స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కిరీటం తరహాలో గొర్రె కొమ్ములు.. యుగాంతానికి సంకేతం అంటూ కామెంట్స్..
posted on Jul 22, 2021 @ 10:14AM
మాములుగా ఏ గొర్రెకు అయినా రెండే కొమ్ములు ఉంటాయి. ఈ గొర్రెకు మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కొమ్ములు ఉన్నాయి. ఒకే గొర్రెకు ఐదు కొమ్ములు ఉండటంతో ఈ గొర్రెను జనం వింతగా చూశారు. అంటే కాదు దాన్ని చూడగానే కొంతమంది అది యుగాంతం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారికి మరో సంకేతం వచ్చింది. ఈ సారి ఐదు కొమ్ములు గల గొర్రె భూమిని అంతం చేసేందుకు పుట్టింది. ఆ గొర్రెను చూసిన నెటిజనులు అంటున్నారు. ఆ గొర్రె బర్త్ ప్లేస్ నైజీరియా. అక్కడ పెరుగుతున్న ఈ గొర్రె ఇటీవలే వార్తల్లోకి ఎక్కింది. నెత్తి మీద కింగ్ కిరీటం పెట్టినట్లుగా ఆ గొర్రె కొమ్ములు భలే అందంగా ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు సైతం దాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. ఒకరకంగా ఆ గొర్రె టూరిస్ట్ ప్లేస్ గా మారింది. ఈ గొర్రె గురించి తెలుసుకోవాలనుకుంటే కొంచం ముందుకు వెళ్ళాలి.. మరింకెందుకు ఆలస్యం పదండి ముందుకు..
జులై 21న బక్రీద్ నేపథ్యం నైజీరియాలోని లాగోస్‌లోని ఓ మార్కెట్‌లో గొర్రెల గోనుగోలు జోరుగా సాగింది. ఈ సందర్భంగా మార్కెట్ లోకి ఓ వ్యక్తి తీసుకొచ్చిన గొర్రె అందరినీ ఆకట్టుకుంది. అలరించించి. సాధారణంగా గొర్రెకు రెండే కొమ్ములు ఉంటాయి. అయితే, ఆ గొర్రెకు మాత్రం ఐదు కొమ్ములు ఉండటంతో దాన్ని వింతగా చూశారు. వింతగా చూడడమే కాదు అది ఈ భూమిని నాశనం చేయడానికి వచ్చిందని మాట్లాడుకున్నారు.అంతే కాదండోయి కొందరు ఆ గొర్రెకు ఫొటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కిరీటం తరహాలో ఆ గొర్రె కొమ్ములు ఉన్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది యుగాంతానికి సంకేతమని అంటున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
ముస్లింలు జరుపుకొనే మరో ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి. ఈ పండుగను ‘ఈద్ ఉల్ అద్హా’ అని కూడా పిలుస్తారు. బక్రీద్ పండుగ త్యాగానికి గుర్తుగా భావిస్తారు. ఏటా హజ్ యాత్ర చివర్లో ఈ పండుగను నిర్వహిస్తారు. అల్లాహ్ ఆదేశంతో ఇబ్రహీం అనే ప్రవక్త తన ఏకైక కుమారుడిని సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆయన త్యాగానికి సంతోషించిన అల్లాహ్.. అతడి కుమారుడి బదులు గొర్రెను ఉంచుతాడు. అప్పటి నుంచి బక్రీద్‌ను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. మరి రెండు గొర్రెల ధర రూ.4.5 లక్షలట, బక్రీద్ సందర్భంగా గొర్రెను బలిచ్చి.. దాని మాంసాన్ని మూడుగా విభజిస్తారు. ఒక భాగం తమ కుటుంబానికి కేటాయిస్తారు. మిగతా రెండు భాగాలను బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారికి, పేదలకు పంచుతారు. అందుకు బక్రీద్ రోజున మేకలు, గొర్రెలకు అంత డిమాండు ఉంటుంది.