని ఈ పని చేశాడని. గ్రామస్తులు,ఇతర  దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. ఎస్‌ఐ రామకృష్ణని సస్పెండ్‌ చేయాలని వారు  డిమాండ్‌ చేశాయి. దాంతో ఎస్‌ఐ రామకృష్ణను విఆర్‌కి అటాచ్‌ చేస్తూ డిఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్‌ బాలిక పోస్టుమార్టంలో ఆధారాలు తారు మారు చేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో డిఐజీ రంగనాథ్‌ స్పెషల్‌ ఆపీసర్‌ సతీష్‌ ఐపీఎస్‌ను నియమించారు. పోలీసుల సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాలికపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసినట్లు తేలింది. దీంతో పవన్‌, అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అమాయకురాలైన బాలికను చంపిన దుండగులను ఉరితీయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

హుజురాబాద్ బరిలో వెయ్యి మంది? కేసీఆర్ కు షాక్ తప్పదా..

రెండు దశాబ్దాలుగా తమకు కంచుకోటగా ఉన్న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు అన్ని శక్తులు ఒడ్డుతోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు రాజకీయంగా చెక్ పెట్టాలని వ్యూహాలు రచిస్తోంది. హుజురాబాద్ లో గెలిచి కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని చూస్తున్న రాజేందర్ ను ఎట్టి పరిస్థితిల్లోనూ ఓడించేలా గులాబీ దళం స్కెచ్ వేస్తోంది. అందులో భాగంగానే ఈటలకు మద్దతుగా ఉంటున్న వారికి గాలం వేస్తున్నారని, ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తన పాదయాత్రకు ఇబ్బందులు కల్గిస్తున్నారని, తన అనుచరులను బెదిరిస్తున్నారని ఈటల పదే పదే ఆరోపణలు చేస్తున్నారు.  అయితే ఈటలకు చెక్ పెట్టాలని ప్లాన్ వేస్తున్న అధికార పార్టీకి మరో రకంగా షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. తమ ఉద్యోగాలు తొలగించడంపై ఆగ్రహంగా ఉన్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టేంట్లు హుజురాబాద్ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. తమను తిరిగి ఉద్యోగాల్లో తీసుకుంటూ రీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోతే ప్రత్యక్ష ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించాలని భావిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏకంగా వెయ్యి మందిని బరిలోకి దింపాలని చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. లేనట్టయితే బై పోల్‌ బరిలో నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరిస్తున్నారు.  ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళనకు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి.  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా ఇదే ప్రకటన చేశారు. హుజురాబాద్ లో వెయ్యి మంది నామినేషన్ వేసి కేసీఆర్ కు ఝలక్ ఇవ్వాలని ఆయన పిలుపిచ్చారు. గతంలో జరిగిన హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు ముందు కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు ఇలాంటి హెచ్చరికలే చేశారు. అయితే సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో పోటీ నుంచి వెనక్కి తగ్గారు. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న బాధితులు.. ప్రభుత్వం దిగి రాకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికలో తమ ప్రతాపం చూపిస్తామని అంటున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వారి కుటుంబాలు కూడా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.  ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వెయ్యి మంది హుజురాబాద్ బరిలో నిలిస్తే రికార్డు బ్రేక్ కానుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో రైతులు నిజామాబాద్ లోక్ సభకు పోటీ చేశారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన 175 మంది రైతులు అప్పటి ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత ఓడిపోయారు. పసుపు రైతుల వల్లే కవిత ఓడిపోయిందని టీఆర్ఎస్ భావిస్తోంది. గతంలో నల్గొండ నుంచి ఫ్లోరైడ్ బాధితులు దాదాలు నాలుగు వందల మంది పోటీ చేశారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏకంగా వెయ్యి మంది పోటీ చేస్తే దేశంలోనే అరుదైన రికార్డు నమోదు కానుంది. అంతేకాదు అధికార పార్టీకి నష్టం కల్గించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సెకండ్ వేవ్ లో ఒక్కరు కూడా ఆక్సీజన్ లేక మరణించలేదు.. మోడీ సర్కార్.. 

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది..అయితే కరోనా మీద ప్రజలకు అనుమానం లేకపోలేదు.. ఇది మెడికల్ మాఫియా అని కొందరు అంటే.. మరికొందరు డాక్టర్స్ కార్పొరేట్ సంస్థ ల పని అని మరికొందరు ఎవరి వారి వాదనలు వినిపించారు. మరి కొంత మంది కరోనా లేదు ఏం లేదని జరుగుతున్నది అంట నాటకం అని కూడా తెగేసి చెప్పారు.  వైరస్ సెకండ్ వేవ్ దేశంలో ఎంతటి విలయాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన అందరం కళ్లారా చూశాం.. దేశం వీధులు శవాలతో నిండాయి.. ఎంతో మంది ప్రాణాలు చేతిలో పట్టుకుని తిండి తిప్పలు లేక బతకాలంటే కోరిన ఒక్కటే గుండెల్లో పెట్టుకుని ఎలాగైనా తమ ఊర్లకు చేరుకుంటే చాలు అన్నట్లు నడవలేక వారి రక్తంతో భూమికి అభిషేకం చేశారు.. ఎక్కడికక్కడే ప్రజలు పిట్టల రాలిపోయారు.  దేశంలో మొదటి వేవ్ చూపించిన విధ్వంసం కంటే నాలుగు రేట్లు ఎక్కువగా ప్రభావం చూపించింది. రోజుకి నాలుగున్నర లక్షలకి పైగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. సెకండ్ వేవ్ లో నమోదు అయిన మరణాల్లో ఎక్కువశాతం ఆక్సీజన్ అవసరం అయిన సమయంలో అందుబాటులో లేకపోవడం వల్లే జరిగాయి అని ఎవరైనా చెప్తారు. ఎందుకు అంటే ఆ సమయంలో ప్రభుత్వాలు కోర్టులు మీడియా ఆక్సీజన్ గురించి అంతగా మాట్లాడాయి. లక్షల మంది రోగులు ఆక్సిజన్ లేక విలవిల్లాడటం పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా వేల మంది చనిపోవడాన్ని జనం ప్రత్యక్షంగా చూసినా ప్రభుత్వాలకు మాత్రం ఆక్సిజన్ మరణాలు ఒక్కటి కూడా కనిపించలేదట. అయితే ప్రభుత్వాలు ఏ సమయంలోను తమ తప్పిదం వల్ల మనుషులు చనిపోయారని వారు అంగీకరించరు. ఇప్పుడు కూడా పార్లమెంట్ లో అదే సీన్ రిపీట్ అయ్యింది. తాజాగా రాజ్యసభలో కరోనా అంశంపై జరిగిన చర్చలో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరంటే ఒక్కరు కూడా దేశంలో చనిపోలేదని కేంద్రం ఓ కీలకమైన భారమైన తప్పుడు  స్టేట్ మెంట్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.. మరి సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ లేక ప్రాణాలు పోలేదని వాళ్ళు ఏరకంగా చనిపోయారో మోడీ కి తెలియదా.. సెకండ్   వేవ్ లో ఆక్సిజన్ కొరత వల్ల రోగులు మరణించినట్లు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెగేసి చెప్పింది మోడీ సర్కార్. తొలి వేవ్ కంటే రెండో వేవ్ లో మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిందని మాత్రం మోదీ సర్కారు అంగీకరించింది. తొలి వేవ్ సమయంలో 3095 మెట్రిక్ టన్నులుగా ఉన్న మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ రెండో వేవ్ సమయంలో 9000 మెట్రిక్ టన్నులకు పెరిగిందని స్వయంగా తానే రంగంలోకి దిగి రాష్ట్రాలన్నిటికీ సమానంగా మెడికల్ ఆక్సిజన్ పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది. ఈ ఒక్క వార్త చాలు మోడీ బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశం పై ఈ దేశ ప్రజలపై ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి.. ఒకవైపు దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసిన సెకండ్ వేవ్ లో ఎవరు ఆక్సిజన్ తో చనిపోలేదని చెప్పడం ఏంటి మోడీ..  పార్లమెంట్ సమావేశాల రెండో రోజైన మంగళవారం కూడా కరోనా పరిస్థితుల నిర్వహణలో మోదీ సర్కారు వైఫల్యంపై విపక్షాలు ఆందోళన చేశాయి. ఏకంగా ప్రశ్నల ప్రవాహమే మొదలైయింది. దేశం మొత్తం  కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలు మొత్తం మరణాల సంఖ్య దాచివేత ఆరోపణలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాడవీయ అదే శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానాలిచ్చారు. వైద్యం ఆరోగ్యం అనేవి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని అంశాలన్న కేంద్రం ఆయా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి నిత్యం కేసుల సంఖ్యను మరణాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయని మరణాలను నివేదించవలసిన విధానంపై అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సవివరమైన మార్గదర్శకాలను జారీ చేశామని అయితే ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలంటూ నిర్దిష్టంగా తెలియజేయలేదని కేంద్ర మంత్రులు పార్లమెంటుకు తెలిపారు. ఇంకా నయ్యం మన దేశంలో కరోనా వల్ల ఒక్కరు కూడా చనిపోలేదని చెప్పలేదు మోడీ సర్కార్. ఆక్సీజన్ కొరత కారణంగా ఓ ఒక్కరు చనిపోలేదు అని దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా కేంద్రానికి సమాచారం ఇవ్వలేదట. మరి అలాంటప్పుడు ఆక్సిజన్ కొరత లేకపోతే మనుషులు పిట్టల్లా రాలిపోకపోతే  ప్రపంచం మొత్తం  ఉరుకులు పరుగుల మీద ఎందుకు ఇండియాకు ఆక్సిజన్ పంపిందో కేంద్రం చెప్పాల్సి ఉంది.  వందల కొద్ది మరణాలు  శ్మశానాల ముందు బారులు తీరిన మృతదేహాలు ఆక్సిజన్ కోసం కోర్టుకెళ్లిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వార్తలతోనే సెకండ్ వేవ్ నడిచిపోయింది. ఏపీలో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 30మందికిపైగా చనిపోయారని ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇచ్చింది. ఇవేమీ లెక్కలోకిరాలేదు. చివరికి ధర్డ్ వేవ్ వస్తుందన్న ఆందోళన.. సెకండ్ వేవ్ లాంటి పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండాలన్న లక్ష్యంతో వేల కొద్దీ ఆక్సిజన్ ప్లాంట్ ల కు కేంద్రం నిధులిస్తోంది. ఇన్ని జరుగుతున్నా కూడా దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు అంటూ దేవాలయం వంటి రాజ్యసభ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు చెప్పాలి మన దేశ ప్రజలు దేశ భక్తులు ఎవరో.. దేశ ద్రోహులు ఎవరో.. దేశాన్ని విచ్చిన్నం చేసేదెవరో దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించేది  ఎవరో.. ప్రజలారా ఇంకెంత కాలం మోసపోతారు.. మేలుకోండి..    

పెట్రోల్ మంటలకు ఇదిగో విరుగుడు..

పెరుగుట విరుగుట కొరకే అనే సామెత, పెట్రోల్, డీజిల్‌ ధరలకు మాత్రం వర్తించేలా లేదు. పెట్రోల్, డీజిల్‌ ధరలు పాపంలా ప్రతి రోజు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పట్లో కాదు, ఎప్పటకీ పెరిగిన ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. కేంద్ర పెట్రోలియం, ఇంధన శాఖ మాజీ  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పెట్రోల్, డీజిల్‌ ధరలు సమీప భవిష్యత్తులో తగ్గే ఆవకాశం ఇప్పట్లో లేదని ఎప్పుడోనే స్పష్టం  చేశారు.  ఈ నేపధ్యంలో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్‌ వాహనాల మధ్యతరగతి ప్రజలకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల  వైపు చూస్తున్నారు. ఇంచు మించుగా గత నెల రోజులలో గ్రేటర్‌లో హైదరాబాద్ నగర్ పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత నెలరోజుల్లో సుమారు 5 వేలకు పైగా బైక్‌ల విక్రయాలు జరిగినట్లు అధికార లెక్కలు సూచిస్తున్నాయి.  ఎలక్ట్రిక్‌ వాహనాలకు జీవితకాల పన్నుతో పాటు వాహనం రిజిస్ట్రేషన్‌ చార్జీలను కూడా ప్రభుత్వం మినహాయించింది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వీస్‌ కింద 2 లక్షల బైక్‌లకు ఈ మినహాయింపు వర్తించనుంది. అలాగే మరో 10 వేల వరకు కార్లు,  3 వేల ఆటోలు, తదితర రవాణా వాహనాలకు కూడా ఈ మినహాయింపును ఇచ్చారు. కొద్ది రోజుల  క్రితంరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అంశాన్ని వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ద్విచక్ర వాహనాలతో పాటుగా కార్లు, ఆటోలు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా విక్రయాలు ప్రారంభం కాలేదు. అయితే ప్రజలు బుకింగ్‌ల పట్ల మాత్రం ఆసక్తి చూపుతున్నట్లు నగరంలోని ఓ ఎలక్ట్రిక్‌ వాహనషోరూమ్‌ నిర్వాహకులు తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాలపైన ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమల్లోకి తేవడానికి ముందు నుంచే నగరంలో వీటి అమ్మకాలు  జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మరింత ఆదరణ పెరిగింది.   అయితే  ఇంకా విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రాక పోవడంతో సహా కొన్ని చిన్న ప్రతిబందాకాలు ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలోనే నగర రోడ్ల పై పరుగులు తీస్తాయని అంటున్నారు.ఎలక్ట్రిక్ బైక్ ను ఒకసారి చార్జింగ్‌ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చును.. నగరంలో ఇంటినుంచి కార్యాలయానికి కార్యాలయం నుంచి ఇంటికి ప్రయాణించే వారికీ ఛార్జింగ్ సమస్య కూడా ఉండదని అంటున్నారు. అయితే, ఈ వాహనాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో  ... చూడవలసి వుంది.