అ ఇద్దరి మధ్యనే పోటీ.. ప్రతిపక్షాలకు పరీక్ష!

రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం  115 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.అయితే,, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు. నిజానికి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు ఎవరిదో ముందుగానే తెలిసి పోయింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో ఏంటో ఇంతో  అనుమానం ఉన్నా, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ  గిరిజన మహిళ  ద్రౌపది ముర్మును టం అభ్యర్ధిగా ప్రకటించడంతోనే, అధికార కూటమి అభ్యర్ధి గెలుపు విషయంలో ఉన్న కొద్దిపాటి అనుమనాలు కూడా తొలిగి పోయాయి. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకు దేశ రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉన్నా, ప్రతిపక్ష పార్టీల మధ్య సయోద్యాత లేక పోవడం ఆయనకు, శాపంగా మారిందని, ఆయనను సమర్ధిస్తున్న పార్టీలు, నాయకులే మధ్యలోనే కాడి వదిలేశారు.  ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపికే ఓ ప్రహసనంగా సాగింది. చివరకు సిన్హా పేరు ఖరారైనా,  ప్రతిపక్ష పార్టీలలో గట్టిగా అయన వెంట నడిచే పార్టీలు ఏవీ, అంటే, ఏవీ కనిపించడం లేదు. మరోవంక  ఆయన నామినేషన్ విషయంలోనూ పొరపొచ్చాలు బయటకొచ్చాయి.ప్రతిపక్ష  పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపికకు సంబంధించి తొలి అడుగు వేసిన మమతా బెనర్జీ, ఆ తర్వాత ఎందుకో వెనకడుగు వేశారు. నిజానికి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికయ్యే వరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో, ఆపార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. అయినా, సిన్హా నామినేషన్ కార్యక్రమానికి ఆమె డుమ్మా కొట్టారు. అసలు, ఆయన్ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిన, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కూడా మమతా దీదీ హాజరు కాలేదు.  అదలా ఉంటే, సిన్హా నామినేషన్ వరకు, కాంగ్రెస్ ఉన్న కూటమితో కలిసేది లేదని, మొత్తం ప్రక్రియకు దూరంగా ఉన్న, తెరాస ఆ తర్వాత  యశ్వత్ సిన్హాకు ఓపెన్ గా మద్దతు ప్రకటించడమే కాకుండా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్ మందీ మార్బలంతో నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఇప్పడు తెలంగాణలో అదొక రాజకీయ దుమారంగా మారింది. అదలా ఉంటే ఇప్పడు యశ్వత్ సిన్హా  ప్రచార యాత్రలో భాగంగా జులై 2 న హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా తెరాస ఆయన తరపున  ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరు అవుతుందా? లేదా అన్నది రాజకీయ మీమాంసగా మారింది. ఇప్పటికే, కాంగ్రెస్, తెరాస జట్టు కట్టారని  బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఇప్పడు, ఆ బురద కడుక్కోవడంలో  రేవంత్ రెడ్డి సతమత మవుతున్నారు. అదలా ఉంటే, ఇప్పటికే బీజేడీ, జేఎంఎం, బీఎస్పీ ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించాయి. ఇప్పడు తాజాగా, జేడీఎస్ కూడా ముర్ముకు మద్దతు ప్రకటించింది. పార్టీ నేత, కర్ణాటక మాజే ముఖ్యమంత్రి కుమార స్వామి ఈ మేరకు ప్రకటన చేశారు. ముర్ము జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడకు ఫోన్ చేసి మద్దతు కోరిన నేపధ్యంలో, ఆమెకు మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని  చెప్పారు. ఈ పరిణామాలు అన్నింటినీ గమనిస్తే, ప్రతిపక్షాల ఐక్యత ఎండమావిగానే ఉందని, ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగా అవుతుంది ఆనుకున రాష్ట్రపతి ఎన్నిక రాజకీయం, ప్రతిపక్షాల అనైక్యతకు అద్దం పడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.  అదలా ఉంటే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం  115 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.అయితే,, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు.దాఖలైన నామినేషన్ పత్రాలలో  28 నామినేషన్లను వివిధ సాంకేతిక కారణాల వల్ల ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 87 నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి గురువారం పరిశీలించారు. అందులో నిబంధనల ప్రకారం దాఖలు చేయని 79 నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. రాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్‌ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించడం, మరో 50 మంది బలపరచడం తప్పనిసరి. ఇంతమంది మద్దతు కూడగట్టడం సామాన్య అభ్యర్థులకు సాధ్యం కాదు కాబట్టి చివరికి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మాత్రమే బరిలో మిగిలారు.  జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహిస్తారు. 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

చీమ‌లా.. మ‌జాకా!

చీమ‌లు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌ప‌డ‌తాయి. ఒక్క‌టిగానో,  గ్రూప్‌గానూ. ఏద‌యినా తిండి ప‌దార్ధం ద‌గ్గ‌రికి మాత్రం అనేక చీమ‌లు పోటీప‌డ‌వు, ఒక వ‌రుస‌గా వెళ్లి దాని మీద ప‌డి తింటాయి. అవి ఏ బెల్లం ముక్కనో లాక్కెళ్లం చూస్తూంటాం. ఏకంగా బాగా బ‌రువ‌యిన వ‌స్తువును లాక్కెళిపోవ‌డం విన్నారా?  ఏకంగా ఓ పెద్ద బంగారు గొలుసునే లాక్కెళ్లిపోయాయి. ఏదో ప‌చ్చ‌గా క‌దులుతోంద‌ని  నందా అనే వ్య‌క్తి  ప‌రిశీల‌న‌గా చూస్తే ఈ సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది.  చీమ‌లు శ్ర‌మ‌జీవ‌నానికి గొప్ప ఉదాహ‌ర‌ణ‌. వాటి  మ‌ధ్య  ఐక్య‌త ప‌టిష్ట‌మైన‌ది.  చాలా దూరం నుంచి ఏద‌న్నా తిండి ప‌దార్ధం తెచ్చుకోవాలంటే అనేక చీమ‌లు క‌లిసిక‌ట్టుగా వెళ్లి తెచ్చుకుంటాయి.  అయితే ఈ బంగారు గొలుసు విష‌యంలో చీమ‌ల్ని దొంగ‌లుగా చిత్రీక‌రించ‌లేం. బ‌హుశా ఆ గొలుసుకి  చ‌క్కెర లాంటి ఏ తీపి ప‌దార్ధమో ప‌ట్టి వుండ‌వ‌చ్చు.  కొండ‌ల ప్రాంతంలో  ఎవ‌రు పారేసుకున్నారో ఏమో మ‌రి. వారి తినే ప‌దార్ధ‌మేదో దానికి అంటిందేమో.. అటుగా వ‌చ్చిన చీమ‌లు ఆ గొలుసును ప‌ట్టి లాక్కెళ్లాయి. అయితే ఇది ఎక్క‌డ జ‌రిగింద‌నేది తెలియ‌లేదు.  ఇది చూసిన అట‌వీశాఖాధికారి సుశాంత్ నందా  వీడియో తీసేరు.  వేలమంది చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.  ఒక‌రిద్ద‌రు చీమ‌ల‌కూ దొంగ‌త‌నం అంట‌గ‌ట్టారు. మ‌రికొంద‌రు  ఏదో నెల్లాళ్ల‌పాటు తినే వ‌స్తువ‌నుకుని పాపం క‌ష్ట‌ప‌డి లాక్కెళుతున్నాయోమోన‌ని, గొప్ప టీమ్ వ‌ర్క్‌కి వుదాహ‌ర‌ణా అనీ అన్నారు. ఇంకొంద‌రు  చీమ‌ల రాణికి సైనికులు గొప్ప బ‌హుమ తిగా తీసికెళుతున్నాయోమోన‌నీ అన్నారు. ఎవ‌రేమ‌న్నా, చీమ లకు మ‌న‌లా బంగారం పిచ్చి వుండ‌దుగా! 

టీచ‌ర్‌ని గొర్రె అన్నారు.. ఆమె ఆనందంగా ఏడిచింది!

మ‌న‌లో తొంభై శాతం మందికి విద్యార్ధి ద‌శ‌లో మాథ్స్ టీచ‌ర్ అంటే భ‌యం. క్లాసులో అప్ప‌టిదాకా కాస్తంత స‌ర‌దాగా వున్నపుడు మాథ్స్ టీచ‌ర్ రావ‌డంతో భ‌యం త‌ర‌గ‌తి గ‌దంతా ఆవ‌హిస్తుంది. భ‌యంతో కూడిన గౌర‌వం ప్ర‌ద‌ర్శించ‌డం ప‌రిపాటి. టీచ‌ర్ లెక్క త‌ప్పుచేస్తే తిట్ట‌డం లేదా  కొట్ట‌డం  చాలా స‌హ‌జం. విద్యా ర్ధులు పెద్ద అవ‌మానంగా తీసుకోవ‌డ‌మూ అంతే స‌హ‌జం.  కానీ  ఒక  వూళ్లో 8వ త‌ర‌గ‌తి విద్యార్ధులు టీచ‌ర్ ని  గొర్రె అన్నారు. ఆమెకి వాళ్లు  త‌న‌ని అలా పిల‌వ‌డంలో అస‌లు అర్ధం చాలా రోజుల త‌ర్వాత  తెలిసి ఎంతో ఆనందించింది.  ఇంత‌లా అభిమానించారా అని క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌యింది. త‌న విద్యార్దులు త‌న‌ను గొర్రె అని పిలిచారు. ఆ పిల‌వ‌డంలో అంత‌రార్ధం ఏమిటో తెలీక టీచ‌ర్  చాలా బాధప‌డింది. ఆ మాట‌కు అర్ధ‌మేమిటి, పిల్ల‌లు త‌న‌ను అలా ఎందుకు పిలిచి వుంటారో ఎవ‌రైనా చెప్ప గ‌ల‌రా అని ఏకంగా సోష‌ల్ మీడియా రెడిట్ లో  ఈమ‌ధ్య‌నే  పోస్ట్ చేసింది. అది చ‌దివిన చాలామంది ఆమెను బాధ‌ప‌డ న‌వ‌స‌రం లేద‌ని అన్నారు. కార‌ణం టీచ‌ర్‌ని పిల్ల‌లు  ప్రేమ‌గానే  అలా స‌ర‌దాగా పిలిచా ర‌ని అర్ధంచేసు కోమని  నెటిజ‌న్లు  వివ‌ర‌ణ ఇచ్చారు.  కొంద‌రు విద్యార్ధ‌ల‌కూ మాథ్స్‌ టీచ‌ర్లంటే  గౌర‌వం వుంటుంది. వాళ్లూ స‌ర‌దాగా వారిలో వారు అలా నిక్‌నేమ్‌తో  పిలుచుకుంటూంటారు. బ‌హుశా ఈ టీచ‌ర్ అది వినే వుంటారు. పాపం ఎంతో బాధ‌ప‌డీ వుంటారు.  గౌర‌వం వ్య‌క్తం  చేయ‌డంలో పిల్ల‌ల ప‌ద్ధ‌తి వేరుగా వుంటుంద‌నేది  ఆమె కాస్తంత  ఆల‌స్యంగానే తెలుసు కున్నారు.  త‌న‌ను గొర్రె అని పిల‌వ‌డంలో వారికి త‌న ప‌ట్ల ఎంతో అభిమానం, గౌర‌వం వుంద‌ని అందుకే అలా పిలిచేవార‌ని నెటిజ‌న్ల వివ‌ర‌ణ‌తో ఆమె ఎంతో పొంగిపోయింది. ఈసారి తిట్టుకోలేదు. భ‌డ‌వ‌ల్లారా ఇన్నాళ్లూ ఇంత ప్రేమాభిమానాల‌ను దాచుకున్నార్రా అని ఆనందంతో క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు ఆ టీచ‌ర్‌. టీచ‌ర్ల‌కు విద్యార్ధుల నుంచి డ‌బ్బులు అక్క‌ర్లేదు. మంచి విద్యార్ధులు, మంచి వ్య‌క్తులుగా స‌మా జంలో నిల‌వ‌డ‌మే కోరుకుంటారు. ఇంతటి  అభిమానమే ఆశిస్తారు.   

ఎంఐఎం ఎమ్మెల్యేల చేరికతో బీహార్‌లో మ‌ళ్లీ పుంజుకున్న ఆర్‌జేడి

బీహార్‌లో తేజ‌స్వ‌నీ యాద‌వ్  నాయకత్వంలోని  ఆర్‌జెడి మ‌ళ్లీ  అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.  నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీ గూటికి చేరడంతో ఇది సాధ్యమైంది.  ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ సభ్యుల సంఖ్య 80కి చేరింది. అంటేజెడియుతో  క‌లిసి అధికారంలో వున్న బిజెపికి ఉన్న సభ్యుల సంఖ్య కంటే  ఆర్జేడీకి ముగ్గురు   ఎక్కువ కావ‌డంతో ఆర్‌జెడి మ‌రోసారి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. కాగా 243మంది స‌భ్యుల బీహార్ అసెంబ్లీ లో .జేడీయూ ఎమ్మెల్యేలు 45 మంది వున్నారు.   2020 బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్‌జెడి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది.  అయితే  బీజేపీ, జేడీయూ కూటమి కంటే తక్కువ మంది సభ్యులు ఉండటంతో మెజారిటీకి దూరమై విపక్షంగా మిగిలిపోయింది. నితీష్ కుమార్ బిజెపితో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు, అయితే  అధికార కూటమిలో బీజేపీదే పై చేయిగా నిలవడంతో నితీష్ కుమార్ ఒకింత ఒత్తిడికి లోనవుతూ వచ్చారు. పలు సందర్భాలలో ఆయన కేంద్ర నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకించారు. కులగణన వంటి ప్రధాన సమస్యలపై సీఎం నితీష్ కుమార్ విపక్ష నేత తేజస్వి స్టాండ్ నే తీసుకున్నారు. ఇది జేడీయూ, ఆర్జేడీలు మళ్లీ దగ్గరౌతున్నాయన్న ఊహాగానాలకు తెరతీసింది. అయితే బీజేపీ, జేడీయూ పొత్తు విచ్ఛిన్నం కాకుండా సాగుతూనే వచ్చింది. తాజాగా ఎంఐఎం నుంచి నలుగురు సభ్యులు ఆర్జేడీ గూటికి చేరారు. వారి చేరికను ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ లౌకిక శక్తుల బలోపేతంగా అభివర్ణించడమే కాకుండా ఆ నలుగురినీ తన కారులోనే అసెంబ్లీకి తీసుకు వెళ్లారు. కాగా వీరి చేరికతో ఆర్జేడీ బలం పెరగగా ఎంఐఎం బలం ఐదు నుంచి ఒకటికి పడిపోయింది.   ఆర్‌జెడి గ‌త ఎన్నిక‌ల్లో 75 స్థానాలు గెలుచుకుని ఒంటరిగా విజ‌యం సాధించిన పెద్ద పార్టీగా నిలిచింది.  త‌ర్వాత జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఒక స్థానం గెలిచింది. లౌకిక‌శ‌క్తుల‌న్నీ ఏక‌మై ప‌టిష్ట‌ప‌డాల‌ని, బీహార్‌లో బీజెపి ఒంట‌రిగా పోటీచేసి గెలిచే స‌త్తా లేద‌ని తేజ‌స్వీయాద‌వ్ అన్నారు.  పరోక్షంగా ఆయన బీజేపీకి దూరం కావాలని జేడీయూకి సూచించారు.  సైద్ధాంతిక సారూప్యత లేని జేడీయూతో జత కట్టి అధికారంలో భాగస్వామిగా కొనసాగడం ద్వారా బీజేపీ నైతికతకు తిలోదకాలిచ్చేసిందని తేజస్వి విమర్శించారు.

హైదరాబాద్ లో మోడీ రోజు కో చోట బస ఎందుకంటే?

బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ హైదరాబాద్ లో రెండు రోజులు బస చేయనున్న సంగతి తెలసిందే. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మోడీ రెండు రోజులూ  నోవాటెల్ లోనే బస చేయాల్సి ఉంది.  అయితే ఇప్పుడు అది మారింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలి రోజు ఆయన నోవాటెల్ లో బస చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జూన్ 3న ఆయన బస రాజ్ భవన్ కు మారనుంది. మూడో తేదీన సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు మోడీ రాజ్ భవన్ నుంచే నేరుగా చేరుకుంటారు. సభ తరువాత ఆయన తిరిగి రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఆ రోజు అక్కడే బస చేసి మరుసటి రోజు అంటే జూలై 4న ఏపీ బయలు దేరి వెళతారు.  భద్రతకు సంబంధించి ఇబ్బందుల కారణంగానే ముందుగా నిర్ణయించిన విధంగా కాకుండా మోడీ బసను 3వ తేదీన రాజ్ భవన్ కు మార్చినట్లు చెబుతున్నారు.   తొలి రోజు అంటే జూలై 2న నోవాటెల్ లోనే కార్యవర్గ సమావేశాలు జరుగుతుండటం వల్ల మోడీ ఆ రోజు అక్కడే బస చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జూలై3 పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. నోవాటెల్ నుంచి రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లడం వల్ల ట్రాఫిక్ సమా పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆయన బసను రాజ్ బవన్ కు మార్చారు. రాజ్ భవన్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ కు దూరం తక్కువ కావడంతో పెద్ద గా ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.  అదీ టీఆర్ఎస్ బీజేపీ ఫ్లెక్సీ వార్, టీఆర్ఎస్, బీజేపీ నేతల  పరస్పర విమర్శలతో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. ఈ నేపథ్యంలో రోడ్డు మార్గంలో మోడీ ఎక్కువ దూరం లేదా ఎక్కువ సేపు ప్రయాణించాల్సిన పరిస్థితి లేకుండా ఉంటే మంచిదని భద్రతాధికారులు సూచించడంతో ఆయన బసను రాజ్ భవన్ కు మార్చినట్లు చెబుతున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణించే సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రోడ్ రోకో వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్న సమాచారం కూడా మోడీ బసను నోవాటెల్ నుంచి రాజ్ భవన్ కు మార్చడానికి కారణమని చెబుతున్నారు. మోడీ మినహా మిగిలిన బీజేపీ అగ్రనేతలంతా రెండు రోజులూ నోవాటెల్ లోనే బస చేస్తారు. 3వ తేదీ సాయంత్రం బహిరంగ సభ అనంతరం మోడీ రాజ్ భవన్ కు చేరుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయమే ఆయన అక్కడ నుంచి నేరుగా ఏపీ పర్యటనకు వెళతారు

శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదంః మృతుల కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా

శ్రీ స‌త్య‌సాయి జిల్లా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తాడిమర్రి మండ‌లం గుడ్డంప‌ల్లి గ్రామానికి చెందిన  వ్య‌వ సాయ కూలీలు ఆటోలో వెళుతూంటారు. కానీ గురువారం వారు వెళుతోన్న ఆటో  చిల్ల‌కొండ‌య్య‌ప‌ల్లి  స‌మీ పంలో  హైటెన్ష‌న్ వైర్లు త‌గిలి ఆటోలోవున్న అయిదుగురు మ‌ర‌ణించారు. మరో ముగ్గురి పరిస్థితి  విష మంగా ఉంది. వారిని వెంటనే  అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోపై ఉన్న ఇనుప మంచా నికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగలడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ  ప్ర‌మాదం లో డ్రైవ‌ర్‌తో పాటు ఎనిమిది మంది  గాయ‌ప‌డ్డారు. కాగా ఈ ప్ర‌మాదంలో  మృతులంతా గుడ్డంప‌ల్లికి చెందిన వారుగా గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్ విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఆటో ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామ న్నారు. పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలు అధికారులు తెలియజేశారు  ఈ సంఘ‌ట‌న ప‌ట్ల టిడిపి  అధినేత చంద్ర‌బాబు నాయుడు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కూలీప‌నుల‌కు వెళుతున్న‌వారు  ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌చివేసింద‌ని ఆయ‌న అన్నారు. ఈ సంఘ‌ట‌న‌కు బాధ్యు లపై క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని టీడీపీ అధినేత  ప్ర‌భుత్వా న్ని డిమాండ్ చేశారు.

2న హైదరాబాద్ కు యశ్వంత్ సిన్హా.. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమావేశం.. కాంగ్రెస్ హాజరయ్యేనా?

2న హైదరాబాద్ కు యశ్వంత్ సిన్హా.. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సమావేశం.. కాంగ్రెస్ హాజరయ్యేనా? హైదరాబాద్ నగరంలో హెక్టిక్ పొలిటికల్ యాక్టివిటీ జరుగుతోంది. ఒక వైపు హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. మరో వైపు అదే సమయంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను అధికార టీఆర్ఎస్ నగరానికి ఆహ్వానించింది. ఈ నెల 2న అంటే బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే యశ్వంత్ సిన్మా హైదరాబాద్ రానున్నారు. అదే రోజు టీఆర్ఎస్ జల విహార్ లో టీఆర్ఎస్ ఆయనతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలాగే జలవిహార్ లో ర్యాలీ కూడా తీయనున్నది. మోడీ హైదరాబాద్ లో బస చేసిన నేపథ్యంలో నగరంలో ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే ఆ ఆంక్షలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్  లిమిట్స్ కే పరిమితం కావడంతో హైదరాబాద్  పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే జలవిహార్ లో ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్ నిర్ణయించింది. కాగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న యశ్వంత్ సిన్హా సమావేశానికి కాంగ్రెస్ హాజరౌతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ సమావేశానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఆహ్వానించిందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి పోటీగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ లు రెండూ హాజరయ్యాయి. ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామనీ ప్రకటించాయి. జాతీయ స్థాయిలో పరిస్థితి వేరు. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరు. తెలంగాణలో టీఆర్ఎస్ కు  వచ్చే ఎన్నికలలో బీజేపీ కాదు కాంగ్రెస్సే ప్రధాన పోటీదారని ఇటీవల కేసీఆర్ లీక్ చేసిన పీకే సర్వే నివేదికలలో తేలింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యశ్వంత్ సిన్హా సమావేశానికి కాంగ్రెస్ ను ఆహ్వానిస్తుందా అన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఆహ్వానించినా  కాంగ్రెస్ హాజరౌతుందా అన్న సందేహాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు మద్దతు విషయంలో ఏకతాటిపైకి వచ్చిన విధంగానే.. యశ్వంత్ సిన్హాకు మద్దతు గా టీఆర్ఎస్ నిర్వహిస్తున్న సమావేశానికి కాంగ్రెస్ హాజరయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇలా ఉండగా నగరంలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే యశ్వంత్ సిన్హాను కేసీఆర్ ఆహ్వానించడం వ్యూహాత్మక ఎత్తుగడగా చెబుతున్నారు. యశ్వంత్ సిన్హాకు బీజేపీ నేతలతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలో యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు ఆహ్వానించడం ద్వారా ఆ పార్టీకి చెందిన కొందరు మిత్రులు ఆయనతో టచ్ లోకి వచ్చే అవకాశం ఉంటుందన్నది కేసీఆర్ వ్యూహంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ హైదరాబాద్ కు ఆహ్వానించడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. 90శాతం ఉత్తీర్ణత

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పొరుగు రాష్ట్రం ఏపీలో టెన్త్ ఉత్తీర్ణతా శాతం గణనీయంగా తగ్గడంతో తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ నెలకొంది. అయితే 90 శాతం ఉత్తీర్ణత సాధించడంతో కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణలో విద్యా బోధన సజావుగా సాగిందని అంటున్నారు. కాగా టెన్త్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. ఫలితాల్లో బాలురు కంటే బాలికలే పై చేయి సాధించారు. టెన్త్ పరీక్షలకు హాజరైన బాలురులో ఉత్తీర్ణతా సాధం 87.61శాతం ఉండగా, బాలికలలో ఇది 92.45 శాతం ఉంది. ఇక సిద్దిపేట జిల్లా ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ జిల్లాలో ఉత్తీర్ణతా శాతం 97 కాగా, చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్ జిల్లాలో 79శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.  www.bse.telangana.gov.in వెబ్ సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది.  ఇలా ఉండగా  ఆగస్టు 1 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.    

రఘురామ విచారణ ఓకే .. బట్ కండీషన్స్ అప్లై.. హైకోర్టు

నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును రాజద్రోహం కేసులో తప్ప ఇతర సెక్షన్లపై నమోదైన కేసుల్లో  విచారణ జరుపుకోవచ్చని ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. రఘురామను హైదరాబాద్ లో మాత్రమే విచారించాలని అది కూడా దిల్ కుషా ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన ఎంచుకున్న న్యాయవాది సమక్షంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని సూచించింది. విచారణ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించాలని కండీషన్ పెట్టింది. ఈ కేసులో ఇతర నిందితులు ఏబీఎన్, టీవీ-5లతో కలిపి ఎంపీ రఘురామను విచారించాలనుకుంటే మాత్రం 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు సూచించింది. విచారణ కోసం రఘురామను సీఐడీ కార్యాలయానికి పిలిపించకూడదని కండిషన్ పెట్టింది. విచారణ సందర్భంగా కేవలం కేసుకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే విచారించాలని, ఇతర అంశాల గురించి ప్రశ్నించకూడదని సూచించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. రఘురామకు వై- కేటగిరి భద్రత ఉన్నందున విచారణ నిర్వహించే గది బయట భద్రతా సిబ్బందిని అనుమతించాలని సూచించింది. నిజానికి వైసీపీ అభ్యర్థిగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటరీ స్థానం నుంచి రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో గెలిచారు. అయితే.. ఆ తర్వాత వైసీపీతో ఆయనకు ఎందుకు చెడిందో ఏమో గానీ.. ప్రతిరోజూ వైసీపీ సర్కార్ చర్యల్ని, సీఎం జగన్ ను, ఆ పార్టీ నేతలు మరీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ‘రచ్చబండ’ పేరుతో మీడియా సమావేశం పెట్టి మరీ ఏకి పారేస్తున్నారు. దీంతో ఏపీ సీఐడీ సమోటోగా కేసు స్వీకరించి తనపై ఐపీసీ సెక్షన్ 124 ఏ ప్రకారం రాజద్రోహం, 152 ఏ కింద రెండు సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, 505, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని, ఆ కేసును కొట్టేయాలని రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఏపీ పోలీసులు తనను అరెస్ట్ చేసిన సందర్భంగా భౌతికంగా   హింసించారని, తనకు ప్రాణ హాని ఉందని ఎంపీ రఘురామ కోర్టుకు విన్నవించారు. దీంతో రఘురామను ఆన్ లైన్ లో విచారించడం సాధ్యమా? కాని పక్షంలో ఏదైనా సురక్షిత ప్రదేశాన్ని సూచించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. నిజానికి తనను అరెస్ట్ చేసి, శారీరకంగా హింసించిన తర్వాత రఘురామ  వైసీపీ సర్కార్ పైన, సీఎం జగన్ పైనా మరింతగా రెచ్చిపోయి విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రఘురామపై ట్విట్టర్ వేదికగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇద్దరు ఎంపీల మధ్యా ట్వీట్ల వార్ నడుస్తోంది. ఒక సందర్భంలో వారిద్దరి మధ్య ట్వీట్ల వార్ వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు కూడా దారితీసింది. జగన్ సర్కార్ చేస్తున్న తప్పిదాలు, ఆర్థికంగా ఏపీని దివాళా తీయించిన వైనంపై రఘురామ కొన్ని ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రఘురామకృష్ణరాజు సంసద్ టీవీ చర్చలకు పిలవొద్దంటూ కొద్ది రోజుల క్రితం విజయసాయి రెడ్డి పార్లమెంట్ సెక్రటరీకి లేఖ రాశారు. వైసీపీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున కానీ రఘురామ ప్రాతినిధ్యం వహించడం లేదని ఆ లేఖలో విజయసాయి పేర్కొన్నారు. అంతకు ముందు పార్టీకి, జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న రఘురామను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడని ప్రకటించాలని లోక్ సభ స్పీకర్ ను ఆ పార్టీ   ఎంపీలు కోరారు. అయితే.. వారి విజ్ఞప్తికి స్పీకర్ ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వ తీరుపైనా విమర్శలు చేస్తున్న  రఘురామపై పార్టీ  సస్పెన్షన్ వేటు వేయడానికి వైసీపీ అధిష్టానానికి ఉన్న అడ్డంకి ఏమిటనేది మాత్రం బయటికి చెప్పకపోవడం గమనార్హం. చివరికి రఘురామపై రాజద్రోహం, సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులను సీఐడీ తనపై కుట్రపూరితంగా పెట్టిందని, వాటిని కొట్టి వేయాలంటూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా రఘురామను హైదరాబాద్ లోనే విచారించాలని, రాజద్రోహం మినహా ఇతర సెక్షన్ల విషయంలో విచారణ చేసుకోవచ్చని సీఐడీని ఆదేశించింది.

ఎవ‌రికీప‌ట్ట‌ని అనీల్ ఎక్క‌డున్నారు?

కొన్ని సంఘ‌ట‌నలు ఇబ్బంది పెడ‌తాయి. కొన్ని స్వ‌యంకృతాలూ జీవితాన్నే తారుమారు చేస్తాయి. మాజీ మంత్రి అనీల్ ది రెండ‌వ ర‌కం. మాజీ మంత్రిగా అయినా అంద‌రితో మంచిగా వుండాల్సిన‌వారు హ‌ఠా త్తుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. మ‌రి ఎప్పుడు తిరిగివ‌స్తారు, నెల్లూరు సిటీలో పోటీ చేస్తారా లేదా అన్న‌ది  నెల్లూరు జిల్లాలో పెద్ద చ‌ర్చ. మంత్రి ప‌దవి పోయిన త‌ర్వాత ఏమ‌యిందో ఏమో ఫ్లెక్సీల గొడ‌వ తో పార్టీ పెద్ద‌ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఆ త‌ర్వాత అజ్ఞాతంలోకి వెళిపోయారు.  అనీల్ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అంటే ప‌డి చ‌చ్చేంత వీరాభిమాని. ఆ విషయం రుజువు చేసుకోవడానికి తుపాకీ ధ‌రించి అతిగా  వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కూ న‌చ్చిన ఆయన ప్ర‌వ‌ర్త‌న ఆ త‌ర్వాత పార్టీ పెద్ద‌ల‌కూ న‌చ్చ‌లేదు. ఆయన అతి ప్ర‌వ‌ర్త‌న ప్ర‌తిప‌క్షాల‌తోపాటు అధికార‌ప‌క్షంవారికి విసుగెత్తించింది.  ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం వ‌ర్గంవారికి అనిల్ వైఖరి బొత్తిగా నచ్చలేదు. అనీల్ మంత్రి ప‌దవి పోయిన త‌ర్వాత అంద‌రూ ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డం తో మ‌ద్రాసుకు మ‌కాం మార్చారు.  అస‌లే ప‌రిస్థితులు అనుకూలించ‌కపోవ‌డంతోపాటు ఆనం, కాకాణివ‌ర్గం ఒక‌టి కావ‌డం అనిల్ కు ఇబ్బందిక‌రంగా మారింది.  దీనితో అనీల్ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సోద‌రుడు విజ‌య‌కుమార్ రెడ్డితో జ‌త‌క‌ట్టారు.  నెల్లూ రులో ఆనం మ‌ద్ద‌తు వుంటే దేన్న‌యినా సాధించ‌వ‌చ్చ‌ని అనీల్ న‌మ్మ‌కం. నెల్లూరు సిటీలో గెల‌వవ‌చ్చ ని పావులు క‌దిపారు. కాకాణి గోవర్దన్బరెడ్డి మంత్రి అయ్యాక అనిల్ కు ఊహించని పరిణామాలు ఎదుర య్యాయి. అనం , కాకాణి వర్గం ఒకటి కావడం అనిల్ కు చెక్ పెట్టడం చకచకా జరిగిపోయాయి.   ఈ విష‌య‌మై నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి మండి ప‌డ్డా రు. అనిల్ తో స్నేహం కటాఫ్ చేసి తన నియోజకవర్గం లొ ఎవరైనా తలదూరిస్తే తాను కూడా అన్నీ నియో జకవర్గం లొ కాలు పెట్టాల్సి వస్తుందని మీడియా సమావేశం పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వార్నింగ్‌ అనీల్ తో పాటు మరి కొందరికి కుడా తగిలేలా చెప్పాడు దీంతో అనిల్ ఉక్కిరి బిక్కిరి అవుతు న్నాడట.  ఆమద్య ప్లినరీ సమావేశా నికి వచ్చిన అనిల్ తాను వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని ప్రచారం జరుగోతోందనీ,   అది అవాస్తవమని తాను నెల్లూరు సిటీ నుంచే పొటీ చెస్తున్నట్టు ప్రకటించుకొని మళ్లీ వెళ్లి పొయాడు. అనీల్ అజ్ఞాతం లోకి వెళ్ళ‌డానికి అస‌లు కార‌ణాలేమిట‌న్న‌ది   పార్టీవ‌ర్గాల‌కీ ఇదమిథ్థంగా తెలియ‌డంలేదు. ఎందుకంటే   అనీల్ మంత్రి ప‌ద‌వి పోయిన త‌ర్వాత ఆయ‌న్ను పెద్ద‌గా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రో వంక   ఏపీ ముఖ్య‌మంత్రి కూడా అనీల్ సంగ‌తి ప‌ట్టించుకోవ‌డం లేదు. 

వైసీపీ జిల్లా ప్లీనరీలలో రగులుతున అసమ్మతి

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయలలో మూడో పార్టీకి స్థానం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలల్లోనే ఆ విషయం రుజువైంది.ఆ ఎన్నికలలో, తెలుగు దేశం, వైసీపీ  బీజేపీ, కాంగ్రెస్’ జనసేన, వామపక్ష పార్టీలు, బీఎస్పీ ఇలా అనేక పార్టీలు కూటములు  పోటీ చేశాయి  అయినా, 90 శాతానికి పైగా ఓట్లు, టీడీపీ, వైసీపీల మధ్యనే పోల్ అయ్యాయి. సీట్ల విషయానికి వస్తే, 175 సీట్లకు గానూ 174 సీట్లు ఆ రెండు పార్టీలే పంచుకున్నాయి. మిగిలిన అన్ని పార్టీలకు కలిపి పది శాతం కంటే తక్కువ ఓట్లు, ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కాయి. అయితే, రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా, మార్పు రాదా, అంటే వస్తుంది. కానీ, ప్రస్తుతానికి  అయితే మరో ప్రత్యాన్మాయం కనిపించడం లేదని, పరిశీలకులు భావిస్తున్నారు.  నిజానికి, ముందస్తు ఎన్నికలు వస్తే ఏమో కానీ, లేదంటే శాసన సభ ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది. వైసేపీ ప్రభుత్వం గద్దెనెక్కి మూడు సంవత్సరాలే పూర్తయ్యాయి, ఇంకా  నిండా రెండు సంవత్సరాలు అలానే ఉన్నాయి. అయితే, ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పతాక స్థాయికి చేరింది. అందుకే, పార్టీలో అసమ్మతి అగ్గిరాజుకుంది. రాజీనామాల పర్వం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ వంక ప్రజల విశ్వాసం  కోల్పోయింది. మరోవంక, పార్టీలో అసమ్మతి సెగలు బుసలు కొడుతున్నాయి. అందుకే, రోజుకో రచ్చ వీధుల కెక్కుతోంది, అంతర్గత కుమ్ములాటలు, ధిక్కార స్వరాలు ఎక్కువ వుతున్నాయి...  బాలినేని భాగోతం ఓ వంక అలా సాగుతుడగానే.. మరో వంక వైసీపే జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశాల్లో కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెన్చుకుంటోందని వార్తలోస్తున్నాయి. ఇంకెవరో కాదు, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం తమ  నియోజకవర్గంలో వర్గ విబేధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని, అవి పార్టీకి మంచిది కాదని బొత్స చెప్పు కొచ్చారు.   ఒంగోలు జిల్లా  ప్లీనరీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ‘ కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడు తున్న సమయంలోనే కార్యకర్తలు తాము చేసిన అభివృద్ది  పనులకు బిల్లులు ఎప్పుడు చేల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేయడంతో, పరిస్థితి రసాభాసగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని దురు సుగా ప్రవర్తించడంతో ఆ కార్యకర్త ఎదురు తిరిగాడు,  .‘వైసీపీకి ఓటు వేసి గెలిపించినందుకు అరెస్టు చేస్తారా? నేను ఏమి తప్పుచేశానని బయటకు తీసుకెళ్తున్నారు?’ అంటూ ఆక్రోశించారు. నిజానికి పెండింగ్ బిల్లుల వ్యవహారం, వైసీపీ ఎమ్మెల్యేలకు సంకటంగా మారింది. ఈ నేపధ్యం లోనే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేనుగోపాల్, నేరుగా ముఖ్యత్రికే చురకలు అంటించారు. మీట నొక్కి ప్రజల ఖాతాలలో డబ్బులు వేస్తున్న ముఖ్యమంత్రి గ్రాఫ్ పెరుగుతోంది,  కానీ, ఏమీ చేయలేక చేతులు ముడుచుకు కూర్చున్న తమ ఫీజులు మాడి పోతున్నాయని అన్నారు. ఒక్క  దర్శి నియోజకవర్గం పరిధిలోనే  రూ.100 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని,అన్నారు.  నాలుగు రూపాయలు సంపాదించుకుందామని కాంట్రాక్టు పనులు చేసిన కార్యకర్తలు ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవలసి వస్తోందని, బహిరంగ వేదిక నుంచే ఆగ్రహం వ్యక్త చేశారు.  నిజానికి ఇది ఎదో ఒక జిల్లాకు పరిమితమైన సమస్య కాదు. అన్నిజిల్లాలలో పైరవీలు చేసి పనులు తెచ్చుకున్న పార్టీ కార్యకర్తలు (కాంట్రాక్టర్ర్లు) అందరిది ఇదే సమస్యగా ఉందని నాయకులే వాపోతున్నారు. అలాగే, కర్నూలు జిల్లా ప్లీనరీలో గొప్పలు చెప్పుకోవడం తప్ప అభివృద్ధికి ఏం చేశారు? మంచినీరు కూడా ఇవ్వనప్పుడు ఏం అభివృద్ధి చేసినట్లు అని కుర్ని వెల్ఫేర్‌ అండ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కృష్ణవేణి మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో నాయకులను ప్రశ్నించారు.  మరో వంక పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య రాయచోటిలో జరిగిన అన్నమయ్య జిల్లా ప్లీనరీలో మాట్లాడుతూ  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ  అధికారం నిలబెట్టుకోవడం అంత సులభం కాదని, కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర నాయకత్వం అంతా బాగుదని అనుకుంటే ఇంతే సంగతులని, పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని హెచ్చరించారు ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొత్తానికి మొత్తంగా 175 సీట్లు మనవే అంటుంటే, రామచంద్రయ్య పార్టీ వేదిక నుంచే అంత సీన్ లేదని తేల్చేశారు. నిజానికి ఒక రామచంద్రయ్య కాదు. పార్టీ నాయకులు,  కార్యకర్తఃల్లో మూడింట రెండు వంతుల మంది ఇదే ఆఖరి మోకా ఇక ముందు అధికారంలోకి రాలేమని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. గడప గడపకు కార్యక్రమంతో  ప్రజల్లో గుడ్తుకట్టున్న ప్రభుత్వ వ్యతిరేకత  భగ్గు మంటే, ఇప్పడు ప్లీనరీ సమావేశాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలో రగులుతున్న అసంతృపతి భగ్గుమంటోందని పరిశీలకులు అంటున్నారు. ఈ  నేపధ్యంలో, ప్రజల ముందు కనిపిస్తున్న ఏకైక ప్రత్యాన్మాయం తెలుగు దేశం, అందుకే ప్రజలు, పరిశీలకులు పొత్తులు ఉన్న లేకున్నా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా .. గెలిచేది టీడీపీ .. అంటున్నారు.

చిరంజీవి సరే... పవన్ మాటేమిటి?

బీజేపీ వ్యూహాలేమిటి? పవన్ కల్యాణ్ తో ఆ పార్టీ మైత్రి కొనసాగుతోందా? లేక అప్రకటిత తెగదెంపులు అయిపోయాయా? అన్న ప్రశ్నలకు అలాగే కనబడుతోంది అన్న జవాబే వస్తుంది. ఎందుకంటే ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా మెగా స్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి ఆహానం అందింది. మరి పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి? ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తుంటే.. బహిరంగ సభ నిర్వహిస్తుంటే.. అదీ ప్రభుత్వ కార్యక్రమం అయినా మిత్ర పక్ష అధినేతకు ఆహ్వానం అందక పోవడమేమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవం వేడుకలలో భాగంగా  అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగానే జూలై 24న భీమవరంగా అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికే కేంద్ర ప్రభుత్వం తరఫున మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. అయితే ఇక్కడే రాజకీయ పరిశీలకులు తమ విశ్లేషణలకు పని చెబుతున్నారు. రాజకీయాలకు దూరంగా సినీమాలకు పరిమితమైన చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపడంలో ఆంతర్యమేమిటి? రాజకీయాలలో క్రియాశీలంగా ఉండటమే కాకుండా.. బీజేపీతో పొత్తు ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆహ్వానం పంపకపోవడమేమిటి? దీని వెనుక రాజకీయమేమి? అంటూ సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించినట్లైతే బీజేపీకి ఇప్పుడు పవన్ కల్యాణ్ కన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ మంచి మిత్రుడుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే కేంద్రం తానా అంటే తానా, తందానా అంటే తందానా అనే జగన్ ను దూరం పెట్టి.. పొత్తుల విషయం సహా ఏపీ ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో కూడా తన మాటే వినాలని పట్టుబట్టే పవన్ ను దగ్గరకు తీసుకోవడం వల్ల రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదని కమలనాథులు భావిస్తున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కనుక పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తే ఇదే కార్యక్రమంలో పాల్గొనే ఏపీ సీఎం జగన్ కు ఇబ్బంది అవుతుందనే కారణం కూడా ఒకటి చెబుతున్నప్పటికీ, అధికార, విపక్ష నేతలు ఒకే కార్యక్రమంలో వేదిక పంచుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. పైగా ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాజకీయాలను జొప్పించడం భావ్యం కాదు. కానీ బీజేపీ మాత్రం ఈ కార్యక్రమాన్ని తన రాజకీయ ప్రయోజనం కోసమే ఉపయోగించుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరి జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు కోసం చిరంజీవిని ఆహ్వానించందనీ, జగన్ ను సంతోష పెట్టడం కోసం పవన్ కల్యాణ్ ను దూరం పెట్టిందనీ,  ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా  ఒకే ఒక్క చర్య ద్వారా అటు జగన్ ను, ఇటు కాపు సామాజిక వర్గాన్నీ, అటు జగన్ ను ప్రసన్నం చేసుకోవచ్చన్నదే మోడీ సభకు చిరంజీవికి ఆహ్వానం పంపి, పవన్ కల్యాణ్ ను దూరం పెట్టడం అని విశ్లేషకులు చెబుతున్నారు.

మహా సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం రేపు?

మహా రాజకీయం రసకందాయంలో పడింది. కమల వ్యూహం ఫలించింది.  మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ప్రణాళికలు అనుకున్నవి అనుకున్నట్లుగా అమలు చేయగలిగింది. దీంతో మహాలో మళ్లీ కమలం జెండా ఎగరనుంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. ఇందు కోసం తమ మాజీ మిత్ర పక్షం శివసేనను నిట్టనిలువుగా చీల్చడంలో కమలనాథులు విజయం సాధించారు. శాసన సభలో బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇక లాంఛనమేనని పరిశీలకులు చెబుతున్నారు. ఉద్ధవ్ థక్రే రాజీనామా చేసిన వెంటనే బీజేపీ మహా చీఫ్ చంద్రకాంత్పాటిల్, మాజీ సీఎం దేవేంద్రఫడ్నవీస్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యులు భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మహా అసెంబ్లీలో అత్యధిక సీట్లు ఉన్నపార్టీ బీజేపీయే. అందుకే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నది. గురువారం (జూన్ 30) ఏక్షణంలోనైనా ఫడ్నవీస్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశంఇవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉందని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫడ్నవీస్ శుక్రవారం నాడే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 

సింహమా.. గ్రామ సింహమా?.. యూట్యూబ్ నిర్వాహకుడి అరెస్టుపై లోకేష్ ఫైర్

 సామాజిక మాధ్యమంలో పోస్టులకు అరెస్టులు వద్దని సుప్రీం కోర్టు విస్పష్టంగా చెప్పింది. అయితే సుప్రీం ఆదేశాలు, తీర్పులు ఏపీలో అమలౌతున్న దాఖలాలు కనిపించడం లేదు. అడ్డగోలుగా, అడ్డదారులు వెతికి మరీ సుప్రీం ఆదేశాల ఉల్లంఘన జరుగుతోంది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ విషయంలోనూ అదే జరిగింది. తాజాగా తెలుగుదేశం కార్యకర్త, యూట్యూబ్ నిర్వాహకుడు, సోషల్ మీడియాలో చురుకుగాఉండే  వెంకటేశ్ అరెస్టు ఆ కోవలోకే వస్తుంది. వెంకటేష్ అరెస్టుపై  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిఫైర్ అయ్యారు. అర్ధరాత్రి దొంగల్లా గోడ దూకి, తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేయడమిటని మండి పడ్డారు. సీఎం జగన్ కు సామాజిక మాధ్యమమంటే వణుకు అని విమర్శించారు. యూట్యూబ్ చానెల్ ను చూసి భయపడే జగన్ సింహమెలా అవుతారని ప్రశ్నించారు. నిజానికి ఆయన గ్రామ సింహం కూడా కాదని ఎద్దేవా చేశారు. అమరావతి మండలం ధరణి కోటకు చెందిన వెంకటేష్ జగన్ పై, వైసీపీపై విమర్శనాత్మక కథనాలను యూట్యూబ్ లో ఉంచిన కారణంగానే అరెస్టు చేశారని లోకేష్ ఆరోపించారు. జగన్ ప్రాపకం కోసమే పోలీసులు ఆయనను అరెస్టు చేశారని, గోడదూకిన పోలీసులు తమ ముఖాలు కనపడకూడదని లైట్లు పగల గొట్టారనీ, వారి ముఖాలన్నీ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయనీ అన్నారు. ఇలా ముఖ్యమంత్రి ప్రాపకంకోసం చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న వారంతా ముందు ముందు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ అన్నారు. 

మహా సీఎం రాజీనామా..

తెలుగువన్ చెప్పినట్లే జరిగింది.  మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష అనివార్యమైతే.. అంతకు ముందే సీఎం ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేస్తారని తెలుగువన్ ముందే ఊహించింది. చివరికి అదే జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. అసెంబ్లీలో గురువారం (జూన్ 30) బలపరీక్ష జరగాల్సి ఉండగా దానికి ఆపాలంటూ ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. అయితే  మహా సంక్షోభంపై సుప్రీం కోర్టు బుధవారం సాయంత్రం బలపరీక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీం ఆదేశాలు జారీ చేసిన స్వల్ప వ్యవధిలోనే ఉద్ధవ్ థాక్రే రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా లేఖ అందజేశారు. బల పరీక్షపై స్టే విధించడం కుదరదన్న సుప్రీం తీర్పును గౌరవిస్తున్నానని ఉద్ధవ్ అన్నారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగేందుకు సహకరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే కృతజ్ణతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శివసనే సర్కార్ కు కొందరి ద్రిష్టి తగిలిందనీ, అది ఎవరిదో అందరికీ తెలుసుననీ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు  మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బాలాసాహెబ్​ ఆశయాలు నెరవేర్చిందన్నారు. సీఎం పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. రాజీనామాకు ముందు ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్‌ భేటీ అయింది.   కేబినెట్‌ భేటీలో మంత్రులకు సీఎం ఉద్దవ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఏమైనా తప్పు జరిగితే అందరూ తనను మన్నించాలని ఠాక్రే కోరారు. తన వాళ్లే తనను మోసం చేశారని, వెన్నుపోటు పొడిచి ఈ స్థితికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. సుప్రీం తీర్పుకు ముందే తెలుగువన్ ఉద్ధవ్ రాజీనామా గురించి చెప్పింది.    https://www.teluguone.com/news/content/maharashtra-cm-uddhav-thakrey-resigb-39-138742.html

తెలంగాణలో బీజేపీ త్రిముఖ వ్యూహం.. కాంగ్రెస్ కు చెక్.. టీఆర్ఎస్ తో నో కటీఫ్.. అధికారమే టార్గెట్

 తెలంగాణలో బీజేపీ దూకుడును మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో తెరాసతో తెగే వరకూ లాగే పరిస్థితి తెచ్చుకోవద్దనీ ఆలోచిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల అనంతరం  తెలంగాణలో బీజేపీ బలోపేతం దిశగా అడగులు వేయనున్నది. రాష్ట్రంలోని ప్రతి మూడు నియోజకవర్గాలకూ ఒక కేంద్ర మంత్రిని ఇన్ చార్జిగా నియమించి.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పటిష్ట చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నది.  అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకూ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసి ఇప్పటి నుంచే  ఆయా నియోజకవర్గాలలో వారు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ విజయావకాశాలను పెంచుకోవాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోంది.  అదే సమయంలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే.. ఆ పార్టీతో పూర్తిగా తెగతెంపులు అయ్యే పరిస్థితి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి విస్పష్టమైన సూచన చేసినట్లు కమలం వర్గాలే చెబుతున్నాయి. కర్రా విరగ వద్దు.. పామూ చావవద్దు అన్న సామెతను కొద్దిగా  మార్చుకుని టీఆర్ఎస్ గెలవ కూడదు.. అలాగని ఆ  పార్టీతో పూర్తిగా సంబంధాలు తెగకూడదు అన్న చందంగా జాగ్రత్తగా వ్యవహరించాలన్నది బీజేపీ వ్యూహంగా కనబడుతోంది. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ఉప్పూ, నిప్పులా పరస్పర విమర్శలతో చెలరేగిపోతున్నా..టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా ప్రధానినే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నా..బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పెద్దగా స్పందన కానరావడం లేదు. ఇటీవల టీఆర్ఎస్ విషయంలో బీజేపీ వైఖరి ఒకింత మారిందనడానికి ఇవే సంకేతాలుగా చెప్పవచ్చు. అసలు తొలి నుంచీ కూడా టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య బంధం ఏదో ఉందన్న సందేహాలను పరిశీలకులు వ్యక్తం చేస్తూనే ఉన్నా... హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం తరువాత రాష్ట్రంలో అధికారం చేపట్టగలమన్న నమ్మకం కలగడంతో బీజేపీ దూకుడు పెంచింది. అదే సమయంలో అప్రమత్తమైన టీఆర్ఎస్ అధినేత జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు చేసిన యత్నాలు విఫలం కావడం, ఆ తరువాత తానే జాతీయ పార్టీ పెడతానంటూ ప్రకటించి, ఆ తరువాత మౌనంవహించారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా ఆయన ఎన్డీయే అభ్యర్థికి కాకుండా విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలూ హాజరయ్యారు. కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గరౌతున్నారన్న వార్తలూ వినిపించాయి. దీంతో బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్న లక్ష్యాన్ని కొనసాగిస్తూనే.. టీఆర్ఎస్ ను పూర్తిగా దూరం చేసుకోవడం సరికాదన్న అభిప్రాయానికి రావడానికి ఇదే కారణమని విశ్లేషకులు అంటున్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతున్నా.. మోడీ సర్కార్ తెలంగాణకు చేసింది, ఇచ్చిందీ ఏమీ లేదంటూ తరచూ విమర్శలు గుప్పించే కేటీఆర్ తన హస్తిన పర్యటనల్లో మాత్రం కేంద్ర మంత్రులతో ములాఖత్ అయ్యి రాష్ట్రానికి కావలసిన నిధులు మంజూరు చేయాల్సిందిగా వినతులు ఇస్తున్నారు. కేంద్ర మంత్రులూ సానుకూలంగా స్పందిస్తున్నారు. అన్నిటికీ మించి.. ఖమ్మం జిల్లాలో  గత ఏప్రిల్ లో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో బీజేపీ స్పందించిన తీరుకు..ఇప్పుడు మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అధీనంలోని భూములను టీఆర్ఎస్ సర్కార్ స్వాధీనం చేసుకుని రైతులకు పంపిణీ చేసిన సందర్భంలో బీజేపీ వ్యవహరించిన తీరునూ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా మంత్రి పువ్వాడ ఒత్తడితో పోలీసులు తప్పుడు కేసులు బనాయించి, రౌడీ షీట్ తెరచి వేధించడం వల్లే చనిపోయాడంటూ బీజేపీ ఆందోళనలు చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా సాయిగణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. అదే ఈటల విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం కాదు కదా రాష్ట్ర నాయకుల స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనిని బట్టే రెండు నెలల కిందటికీ, ఇప్పటికీ బీజేపీ వైఖరిలో, తీరులో మార్పు వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచాలంటే.. టీఆర్ఎస్ తో సంబంధాలు పూర్తిగా చెడకుండా చూసుకోవాలని బీజేపీ భావిస్తున్నది.   అదే సమయంలో రాష్ట్రంలో అధికార అందలం అందుకోవడానికి, బలోపేతం కావడానికి ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలని గట్టి పట్టుదలతో ఉందని పరిశీలకులు అంటున్నారు.    

ఈ దిండు అక్ష‌రాలా రూ.45 ల‌క్ష‌లు!

త‌ల‌కింద మంచి దిండు లేక‌పోతే నిద్ర‌ప‌ట్ట‌దు. దిండు మెత్త‌గా లేద‌ని గొడ‌వ‌ప‌డే పెద్ద‌వాళ్లూ వుంటారు. బూరుగుదూది దిండ్ల మీద మ‌న‌వాళ్ల‌కు మ‌హా వ్యామోహం. ఆ దిండు మీద త‌ల‌పెట్టుకుని అలా ప‌డుకోగా నే క్ష‌ణాల్లో మంచి నిద్ర‌లోకి జారిపోవ‌చ్చ‌న్న‌ది మంచి నిఖార్స‌యిన అభిప్రాయం. దిళ్ల‌లో అనేక ర‌కాలు చెబుతూంటారు. మ‌నం చేయించుకునేది, మ‌నం కొన్న‌ది కాస్తంత త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులోకి వ‌స్తుం ది. కానీ వాన్‌డెర్ గారి దిండు అసామాన్యం! ఎందుకంటే ఈ దిండు ఖ‌రీదు అక్ష‌రాలా 45 ల‌క్ష‌లు!   ఇంత ఖ‌రీద‌యిన వ‌స్తువులు పూర్వం బ్రిటీష్ మ‌హారాణి గారే వాడేవారు. అది వారికే చెల్లింది సుమీ అనే వారు అప్ప‌ట్లో తాత‌య్య‌లు, అమ్మ‌మ్మ‌లు. కానీ ఈ రోజుల్లో 45 ల‌క్ష‌లు పెట్టి త‌యారుచేసుకున్న దిండు ప్ర‌త్యేక‌త ఏమిట‌న్న‌ది తెలుసుకోవ‌డానికి చాలామంది ఆయ‌న్ను క‌లిసేర‌ట‌. నిజంగా ఆయ‌న అంతపోసి త‌యారుచేసుకున్నాట్టండీ?! అంటే అవును అంటూ దాన్ని చూపించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచాడు వాన్ డెర్.  థిజ్స్ వాన్ డెర్ హిల్స్ట్  అనే పెద్దాయ‌న   నిద్రలేమితో బాధపడేవారు ప్రశాంతంగా  నిద్రపోవడానికి ఈ దిండు సహాయపడుతుందన్నారు. డచ్ సర్వైకల్ స్పెషలిస్ట్-డిజైనర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండును త‌యారుచేశారు. మామూలుగా  వాడ‌డానికి సిద్ధంగా వుండే దిండు వుంటుంది. కానీ వాన్ ద‌గ్గ‌ర వున్న‌ది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అధునాతనమైన దిండు.  ఇది ఈజిప్ట్‌ పత్తి , మల్బరీ సిల్క్ తో తయారుచేశాడు.  అలాగే  విషరహిత డచ్ మెమరీ ఫోమ్‌తో నిండి  ఉంటుంది. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ప్రకారం, నెదర్లాండ్స్‌కు చెందిన  వాన్ డెర్ హిల్స్ట్ ఈ దిండు త‌యారీకి  57,000 డాల‌ర్లు  (దాదాపు రూ.45 లక్షలు) వెచ్చించారు.  వాన్ డెర్  ఈ ప్రత్యేకమైన దిండును త‌యారుచేయ‌డానికి పదిహేను సంవత్సరాలు పట్టింది. ఇది  24 క్యా రెట్ల బంగారం, వజ్రాలు,  నీలమణితో నిండి ఉంది. అంతేకాకుండా, దిండును నింపడానికి  ఉపయో గించే పత్తి  రోబోటిక్ మిల్లింగ్ యంత్రం నుండి వస్తుంది. దిండు 24-క్యారెట్ గోల్డ్ కవర్‌ను కలిగి ఉంది.  సురక్షిత మైన,  ఆరోగ్యకరమైన నిద్ర కోసం అన్ని విద్యుదయ స్కాంత వికిరణాలను నిరోధించే  ఒక  మెరుస్తున్న ఫాబ్రిక్ తొడుగు  ధర ట్యాగ్‌కు జోడించబ‌డింది.  ఇది   22.5 క్యారెట్ నీలమణి,  నాలుగు వజ్రాలను  కలిగి ఉన్న జిప్పర్. హై-టెక్ సొల్యూషన్స్, పాత-కాలపు హస్తకళను కలపడం ద్వారా, టైలర్‌మేడ్  పిల్లో అత్యంత వినూత్నమై నది. ఈ దిండు బ్రాండెడ్ బాక్స్‌లో ప్యాక్ చేయబడింది.  హిల్స్ట్ నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు ప్రశాంతంగా నిద్రపోవడానికి దిండు సహాయపడుతుందని పేర్కొన్నారు.  

నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు .. జంప్

రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో, రాజకీయ  నాయకులు ఎమ్మెల్యేలు, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం, తీసుకుంటారో ఉహించడం అన్ని  సందర్భాలలో కాకున్నా, కొన్ని సంధర్భాలో కొంచెం చాలా కష్టం. అందుకే కొన్ని కొన్ని వార్తల విన్నప్పుడు, అవునా ..? నిజమా? అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇవాళ రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం  సర్వ సాధారణ విషయం అయిపొయింది. అయినా, ఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటే, అది విశేషమే అవుతుంది. ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా పార్టీ మారతారు గానీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారడం అనేది  కనీసం  ఉహించను కూడా ఉహించ లేము. కానీ, ఒకరు ఇద్దరు కాదు ఒకేసారి నలుగురు  మజ్లీస్’ ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడు ఒవైసీకి షాక్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించారు. అయితే, ఎంఐ ఎం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించింది, పార్టీ పుట్టిల్లు తెలంగాణలో కాదు, బీహార్లో. అవును  2020లో జరిగిన  బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మొదటి సారిగా 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. సంచలనం సృష్టించింది. ఏకంగా ఐదు సీట్లను ఎంఐఎం గెలుచుకుంది. అంతకు ముందు మహారాష్ట్ర, కర్ణాటకలలో ఒకటీ అరా సీట్లలో గెలిచిన ఎంఐఎం బీహార్లో ఐదు సీట్లు గెలిచంది. ఈ గెలుపు ఇచ్చిన ఊపుతోనీ, ఒవైసీ యూపీ, పశ్చిమ బెంగాల్   సహా మరికొన్ని రాష్ట్రాలపైనా దృష్తి కేంద్రీకరించారు. అయితే, ఇంకెక్కడా కూడా ఎంఐఎం ముస్లిం ఓట్లను చీల్చి, బీజేపీకి మేలు చేయడం మినహ మరే ప్రభావమూ  చూప లేదు. ఒక్క బీహార్’లో మాత్రమే 2019 ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు, 2020లో ఐదు ఎమ్మెల్యే  సీట్లు గెలుకుని ఆ రాష్ట్ర రాజకీయలలో పాదం మోపింది.  అయితే, ఇప్పడు  అలా గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలలో  నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు.మజ్లిస్ బిహార్ విభాగం అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ తప్ప మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరారు. ఆర్జేడీ నేత, బిహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ను కలిసిన తర్వాత వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షానవాజ్, ఇజార్ అస్ఫీ, అంజార్ నైమీ, సయ్యద్ రుక్నుద్దీన్ ఆర్జేడీ కండువా కప్పుకున్నవారిలో ఉన్నారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై గతంలోనే పలు ఊహాగానాలు వచ్చాయి. కులాల ప్రకారం జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ తేజస్వీ యాదవ్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మజ్లిస్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ సైతం హాజరయ్యారు. ఆర్జేడీతో కలిసి ఓ వేదికను పంచుకోవడం మజ్లిస్ ఎమ్మెల్యేలకు అదే తొలిసారి. అమౌర్, కొచాధామ్, జోకిహాట్, బహదుర్గంజ్ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే, గెలిచిన ఐదు సీట్లలో నాలుగింటిని ఇప్పుడు కోల్పోయింది.

బొత్స‌కు జ్ఞానోద‌యం!

ఆలీసంగానైనా ఆత్మ‌శోధ‌న చేసుకుని, త‌న త‌ప్పును తెలుసుకుని ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని ప‌నిచేయువాడు ధ‌న్యుడు! ఇదేదో గొప్ప సూక్తి కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కి క‌లిగిన జ్ఞానోద‌యం. అవును. చాలా రోజులుగా చెవిలో ర‌క్తం కారేట్టు గోడు వినిపిస్తున్నా ప‌ట్టించుకోని మంత్రికి త‌న నియోజ‌క వ‌ర్గంలోని వాస్త‌వాలు ఇప్పటికి  తెలిసొచ్చాయి. ప్లీన‌రీలో మంత్రి త‌న చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ వ‌ర్గాల్లో విభేదాలు వున్నాయ‌ని ఎట్ట‌కేల‌కు అంగీక‌రించారు. కానీ వారి మ‌ధ్య స‌యోధ్య‌కు ఆయ‌న తీసుకునే చ‌ర్య లేమిట‌న్న‌ది మాత్రం చెప్ప‌లేదు.  అస‌లు విభేదాలంటూ లేకుండా వుండ‌వు. కానీ వాటిని పెద్ద‌వి చేసి బూత‌ద్దంలో చూడ‌ట‌మే మంచిది కాద ని అంటున్నారు. నియోజకవర్గం స్థాయిలో శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని అవి పార్టీకి మంచిది కాదన్నా రు. ఇంకా ఇలా బోధించారు.. ఎల్లకాలం నేనే నాయకుడ్ని అనుకోవడం మంచిదికాదు. అదృష్టం ఉంటే ఎవ రైనా నాయకుడు అవ్వొచ్చు. సంక్షేమ పథకాలందించడంలో గ్రామ స్థాయి నాయకులు లంచాలడి పార్టీకి చేటు అన్నారు. పార్టీలో పెద్ద త‌ల‌కాయ‌ల్ని ఆక‌ట్టుకోవ‌డానికి మ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో చిన్న‌వారు అలాంటి ప‌నులే చేప‌డ‌తారు.  ఎక్క‌డైనా ఇది అనాదిగా వున్న‌దే.   నియోజకవర్గంలో కొత్త నీటి బుడగలు వస్తున్నాయి.. అవి శాశ్వతం కాదు. పట్టించుకోవలసిన అవసరం లేదు. వయసులో చిన్నవాడివి నియోజకవర్గంపై అవగాహన లేకుండా మాట్లాడొద్దు. ఇది విమర్శ కాదు.. నేర్చుకో అంటూ టీడీపీ ఇన్‌చార్జ్ కిమిడి నాగార్జునకి కౌంటర్ ఇచ్చారు. మీ అమ్మగారు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఏమి అభివృద్ది చేసారో చెప్పు ముందు. నియంత రాజకీయాలు వద్దు. అందరూ కలసి నిర్ణయం తీసుకోండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవటం మానుకోమ‌ని పిలుపు నిచ్చారు. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడేం పాఠాలు చెప్పగలరు? 1998 డీఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నాను.వ‌య‌సులో పెద్ద‌వారు క‌నుక బోధ‌న చురుగ్గా చేప‌ట్ట‌డం క‌ష్ట‌మే. ఈ  వయసులో వారు  విద్యార్థులకు  పాఠాలు ఏమి చెప్తారు? ఉద్యోగులకు మళ్లీ శిక్ష‌ణ‌ నిర్వహిస్తామ‌ని అన‌డం బొత్సకు అస‌లు ఉపాధ్యాయులు, వారి స‌మ‌స్య‌ల గురించిన అవ‌గాహ‌న లేద‌నే అనాలి.