జగన్ తో ఎక్కడ చెడింది.. మోహన్ బాబు కల ఎలా చెదిరింది?

నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. ఒకప్పుడు తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కూడా పొందారు. ఆ తరువాత కారణాలేమైతేనేం.. తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. కొంత కాలం రాజకీయాలకు దూరంగా  ఉన్నా.. ఆ తరువాత వైసీపీ గూటికి చేరారు. చేరడం చేరడంతోనే ఆ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే అరహరం పాటుపడ్డారు. గత ఎన్నికలకు ముందు తన విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి తిరుపతిలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదంటూ తన కుమారుతలో కలిసి రోడ్డెక్కారు. ఏమైతేనేం.. గత ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీలో చాలా చాలా చురుకుగా.. ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీస్ పృధ్వీ, కమేడియన్ అలీ, నటుడు పోసానిలతో సమానంగా కష్టపడ్డారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. అప్పటి నుంచీ మోహన్ బాబు తనకు ఏదో ఒక పదవి వస్తుందన్న ఆశతోనే గడిపారు. కానీ మొట్టమొదట థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీకి జగన్ పదవి కట్టబెట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ పదవిని కట్టబెట్టారు కానీ అది పృధ్వికి మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఒక మహిళకు ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి తప్పించారు. ఆ తరువాత పృధ్వీ ముఖం చూసినా వారే వైసీపీలో లేకుండా పోయారు. ఇక తరువాత అలీ, పోసానిల వంతు వచ్చింది. ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన వారికి మూడేళ్ల తరువాత ఇక తప్పదన్నట్లుగా రెండు సలహాదారు పోస్టులు కట్టబెట్టి జగన్ చేతులు దులుపుకున్నారు. వారితో పాటే గాయని మంగ్లీకీ ఎస్వీబీసీలో ఓ పోస్టు పందేరం చేశారు. కానీ వారందరి కంటే ఎవరు ఔనన్నా కాదన్నా ఓ స్థాయి పైనున్న మోహన్ బాబును మాత్రం  జగన్ పట్టించుకోలేదు.  గత ఎన్నికల సమయంలో సీఎం వైయస్ జగన్‌కు బాసటగా ఉండి..  ప్రచారం చేసిన మోహన్ బాబుకు మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో సీఎం వైయస్ జగన్‌ వ్యవహారశైలిపై మంచు ఫ్యామిలీలో అసంతృప్తి పీక్స్ చేరిందని, దాని పర్యవసానమే సామాజిక మాధ్యమంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సెటైరికల్ పంచ్ అని అంటున్నారు.   అటు పరిశ్రమలోనూ, ఇటు పార్టీలోనూ కూడా మోహన్ బాబు ఎవరికీ పట్టని వ్యక్తిగా మిగిలిపోవడం ఆయన స్వయంకృతాపరాధమే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అప్పట్లో ఇది రాజకీయంగా ఒకింత సంచలనం రేకెత్తించినా..  చిత్తూరు జిల్లాలోని తన కాలేజీలో షిర్డి సాయి విగ్రహ ప్రతిష్టకు చంద్రబాబును ఆహ్వానించడానికే ఆయన ఇంటికి వెళ్లినట్లు మోహన్ బాబు చెప్పి రాజకీయ ఊహాగాన సభలకు తెరదించడానికి ప్రయత్నించారు. మంచు విష్ణుకు సీఎం వైయస్ జగన్ సమీప బంధువుని... ఈ నేపథ్యంలో ఆయన అధికారంలోకి వస్తే.. టీటీడీ చైర్మన్ లాంటి పదవి కోసం మోహన్ బాబు ఆశించారనీ, కానీ చైర్మన్ పదవి కాదు కదా.. కనీసం సలహాదారు పదవి కూడా దక్కలేదన్న దుగ్ధ మోహన్ బాబులో పేరుకుపోయిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.   

ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు.. జగన్ కు రఘురామ ప్రతిపాదన

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలంతా రాజీనామాలు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు అన్నారు. ఇందుకోసం తాను రాజీనామాకు సిద్ధమని పేర్కొన్న ఆయన వైసీపీ ఎంపీలందరి చేతా జగన్ రాజీనామాలు చేయిస్తే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను బతిమాలి తాను రాజీనామాకు ఒప్పిస్తానని రఘురామ అన్నారు. రచ్చబండలో మాట్లాడిన ఆయన 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యమని చెప్పిన జగన్ అధికారం చేపట్టిన తరువాత ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా హామీని విస్మరిస్తే ప్రజల ఆసహ్యించకుంటారన్నారు. ఎప్పుడో జరిగిన శ్రీ భాగ ఒప్పందం గురించి మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని విస్మరించడమంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదని రఘురామకృష్ణం రాజు అన్నారు.  జగన్ ఏది చెబుతారో అది చేయరనడానికి తాజా ఉదాహరణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన అని అన్నారు. ఎన్నికలకు ముందు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరిస్తానని వాగ్దానం చేసిన జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత వారిని తొలగించడం దారుణమన్నారు.   కర్నూలు వేదికగా సోమవారం (డిసెంబర్ 5) జరిగిన రాయలసీమ గర్జన సభ జంధ్యాల సినిమాను మించిన హాస్యరసం ఒలికించిందని రఘురామ అన్నారు.  కర్నూలు గర్జన సభకు జనసమీకరణ కోసం వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి బెదరించినా ఎవరూ రాలేదన్నారు.  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులో మాత్రం హైకోర్టు ఏర్పాటుపై మాట మార్చిందని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం లేదని నివేదించారని పేర్కొన్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయబోమని చెబుతూనే, మరొకవైపు రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.  

దేశంలోనే ఏపీ ఫస్ట్.. ఎందులోనో తెలుసా?

జగన్ పాలనలో అన్ని రంగాలలోనూ ఆంధ్రప్రదేశ్ అధమ స్థానంలోకి పడిపోయింది. అక్షర క్రమంలోనే తప్ప మరెందులోనూ ఏపీ ప్రథమ స్థానంలో లేదు సరికదా.. కింది నుంచి మొదటి స్థానం కోసం బీహార్ వంటి రాష్ట్రాలలో పోటీ పడుతోంది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఏపీ దేశంలో మిగతా ఏ రాష్ట్రమూ కనీసం పోటీ కూడా పడలేనంత పురోభివృద్ధి సాధించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఎందుకో ఈ అభివృద్ధిని ప్రచారం చేసుకోవడం లేదు సరికదా.. కనీసం తలచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దాచేద్దామంటే ఏదీ దాగదు కదా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఏపీ సాధించిన పురోభివృద్ధిని బట్టబయలు చేసింది. ఇంతకీ జగన్ పాలనలో మూడున్నరేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ఎందులో కనీవినీ అభివృద్ధి సాధించిందని ఆలోచిస్తున్నారా? అంత శ్రమ వద్దు.. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికలో చెప్పారు. స్మగ్లింగ్ ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. సాధారణంగా డ్రగ్స్ అనగానే ఎవరికైనా గోవా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేష్. ఇక్కడికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. అందుకని సహజంగానే డ్రగ్స్ విషయంలో గోవా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. అక్కడా డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ మూడేళ్లలో స్మగ్లింగ్ విషయంలో గోవాను మించిపోయింది. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం 2021-22 దేశం మొత్తంలోనే అత్యధికంగా 18, 267 కిలోల డ్రగ్స్ స్వీధీనం అయ్యాయి. ఇది దొరికిన డ్రగ్స్ మాత్రమే. దొరకకుండా రాష్ట్రం ఎల్లలు దాటిపోయినా, లేదా రాష్ట్రంలోని యువత వినియోగించేసిన మాదక ద్రవ్యాల సంగతేమిటనే ప్రశ్నకు ఎవరూ బదులు చెప్పలేరు. మొత్తం మీద కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం డ్రగ్స్ సంబంధిత కేసుల్లో ఏపీలో 90 మందిని అరెస్టు చేశారు. తొలి స్థానంలో ఉన్న ఏపీలో ఏకంగా 18 వేల 267 కిలోల డ్రగ్స్ స్వాధీనమైతే, పొరుగున ఉన్న తెలంగాణలో  2021-22లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ కేవలం 830 కిలోలు మాత్రమే. దీనిని బట్టే డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ సాధించిన పురోగతి ఎంత ఘనంగా ఉందో ఇట్టే చెప్పేయవచ్చు. అక్కడితో ఆగిపోలేదే.. ఆ నివేదిక ప్రకారం దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా అందుకు సంబంధించిన లింకులు ఏపీలో ఉంటున్నాయి. ఇక గంజాయి విషయానికి వస్తే ఏపీలోని విశాఖ మన్యం ప్రాంతం నుంచి హస్తిన వరకూ గంజాయి స్మగ్లింగ్ సాగుతోంది. పలు సందర్భాలలో పెద్ద  ఎత్తున పట్టుబడి గంజాయి స్మగ్లింగ్ వాహనాలన్నీ ఇదే విషయాన్ని అప్పట్లోనే తేటతెల్లం చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాల పోలీసులూ కూడా తమ రాష్ట్రానికి గంజాయి ఏపీ నుంచే వస్తోందని నిర్ధారించేశారు.  మరి ఇంకా జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనే అధోగతికి చేర్చాశారనే అందామా.. లేక అన్ని విధాలుగానూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన జగన్ పాలన ఒక్క డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో మాత్రం దేశంలోని మరే ఇతర రాష్ట్రం అందుకోలేనంత ఎత్తున నిలబెట్టాడని చెప్పుకుందామా? 

రాజకీయాల్లో పవన్ ఎందుకు ఫెయిలయ్యారు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల సంగతి ఎలా ఉన్నా రాజకీయాలలో మాత్రం రాణించ లేక పోతున్నారు. కొంచెం ఆలస్యంగానే అయినా  ఆయనే ఆ నిజాన్ని అంగీకరించారు. రాజకీయాల్లో  తాను ‘ఫెయిల్’ అయ్యానని అయినా, రాజకీయాలను వదిలి వెళ్లనని, పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. బాగుంది కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎందుకు రాణించలేక పోతున్నారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? లోపం ఎక్కడ వుంది? అంటే, అందుకు కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును, ఉండవచ్చును కాదు  ఉన్నాయి.   కానీ ఆయన ఫెయిల్యూర్ కు ఒక ప్రధాన కారణం మాత్రం ఆయన చేస్తున్న జోడు పడవల ప్రయాణం. ఇటు సినిమాల్లో, అటు రాజకేయాల్లో ఇటో కాలు అటో కాలు అన్నట్లు ప్రయాణం చేయడం వలన సామాన్య జనం ఆయన్ని ఇంకా సినిమా హీరోగా చూస్తున్నారే తప్ప సీరియస్ పొలిటికల్ స్టార్ గా గుర్తించడం లేదు. అందుకే  ఆయన మీటింగులకు వస్తున్నారు. చూస్తున్నారు. ఆయన చెప్పే డైలాగు వింటున్నారు చప్పట్లు కొడుతున్నారు. సినిమా చూసినట్లు చూస్తున్నారు. వెళుతున్నారు. అంతే తప్ప ఆయన్ని రాజకీయ నాయకుడిగా గుర్తించడంలేదు. అందుకే  ఆయన రాజకీయాల్లో రాణించ లేక పోతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా ఆయనకున్న హీరో ఇమేజే రాజకీయాల్లో ఆయన జీరో ఇమేజ్ కి కారణం అవుతోందని విశేషకులు అంటున్నారు.  అయితే సినిమాలు వదులు కునేందుకు పవన్ కళ్యాణ్  సిద్ధంగా లేరు. అలాగని అన్న చిరంజీవి అడుగుజాడల్లో రాజకీయాలకు చుక్క పెట్టి  సినిమాలకు పరిమితయ్యే ఆలోచన కూడా పవన కళ్యాణ్ కు లేదు. చిరంజీవి రాజకీయాలు వదిలేసినా  రాజకీయాలు ఆయన్ని వదలడం లేదు (సినిమాలో కాదు నిజంగానే)  అలాగే  పవన్ కళ్యాణ్ కు అదో ఇదో ఏదో ఒకటి వదిలించుకునే ఆలోచన వుందో లేదో కానీ, అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండూ కూడా పవన్ కళ్యాణ్ ను వదలడం లేదని ఆయన సన్నిహితులు, అభిమానులు అంటున్నారు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి  కానీ, పవన్ కళ్యాణ్ ఏదీ వదులుకునే పరిస్థితిలో లేరు. సినిమాలు వదులు కుంటే పార్టీ నడవదు. రాజకీయాలు వదులు కుంటే, చిరంజీవి అన్నయ్యలా, ఇంచక్కా చిందులు, విందులలో మునిగి తెల వచ్చును. కానీ, పవన్ కళ్యాణ్ ఇంకా  అందుకు సిద్దం అయినట్లు లేరు.అదలా ఉంటే  ఓ వంక ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్దమవుతున్నాయి. అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు  జిల్లాలో పర్యటిస్తున్నారు. జనం బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. ఆయన పరుగుల్లో ఆయనున్నారు.  మరోవంక టీడీపీ యువనాయకుడు లోకేష్ పాదయాత్రకు సిద్దమవుతున్నారు. చివరకు స్టేట్ పాలిటిక్స్ లో స్టేక్ లేని బీజేపీ , కాంగ్రెస్, వామ పక్ష పార్టీలు కూడా ఏంతో కొంత హడావిడి చేస్తున్నాయి.  ఆలాగని  జనసేన ఏమీ చేయకుండా చేతులు ముడుచుకు కూర్చుందని కాదు కానీ, సర్వం తానైన పవన్ కళ్యాణ్  ఏ మేరకు పార్టీకి సమయం ఇవ్వగలరు అనేదే ఇప్పుడు జన సైనికుల ముందున్న ప్రశ్న.  నిజానికి జనసేన ప్రచార రథాలు ఇంచుమించుగా సంవత్సరం క్రితమే సిద్ధమయ్యాయి. జిల్లాల్లో ప్రచారం కోసం బయలుదేరి వెళ్ళాయి, కానీ, ప్రచారం మాత్రం అంతగా పట్టాలు ఎక్కలేదు. మరోవంక జనవరి 2023 నుంచి, పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర  ప్లాన్ చేసుకున్నారు. బస్సు కూడా రెడీ అయింది.అయితే, పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు ఎంత వరకు డేట్స్ ఇవ్వగలరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరసగా వస్తున్న సినిమా ప్రకటనలు గమనిస్తే, ఎన్నికల చివరి సంవత్సరంలో అయినా పవన్ కళ్యాణ్ పార్టీకి సమయం కేటాయించగలరా అనేది అనుమానంగానే ఉందని అంటున్నారు.  ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు కంప్లీట్ అవడానికి జనవరి వరకూ పడుతుంది.. ఆ తర్వాత వెంటనే మరో రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటారని ఆయా సినిమాల రూపకర్తలు ప్రకటించారు. సుజిత్ డైరక్షన్‌లో ఓ సినిమాను కొత్తగా ఎనౌన్స్ చేయగా.. గతంలోనే ప్రకటించిన హరీష్ శంకర్ దర్శకత్వంలోని సినిమా కూడా వచ్చే వారం నుంచే ప్రారంభమవుతుందని.. హరీష్ శంకరే ప్రకటించారు. ఎలా లేదన్నా ఒక్క సినిమా షూటింగ్‌కు కనీసం నాలుగు నెలలు పడుతుంది. మరి కొన్ని కమిట్ మెంట్స్ కూడా ఉన్నాయి.ఇవ్వన్నీ అయ్యే సరికి పుణ్యకాలం పూర్తయి ఎన్నికల రానే వస్తాయి. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్  బస్సు యాత్ర మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఒకటి రెండు సార్లు వాయిదా పడిన బస్సు యాత్ర అనుకున్నవిధంగా జనవరిలో మొదలవుతుందా? మొదలైనా, నిరాటంకంగా జరుగుతుందా, షూటింగుల మధ్యలో, ‘గ్యాప్’ యాత్రలు చేస్తారా అన్నదానిపై ఇప్పటికే స్పష్ట్టత లేదు. సో.. పవన్ కళ్యాణ్  రాజకీయాల్లో ఎందుకు రాణించలేక పోతున్నారో, ఎందుకు ఫెయిల్ అయ్యారో అర్థమైంది. కానీ, ఆయన సినిమాలు చేయకపోతే, రాజకీయం చేయలేరు, సినిమాలు చేస్తే రాజకీయాలలో రాణించలేరు, పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు.. పిచ్చి కుదిరితే గానీ, పెళ్లి కాదు.  పీకేది ..అదే .. అదే డైలమా ...

ఆప్ ఆశలు గల్లంతు.. కాంగ్రెస్ కు నిరాశ..

హిమాచల ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి  జాతీయ స్థాయిలో హస్తం పార్టీ పై  పైచేయి సాధించాలని, ఆశలు పెంచుకున్న ఆప్(ఆమ్ ఆద్మీపార్టీ) కలలు కల్లలయ్యాయి. ఆప్  ఆశలపై ఎగ్జిట్ ఫలితాలు నీళ్లు చల్లాయి. ఆప్  అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆశలు  ఎగ్జిట్  లో కొట్టుకు పోయాయి. అయితే, ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్  బీజేపీకి గట్టిగా జెల్ల కొట్టింది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వమున్నా 15 ఏళ్లుగా, ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) పై ఎగురుతున్న కాషాయ జెండాను, ఆప్   చీపురు దించేసింది. ఊడ్చేసింది. అయితే  ఇవి ఎగ్జిట్  ఫలితాలే, ‘అంతిమ’ తీర్పుకు ఇంకా సమయముంది ... ఢిల్లీ ఫలితాలు  బుధవారం(డిసెంబర్ 7) హిమాచల్, గుజరాత్ ఫలితాలు గురవారం(డిసెంబర్ 8) వెలువడతాయి.  అప్పుడు గానీ  అసలు కథ బయటకు రాదు. రాజెవరో రెడ్డెవరో తెలియదు. అయితే  ఎగ్జిట్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనే అభిప్రాయమే రాజకీయ విశ్లేషణలలో వినిపిస్తోంది.  అంకెల్లో స్వల్ప తేడాలున్నా గెలుపు ఓటముల విషయంలో మాత్రం ఇంచుమించుగా అన్ని ఛానల్స్, అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ ఫలితాలు ఒకేలా ఉన్నాయి. సో .. సీట్ల సంఖ్యలో  తేడాలున్నా  ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్  లో ఆప్ జెండా ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది.  అలాగే, గుజరాత్ లో వరసగా  ఏడవ సారి బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం కూడా ఖరారైనట్లే ఎగ్జిట్ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే, హిమాచల్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య, నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉన్నట్లుగా కనిపించినా  పోల్ అఫ్ పోల్  లో బీజేపీవైపే హిమాచల్   ఓటరు మొగ్గు చూపుతున్నట్లు ఎగ్జిట్ ఫలితాలు సూచిస్తున్నాయి.  నిజానికి, గుజరాత్ లో కంటే హిమాచల్  పైనే కాంగ్రెస్ గట్టి ఆశలు పెట్టుకుంది. బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో పాటుగా, ఏ పార్టీకి వరసగా రెండవసారి అధికారం ఇవ్వని  ఆనవాయితీ మీద హస్తం పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది. అయితే, హిమాచల్  ఓటర్లు ఈసారి ఆనవాయితీకి భిన్నగా వరసగా రెండవ సారి బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారని  ఎగ్జిట్  ఫలితాలు సూచిస్తున్నాయి. కేరళ అస్సాం, ఉత్తరాఖండ్  బాటలోనే హిమాచల్  ప్రదేశ్  ఓటర్లు కూడా ఆనవాయితీకి భిన్నంగా అధికార పార్టీకి సెకండ్ ఛాన్స్  ఇచ్చారని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.  68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో బీజేపీ 38 స్థానాలతో మెజారిటీని నిలుపుకుంటుందని, పోల్ అఫ్ పోల్ సర్వే తెలిపింది. హిమాచల్ అసెంబ్లీకి మెజారిటీ మార్క్ 35 (మ్యాజిక్ ఫిగర్).  తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28 సీట్లు వస్తాయని  టైమ్స్ నౌ అంచనా వేసింది. ఇక హిమాలయ రాజ్యంలో తొలిసారిగా అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని వెల్లడించింది. ఆ పార్టీ ఇక్కడ ఖాతా కూడా తెరవదని పేర్కొంది.  ఇతరులకు 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92 . వివిధ ఎగ్జిట్ పోల్స్’లో  బీజేపీ 110 నుంచి 15౦ సీట్ల వరకు పొందే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. గుజరాత్, హిమాచల్ రాష్ట్రాలలో ఆప్  కాంగ్రెస్ పార్టీని అధిగమించక పోయినా, కాంగ్రెస్  ను ఓడించడంలో  మాత్రం కీలక పాత్రను పోషించింది. ముఖ్యంగా, గుజరాత్ లో ముస్లిం ఓటు బ్యాంకు  కాంగ్రెస్ ఖాతా నుంచి ఆప్  ఖాతాలోకి ట్రాన్స్ఫరైందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నటికంటే ముఖ్యంగా హిమాచల్, గుజరాత్, ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్నిమరోమారు నిరాశకు గురిచేశాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ముఖ్యంగా రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర ప్రభావం కానీ, పార్టీ నాయకత్వ మార్పు ప్రభావం కానీ, ఈ ఎన్నికలలో ఏ మాత్రం కనిపించలేదని పరిశీలకులు అంటున్నారు. అలాగే, ఈ ఫలితాల ప్రభావం వచ్చే సంవత్సరం జరిగే, కర్ణాటక,మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఫలితాల్తో పాటుగా, 2024 సార్వత్రిక ఎన్నికలపై కూడా ఉంటుందని అంటున్నారు.

షర్మిలకు మోడీ పిలుపు.. తెలంగాణ రాజకీయాలలో పెను కుదుపు

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలకు మోడీ నుంచి పిలుపు అందింది. ఢిల్లీ రావాల్సిందిగా ప్రధాని  ఆమెను ఆహ్వానించారు. స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి మరీ మోడీ ఢిల్లీ రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ షర్మిలతో దాదాపు పది నిముషాల సేపు ఫోన్ లో మాట్లాడారని సమాచారం. ఇప్పటికే షర్మిల తెలంగాణ రాజకీయాలలో విస్మరించరాని శక్తిగా ఎదిగారు. ఏడాదికి పైగా రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసినా, తెరాసపై, తెరాస అధినాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినా, చివరాఖరికి హస్తిన వెళ్లి మరీ కాళేశ్వరం అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసినా రాని గుర్తింపు.. ఆమెను అరెస్టు చేసిన తీరుతో ఒక్కసారిగా వచ్చేసింది. వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్రపై రాళ్ల దాడి, కార్ వ్యాన్ దగ్ధం సంఘటనలు, ఆనంతరం హైదరాబాద్ లో  ఆమె తన కారులో ఉండగానే టోయింగ్ చేసి మరీ పోలీసు స్టేషన్ కు తరలించడంతో ఒక్కసారిగా షర్మిల పొలిటికల్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచీ ఆమెకు మద్దతు లభించింది. ఆమె అరెస్టు ఎఫెక్ట్ తెరాస సర్కార్ ప్రతిష్టను మసకబార్చింది. అంతే కాకుండా ఆమె అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కూడా తాకింది. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం (డిసెంబర్5) ఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సు సన్నాహక సమావేశానికి హాజరైన జగన్ ను సొంత చెల్లెలి అరెస్టుపై ఎందుకు స్పందించలేదంటూ నిలదీశారు. సమాధానం చెప్పలేక, సమర్ధించుకోలేక జగన్ నీళ్లునమిలిన సంగతి విదితమే. ఆ సందర్భంగా మోడీ షర్మిలను అరెస్టు చేసిన తీరు తనకు ఎంతో బాధకలిగించిందన్నారు. తోడబుట్టిన సోదరుడిగా మీరెందుకు స్పందించలేదని జగన్ ను ప్రశ్నించారు.  ఇది జరిగిన 24 గంటల వ్యవధిలోనే ప్రధాని స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి హస్తినకు ఆహ్వానించారు. ఆమె అరెస్టు తీరును ఖండించి, ఆమెకు మద్దతు ప్రకటించారు.  ధైర్యంగా ఉండాలని చెప్పారు.   తనకు మద్దతు తెలిపి, పరామర్శించిన ప్రధానికి షర్మిల ఈ సందర్బంగా  ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆహ్వానం మేరకు ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పారు. మొత్తం మీద షర్మిలకు మోడీ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించడం, ఢిల్లీకి ఆహ్వానించడం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

వల్లభనేని వంశి, దేవినేని అవినాశ్ నివాసాలపై ఐటీ దాడులు

వైసీపీ నేతల నివాసాలపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం (డిసెంబర్6) ఉదయం నుంచే వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ నివాసాలలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ దాడులకు హైదరాబాద్ లింకులు ఉన్నట్లు చెబుతున్నారు. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు, దాడులు కలకలం సృష్టిస్తున్న సంగతి విదితమే. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం, మరో వైపు చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో వ్యవహారం, ఇంకో వైపు పన్నుల ఎగవేత.. ఇలా వేరు వేరు కారణాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీలు తెలుగు రాష్ట్రాలపై వరుస దాడులతో రాజకీయ వేత్తల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా వైసీపీ నాయకుడు, బెజవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జ్ దేవినేని అవినాశ్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి నివాసాలపై మంగళవారం ఉదయం నుంచీ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో దేవినేని అవినాశ్ కు చెందిన స్థలం డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఆ ఒప్పందంలో  భాగంగా జరిగిన లావాదేవీలపైనే  ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, ఆ సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది,  డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి  నివాసాలలో   ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా  ఉభయ తెలుగు రాష్ట్రాలలో  36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 

టీడీపీ టికెట్ కోసం కర్చీప్ వేస్తున్న సీనియర్లు

తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులు చొక్కా మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఫిరాయింపులు మరింత జోరుగా సాగుతూ ఉంటాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితి అందుకు కొంత భిన్నంగా కనిపిస్తోంది. నిజానికి, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు  ఇంకా ఏడాదిన్నర సమయం వుంది. అయినా  ఎన్నికల వేడి  రాజుకుంది. పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరిగి పెరిగి పీక్ కు చేరుతోంది. మరో వంక అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు బుసలు కొడుతున్నాయి. ఈ నేపధ్యంలో, పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే పక్క దారులు చూస్తున్నారు.  మరో వంక పార్టీ అద్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు, తమ వైఫల్యాలు, చేతకాని తనాన్ని, ఎమ్మెల్యేల మీదకు నెట్టి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి పరీక్షలో నెగ్గితేనే మళ్ళీ టికెట్ అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను టెన్షన్ గు గురి చేస్తున్నారు. ఈ పరిస్థితులలో, కీడెంచి మేలేంచడం మంచిదని, కొందరు కీలక నేతలు ముందుగానే పక్క పార్టీల్లో కర్చీఫ్  వేస్తున్నారు. నియోజక వర్గంలో పరిస్థితిని బేరీజు వేసుకుని  వైసీపీని వదలవలసి వస్తే  ఏ పార్టీలో చేరితే తమ రాజకీయ భవిష్యత్  నిలబడుతుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. సహచరులతో మంతనాలు సాగిస్తున్నారు. ఏపీలో వైసీపీకి ఏకైక ప్రత్యాన్మాయం టీడీపీ. సో .. సహజంగానే, ముందు జాగ్రత్తగా  వైసేపీ సీనియర్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు రెడీ  అవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటుగా, వైసీపీ ‘ముఖ్య’ నేతలు కూడా టికట్ హామీతో టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు  మాజీమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి పార్టీ  నియోజక వర్గం ‘మార్పు’ గురించి వస్తున్న వార్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నానని  తాను పోటీచేసే విషయం చెప్పాల్సింది తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముందుగానే ఏదేదో ఊహించుకొని ఇక్కడే పోటీచేస్తాను.. అక్కడ పోటీచేస్తానంటూ చెప్పడం కూడా సరికాదన్నారు. ప్రస్తుతం వెంకటగిరికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు ఆ అర్హత ఉందన్నారు.అయితే, ఆయన  ప్రస్తుతానికి వైసీపీలోనే ఉన్నా నని చెప్పడం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా వెంకటగిరి నుంచి మళ్ళీ పోటీ చేసే ‘అర్హత’ ఉందని నొక్కి చెప్పడం వెనక రాజకీయ మర్మం ఏమిటనే చర్చ జరుగుతోంది. అయితే ఆనం రామనారాయణ రెడ్డి, ఈ వ్యాఖ్యల ద్వారా సున్నితంగానే అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి  ఒక హెచ్చరిక చేశారని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు.  అంతే కాదు, మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఆనం  ఫాను పార్టీలో చాలా కాలంగా ఉక్కపోతకు గురవుతున్నారు, అసంతృప్తితో రగిలిపోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఒకటి రెండు సందర్భాలలో ఆనం తమ అసంతృప్తిని బయట పెట్టినా  సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని, అయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.  మరోవంక ఆత్మకూరు ఉపఎన్నిక సమయంలో, ఆనం కుమార్తె, కైవల్యా రెడ్డి టీడీపీలో చేరారు. నిజానికి అప్పటి నుంచి ఆనం టీడీపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఆలాగే,  ఆయన ఈసారి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారామ్ కూడా జోరుగా సాగుతోంది. అయితే, ఆయన అనుచరులు చెపుతున్నట్లుగా వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళిపోవడం కాకుండా, తన సీనియారిటీని గుర్తించక పోవడమే కాకుండా, జిల్లా రాజకీయాల్లో తమ కుటుంబ ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు సాగిస్తున ‘ప్రత్యర్ధుల’ ను దెబ్బతీసే వ్యూహంతో ఆనం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఆయన తాజాగా,మీడియాలో వస్తున్నట్లుగా తనకు వేరే ఆలోచన ఉంటే.. ఆ మాట తన నోటినుంచి రాబోయే ముందు కాగితం పక్కనపెట్టి చెబుతానన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై అప్పటివరకు ఎవరికీ ఏ అనుమానం అక్కర్లేదని చెప్పారు.అలాగే  తనకు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేందుకే టికెట్ ఇచ్చారని, ఈ ఐదు సంవత్సరాల చివరి రోజు వరకు వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. అదలా ఉంటే, ఆనం రామనారాయణ రెడ్డి తాజా వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లోనే  కాదు, రాష్ట్ర రాజకీయాల్లోను వేడిని రాజేస్తున్నాయి. నిజానికి, వైసీపీలో ఒక్క ఆనం మాత్రమే కాదు  ప్రస్తుత మంత్రి వర్గంలో ఉన్న కొందరు మంత్రులతో సహా  సీనియర్ నాయకులు, ముఖ్యంగా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు  ఆనం కంటే ఎక్కువగా అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోంది. అయితే, ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నర సమయం ఉన్నందున తొందర పడకుండా జగన్ రెడ్డికి వ్యతిరేకంగా జెండా ఎగరేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.అందుకే, రాజకీయ విశ్లేషకులు,‘అవును,వైసీపీలో అగ్గి రాజుకుంటోంది.. భగ్గుమనే రోజు దగ్గరలోనే వుందని  అంటున్నారు .

షర్మిల అరెస్టుపై ఎందుకు స్పందించలేదు.. జగన్ ను నిలదీసిన మోడీ.. నీళ్లు నమిలిన ఏపీ సీఎం

ప్రజా సమస్యలపైనా, ప్రభుత్వ విధానాలపైనా విపక్షాలు విమర్శలు గుప్పించడం, ఆందోళనలు చేయడం సహజమే. ప్రభుత్వం నిర్బంధ కాండ ప్రయోగిస్తే.. రాజకీయాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ముక్త కంఠంతో ఖండిస్తారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరే వేరు. ఆయన తనకు రాజకీయ లబ్ధి ఉంటుందని భావిస్తేనే పెదవి విప్పుతారు. లేదంటే.. తన పర భేదం లేదు ఆయనకు ఎవరెలా పోతే మాకేం.. అన్నట్లుగానే వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తన సొంత చెల్లి షర్మిలను అక్కడి తెరాస సర్కార్ అత్యంత అమానవీయంగా వాహనంలో ఉండగానే టోవింగ్ చేసి పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లిన సంఘటనను రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించారు. తెలంగాణలో వైఎస్సార్ టీపీ ని స్థాపించి.. అక్కడి ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలుపెరుగని పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు మూడు వేల కిలోమీటర్లకు పైగా షర్మిల తెలంగాణలో పాదయాత్ర పూర్తి చేశారు. తన పోరాటంలో షర్మిల తెరాస సర్కార్ ను, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శలతో చెడుగుడు ఆడుకున్నారు. అలా అని మిగిలిన పార్టీలను కూడా స్పేర్ చేయలేదు. బీజేపీపైనా, కాంగ్రెస్ పైనా కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయినా కూడా ఆమెను అరెస్టు చేయడాన్ని, ఆమె కారులో ఉండగానే టోయింగ్ చేసి పీఎస్ కు తరలించడాన్ని బీజేపీ, కాంగ్రెస్ కండించాయి. ఆ రాష్ట్ర గవర్నర్ తమిళి సై స్పందించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ షర్మలకు మద్దతు లభించింది. సానుభూతి వ్యక్తమైంది. అయితే పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి, షర్మిలకు తోడబుట్టిన అన్న జగన్ మాత్రం పెదవి విప్పి మాట్లాడలేదు. పన్నెత్తి ఆమె అరెస్టును ఖండించలేదు.   తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వాహనంపై వరంగల్‌ జిల్లా నర్సంపేటలో గత ఆదివారం రాళ్ల దాడి జరిగింది. ఆమె క్యారవాన్‌ను దగ్ధం చేశారు.  పోలీసులు ఆమెను బలవంతంగా హైదరాబాద్‌లోని నివాసానికి తరలించారు. ఈ ఘటనలను నిరసిస్తూ మరుసటి రోజు షర్మిల ప్రగతి భవన్‌ ముట్టడికి  పాక్షికంగా ధ్వంసమైన తనకారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయలు దేరారు. అయితే మార్గమధ్యంలో  అడ్డుకున్నారు. ఆమె కారులో కూర్చుని ఉండగానే కారును క్రేన్‌తో పీఎస్ కు తరలించారు.  షర్మిలను పరామర్శించేందుకు వెళ్తున్న తల్లి విజయలక్ష్మిని కూడా పోలీసులు నిలువరించి గృహనిర్బంధం చేశారు.  ఈ ఘటనలను రాజకీయాలకు అతీతంగా అందరూ తీవ్రంగా ఖండించినా   సొంత చెల్లెలు షర్మిలపై తెలంగాణలో జరిగిన ఈ దాడిపై, అప్రజాస్వామికంగా అరెస్టు చేయడంపై ఏపీ  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్పందించలేదు, ఖండించలేదు.   అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఊరుకోలేదు. సోమవారం (డిసెంబర్5) జి-20 సదస్సు సన్నాహకాలపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లిన ఏపీ సీఎం జగన్ ను మోడీ నిలదీశారు. షర్మిలను అరెస్టు చేసిన తీరు తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఆ విషయంపై మీరెందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో షర్మిలను అప్రజాస్వామికంగా అరెస్టు చేసిన వారం రోజుల తరువాత హస్తినలో జగన్ ను ప్రధాని మోడీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.   మీ చెల్లెలు షర్మిల కారులో ఉండగానే క్రేన్‌తో లాక్కెళ్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారటకదా! ఇంత జరిగినా మీరెందుకు స్పందించలేదు? అని జగన్ ను ప్రశ్నించారు.  ప్రధాని నుంచి ఇలాంటి ప్రశ్నను ఊహించని జగన్ సమాధానం చెప్పలేక నీళ్లు నవ్వారు. కష్టపడి ముఖానికి నవ్వు పులుముకుని మౌనంగా మిగిలిపోయారు.   

చంద్రబాబు విజన్ కు, విజ్ణతకు మోడీ ఫిదా!

ఆధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రత్యేకతే వేరు. ఆయనకు ఉన్న గుర్తింపే వేరు. గతంలోనూ ఇది పలుమార్లు రుజువైంది. తాజాగా ఢిల్లీలో సోమవారం (డిసెంబర్ 5)జి-20 సదస్సు సన్నాహకంపై జరిగిన అఖిల పక్ష సమావేవంలో ఇది మరో సారి రుజువైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబుకు కేంద్రం ఘన స్వాగతం పలికింది. కేంద్ర మంత్రి స్వయంగా చంద్రబాబును వేదిక వద్దకు తోడ్కోని పోయారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులు హాజరయ్యారు. వారెవరికీ లేని గుర్తింపు, ప్రాధాన్యత చంద్రబాబుకు దక్కింది. సదస్సు అనంతరం ప్రధాని మోడీ చంద్రబాబుతో ప్రత్యేకంగా పది నిముషాల పాటు ముచ్చటించారు. ఈ మాటామంతీలో మోడీ రాజకీయ అంశాలతో పాటు, చంద్రబాబు ఆరోగ్యం, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బాగా చిక్కిపోయారు అని మోడీ వ్యాఖ్యానించారు. అంతకు ముందు సమావేశానికి హాజరైన చంద్రబాబుకు కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ అయితే స్వయంగా దగ్గరుండి మరీ సమావేశ మందిరానికీ, వేదికపైకి తోడ్కొని పోయారు. ఈ సమావేశంలో చంద్రబాబు డిజిటల్ నాలెడ్జ్ పై ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి సదస్సుకు హాజరైన  వారంతా ముగ్ధులయ్యారు. మోడీ అయితే ఫిదా అయిపోయారు. తన ప్రసంగంలో చంద్రబాబు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ పై ప్రత్యేకంగా ప్రస్తావించారు.  చంద్రబాబు తన ప్రసంగంలో దేశం భవిష్యత్ గమనం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అన్నవిషయాన్ని విపులంగా వివరించారు. వచ్చే పాతికేళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. రానున్న పాతికేళ్లలో భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా నిలుస్తుందని అన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలను, కార్యాచరణను సిద్ధం చేసుకోవలసిన ఆవశ్యకతను వివరించారు. జి-20 సదస్సు సన్నాహకంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో చంద్రబాబు ప్రసంగమే హైలైట్ గా నిలిచిందంటే.. ఆయన విజనరీని అవగాహన చేసుకోవచ్చు. చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలను మోడీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొని మరీ ప్రస్తుతించారంటేనే.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రగతి, పురోగతి, అభివృద్ధి అంశాలపై చంద్రబాబు దార్శనికతకు ఎవరైనా సరే ఫిదా అవుతారనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణంగా చెప్పాలి. తన ప్రసంగంలో చంద్రబాబు ఏపీకి సంబంధించిన అంశాలతో పాటుగా జాతీయ, అంతర్జాతీయ అంశాలనూ స్పృసించారు. దేశ ప్రగతి బాటలో నడవాలంటే చేపట్టాల్సిన చర్యల గురించీ ప్రస్తావించారు. ముఖ్యంగా దేశానికి బలం యువత అనీ, ఆ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలనీ చెప్పారు. అందుకోసం వారికి అవకాశాలు  సృష్టించేలా ప్రభుత్వాలు విధానాల రూపకల్పన చేయాలన్నారు. ముందు నుంచీ అంటే చంద్రబాబు జి-20 సన్నాహక సదస్సుకు కేంద్రం  ఆహ్వానం మేరకు హస్తిన వెళుతున్నరని తెలిసినప్పటి నుంచీ అందరి ఆసక్తీ మోడీతో భేటీ ఉంటుందా అన్న అంశంపైనే కేంద్రీకృతమైంది. నాలుగు నెలల కిందట..  ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌  సమావేశంలో  కేంద్రం ఆహ్వానం మేరకు చంద్రబాబు   పాల్గొన్నారు. ఆ సమావేశం ముగిసిన అనంతరం... చంద్రబాబుతో మోదీ  కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ ఐదు నిముషాల సేపు వీరిరువురూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా  మోడీ ‘మనం చాలా రోజులు అయ్యింది కలుసుకొని. మీరు ఢిల్లీకి తరచూ ఎందుకు రావడం లేదు? అని అడిగారు. మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది అని కూడా అన్నారు. ఆ తరువాత నాలుగు నెలల అనంతరం మళ్లీ మోడీ, చంద్రబాబు ముఖాముఖీ కలుసుకోనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోమవారం(డిసెంబర్ 5) నాటి సదస్సులో చంద్రబాబు, ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అవుతారా, అయితే ఇరువురి మధ్యా చర్చకు వచ్చే అంశాలేమిటి? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. వీరి ప్రత్యేక భేటీ ఏపీ రాజకీయాలలో మార్పులకు నాందిగా అందరూ   అభివర్ణిస్తున్నారు.  

తెలుగుదేశానికే జై ‘గంటా’

మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు గంటా శ్రీ‌నివాస్‌రావు పార్టీ మారబోతున్నారంటూ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గ‌తంలోనూ గంటా గోడ దూకేస్తున్నారన్న వార్తలు వెల్లువెత్తాయి. ఆయ‌న ఈ వార్తలపై ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. పార్టీ మారలేదు.  అయితే మొక్కుబడిగా తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాననీ, పార్టీ మారే ప్రశక్తే లేదనీ చెబుతూ వచ్చారు. అయితే ఇటీవ‌ల మ‌రోసారి గంటా పార్టీ మారుతున్నార‌ని, వైసీపీ త‌ర‌పున ఆయ‌న వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ మొదలైంది. గంటా వ‌ర్గీయులు మాత్రం ఆయ‌న పార్టీ మార్పుపై ఎలాంటి స‌మాచారం లేద‌ని చెబుతూ వ‌చ్చాయి. కానీ, రోజురోజుకు గంటా పార్టీ మారుతున్నాడ‌ని వార్తలు విస్తృతంగా ప్రచారం జరిగింది. గంటా ముఖ్యమంత్రి జగన్ సమక్షంగా వైకాపా గూటికి చేరనున్నారనే కాక, ఆయన పార్టీ మారే ముహూర్తం కూడా ఫిక్సైపోయిందని వైసీపీ నేతలు ప్రకటనలు కూడా చేసేశారు. జనవరిలో గంటా ఫ్యాన్ పార్టీలో చేరడం ఖాయమన్నట్లు చెప్పేశారు. ఈ నేపథ్యంలో గంటా ఈ సారి కాస్తంత గట్టిగానే తాను పార్టీ మారేది లేదని గట్టిగా చెప్పారు. తాను రాజకీయాలలో ఉన్నంత వరకూ చంద్రబాబుతోనే తన ప్రయాణం అని గంటా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదంటూ విస్పష్టంగా ప్రకటించారు.  తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాననీ, సామాజిక మాధ్యమాలలో ఎవేవో రాస్తుంటారు, వాటిని పట్టించుకోనవసరం లేదని గంటా పేర్కొన్నారు. గత కొంత కాలంగా తాను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం జరగడం, నేను వివరణ ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు. కాగా పార్టీ మారేది లేదని గంటా ఇచ్చిన వివరణతో తెలుగుదేశం శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్నంత వరకూ తాను చంద్రబాబుతోనే ఉంటానంటూ గంటా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఎప్పటిదన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. 

దేశంలో ఎలక్షన్ ఫీవర్

సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏణ్ణర్థం సమయం ఉంది. అయినా దేశం మొత్తం ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష కాంగ్రెస్ సహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలూ కూడా ఎన్నికల సన్నాహాలలో నిండా నిమగ్నమయ్యాయి. అంతేనా.. ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి చల్లారకుండా రగులుస్తూనే ఉన్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ప్రత్యర్థి పార్టల నుంచి జంప్ జిలానీలను ప్రోత్సహించడమే కాదు.. పార్టీకి గ్లామర్ కోసం సెలబ్రిటీలనూ ఆశ్రయిస్తున్నాయి. కేవలం సెలబ్రిటీలు పార్టీ  తరఫున మాట్లాడితే ఓట్లు పడతాయా అన్న సంశయం ఉన్నప్పటికీ.. వారి వల్ల తమ సభలకు జనం తరలివస్తారన్న నమ్మకం మాత్రం అన్ని పార్టీలలోనూ మెండుగా ఉంది. అమిత్ షా హైదరాబాద్ పర్యటనల సందర్భంగా ప్రముఖ సినీ నటులతో ప్రత్యేకంగా భేటీ కావడం, రాహుల్ గాంధీ భాతర్ జోడో యాత్రలో ప్రముఖ నటులు కలిసి నడవడం వంటి గిమ్మిక్కులన్నీ ఇందులో భాగమనే చెప్పాల్సి ఉంటుంది. నిజంగానే సీనీ గ్లామర్ ఓట్లను రాలుస్తుందా? అంటే నమ్మకంగా ఏ పార్టీ ఔనని చెప్పగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రజాదరణ ఉన్న నటులు సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి విజయం సాధించడంలో విఫలమైన ఉదంతాలు ఉన్నాయి. అయితే సినీ గ్లామర్ ఆయా పార్టీల  ర్యాలీలకు జనాన్ని రప్పించడానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంనద్న విశ్వాసం మాత్రం ఆయా పార్టీల నాయకుల్లో మెండుగా ఉంది. అందుకే పోటీలు పడి మరీ సెలబ్రిటీలకు పార్టీల నేతలు ఆహ్వానాలు పలుకుతున్నారు.  ఈ ఎన్నికల  రేసును ముందుగా మొదలు పెట్టినది బీజేపీ అనే చెప్పాలి. హిమాచల్, గుజరాత్ ఎన్నికలు ముగిశాయి. మరో మూడు రోజులలో ఫలితాలు వస్తాయి. గుజరాత్ లో రెండో విడత పోలింగ్ ఇంకా పూర్తిగా ముగియక ముందే.. త్వరలో అంటే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దృష్టి సారించాలంటూ ప్రధాని మోడీ బీజేపీ క్యాడర్ కు పిలుపు నిచ్చేశారు. సోమ,మంగళవారాలలో (డిసెంబర్ 5,6) బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆఫీస్ బేరర్స్ తో  జరిగే కీలక భేటీలో  2024 సార్వత్రిక ఎన్నికలలో  అవలంబించాల్సిన వ్యూహాలపై బీజేపీ అధ్యక్షుడు నడ్డా పార్టీ శ్రేణులకు వివరిస్తారు. ఎన్నికలలో అనుసరించాల్సిన ప్రచారంపై దిశానిర్దేశం చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రోడ్ మ్యాప్ పై ఆ సమావేశాల్లో చర్చిస్తారు.  సోమవారం (డిసెంబర్ 5న) జరిగిన భేటీలో ప్రధాని మోడీ  వర్చువల్ గా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలే కాకుండా వచ్చే ఏడాది అంటే 2023లో కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలపై ఇప్పటి నుంచే సీరియస్ గా దృష్టి పెట్టాలని మోడీ క్యాడర్ కు పిలుపు నిచ్చేశారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ అసెంబ్లీలకు కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే ఏడాదే జరిగే అవకాశాలున్నాయన్న సంకేతాలు కూడా ఇచ్చారు. రెండు రోజుల  బీజేపీ జాతీయఆఫీస్ బేరర్స్, అన్ని రాష్ట్రాల ఇంఛార్జులు, కో-ఇన్-ఛార్జులు, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీలతో రెండు రోజుల పాటు జరిగే సమావేశాల తొలి రోజు సోమవారం (డిసెంబర్ 5) జేసీ నడ్డా ప్రసంగించారు. మోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. సమావేశం మంగళవారం (డిసెంబర్ 26) కూడా కొనసాగనుంది. అటు గుజరాత్ ఎన్నికల రెండో విడత పోలింగ్ పూర్తి కాకముందే బీజేపీ తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టేసింది. బీజేపీ తన స్పీడ్ తో ఇరత పార్టీలలో కూడా ఎన్నికల వేడిని రగిలించేసింది.  బీజేపీహంగామాతో ఇతర పార్టీలు సైతం ఎన్నికలసన్నాహాలకు శ్రీకారం చుట్టేశాయి. ఇక అన్నిటికీ మించి కేంద్రం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో దర్యాప్తు సంస్థల ద్వారా ఆ ప్రభుత్వాలకు చిక్కులు సృష్టిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  దర్యాప్తు సంస్థల దాడులతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను టెన్షన్ లోకి నెట్టేసి తాను మాత్రం ఎన్నికల సన్నాహాలను తాపీగా చేసుకుంటోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు  వరుసగా రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు ఉండటంతో దేశ వ్యాప్తంగా ఎలక్షన్ ఫీవర్ పీక్స్ లో ఉంది. 

గుజరాత్ లో కమల వికాసం - హిమాచల్ ..లో హంగ్ ?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ ఈ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసీ ముగియక ముందే గుజరాత్ తో పాటుగా హిమాచల్  ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తున్నాయి. ఇంతవరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలో ప్రీ పోల్ సర్వే ఫలితాలు సూచించిన విధంగా, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ వుంది. గుజరాత్ లో మరోమారు బీజేపీ  అధికారం నిలబెట్టుకుంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ రెండు రాష్టలోనూ చతికిలపడింది. గుజరాత్ లోపరోక్షంగా బీజేపీ గెలుపుకు ఆప్  కొంత వరకు దోహదం చేసినా కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి చేర్చాలనే కేజ్రీవాల్  కల ఫలించలేదు.  హిమాచల్ ప్రదేశ్ లో ఆత్మసాక్షి సర్వే ప్రకారం, బీజేపీకి 42 నుంచి 43.75 శాతం ఓట్లతో 31 నుంచి 35 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాసం వుంది. మరో వంక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పై స్వల్ప ఆధిక్యతతో, 44 నుంచి 44.5 శాతం వోట్  షేర్  తో 33 నుంచి 36 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఆప్ కు నాలుగు నుంచి ఐదు శాతం ఓట్లతో  2  నుంచి 3 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆత్మసాక్షి సర్వే సూచించింది. అలాగే  ఇతరులు  6 నుంచి 6.75 శాతం ఓట్లతో 2 నుంచి 3 సీట్లు గెలుచుకుంటారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఓక విధంగా హంగ్  ను సూచిస్తున్నాయి.    అయితే గుజరాత్  ఓటర్లు మరో మారు బీజేపీకి అనుకూలంగా తీర్పు నిచ్చారని, ఆ పార్టీకి 45 నుంచి 46 శాతం ఓట్లు, 98 నుంచి 110 వరకు సీట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ  38 నుంచి 39 శాతం ఓట్లతో 66 నుంచి 71 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదాను నిలుపుకుంటుంది. అలాగే, ఆప్    కి మూడవ స్థానానికే పరిమితమౌతుంది.  11 నుంచి 14శాతం ఓట్లతో, 9 నుంచి 14 సీట్లు తెచ్చుకుని ఆప్ ..మూడవ స్థానంతో సరిపెట్టుకోక తప్పదని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది.

కేసీఆర్ ముందస్తు అడుగులు.. కాదు కాదు పరుగులు!

నోటితో చెప్పిన ప్రతి విషయాన్నీ నొసటితో కాదనడం కేసీఆర్ కు బాగా తెలిసిన విద్య. అందుకే ఆయన ముందస్తు ప్రశక్తే లేదని ఇటీవలి కాలంలో ఎన్నిమార్లు ఉద్ఘాటించినా రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా నమ్మకం కనిపించలేదు. ఇంత గట్టిగా చెబుతున్నారు కనుక ముందస్తు ఖాయం అన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమైంది. అందుకు తగ్గట్టుగానే  కేసీఆర్ జిల్లాల కార్యాలయాలు, కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవాల స్పీడ్ పెంచారు. ఆ సందర్బంగా ఏర్పాటు చేసే సభలలో వరాల జల్లులు కురిపించడంతో మాటు మరో మారు తెరాసకుఅవకాశం ఇవ్వాలన్న విజ్ణప్తులూ చేస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద నుంచే  ఢిల్లీ పీఠానికి గురిపెట్టానంటున్నారు. అందుకోసం తెరాసను తెలంగాణలో గెలిచించాలని కోరుతున్నారు. పాలమూరులో ఆదివారం కేసీఆర్ పర్యటన మొత్తం ఎన్నికల సందడినే స్ఫురింపచేసింది. ఆ సందర్భంగా ఆయన మాటలన్నీ ఎన్నికలను టార్గెట్ చేసే ఉన్నాయి.   ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఉద్దేశాన్నే చాటాయి. జాతీయ వ్యూహాన్ని మార్చి పూర్తిగా తెలంగాణ ఎన్నికలపైనే దృష్టి పెట్టిన కేసీఆర్ హామీలు, అభివృద్ధి పనులపై కాన్ సన్ ట్రేట్ చేయడానికి డిసైడైపోయారని అంటున్నారు.  ముందస్తు ప్రసక్తే లేదని ప్రకటించిన కేసీఆర్ అందుకు పూర్తి భిన్నంగా ఎన్నికల సన్నాహాలలో నిమగ్నమైపోయారన్న చర్చరాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత కేసీఆర్ ముందస్తు ఉండదని నోటితో చెబుతూనే.. తెరవెనుక ముందస్తు సన్నాహాలు మొదలెట్టేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ పరంగా శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే కాదు... పాలన పరంగా కూడా కేసీఆర్ దూకుడు పెంచారు. పాలమూరుతో ప్రారంభించి.. డిసెంబర్ లో పలు జిల్లాలలో కూసీఆర్ పర్యటనలకు షెడ్యూల్ రెడీ చేసుకున్నారు.   యదాద్రి పవర్ ప్లాంట్ పర్యటన, మెట్రో విస్తరణ, సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించడం, అలాగే  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి కసరత్తు,  సొంత స్థలాలు ఉన్న వారికి ఆర్థిక సాయం ఇలా ఇంత కాలం పట్టించుకోకుండా వదిలేసిన పథకాలను  పట్టాలు ఎక్కించబోతున్నారు. ఇక ఒక్కటొక్కటిగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఒక్కొక్కటి జారీ చేస్తున్నారు.  హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలకు కూడా పదును పెడుతున్న  కేసీఆర్ స్పీడ్ ను చూస్తుంటే ముందస్తు తథ్యమన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలతో పార్టీలో జోష్ పెంచుతుంటే మరో వైపు మంత్రి కేటీఆర్  గ్రేటర్ పరిధిలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు వరుస ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మరిన్ని కోట్ల రూపాయల పనులకు వంకుస్థాపనలు చేస్తున్నారు. బన్సీలాల్ పేట మెట్ల బావిని అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. అలాగే గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలలో అభివృద్ధి పనులుకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో స్పీడ్ పెంచారు.  ఈ నేపథ్యంలోనే ముందస్తు ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమౌతోంది. అయితే ముందస్తు తేదీపై మాత్రమే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం (డిసెంబర్ 6) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశాలలోనే ముందస్తు ప్రకటన చేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. ఒక వేళ ఈ అసెంబ్లీ సమావేశాలలో ముందస్తు ప్రకటన లేకుంటే మరో రెండు నెలల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అంత వరకూ వేచి ఉండి.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత ముందస్తు ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా మార్చి లోగా ముందస్తు ప్రకటన ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. అంటే వచ్చే ఏడది సెప్టెంబర్- అక్టోబర్ నెలల మధ్యలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే  కేసీఆర్ తన ప్రసంగాలు, ప్రకటనల ద్వారా ఒక వైపు ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ ను రగులుస్తున్నారనీ, అదే సమయంలో మరో వైపు విపక్షాలను ముఖ్యంగా బీజేపీని తెలంగాణ ద్రోహిగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు.  

కేసీఆర్ అఖిలపక్షసదస్సుకు హాజరు కావడం లేదు ?

కేంద్రంలో బీజేపీ అధికారంలో వుంది.తెలంగాణలో తెరాస అధికారంలో వుంది. ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వుంది. సహజం. రాజకీయ పార్టీల నడుమ విబేధాలు సహజం. కానీ, రాజకీయ విబేధాలు, రాజకీయాల వరకు పరిమితం అయితే ఓకే, కానీ, ఆ-గీత దాటి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితికి చేరితే, అది ఎంత మాత్రం అభిలషనీయం కాదు. కానీ,దురదృష్ట వశాత్తు, బీజేపీ, తెరాసల రాజకీయ యుద్ధం గీత దాటింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధంగా మారుతోంది.అంతేకాదు,వ్యక్తిగత శతృత్వం స్థాయికి దిగజరుతోందా, అనే సందేహాలకు తావిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  గడచిన సంవత్సర కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాలుగైదు మార్లు తెలంగాణ పర్యటనకు వచ్చారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా ఆయన్ని కలవలేదు. ప్రోటోకాల్ పాటించలేదు. ప్రధానికి స్వాగతం పలక లేదు.వీడ్కోలు చెప్పలేదు. ప్రోటోకాల్ సంగతి పక్కన పెట్టినా, కనీస రాజకీయ మర్యాదను పాటించలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాదు, ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ అదొక వివాదంగా మారుతోంది. సమాచారం ఉందని,  లేదని, పిలిచారని, పిలవలేదని ఇలా, గిల్లికజ్జాల వ్యవహారం నడుస్తోంది.  అదొక ఆనవాయితీగా మారిపోయింది. దీంతో, మిగిలిన విషయాలు ఎలా ఉన్నా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు.  అదలా  ఉంటే, ఇప్పడు మళ్ళీ అలాంటి వివాదమే నడుస్తోంది. మన దేశం జీ-20 అధ్యక్ష పదవిని దక్కించుకుంది. డిసెంబర్ 1, 2022 నుంచి సంవత్సర కాలంపాటు, మన దేశం ఈ పదవిలో కొనసాగుతుంది. ఈ సంవత్సర కాలంలో జీ – 20 వేదికగా జరిగే కార్యక్రమాలకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఒక అవగాహన కల్పించేందుకు, కేంద్ర ప్రభుత్వం   సోమవారం (డిసెంబర్ 5) అన్ని రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నలభైకిపైగా రాజకీయ పార్టీల నాయకులకు ఆహ్వానం పంపింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సమబందించి, వైసీపీ అద్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెరాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఏపీలో రాష్ట్రపతి పర్యటన కొనసాగుతున్నందున జగన్ రెడ్డి సమావేశానికి హాజరు కాకపోవచ్చని అంటున్నారు, చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. తెరాస అధ్యక్షడు కేసేఆర్, హాజరవుతున్నారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఒరిస్సా ముఖ్యమంత్రి, బీజేడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ అధ్యక్షడు జేపీ నడ్డా, ఇతర ప్రధాన పార్టీల అధ్యక్షులు అందరూ హాజరవుతున్నారు. నిజానికి, ఈ సమావేశంలో పాల్గొంటున్న వారిలో బీజేపీ మిత్ర పక్షాల కంటే, బీజేపీని రాజకీయంగా వ్యతిరేకించే పార్టీల నేతలే ఎక్కువ మంది ఉన్నారు. అయినా, కేసేఆర్ మాత్రం ఎందుకనో, ఇంతటి  కీలక సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించుకున్నారు.  అదలా ఉంటే టీఆర్‌ఎస్‌ నేత కె.కేశవరావు స్పందిస్తూ.. మా నాయకుడు సభకు హాజరవుతారనే సమాచారం తమకు లేదన్నారు. సింగపూర్‌లో చికిత్స పొందుతున్నందున ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరుకావడం లేదు. ఈ సమావేశానికి జనతాదళ్ యునైటెడ్ ప్రెసిడెంట్ నితీష్ కుమార్ కూడా హాజరయ్యే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.అయితే, ఇతరుల విషయం ఎలా  ఉన్నా, బీజేపీ, తెరాస సంబంధాలు ఉప్పు నిప్పులా భగ్గుమంటున్న నేపధ్యంలో   ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొనడం వలన రాజకీయంగా తప్పుడు సంకేతాలు రాష్ట్రంలో తప్పుడు సంకేతాలు వెళతాయనే ఆలోచనతోనే, ముఖ్యమంత్రి కేసేఆర్,ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే, అదే సమయంలో, జాతీయ రాజకీయాలో కీలక పాత్రను పోషించేందుకు సిద్దమవుతున్న కేసేఆర్  జాతీయ స్థాయిలో జరుగతున్న సమావేశానికి హాజరు కాకపోవడం  జాతీయ స్థాయిలో  రాజకీయంగా రాంగ్ సిగ్నల్స్ పంపుతుందని అంటున్నారు. పొలిటికల్ సిగ్నల్స్ ఎలా ఉన్నా, నువ్వు గోకినా గోకకపోయినా నేను నిన్ను గోకుతూనే ఉంటానని, ప్రధానిని ఉద్దేశించి  ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన నేపధ్యంలో అయిన దానికి కాని దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై కయ్యానికి కాలుదువ్వుతున్నారనే సంకేతాలు అయితే వెళుతున్నాయని,అలాగే ముఖ్యమంత్రి ధోరణి విమర్శలకు గురవుతోంది తెరాస నాయకులే అంటున్నారు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, రాజకీయం రాజకీయమే, పరిపాలన పరిపాలనే..; అన్నట్లు ఉండాలని అంటున్నారు.

రాయలసీమ గర్జనలో కుప్పకూలిన బైరెడ్డి.. అసలేమైంది?

వైసీసీ యూత్ వింగ్ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రాయలసీమ గర్జన సభలో ప్రసంగిస్తూ ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రసంగాన్ని కొనసాగించడం కష్టమైంది. వెంటనే ఆయన క్షమించాలి అంటూ ప్రసంగాన్ని ముగించి వేదిక దిగిపోయారు. ఆ తరువాత ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనకు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అస్వస్థత ఏమిటన్న ఆందోళనలో పార్టీ వర్గాలు ఉన్నాయి. కాగా ఆసుపత్రిలో చికిత్స అనంతరం బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు.

పంజాబ్ మ్యాజిక్ పునరావృతమౌతుందా? గుజరాత్ లో ఆప్ ప్రభావమెంత?

దేశమంతా ఆసక్తిగా గమనిస్తున్న,గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ సోమవారం (డిసెంబర్ 5) ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అలాగే, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అహ్మదాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అహ్మదాబాద్‌లోని రాణిప్‌లో గల పోలింగ్‌ కేంద్రంలో   ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రధాని మోడీ ఈ ఉదయం గాంధీనగర్‌ రాజ్‌భవన్‌ నుంచి అహ్మదాబాద్‌ చేరుకున్నారు. రాణిప్‌లోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికివచ్చిన మోడీ, కాన్వాయ్‌ను కొంత దూరంలో ఆపి నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లారు. ప్రధానిని చూసేందుకు వందల మంది అభిమానులు రాగా.. దారిపొడవునా వారికి అభివాదం చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వద్ద సామాన్య ప్రజలతో కలిసి క్యూలైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు.. ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా పిలుపు నిచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ నారన్ పురాలోని ఏఎంసీ సబ్ జోనల్ ఆఫీస్ లో ఓటు వేశారు. అమిత్ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు ఇతర కుటుంబసభ్యులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేస్తున్న యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇక గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శైలజ్‌ అనుపమ్‌ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన సీఎం పటేల్‌ కూడా క్యూలైన్‌లో నిల్చుని ఓటేశారు. కాగా,రెండో విడతలో భాగంగా 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.51 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 5.30 గంటలకు ఎగ్జిట్ పోల్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. డిసెంబరు 8వ తేదీన గుజరాత్‌తో సహా హిమాచల్‌ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఇంతవరకు గుజరాత్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరు జరుగుతుంటే, ఈసారి తొలి సారిగా, ఆప్  బరిలో దిగడంతో త్రిముఖ పోటీ జరుగు తోంది అయితే, ఆప్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంలో  విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆప్ ప్రభావం పట్టణ ప్రాంతాల్లో తప్పించి, గ్రామీణ ప్రాంతాల్లో  పెద్దగా ఉండదని, అంటున్నారు. అయితే, ఆప్ అధినాయకత్వం మాత్రం పంజాబ్ మ్యాజిక్ పునరావృతం అవుతుందని గట్టి విశ్వాసంతో వుంది.

కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం ?!

కాంగ్రెస్ పార్టీ కథ ముగిసింది. ఇక హస్తం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అయ్యే పని కాదు. అందుకే ..ఈ నిర్ణయం.  ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీని వదిలి కాషాయం కట్టిన మర్రి శశిధర్ రెడ్డి మొదలు, కాంగ్రెస్ చేయి వదిలిన ప్రతి నాయకుడు చెపుతున్న మాటే ఇది.  గడచిన ఎనిమిది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీని ఎంత మంది నాయకులు వదిలి వెళ్ళారో లెక్క లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో 2019 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రస్ పార్టీ వరసగా రెండవ సారి, రెండంకెల సంఖ్య దగ్గరే ఆగిపోయిన తర్వాత, ఎంతోమంది పార్టీ సీనియర్ నాయకులు క్యూ కట్టి బయటకు వెళ్ళిపోయారు.  ఈ   (2022) సంవత్సరంలోనే గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, కెప్టెన్ అమరేందర్ సింగ్, సునీల్ ఝాకర్,ఆర్పీఎన్ సింగ్, అశ్వినీ కుమార్, హార్దిక్ పటేల్ ఇలా ఎంతో మంది ఉద్దండ నాయకులూ,కేంద్ర మాజీ మంత్రులు,మాజీ ముఖ్యమంత్రులు ఇంకా ఎంతో మంది  కాంగ్రెస్ ను వీడారు. ఇలా పార్టీకి గుడ్ బై చెప్పిన వారంతా  కాంగ్రెస్ పార్టీ వరస ఓటములకు, పార్టీ ప్రస్తుత దయనీయ స్థితికి రాహుల్ గాంధీని ఆయన చుట్టూచేరిన కోటరీని కారణంగా చూపిస్తున్నారు. అంతా మీరే చేశారు.. అంటూ రాహుల్ అండ్ కో ను  వేలెత్తి చూపిస్తున్నారు. దోషులుగా బోనులో నిలబెడుతున్నారు. గులాం నబీ ఆజాద్, పార్టీ వదిలి పోతూ పోతూ, అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఏకంగా ఐదు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశం కూడా ఇదే. “రాజకీయ అనుభవం లేని భట్రాజులు పార్టీని నడుపుతున్నారు, అదే పార్టీ సంస్థాగత బలహీనతకు మూలకారణం” అంటూ రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే ఆయన, ఆయన చుట్టూ చేరిన కోటరీని చాలా తీవ్ర పదజాలంతో విమర్శించారు.  అయితే, సీనియర్ నాయకులు పార్టీని వదిలి వెళ్ళినంత మాత్రం  కాంగ్రస్ కథ ముగిసినట్లేనా, అంటే, 130 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీని, చరిత్ర పుటల్లోంచి తీసేయడం అంత సులువైన విషయం కాదు. నడుస్తున్న చరిత్రలో ఒడిదుడుకులు ఉన్నా, పార్టీ చరిత్రకు చుక్క పెట్టేసి, చరిత్ర పుటల్లో కలిపేయడం సరి కాదని అనేవారున్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చిగురించి, చరిత్ర సృష్టిస్తుందనే విశ్వాసం ఇంకా  మిగిలే వుంది.   అదలా ఉంటే, ఓ వంక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతుంటే, మరో వంక పార్టీ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో చ‌త్తీస్‌ఘ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూర్‌లో 85వ ప్లీన‌రీ స‌మావేశాల‌ను మూడు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని, పార్టీ స్టీరింగ్ క‌మిటీ స‌మావేశం నిర్ణ‌యించారు. కాంగ్రెస్ చీఫ్‌గా మల్లికార్జున్ ఖ‌ర్గే బాధ్య‌తలు చేప‌ట్టిన అనంత‌రం పార్టీ అత్యున్న‌త నిర్ణాయ‌క సంఘం వ‌ర్కింగ్ క‌మిటీ స్ధానంలో స్టీరింగ్ క‌మిటీ ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. ఏఐసీసీ ప్లీనరీ సెష‌న్‌, భార‌త్ జోడో యాత్ర‌పై స్టీరింగ్ క‌మిటీలో విస్తృతంగా చ‌ర్చించారు. అలాగే, వచ్చే (2023) జ‌న‌వ‌రి 26 గణతంత్ర దినోత్సవం నుంచి, ‘హాథ్ సే హాథ్ జోడో’ పేరిట భారీ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాల‌ని స్టీరింగ్ క‌మిటీ నిర్ణ‌యించింది. ఈ ప్ర‌చారోద్య‌మంలో భాగంగా గ్రామ పంచాయితీలు, పోలింగ్ బూత్‌ల‌ను క‌వ‌ర్ చేస్తూ బ్లాక్ స్ధాయి యాత్ర‌లు చేప‌డ‌తామ‌ని పార్టీ నాయకులు చెపుతున్నారు. నిజానికి కాంగ్రెస్ జెండా మోసే కార్యకర్తలు ఇప్పటికీ,  ప్రతి గ్రామంలో ఉన్నారు. కానీ, నాయకులలోనే ఉత్సాహం కనిపించడం లేదని పార్టీ అభిమానులు అంటున్నారు.  దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న మాట నిజం. నాయకత్వ సమస్య ఆ పార్టీని వెంటాడుతోంది. రాహుల్ గాంధీ 2019లో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత నిండా మూడేళ్ళు, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీని నడిపిస్తూ వచ్చారు. చివరకు, సోనియా స్థానంలో మల్లిఖార్జున ఖర్గే పార్టీ అధ్యక్షునిగా, ఎన్నికయ్యారు. కానీ,గాంధీల నీడలో ఆయన  ఏ మేరకు నిలబడ గలుగుతారు, ఏ మేరకు పార్టీని ముందుకు నడిపించగలుగుతారు, అనేది చూడవలసి వుంది.    కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలకు ముందు, కేంద్రంలో అధికారంలో వుంది. దేశంలో 9 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో వుంది. ఈరోజు కేంద్రంలో అధికారంలో లేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అలాగే, కేవలం రెండు రాష్టాలు, రాజస్థాన్, చ‌త్తీస్‌ఘ‌ఢ్ రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో వుంది. ప్రస్తుత సంవత్సరం 2022 ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,పంజాబ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ... మొత్తం ఏడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, సంవత్సరం ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక తాజాగా ఎన్నికలు జరిగిన హిమాచల్ ప్రదేశ్, గుజరాత్  రాష్ట్రాలో హస్తవాసి ఎలా వుందో మరో మూడు రోజుల్లో డిసెంబర్ 8 న తెలిపోతుంది. ఈ రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు అంతగా లేవనే సర్వేలు చెప్పాయి. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధ్యమేనా? అంటే .. కాంగ్రెస్ పార్టీ పూర్వ  వైభవం సంగతి ఏమో కానీ, ఓక పార్టీగా కాంగ్రెస్ పార్టీ చిరంజీవిగా ఉంటుందని అంటున్నారు.

కవిత బిజీ.. సీబీఐ విచారణకు అగ్లా తారీఖ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు సీబీఐ నోటీసులు పంపిన క్షణం నుంచీ ఆమె విచారణ వ్యవహారం తెలుగు సినిమాలోని మలుపులను మించి తిరుగుతోంది. ఒక సస్పెన్స్ మూవీని తలపిస్తోంది. రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు అయినా.. సీబీఐ నోటీసులు పంపగానే ఎమ్మెల్సీ కవిత మా ఇంటికే వచ్చి విచారణ జరుపుకోండి అంటూ ఆహ్వానించేసింది. ఆ తరువాత తన తండ్రితో, న్యాయకోవిదులతో ప్రగతి భవన్ లో వరుస భేటీల తరువాత యూటర్న్ తీసుకున్నారు. రిమాండ్ రిపోర్ట్ ను, ఎఫ్ ఐఆర్ కాపీనీ పంపితేనే విచారణకు అంగీకరిస్తానంటూ సీబీఐకి లేఖ రాశారు. ఆ లేఖపై స్పందనను బట్టి విచారణ విషయం ఆలోచిస్తానన్నారు. అయితే సీబీఐ ప్రాంప్ట్ గా కవిత లేఖకు స్పందించి రిమాండ్ రిపోర్ట్ ను, ఎఫ్ఐఆర్ కాపీనీ ఆమెపు అందజేసింది. ఆ విషయాన్ని కవిత స్వయంగా వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ప్రస్తావనకు రావడం వల్లే విచారణకు, కాదు కాదు ఆమె వివరణ తీసుకోవడానికి వస్తున్నామని సీబీఐ  నోటీసులో స్పష్టంగా ఉంది. ఇప్పుడు అదనంగా ఎఫ్ఐఆర్ కాపీలో తన పేరు లేదని కవిత స్వయంగా వెల్లడించారు. అంతే కాదు.. నిన్నగాక మొన్న మంగళవారం (డిసెంబర్ 6)న విచారణకు రెడీ అని ప్రకటించిన కవిత ఇప్పుడు ఆ తేదీన తాను బిజీగా ఉన్నానంటూ వచ్చే వారం.. అంటే డిసెంబర్ 11, 12, 13, 15 తేదీలలో ఎప్పుడైనా తనను విచారించేందుకు రావచ్చని సీబీఐకి వర్తమానం పంపారు. అయితే కవిత ఆఫర్ చేసిన ఈ తేదీలపై సీబీఐ ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.   సీబీఐ నోటీసులు అందుకున్న తరువాత శనివారం(డిసెంబర్3) ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్లి తన తండ్రి , సీఎం కేసీఆర్‌తోనూ, ఆయన సమక్షంలో పలువురు న్యాయనిపుణులతోనూ చర్చించారు.  ఆ చర్చల మేరకే ఎఫ్ఐఆర్  కాపీలు తీసుకోవాలని లేఖ రాశారు. ఆ లేఖ సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే  సీబీఐ విచారణ సందర్భంగా   ఫిర్యాదు కాపీలు, ఎఫ్ఐఆర్ కాపీలు కవితకు అందజేస్తే వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాల్సి ఉంది కనుక సీబీఐ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం ఇవ్విలేనని కవిత నిరాకరించే అవకాశం ఉం ఉందని తెలుగువన్ ముందే చెప్పింది. ఆ మేరకే ఇప్పుడు కవిత మంగళవారం (డిసెంబర్ 6)న తాను విచారణకు అందుబాటులో ఉండబోనని సీబీఐకి వర్తమానం పంపారు. విచారణను సాధ్యమైనంత వరకూ వాయిదా వేయడమే లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇటీవల  కేంద్ర భద్రతా సలహాదారు అత్యంత రహస్యంగా హైదరాబాద్ లో పర్యటించి వెళ్లడం, తెలంగాణలో మోస్ట్ ఇన్ ఫ్లుయెన్స్ డ్ పొలిటికల్ లీడర్లు సీబీఐ, ఈడీ, ఐటీ విచారణను ఎదుక్కొంటుండడానికి ఏమైనా లింకుందా అన్న కోణంలో పరిశీలకుల విశ్లేషణలు సాగుతున్నాయి. కొందరు ప్రముఖులను ఈడీ, సీబీఐ అదుపులోనికి తీసుకునే అవకాశం ఉండటంతోనే అలా జరిగితే పర్యవశానాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఆరా తీయడానికే అజిత్ దోవల్ తెలంగాణలో పర్యటించారని పరిశీలకులు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు వివరణ కోసం అని వచ్చి ఎక్కడ అరెస్టు చేస్తారో అని కవిత భావించడం వల్లనే విచారణకు అగ్లా తారీఖ్ అంటూ వాయిదా కోరుతున్నారని అంటున్నారు. నోటీసులో ఎఫ్ ఐఆర్ ప్రస్తావన లేకపోయినా దానిని కోరడం.. ఆ తరువాత ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదంటూ కవిత మీడియాకు తెలియజేయడం వెనుక సీబీఐ విచారణ వెనుక ఉన్నది రాజకీయ కక్ష సాధింపే అని చెప్పాలని చూస్తున్నారని అంటున్నారు. సీబీఐ కానీ, మరే దర్యాప్తు సంస్థ అయినా కానీ విచారణ చేయడానికి ఎఫ్ ఐఆర్ లో పేరు ఉండాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఆఫర్ చేసిన కొత్త తేదీలపై సీబీఐ ఎలా స్పందిస్తుందన్న ఆసక్కి సర్వత్రా నెలకొని ఉంది.