హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్? 

తెలంగాణ ప్రభుత్వంలో మరోసారి కీలక మార్పులు జరిగే సూచనలు కన్పిస్తున్నాయి. కీలకమైన పోస్టుల్లోని అధికారుల్లో మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే సీనియర్ ఐపీఎస్ లను మార్చింది తెలంగాణ సర్కార్. సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. కీలకమైన సైబరాబాద్ సీపీగా హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్న  స్టీఫెన్ రవీంద్రను అపాయింట్ చేసింది. ఇంటలిజెన్స్ ఐజీగా అనిల్ కుమార్ ను నియమించింది.   ఐపీఎస్ ల్లో మరోసారి కీలక మార్పులు ఉంటాయనే చర్చ  సీఎంవోలో సాగుతోంది. హైదరాబాద్ సీపీని కూడా మారుస్తారని అంటున్నారు. హైదరాబాద్ సీపీగా ప్రస్తుతం అంజనీకుమార్ కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్ ను నియమిస్తారని తెలుస్తోంది. సీవీ ఆనంద్ ప్రస్తుతం  డిప్యూటేషన్‌పై సీఐఎస్ ఎఫ్ లో ఉన్నారు. 1991 బ్యాచ్ కు చెందిన సీవీ ఆనంద్ కు ఇటీవలే  అదనపు డీజీపీగా కేంద్రం ఎంప్యానెల్‌ చేసింది. గతంలో సైబరాబాద్ కమిషనర్ ను విభజించక ముందు సీపీగా పని చేశారు సీవీ ఆనంద్. సైబరాబాద్ ను రెండుగా విభజించిన తర్వాత ఆయనను హైదరాబాద్ సీపీగా నియమిస్తారనే ప్రచారం జరిగింది. కాని సీవీ ఆనంద్ ను సివిల్ సప్లయ్ కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం.  కొంత కాలం  తర్వాత డిప్యూటేషన్ పై కేంద్రానికి వెళ్లారు. సీఐఎస్ ఎఫ్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఆయన తిరిగి రాష్ట్రానికి వస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు కేంద్రం నుంచి కూడా సిగ్నల్ వచ్చిందంటున్నారు. ఆయనను హైదరాబాద్ సీపీగా నియమించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని , త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు పక్కాగా చెబుతున్నాయి.  హైదరాబాద్ ప్రస్తుత సీపీ అంజనీకుమార్ ఏపీ కేడర్ కు చెందిన వారు. దీంతో ఆయనను ఏపీకి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను కోరారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి డీవోపీటీ కసరత్తు చేస్తుందని, ఇందులో భాగంగానే సీవీ ఆనంద్ డిప్యూటేషన్ ను ముగించాలనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న ఇతర కేడర్ అధికారులను ఏం చేయాలన్న దానిపైనే డీవోపీటీ కసరత్తు చేస్తుందని అంటున్నారు.    తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విషయంలోనూ కీలక పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. విభజన సమయంలో సాంకేతికంగా సోమేష్ కుమార్ ఏపీ కేడర్ కు అలాట్ అయ్యారు. అయితే ఆయన క్యాట్ ఆర్డర్ పొంది తెలంగాణలో కొనసాగుతున్నారు. ఆయన  ఏకంగా సీఎస్ బాధ్యతలు చేపట్టారు.  సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాతో పాటు మరో పది మంది సీనియర్ ఐపీఎస్ లను పక్కన పెట్టి మరీ సోమేష్ కుమార్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు కేసీఆర్. అప్పుడే సీఎస్ గా సోమేష్ నియామకంపై విమర్శలు వచ్చాయి. తాజాగా డీవోపీటీ ఈ అంశంపై ఫోకస్ చేసిందని తెలుస్తోంది. 

వైసీపీదీ ఓ గెలుపేనా? జ‌గ‌న్ విర్ర‌వీగాల్సినంత ఉందా?

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న విజ‌యం. ఈ ప్రాంతం ఆ ప్రాంతం.. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా ఏపీ వ్యాప్తంగా అధికార‌పార్టీ అభ్య‌ర్థులే గెలిచారంటూ ఆ పార్టీ శ్రేణులు సంబ‌రాలు చేసుకున్నారు. కింది స్థాయి కేడ‌ర్ అలా ఆనందించారంటే కాస్త అర్థ‌ముంది గానీ.. సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సైతం ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించిందంటూ అటు ట్విట్ట‌ర్‌లో, ఇటు మీడియా ముందు తెగ ఖుషీ అవుతూ విర్ర‌వీగ‌డం మాత్రం కామెడీగా ఉందంటున్నారు చూసినవారంతా.  ఎప్ప‌టిలానే దేవుడి ద‌య‌, ప్ర‌జ‌ల చ‌ల్ల‌ని ఆశీస్సుల‌తో తాము జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం సాధించామంటూ మ‌హా ఆనందం వ్య‌క్తం చేశారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా.. ఉబ్బు ఆపుకోలేన‌ట్టు.. ఆదివారమే ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేయ‌గా.. సోమ‌వారం మీడియా ముందుకొచ్చి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందామంటూ.. ఈ విజ‌యాన్ని కొంద‌రు ఓర్వ‌ట్లేదంటూ రొటీన్‌గా కొన్ని ప‌త్రిక‌లు, ఛానెళ్ల‌పై ఆడిపోసుకున్నారు. ఇంత‌కీ జ‌గ‌న‌న్న‌కి అంత‌టి హ్యాపీనెస్ ఎందుకో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.  అస‌లు జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగాయో కూడా చాలా మందికి గుర్తుకే లేదు. అప్పుడెప్పుడో ఐదారు నెల్ల క్రితం జ‌రిగాయి. ప్ర‌తిప‌క్షాన్ని, ప్ర‌జాస్వామ్యాన్ని ఓడించాల‌ని.. హ‌డావుడిగా వారం రోజుల్లో ఎన్నిక‌ల తంతు ముగిసేలా ఈసీతో క‌లిసి ప్ర‌భుత్వం కుట్ర‌లు చేసింద‌నే ఆరోప‌ణ ఉంది. ఇక అంత‌కుముందు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ ఆగ‌డాలు, బెదిరింపులు, కుట్ర‌లు గుర్తెరిగి.. ఈసీ తీరును త‌ప్పుబ‌డుతూ.. జ‌గ‌న్ స‌ర్కారు విధానాల‌కు నిర‌స‌న‌గా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకుంది. ఈ విష‌యాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబే స్వ‌యంగా మీడియా ముందు ప్ర‌క‌టించి.. తాము ఈ ఎన్నిక‌లను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. ఈ విష‌యం రాష్ట్ర‌ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. మ‌రి, టీడీపీ పోటీ చేయ‌ని ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఎవ‌రి మీద గెలిచిన‌ట్టు? అస‌లు పోటీయే లేనిచోట గెలుపు ఎలా ఉంటుంది? టీడీపీ ఎల‌క్ష‌న్‌ను బ‌హిష్క‌రిస్తే.. అది ఓట‌మి అవుతుందా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జ‌గ‌న్‌రెడ్డి గారు.. అని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు.  జ‌గ‌న్‌రెడ్డి ఇంత‌లా ఆనందాన్ని వ్య‌క్తం చేయ‌డానికి కార‌ణం లేక‌పోలేదంటున్నారు. ఇటీవ‌ల జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ప‌న్నుల బాదుడు, ప‌థ‌కాల్లో కోత‌, మ‌హిళ‌ల‌పై దాడులు.. ఇలా అడ్డ‌గోలు పాల‌న‌పై అన్నివ‌ర్గాల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. అందుకే, ఓట‌మి భ‌యంతోనే ఎన్నిక‌ల‌కు రెండున్న‌రేళ్ల ముందే ప్ర‌శాంత్ కిశోర్‌ టీమ్‌ను మ‌ళ్లీ రంగంలోకి దింపుతున్నార‌ని అంటున్నారు. ఆ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను క‌వ‌ర్ చేసుకోడానికే.. ఇలా మీడియా ముందుకొచ్చి.. ప్ర‌జ‌ల్లో త‌మ ప్ర‌భుత్వానికి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ఉంద‌ని.. అందుకు జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాలే నిద‌ర్శ‌ణ‌మ‌ని క‌వ‌రింగ్ ఇచ్చుకోడానికే.. దేవుడు ద‌య‌, ప్ర‌జ‌ల చ‌ల్ల‌ని ఆశీస్సుల‌తో ఘ‌న విజ‌యం సాధించామ‌ని గొప్ప‌లు చెప్పుకున్నార‌ని అంటున్నారు. టీడీపీ పోటీయే చేయ‌ని ఎన్నిక‌ల్లో గెలిచామ‌ని వైసీపీ అంత‌లా విర్ర‌వీగ‌టం త‌గునా? అదీ ఓ గెలుపేనా? జ‌గ‌న్‌కు ఆమాత్రం తెలీదా?  

రేవంత్ ట్రాప్‌లో కేటీఆర్ ఫుల్‌గా ఇరుక్కుపోయారా? ఇక బ‌య‌ట‌కు రాలేరా?

పీసీసీ చీఫ్ అయిన‌ప్ప‌టి నుంచీ రేవంత్‌రెడ్డి నోరును బాగా వాడేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆయ‌న ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా.. ఎంత ప‌రుష ప‌ద‌జాలం వాడుతున్నా.. ఇన్నాళ్లూ కేసీఆర్‌, కేటీఆర్ మౌనంగా భ‌రించారు. బ‌హుషా, రేవంత్ పేరు ఎత్త‌డం ఇష్టం లేక‌నో, లేక‌, ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై స్పందించి అంత‌గా ఇంపార్టెన్స్ ఇవ్వ‌కూడ‌ద‌నో.. కార‌ణం ఏదైనా వాళ్లిద్ద‌రూ సైలెంగ్‌గా ఉంటూ వ‌చ్చారు. మౌనంగా ఉన్న‌న్నాళ్లూ కాస్త మంచిగానే ఉన్నారు. రేవంత్ తాను అనాల్సింది అనేసి వ‌దిలేసే వారు. కానీ.. విమ‌ర్శ‌లు, తిట్లు విని విని వేసారి.. ఇక చాలంటూ, ఇక భ‌రించ‌లేనంటూ.. కేటీఆర్ మౌనాన్ని వీడారు. తాను సైతం నోటికి ప‌ని చెప్ప‌డం స్టార్ట్ చేశారు. ఇక అంతే. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న కంఫోర్ట్ జోన్ చేజారిపోయిందంటున్నారు. ఎప్పుడైతే కేటీఆర్ నోటికి ప‌ని చెప్పారో.. అప్ప‌ట్నుంచే ఆయ‌నకు ఇబ్బందులు మొద‌ల‌య్యాయ‌ని చెబుతున్నారు. అన‌వ‌స‌రంగా రేవంత్‌రెడ్డిని ఏదో అన‌బోయి.. అనుకోని చిక్కులు, ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. త‌న‌తో పాటు కేసీఆర్‌నూ క‌ష్టాల్లో ప‌డేశార‌ని అంటున్నారు. రాజ‌కీయ ఎత్తులు, జిత్తుల్లో ఆరితేరిన రేవంత్‌రెడ్డి వ్యూహాలు, ట్రాపుల ముందు కేటీఆర్ నిల‌వ‌లేక‌పోతున్నారు. అన‌వ‌స‌రంగా అందులో చిక్కుకుపోతున్నారు. రేవంత్‌రెడ్డి సృష్టించిన వైట్ ఛాలెంజ్‌లో ఇరుక్కుపోయి.. వెన‌క్కిరాలేక‌, ముందుకుపోలేక.. విల‌విల్లాడుతున్నార‌ని అంటున్నారు.  రేవంత్‌రెడ్డి ప‌దే పదే చేస్తున్న డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌ల‌కు చెక్ పెట్టాల‌నుకున్న కేటీఆర్‌.. త‌న‌కు డ్ర‌గ్స్‌తో సంబంధం లేద‌ని కావాలంటే బ్ల‌డ్, లివ‌ర్ టెస్టుల‌కు రెడీ అంటూ స‌వాల్ విసిరి తాను మిస్ట‌ర్ క్లీన్ అని చెప్ప‌ద‌ల‌చుకున్నారు. భ‌లే మంచి ఛాన్స్ అంటూ చిట్‌చాట్‌గా అన్న ఆ డైలాగ్‌ను రేవంత్‌రెడ్డి బ‌హు బాగా వాడేసుకున్నారు. వైట్ ఛాలెంజ్ అంటూ కేటీఆర్‌ను ఊబిలోకి లాగేశారు. ఓ ప్లేసు, ముహూర్తం పెట్టేసి అక్క‌డి వ‌స్తా.. నువ్ కూడా రా అంటూ కేటీఆర్‌ను క‌వ్వించారు. ఆయ‌న ఎలానూ రారు కాబ‌ట్టి మ‌రింత కార్న‌ర్ చేసేలా.. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డితో క‌లిపి వైట్ ఛాలెంజ్ అనే ట్రాప్ త‌యారు చేశారు. అది ట్రాప్ అని తెలిసి.. అందులో చిక్క‌కుండా ఎంత త‌ప్పించుకుందామంటే.. అంత‌లా మ‌రింత చిక్కుకుపోతున్నారు కేటీఆర్‌. రేవంత్‌రెడ్డి ప‌న్నిన ఉచ్చు అలా ఉంది మ‌రి. కేటీఆర్ కాస్త హుషారుత‌నం ప్ర‌ద‌ర్శించి డ్ర‌గ్‌ టెస్టుల‌కు తాను రెడీ కానీ.. రాహుల్‌గాంధీ కూడా రెడీ అయితే.. ఢిల్లీ ఎయిమ్స్‌లో టెస్టులకు ఓకే అన్నారు. ప‌నిలో ప‌నిగా రేవంత్‌ను కార్న‌ర్ చేసేలా.. ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా? అంటూ తానేదో కాంగ్రెస్‌ను బాగా కార్న‌ర్ చేశాన‌నుకొని తెగ ఖుషీ అయిన‌ట్టున్నారు. కానీ, పాద‌ర‌సంలా స్పందించిన రేవంత్‌రెడ్డి.. ఏకంగా కేసీఆర్‌నే అందులో ఇరికిస్తూ.. లైడిటెక్ట‌ర్ టెస్ట్‌కు నేను రెడీ.. బ‌ట్‌, ఈఎస్ఐ కేసు, సహారా పీఎఫ్‌ అక్రమాలపై లైడిటెక్ట‌ర్ పరీక్షలకు కేసీఆర్‌ సిద్ధమా? అని రేవంత్ మరింత ర‌చ్చ రాజేశారు. రేవంత్ నుంచి ఇలాంటి కౌంట‌ర్ వ‌స్తుంద‌ని.. తాను రాహుల్‌ను ఇరికించాల‌నుకుంటే, రేవంతేమో కేసీఆర్‌ను ఇబ్బందుల్లో ప‌డేస్తార‌ని అస్స‌లు ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. ఇక వైట్ ఛాలెంజ్‌తోనూ కేటీఆర్ ఫుల్‌గా ఇరుక్కుపోయారంటున్నారు. కేటీఆర్ ఎలాగూ స్పందించ‌ర‌ని.. వ్యూహాత్మ‌కంగా కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిని రంగంలోకి దింపారు రేవంత్‌రెడ్డి. ఆయ‌నేమో వైట్ ఛాలెంజ్‌కి రెడీ అంటూ.. మ‌రో ఇద్ద‌రిని నామినేట్ చేశారు. అందులో ఒక‌రు బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ కావ‌డం రాజ‌కీయంగా కీల‌కంగా మారింది. బండి గ‌నుక ఆ ఛాలెంజ్‌ను స్వీక‌రించ‌క‌పోతే.. ఇక‌పై డ్ర‌గ్స్‌పై గొంతెత్తే నైతిక అర్హ‌త ఆయ‌న కోల్పోవాల్సి వ‌చ్చేది. అదే రేవంత్ వ్యూహం. కానీ, అనూహ్యంగా బండి సంజ‌య్ సైతం వైట్ ఛాలెంజ్‌ను స్వీక‌రించారు. అక్టోబ‌ర్ 2 త‌ర్వాత ఎప్పుడైనా టెస్టుల‌కు తాను సిద్ద‌మ‌న్నారు. అంతే. ఒక్క‌సారిగా కేటీఆర్ షాక్‌. పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్ విసిరిన ఛాలెంజ్‌కి.. బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ సైతం సై అన‌డం.. కేటీఆర్‌కు మ‌రింత క‌ష్టాలు తెచ్చిపెట్టింద‌ని అంటున్నారు. కాంగ్రెస్‌కు బ‌ద్ద శ‌త్రువైన బీజేపీనే రెడీ అంటుంటే.. కేటీఆర్ మాత్రం సైలెంట్‌గా ఉంటే.. ఏదో ఉంద‌నే అనుమానం రాకుండా ఉంటుందా? అందులోనూ రేవంత్‌రెడ్డి ప‌దే ప‌దే కేటీఆర్‌.. డ్ర‌గ్స్‌.. గోవా.. ర‌కుల్‌.. అంటూ ఫెవికాల్‌ లింకులు పెడుతుంటే.. అందులోనుంచి లాక్కోలేక‌, బ‌య‌ట‌ప‌డ‌లేక కేటీఆర్ తెగ ఇదై పోతున్నార‌ట‌. అన‌వ‌స‌రంగా నోరు జారానా? ఎప్ప‌టిలానే నోరు మూసుకొని ఉంటే బాగుండేదా? అనే డిఫెన్స్‌లో ప‌డేలా చేయ‌డంలో రేవంత్‌రెడ్డి బాగా స‌క్సెస్ అయ్యార‌ని అంటున్నారు. అయినా, ఏదోర‌కంగా తాను స‌చ్చీలుడ‌ని నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో రేవంత్‌రెడ్డిపై ప‌రువున‌ష్టం దావా వేసి.. ఆ విధంగా న‌రుక్కొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి, ఆ స్ట్రాల‌జీ అయినా కేటీఆర్‌కు ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి. మొత్తానికి రేవంత్ ప‌న్నిన ఉచ్చు మామూలుగా లేదు మ‌రి.  

రేవంత్ రెడ్డిని ఢీకొట్టేదెలా? కేసీఆర్ తో బీజేపీ పెద్దల చర్చ? 

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. మూడు నెలల క్రితం పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి సీన్ మారిపోయిందని అంటున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రాకముందు ఒకలా.. వచ్చిన తర్వాత ఒకలా రాజకీయం మారిపోయిందంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ కనిపించిందని, ప్రస్తుతం మాత్రం బీజేపీ వెనకబడి పోయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.  బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాల ముందు నిలవలేకపోతున్నారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న దళిత గిరిజన దండోరా సభలకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తుందని అంటున్నారు. ఇక సెప్టెంబరు 17న బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహించాయి. నిర్మల్ లో జరిగిన బీజేపీ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అదే రోజు కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో దళిత గిరిజన దండోరా సభ నిర్వహించారు రేవంత్ రెడ్డి. రెండు పార్టీలు సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జనాలు కూడా ఆసక్తి కనబరిచారు.  అయితే నిర్మల్ బీజేపీ సభ కంటే రేవంత్ రెడ్డి గజ్వేల్ సభకే జనాలు ఎక్కువగా వచ్చారు. ఇదే ఇప్పుడు బీజేపీకి ఇబ్బందిగా మారింది. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీలో ఊహించని ఫలితాలతో తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని భావించింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఖాయమని కూడా కమలనాధులు చెబుతూ వస్తున్నారు. రాష్ట్రంలో పొలిటికల్ సీన్  కూడా టీఆర్ఎస్ కు బీజేపీనే పోటీ ఇస్తుందనేలా కనిపించింది. అందుకే కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు కాషాయ గూటికి చేరారు. కాని రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రావడంతో కాంగ్రెస్ లో జోష్ వచ్చింది. వరుసగా నిర్వహిస్తున్న సభలతో ఆ పార్టీ కేడర్ యాక్టివ్ అయింది.  రేవంత్ రెడ్డి దూకుడుతో బీజేపీ అంచనాలు తప్పాయనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కు  పోటీ మళ్లీ కాంగ్రెస్ అనేది ప్రజలకు అర్ధమైందని అంటున్నారు పరిశీలకులు. రేవంత్ దెబ్బకు తెలంగాణలో బీజేపీ వెనుకకు వెళ్లిందనే చర్చ సాగుతుంది. బీజేపీ నేతల అభిప్రాయం కూడా ప్రస్తుతం అలానే ఉంది. రాష్ట్రంలో రోజు రోజుకు కాంగ్రెస్ బలపడుతుండటంతో కమలం నేతల్లో కలవరం మొదలైందని తెలుస్తోంది.  రేవంత్ దెబ్బకు మనం పుంజుకోవడం కష్టమేనని.. బీజేపీ హైకమాండ్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డిని నిలువరించాలంటే.. ఏం చేయాలనే విషయంపై బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని ఎలా కట్టడి చేయాలనే  విషయంలో సీఎం కేసీఆర్ కూడా బీజేపీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దీనిపై బీజేపీ పెద్దలతో మాట్లాడినట్లు చెబుతున్నారు. రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు.. ఓటు కు నోటు కేసును తిరిగదోడాలనే చర్చ కూడా వచ్చిందని అంటున్నారు.  ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు రేవంత్ రెడ్డి. కేసును తిరగతోడి బెయిల్ రద్దు చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య  వచ్చిందంటున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డిని మరోసారి జైలుకు పంపిస్తే.. ఆయనకు మైలేజీ మరింత పెరిగే అవకాశం ఉందనే వాదన కూడా కొందరు నేతల నుంచి వచ్చిందట. దీంతో రేవంత్ రెడ్డికి ఎలా బ్రేకులు వేయాలన్న అంశంపై కమలనాధులు సీరియస్ గా చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. చూడాలి మరీ.. ఏం జరుగుతుందో... 

టీటీడీ జంబో పాలకమండలిపై హైకోర్టులో పిల్..

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి నియామకంపై వివాదం ముదురుతోంది.  జంబో బోర్డుపై తీవ్ర విమర్శలు వస్తుండగా.. తాజాగా హైకోర్టులో పిల్‌ దాఖలైంది. టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ పిల్‌ వేశారు. పాలకమండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం చట్ట విరుద్ధమని, దీని వల్ల సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బందని చెప్పారు.  హిందూ ధర్మాదాయ, దేవాదాయ చట్టానికి ఈ నియామకాలు విరుద్ధమని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పాలకమండలిపై ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను కొట్టివేయాలన్నారు.  టీటీడీ కొత్త బోర్డు ఎంపికపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. టీటీడీ బోర్డు ఎంపికపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసింది. భారీ ఎత్తున ప్రత్యేక ఆహ్వానితులకు చోటు కల్పించారంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. జగన్ ఆధ్వర్యంలో వైసీపీ సర్కారు టీటీడీ బోర్డు విషయంలో గతంలో ఎన్నడూలేని కొత్త సంస్కృతికి తెరదీసిందని ఆరోపించారు. సాధారణ బోర్డుకు అదనంగా 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో టీటీడీ బోర్డును ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. హిందూ దేవాలయాల విషయంలో, ధార్మిక చింతనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి రాజకీయ చర్యలను తాము నిరసిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రభుత్వం నియమించిన 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరామని వెల్లడించారు. ఈ మేరకు వినతిపత్రం అందించామని తెలిపారు. టీటీడీ అంశంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని సోము వీర్రాజు చెప్పారు. 

వైసీపీ ఎంపీ రౌడీషీటర్లు, భూకబ్జాదారుల లీడర్.. వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టిందా? పార్టీలో నేతల మధ్య అంతర్గత పోరాటం ముదిరిపోయిందా? త్వరలోనే  వైసీపీలో సంచలనాలు జరగబోతున్నాయా? అంటే వైసీపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. సొంత పార్టీ నేతలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కుతున్నారు. తమ అక్రమాలు, అరాచకాలను బయటపెట్టుకుంటున్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు చేసుకోవడం కలకలం రేపుతోంది.  తాజాగా రాజమండ్రి వైసీపీలో కోల్డ్ వార్ భగ్గుమంది. ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య  కొంత కాలంగా అంతర్గతంగా సాగుతున్న వివాదం బహిర్గతమైంది. ఎంపీ భరత్‌పై ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో భరత్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.  సీఎం జగన్‌ను ఇబ్బందిపెట్టిన మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణతో కలిసి భరత్ సెల్ఫీలు తీసుకున్నారని ఆరోపించారు.  ఎంపీ భరత్ వెనుక రౌడీషీటర్లు, భూకబ్జాదారులు ఉన్నారని ఆరోపించారు జక్కంపూడి రాజా. భరత్‌ చిల్లర పనులు మానుకోవాలని జక్కంపూడి హెచ్చరించారు. భరత్‌ రాజానగరంలో దళితులు, గిరిజనులు, బీసీలను రెచ్చగొడుతున్నారని, భరత్‌ తనపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి.. తూచ్ అంటున్నారని జక్కంపూడి రాజా మండిపడ్డారు. వైసీపీ ఎంపీపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా రౌడీ షీటర్లు, భూకబ్జాదారులకు ఎంపీ వంత పాడుతున్నారన్న రాజా వ్యాఖ్యలపై సంచలనంగా మారాయి.   

కేటీఆర్ తన వెంట్రుకతో సమానమన్న రేవంత్ రెడ్డి..

తెలంగాణ రాజకీయాల్లో వేడి మరింత రాజుకుంది. మంత్రి కేటీఆర్, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పరస్పర సవాళ్లు, హాట్ కామెంట్లు కాక రేపుతున్నాయి. డ్రగ్స్ వాడేవాళ్లకు కేటీఆర్ బ్రాండ్ అంబాసడర్ అంటూ  రేవంత్ చేసిన ఆరోపణలపై రచ్చ ముదురుతోంది. టెస్టుకు తాను సిద్ధమని, అయితే తనతో పాటు రాహుల్ గాంధీ కూడా పరీక్షలు చేయించుకోవడానికి రావాలంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు మీరు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ విసిరిన సవాల్ కు రేవంత్ అదే స్థాయిలో ప్రతిస్పందించారు. లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని... సహారా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కుంభకోణాల్లో సీబీఐ కేసుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. కేసీఆర్ సిద్ధమైతే టెస్టుకు తాను కూడా సిద్ధమని... టైమ్, ప్లేస్ చెప్పాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద వేచి చూస్తుంటానని... దమ్ముంటే రావాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు.  అన్నట్లుగానే గన్ పార్క్ దగ్గరకు వచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్సైజ్ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదు? ఐపీఎస్‌ అధికారి అకున్ సభర్వాల్ కమిటీ ఏమైంది? అని ప్రశ్నించారు. మంచి ట్రాక్ రికార్డు ఉన్న అకున్ సబర్వాల్ ను డ్రగ్స్ కేసు విచారణలో ఉండగానే ఎందుకు తప్పించారని రేవంత్ నిలదీశారు. బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ వరకూ పబ్బులు వ్యాప్తి చెందాయని, విదేశాల నుంచి వచ్చిన డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువైందని అన్నారు. కేటీఆర్‌కి బాధ్యత లేదా? పిల్లలు డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు’’ అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసు చర్చ పక్కదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  మీ ఆస్తులు అడగడం లేదు. రానా, రకుల్ ప్రీత్ సింగ్‌ని ఈడీ పిలిచింది. వాళ్ళని నేను అంటుంటే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని అన్నారు. కేసులు వేస్తం అని బెదిరిస్తున్నారు.. కేటీఆర్ నీ స్థాయి పెద్దది అనుకుంటున్నావు. నువ్వు ఎమ్మెల్యే కాకముందే నేను ఎమ్మెల్సీ అయ్యాను. నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే‌గా కేవలం 100 ఓట్లతోనే గెలిచావు అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి.  రాజకీయాల పరంగా చూస్తే కేటీఆర్  తన వెంట్రుకతో సమానమంటూ హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. డ్రగ్ టెస్టుకు సిద్ధమని చెప్పి తోక ముడిచారని మండిపడ్డారు. డ్రగ్స్ టెస్టుకి రాహుల్ గాంధీని రమ్మని చెప్పిన కేటీఆర్.. ఇవాంక ట్రంప్‌ని కూడా రమ్మని అడుగుతారేమో అంటూ సెటైర్లు వేశారు,  డ్రగ్స్‌తో నీకు సంబంధం ఉందని అన్నామా. నువ్వే డ్రగ్స్ టెస్టుకు సిద్ధమేనని సవాల్ చేశావు. కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ సవాల్ నేను స్వీకరించకపోతే... జనానికి అనుమానం వస్తుంది. ఆయన చెప్పిన మాటలకు నేను వైట్ ఛాలెంజ్ అని విసిరా. కేటీఆర్‌ని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే. కేటీఆర్ స్లీపింగ్ ప్రెసిడెంట్‌గా మారిపోయాడని రేవంత్ విమర్శించారు. మరోవైపు సిటీ సివిల్‌కోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా.. తన పేరును వాడుతున్నారని కేటీఆర్‌ పిటిషన్‌‌లో పేర్కొన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రగ్స్‌ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న.. వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు.. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును మంత్రి కోరారు. రేవంత్‌రెడ్డిని తగిన విధంగా కోర్టు శిక్షిస్తుందని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు

ఈ తప్పుకి కారణమెవరు?.. ఆరేండ్ల చిన్నారి హత్యపై యువకుడి లేఖ వైరల్..

హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఆరేండ్ల చిన్నారిపై హత్యాచారం కేసు తెలంగాణను షేక్ చేసింది. వారం రోజులైనా నిందితుడు దొరక్కపోవడంతో ప్రభుత్వం రోడ్డున పడింది. వేలాది మంది పోలీసులు దొరికినా నిందితుడు రాజు దొరకలేదు.. చివరికి ఆ మృగాడు రైలు కింద పడి సూసైడ్ చేసుకోవడంతో పోలీసులు ఊపీరీ పీల్చుకున్నారు. అయితే  రాజు చావుతో ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టేనా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.  నిందితుడు పెరిగిన నేపధ్యం, సింగరేణి కాలనీలో గంజాయి మత్తు, వంటి  ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఇలాంటి సమస్యలకి శాశ్విత పరిష్కారం దొరకడం దాదాపు అసాధ్యమే. తాజాగా సింగరేణి చిన్నారి ఘటనపై ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్  వైరల్ అవుతోంది., అందరిని ఆలోచింప చేస్తోంది. ఆ యువకుడు రాసిన పోస్ట్ యధావిధిగా.. నా పేరు అజ్జు.. అజహరుద్దీన్. నేను జాబ్ చేసే ప్లేస్ కు హైదరాబాద్ లోని సింగ‌రేణి కాల‌నీ అతి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అక్క‌డ నివసించే కుటుంబాల‌న్నీ పొట్ట‌చేత ప‌ట్టుకుని వ‌ల‌స వ‌చ్చిన‌వే. బాధితురాలు కుటుంబం, నిందితుడు రాజు కుటుంబం కూడా అలా వ‌చ్చిన‌వే. ఇప్పుడు ఆ సింగరేణి కాలనీ గురించి కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. 6 ఏళ్ల పసి బిడ్డతో ఎవరైనా లైగింకానందాన్ని పొంద‌గ‌ల‌రా? లేదు. మ‌రి ఆ సమయంలో రాజు అలా ఎందుకు ప్రవర్తించాడు? అతనిలో పైశాచిక‌త్వం దానికి కారణం. మ‌రి.. ఆ పైశాచిక‌త్వానికి కార‌ణం ఏమిటి? మందు, గంజాయి, వైట్నెర్ ఇలా ఒక్కటేమిటి? కావాల్సినన్ని మత్తు పదార్ధాలు. నిజానికి సింగరేణి కాలనీలో చాలా కుటుంబాల‌ జీవనాధారం ఈ మత్తు పదార్ధాలను అమ్మడమే. ఒక‌రోజు రాత్రి 12 గంట‌ల ప్రాంతంలో నేను సింగ‌రేణి కాల‌నీ నుండి వెళ్తుంటే.. ముగ్గురు మ‌హిళ‌లు రోడ్డుపై ఆపారు. ఆ పనికి ర‌మ్మంటూ క‌వ్వించారు. ఇక్కడ చాలా కుటుంబాలకు వ్యభిచారం ఓ జీవనాధారం. నేను దానికి ఒప్పుకోకపోవడంతో బెదిరింపుకు పాల్ప‌డ్డారు. జేబులో ఉన్న‌ డబ్బు ఇవ్వమని రౌండ‌ప్ చేశారు. అప్ప‌డే అటుగా పోలీసులు రావ‌డంతో బ‌య‌ట‌ప‌డ్డాను. “నీ ఇంటికి ఇది షార్ట్ క‌ట్ రూట్ అయినా.. నువ్వు వేరే రూట్ చూసుకో ఈ ఏరియా అంత సేఫ్ కాదు”. అప్పుడు నాతో పోలీసులు అన్న మాట ఇది. నాకొక డౌట్.. సింగ‌రేణి కాల‌నీ ఏమైనా అప్ఘ‌నిస్తాన్ లో ఉందా? మరోసారి బోనాల పండుగ‌. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాప్ లు బంద్. కానీ.., సింగ‌రేణి కాల‌నీకి వెళ్తే, బ్లాక్ లో మాకు ఓ వైన్స్ షాప్ కి స‌రిప‌డ మందు కనిపించింది. అక్కడి చిన్న పిల్ల‌లు సైతం ఈ బిజినెస్ లో క‌నిపిస్తారు. ఈ బిజినెస్ పోటా పోటిగా ..క‌స్ట‌మ‌ర్ల కోసం వాళ్ల‌లో వాళ్లే గొడ‌వ ప‌డేంతగా సాగుతోంది. సింగరేణి కాలనీలో టీనేజ్ పిల్ల‌లు సైతం పొగ‌లు ఊదుకుంటూ క‌నిపిస్తారు. అవి సిగ‌రెట్ పొగ‌లు కావు. గంజాయితో నిండిన పొగ‌లు. కాలేజ్ స్టూడెంట్స్ కు గంజాయి స్పాట్స్ ఇక్క‌డి పాన్ షాప్ లు! డ‌బ్బులేని వాళ్ల‌కు వైట్న‌ర్ లు కూడా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే ఇక్కడ లభిస్తాయి. చెత్త‌ను సేక‌రిస్తూ కొన్ని కుటుంబాలు, దొరికిన ప‌ని చేస్తూ జీవితాన్ని వెళ్లేదీసే కొన్ని ఫ్యామిలీస్, వారి క‌ష్టాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని అనైతిక బిజినెస్ లు ఇక్కడ ఎక్కువ. ఈ కాలనీలో ఎంత మంది ఉంటున్నారో తెలియ‌దు, ఎవ‌రెవ‌రు ఉంటున్నారో తెలియ‌దు. ఎవ‌రొస్తున్నారో కూడా తెలియ‌దు. ఆ కాల‌నీ అంతా అస్త‌వ్య‌స్త ఓ ప‌ద్మ‌వ్యూహం. కానీ.., ఓట్ల లెక్కింపు మాత్రం ఇక్కడ క్రిస్ట‌ల్ క్లియ‌ర్! రాజును ఇలా రాక్షసుడుగా మారడానికి ఈ దుర‌ల‌వాట్లు, వాటికి త్వ‌ర‌గా అల‌వాటు ప‌డేలా చేసిన ఆ వాతావ‌ర‌ణం కారణం. ఏది మంచి, ఏది చెడు అని తెల్సుకోలేని అతని అజ్ఞానం కారణం. స‌రిగ్గా అంద‌ని నిర్భంద విద్య‌, అవ‌గాహ‌న క‌ల్పించ‌లేని చ‌ట్టాలు. ఉపాధి క‌ల్పించ‌లేని విధానాలు, ఓటరుగా త‌ప్ప రేప‌టి భ‌విష్య‌త్ గా చూడ‌ని రాజ‌కీయాలు అందుకు కారణం. రాజు ఆత్మ‌హ‌త్య‌తో నేర‌స్తుడు చ‌చ్చాడు. మ‌రో నేరం జ‌రిగే వ‌ర‌కు ప్ర‌జ‌ల ఆవేశాలు చ‌ల్ల‌బ‌డ‌తాయి.! మ‌ళ్లీ రాజు లాంటి మ‌రో ‘బూజు’ వ‌చ్చాక.. నిందితుడిని ఎన్ కౌంట‌ర్ చేయండి అంటూ మ‌ళ్లీ పాత నినాదాలే స‌రికొత్త‌గా వినిపిస్తాయి. కానీ.., సమస్య మూలలను మాత్రం మనం మార్చే ప్రయత్నం చేయడం లేదు. మనం అంటే మొత్తం వ్యవస్థ. ఇది ఆ యువకుడు చేసిన పోస్ట్. ప్రతి అక్షరంలో నిజం ఉంది. ఒక్క సింగరేణి కాలనీ పరిస్థితి మాత్రమే కాదు.. మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ నుండే రాజు లాంటి మృగాలు తయారు అవుతున్నాయి. అవి మన బిడ్డల జీవితాలను చిదిమేస్తున్నాయి.మరి..ఈ తప్పుకి ఎవరిని నిందించాలి?

ఐటీ రైడ్స్‌పై సోనూసూద్ స్పంద‌న‌.. ఆయ‌న ఏమ‌న్నారంటే...

సోనూసూద్ ఇల్లు, కార్యాల‌యాల‌పై నాలుగు రోజుల పాటు ఐటీ సోదాలు. 20 కోట్ల వ‌ర‌కూ ప్ర‌భుత్వానికి ప‌న్నులు ఎగ్గొట్టార‌ని తేల్చారు. ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో సోనూసూద్ ట్ర‌స్ట్‌కు 18 కోట్ల వ‌ర‌కూ విరాళాలు వ‌స్తే.. అందులో కేవ‌లం 1.9 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని.. మిగ‌తా డ‌బ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని ఐటీ అధికారులు బ‌హిర్గ‌తం చేశారు. ఇలా ప్ర‌ముఖ న‌టుడు, స‌మాజ సేవ‌కుడు సోనూసూద్ గురించి ఐటీ శాఖ బ‌య‌ట‌పెట్టిన సంచ‌ల‌న విష‌యాలు ఆయ‌న ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేశాయి. ఇంత‌కీ సోనూసూద్ మంచోడా? చెడ్డోడా? అనే అనుమానాలు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దీంతో.. నాలుగు రోజుల ఐటీ రైడ్స్ త‌ర్వాత సోనూసూద్ స్పందించారు. ఆ మేర‌కు ట్వీట్ చేశారు. విషయమేదైనా సరే సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అన్నారు.  ‘ఏ విషయంలోనైనా ప్రతిసారీ నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. మంచి మనస్సుతో భారతదేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సాయం కోసం చూసే ప్రజలతోపాటు ఒక విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోంది. నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగాను వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం వినియోగించాలని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్‌ సంస్థలకు సూచించాను. అలా, మా ప్రయాణం కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల నుంచి వ్యక్తిగత పనుల్లో (ఐటీ దాడులు) బిజీగా ఉండటం చేత మీకు అందుబాటులో లేను. మళ్లీ సేవలందించేందుకు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాను’ అంటూ సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు. 

ఏపీ సీఎం రహస్య ఎజెండా? పిల్లల మెదళ్ళలో విష బీజాలా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరు రాజకీయ నాయకుల వంటి రాజకీయ నాయకుడు కాదు. అందరు ముఖ్యమంత్రుల వంటి ముఖ్యమంత్రి కాదు. ఆయనకొక ప్రత్యేక జెండా అజెండా ఉన్నాయి. అందులో ప్రధానమైనది, ప్రభు సేవ, క్రైస్తవ మత ప్రచారం.రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా మార్చడం, అన్న అనుమానాలు, ఆరోపణలు అది నుంచి ఉన్నాయి, ఒక పెద్దాయన అన్నట్లుగా ఆయనలో ఒక కనిపించని దేవుడున్నాడు. ఆయన వేసే ప్రతి అడుగు ఆ లక్ష్యం, ఆగమ్యం వైపుగా వేసే మరో ముందడుగే అవుతుందని ఆయన అనుచర, సహచరులు అందరు కాకున్నా కొందరు గిట్టిగా నమ్ముతారు. పాస్టర్లకు జీతాలు వంటి ప్రత్యక్ష ప్రోత్సహాకాలు,దేవాలయాలపై దాడులవంటి హిందూ విద్వేష, హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలే కాదు, చాపకిందనీరులా అన్యమత ప్రచారానికి అడ్డుగా నిలుతున్న భాష, సంస్కృతులను ప్రజల మనసుల నుంచి తుడిచెడుకు అవసరమైన అనుకూల పరిస్థితులు కల్పించే దీర్ఘకాల ప్రణాళికలు కూడా ఉన్నయని అంటారు.  ఇప్పటికీ ప్రాధమిక స్థాయిలో అంగ్ల బోధనను తప్పనిసరి చేసిన జగన్ రీడ్డి ప్రభుత్వం ,తెలుగుకు తిలోదకాలు ఇస్తూ అన్ని ప్రభుత్వ,ప్రైవేటు డిగ్రీ  కళాశాలల్లోనూ తెలుగుకు బదులుగా ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధించాలని జారే చేసిన ఉత్తర్వులు ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తాజా ఉత్తర్వులు అమలు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలు రెండూ అందుబాటులో ఉండగా, ఇకపై ఇంగ్లిష్ ఒక్కటే అమలు కానుంది. అంతేకాదు, విద్యార్థులందరూ ఇకపై ఇంగ్లిష్ మీడియంలోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతేడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో మొత్తం 2,62,805 మంది ప్రవేశాలు పొందగా, వారిలో 25 శాతం మంది అంటే 65,701 మంది మాత్రమే తెలుగు మీడియంలో చేరారు. వీరిలోనూ ఎక్కువమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉన్నారు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడంతో వీరంతా తెలుగులో చదివే అవకాశాన్ని కోల్పోనున్నారు. మరోపక్క  ప్రభుత్వ నిర్ణయంపై భాషాభిమానులు, సామాన్య ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. ఉన్నత విద్యను మాతృభాషలో అభ్యసించేలా నూతన జాతీయ విద్యావిధానం అవకాశం కల్పిస్తోందని, కానీ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరుగుతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిజానికి, ఇలా చాపకింద నీరులా, మతం మత్తును విద్యార్ధుల మెదళ్ళలో ఎక్కించడం ఇదే మొదలు కాదు ఇదే చివరి ప్రయత్నం కూడా కాదు.. ఎన్ని ఎదురు దెబ్బలు జరిగినా, ప్రయతనాలు మాత్రం ఆగడం లేదు. ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం,. ఎవరో మాట ప్రచారకులు కాదు.. ప్రభుత్వమే చేస్తోందనే ఆరోపణలున్నాయి. ప్రాధమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మాధ్యమంలో మాత్రమే బోధన చేయాలనే వివదాస్పద ఉత్తర్వులు మొదలు నిన్న మొన్న వెలుగు చూసిన ఐదవ తరగతి విద్యార్ధులకు అభ్యాస పాఠంగా గుణదల మేరీ మాత చర్చి సందర్శనను చేర్చడం వరకు అనేక ఉదంతాలు ఉన్నాయి.  ఇలా పిల్లల మెదళ్ళలో మత బీజాలు నాటి  మత మార్పిడులను ప్రోత్సహించే కుట్ర ఇందులో దాగుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే, తెలుగు బాష, తెలుగు సంస్కృతీ మీద, హిందువుల పండగలు, సంప్రదాయాల మీద ప్రభుత్వ జరుగుతున్న దాడులు అన్నీ ముఖ్యమత్రి జగన్ రెడ్డి రహస్య అజెండాలో భాగంగానే సాగుతున్నాయని, సామాన్య ప్రజలే కాదు అంతర్గత వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి.

ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టులో షాక్‌..

ఏపీ ఫైబ‌ర్ నెట్ కేసుతో ప‌లువురికి ఉచ్చు బిగుస్తోంది ఏపీ ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే ఈ కేసులో ప‌లువురిని అరెస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ కు సంబంధించిన కేసులో రెండు రోజుల కిందట అరెస్టైన ఐఆర్‌టీఎస్‌ అధికారి కోగంటి సాంబశివరావుకు.. తాజాగా హైకోర్టులో ఊరట లభించింది.  మధ్యంతర బెయిల్ పిటిషన్‌తో పాటు సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టేయాలని ఇప్ప‌టికే సాంబ‌శివ‌రావు హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లపై విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. 48 గంటల్లో బెయిల్‌ రాకపోతే తన ఉద్యోగం పోతుందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సాంబశివరావుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.   ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన తొలి దశ టెండర్లను గత ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సాంబశివరావును సీఐడీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి కావ‌డంతో అరెస్ట్ అయి విధుల‌కు హాజ‌రుకాక‌పోతే ఉద్యోగం పోయే ప్ర‌మాదం ఉంది. అందుకే, ఆయ‌న హుటాహుటిన హైకోర్టును ఆశ్ర‌యించ‌డం.. హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ఇవ్వ‌డంతో సాంబ‌శివ‌రావుకు ఊర‌ట ల‌భించిన‌ట్టైంది.    

బండి సంజ‌య్‌కు 'వైట్ ఛాలెంజ్‌'.. రేవంత్ రెడ్డి ఖతర్నాక్ స్కెచ్

తెలంగాణ రాజ‌కీయం కాక రేపుతోంది. వైట్‌ ఛాలెంజ్‌తో అగ్గి రాజుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్టార్ట్ చేసిన వైట్ ఛాలెంజ్‌తో మొద‌ట మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. ఆయ‌న‌తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డికి సైతం ఛాలెంజ్ విసిరారు. రేవంత్ విసిరిన వైట్ ఛాలెంజ్‌ను కేటీఆర్ స్వీక‌రించ‌లేదు. కొండా మాత్రం వైట్ ఛాలెంజ్‌కు సై అన్నారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు అమ‌ర‌వీరుల స్థూపం ద‌గ్గ‌రికి చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి.. మ‌రో ఇద్ద‌రికి సైతం వైట్ ఛాలెంజ్ విసిరారు. ఇదే ఇప్పుడు మ‌రింత ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  వైట్ ఛాలెంజ్‌తో వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ వేశారు రేవంత్‌రెడ్డి. ఆ ఛాలెంజ్‌కు.. ఫ‌స్ట్ టార్గెట్‌ కేటీఆర్ కాగా.. సెకెండ్ టార్గెట్ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ అయ్యారు. రేవంత్‌రెడ్డి నుంచి వైట్ ఛాలెంజ్ తీసుకున్న కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి తాను సైతం మ‌రో ఇద్ద‌రికి వైట్ ఛాలెంజ్ విసిరారు. అందులో ఒక‌రు బండి సంజ‌య్ కాగా.. ఇంకొక‌రు బీఎస్పీ తెలంగాణ బాధ్యులు ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌. వీరిద్ద‌రికీ కొండా వైట్ ఛాలెంజ్ విస‌ర‌డం రాజ‌కీయంగా అత్యంత ఆస‌క్తిక‌రం. రేవంత్ వైట్ ఛాలెంజ్ విసిరితే.. కేటీఆర్ స్వీక‌రించ‌లేదు. దీంతో కేటీఆర్‌ను దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌,, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరితే.. బీజేపీ అధినేత బండి సంజ‌య్ స్పీక‌రిస్తారా? అంటే అనుమాన‌మే. ఆయ‌న స్వీక‌రించ‌క‌పోతే బండి సంజ‌య్‌ను సైతం ఇర‌కాటంలో ప‌డేసే ఎత్తుగ‌డ‌లా క‌నిపిస్తోంది. ఇక ఒక్క వైట్ ఛాలెంజ్‌తో.. వెంట‌వెంట‌నే ఇటు కేటీఆర్‌, అటు బండి సంజ‌య్‌ల‌ను టార్గెట్ చేసి.. రాజ‌కీయంగా పూర్తి ప్ర‌యోజ‌నం పిండుకునే ప్ర‌య‌త్నం స‌క్సెస్‌ఫుల్‌గా చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ విష‌యంలో రేవంత్‌రెడ్డి మాస్ట‌ర్ ప్లాన్ బాగా వ‌ర్క‌వుట్ అయిన‌ట్టే ఉంది.  ఇక‌, ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ వైట్ ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తారా?  స్వీక‌రిస్తే.. ఆయ‌న ఏ ఇద్ద‌రికి మ‌ళ్లీ వైట్ ఛాలెంజ్ విసురుతారోన‌నేది మ‌రింత ఆస‌క్తిక‌రం కానుంది. ఒక‌వేళ స్వీక‌రించ‌క‌పోతే.. వైట్ ఛాలెంజ్ ఇక్క‌డితోనే ముగుస్తుంది. ముగిస్తే.. వైట్ ఛాలెంజ్‌తో ఇర‌కాటంలో, ఇబ్బందిలో ప‌డ్డది ఇద్ద‌రే ఇద్ద‌రు.. ఒక‌రు కేటీఆర్‌. ఇంకొక‌రు బండి సంజ‌య్. వారెవా.. వైట్ ఛాలెంజ్‌. రేవంత్‌రెడ్డి స్ట్రాట‌జీ అదుర్స్ అంటున్నారు.   

విజ‌య‌వాడ డ్ర‌గ్స్ అడ్డానా? 9వేల కోట్ల హెరాయిన్ మిస్ట‌రీ ఏంటి?

అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ ముఠా. 9వేల కోట్ల హెరాయిన్ ప‌ట్టివేత‌. యావ‌త్ దేశం షాక్‌. ఇండియా ఉలిక్క‌ప‌డింది. ఆ భారీ డ్ర‌గ్స్ దందాలో విజ‌య‌వాడ పేరు బ‌య‌ట‌కు రావ‌డం మ‌రింత క‌ల‌క‌లం. ఆ 9వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ విజ‌య‌వాడ‌కే స‌ప్లై కానుంద‌ని తెలిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవాక్కైంది. అదేంటి, మ‌న బెజ‌వాడ‌కు 9వేల కోట్ల హెరాయిన్ త‌ర‌లిస్తున్నారా? అంటూ ప్ర‌జ‌లంతా నోరెళ్ల‌బెట్టారు. ఏపీ కేంద్రంగా ఇలాంటి డ్ర‌గ్స్ దందా ఎప్ప‌టి నుంచి జ‌రుగుతోందోన‌ని.. ఇన్నాళ్లూ ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత‌కీ ఆ డ్ర‌గ్స్ దందా ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే.... సుమారు 9 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌. అఫ్ఘానిస్థాన్‌ నుంచి విజయవాడకు అక్రమంగా రవాణా అవుతోంది. ముఖానికి రాసుకునే పౌడర్‌ పేరిట కంటైనర్‌లలో తరలిస్తుండగా గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో ఉన్న ముంద్రా పోర్టులో డీఆర్‌ఐ, నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు సీజ్‌ చేశారు. ఏపీలోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్‌ ఫర్మ్‌ అనే సంస్థ వీటిని బుక్‌ చేసుకుంది. కన్‌సైన్‌మెంట్‌లో తెల్పిన‌ అడ్రస్‌ మేరకు విజయవాడలోని సత్యనారాయణపురం వెళ్లిన అధికారులకు అక్కడ ఓ ఇల్లు మాత్రమే కనిపించింది.  ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్‌ రాకెట్‌తో విజయవాడకు లింకులుండ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఇరాన్‌కు చెందిన రెండు నౌకల్లో భారత్‌కు వస్తున్న 2,988 కిలోల హెరాయిన్‌ను నిఘా పెట్టి గుజరాత్‌లో పట్టుకున్నారు. ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ పోర్టు నుంచి.. బందరు పోర్టుకు దిగుమతి చేసుకొంటున్నట్లు తేలింది. 988 కిలోల చొప్పున కంటైనర్లలో వాటిని ముంబైకి చేర్చేలా దిగుమతిదారులు బుక్‌ చేసినట్లు గుర్తించారు. కంటైనర్లలో ఉన్న పౌడర్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరిశీలించి హెరాయిన్‌ అని తేలాక ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు అఫ్ఘాన్‌ జాతీయులు ఉన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న ఆశి ట్రేడింగ్‌ కంపెనీలో అధికారులు సోదాలు చేసి గోవింద రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.  మరోవైపు అతిపెద్ద డ్రగ్‌ రాకెట్‌లో బెజవాడ ఏజెన్సీ, ఇక్కడి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఏపీ పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఎవరైనా పెద్దల పాత్ర ఉందా? గుట్కా మాఫియా పాత్ర ఉండొచ్చా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే నార్కోటిక్‌ బ్యూరో ఇప్పటికే రంగంలోకి దిగిందని, ఎన్‌ఐఏ, సీబీఐ, సీవీసీ సంస్థలు కూడా కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది.  సోలార్‌ ప్లేట్ల ఏర్పాటు పనుల పేరిట విజయవాడ సత్యనారాయణపురంలో ఆశి ట్రేడింగ్‌ కంపెనీని మాచవరం సుధాకర్‌ అనే వ్యక్తి ప్రారంభించినట్టు స‌మాచారం. కంపెనీని ఏర్పాటు ఇక్కడ జరిగినప్పటికీ కార్యకలాపాలు చెన్నై కేంద్రంగా నడుస్తున్నాయని తెలుస్తోంది. తదుపరి విచారణ కొనసాగుతోంది.   

గులాబీబాస్ గుండెల్లో గజ్వేల్ ముళ్లు.. ప్లీనరీకి ప్రిపేర్ అవుతున్నారా?

నిర్మల్’లో బీజేపీ, గజ్వేల్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఏ స్థాయిలో ఎగిసి పడుతున్నాయో చెప్పకనే చెప్పాయి. మరోవంక బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు పాదయాత్రలు, సభలు సమావేశాలు, ప్రజాందోళనలతో జనంలోకి దూసుకుపోతున్నాయి. ఓ వంక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగిస్తుంటే, మరో వంక కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా సభలతో దాదా పుట్టిస్తున్నారు. అంతే కాదు దండోరా సభలు సక్సెస్ అయిన స్పూర్తితో, అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ యుద్దభేరి మొగించేందుకు సిద్దమయ్యారు. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక విషయం అయితే, చెప్పనే అక్కరలేదు. కేసీఆర్ దళిత బంధన్నా హరీశ్ రావు ఇంకొకటి అన్నా ఫలితం లేదని తేలిపోయింది.  ఒక్క మాటలో చెప్పాలంటే, హుజూరాబాద్, ఈటల ఎపిసోడ్’తో తెరాస తెలంగాణ ప్రజల సొంత పార్టీ , ఇంటి పార్టీ స్టేటస్ కోల్పోయింది. ఇంతవరకు సెంటిమెంట్’గా నెత్తికిఎత్తుకున్న పార్టీని, ఇప్పుడు జనం కుతుబామ పార్టీగా మాత్రమే చూస్తున్నారు.  ఒక్క హుజూరాబాద్’లో మాత్రమే కాదు, హుజూరాబాద్‌ ఎఫెక్ట్’తో తెలంగాణ అంతటా కూడా తెరాసతో తెలంగాణ ప్రజలకు ఉన్న సెంటిమెంటల్ అటాచ్మెంట్, భావోద్రేక బంధం తెగిపోయింది. అందుకే, ఒకప్పుడు తెరాసని నెత్తికి ఎత్తుకున్నజనాలే ఇప్పుడు కుటుంబ పార్టీగా చూస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి కంటే కుటుంబ ప్రయోజనాలకే కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారనే అభిప్రాయం రోజురోజుకు మరింతగా బలపడుతోంది.  ఏ నేపధ్యంలో అధికార తెరాస, కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. పార్టీకి దూరమైన తెలంగాణ ప్రజలను మళ్ళీ దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకు ఇంతలా భయపడలేదు. హుజూరాబాద్ ఓటమి ఖరారైన తర్వాతనే ఆయనలో కదలిక వచ్చింది. అంతవరకూ విపక్ష్లాల విమర్శలను సైతం లైట్’గా తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు విపక్షాల విమర్శలకు  భయపడడమే కాదు స్పదిస్తున్నారు. రేషన్ కార్డుల ఇష్యూ మొదలు సీఎంఓ లో దళిత అధికారి నియామకం వరకు ఈటల లేనేట్టిన లోపాలకు కేసీఆర్  ఎలా స్పందించారో చూశాం. అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, గజ్వేల్‌లో కేసీఆర్ ఫాంహౌస్‌కు కూతవేటు దూరంలో  రేవంత్ రెడ్డి చేసిన గర్జన గులాబీ బాస్ గుండెల్లో రైళ్లు పరిగేట్టిస్తోంది. వెన్నులో చలి పుట్టిస్తోంది. అందులే ఆయన అల్లర్ట్ అయ్యారు. దానికి కౌంటర్‌గా వచ్చే నెలలో గజ్వేల్‌లో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.  నిజానికి, గతంలో ఎప్పుడోనే నిర్వహించవలసిన తెరాస ప్లీనరీని అప్పట్లో కరోనా కారణంగా వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ప్లీనరీ పేరిట సొంత గడ్డ గజ్వేల్’లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని, తద్వారా సక్సెస్, గ్రాంట్ సక్సెస్ అయిన నిర్మల్, గజ్వేల్ సభలకు సమాధానం చెప్పాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కూడా చాలా వరకు కంట్రోల్’లో ఉన్న నేపధ్యంలో పెద్ద ఎత్తున ప్లీనరీ నిర్వహించడం ద్వారా విపక్షాలకు జవాబు ఇవ్వడమే కాకుండా, సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలలో నైతిక స్థైర్యాన్ని నింప వచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  ప్లీనరీ  ఎప్పుడు ఉంటుంది అనేదానిలో ఇంకా కొంత స్పష్టత రావలసి ఉందని అంటున్నారు. అలాగే, ప్లీనరీ ఇప్పుడు అవసరమా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతున్నల్టు తెలుస్తోంది.ఈ సమయంలో ప్లీనరీ నిర్వహించడం కొరివితో తల్గోక్కోవడం అవుతుందా అన్న కోణంలోనూ పార్టీలో చర్చ జరుగుతోందని సమాచారం.  ప్లీనరీ నిర్వహించడమా మరొకటా అనేది ఎలా ఉన్నా, ప్రస్తుతం జనంలో, చివరకు పార్టీ నయలులు, క్యాడర్ ‘లో సైతం ఏర్పడిన,’ ‘కుటుంబ పార్టీ. ‘తెరాస పని పోయింది’ అన్న భావన (పర్సెప్షన్) నుంచి బయట పాడేందుకు కేసీఆర్ ... అంతర్గత మథనం సాగిస్తున్నది మాత్రం నిజం.

లై డిటెక్ట‌ర్‌లు, ప‌రువున‌ష్టం కేసులు.. కేటీఆర్ రేవంత్‌ల మ‌ధ్య ర‌చ్చ రంభోలా..

డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌ల‌తో స్టార్ట్ అయింది. స‌వాల్, ప్ర‌తిస‌వాళ్ల‌కు దారి తీసింది. మీడియా ఆజ్యం పోయ‌కున్నా అగ్గి రాజుకుంది. ట్విట్ట‌ర్‌లో వార్ ముదిరింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డ్ర‌గ్స్‌పై దాడి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఎదురుదాడి జ‌రుపుతున్నారు. రెండు రోజులుగా రేవంత్‌రెడ్డి వ‌ర్సెస్ కేటీఆర్ ర‌చ్చ ఓ రేంజ్‌లో సాగుతోంది. అది మ‌రింత ముదిరి లైడిటెక్ట‌ర్ టెస్టులు, కోర్టు కేసుల వ‌ర‌కూ దారి తీయ‌డంతో తెలంగాణలో పొలిటిక‌ల్ హీట్ తారాస్థాయికి చేరింది. డ్ర‌గ్స్ వాడేవారికి మంత్రి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటూ గ‌జ్వేల్ స‌భ‌లో కాక రేపారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. రేవంత్ కామెంట్స్‌కు కౌంట‌ర్ ఇస్తూ.. డ్ర‌గ్స్‌తో త‌న‌కేం సంబంధ‌మ‌ని.. బ్ల‌డ్‌, లివ‌ర్ శాంపిల్ ఇస్తా.. ఏ టెస్టుకైనా రెడీ.. అయితే రాహుల్‌గాంధీ కూడా డ్ర‌గ్స్ టెస్టులు రెడీనా అంటూ స‌వాల్ చేశారు మంత్రి కేటీఆర్‌. ఆయ‌న‌కు కౌంట‌ర్‌గా రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. తాను సైతం శాంపిల్స్ ఇస్తాన‌ని.. మీరు కూడా ఇవ్వాలంటూ కేటీఆర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిలకు వైట్ ఛాలెంజ్ విసిరడం క‌ల‌క‌లం రేపింది. తాజాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విసిరిన వైట్‌ ఛాలెంజ్‌పై మంత్రి కేటీ రామారావు స్పందించారు. ‘‘ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాంధీ సిద్ధమేనా? రాహుల్ ఒప్పుకుంటే ఢిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధం. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో నా స్థాయి కాదు. క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో సవాల్‌ విసిరారు.  కేటీఆర్ ట్వీట్‌పై రేవంత్‌ రెడ్డి సైతం స్పందిస్తూ మ‌రో ట్వీట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌తో కలిసి లైడిటెక్టర్‌ పరీక్షకు తాను సిద్ధమని ప్రకటించారు. సమయం, స్థలం చెప్పాలన్నారు. సీబీఐ కేసులు, సహారా పీఎఫ్‌ అక్రమాలపై పరీక్షలకు కేసీఆర్‌ సిద్ధమా? అని రేవంత్ మరింత ర‌చ్చ రాజేశారు. ర‌చ్చ బాగా ముద‌ర‌డంతో కేటీఆర్ రూట్ మార్చిన‌ట్టున్నారు. ‘‘ఉద్దేశ‌పూర్వ‌కంగా నాపై దుష్ప్ర‌చారం చేస్తున్నారు. న్యాయ‌స్థానంలో ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశాను. వారిపై కోర్టు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని విశ్వ‌సిస్తున్నాను’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

ఇవేం మద్యం బ్రాండ్లు సీఎం..  బ్యాలెట్ బాక్సులో లేఖ..

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అమలులో ఉన్న మద్యం పాలసీపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చాకా గతంలో ఉన్న పాలసీని మార్చేసింది. ప్రస్తుతం ప్రభుత్వమే షాపులను నిర్వహిస్తోంది. లిక్కర్ బ్రాండ్లను కూడా మార్చేశారు. కొత్త రకం బ్రాండ్లను ఏపీలో అందుబాటులోకి తెచ్చింది. అయితే కొత్తగా తీసుకువచ్చిన బ్రాండ్లు నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నా.ి, దీనిపై మందుబాబుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రేట్లను అడ్డుగోలుగా నిర్ణయిస్తూ నాసిరకం లిక్కర్ ను అంటగడుతున్నారనే కొందరు బహిరంగంగానే మండిపడ్డారు. తాజాగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులోనూ మద్యం బ్రాండ్లపై జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో బయటపడింది. ఓటుతో పాటు బ్యాలెట్ బాక్సులో  చీటి ఏపి సర్కారుకు ఓ మందుబాబు చేసుకున్న  విన్నపం ఆసక్తిగా మారింది. అనంతపురం జిల్లా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కంపు నేపథ్యంలో బ్యాలెట్‌ బాక్స్‌లో వచ్చిన ఓ మందు బాబు విన్నపం అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచింది.రకరకాల మద్యం బ్రాండ్లతో విసుగెత్తి పోతున్నామని, ఇప్పుడు సరఫరా చేసిన బ్రాండ్లను మార్చాలంటూ ఒక ఓటరు తన ఓటుతో పాటు చీటీ రాసి బ్యాలెట్‌ బాక్సులో వేశారు. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తలమర్లవాండ్లపల్లి ఎంపీటీసీ పరిధిలోని బ్యాలెట్‌ బాక్సులో ఈ చీటీ బయటపడింది. మద్యం దుకాణాల్లో చల్లని బీర్లతో పాటు మంచి బ్రాండ్‌ ల మద్యాన్ని అందుబాటులో ఉంచాలని చీటీలో మందుబాబు పేర్కొన్నాడు. బ్యాలెట్‌ బ్యాక్సులు ఓపెన్‌ చేసి ఓట్లను లెక్కిస్తున్న క్రమంలో ఈ చీటీలు బయటపడ్డాయి. నల్లచెరువు మందుబాబుల యూత్‌ అధ్యక్షుడు అని రాసి ఉండటం కొసమెరుపు.చీటీలో నల్లచెరువు మందుబాబుల యూత్‌ అధ్యక్షుడు అని రాసి ఉండటం కొసమెరుపు.

జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. ఏపీ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం బంద్‌?

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జగన్ సర్కార్ విధానాలతో తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి తాజాగా మరో షాక్ తగిలింది. అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌ల నిధుల‌తో న‌డిచే ప్రాజెక్టుల‌కు గండం ఏర్పడింది. ఈ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం బంద్‌ కానుండటమే ఇందుకు కారణం కానుంది.  అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌ల నిధుల‌తో నిర్మించిన  ప్రాజెక్టుల కింద విడుద‌ల చేసిన రూ.960 కోట్లకు లెక్క‌లు చెప్పాల‌ని డిపార్ట్‌మెంట్ ఎకాన‌మిక్ అఫైర్స్ నుంచి ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి  వచ్చాయి. డిపార్ట్మెంట్ ఎకానమిక్ అఫైర్స్ రాసిన లేఖ‌పై కేంద్ర ఆర్థిక శాఖ‌ తీవ్రంగా స్పందించింది. గ‌త వారం కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఏపీ ప్ర‌భుత్వానికి ఘాటు లేఖ‌ వచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా వ‌స్తున్న నిధుల‌ను వేరే ప‌థ‌కాల‌కు మ‌ళ్లించ‌డంపై కేంద్ర ఆర్థిక శాఖ‌ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. రూ.960కోట్ల‌కు లెక్క‌లు చెప్ప‌కపోతే భ‌విష్య‌త్తులో నిధులు విడుద‌ల చేయ‌బోమ‌ని అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌లు స్ప‌ష్టం చేశాయి.  ఈ ప్రాజెక్టుల కింద చేప‌ట్టిన ప‌నుల‌కు సంబంధించిన బిల్లులను ఇవ్వ‌డం లేద‌ని అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌ల‌కు కాంట్రాక్ట‌ర్లు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్ట‌ర్ల ఫిర్యాదుతో అంత‌ర్జాతీయ ఆర్థిక సంస్థ‌లు తీవ్రంగా స్పందించాయి. కేంద్ర ప్ర‌భుత్వానికి ఆర్థిక సంస్థ‌లు లేఖ రాశాయి. ఈ ప‌రిస్థితి తీవ్ర‌త‌ను గ‌మ‌నించిన కేంద్ర ఆర్థిక శాఖ‌ త‌మ‌కు వారం రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఏపీ ఆర్థిక శాఖ ఉన్న‌తాధికారుల‌కు లేఖ‌ రాసింది. కేంద్రానికి ఏపీ సర్కార్ ఇచ్చే నివేదికను బట్టి ప్రాజెక్టుల మనుగడ ఆధారపడి ఉంది.   

బీజేపీ కూటమిలోకి అమరీందర్ సింగ్? పంజాబ్ సీఎంగా చన్నీ..

పంజాబ్ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ తో విభేదించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో.. పార్టీల వ్యూహాలు శరవేగంగా మారిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి రావాలంటూ కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ (ఏ) అధినేత రాందాస్ అథవాలె ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్‌ను అవమానించిందని, అలాంటి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుందని, అమరీందర్ ఎన్డీయేలోకి వస్తే వచ్చే పంజాబ్ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అథవాలె అన్నారు.  సిద్ధూ విషయంలో అమరీందర్ వైఖరి సరైందేనన్నారు అథవాలె.  సిద్దూ పాకిస్తాన్ వెళ్లి బజ్వాను కౌగిళించుకోవడం చాలా తీవ్రమైన పరిణామమన్నారు. అమరీందర్ చెప్పింది కరెక్టే.. సిద్ధూ మోసగాడు అని అథవాలె అన్నారు. అమరీందర్ సింగ్ ను ఎన్డీయే కూటమికి లోకి ఆహ్వానిస్తూ అథవాలే చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. కెప్టెన్ కూడా అదే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. బీజేపీలో చేరకుండా సొంత పార్టీ పెట్టి.. ఎన్డీఏ కూటమికి అమరీందర్ సింగ్ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటించింది కాంగ్రెస్. పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ అని   పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ హరీష్ రావత్ ప్రకటించారు.  పంజాబ్ అసెంబ్లీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రులు వీరేనంటూ సుక్జిందర్ సింగ్ రంధావా సహా మరికొన్ని పేర్లు వినిపించాయి. అందులో చన్నీ పేరు లేదు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. హిందూ నేతను ఎంపిక చేయాల్సి వస్తే రాజ్యసభ సభ్యురాలు అంబికా సోని పేరు ప్రతిపాదించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సిక్కు నేతకే సీఎం పగ్గాలు ఇవ్వాలని అంబికా సోని అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరు అంతగా ప్రచారంలోకి రాకపోయినా, ఆయనను కానీ, ఆయన అనుయాయులను కానీ సీఎంగా ప్రకటిస్తే అసెంబ్లీలో బలపరీక్షకు కెప్టెన్ అమరీందర్ డిమాండ్ చేసే అవకాశాలను కూడా అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్‌జిత్ సింగ్ చన్నీ వైపుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. 

డీజీపీ ఆఫీసుకు వెళ్లిన టీడీపీ నేతలపై కేసు.. జైలుకు వెళ్లడానికి సిద్ధమేనన్న అయ్యన్న 

ఆంధ్రప్రదేశ్ లో అంతా రివర్సే. పాలనలో అంతా రివర్స్ సాగుతుందన్న ఆరోపణలు ఉండగా.. పోలీసుల తీరు కూడా అలానే ఉంటుంది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ప్రతి పక్ష నేతలపైనే తిరిగి కేసులు పెడుతున్నారు పోలీసులు. తాజాగా టీడీపీ నేతలపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణకు సంబంధించి డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు వెళ్లారు. అయితే  భారీగా తరలివచ్చిన నేతలు డీజీపీ ఆఫీసు గేటును నెట్టివేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ తాడేపల్లి ఏఎస్ఐ మధుసూదనరావు ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్ రెడ్డి, ఆలపాటి రాజేంద్ర, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, డోల బాల వీరాంజనేయ స్వామి,  ఏలూరి సాంబశివరావు, సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర,  బోడె ప్రసాద్, తెనాలి శ్రావణ్, జీవీ ఆంజనేయులు, నజీర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారంతా డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు. తాజాగా కొత్త కేసుతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరిగిపోతుందనే అక్కసుతోనే వైసీపీ దాడులు చేస్తోందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు. జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమేనన్నారు. తానేమి బూతులు మాట్లాడలేదని చెప్పారు.తాను గుంటూరు జిల్లాకు వెళితే ప్రజలు బ్రహ్మాండమైన స్వాగతం పలికారని, ఇలా ఉంటుందని  ఊహించలేదన్నారు. రెండున్నరేళ్లలో ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. దీంతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటికి తాను భయపడనని స్పష్టం చేశారు.  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారని, అది బలవంతంగా ఇచ్చారనేది ఆ స్టేట్ మెంట్ చూస్తే అర్థమవుతుందని అయ్యన్న పాత్రుడు అన్నారు. రెండు నెలల్లో ఆయన మంత్రి పదవి పోయేలా ఉందని, మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారని ఆరోపించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని సూచించారు. పార్టీ కోసం, ప్రభుత్వం చేస్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలపై తాము మాట్లాడతామని, అధికారపార్టీ ఏం చేసినా భయపడేది లేదని అయ్యన్న స్పష్టం చేశారు.