తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. 90శాతం ఉత్తీర్ణత

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పొరుగు రాష్ట్రం ఏపీలో టెన్త్ ఉత్తీర్ణతా శాతం గణనీయంగా తగ్గడంతో తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ నెలకొంది. అయితే 90 శాతం ఉత్తీర్ణత సాధించడంతో కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణలో విద్యా బోధన సజావుగా సాగిందని అంటున్నారు. కాగా టెన్త్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. ఫలితాల్లో బాలురు కంటే బాలికలే పై చేయి సాధించారు. టెన్త్ పరీక్షలకు హాజరైన బాలురులో ఉత్తీర్ణతా సాధం 87.61శాతం ఉండగా, బాలికలలో ఇది 92.45 శాతం ఉంది. ఇక సిద్దిపేట జిల్లా ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ జిల్లాలో ఉత్తీర్ణతా శాతం 97 కాగా, చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్ జిల్లాలో 79శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.  www.bse.telangana.gov.in వెబ్ సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది.  ఇలా ఉండగా  ఆగస్టు 1 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.    

రఘురామ విచారణ ఓకే .. బట్ కండీషన్స్ అప్లై.. హైకోర్టు

నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును రాజద్రోహం కేసులో తప్ప ఇతర సెక్షన్లపై నమోదైన కేసుల్లో  విచారణ జరుపుకోవచ్చని ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. రఘురామను హైదరాబాద్ లో మాత్రమే విచారించాలని అది కూడా దిల్ కుషా ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన ఎంచుకున్న న్యాయవాది సమక్షంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని సూచించింది. విచారణ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించాలని కండీషన్ పెట్టింది. ఈ కేసులో ఇతర నిందితులు ఏబీఎన్, టీవీ-5లతో కలిపి ఎంపీ రఘురామను విచారించాలనుకుంటే మాత్రం 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు సూచించింది. విచారణ కోసం రఘురామను సీఐడీ కార్యాలయానికి పిలిపించకూడదని కండిషన్ పెట్టింది. విచారణ సందర్భంగా కేవలం కేసుకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే విచారించాలని, ఇతర అంశాల గురించి ప్రశ్నించకూడదని సూచించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. రఘురామకు వై- కేటగిరి భద్రత ఉన్నందున విచారణ నిర్వహించే గది బయట భద్రతా సిబ్బందిని అనుమతించాలని సూచించింది. నిజానికి వైసీపీ అభ్యర్థిగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటరీ స్థానం నుంచి రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో గెలిచారు. అయితే.. ఆ తర్వాత వైసీపీతో ఆయనకు ఎందుకు చెడిందో ఏమో గానీ.. ప్రతిరోజూ వైసీపీ సర్కార్ చర్యల్ని, సీఎం జగన్ ను, ఆ పార్టీ నేతలు మరీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ‘రచ్చబండ’ పేరుతో మీడియా సమావేశం పెట్టి మరీ ఏకి పారేస్తున్నారు. దీంతో ఏపీ సీఐడీ సమోటోగా కేసు స్వీకరించి తనపై ఐపీసీ సెక్షన్ 124 ఏ ప్రకారం రాజద్రోహం, 152 ఏ కింద రెండు సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, 505, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని, ఆ కేసును కొట్టేయాలని రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఏపీ పోలీసులు తనను అరెస్ట్ చేసిన సందర్భంగా భౌతికంగా   హింసించారని, తనకు ప్రాణ హాని ఉందని ఎంపీ రఘురామ కోర్టుకు విన్నవించారు. దీంతో రఘురామను ఆన్ లైన్ లో విచారించడం సాధ్యమా? కాని పక్షంలో ఏదైనా సురక్షిత ప్రదేశాన్ని సూచించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. నిజానికి తనను అరెస్ట్ చేసి, శారీరకంగా హింసించిన తర్వాత రఘురామ  వైసీపీ సర్కార్ పైన, సీఎం జగన్ పైనా మరింతగా రెచ్చిపోయి విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రఘురామపై ట్విట్టర్ వేదికగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇద్దరు ఎంపీల మధ్యా ట్వీట్ల వార్ నడుస్తోంది. ఒక సందర్భంలో వారిద్దరి మధ్య ట్వీట్ల వార్ వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు కూడా దారితీసింది. జగన్ సర్కార్ చేస్తున్న తప్పిదాలు, ఆర్థికంగా ఏపీని దివాళా తీయించిన వైనంపై రఘురామ కొన్ని ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రఘురామకృష్ణరాజు సంసద్ టీవీ చర్చలకు పిలవొద్దంటూ కొద్ది రోజుల క్రితం విజయసాయి రెడ్డి పార్లమెంట్ సెక్రటరీకి లేఖ రాశారు. వైసీపీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున కానీ రఘురామ ప్రాతినిధ్యం వహించడం లేదని ఆ లేఖలో విజయసాయి పేర్కొన్నారు. అంతకు ముందు పార్టీకి, జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న రఘురామను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడని ప్రకటించాలని లోక్ సభ స్పీకర్ ను ఆ పార్టీ   ఎంపీలు కోరారు. అయితే.. వారి విజ్ఞప్తికి స్పీకర్ ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వ తీరుపైనా విమర్శలు చేస్తున్న  రఘురామపై పార్టీ  సస్పెన్షన్ వేటు వేయడానికి వైసీపీ అధిష్టానానికి ఉన్న అడ్డంకి ఏమిటనేది మాత్రం బయటికి చెప్పకపోవడం గమనార్హం. చివరికి రఘురామపై రాజద్రోహం, సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులను సీఐడీ తనపై కుట్రపూరితంగా పెట్టిందని, వాటిని కొట్టి వేయాలంటూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా రఘురామను హైదరాబాద్ లోనే విచారించాలని, రాజద్రోహం మినహా ఇతర సెక్షన్ల విషయంలో విచారణ చేసుకోవచ్చని సీఐడీని ఆదేశించింది.

ఎవ‌రికీప‌ట్ట‌ని అనీల్ ఎక్క‌డున్నారు?

కొన్ని సంఘ‌ట‌నలు ఇబ్బంది పెడ‌తాయి. కొన్ని స్వ‌యంకృతాలూ జీవితాన్నే తారుమారు చేస్తాయి. మాజీ మంత్రి అనీల్ ది రెండ‌వ ర‌కం. మాజీ మంత్రిగా అయినా అంద‌రితో మంచిగా వుండాల్సిన‌వారు హ‌ఠా త్తుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. మ‌రి ఎప్పుడు తిరిగివ‌స్తారు, నెల్లూరు సిటీలో పోటీ చేస్తారా లేదా అన్న‌ది  నెల్లూరు జిల్లాలో పెద్ద చ‌ర్చ. మంత్రి ప‌దవి పోయిన త‌ర్వాత ఏమ‌యిందో ఏమో ఫ్లెక్సీల గొడ‌వ తో పార్టీ పెద్ద‌ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఆ త‌ర్వాత అజ్ఞాతంలోకి వెళిపోయారు.  అనీల్ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అంటే ప‌డి చ‌చ్చేంత వీరాభిమాని. ఆ విషయం రుజువు చేసుకోవడానికి తుపాకీ ధ‌రించి అతిగా  వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కూ న‌చ్చిన ఆయన ప్ర‌వ‌ర్త‌న ఆ త‌ర్వాత పార్టీ పెద్ద‌ల‌కూ న‌చ్చ‌లేదు. ఆయన అతి ప్ర‌వ‌ర్త‌న ప్ర‌తిప‌క్షాల‌తోపాటు అధికార‌ప‌క్షంవారికి విసుగెత్తించింది.  ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం వ‌ర్గంవారికి అనిల్ వైఖరి బొత్తిగా నచ్చలేదు. అనీల్ మంత్రి ప‌దవి పోయిన త‌ర్వాత అంద‌రూ ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డం తో మ‌ద్రాసుకు మ‌కాం మార్చారు.  అస‌లే ప‌రిస్థితులు అనుకూలించ‌కపోవ‌డంతోపాటు ఆనం, కాకాణివ‌ర్గం ఒక‌టి కావ‌డం అనిల్ కు ఇబ్బందిక‌రంగా మారింది.  దీనితో అనీల్ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సోద‌రుడు విజ‌య‌కుమార్ రెడ్డితో జ‌త‌క‌ట్టారు.  నెల్లూ రులో ఆనం మ‌ద్ద‌తు వుంటే దేన్న‌యినా సాధించ‌వ‌చ్చ‌ని అనీల్ న‌మ్మ‌కం. నెల్లూరు సిటీలో గెల‌వవ‌చ్చ ని పావులు క‌దిపారు. కాకాణి గోవర్దన్బరెడ్డి మంత్రి అయ్యాక అనిల్ కు ఊహించని పరిణామాలు ఎదుర య్యాయి. అనం , కాకాణి వర్గం ఒకటి కావడం అనిల్ కు చెక్ పెట్టడం చకచకా జరిగిపోయాయి.   ఈ విష‌య‌మై నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి మండి ప‌డ్డా రు. అనిల్ తో స్నేహం కటాఫ్ చేసి తన నియోజకవర్గం లొ ఎవరైనా తలదూరిస్తే తాను కూడా అన్నీ నియో జకవర్గం లొ కాలు పెట్టాల్సి వస్తుందని మీడియా సమావేశం పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వార్నింగ్‌ అనీల్ తో పాటు మరి కొందరికి కుడా తగిలేలా చెప్పాడు దీంతో అనిల్ ఉక్కిరి బిక్కిరి అవుతు న్నాడట.  ఆమద్య ప్లినరీ సమావేశా నికి వచ్చిన అనిల్ తాను వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని ప్రచారం జరుగోతోందనీ,   అది అవాస్తవమని తాను నెల్లూరు సిటీ నుంచే పొటీ చెస్తున్నట్టు ప్రకటించుకొని మళ్లీ వెళ్లి పొయాడు. అనీల్ అజ్ఞాతం లోకి వెళ్ళ‌డానికి అస‌లు కార‌ణాలేమిట‌న్న‌ది   పార్టీవ‌ర్గాల‌కీ ఇదమిథ్థంగా తెలియ‌డంలేదు. ఎందుకంటే   అనీల్ మంత్రి ప‌ద‌వి పోయిన త‌ర్వాత ఆయ‌న్ను పెద్ద‌గా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రో వంక   ఏపీ ముఖ్య‌మంత్రి కూడా అనీల్ సంగ‌తి ప‌ట్టించుకోవ‌డం లేదు. 

వైసీపీ జిల్లా ప్లీనరీలలో రగులుతున అసమ్మతి

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయలలో మూడో పార్టీకి స్థానం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలల్లోనే ఆ విషయం రుజువైంది.ఆ ఎన్నికలలో, తెలుగు దేశం, వైసీపీ  బీజేపీ, కాంగ్రెస్’ జనసేన, వామపక్ష పార్టీలు, బీఎస్పీ ఇలా అనేక పార్టీలు కూటములు  పోటీ చేశాయి  అయినా, 90 శాతానికి పైగా ఓట్లు, టీడీపీ, వైసీపీల మధ్యనే పోల్ అయ్యాయి. సీట్ల విషయానికి వస్తే, 175 సీట్లకు గానూ 174 సీట్లు ఆ రెండు పార్టీలే పంచుకున్నాయి. మిగిలిన అన్ని పార్టీలకు కలిపి పది శాతం కంటే తక్కువ ఓట్లు, ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కాయి. అయితే, రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా, మార్పు రాదా, అంటే వస్తుంది. కానీ, ప్రస్తుతానికి  అయితే మరో ప్రత్యాన్మాయం కనిపించడం లేదని, పరిశీలకులు భావిస్తున్నారు.  నిజానికి, ముందస్తు ఎన్నికలు వస్తే ఏమో కానీ, లేదంటే శాసన సభ ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది. వైసేపీ ప్రభుత్వం గద్దెనెక్కి మూడు సంవత్సరాలే పూర్తయ్యాయి, ఇంకా  నిండా రెండు సంవత్సరాలు అలానే ఉన్నాయి. అయితే, ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పతాక స్థాయికి చేరింది. అందుకే, పార్టీలో అసమ్మతి అగ్గిరాజుకుంది. రాజీనామాల పర్వం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ వంక ప్రజల విశ్వాసం  కోల్పోయింది. మరోవంక, పార్టీలో అసమ్మతి సెగలు బుసలు కొడుతున్నాయి. అందుకే, రోజుకో రచ్చ వీధుల కెక్కుతోంది, అంతర్గత కుమ్ములాటలు, ధిక్కార స్వరాలు ఎక్కువ వుతున్నాయి...  బాలినేని భాగోతం ఓ వంక అలా సాగుతుడగానే.. మరో వంక వైసీపే జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశాల్లో కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెన్చుకుంటోందని వార్తలోస్తున్నాయి. ఇంకెవరో కాదు, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం తమ  నియోజకవర్గంలో వర్గ విబేధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని, అవి పార్టీకి మంచిది కాదని బొత్స చెప్పు కొచ్చారు.   ఒంగోలు జిల్లా  ప్లీనరీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ‘ కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడు తున్న సమయంలోనే కార్యకర్తలు తాము చేసిన అభివృద్ది  పనులకు బిల్లులు ఎప్పుడు చేల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేయడంతో, పరిస్థితి రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని దురు సుగా ప్రవర్తించడంతో ఆ కార్యకర్త ఎదురు తిరిగాడు,  .‘వైసీపీకి ఓటు వేసి గెలిపించినందుకు అరెస్టు చేస్తారా? నేను ఏమి తప్పుచేశానని బయటకు తీసుకెళ్తున్నారు?’ అంటూ ఆక్రోశించారు. నిజానికి పెండింగ్ బిల్లుల వ్యవహారం, వైసీపీ ఎమ్మెల్యేలకు సంకటంగా మారింది. ఈ నేపధ్యం లోనే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేనుగోపాల్, నేరుగా ముఖ్యత్రికే చురకలు అంటించారు. మీట నొక్కి ప్రజల ఖాతాలలో డబ్బులు వేస్తున్న ముఖ్యమంత్రి గ్రాఫ్ పెరుగుతోంది,  కానీ, ఏమీ చేయలేక చేతులు ముడుచుకు కూర్చున్న తమ ఫీజులు మాడి పోతున్నాయని అన్నారు. ఒక్క  దర్శి నియోజకవర్గం పరిధిలోనే  రూ.100 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని,అన్నారు.  నాలుగు రూపాయలు సంపాదించుకుందామని కాంట్రాక్టు పనులు చేసిన కార్యకర్తలు ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవలసి వస్తోందని, బహిరంగ వేదిక నుంచే ఆగ్రహం వ్యక్త చేశారు.  నిజానికి ఇది ఎదో ఒక జిల్లాకు పరిమితమైన సమస్య కాదు. అన్నిజిల్లాలలో పైరవీలు చేసి పనులు తెచ్చుకున్న పార్టీ కార్యకర్తలు (కాంట్రాక్టర్ర్లు) అందరిది ఇదే సమస్యగా ఉందని నాయకులే వాపోతున్నారు. అలాగే, కర్నూలు జిల్లా ప్లీనరీలో గొప్పలు చెప్పుకోవడం తప్ప అభివృద్ధికి ఏం చేశారు? మంచినీరు కూడా ఇవ్వనప్పుడు ఏం అభివృద్ధి చేసినట్లు అని కుర్ని వెల్ఫేర్‌ అండ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కృష్ణవేణి మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో నాయకులను ప్రశ్నించారు.  మరో వంక పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య రాయచోటిలో జరిగిన అన్నమయ్య జిల్లా ప్లీనరీలో మాట్లాడుతూ  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ  అధికారం నిలబెట్టుకోవడం అంత సులభం కాదని, కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర నాయకత్వం అంతా బాగుదని అనుకుంటే ఇంతే సంగతులని, పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని హెచ్చరించారు ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొత్తానికి మొత్తంగా 175 సీట్లు మనవే అంటుంటే, రామచంద్రయ్య పార్టీ వేదిక నుంచే అంత సీన్ లేదని తేల్చేశారు. నిజానికి ఒక రామచంద్రయ్య కాదు. పార్టీ నాయకులు,  కార్యకర్తఃల్లో మూడింట రెండు వంతుల మంది ఇదే ఆఖరి మోకా ఇక ముందు అధికారంలోకి రాలేమని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. గడప గడపకు కార్యక్రమంతో  ప్రజల్లో గుడ్తుకట్టున్న ప్రభుత్వ వ్యతిరేకత  భగ్గు మంటే, ఇప్పడు ప్లీనరీ సమావేశాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలో రగులుతున్న అసంతృపతి భగ్గుమంటోందని పరిశీలకులు అంటున్నారు. ఈ  నేపధ్యంలో, ప్రజల ముందు కనిపిస్తున్న ఏకైక ప్రత్యాన్మాయం తెలుగు దేశం, అందుకే ప్రజలు, పరిశీలకులు పొత్తులు ఉన్న లేకున్నా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా .. గెలిచేది టీడీపీ .. అంటున్నారు.

చిరంజీవి సరే... పవన్ మాటేమిటి?

బీజేపీ వ్యూహాలేమిటి? పవన్ కల్యాణ్ తో ఆ పార్టీ మైత్రి కొనసాగుతోందా? లేక అప్రకటిత తెగదెంపులు అయిపోయాయా? అన్న ప్రశ్నలకు అలాగే కనబడుతోంది అన్న జవాబే వస్తుంది. ఎందుకంటే ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మెగా స్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి ఆహానం అందింది. మరి పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి? ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తుంటే.. బహిరంగ సభ నిర్వహిస్తుంటే.. అదీ ప్రభుత్వ కార్యక్రమం అయినా మిత్ర పక్ష అధినేతకు ఆహ్వానం అందక పోవడమేమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవం వేడుకలలో భాగంగా  అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే జూలై 24న భీమవరంగా అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికే కేంద్ర ప్రభుత్వం తరఫున మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. అయితే ఇక్కడే రాజకీయ పరిశీలకులు తమ విశ్లేషణలకు పని చెబుతున్నారు. రాజకీయాలకు దూరంగా సినీమాలకు పరిమితమైన చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపడంలో ఆంతర్యమేమిటి? రాజకీయాలలో క్రియాశీలంగా ఉండటమే కాకుండా.. బీజేపీతో పొత్తు ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆహ్వానం పంపకపోవడమేమిటి? దీని వెనుక రాజకీయమేమి? అంటూ సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించినట్లైతే బీజేపీకి ఇప్పుడు పవన్ కల్యాణ్ కన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ మంచి మిత్రుడుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే కేంద్రం తానా అంటే తానా, తందానా అంటే తందానా అనే జగన్ ను దూరం పెట్టి.. పొత్తుల విషయం సహా ఏపీ ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో కూడా తన మాటే వినాలని పట్టుబట్టే పవన్ ను దగ్గరకు తీసుకోవడం వల్ల రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదని కమలనాథులు భావిస్తున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కనుక పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తే ఇదే కార్యక్రమంలో పాల్గొనే ఏపీ సీఎం జగన్ కు ఇబ్బంది అవుతుందనే కారణం కూడా ఒకటి చెబుతున్నప్పటికీ, అధికార, విపక్ష నేతలు ఒకే కార్యక్రమంలో వేదిక పంచుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. పైగా ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాజకీయాలను జొప్పించడం భావ్యం కాదు. కానీ బీజేపీ మాత్రం ఈ కార్యక్రమాన్ని తన రాజకీయ ప్రయోజనం కోసమే ఉపయోగించుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరి జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు కోసం చిరంజీవిని ఆహ్వానించందనీ, జగన్ ను సంతోష పెట్టడం కోసం పవన్ కల్యాణ్ ను దూరం పెట్టిందనీ,  ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా  ఒకే ఒక్క చర్య ద్వారా అటు జగన్ ను, ఇటు కాపు సామాజిక వర్గాన్నీ, అటు జగన్ ను ప్రసన్నం చేసుకోవచ్చన్నదే మోడీ సభకు చిరంజీవికి ఆహ్వానం పంపి, పవన్ కల్యాణ్ ను దూరం పెట్టడం అని విశ్లేషకులు చెబుతున్నారు.

మహా సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం రేపు?

మహా రాజకీయం రసకందాయంలో పడింది. కమల వ్యూహం ఫలించింది.  మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ప్రణాళికలు అనుకున్నవి అనుకున్నట్లుగా అమలు చేయగలిగింది. దీంతో మహాలో మళ్లీ కమలం జెండా ఎగరనుంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. ఇందు కోసం తమ మాజీ మిత్ర పక్షం శివసేనను నిట్టనిలువుగా చీల్చడంలో కమలనాథులు విజయం సాధించారు. శాసన సభలో బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇక లాంఛనమేనని పరిశీలకులు చెబుతున్నారు. ఉద్ధవ్ థక్రే రాజీనామా చేసిన వెంటనే బీజేపీ మహా చీఫ్ చంద్రకాంత్పాటిల్, మాజీ సీఎం దేవేంద్రఫడ్నవీస్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యులు భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహా అసెంబ్లీలో అత్యధిక సీట్లు ఉన్నపార్టీ బీజేపీయే. అందుకే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నది. గురువారం (జూన్ 30) ఏక్షణంలోనైనా ఫడ్నవీస్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశంఇవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉందని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫడ్నవీస్ శుక్రవారం నాడే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 

సింహమా.. గ్రామ సింహమా?.. యూట్యూబ్ నిర్వాహకుడి అరెస్టుపై లోకేష్ ఫైర్

 సామాజిక మాధ్యమంలో పోస్టులకు అరెస్టులు వద్దని సుప్రీం కోర్టు విస్పష్టంగా చెప్పింది. అయితే సుప్రీం ఆదేశాలు, తీర్పులు ఏపీలో అమలౌతున్న దాఖలాలు కనిపించడం లేదు. అడ్డగోలుగా, అడ్డదారులు వెతికి మరీ సుప్రీం ఆదేశాల ఉల్లంఘన జరుగుతోంది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ విషయంలోనూ అదే జరిగింది. తాజాగా తెలుగుదేశం కార్యకర్త, యూట్యూబ్ నిర్వాహకుడు, సోషల్ మీడియాలో చురుకుగాఉండే  వెంకటేశ్ అరెస్టు ఆ కోవలోకే వస్తుంది. వెంకటేష్ అరెస్టుపై  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిఫైర్ అయ్యారు. అర్ధరాత్రి దొంగల్లా గోడ దూకి, తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేయడమిటని మండి పడ్డారు. సీఎం జగన్ కు సామాజిక మాధ్యమమంటే వణుకు అని విమర్శించారు. యూట్యూబ్ చానెల్ ను చూసి భయపడే జగన్ సింహమెలా అవుతారని ప్రశ్నించారు. నిజానికి ఆయన గ్రామ సింహం కూడా కాదని ఎద్దేవా చేశారు. అమరావతి మండలం ధరణి కోటకు చెందిన వెంకటేష్ జగన్ పై, వైసీపీపై విమర్శనాత్మక కథనాలను యూట్యూబ్ లో ఉంచిన కారణంగానే అరెస్టు చేశారని లోకేష్ ఆరోపించారు. జగన్ ప్రాపకం కోసమే పోలీసులు ఆయనను అరెస్టు చేశారని, గోడదూకిన పోలీసులు తమ ముఖాలు కనపడకూడదని లైట్లు పగల గొట్టారనీ, వారి ముఖాలన్నీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయనీ అన్నారు. ఇలా ముఖ్యమంత్రి ప్రాపకంకోసం చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న వారంతా ముందు ముందు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ అన్నారు. 

మహా సీఎం రాజీనామా..

తెలుగువన్ చెప్పినట్లే జరిగింది.  మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష అనివార్యమైతే.. అంతకు ముందే సీఎం ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేస్తారని తెలుగువన్ ముందే ఊహించింది. చివరికి అదే జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. అసెంబ్లీలో గురువారం (జూన్ 30) బలపరీక్ష జరగాల్సి ఉండగా దానికి ఆపాలంటూ ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. అయితే  మహా సంక్షోభంపై సుప్రీం కోర్టు బుధవారం సాయంత్రం బలపరీక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీం ఆదేశాలు జారీ చేసిన స్వల్ప వ్యవధిలోనే ఉద్ధవ్ థాక్రే రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా లేఖ అందజేశారు. బల పరీక్షపై స్టే విధించడం కుదరదన్న సుప్రీం తీర్పును గౌరవిస్తున్నానని ఉద్ధవ్ అన్నారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగేందుకు సహకరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే కృతజ్ణతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శివసనే సర్కార్ కు కొందరి ద్రిష్టి తగిలిందనీ, అది ఎవరిదో అందరికీ తెలుసుననీ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు  మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బాలాసాహెబ్​ ఆశయాలు నెరవేర్చిందన్నారు. సీఎం పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. రాజీనామాకు ముందు ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్‌ భేటీ అయింది.   కేబినెట్‌ భేటీలో మంత్రులకు సీఎం ఉద్దవ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఏమైనా తప్పు జరిగితే అందరూ తనను మన్నించాలని ఠాక్రే కోరారు. తన వాళ్లే తనను మోసం చేశారని, వెన్నుపోటు పొడిచి ఈ స్థితికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. సుప్రీం తీర్పుకు ముందే తెలుగువన్ ఉద్ధవ్ రాజీనామా గురించి చెప్పింది.    https://www.teluguone.com/news/content/maharashtra-cm-uddhav-thakrey-resigb-39-138742.html

తెలంగాణలో బీజేపీ త్రిముఖ వ్యూహం.. కాంగ్రెస్ కు చెక్.. టీఆర్ఎస్ తో నో కటీఫ్.. అధికారమే టార్గెట్

 తెలంగాణలో బీజేపీ దూకుడును మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో తెరాసతో తెగే వరకూ లాగే పరిస్థితి తెచ్చుకోవద్దనీ ఆలోచిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల అనంతరం  తెలంగాణలో బీజేపీ బలోపేతం దిశగా అడగులు వేయనున్నది. రాష్ట్రంలోని ప్రతి మూడు నియోజకవర్గాలకూ ఒక కేంద్ర మంత్రిని ఇన్ చార్జిగా నియమించి.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పటిష్ట చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నది.  అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకూ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసి ఇప్పటి నుంచే  ఆయా నియోజకవర్గాలలో వారు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ విజయావకాశాలను పెంచుకోవాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోంది.  అదే సమయంలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే.. ఆ పార్టీతో పూర్తిగా తెగతెంపులు అయ్యే పరిస్థితి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి విస్పష్టమైన సూచన చేసినట్లు కమలం వర్గాలే చెబుతున్నాయి. కర్రా విరగ వద్దు.. పామూ చావవద్దు అన్న సామెతను కొద్దిగా  మార్చుకుని టీఆర్ఎస్ గెలవ కూడదు.. అలాగని ఆ  పార్టీతో పూర్తిగా సంబంధాలు తెగకూడదు అన్న చందంగా జాగ్రత్తగా వ్యవహరించాలన్నది బీజేపీ వ్యూహంగా కనబడుతోంది. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ఉప్పూ, నిప్పులా పరస్పర విమర్శలతో చెలరేగిపోతున్నా..టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా ప్రధానినే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నా..బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పెద్దగా స్పందన కానరావడం లేదు. ఇటీవల టీఆర్ఎస్ విషయంలో బీజేపీ వైఖరి ఒకింత మారిందనడానికి ఇవే సంకేతాలుగా చెప్పవచ్చు. అసలు తొలి నుంచీ కూడా టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య బంధం ఏదో ఉందన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తూనే ఉన్నా... హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం తరువాత రాష్ట్రంలో అధికారం చేపట్టగలమన్న నమ్మకం కలగడంతో బీజేపీ దూకుడు పెంచింది. అదే సమయంలో అప్రమత్తమైన టీఆర్ఎస్ అధినేత జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు చేసిన యత్నాలు విఫలం కావడం, ఆ తరువాత తానే జాతీయ పార్టీ పెడతానంటూ ప్రకటించి, ఆ తరువాత మౌనంవహించారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా ఆయన ఎన్డీయే అభ్యర్థికి కాకుండా విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలూ హాజరయ్యారు. కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గరౌతున్నారన్న వార్తలూ వినిపించాయి. దీంతో బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్న లక్ష్యాన్ని కొనసాగిస్తూనే.. టీఆర్ఎస్ ను పూర్తిగా దూరం చేసుకోవడం సరికాదన్న అభిప్రాయానికి రావడానికి ఇదే కారణమని విశ్లేషకులు అంటున్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతున్నా.. మోడీ సర్కార్ తెలంగాణకు చేసింది, ఇచ్చిందీ ఏమీ లేదంటూ తరచూ విమర్శలు గుప్పించే కేటీఆర్ తన హస్తిన పర్యటనల్లో మాత్రం కేంద్ర మంత్రులతో ములాఖత్ అయ్యి రాష్ట్రానికి కావలసిన నిధులు మంజూరు చేయాల్సిందిగా వినతులు ఇస్తున్నారు. కేంద్ర మంత్రులూ సానుకూలంగా స్పందిస్తున్నారు. అన్నిటికీ మించి.. ఖమ్మం జిల్లాలో  గత ఏప్రిల్ లో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో బీజేపీ స్పందించిన తీరుకు..ఇప్పుడు మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అధీనంలోని భూములను టీఆర్ఎస్ సర్కార్ స్వాధీనం చేసుకుని రైతులకు పంపిణీ చేసిన సందర్భంలో బీజేపీ వ్యవహరించిన తీరునూ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా మంత్రి పువ్వాడ ఒత్తడితో పోలీసులు తప్పుడు కేసులు బనాయించి, రౌడీ షీట్ తెరచి వేధించడం వల్లే చనిపోయాడంటూ బీజేపీ ఆందోళనలు చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా సాయిగణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. అదే ఈటల విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం కాదు కదా రాష్ట్ర నాయకుల స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనిని బట్టే రెండు నెలల కిందటికీ, ఇప్పటికీ బీజేపీ వైఖరిలో, తీరులో మార్పు వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచాలంటే.. టీఆర్ఎస్ తో సంబంధాలు పూర్తిగా చెడకుండా చూసుకోవాలని బీజేపీ భావిస్తున్నది.   అదే సమయంలో రాష్ట్రంలో అధికార అందలం అందుకోవడానికి, బలోపేతం కావడానికి ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలని గట్టి పట్టుదలతో ఉందని పరిశీలకులు అంటున్నారు.    

ఈ దిండు అక్ష‌రాలా రూ.45 ల‌క్ష‌లు!

త‌ల‌కింద మంచి దిండు లేక‌పోతే నిద్ర‌ప‌ట్ట‌దు. దిండు మెత్త‌గా లేద‌ని గొడ‌వ‌ప‌డే పెద్ద‌వాళ్లూ వుంటారు. బూరుగుదూది దిండ్ల మీద మ‌న‌వాళ్ల‌కు మ‌హా వ్యామోహం. ఆ దిండు మీద త‌ల‌పెట్టుకుని అలా ప‌డుకోగా నే క్ష‌ణాల్లో మంచి నిద్ర‌లోకి జారిపోవ‌చ్చ‌న్న‌ది మంచి నిఖార్స‌యిన అభిప్రాయం. దిళ్ల‌లో అనేక ర‌కాలు చెబుతూంటారు. మ‌నం చేయించుకునేది, మ‌నం కొన్న‌ది కాస్తంత త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులోకి వ‌స్తుం ది. కానీ వాన్‌డెర్ గారి దిండు అసామాన్యం! ఎందుకంటే ఈ దిండు ఖ‌రీదు అక్ష‌రాలా 45 ల‌క్ష‌లు!   ఇంత ఖ‌రీద‌యిన వ‌స్తువులు పూర్వం బ్రిటీష్ మ‌హారాణి గారే వాడేవారు. అది వారికే చెల్లింది సుమీ అనే వారు అప్ప‌ట్లో తాత‌య్య‌లు, అమ్మ‌మ్మ‌లు. కానీ ఈ రోజుల్లో 45 ల‌క్ష‌లు పెట్టి త‌యారుచేసుకున్న దిండు ప్ర‌త్యేక‌త ఏమిట‌న్న‌ది తెలుసుకోవ‌డానికి చాలామంది ఆయ‌న్ను క‌లిసేర‌ట‌. నిజంగా ఆయ‌న అంతపోసి త‌యారుచేసుకున్నాట్టండీ?! అంటే అవును అంటూ దాన్ని చూపించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచాడు వాన్ డెర్.  థిజ్స్ వాన్ డెర్ హిల్స్ట్  అనే పెద్దాయ‌న   నిద్రలేమితో బాధపడేవారు ప్రశాంతంగా  నిద్రపోవడానికి ఈ దిండు సహాయపడుతుందన్నారు. డచ్ సర్వైకల్ స్పెషలిస్ట్-డిజైనర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండును త‌యారుచేశారు. మామూలుగా  వాడ‌డానికి సిద్ధంగా వుండే దిండు వుంటుంది. కానీ వాన్ ద‌గ్గ‌ర వున్న‌ది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అధునాతనమైన దిండు.  ఇది ఈజిప్ట్‌ పత్తి , మల్బరీ సిల్క్ తో తయారుచేశాడు.  అలాగే  విషరహిత డచ్ మెమరీ ఫోమ్‌తో నిండి  ఉంటుంది. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ప్రకారం, నెదర్లాండ్స్‌కు చెందిన  వాన్ డెర్ హిల్స్ట్ ఈ దిండు త‌యారీకి  57,000 డాల‌ర్లు  (దాదాపు రూ.45 లక్షలు) వెచ్చించారు.  వాన్ డెర్  ఈ ప్రత్యేకమైన దిండును త‌యారుచేయ‌డానికి పదిహేను సంవత్సరాలు పట్టింది. ఇది  24 క్యా రెట్ల బంగారం, వజ్రాలు,  నీలమణితో నిండి ఉంది. అంతేకాకుండా, దిండును నింపడానికి  ఉపయో గించే పత్తి  రోబోటిక్ మిల్లింగ్ యంత్రం నుండి వస్తుంది. దిండు 24-క్యారెట్ గోల్డ్ కవర్‌ను కలిగి ఉంది.  సురక్షిత మైన,  ఆరోగ్యకరమైన నిద్ర కోసం అన్ని విద్యుదయ స్కాంత వికిరణాలను నిరోధించే  ఒక  మెరుస్తున్న ఫాబ్రిక్ తొడుగు  ధర ట్యాగ్‌కు జోడించబ‌డింది.  ఇది   22.5 క్యారెట్ నీలమణి,  నాలుగు వజ్రాలను  కలిగి ఉన్న జిప్పర్. హై-టెక్ సొల్యూషన్స్, పాత-కాలపు హస్తకళను కలపడం ద్వారా, టైలర్‌మేడ్  పిల్లో అత్యంత వినూత్నమై నది. ఈ దిండు బ్రాండెడ్ బాక్స్‌లో ప్యాక్ చేయబడింది.  హిల్స్ట్ నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు ప్రశాంతంగా నిద్రపోవడానికి దిండు సహాయపడుతుందని పేర్కొన్నారు.  

నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు .. జంప్

రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో, రాజకీయ  నాయకులు ఎమ్మెల్యేలు, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం, తీసుకుంటారో ఉహించడం అన్ని  సందర్భాలలో కాకున్నా, కొన్ని సంధర్భాలో కొంచెం చాలా కష్టం. అందుకే కొన్ని కొన్ని వార్తల విన్నప్పుడు, అవునా ..? నిజమా? అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇవాళ రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం  సర్వ సాధారణ విషయం అయిపొయింది. అయినా, ఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటే, అది విశేషమే అవుతుంది. ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా పార్టీ మారతారు గానీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారడం అనేది  కనీసం  ఉహించను కూడా ఉహించ లేము. కానీ, ఒకరు ఇద్దరు కాదు ఒకేసారి నలుగురు  మజ్లీస్’ ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడు ఒవైసీకి షాక్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించారు. అయితే, ఎంఐ ఎం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించింది, పార్టీ పుట్టిల్లు తెలంగాణలో కాదు, బీహార్లో. అవును  2020లో జరిగిన  బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మొదటి సారిగా 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. సంచలనం సృష్టించింది. ఏకంగా ఐదు సీట్లను ఎంఐఎం గెలుచుకుంది. అంతకు ముందు మహారాష్ట్ర, కర్ణాటకలలో ఒకటీ అరా సీట్లలో గెలిచిన ఎంఐఎం బీహార్లో ఐదు సీట్లు గెలిచంది. ఈ గెలుపు ఇచ్చిన ఊపుతోనీ, ఒవైసీ యూపీ, పశ్చిమ బెంగాల్   సహా మరికొన్ని రాష్ట్రాలపైనా దృష్తి కేంద్రీకరించారు. అయితే, ఇంకెక్కడా కూడా ఎంఐఎం ముస్లిం ఓట్లను చీల్చి, బీజేపీకి మేలు చేయడం మినహ మరే ప్రభావమూ  చూప లేదు. ఒక్క బీహార్’లో మాత్రమే 2019 ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు, 2020లో ఐదు ఎమ్మెల్యే  సీట్లు గెలుకుని ఆ రాష్ట్ర రాజకీయలలో పాదం మోపింది.  అయితే, ఇప్పడు  అలా గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలలో  నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు.మజ్లిస్ బిహార్ విభాగం అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ తప్ప మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరారు. ఆర్జేడీ నేత, బిహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ను కలిసిన తర్వాత వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షానవాజ్, ఇజార్ అస్ఫీ, అంజార్ నైమీ, సయ్యద్ రుక్నుద్దీన్ ఆర్జేడీ కండువా కప్పుకున్నవారిలో ఉన్నారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై గతంలోనే పలు ఊహాగానాలు వచ్చాయి. కులాల ప్రకారం జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ తేజస్వీ యాదవ్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మజ్లిస్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ సైతం హాజరయ్యారు. ఆర్జేడీతో కలిసి ఓ వేదికను పంచుకోవడం మజ్లిస్ ఎమ్మెల్యేలకు అదే తొలిసారి. అమౌర్, కొచాధామ్, జోకిహాట్, బహదుర్గంజ్ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే, గెలిచిన ఐదు సీట్లలో నాలుగింటిని ఇప్పుడు కోల్పోయింది.

బొత్స‌కు జ్ఞానోద‌యం!

ఆలీసంగానైనా ఆత్మ‌శోధ‌న చేసుకుని, త‌న త‌ప్పును తెలుసుకుని ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని ప‌నిచేయువాడు ధ‌న్యుడు! ఇదేదో గొప్ప సూక్తి కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కి క‌లిగిన జ్ఞానోద‌యం. అవును. చాలా రోజులుగా చెవిలో ర‌క్తం కారేట్టు గోడు వినిపిస్తున్నా ప‌ట్టించుకోని మంత్రికి త‌న నియోజ‌క వ‌ర్గంలోని వాస్త‌వాలు ఇప్పటికి  తెలిసొచ్చాయి. ప్లీన‌రీలో మంత్రి త‌న చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ వ‌ర్గాల్లో విభేదాలు వున్నాయ‌ని ఎట్ట‌కేల‌కు అంగీక‌రించారు. కానీ వారి మ‌ధ్య స‌యోధ్య‌కు ఆయ‌న తీసుకునే చ‌ర్య లేమిట‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు.  అస‌లు విభేదాలంటూ లేకుండా వుండ‌వు. కానీ వాటిని పెద్ద‌వి చేసి బూత‌ద్దంలో చూడ‌ట‌మే మంచిది కాద ని అంటున్నారు. నియోజకవర్గం స్థాయిలో శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని అవి పార్టీకి మంచిది కాదన్నా రు. ఇంకా ఇలా బోధించారు.. ఎల్లకాలం నేనే నాయకుడ్ని అనుకోవడం మంచిదికాదు. అదృష్టం ఉంటే ఎవ రైనా నాయకుడు అవ్వొచ్చు. సంక్షేమ పథకాలందించడంలో గ్రామ స్థాయి నాయకులు లంచాలడి పార్టీకి చేటు అన్నారు. పార్టీలో పెద్ద త‌ల‌కాయ‌ల్ని ఆక‌ట్టుకోవ‌డానికి మ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో చిన్న‌వారు అలాంటి ప‌నులే చేప‌డ‌తారు.  ఎక్క‌డైనా ఇది అనాదిగా వున్న‌దే.   నియోజకవర్గంలో కొత్త నీటి బుడగలు వస్తున్నాయి.. అవి శాశ్వతం కాదు. పట్టించుకోవలసిన అవసరం లేదు. వయసులో చిన్నవాడివి నియోజకవర్గంపై అవగాహన లేకుండా మాట్లాడొద్దు. ఇది విమర్శ కాదు.. నేర్చుకో అంటూ టీడీపీ ఇన్‌చార్జ్ కిమిడి నాగార్జునకి కౌంటర్ ఇచ్చారు. మీ అమ్మగారు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఏమి అభివృద్ది చేసారో చెప్పు ముందు. నియంత రాజకీయాలు వద్దు. అందరూ కలసి నిర్ణయం తీసుకోండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవటం మానుకోమ‌ని పిలుపు నిచ్చారు. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడేం పాఠాలు చెప్పగలరు? 1998 డీఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నాను.వ‌య‌సులో పెద్ద‌వారు క‌నుక బోధ‌న చురుగ్గా చేప‌ట్ట‌డం క‌ష్ట‌మే. ఈ  వయసులో వారు  విద్యార్థులకు  పాఠాలు ఏమి చెప్తారు? ఉద్యోగులకు మళ్లీ శిక్ష‌ణ‌ నిర్వహిస్తామ‌ని అన‌డం బొత్సకు అస‌లు ఉపాధ్యాయులు, వారి స‌మ‌స్య‌ల గురించిన అవ‌గాహ‌న లేద‌నే అనాలి. 

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర

పర‌మకోటీశ్వ‌రుడు ఒకాయ‌న త‌న కూతురు పెళ్లికి పెద్ద లిస్టు చేశాడు. ఆభ‌ర‌ణాలు, దుస్తులు, ఇత‌ర సామ గ్రి, వ‌చ్చిన‌వారికి రిట‌ర్న్ గిఫ్ట్‌లు పెద్ద జాబితానే త‌యార‌యింది.  పెళ్లికి అంద‌రూ వ‌చ్చారు. మ‌హాద్భుతం గా, ఆర్భాటంగా జ‌రిగింది. తెలంగాణా బీజేపీ సీనియ‌ర్లు కూడా ఒక జాబితా త‌యారుచేస్తున్నారు. వ‌చ్చే వారం హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌బోయే బిజెపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి ఎవ‌ర్ని, ఎంత మందిని పిల‌వా ల‌ని. ఈ స‌మావేశానికి సుమారు 400 మందిని పిల‌వాల‌ని ఢిల్లీ పెద్ద‌లు నిర్ణ‌యించార‌ట‌. మ‌రి వారి మాట విని ఆ జాబితానే ఖ‌రారుచేయాలి. అయితే ఈ మ‌హా స‌మావేశం తెలంగాణా ప్ర‌భుత్వానికి ఏ మేర‌కు భయో త్పాతాన్ని క‌ల‌గ‌జేస్తుంద‌నేది చూడాలి.  ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి ఈ సారి ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని బీజేపీ అధిష్ఠానం భావి స్తోందని తెలిసింది. వీరిలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేబినెట్‌ మంత్రులు, ఆఫీస్‌ బేర ర్లు, కీలక నేతలు ఉంటారని సమాచారం. పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ పర్యవేక్షణలో జాబితా రెడీ అవుతోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై ఇంకా కసరత్తు జరుగుతోంది. జూన్‌ 30వ  తేదీనే అతిథులంతా  హైదరాబా ద్‌కు చేరుకుంటారని సమాచారం.   బిజెపి తెలంగాణాలో ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు  విశ్వ‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ స‌మా వేశాన్ని విజ‌య‌వంతం చేసి త‌మ స‌త్తా చాటాలన్నది  రాష్ట్ర బిజెపీ సీనియ‌ర్ల మాట‌.  చాలా రోజుల క్రితం టిఆర్ ఎస్ నాయ‌కులు బిజెపి వారికి చుర‌క అంటించారు.. బ‌క్క‌ప‌ల్చ‌వాడిని దెబ్బ‌తీయ‌డానికి  ఇంత సైన్యంతో హ‌డావుడి చేయ‌డంలో వారిలో టిఆర్ ఎస్ ప‌ట్ల పేరు కుపోయిన భ‌యం బ‌య‌ట‌ప‌డు తోంది.  తెలంగాణాలో బూత్ స్థాయి నుంచి పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏ విధంగా ప‌నిచేస్తున్నారు, పార్టీ విజ‌యానికి ఏ విధం గా కంక‌ణం క‌ట్టుకున్నార‌న్న‌ది ఒక నివేదిక కూడా త‌యారు చేస్తార‌ట‌. జూలై 2న హైదరాబాద్‌ మాదాపూర్‌ లోని నోవాటెల్‌ వేదికగా కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 3వ తేదీన పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రధాని బహింరంగ సభ ఉంటుంది. సభలో ప్రధాని ఏం మాట్లాడతారన్న దానిపై నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు కమల సైన్యం చేయాల్సిన కసరత్తు ఏమిటి? రానున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ను ఎలా ఢీకొట్టాలి? అజెండా ఏంటి? అనే విషయాలపై ప్రధాని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. 2024లో తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా మోదీ ప్రసంగం ఉంటుందని కూడా చెబుతున్నారు.   మోదీ విందులో తెలంగాణ రుచులు జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం రాష్ట్రానికి విచ్చేస్తున్న నేతలకు అందించే భోజనం విషయంలో స్థానిక నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ సహా నేతలకు తెలంగాణ రుచులు చూపించాలని నిర్ణయించారు.

ఈటలకు భారీ షాక్.. జమునా హేచరీస్ భూములను రైతులకు పంపిణీ చేసిన సర్కార్

ఈటల రాజేందర్ కు భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన జమునా హేచరీస్ కు చెందిన భూమిని అసైన్డ్ భూములంటూ 56 మంది రైతులకు ప్రభుత్వం పంచేసింది. కాగా రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా గుర్తింపు పొందిన ఈటల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు పంపిణీ చేయడం సంచలనంగా మారింది. ఇటీవల పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన ఈటల బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసి వచ్చారు. రాజకీయ కారణాల కంటే ఈటల తన భూముల విషయంలో బీజేపీ అగ్రనేతల అండ కోసమే హస్తిన వెళ్లారని ఆప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈటల భూములను రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసినవే అని నిర్ధారించి ఆఘమేఘాల మీద రైతులకు పంపిణీ చేయడంతో బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఈటలకు ఎటువంటి అండా లభించలేదా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. ఇటీవల కొంత కాలంగా ఈటల మౌనం, బీజేపీతో అంటీముట్టనట్లు ఉన్న తీరుతో ఆయన బీజేపీలో ఇమడ లేకపోతున్నారని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు. అయితే అమిత్ షా రాష్ట్ర పర్యటనలో ఈటలతో మాట్లాడటం, ఆయన ప్రాధాన్యత ఉన్న నేతేనని చెప్పడంతో ఆల్ ఈజ్ వెల్ అన్న భావన కలిగింది. అయితే ఈటల భూములను ప్రభుత్వం పేదలకుపంచేయడంతో ఆయనకు బీజేపీ నుంచి ఎటువంటి సహకారం అందలేదని తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దాదాపు రెండు నెలల నుంచీ   కమలం పార్టీలో ఈటలను ఏకాకిని చేశారన్న ప్రచారం జరుగుతోంది. గుర్తింపు లేని చోట ఈటల మౌనంగా సర్దుపోవడానికి కారణం తనపై ఉన్న భూ కబ్జా ఆరోపణలేననీ, బీజేపీ అండతో వాటి నుంచి బయటపడాలని ఈటల భావించడమేనని కూడా  అప్పట్లో పలువురు ఈటల సన్నిహితులు పేర్కొన్నారు. ఎంతగా సర్దుకు పోయినా ఈటలకు బీజేపీ అండగా నిలవలేదని ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన అధీనంలోని భూములను రైతులకు పంపిణీ చేయడమేనని అంటున్నారు. ఇక భూముల పంపిణీ విషయానికి వస్తే  ఈటలకు చెందిన జమునా హేచరీస్ అధీనంలో ఉన్న    85 ఎకరాల 19 గుంటల గురువారం ప్రభుత్వం పేదలకు పంచేసింది.   బీజేపీ అభ్యర్ధిగా    హుజూరాబాద్  ఉప ఎన్నికలో ఈటల గెలిచినప్పటికీ.. ఆ గెలుపులో భీజేపీకి ఏమాత్రం భాగస్వామ్యం లేదనీ, అది పూర్తిగా ఈటల విజయమని అప్పట్లోనే విశ్లేషణలు వెల్లువెత్తాయి.   దీంతో ఆయన రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఎదుగుతారన్న భయంతో పార్టీలో ఆయన ఎదుగుదలను రాష్ట్ర బీజేపీ నాయకత్వం అడ్డుకుందన్న ప్రచారం కూడా జోరుగా సాగింది.  ఆ కారణంతోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అగ్ర నాయకత్వం వద్ద చక్రం తిప్పి ఈటల భూ కబ్జా ఆరోపణల విషయంలో పార్టీ నుంచి అండ అందకుండా చేసిందన్న అభిప్రాయం   రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా ఈటల అధీనంలోని జమునా హేచరీస్ భూమిని ప్రభుత్వం రైతులకు పంపిణీ చేయడంతో ఈటల బీజేపీలో సౌఖ్యంగా, సౌకర్యంగా లేదనీ పార్టీతో ఆయన సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్న వాదనకు బలం చేకూరినట్లైంది. 

ప్లాస్టిక్ కు ఇక మంగళం

పాలు, పెరుగు, అర‌టిప‌ళ్లు, కూర‌లు... ఏవైతేనేం ప్లాస్టిక్ క‌వ‌ర్లో ఇంటికి రావాల్సిందే. ఇది అనాదిగా వున్న అల‌వాటు. ఎంత‌కాద‌న్నా గృహిణులు ఇపుడు బిజెపి ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌కు కాస్తంత కంగారు ప‌డుతున్నా ర‌నే అనాలి. కావ‌డానికి ఒక‌సారి ఉప‌యోగించి పారేసే క‌వ‌ర్లే అయినా, వాటి వ‌ల్ల ఎంతో వుప‌యోగం వుంది, వీటిని పూర్తిగా నిషేధిస్తే ఎలా అని  ప్ర‌శ్నిస్తున్నారు. కానీ దేశం అన్ని ప్రాంతాల్లోనూ ఈ ప్లాస్టిక్ క‌వ‌ర్లతో ప‌ర్యావ‌ర‌ణానికి విప‌త్తు సంభ‌విస్తోంద‌న్న నినాదాలు చాలా కాలంనుంచే విన‌ప‌డుతున్నాయి. ప్లాస్టిక్ వాడ‌కాన్ని క్ర‌మేపీ త‌గ్గించుకోవ‌డం లోకానికి శ్రేయ‌స్క‌రం అని ఇప్ప‌టికే ప‌ర్యావ‌ర‌ణ నిపుణులు గొంతు చించుకుంటున్నారు. వీటివ‌ల్ల కాల‌వ‌లు, న‌దులూ కాదు, ఏకంగా స‌ముద్రాలూ పాడ‌వుతున్నాయ‌ని గోడు పెడుతున్నారు.  అయితే హ‌ఠాత్తుగా నిర్ణ‌యం తీసుకుంటే క‌ష్ట‌మ‌ని కేంద్రం కొంత స‌మ‌యం తీసుకున్నా గ‌ట్టి నిర్ణ‌యానికి వ‌చ్చింది. జూలై ఒక‌టో తేదీ నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని తూ.చ త‌ప్ప‌క అమ‌లుచేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టిం చింది. అంతేకాదు నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల అక్రమ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని తనిఖీ చేయడానికి జాతీయ, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుచేసింది.  భాగస్వాములందరి ద్వారా సమర్థవంతమైన నిమగ్నత, సంఘటిత చర్యల ద్వారా మాత్రమే నిషేధాన్ని విజయవంతం చేయడం సాధ్యపడుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను దశలవారీగా తొలగించాలని గౌరవనీయులైన భారత ప్రధాని  మోదీ ఇచ్చిన పిలుపున‌కు అనుగుణంగా, భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ  2021 ఆగస్టు 12న  ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు, 2021 ను మౌఖికంగా చేసింది. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' స్ఫూర్తిని ముందుకు తీసుకువెళుతూ, చెత్తాచెదారం, నిర్వహ ణలో లేని ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టడానికి దేశం ఒక నిర్ణయాత్మక చర్య తీసుకుం టోంది. 2022 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా తక్కువ వినియోగం, పారేయ‌డానికి సామర్ధ్యం కలిగిన గుర్తించి న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం,  వినియోగాన్ని భారత దేశం నిషేధించనుంది. 2019 లో జరిగిన 4 వ ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీలో, భారతదేశం సింగిల్-యూజ్ ప్లాస్టిక్ ఉత్ప త్తుల కాలుష్యాన్ని పరిష్కరించడంపై ఒక తీర్మానాన్ని ప్రయోగాత్మకంగా తీసుకుంది, చాలా ముఖ్యమైన ఈ సమస్యపై ప్రపంచ సమాజం దృష్టి సారించాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించింది. యు.ఎన్.ఇ.ఎ 4 వద్ద ఈ తీర్మానాన్ని ఆమోదించడం ఒక ముఖ్యమైన దశ. 2022 మార్చిలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీ 5వ సెషన్లో, ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రపంచ చర్యను నడిపించే తీర్మానంపై ఏకాభిప్రాయాన్ని అభి వృద్ధి చేయడానికి భారతదేశం అన్ని సభ్య దేశాలతో నిర్మాణాత్మకంగా నిమగ్నమైంది. చెత్తాచెదారంతో నిండిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం దృఢమైన చర్యలు చేపట్టింది. నిషేధిత వస్తువుల జాబితాలో ప్లాస్టిక్ కర్రలతో కూడిన ఇయర్ బడ్స్, బెలూ న్‌లకు ప్లాస్టిక్ కర్రలు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండి స్టిక్స్ , ఐస్ క్రీమ్ స్టిక్స్, అలంకరణ కోసం పాలిస్టైరిన్ (థ ర్మోకోల్), ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రా, ట్రేలు, స్వీట్ బాక్సుల చుట్టూ చుట్టడం లేదా ప్యాకింగ్ ఫిల్మ్లు, ఆహ్వాన కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు,  100 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్‌లు, స్టిక్క‌ర్లు  ఉన్నాయి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సవరణ నిబంధనలు, 2021 ప్రకారం సెప్టెంబర్ 30, 2021 నుండి అమలులోకి వచ్చే విధంగా డెబ్బై ఐదు మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు వాడకాన్ని నిషేధించింది. 31 డిసెంబర్ 2022 నుండి అమలులోకి వచ్చే విధంగా నూట ఇరవై మైక్రాన్ల మందం కంటే తక్కువ మందం కలిగిన వాటిపై నిషేధం ఉంటుంది.

బల పరీక్ష తప్పకపోతే రాత్రికే ఠాక్రే రాజీనామా?

మహారాష్ట్రలో ఎనిమిది రోజుల క్రితం మొదలైన రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరుకుంది. అయితే, అసెంబ్లీలో గవర్నర్‌ ఆదేశించిన విధంగా రేపు ( గురువారం) బల పరీక్ష జరిగితే, ఏమి జరుగుతుందో ముందే ఉహించిన, అధికార 'అఘాడీ' కూటమి, బలపరీక్ష నిరూపణను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ బలపరీక్ష నిరూపణను సవాల్ చేస్తూ.. శివసేన చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో, గవర్నర్ అదేశించిన విధంగా  గురువారం (రేపు) అసెంబ్లీ బల నిరూపణ జరుగుతుందా లేదా అనే విషయంలో సందిగ్ధత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే,  బుధవారం (ఈ రోజు)   సాయంత్రం సునీల్‌ ప్రభు ప్రభు పిల్  పై  సుప్రీం   తీర్పు ఏమిటో   తేలిపోతుంది.  అయితే, ఇప్పడు ప్రశ్న, బల పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అనేది కాదు, బల పరీక్ష ఎప్పుడు జరిగినా, మహా వికాస అఘాడీ (ఎంవీఎస్) ప్రభుత్వం, సభలో సంఖ్యా బలాన్ని నిరుపించుకుంటుందా? అందుకు అవసరమైన సంఖ్యా బలం కూటమికి వుందా? అంటే ఇప్పటికిప్పుడు ఉందని కానీ, లేదని కానీ, చెప్పే పరిస్థితి లేదు. అయితే, శివసేన తిరుగుబాటు వర్గం నేత ఏక్‌నాథ్ షిండే చెప్పు కుంటున్న విధంగా 39 మంది శివసేన ఎమ్మెల్యేలతో సహా మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నదే నిజమైతే  ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పభుత్వం బల పరీక్షను నెగ్గుకు రావడం అయ్యే పనికాదని, మహారాష్ట్ర పరిణామాలను గమనిస్తున్న ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి, అసమ్మతి ఎమ్మెల్యేలలో 20 మంది ఎమ్మెల్యేలు తమ తో టచ్’లో ఉన్నారని, శాసన సభ బల పరీక్షలో గెలుస్తామని, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీమాగా  ఉన్నా, బల పరీక్ష వాయిదాకు శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో,  సంఖ్యా బలం శివసేన వైపు లేదనే విషయం తేట తెల్లంగా తెలిసిపోతోందని, పరిశీలకులు అంటున్నారు. మరో వంక ఏక్‌నాథ్ షిండే వర్గం, అదే విధంగా షిండే వర్గంతో చేతులు కలిపిన బీజేపీ బల పరీక్షకు సిద్ధమవు తున్నాయి.  కాగా, బీజేపీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలందరూ  ఈరోజు (బుధవారం) సాయంత్రం లోపు ముంబయిలోని తాజ్ హోటల్ కు రావాలన్నదే ఆ ఆదేశం.  మరోవంక ప్రస్తుతం గౌహతీలో ఉన్న శివసేన తిరుగుబాటు వర్గం నేత షిండే, గురువారం ఉదయం తమ వర్గం  ఎమ్మెల్యేలతో కలిసి ముంబయికి చేరుకుంటానని, అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలపరీక్షలో పాల్గొంటామని వెల్లడించారు. అధికార మహా వికాస్‌ అఘాడీ కూటమిలోని శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది శాసన సభ్యులు ఉన్నారు. ప్రతిపక్షం బీజేపీకి  106 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే షిండే తిరుగుబాటుతో.. ఆయన వెంట 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు స్వతంత్రులు షిండే వర్గంలో ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 287 మంది సభ్యులున్నారు. ఈ నేపధ్యం,లో  శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు 39 మంది. ఓటింగులో  పాల్గొన్నా, పాల్గొనక పోయినా, అఘాడీ సర్కార్ కుప్ప కూలడం ఖాయమని, అంటున్నారు. శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొని విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే, బీజేపీ కూటమి బలం మెజారిటీ మార్క్ 144ను సునాయాసంగా దాటేస్తుంది. అలా కాదని, శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు 39 మంది. సభకు హాజరుకాకపోతే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 248 కి తగ్గనుంది. ఈ క్రమంలో ఠాక్రే తన బలాన్ని నిరూపించుకోవాలంటే 125 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. ప్రస్తుతం మహా వికాస్‌ అఘాడీ కూటమి ఉన్న సంఖ్యా బలం 113 మాత్రమే. ఈ పరిస్థితుల్లో బలపరీక్ష ఎదురైతే ఠాక్రే సర్కారు కుప్పకూలే ప్రమాదం ఉందని, సో .. బల పరీక్ష జరిగితే, ప్రభుత్వం కూలిపోక తప్పదని అంటున్నారు. అందుకే, సుప్రీం కోర్టు బల పరీక్షకు పచ్చ జండా ఊపితే ... ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సర్కార్ పడిపోవడం ఖాయమని, అదే జరిగితే ముందుగా, ఈ రాత్రికే  ఠాక్రే రాజీనామా  చేసినా చేస్తారని అంటున్నారు.

సాలు దొర.. సెలవు దొర.. సాలు మోడీ.. సంపకు మోడీ.. బీజేపీ, టీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్

హైదరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది.  ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ లోని హైటెక్స్ లో వచ్చే నెల 2,3 తేదీలలో జరగనున్న బీజీపీ కార్యకర్గ సమావేశాలకు హాజరౌతున్న నేపథ్యంలో ఫ్లెక్సీ వార్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే వచ్చే నెల 3న సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. దీంతో ఈ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు నిమగ్నమయ్యాయి.   పార్టీ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ నేపథ్యంలో జంట నగరాలలో బీజేపీ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అన్నిటి కంటే ముఖ్యంగా బీజేపీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పనైపోయిందన్న అర్ధం వచ్చేలా ‘సాలు దొర.. సెలవు దొర’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీవార్ కు కారణమైందని అంటున్నారు.  మోడీ బహిరంగ సభ జరగనున్న సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిలో ‘ సాలు మోడీ.. సంపకు మోడీ’ అన్న ఫ్లెక్సీ ప్రాధాన్యత  సంతరించుకుంది.  ఇక కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా  నల్లధనం వెనక్కి తెప్పించడం సహా, నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలను ప్లెక్సీలో ముద్రించారు.  ఇవే కాకుండా పలు ఫ్లెక్సీలు కూడా మోదీకి వ్యతిరేకంగా వెలిశాయి. కాగా ఈ  హోర్డింగ్ లు, ప్లెక్సీలు   ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో పోలీసులను మోహరించారు. బీజేపీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేసింది ఎవరన్నది తెలియకపోయినా, వీటి వెనకున్నది టీఆర్ఎస్సేనని బీజేపీ ఆరోపిస్తోంది. గత రెండు రోజులుగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది.  ఈ ఫ్లెక్సీ వార్ నేపథ్యంలో  బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకదాని తీరును మరోటి తప్పుపడుతున్నాయి.  

ర‌ష్యా డాల్ఫిన్ ఆర్మీ!

సైన్యంలోకి యువ‌త‌ను అనేక ప‌రీక్ష‌లు పెట్టి తీసుకోవ‌డం మామూలే. అనేక ర‌కాల శిక్ష‌ణ‌లు ఇచ్చి అనేక విభాగాల్లో సైన్యాన్ని సిద్ధం చేయ‌డం ఏ  దేశానిక‌యినా ప‌రిపాటి.  కానీ డాల్ఫిన్‌లను కూడా యుద్ధానికి  సిద్ధం చేయడం మాత్రం ర‌ష్యాకే  చెల్లింది! అవును. ఉక్రెయిన్‌తో త‌ల‌ప‌డిన యుద్ధంలో నేల మీంచే కాకుండా స‌ముద్రం గర్భం నుంచి కూడా దాడులు చేయ డానికి ర‌ష్యా కొత్త వ్యూహ ర‌చ‌న చేసింది. దీన్ని ఉక్రెయిన్ క‌నీవినీ ఎరుగ‌దు. న‌ల్ల‌స‌ముద్రంలో త‌న నావికా స్థావ రాన్ని సుర‌క్షితం చేసుకోవ‌డానికి  కోస్ట‌ల్ ఆర్మీలా డాల్ఫిన్ ఆర్మీని త‌యారుచేసింది. కుక్క‌ల‌కి శిక్ష‌ణ నీయ వ‌చ్చు. ఇది ఎప్ప‌టినుంచో పోలీస్ శాఖ వారు అమ‌లుచేస్తున్న ప‌ద్ధ‌తి. డాగ్ స్క్వాడ్ అనేది వుంది. ర‌హ‌స్యా ల్ని ఛేదించ‌డానికి, దొంగ‌ల్ని, హంత‌కుల‌ను ప‌ట్టుకోవ‌డానికి కుక్క‌ల‌ను రంగంలోకి దింపుతారు. అవి వాస న‌ను ప‌ట్టి తిన్న‌గా హంత‌కుడిని ప‌ట్టిస్తాయి. దీనికి ప్ర‌త్యేక శిక్ష‌ణా వుంటుంది. అదో ప్ర‌త్యేక విభాగం.  శిక్ష‌ణ ఇవ్వ‌డానికి మ‌రి డాల్ఫిన్స్‌ని ఎలా మ‌చ్చిక‌చేసుకున్నారో! డాల్ఫిన్స్‌తో స‌ర‌దాగా ఆడ‌వ‌చ్చ‌ని చాలా సంద‌ర్భాల్లో విదేశాల్లో స‌ముద్ర‌ తీరాల్లో తీసిన చిత్రాలు, వీడియోలు తెలియ‌జేశాయి. అది ఓ ప‌ది ప‌ది హేను నిమిషాల ఆట వ‌ర‌కే. కానీ యుద్ధానికి స‌న్న‌ద్ధం చేయ‌డం మామూలు విష‌యం కాదు. న‌ల్ల  సము ద్రంలో న‌వాస్తా పోల్ అనే చోట రెండు డాల్ఫిన్ శిక్ష‌ణా కేంద్రాలు వున్న‌ట్టు అమెరికా ఉప‌గ్ర‌హ చిత్రాల ద్వారా గుర్తించింది. డాల్ఫిన్‌కి స‌ముద్రం అడుగున ఏవయినా వింత వ‌స్తువులు గుర్తించే ప్ర‌త్యేక‌త వుంది. అంటే సైనిక దాడు ల్లో భాగంగా నీటి అడుగున శ‌తృవువులు ఏమ‌న్నా అమ‌ర్చార‌నేది తెలుసుకోవ‌డానికి డాల్ఫిన్  ఎంతో స‌హ కరిస్తుంది. అందువ‌ల్ల  వాటిని ర‌ష్యా ప్ర‌త్యేక ద‌ళంగా భావించి వినియోగించింద‌ని తేలింది. అయితే ఈ త‌ర‌హా  డాల్పిన్ సైన్యాన్ని పూర్వం అంటే 1950ల్లోనే అమెరికా వుప‌యోగించింది.  మ‌రి మెల్ల‌గా ఈ జ‌ల జీవాల సైన్యానికి స‌ముద్ర తీరం వున్న దేశాలు కూడా ఆస‌క్తి చూపుతాయ‌నే అనుకోవాలి. 

నిద్ర సుఖ‌మెరుగునా ?!

కాయ‌క‌ష్టం చేసి వొళ్లు తెలీని నిద్ర‌లోకి జారుకోవ‌డం ఒక లెక్క‌. హ‌ఠాత్తుగా వొంట్లో బాగాలేక ఏ చెట్టు కింద నో కాస్తంత విశ్ర‌మించి అలా నిద్ర‌లోకి జారుకోవ‌డం మ‌రో లెక్క‌.  కానీ   వైసీపీ  మంత్రి  బొత్స స‌త్యనారాయ‌ణ‌ది మ‌రో లెక్క‌! ఒక‌ వంక ప్లీన‌రీ జ‌రుగుతోంది, ఆయ‌న మాత్రం హాయిగా నిద్ర‌లోకి జారారు. అంటే ఆ ప్లీనరీ ఎంత ఆసక్తిగా సాగుతోందో ఇట్టే అర్ధమైపోతుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో నేత‌ల ప్ర‌సంగాలు ఒకింత  బోరు కొడ‌తాయి. విసుగెత్తి ప్ర‌జ‌లు ఇంటికి వెళ్ల‌వ‌చ్చు.  ఏదో అర్జంటు ఫోన్ కాల్ అనీ వెళ్ల‌వ‌చ్చు. కానీ బొత్స‌గారికి బొత్తిగా ఆ అవ‌కాశ‌మే లేదు. ఎందుకంటే ప్లీన‌రీలో  జ‌నం కంటే మంత్రులు, నాయ‌కులే అధిక‌ సంఖ్య‌లో వున్నారు. పైగా బొత్స మ‌ధ్య‌లో వెళిపోతే, పోనీ ఓ ప‌ది నిమిషాల‌కైనా అలా తిరిగేసి రావ‌డానికి వెళ్లినా మీడియా వారు ఠ‌క్కున ప‌ట్టేసుకుంటారు. ప్లీన‌రీ  అత్యం త ముఖ్య‌మైన అంశాలు చ‌ర్చిస్తారు. వారి అత్యంత మాటెలా వున్నా ఇంత బోర్ కొట్టేట్టు వుంద‌నేది బొత్స వైఖ‌రే చెబుతుంది.  కానీ బొత్స కునుకుకి  తాత్ప‌ర్య మదేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  ఆయ‌న ఆంధ్రా  దేవెగౌడ అనుకోవాలా?  పాపం ఆ పెద్దాయ‌న కూడా వీల‌యినంత‌వ‌ర‌కూ క‌లల్లో విహ‌రించ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు. అది జాతీయ స్థాయి స‌ద‌స్స‌యినా, అంత‌ర్జాతీయ స‌ద‌స్స‌యినా, నిద్రా దేవి మ‌హ‌త్తు అలాంటిది మ‌రి. గ‌ట్టిగా మాట‌లు విన్నపుడు, ఎవ‌రో పిలిచిన‌ట్టు విన్న‌పుడు ఠ‌క్కున లేచి సాలోచ‌న‌గా చుట్టూ చూసి తానేదో అద్బుత ఆలోచ‌న‌లో వున్న‌ట్టు న‌టించ‌డంలో ఇలాంటివారు ఘ‌నాపాటి!  ప్లీన‌రీకి భారీ ప్ర‌చారం చేసుకున్నా చాలాత‌క్కువ మంది హాజ‌ర‌యి నాయ‌కుల‌ను నిరావ‌ప‌రిచారు.  ఇదేదో  పార్టీ ఆఫీసులోనే కానిచ్చేస్తే బాగుండేదిగా అనుకుంటున్నారు. సాలూరు, బొబ్బిలిలో జరిగిన ఫ్లీనరీలకు మంత్రి బొత్స,  ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఫ్లీనరీ ప్రారం భం నుంచి పలు సందర్భాల్లో కునుకు తీస్తున్న మంత్రి బొత్సను చూసిన నేతలు ఆయనకు నిద్రాభంగం కలగనీయలేదు. ఇక సాలూరు సభలో అయితే వచ్చిన కార్యకర్తలే తక్కువ. సభ ప్రారంభం కాగానే మూడొంతుల జనం ఇంటి ముఖం పట్టారు. ఎక్కువ శాతం ఖాళీ కుర్చీలకు నేతలు ప్రసంగాలు వినిపించాల్సి వచ్చింది. నాలుగు మండలాల నుంచి ఆశించిన స్థాయిలో కార్యకర్తలు రారనుకున్నారో.. రాలేరనుకున్నారో గానీ.. బొబ్బిలో చిన్న పాటి హాలులో ఫ్లీనరీ జరిపించేసి మమ అనిపించారు. అయితే సాలూరు సభలోనూ మంత్రి బొత్స కునుకు తీశారు. ఏది ఏమైనా   ఫ్లీనరీ సమావేశంలో కునుకుతీసి బుక్ అయ్యారు.