ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే.. కేసీఆర్ గాలి తీసేసిన మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ గాలి తీసేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ  కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కేవలం ఎన్నికల స్టంటేనని అసలు నిజం చెప్పేసి నాలిక కరుచుకున్నారు. ఔను కేసీఆర్ తాను అసాధ్యం అని గతంలో చెప్పిన సంగతి విస్మరించి  మరీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  గతంలో కేసీఆర్ మీడియా సమావేశంలోనే.. ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలపడమనే ఒక అంసబద్ధమైన, అసంభవమైన, అర్థరహితమైన, ఒక తెలివి తక్కువ నినాదాన్ని పట్టుకుంటరా?  అదో నినాదమానండీ! నాకర్థం కాదు. ఒక పనికిమాలిన, పిచ్చి రాజకీయ పార్టీలు, తలకాయమాసినోడు, నెత్తిమాసినోడు.. గీళ్లా.. నాకర్థం కాదు. అర్థముండాలె కద! ఆర్టీసీ విలీనమనేది వందశాతం అసంభవం. గవర్నమెంట్‌లో కలపడమనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంతకాలం అది జరిగేది కాదు. అని చెప్పారు. కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ గతంలో తాను చెప్పిన మాటలను తానే ఖండించిన చందంగా ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశారు. దీనిపై కేసీఆర్ కేబినెట్ లో కార్మిక మంత్రిగా ఉన్న చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ( ఆగస్టు 2)  విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి ఆర్టీసీ విలీనం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని కుండబద్దలు కొట్టేశారు. బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ అనీ, ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఎన్నికల స్టంట్ లు కామనే కదా అని అన్నారు.   ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలనీ, అవి రెండూ తమ అధినేత వద్ద పుష్కలంగా ఉన్నాయనీ మల్లారెడ్డి తన వ్యాఖ్యలను సమర్ధించుకుని, సరిదిద్దుకోవాలని ప్రయత్నించినా.. ఆర్టీసీ ఎన్నికల స్టంటేనన్న ఆయన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి

జగన్ సర్కార్ కు మరో పరాభవం.. ఆర్5 జోన్ లో ఆగిన ఇళ్ల నిర్మాణం

కింద పడినా పై చేయి నాదే  అంటూ జగన్ సర్కార్ ఎంతగా మొండికేసినా ముందడుగు వేసే అవకాశాలు లేకుండా కోర్టు తీర్పులు గట్టి బంధనాలనే వేశాయి. ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణం విషయంలో తీర్పులకు వక్రభాష్యం చెప్పి మరీ తొడగొట్టి ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామంటూ ఘనంగా ప్రకటించుకుని.. సాక్షాత్తూ సీఎం జగనే శంకుస్థాపన చేసినా.. అక్కడ ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. హైకోర్టు ఆర్5  జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది.   అక్కడ ఇళ్ల నిర్మాణాన్నితక్షణమే నిలిపివేయాలన్న విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది. గత  తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించిన భూమిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చట్ట విరుద్ధమన్న అంశంపై  కేసులు ఉన్నాయి. అన్నిటికీ మించి రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వనే లేదు. అంటే అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. హైకోర్టు తీర్పులో ఈ విషయం విస్పష్టంగా ఉన్నా జగన్ సర్కార్ సీఆర్డీయే చట్టంలో మార్పులు చేసి మరీ  ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసింది. పేదల పేరుతో ఎక్కడెక్కడో ఉన్న ఓటు బ్యాంక్‌కు సెంటు స్థలాలు పంపిణీ చేసి శంకుస్థాపన కూడా చేసేసింది. అయితే జగన్ సర్కార్ చెబుతున్నట్లుగా  కాకుండా సుప్రీంకోర్టు  ఇంటి స్థలాలు పంపిణీ చేయవచ్చు కానీ లబ్ధిదారులకు చట్టబద్దమైన అధికారం దఖలు పడదని.. తుది తీర్పుకు లోబడే ఆ హక్కు దఖలు పడేదీ లేనిదీ ఆధారపడి ఉంటుందని స్పష్టంగా పేర్కొంది.  ఆ మేరకు ఇళ్ల పట్టాలపై స్పష్టంగా పేర్కొన్న మిదటే వాటిని పింపిణీ చేయాలని ఆదేశించింది. అయితే జగన్ సర్కార్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన పట్టాలపై కేవలం స్టిక్కర్లు అంటించింది.  ఆర్ 5 జోన్‌లో ఉన్న భూమిపై ధర్డ్ పార్టీకి భూమిహక్కులు బదలీ అవ్వవు. కోర్టు తీర్పు ఇంత స్పష్టంగా ఉన్నా జగన్ సర్కార్ మాత్రం పేదలకు  భూమి పంపిణీ అంటూ కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే..  పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసేసింది. జగన్ సర్కార్ అధికారంలో ఉన్న నాలుగేళ్ల పైచిలుకు సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడా   ఇళ్లు కట్టించిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకే రంగులు వేసి హడావుడి చేయడానికి ప్రయత్నించి బొక్కబోర్లా  పడింది. అయితే అమరావతి విషయంలో మాత్రం ఇళ్ల నిర్మాణానికి  ఎక్కడ లేని హడావుడీ ప్రదర్శిస్తోంది. అయితే అమరావతిలో జగన్ సర్కార్ ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి  నిధులిచ్చేది  లేదని కేంద్రం తేల్చేసినా  జగన్ సర్కార్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరాయించి  ఇళ్లు కట్టిస్తామని చెప్పింది. ఇప్పుడు సీఎం జగన్ ఆర్భాటంగా కోర్టు తీర్పులను ఉల్లంఘించి మరీ శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. వచ్చే డిసెంబర్ లో రాజధాని కేసులపై విచారణ జరుగుతుంది. అప్పటి వరకూ నిర్మాణాల ప్రారంభానికి వీలులేదు.   పేదలకు ఇళ్లిద్దామంటే అడ్డుకున్నారని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది కానీ ఆర్5 జోన్ లో పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు కూడా తమకు అక్కడ ఇళ్ల నిర్మాణం ఎందుకు   తామున్న చోట ఇవ్వొచ్చు కదా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇలా ఉండగా ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలపై హై కోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే విధించడంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

తమ్మినేనికి గాంధీ గుబులు

ఓ వైపు ఎన్నికలు దూసుకొస్తున్నాయి. అలాంటి వేళ  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి సొంత నియోజకవర్గం అముదాలవలసలో కొత్త నొప్పులు మొదలైనాయి. సొంత పార్టీలోనే అసమ్మతి కాక.. ఆయనను కుదురుగా కూర్చోనివ్వడం లేదు. అముదాలవలస నియోజకవర్గంలో మొత్తం మూడు పార్టీ కార్యాలయాలు ఉండగా... వాటిలో ఎవరికీ వారే కోటరీలు ఏర్పాటు చేసుకొంటూ.. ప్రస్తుత ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం సీటుకు ఎసరు పెడుతున్నారు.    జులై 31వ తేదీ ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సువ్వారి గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భారీగా ఫ్యాన్ పార్టీ శ్రేణులు తరలి వచ్చాయి. అయితే ఈ వేడుకలతో సువ్వారి గాంధీకి భారీగా మైలేజ్ పెరిగిందని అంటున్నారు. తమ్మినేని వర్గం కూడా అలాగే  భావిస్తోంది. అయితే  ఈ విషయాన్ని ముందే పసిగట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం వర్గం.. గాంధీ బర్త్ డే వేడుకలకు వైసీపీ శ్రేణులు హాజరుకాకుండా చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటి ఫలించ లేదు. దీంతో సువ్వారి గాంధీ జన్మదిన వేడుకలు కాస్తా.. ఆయన గారి బలప్రదర్శనకు వేదిక అన్నట్లుగా మారిపోయాయి. ఫ్యాన్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆమదాలవలస ఎమ్మెల్యే టికెట్‌ను సువ్వారి గాంధీ ఆశిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం... ఈ ఏడాది జరుపుకొంటున్న జన్మదిన వేడుకల ద్వారా తన సత్తాతోపాటు తన మాస్ ఫాలోయింగ్‌ని సైతం వైసీపీ అధినాయకత్వానికి చూపించాలని భావించారు. ఆ ఉద్దేశంతో.. భారీగా ఏర్పాటు చేసిన బర్త్ డే సెలబ్రేషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు స్పీకర్ తమ్మినేనికి ఆమదాలవలస పట్టణంపై పూర్తి పట్టున్నా కూడా.. సువ్వారి గాంధీ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరగడంతో.. ఫ్యాన్ పార్టీ అధిష్టానానికి కొత్త సంకేతాలు పంపినట్లు అయింది.  ఇంకోవైపు ఈ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సువ్వారి గాంధీ తన ప్రసంగం ద్వారా.. ప్రజలను మరింతగా ఆకర్షించారు. అంతేకాదు రానున్న ఎన్నికల్లో.. తాను ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టు సువ్వారి గాంధీ విస్పష్టంగా చెప్పారు. ఈసారి కనుక తనకు టికెట్ ఇస్తే.. ఆమదాలవలసలో తన విజయం ఖాయమని.. అందుకు తన వెనుక ఉన్న క్యాడరే బలమైన సాక్ష్యమని ఈ సందర్భంగా ఆయన   చెప్పారు.  ఇక ప్రజా సమస్యల ప్రస్తావనలో వైలంట్‌గా ఉండే సువ్వారి గాంధీ.. నియోజకవర్గంలో పరిస్థితుల రీత్యా పొలిటికల్ స్పీచ్‌లలో కాస్త సైలెంట్‌గా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి తన జన్మదిన వేడుకల సందర్భంగా సూటిగా సుత్తిలేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం... తనకు టికెట్ కేటాయించాలంటూ తన వాణిని బలంగా వినిపించడంతో  తమ్మినేని వర్గంలో గుబులు మొదలైంది.  ఇప్పటికే నియోజకవర్గంలోని సమస్యలను తీర్చడంలో స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాం ఘెరంగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వేళ సువ్వారీ గాంధీ రూపంలో మరో సమస్య.. అదీ సొంత పార్టీ నుంచే స్పీకర్‌ తమ్మినేనికి ఎదురైందనే ఓ చర్చ సైతం స్థానికంగా ఊపందుకొవడం గమనార్హం.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఎలక్షన్ గిమ్మిక్కేనా?

ఒక్కసారి గానీ అధికారానికి దూరమయ్యామా?.. మళ్లీ ఆ అధికారాన్ని అందుకోవడం కోసం చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావని.. అలా ఫీట్లు చేసే క్రమంలో తాతలే కాదు.. ముత్తాతలు సైతం దిగిరావాల్సి ఉంటుందని గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చాలా గట్టిగానే అర్థమైనట్లుందన్న చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఆ క్రమంలో అధికారాన్ని మరోసారి పదిలం చేసుకోవడానికి ఎన్ని ఫీట్లు అయినా చేయాలని కేసీఆర్ కు అర్దమైనట్లు కనిపిస్తోంది.   రాజకీయం అంటే రంగులు మార్చడం ఒక్కటే కాదని... మాటలు సైతం మార్చాల్సిందేననీ కేసీఆర్ కేసీఆర్ భావిస్తున్నారనీ, అలాగే వ్యవహరిస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా కొద్ది సమయమే ఉన్నా.. ఇటీవల జరిగిన కేబినెట్‌ భేటీలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే సీఎం చేసిన ఈ ప్రకటనను తెలంగాణ ఆర్టీసీలోని కార్మికులే తొలుత నమ్మలేదని.. ఆ తర్వాత ఎప్పటికో కానీ వారికి కేసీఆర్ ప్రకటనపై నమ్మకం కుదర్లేదని ఆర్టీసీ కార్మికులే అంటున్నారు. సరిగ్గా నాలుగేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు.. తమను కూడా ప్రభుత్వంలో వీలినం చేయాలంటూ టీఎస్ఆర్టీసీ కార్మికులు దాదాపు 50 రోజులకు పైగా ఆందోళన బాట పట్టారు. ఆ  ఆందోళన సమయంలో కొందరు  కార్మికులు  మరణించారు. అయినా కేసీఆర్ స్పందించలేదు సరికదా.. ప్రగతి భవన్‌ సాక్షిగా ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్లో..  ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలపడమనే ఒక అంసబద్ధమైన, అసంభవమైన, అర్థరహితమైన, ఒక తెలివి తక్కువ నినాదాన్ని పట్టుకుంటరా?  అదో నినాదమానండీ! నాకర్థం కాదు. ఒక పనికిమాలిన, పిచ్చి రాజకీయ పార్టీలు, తలకాయమాసినోడు, నెత్తిమాసినోడు.. గీళ్లా.. నాకర్థం కాదు. అర్థముండాలె కద! ఆర్టీసీ విలీనమనేది వందశాతం అసంభవం. గవర్నమెంట్‌లో కలపడమనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంతకాలం అది జరిగేది కాదు. ఏపీలో ఆర్టీసీ గవర్నమెంట్‌లో కలవడంపై చూద్దాం. అక్కడ ఏం జరిగిందో. వాళ్లు ఒక ఎక్స్‌పరిమెంట్‌ చేసిండ్రు. అక్కడ ఏం మన్ను కూడ జరగలేదు. మీకు అంటే జర్నలిస్టులకు తెల్వదు. అక్కడ కమిటీ వేసి.. మూడు నెలలకో, ఆరు నెలలకో ఏదో చెప్తరంట కథ.  అది ఏం చెప్తరనేది చూడాలె. ఆర్టీసీ మునగక తప్పదు. ఎవ్వరూ కాపాడలేరు. ఆర్టీసీ సమ్మె మాత్రమే కాదు.. ఆర్టీసీయే ముగుస్తుంది’’ అని కేసీఆర్‌ అన్నారు. దీంతో ఆర్టీసీ విలీనం అన్న ప్రతిపాదననే సీఎం కేసీఆర్ ఓ రకంగా  ఎగతాళి చేసి పారేశారు.  అయితే తమను విలీనం చేయమని.. టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మళ్లీ కేసీఆర్ వద్ద మొరపెట్టుకోలేదు. వాళ్లు సైలెంట్‌గానే ఉన్నా.. కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికులు ఎదురు చూడని ఆఫర్ ఇచ్చేశారు. దీనిపై పలు రకాల ఊహగానాలు జోరందుకొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారని.. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి, విధి విధానాలను.. బస్సులోని ప్రయాణికుల వద్దే ఆర్టీసి సిబ్బందిఏకరువు పెడుతున్నారని.. అలా కేసీఆర్ ప్రభుత్వంపై మౌత్ టు మౌత్ కాన్వాసింగ్  జోరుగా జరుగుతోందనీ,  ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో సైతం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యక్తమౌతోందనీ అర్ధం చేసుకున్న కేసీఆర్... ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలలో  గులాబీ పార్టీకి  ఓట్ల రూపంలో భారీ నష్టం వాటిల్లుతుందని భావనతోనే   ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అలాగే టీఎస్ ఆర్టీసీకి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లక్షల కోట్ల రూపాయిల విలువ చేసే స్థలాలు ఉన్నాయని.. వాటిని సైతం ప్రభుత్వ పరం చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రతిపాదన నిర్ణయం తీసుకొన్నారనే ఓ ప్రచారం సైతం నడుస్తోంది.  మరోవైపు ఇప్పటికే జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, వీఆర్ఏలు.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారంటూ ఇంటిలిజెన్స్ రిపోర్టులు ద్వారా ఈ ప్రభుత్వానికి నివేదిక అందిడం.. దీంతో వారిని సైతం వివిధ శాఖల్లో సర్థుబాటు చేశారన్న వాదన సైతం పోలిటికల్ సర్కిల్ వైరల్ అవుతోంది.    ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారాన్ని అందుకోన్న కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవడం కోసం.. చేస్తున్న జిమ్మిక్కుల్లో ఇదోకటనే ఓ అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది. అదీకాక ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అలాంటి వేళ.. ఇటువంటి నిర్ణయాలు మరిన్నిటిని కేసీఆర్ తీసుకొనే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

చిలుకా దొరకవే!

సాధారణంగా తమ వాళ్లు తప్పి పోయినప్పుడు వారిని వెతికే క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. కూడళ్లలో, బస్టాండ్ లలో, రైల్వే స్టేషన్లలో వారి ఫొటోలతో కనిపించడం లేదు అంటూ పోస్టర్లు అంటించడం కద్దు. అలాగే తప్పిపోయిన తమ వారి ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామంటూ నజరానా కూడా ఆ పోస్టర్లో ప్రకటిస్తారు. ఇక ఇటీవలి కాలంలో తమ పెంపుడు జంతువులు తప్పిపోయిన సందర్భంలో కూడా పలువురు వాటి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోస్టర్లు కూడా వేస్తున్నారు. అలా తప్పి పోయిన పెంపుడు జంతువుల కోసం ఆరాటపడే వారిలో అత్యధికులు కుక్క, పిల్లి వంటి వాటి కోసం వెతుకులాట చేయడం చూశాం. ఇటీవల ఓ  ఉన్నతాధికారి తన పెంపుడు కుక్కను గాలించేందుకు ఏకంగా వందల సంఖ్యలో పోలీసులను వినియోగించి వివాదాస్పదమైన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా సామాజిక మాధ్యమంలో తన పెంపుడు చిలుక ఆచూకీ తెలిపిన వారికి పది వేల రూపాయలు బహుమతి అంటూ వెలిసిన పోస్టర్లు నెట్టింట వైరల్ అయ్యాయి.  మధ్యప్రదేశ్‌  దమోహ్‌ జిల్లాకు చెందిన దీపక్‌ సోనీ  పెంపుడు చిలుక ఎటో ఎగిరిపోయింది. ఆ చిలుక ఫొటోలతో పోస్టర్లు వేసి ఆచూకీ చెప్పినవారికి రూ.10 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఊరంతా పోస్టర్లు వేసి, ఆటోకు మైకులు పెట్టి మరీ తన పెంపుడు చిలక ఆచూకీ కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.  నిజానికి దీపక్ సోనీ చిలుక ఇలా పారిపోవడం ఇదేమీ తొలిసారి కాదు.  గత నెలలో ఒకసారి ఇలాగే ఎగిరిపోయి మళ్లీ దానంతటదే ఇంటికి తిరిగొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎగిరిపోయింది. రోజులు గడుస్తున్నా అది తిరిగి రాకపోవడంతో దీపక్ సోనీ కుటుంబ సభ్యులు ఆందోళన   పడుతున్నారు. ఆ చిలుక సరిగా ఎగరలేకపోతోందనీ, దానికి ఏదైనా హాని జరిగిందా అన్న ఆందోళన కలుగుతోందని  దీపక్‌ సోనీ అంటున్నారు. 

పొత్తు తేలకుండానే అభ్యర్థి ప్రకటన.. పవన్ సంకేతమేంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పొత్తల విషయంలో రోజుకో మలుపు తిరుగుతోంది. పూటకో రకమైన గందరగోళం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇంత కాలం చెబుతూ వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ ఏకపక్షంగా తమ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని ప్రకటించేశారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అది కూడా కీలకమైన తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా పార్టీ రాజకీయవ్యవహారాల ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్ పోటీలో నిలుస్తారని పవన్ ప్రకటించారని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. దీంతో జనసేన, తెలుగుదేశం వర్గాలలోనే కాకుండా జనబాహుల్యంలో కూడా మరి పొత్తు సంగతేంటన్న చర్చ  ప్రారంభమైంది. వాస్తవానికి జనసేనాని ఏ నియోజకవర్గం నుంచైనా ఏక పక్షంగా అభ్యర్థిని ప్రకటించాలంటే ముందుగా తాను పోటీ చేయదలచుకున్న నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ ప్రకటన చేయాలి అంతే తప్ప తెలుగుదేశంకు బలమైన స్థానంగా అంతా భావిస్తున్న తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పేరు ప్రకటించడమేమిటన్న చర్చ జరుగుతోంది. అంతే కాకుండా పొత్తుల విషయంలో ఒక నిర్ణయానికి రావాలన్న ఒత్తిడిని తెలుగుదేశంపై పెంచే వ్యూహమా? లేక నాదేండ్లను తన నియోజకవర్గానికే పరిమితం చేయాలన్న ఉద్దేశమా అన్న చర్చ కూడా మొదలైంది. మొత్తానికి నాదెండ్ల అభ్యర్థిత్వ ప్రకటన అన్న వార్త అసలే వేడిగా ఉన్న ఏపీ రాజకీయాలలో కాక పెంచిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ నిజంగానే తెనాలి నుంచి నాదెండ్ల అభ్యర్థిత్వాన్ని ప్రకటించేసి ఉంటే.. అది దేనికి సంకేతం.. పొత్తులు ఉంటాయా? ఉండవా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెనాలి నుంచి తెలుగుదేశం తరఫున ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత యాస్పిరెంట్ గా ఉన్నారు. ఆయనను కాదని పొత్తులో భాగంగా తెనాలిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేనకు వదిలేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. జనసేన తెలుగుదేశం పొత్తు ఖాయమన్న భావనతో ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు కలిసి పని చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ఎండగట్టే కార్యక్రమాలలో కలిసి అడుగులేస్తున్నాయి. అటువంటి తరుణంలో పొత్తల విషయం తేలకుండా ఇరువురి నేతల మధ్యా చర్చ జరగకుండా పవన్ కల్యాణ్ తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన తరఫున బరిలో ఉంటారంటూ ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.   లోకేష్ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీల డ్రామాలాగా ఇది కూడా వైసీపీ మైండ్ గేమేనా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.   జగన్  ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎంత మాత్రం చీలనీయబోనని పదే పదే ప్రకటిస్తున్న జగన్ తనతో పాటుగా బీజేపీని కూడా కూడగట్టాలని యోచిస్తున్నారు.  ఇప్పటికే  బీజేపీతో  పొత్తు లో ఉన్న జనసేన, తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఇప్పటికే మిత్రుడిగా ఉన్న బీజేపీని కూడా కలిసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు. బీజేపీ కలుస్తుందా? అందుకు తెలుగుదేశం అంగీకరిస్తుందా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ తరుణంలో  పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గం నుండి నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇవ్వడం దేనికి సంకేతం. తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ కూటమి నుండి అభ్యర్దిగా రంగంలో ఉంటారన్న సంకేతమిచ్చారా అని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే నిజమైతే మరి  తెనాలిలో తెలుగు దేశం పార్టీ నుండి ఇప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజా వరుసగా పోటీ చేస్తున్నారు. తెనాలి నుండి జనసేన తరపున నాదెండ్ల పోటీ చేస్తే కూటమి లో ఉన్న తెలుగు దేశం పార్టి అభ్యర్దిగా ఆలపాటి రాజా పరిస్దితి ఎంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.   ఏది ఏమైనా తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల అన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 

ఎమ్మెల్యేల ఆస్తుల విలువ నాగాలాండ్ మిజోరం బడ్జెట్ కంటే ఎక్కువ!

దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలు ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ లెక్కలను ప్రకటించింది. ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించిన ఈ తాజా నివేదిక ప్రకారం దేశంలోని 4001 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ. 54, 545. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వరుసగా 3, 8 స్థానాలలో ఉన్నాయి. ఇందులో  ఇందులో తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ. 1601 కోట్లు అని ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ రిపోర్ట్ తేల్చింది.   వీరిలో 103 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులను రూ. 1,443 కోట్లుగా పేర్కొంది.  అలాగే   ఏపీలోని 146 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 3,379 కోట్లు అని నివేదిక పేర్కొంది.   ఇక దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఆస్తుల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కర్నాటక టాప్‌లో నిలిచింది. కర్నాటకలోని 223 మంది ఎమ్మెల్యేల ఆస్తులు 14,359 కోట్లు. ఇక, ఈ నివేదికలో రూ.6679 కోట్లతో రెండవ స్థానంలో మహారాష్ట్ర ఎమ్మెల్యేలు నిలిచారు. దేశంలోని మొత్తం 1356 మంది బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 16,234 కోట్లుగా కాగా.. దేశంలోని మొత్తం 719 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు 15, 798 కోట్లుగా ఏడీఆర్ నివేదిక తేల్చింది. బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.11.97 కోట్లు కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ. 21.97 కోట్లు,  వైసీపీ ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ. 23.14 కోట్లుగా పేర్కొంది.అంతేకాదు, ఎమ్మెల్యేల ఆస్తుల విలువ నాగాలాండ్, మిజోరం, సిక్కిం బడ్జెట్‌కు మించి ఉందని ఏడీఆర్-ఎన్ఈడబ్ల్యూ పేర్కొంది.  అందరికంటే తక్కువగా త్రిపురలో 59 మంది ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 90 కోట్లుగా తేలింది.  

జగన్ రివర్స్ పాలన.. రివర్స్ టెండరింగ్.. రివర్స్ ఇన్వెస్ట్ మెంట్స్!

గత మార్చి నెల 3, 4 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘స్వప్న’ రాజధాని విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్’ నిర్వహించింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఆవిషయం గుర్తుందో లేదో కానీ, ఆ సందర్భంగా ఆయన అదే వేదిక నుంచి రెండు కీలక  ప్రకటనలు చేశారు.  ఈ సదస్సు ద్వారా, రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చి పడుతుందని చేయెత్తి మరీ చెప్పు కొచ్చారు. అలాగే, వట్టి పెట్టుబడులే కాదు, పెట్టుబడులతో పాటుగా..లక్షల్లో ఉద్యోగాలు వచ్చిపడుతున్నాయని ప్రకటించారు. ఒకటి రెండు కాదు, ఏకంగా 20 రంగాలకు సంబంధించి, 340 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, తద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు, ఓ ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి, తమ ట్రేడ్ మార్క్ చిరునవ్వు చెరగకుండా, సగర్వంగా చెప్పారు.  అదే  వేదిక నుంచి ముఖ్యమంత్రి విశాఖ వాసులకు మరో ‘తీపి’ కబురు కూడా వినిపించారు విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని వెల్లడించారు. అలాగే  తాను త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తానంటూ ముఖ్యమంత్రి సదస్సు వేదికగా పారిశ్రామిక దిగ్గజాలు - ఆహుతుల సమక్షంలో ప్రకటించారు. సరే రాజధాని విషయం కాసేపు పక్కన పెడడాం..  పెట్టుబడుల మాటేమిటి? అవైనా వచ్చాయా, అంటే, ఆ ఒక్కటీ అడగొద్దనేదే సర్కార్ స్వాముల సమాధానం. నిజమే విశాఖలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్  వంటి సదస్సుల్లో కుదుర్చుకున్న ఎంఓయూలు అన్నీ, గ్రౌండ్ కావు. కొన్ని ఒప్పందాలు కాగితాలకే  పరిమితం అవుతాయి. అందులో కొన్ని ఉత్తుతి ఒప్పందలుంటాయి. కొన్నిటి విషయంలో ఎక్కడో చిక్కుముడి పడి ఆగి పోతాయి. ఇంకొన్ని కొంచెం ఆలస్యంగా మొదలవుతాయి ... కానీ, ఎన్నో కొన్నయితే ఖాయంగా ఇప్పటికే గ్రౌండ్ కావాల్సింది. కానీ, ‘వైరైటీ’ గా జగన్ రెడ్డి ప్రభుత్వం కుదుర్చుకున్న, పోనీ కుదుర్చుకున్నామని స్వయంగా  ముఖ్యమంత్రి ప్రకటించిన  రూ.13 లక్షల కోట్లలో నుంచి కోట్ల తీసేసి లక్షల్లో చూసినా ఆ రూ.13 లక్షల పెట్టుబడులు అయినా వచ్చాయా ..అంటే లేదనే సమాధానమే వస్తోంది. నిజానికి, విశాఖ సమ్మిట్ తర్వత కాదు, జగన్ రెడ్డి నాలుగేళ్ళ పై చిలుకు పాలనలో రాష్టానికి కొత్తగా వచ్చిన పెట్టుబడులు ఏంటో తెలిస్తే, సిగ్గుతో తలదించుకోక తప్పుదు. అవును జగన్ రెడ్డి పాలనలో పెట్టుబడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ అధోగతికి చేరింది. అట్టడుగు స్థాయికి చేరుకుంది. ఇదేదో ఎవరో జగన్ రెడ్డి అంటే గిట్టని వ్యతిరేకులు చేస్తున్న ఆరోపణ కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే, 2019 నుంచి 2022 వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 5751 కోట్లు .. అంటే, దేశం మొత్తం పెట్టుబడులలో 0.4 శాతం. ఇంత తక్కువగా పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం దేశంలో  ఏపీ తప్ప మరోటి లేదనడంలో సందేహం లేదు.  కొత్తగా పెట్టుబడులు రాకపోవడం ఒకటైతే గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ( కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం అయిదేళ్ళలో రూ. 6 లక్షల కోట్లకు పైబడిన పెట్టుబడులు వచ్చాయి) అంతకు ముందు  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు అనేక మంది జగన్ రెడ్డి అరాచక పాలన భరించలేక రాష్ట్రం వదిలి పోయారు.    రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర  చంద్రబాబు నాయుడు హయాంలో  ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురానికి వచ్చింది, చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి. విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే జగన్ రెడ్డి పాలనలో  సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.దీంతో లూలు గ్రూప్, రూ.2200 కోటల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో పాటు  ఇప్పుడున్న పరిస్థితిలో ( అనగా జగన్ రెడ్డి అధికారంలో ఉండగా ..)  ఇక మీదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని తేల్చి చెప్పేసింది. అంత వరకు ఎందుకు, చిత్తూరు జిల్లాకు చెందిన  గల్లా వారి,  అమర రాజా కంపెనీ, జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక రూ,9500 కోట్ల పెట్టుబడులను, తెలంగాణకు తరలించుకు పోయింది.. ఇలా చెప్పాలంటే చాల చాలా ఉన్నాయి. ఒక్క మాటలో ముగించాలంటే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు ..ఆ సాహాసం చేసే పెట్టుబడి దారులు లేరు.  ఉన్న  పెట్టుబడులు నిలిచే పరిస్థితీ లేదు. పెట్టుబడులు రానిదే రాష్ట్రం ముందుకు సాగదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవు ... అప్పులు మాత్రమే మిగులుతాయి. మరి రాష్ట్ర భవిష్యత్ ..? ఈ ప్రశ్నకు జవాబు ప్రజలే చెప్పవలసి ఉంటుంది . ఓటు వారి చేతిలో నే వుంది. సరే మళ్లీ గ్లోబల్ సమ్మిట్ దగ్గరకు వస్తే.. ఆ సమ్మిట్ లో పెట్టుబడులు పెడతామంటూ కోట్లూ, బూట్లూ వేసుకు వచ్చిన వారంతా నిజంగా పారిశ్రామిక వేత్తలేనా అన్న అనుమానాలు అప్పట్లోనే వచ్చాయి. భోజనాల దగ్గర వారు చేసిన గలాటా.. వారిలో కొందరిని ఐప్యాక్ సభ్యులుగా గుర్తించి అందుకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో గ్లోబల్ సమ్మిట్ ఓ ప్రహసనం అని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తయి. అయితే సాక్షాత్తూ ముఖ్యమంత్రే గొప్పగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రకటించేసరికి కొందరు కాకపోతే కొందరైనా అందులో ఎంతో కొంత గ్రౌండ్ కాకపోతుందా అని ఆశించారు. అయితే  వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి కూడా వాస్తవాలు మాట్లాడడని తేలిపోయింది. మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్ జరిగిన నాలుగు నెలల తరువాత అటువంటి సమ్మిట్ ఒకటి తన హయాంలో జరిగిందన్న సంగతిని జగన్ తో సహా ఆయన కేబినెట్ పూర్తిగా మరచిపోయింది. 

నయా సైబర్ నేరం.. యువతికి రూ.20లక్షలు టోకరా

సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్ గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నా జనంలో మాత్రం అవగాహన పెరగడం లేదు. పైగా ఈ తరహా మోసాలలో బాధితులుగా ఉంటున్న వారిలో అత్యధికులు ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. అందులోనూ ఐటీ కొలువులలో ఉండే వారే  ఎక్కువగా సైబర్ మోసాలకు గురి అవుతున్నారు.  తాజాగా యువతి సాప్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న ఒక యువతి ఈ తరహా మోసానికి గురై రమారమి 20 లక్షలు పోగొట్టుకుంది. హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఆ యువతికి జులై 26న   ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. స్మిత పేరుతో పరిచయం చేసుకున్న  ఓ మహిళ ఆ ఫోన్ లో మీ పేరిట మలేసియాకు పంపిన పార్సిల్‌ ముంబయికి తిరిగొచ్చిందనీ, ఆ పార్శిల్ లో  డ్రగ్స్‌ ఉన్నాయని చెప్పింది.  దాంతో షాక్ తిన్న బాధితురాలు ఆ పార్సిల్‌తో తనకు సంబంధం లేదని చెప్పింది. అయితే ముంబై కస్టమ్స్‌ అధికారులతో మాట్లాడాలంటూ మరో వ్యక్తిని గూగుల్‌ మీట్‌ ద్వారా లైన్లోకి  తీసుకు వచ్చింది. ముంబై కస్టమ్స్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ భయపెట్టిన ఆ వ్యక్తి ఆమె ఆధార్‌ కార్డు వివరాలు తీసుకున్నాడు. ఆధార్‌ ఐడీ తనిఖీ చేశామనీ,  హవాలా లావాదేవీల కేసు ఉన్నట్లు తెలిసిందని, బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తామంటూ బాధితురాలి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత సీబీఐ అధికారి పేరిట మరో వ్యక్తి వీడియోకాల్‌లో  లైన్లోకి వచ్చాడు. బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని.. మొత్తం మీ కుటుంబం సమస్యల్లో చిక్కుకుంటుందని ఆ యువతిని భయపెట్టాడు. ఈ కేసులో మూడేళ్లు జైలుశిక్ష పడుతుందని.. జైలుకు వెళ్లకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు వినాలన్నాడు. అప్పటికే తీవ్రంగా భయాందోళనలకు గురైన బాధితురాలు అతను చెప్పిన విధంగా  ఓ బ్యాంకు యాప్‌ ద్వారా అప్పటి కప్పుడు రూ.19.94 లక్షల లోన్‌కు అప్లై చేసింది. ఆ సొమ్ము రాగానే  తాను చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలనీ,  10 నిమిషాల తర్వాత హైదరాబాద్‌ సీబీఐ అధికారులు మీ ఇంటికొచ్చి డ్రగ్స్‌ పార్సిల్‌ పంపలేదని ఒప్పందం చేసుకుంటారని ఆ యువతిని నమ్మించారు. ఆ యువతి వారు చెప్పినట్లుగానే  రూ.19.94 లక్షలు  బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దాదాపు మూడు గంటలు ఫోన్లో మాట్లాడిన నిందితులు.. డబ్బు వాళ్ల అకౌంట్‌లో పడగానే  కాల్‌ కట్‌ చేశారు. ఎంత సేపు ఎదురుచూసినా.. సీబీఐ బృందం తన ఇంటికి రాకపోవటంతో యువతికి తాను మోసపోయానని అర్ధమైంది.  వెంటనే సైబరాబాద్‌ పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చదువుకున్నవారు ఇలాంటి మోసాల బారినపడటం ఆందోళన కలిగిస్తోందని పోలీసులు అంటున్నారు. ఇలాంటి కాల్స్, మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.  

కేసీఆర్ రీతి, నీతి.. నిన్నటికి నేడు కొత్త.. నేటికి రేపు కొత్త

కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. నిన్న రైట్ అన్నది రేపు రాంగ్ అవుతుంది.. ఇవ్వాల రాంగ్ అన్నది రేపు రైట్ అవుతుంది అని. అయితే తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం  ఎప్పుడు ఏది రైట్ అంటారో.. ఎప్పుడు ఏది రాంగ్  అంటారో ఆయనకైనా తెలుసా అన్న అనుమానం కలగక మానదు. ఒకే విషయంపై వేర్వేరు సందర్భాలలో ఆయన వేర్వేరు భాష్యాలు చెబుతారు. జనానికి ఏదీ గుర్తు ఉండదన్న విశ్వాసమో.. లేక ఆయనకే ఏం మాట్లాడానన్నది గుర్తుండదా అన్నది తెరాస శ్రేణులకే అర్ధం కాని విషయం. తెలంగాణ ఆవిర్భావానికి ముందు దళిత ముఖ్యమంత్రి అన్న ఆయనే.. తీరా తెలంగాణ ఆవిర్భవించి.. తెరాస (ఇప్పుడు బీఆర్ఎస్) విజయం సాధించిన తరువాత మాట మార్చారు. కొత్త రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే సమర్ధుడి నాయకత్వం అవసరమంటూ తానే సీఎం పగ్గాలు అందుకున్నారు. అలా అందుకున్న తరువాత గత తొమ్మిదేళ్లుగా ఆయనే అధికార పగ్గాలను చేతబట్టారు. దళిత ముఖ్యమంత్రి అని తన నోటి వెంటే వచ్చిన మాటను పూర్తిగా మరిచిపోయారు. తన తరువాత రాష్ట్ర పగ్గాలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి అప్పగించడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు. ఇక ఆ తరువాత ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి అన్నది కూడా అలాగే  అయ్యింది. మచ్చుకు ఇవి రెండు మాత్రమే ప్రస్తావించినా.. ఆయన ఔనన్నది కాదని.. కాదన్నది ఔనన్న సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం. ఇది నిజంగా ఉభయ తెలుగు రాష్ట్రాలనూ ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.   ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ నిన్న మొన్నటిది కాదు.. ఎప్పటి నుంచో ఉంది.  అయితే ఏపీలో జగన్ సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత తెలంగాణలో కూడా అలాగే చేయాలన్న డిమాండ్ బలంగా తెరపైకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ దానిని కొట్టి పారేశారు. ఆంధ్రలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ జగన్ చేసిన ప్రయోగం విఫలమౌతుందని అప్పట్లో జోస్యం చెప్పారు. బుర్రా బుద్ధీ ఉన్నవారెవరూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయరనీ, అది జరిగే పని కాదనీ తేల్చేశారు. ఆ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పేరు ప్రస్తావించి మరీ అది సరైనది కాదని చెప్పారు. తెలివితక్కువ నిర్ణయం అని తేల్చేశారు. అయితే ఇప్పుడు ఎవరూ అడగకుండానే స్వయంగా కేసీఆర్ ఆ తెలివి తక్కువ నిర్ణయం తీసుకుని, తాను తీసుకున్న నిర్ణయం చాలా చాలా గొప్పదంటూ తన భుజాలను తానే చరుచుకుంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమన్నది భూగోళం ఉన్నంత వరకూ జరిగేది కాదన్న నోటితోనే ఆయన విలీన ప్రకటన చేశారు. విధివిధానాల ఖరారుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కేబినెట్ లో ఆర్టీసీ విలీనం నిర్ణయం తరువాత నాడు ఏపీలో ఆర్టీసీ విలీనం తరువాత కేసీఆర్ మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలివితక్కువ నిర్ణయాలను అడాప్ట్ చేసుకోవడంలో కేసీఆర్ అంతటివాడు లేడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   ఏది ఏమైనా ఈ సారి ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఎదురీత తప్పదన్న విశ్లేషణల నేపథ్యంలో కేసీఆర్ వీఆర్ఏలకు, ఆర్టీసీ కార్మికులకు వరాలు కురిపించడం చాణక్యమేనని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తొలి ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ అని వాగ్దానం చేసిన ఆయన ఇన్నేళ్లుగా మొండి చేయి చూపుతూనే వస్తున్నారు.  మాట ఇవ్వడం.. మాట తప్పడం, హామీలను గాలికి వదిలేయడం కేసీఆర్ కు కొత్తేమీ కాదని అంటున్నారు. ఎన్నికలు ముంచుకువస్తున్నాయి కనుక విలీనం అంటూ చేసిన ప్రకటన ఓట్ల రూపంలో లబ్ధి చేకూరుతుందన్న భావనతోనే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారనీ, అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల బకాయిలు, ఇతర ఆర్థిక అంశాల గురించి కేబినెట్ లో కనీస ప్రస్తావన కూడా చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్పటికెయ్యది ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ. అన్న సుమతీ శతకంలోని శ్లోకాన్ని కేసీఆర్ తు.చ. తప్పకుండా పాటిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

పని మొదలెట్టేసిన కొత్త పార్టీ!

కొత్త పార్టీ అప్పుడే పని ప్రారంభించేసింది. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఏపీలో జగన్ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిపై కేంద్ర హోంమంత్రి  అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  పాల్పడిన 35 వేల కోట్ల రూపాయల అవినీతిపై అమిత్ షాకు ఆధారాలను అందజేశారు.  ఆయన ఫిర్యాదు మేరకు పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీపై 160 క్రిమినల్ కేసులున్నాయి. 17 మంది డైరెక్టర్ల ద్వారా సూట్కేసు కంపెనీలు సృష్టించి అవినీతిని దాచే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ముందు పెద్దిరెడ్డికి ఉన్న ఆస్తుల వివరాలను దాచిపెట్టారని రామచంద్రయాదవ్ హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు.    పెద్ది రెడ్డి అక్రమాలు, అవినీతిపై ఈడీ  దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.  అలాగే ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మోసం చేశారని, దానిపై న్యాయపోరాటానికి సమాయత్తమౌతున్నానని అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో రామచంద్రయాదవ్ చెప్పారు. అలాగే పెద్దరెడ్డి తప్పుడు అఫిడవిట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.  కాగా తన భారత చైతన్య యువజన పార్టీ వెనుక బీజేపీ ఉన్నదంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని, బీజేపీ కోసం పని చేసేవాడినైతే తానే బీజేపీలో చేరేవాడిని కదా అని కూడా అన్నారు. జగన్ అక్రమాలను ఎదుర్కొనే విషయంలో ఏపీలో ఇప్పుడున్న పార్టీల వల్ల ఉపయోగం లేదన్న నిర్ణయానికి వచ్చిన మీదటే సొంతంగా పార్టీ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మొత్తంగా మంగళవారం ( ఆగస్టు 2)న రామచంద్రయాదవ్ అమిత్ షాతో దాదాపు 20 నిముషాలు భేటీ అయ్యారు.  పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న అన్ని ఆధారాలు హోమంత్రికి అందజేసిన ఆయనఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయని విమర్శించారు.  2019 నుంచి ఇప్పటి వరకూ జగన్ సర్కార్ చేస్తున్నది కేవలం రాష్ట్ర సంపద లూటీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న  విపక్షాల నాయకులపై కేసులు బనాయించడం వేధించడమ మాత్రమేనని రామచంద్రయాదవ్ అన్నారు.  పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఇసుకాసురులనీ, ఒక్క ఇసుక అనేమిటి, అన్ని రంగాలలోనూ దోపిడీకి పాల్పడుతున్నారని రామచంద్రయాదవ్ ఆరోపించారు.  అవినీతి సొమ్ముతో వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. అంతే కాకుండా పీఎల్‌ఆర్ కంపెనీకి ప్రభుత్వం నుంచి అక్రమంగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులున్నాయని రామచంద్రయాదవ్ ఆరోపించారు.  జగన్ సర్కార్ కేబినెట్ లో ఒక్క మంత్రిపైనే  రూ.35 వేల కోట్లు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయంటూ.. మొత్తం కేబినెట్ లో మిగిలిన మంత్రుల అవినీతి లెక్క ఎంత ఉంటుందో  ఊహాతీతమేమీ కాదని పరిశీలకులు ఒక్కో మంత్రిపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ విశ్లేషిస్తున్నారు.  సీఎం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర సంపదని లూటీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో  అవినీతి సర్కార్ పై రాజీలేని పోరాటం చేయడానికే కొత్త పార్టీని ఏర్పాటు చేశామన్న రామచంద్రయాదవ్ రానున్న రోజులలో తమ పోరాట కార్యచరణ ప్రారంభించనున్నామని అన్నారు.   

లోకేష్ ప్రకాశం

ప్రాంతమేదైనా.. ఊరు ఏదైనా.. మండుటెండ వచ్చినా, జోరు వాన వచ్చినా.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట చేపట్టి పాదయాత్ర  సుడిగాలిలా ముందుకు దూసుకుపోతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 17 రోజుల పాటు.. 220 కిలోమీటర్ల మేర అన్ని నియోజకవర్గాల మీదగా సాగిన యువనేత పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  జిల్లాలోని ఏ నియోజకవర్గంలో లోకేశ్ సభ పెట్టినా ప్రజలు పోటెత్తుతున్నారు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే అద్దంకిలో లోకేశ్ సభ అదిరిపోయింది. ఇక దర్శిలో లోకేశ్ సభ దద్దరిల్లిపోయింది.  అటు కందుకూరులో సభ అయినా.. ఇటు గిద్దలూరులో సభ అయినా.. జిల్లాలో ఎక్కడ.. ఎప్పుడు సభ పెట్టినా జనం మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నారు.    అలాగే అధికార పార్టీ అధ్యక్షుడు  సీఎం వైయస్ జగన్‌పై లోకేశ్ విసురుతోన్న పంచ్‌లకు, ఆయా నియోజకవర్గాల అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల చిట్టాపై నారా లోకేశ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటే.. ప్రజల నుంచి వస్తున్న స్పందన..  తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక వివిధ నియోజకవర్గాల్లో ప్రజలకు లోకేశ్ ఇస్తున్న హామీలతో  ప్రజల్లో తెలుగుదేశం నాయకత్వంపై నమ్మకం రెట్టింపు అవుతోంది.  అలాగే  తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. రైతులకు నాణ్యమైన విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, ఉచిత కరెంట్, వ్యవసాయ రుణాలు, అదే విధంగా యువతకు విద్యా, ఉపాధి, ఉద్యోగ కల్పన.. తదితర అంశాలపై నేను ఉన్నాను నేను విన్నాను అన్నట్లుగా  ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో   జగన్ ఉకదంపుడు హామీలు ఇచ్చినట్లుగా కాకుండా.. తాము అధికారంలోకి వస్తే.. తూచ తప్పకుండా అమలు చేసే స్పష్టమైన హామీలను ప్రకటిస్తూ.. నారా లోకేశ్  ముందుకు సాగుతున్నారు.   ప్రకాశం జిల్లాలో నారా లోకేశ్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోని.. ఆయన అడుగులు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు సీమలోకి దూసుకెళ్తున్నాయి. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన ఈ పాదయాత్ర ద్వారా  నారా లోకేశ్  వైయస్ జగన్ మోహనుడి అధికార మదం పీచమణచడానికి.. నవ్యంధ్రలో అమరావతి రాజధానిగా చేసుకొని  తెలుగుదుశం ప్రజా రంజక పాలన చేపట్టడానికి రాచబాట వేస్తున్నారని పార్టీ శ్రేణులు సంతోషంగా చెబుతున్నాయి. 2023, జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో  లేకేష్ చేపట్టిన యువగళం   పాదయాత్ర  నిర్విఘ్నంగా దిగ్విజయంగా కొన... సాగుతోంది. ఈ పాదయాత్రలో తొలుత లోకేశ్‌కు అటు పోలీసులు, ఇటు అధికార   పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించినా.. వాటిని ఆయన అధిగమించి.. తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. అలా ఆయన చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలతోపాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా మీదుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన..సాగి ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాటీ సీమలోని వినుకొండ నియోజకవర్గంలోకి  పాదయాత్ర ప్రవేశించి.. ముందుకు సాగుతోంది.

ఎన్నికల బరిలో నితిన్ వర్సెస్ దిల్ రాజు

రానున్న సార్వత్రిక ఎన్నికలు చాలా రసవత్తరంగా జరగనున్నాయనే ఓ చర్చ అయితే అటు పోలిటికల్ సర్కిల్‌లో ఇటు టాలీవుడ్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల బరిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ హీరో నితిన్ ఒకరిపై ఒకరు పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయనే ఓ చర్చ సైతం ఊపందుకొంది.  నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర పంపిణి విషయంలో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి, నిర్మాత దిల్ రాజు మధ్య వివాదం నెలకొనడంతో వీరి మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లు ఓ చర్చ అయితే టాలీవుడ్‌ వర్గాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు సై అంటే సై అనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.  అదీకాక దిల్ రాజు, హీరో నితిన్ ఇద్దరిది నిజామాబాద్ జిల్లానే కావడం గమనార్హం. ఇక హీరో నితిన్ మేనమామ, పీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగేందుకు తన వంతుగా సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ స్థానానికి నితిన్‌ని బరిలోకి దిగేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారనే చర్చ కొనసాగుతోంది. అయితే సదరు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మధుయాష్కి పోటీ చేయని పక్షంలో నితిన్‌ను హస్తం పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా అధిష్టానం చేత ఖరారు చేయించే పనిలో నగేష్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.  ఇంకోపైపు హీరో నితిన్.. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావడంతో.. ఆయన రాజకీయ ఎంట్రీపై ఓ రేంజ్‌లో పుకార్లు సైతం షికారు చేస్తున్నాయి. కానీ నితిన్‌ను మాత్రం కాంగ్రెస్ నుంచే బరిలో దింపేందుకు నగేష్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది.  ఇక నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దిల్ రాజు బరిలో నిలిపే అవకాశం ఉందనే చర్చ సైతం సాగుతోంది. 2019 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కవిత.. బీజేపీ అభ్యర్థి దర్మపూరి అర్వింద్ చేతిలో ఓటమి పాలైయ్యారు. కానీ రానున్న ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నిజామాబాద్ సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆ క్రమంలో నిజామాబాద్ ఎంపీగా దిల్ రాజు బరిలో దిగనున్నారనే ప్రచారం సైతం వాడి వేడిగా కొన..సాగుతోంది.  ఇంకోవైపు తాను రాజకీయాల్లోకి వెళ్లితే ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో ఎక్కడి నుంచి అయినా గెలుస్తానంటూ దిల్ రాజ్ వ్యాఖ్యానించారు. ఆ కొద్దిరోజులకే ఆయన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరి దిల్ రాజు, నితిన్‌లు ఎన్నికల బరిలోకి దిగితే.. ఎవరు గెలుస్తారనేది మాత్రం సస్పెన్సే. ఎందుకంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అలాంటి వేళ..  ఓ వేళ వీరిద్దరి.. ఎన్నికల బరిలో నిలిస్తే.. ఎవరు గెలుస్తారంటే మాత్రం ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే అనే చర్చ సైతం పోలిటికల్, టాలీవుడ్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

ఎన్నికల ముందు బిఆర్ఎస్ వరాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు  వరాలను ప్రకటిస్తున్నారు. వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ వర్గానికి దగ్గరైంది.  ప్రజల్లో తమ ప్రభుత్వంపై సానుకూల వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకుంటుంది బిఆర్ఎస్ ప్రభుత్వం. కాగా.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. ఆర్టీసీ సిబ్బంది దీర్ఘకాలికంగా చేస్తున్న పలు డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. 69,100 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ను 300 కి.మీల మేర విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.బీసీ కుల వృత్తులు చేసే వారికి  లక్ష  రూపాయల రుణం ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.వరంగల్ జిల్లాలోని మామ్‌నూర్‌ విమానాశ్రయాన్ని టెర్మినల్‌ భవనం, ప్రస్తుత రన్‌వే పొడిగింపు కోసం 253 ఎకరాల అదనపు భూమిని సేకరించి అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ ఏడాది జూన్‌లో విమానాశ్రయ విస్తరణ కోసం అదనపు భూమిని సేకరించేందుకు సర్వే పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం.  ఆర్టీసీ విలీనం, హైదరాబాద్ మెట్రో, వరంగల్ ఎయిర్ పోర్టు అంటూ చేసిన ప్రకటనలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి మార్కులు వచ్చాయి. వీటిపై విస్తృత చర్చ జరుగుతుంది.. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను మర్చిపోయే  స్థాయికి వచ్చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రకటనలతో హ్యట్రిక్ కొట్టాలని చూస్తోంది. అయితే కేసీఆర్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో మరో రకంగా ప్రచారం జరుగుతుంది. ఆర్టీసీ విలీనంపై గతంలో కేసీఆర్ అన్న మాటలు వైరల్ అయ్యాయి. ఈ భూమండలం ఉన్నంత వరకూ ఆర్టీసీ విలీనం జరగదని గతంలో తేల్చి చెప్పారు. 50కిపైగా కార్పొరేషన్లు ఉన్నాయని వాటన్నింటినీ ప్రభుత్వంలో కలపమని డిమాండ్లు వస్తాయన్నారు. అందుకే అప్పట్లో సాధ్యం కాదని తేల్చారు. కెసీఆర్ ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడం ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు ఎవరూ అడగకపోయినా ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటున్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన ప్రకటనలను సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి.  ఎన్నికల స్టంట్ అని పలువురు అనుకుంటున్నారు. నాలుగు వందల కిలోమీటర్ల మెట్రోను మూడు నుంచి ఐదేళ్లలో పూర్తి చేస్తామనడం పూర్తి జిమ్మిక్కేనని నమ్ముతున్నారు. అందుకే.. కేబినెట్ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి.  కేబినెట్ నిర్ణయాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా చూడాలని… పార్టీ నేతల్ని కెటీఆర్ ఇప్పటికే ఆదేశించారు. కానీ ఆ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్తున్నా  కానీ నెగెటివ్ కోణంలో ప్రచారం జరుగుతోంది. 

పులస తినే భాగ్యం ఇక ఉండదా?.. కాలుష్యం కాటుకు పులస మాయం

వింటే భారతం వినాలి... తింటే గారెలు తినాలి అన్నది సామెత.. కానీ మాంసాహార ప్రియులు మాత్రం మరీ ముఖ్యంగా సీఫుడ్ ను ఇష్టపడేవారు మాత్రం పులస చేప తినాలి అని అంటారు. సీజనల్ గా మాత్రమే.. అదీ గోదావరి వరదల సమయంలో మాత్రమే లభించే పులస చేపకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది. ఒక్కో సారి ఆ చేప వేల రూపాయలు దాటి లక్షల్లో కూడా పలుకుతూ ఉంటుంది. ఇది కేవలం జూలై, ఆగస్టు నెలలలో  మాత్రమే లభిస్తుంది. పుస్తెలమ్మైనా సరే ఒక సారైనా పులస చేప పులుసు తినాలి అన్న నానుడి గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వినిపిస్తుంటుంది. కేవలం గోదావరి వరదల సమయంలో మాత్రమే లభించే ఈ పులస చేప అంటే మాంసాహార ప్రియులలో ఉండే క్రేజే వేరు. రుచి, డిమాండ్ సంగతిని పక్కకు పెడితే.. ఎదురీది మరీ గోదావరిలోకి ప్రవేశించే ఏకైక చేప పులస. సముద్రం గోదావరి కలిసే సంగమం వద్ద గోదావరికి వరద సమయంలో సముద్రంలో నుంచి ఏటికి ఎదురీది ఉప్పునీటి నుంచి మంచినీటిలోకి ప్రవేశించే ఈ పులస చేపలు గోదవరి వరద తగ్గిన తరువాత మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంది.  అయితే ఇటీవలి కాలంలో పులస చేప లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే పులస కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు, మాంసాహార ప్రియులూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వచ్చే వరదల్లో ఎదురీది మరీ గోదవరిలోకి ప్రవేశించే  విలస చేప పులస చేపగా మారి రుచికరమైన ఆహారంగా మారుతుంది. ఏటా వరదలు వస్తున్నా పులస చేప లభ్యత ఎందుకు తగ్గిపోతోందీ అంటే పర్యావరణ వేత్తలు కాలుష్యమే కారణమని అంటున్నారు.   మరీ ముఖ్యంగా సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటలు వేయడం...గోదావరి బేసిన్ లో చమురు, సహజవాయువుల కోసం అన్వేషణలు కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే గోదావరిలోకి యథేచ్ఛగా పరిశ్రమల వ్యర్థాలను వదిలివేయడం వల్ల గోదావరి జలాలు కలుషితం కావడం కూడా విలసలు సంతానోత్పత్తి కోసం గోదావరికి ఎదురీది రావడం తగ్గిపోతోందని చెబుతున్నారు. గోదావరి జలాలు కలుషితం అవ్వడం వల్ల ఇప్పటికే రకాల చేపలు కనుమరుగైపోయాయి. ఇప్పుడు పులస చేప కూడా వేగంగా ఆ కోవలోకే చేరిపోతున్నదని  అంటున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో పర్యావరణ అనుమతులతో సంబంధం లేకుండా చేపడుతున్న రొయ్యల సాగు కూడా పులస చేపలు అంతరించిపోవడానికి ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. రొయ్యల సాగు కోసం వాడే మేత, యాంటీబయటిక్ వ్యర్థాలను గొదావరిలోకి మళ్లించడం వల్ల పులసలు అంతరించిపో తున్నాయనీ, వాటి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నదనీ నిపుణులు చెబుతున్నారు.  

తెలుగుదేశం... జనసేన మధ్యలో బీజేపీ.. పొత్తులు పొడిచేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, పొత్తులు, ఎత్తుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా పొత్తు వ్యవహారాలన్నీ బీజేపీ సెంట్రిక్ గానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సర్వ వ్యవస్థలనూ గుప్పెట్లో పెట్టుకుని ఒక విధంగా పోలీసు పాలనను సాగిస్తున్నదని రాజకీయ వర్గాలలోనే కాదు జనబాహుల్యంలో కూడా గట్టిగా వినిపిస్తున్నది. జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా గత నాలుగేళ్లుగా తెలుగుదేశం జగన్ సర్కార్ విధానాలు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది.   2024 ఎన్నికలలో  వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు, ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. పార్టీని, పార్టీ శ్రేణులను నిరంతరం చైతన్యవంతం చేస్తూ  జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. మరో వైపు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ యువగళం పాదయాత్ర పేరిట జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి, నేతల అరాచకత్వాలను ప్రజలలో ఎండగడుతూ యువగళం పేర పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జగన్ సర్కార్ ను గద్దెదింపడమే లక్ష్యంగా పోరుబాటలో సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను మరోసారి అధికారంలోకి రానివ్వనని, అందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ రాష్ట్రంలో పొత్తు పొడుపులపై చర్చకు తెరతీశారు. అది కూడా నిన్నో మొన్నో కాదు.. దాదాపు ఏడాదిన్నర కిందటే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననీ, జగన్ వ్యతిరేక శక్తులన్నిటినీ కలుపుకు పోతానని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. అంతే కాదు ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందాలనుకోవడం లేదని కూడా క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో తెలుగుదేశం, జనసేనలు పొత్తుతోనే ఎన్నికలకు వెడతాయన్నది విస్పష్టంగా తేలిపోయింది. అయితే రాష్ట్రంలో ఇసుమంతైనా ఓటు బ్యాంకు లేకపోయినా.. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి నడిస్తే మంచిదని, జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ సహకారం అవసరమని జనసేనాని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన, బీజేపీల మధ్య అధికారికంగా మైత్రి ఉంది. తెలుగుదేశం కూడా బీజేపీతో ఘర్షణాత్మక వైఖరిని కోరుకోవడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలో జగన్ హింసాత్మక వైఖరి, ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల నమోదు వంటి విషయాలలో కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా నిలబడి, నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఉండాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ అండ అవసరమన్న భావనతోనే తెలుగుదేశం బీజేపీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జ ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలరాదు అని పదేపదే చెబుతున్న పవన్ కల్యాణ్ ఇటీవల  ఢిల్లీ పర్యటనలో వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ కలిసివస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో రాజకీయ వాతావరణం చూస్తుంటే ఒకే సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసే ఎన్నికల బరిలోకి దిగుతాయన్న భావన, బీజేపీ జగన్ సర్కార్ కు అండగా నిలుస్తూ పొత్తు పొడుపునకు అవరోధాలు కలిగిస్తోందన్న భావనా కలుగుతున్నాయి.   

జులై నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.129.03 కోట్లు

తిరుమల శ్రీవారిని జులై నెలలో 23.23లక్షల మంది దర్శించుకున్నారు. ఆ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 129.03 కోట్ల రూపాయలు వచ్చింది. జూలైలో అత్యధికంగా 9వ తేదీన 88 వేల 836 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 17వ తేదీన శ్రీవారి హుండీ ఆదాయం అత్యధికంగా 5.40 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక నెల చివరి రోజు 31వ తేదీన శ్రీవారి హుండీ ఆదాయం 5.21 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక  సోమవారం అంటే ఆగస్టు 1న శ్రీవారిని 67 వేల 728 మంది దర్శించుకున్నారు. 21, 084 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయలు వచ్చింది. మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.   

ఈ మరాఠా యోధుడిని శ్లాఘించిన కెసీఆర్ 

ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అన్నాభావ్ సాథే పేరు కొత్తగా పరిచయమైంది. ఎందుకంటే తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మహారాష్ట్ర పర్యటనలో ఆయనను కీర్తిస్తూ మాట్లాడారు. భారత రత్న అవార్డు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అన్నాభావ్ సాథే మరాఠా ప్రజలకు సుపరిచితుడు. సామాజిక కార్యకర్త. జానపద కళాకారుడు, కవి, రచయిత ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాలకు  సేవ చేసిన యోధుడు. పైగా దళితుడు. పీడిత, తాడిత ప్రజానీకం కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. మరాఠాలకు ఒక రకంగా దేవుడు లాంటి మనిషి. అంటరాని కులంలో పుట్టినప్పటికీ దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు.  సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ముఖ్య భూమిక వహించారు.  మహరాష్ట్ర సాంగ్లీ జిల్లా వతేగావ్ లో పుట్టిన అన్నాభావ్ సాథే ఎస్ సిలోని మాతంగ్ తెగకు చెందిన వ్యక్తి. అన్నాబావ్ సాథే పెద్దగా చదువుకోలేదు. నాలుగో తరగతిలోనే చదువుకు స్వస్థి పలికారు కానీ సమాజాన్ని బాగా చదివారు.  సాథే ఇప్పటి వరకు 35 నవలలు రచించారు. ఇందులో ఫకీరా(1959) చాలా ప్రాచుర్యం పొందింది. ఈ నవలకు మహ ప్రభుత్వం అవార్డును కూడా ప్రకటించింది. నవలలతో బాటు షార్ట్ స్టోరీలు రాశారు. రష్యాలో కూడా ఆయన అనేక నాటక ప్రదర్శనలు చేశారు. అన్నా భావ్ సాథే కమ్యూనిస్ట్ సిద్దాంతాలకు ప్రభావితులయ్యారు. భారత రాజ్యాంగనిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్  స్పూర్తితో సాథే దళిత ఉద్యమాల్లో పాల్గొన్నారు. సాథే బుద్దిజం కు కూడా ప్రభావితం చెందారు. ఆయన పేరు మీద 2002లో పోస్టల్ స్టాంప్ కూడా విడుదలైంది.