ప్రధాన మంత్రి అయిన చంద్రబాబు...!

  ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిత్రపక్షమైన బీజేపీ నుండి విడిపోయారు. మిత్రపక్షంగా ఉన్నప్పుడే రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు కారాలు, మిరియాలు నూరుకునేవారు. ఇక విడిపోయిన తరువాత అయితే చెప్పనక్కర్లేదు. దానికి తోడు టీడీపీ మోడీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పరిస్థితి ఇంకా తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. అసలే టీడీపీ అంటే మండిపడుతున్న బేజీపీ మంటలో ఇప్పుడు ఓ విషయం ఆజ్యం పోసినట్టైంది. అదేంటనుకుంటున్నారు..? అసలు సంగతేంటంటే...   మంగళగిరి సీవీ కన్వెనన్లో సీఆర్డీయే, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజుల పాటు సంతోష నగరాల సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇక్కడే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన భూటాన్లోని, జెలెఫర్ నగర మాజీ మేయర్ ఆకారాం కెప్లీ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రధానమంత్రిగా సంభోదించారు. స్మార్ట్ నగరాల నిర్మాణం పై తన అనుభవాలను వివరించిన కెప్లీ 'ప్రైమ్ మినిస్టర్' చంద్రబాబు నాయుడు ఓ విజన్ ఉన్న నాయకుడని అభివర్ణించారు. తనకు ఉన్న అపారమైన అనుభవంతోనే అమరావతి నిర్మాణానికి సదస్సు ఏర్పాటు చేశారన్నారు. ప్రధానమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దగలరనే నమ్మకం తమకు ఉందన్నారు.   దీంతో చంద్రబాబును ఏకంగా ప్రధానమంత్రిగా సంబోధించంపై రాష్ట్ర బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అంతేకాదు... ఇది కావాలనే చంద్రబాబు చేసిన కుట్ర అంటూ, చంద్రబాబు ఇలా కావాలనే వాళ్ళ చేత చెప్పించుకుంటున్నారు అని ఎప్పటిలాగే విమర్శలు మొదలుపెట్టారు. దీనికి టీడీపీ నేతలు కూడా స్పందించి... చంద్రబాబుకు అలా అనిపించుకోవాల్సిన అవసరం లేదు... రెండు సార్లు ఆ పదవి చేపట్టే అవకాశం వచ్చినా రాష్ట్రం కోసం ఆయన ఆపదవిని వదిలిపెట్టుకున్నారని... వేరే వాళ్లయితే ఆ పని చేసేవారు కాదని కౌంటర్ ఇచ్చారు. మరి అప్పుడంటే చంద్రబాబు వదిలిపెట్టారు... ఇప్పుడు ఆ అవకాశం వస్తే చంద్రబాబు వదిలిపెట్టి తప్పు చేయరేమో. చూద్దాం.. చంద్రబాబు మళ్లీ పీఎం అయ్యే ఛాన్స్ వస్తుందేమో..

దానికి మోడీయే కారణం...నాకు తెలుసు ఎలా సాధించుకోవాలో..

ఏపీ ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీలందరూ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. కానీ అవిశ్వాస తీర్మానం మాత్రం చర్చకు రాలేదు. అన్నాడీఎంకే పార్టీని అడ్డుపెట్టుకొని మోడీ ప్రభుత్వం చర్చ జరగకుండా డ్రామాలాడింది. ఇక పార్లమెంట్ సమావేశాలు ముగిసినా ఇంకా ఎంపీలందరూ నిరసన చేస్తూనే ఉన్నారనుకోండి. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... విపక్షాలు పార్లమెంటు సమావేశాలు జరగనీయకపోవడాన్ని నిరసిస్తూ మోడీ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నా అని ప్రకటింటారు. ఇక ఇప్పుడు మోడీ చేస్తానంటున్న ఒక్క రోజు నిరాహార దీక్ష పై  చంద్రబాబునాయుడు స్పందించి ఆయనపై విమర్సలు గుప్పించారు. అమరావతిలో జరిగిన ఆనంద నగరాల సదస్సుకు హాజరైన ప్రతినిధులకు ఇచ్చిన విందు సమయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంటు సజావుగా సాగకపోవడానికి ఎన్డీయేనే కారణమని ఆయన ఆరోపించారు.   అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ఉండేందుకు అన్నాడీఎంకే పార్టీ వెనుక ఉండి లోక్‌సభ జరగనీయకుండా చేసింది ఎన్డీయే కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం తలచుకుంటే కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయొచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దాన్ని ఏర్పాటు చేయకుండా మోదీని ఎవరు ఆపారు’ అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు జరగకపోవడంపై తప్పు తమ వైపు పెట్టుకుని ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.. కేంద్రంతో విభేదాలు ఉన్నంత మాత్రాన సంక్షేమం, అభివృద్ధి ఆగదని, మోదీ ఏపీకి సాయం చేయకపోతే కేంద్రం నుంచి వడ్డీతో సహా ఎలా సాధించుకోవాలో మాకు తెలుసని సీఎం చంద్రబాబు తెలిపారు.

నిజంగానే మరిచిపోయారా.. కావాలని చేశారా..!

  ఎయిరిండియా సిబ్బంది వల్ల గతంలో ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఏకంగా భారత విమానయానశాఖ మంత్రిగా పని చేసిన అశోక్ గజపతిరాజుకే ఎయిరిండియా వల్ల చేదు అనుభవం ఎదురైంది. వివరాల ప్రకారం... అశోక్ గజపతిరాజు తన భార్య కూతురు, సోదరితో కలిసి ఢిల్లీ నుంచి విశాఖపట్టణం వచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లైట్ ఎక్కేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ రాజుగారి లగేజీని తనిఖీ చేశారు విమానాశ్రయ సిబ్బంది. ఇక  అశోక్ గజపతి రాజు ఫ్లైట్ ఎక్కి విశాఖ చేరుకున్నారు. ఆతరువాత... ఆయన తన లగేజీ కోసం చూసుకుంటే అది ఎక్కడా కనపడలేదు, ఎంతకీ ఆయన లగేజీ రాలేదు. ఆ విమానంలో ప్రయాణించిన అందరి లగేజీ వచ్చినా తన లగేజీ మాత్రం రాకపోవడంతో అశోక్ గజపతి రాజు ఆశ్చర్యపోయారట. విషయం ఏమిటంటే, ఆయనను లోనికి అనుమతించిన తరువాత ఆయన బుక్ చేసిన లగేజీని తనిఖీ చేసి అక్కడే వదిలేశారు. దీంతో పరిస్థితి గమనించిన సిబ్బంది... ఆయనకు క్షమాపణలు చెప్పి...లగేజీని జాగ్రత్తగా చేరుస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఎయిరిండియా చేసిన నిర్వాకంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మాజీ విమానయాన శాఖ మంత్రికే ఇలా జరిగితే... సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు...ఇది కాకతాళీయంగా జరిగిందా లేక కావాలని అశోక్ గజపతిని అవమానించాలని ఇలా చేశారా అన్నఅనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీయే నుండి తెలుగుదేశం బయటకి వచ్చేసిన సమయంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ ఆందోళన ముగిసి ఆంధ్రాకి బయలుదేరే ముందే ఈ ఘటన జరగడంతో అనేక అనుమానాలకి తావిస్తోంది. ఎందుకంటే నెల రోజుల క్రితందాకా ఆయన క్యాబినెట్ మంత్రి, ఇప్పుడు మంత్రి కాకపోయినా ఎంపీ క్యాబినెట్ మంత్రి గా పని చేసిన వీఐపీ కి చెందిన వస్తువులని సాధారణంగా అయితే ఇలా నిర్లక్ష్యంగా వదిలివేయరు ఎయిర్ ఇండియా స్టాఫ్. అది కూడా ఆయన మంత్రిగా పని చేసిన విమానయాన శాఖకి చెందిన ఎయిర్ ఇండియా సిబ్బంది ఇలా వ్యవహరించే అవాకాశం ఉండదు సో ఇదంతా కావాలనే చేయించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాజుగారు ముందుంది అసలు పండగ..

  మొత్తానికి ఏపీకి బీజేపీ అధ్యక్షుడిని నియమించింది పార్టీ అధిష్టానం. ఇన్ని రోజులు ఏపీ బీజేపీ బాధ్యతలు ఎవరికిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ సోము వీర్రాజుకి ఆ బాధ్యతలు బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమించినట్టు తెలిపింది. త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఈ విషయంలో ఎంపీ హరిబాబు వర్గం విభేదించినా.. చివరికి వీర్రాజు వైపు అమిత్ షా మొగ్గు చూపారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాలంటే ఇలాంటి లీడర్ అవసరం అని భావించి.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. అంతేకాదు... ఏపీలో బలమైన నేతలుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలు కూడా వీర్రాజు వైపే మొగ్గుచూపారట. పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగినా.. ఆమే వద్దన్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో నేను పార్టీ పగ్గాలు స్వీకరించలేను అని తెలిపారంట. ఇక కన్నా కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవటంతో సోము వీర్రాజుకే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో పార్టీ పటిష్ఠంపై దృష్టాలని యాక్షన్ ప్లాన్ తో ఓ నివేదిక కూడా వీర్రాజుకి అందజేసినట్లు తెలుస్తోంది.   మరి అసలే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఇప్పటికే బీజేపీ అంటే రగిలిపోతున్నారు ఏపీ జనాలు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని... వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ది చెప్పాలని ఇప్పడికే నిర్ణయం తీసుకున్నారు తెలుగు ప్రజలు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు గారు అంత పెద్ద బాధ్యతను నెత్తిన పెట్టుకున్నారు. ఇక సోము వీర్రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడే ఆయన టీడీపీపై ఓ రేంజ్ లో విమర్సలు గుప్పించారు. విడిపోయిన తరువాత అయితే ఏకంగా చంద్రబాబునాయుడిపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు.   ఇప్పుడు ఏకంగా.. రాజుగారికి అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా రెచ్చిపోతారేమో.. అందుకే బీజేపీ వీర్రాజు ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న్టట్టుంది అంటున్నారు. మిగిలిన వాళ్లు ఎలాగూ ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసుకాబట్టి అందుకే సైలెంట్ గా తప్పుకున్నట్టున్నారు అని కూడా అనుకుంటున్నారు. మరి బీజేపీపై ఇంత వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో సోము వీర్రాజు ఎలా ప్రజల్లోకి వెళతారో చూద్దాం....

మేము రాము.. వీళ్ల అసలు రంగు బయటపడింది...

ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోతాడు. అలాగే ఎంత కవరింగ్ చేసినా... ఎన్ని మాటలు చెప్పినా ఆఖరికి రాజకీయ నేతల వేసుకునే ముసుగు తొలగించక తప్పదు. ఇప్పుడు అదే జరిగింది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు మరోసారి తాము బీజేపీ తొత్తులే అని నిరూపించాయి. ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో ఈ విషయం ఎప్పుడో అర్ధమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్రం మొత్తం ఆందోళనలు చేపడుతూనే ఉంది. ఏపీ ఎంపీలందరూ అవిశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు. కానీ ఈ తీర్మానం చర్చకు రాకుండా టీఆర్ఎస్ నేతలు, అన్నాడీఎంకే నేతలు అడ్డుపడ్డారన్న విషయం అందరూ గమినించారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా రెండు పార్టీలు చేసిన రాజకీయ డ్రామా వెనుక బీజీపే ఉందన్న విషయం అప్పుడే అర్దమైంది అందరికీ. దేశంలో అన్ని పార్టీలు, ఈ రెండు పార్టీల చేత, బీజేపీనే గోల చేయిస్తుంది అని విమర్శలు కూడా చేసాయి. ఇక ఆ తరువాత టీఆర్ఎస్ నేతలు మద్దతిస్తున్నామని వెనక్కి తగ్గినా.. అన్నాడీయంకే మాత్రం కొనసాగించింది.   ఇక ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల నేతలు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే నిజంగానే వీరు మోడీ తొత్తులు అనేది మరోసారి స్పష్టం అయ్యింది...దక్షిణ రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు చూస్తున్న నేపథ్యంలో  రోజు, కేరళ రాజధాని తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేసి.. కేంద్రానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. అయితే, ఈ సమావేశానికి రావటం లేదు అంటూ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మంత్రులు కబురు పంపించారు. కేరళలో భేటీకి వెళ్లడం లేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించగా.... తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం కూడా ఈ సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించింది.   దీంతో పూర్తి క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు దక్షిణ రాష్ట్ర రాజకీయ నేతలు. అంతేకాదు ఇన్ని రోజులు మోడీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ పెడతానని చెప్పి కేసీఆర్ డ్రామాలాడారని.. అన్నాడీఎంకే నేతుల కావేరి నది జలాలపై పోరాటం అని కలరింగ్ ఇచ్చారని.. వీళ్ల అసలు రంగు ఇదే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తమని ఏమన్నా ఊరుకోని కేసీఆర్ ఇప్పుడు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూద్దాం..

చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. అక్కడే ఆమరణ నిరాహార దీక్ష..

  ఏపీ ప్రత్యేక హోదాపై ఇప్పటికే ఏపీ నేతలంతా గత కొద్దికాలంగా ఢిల్లీ పార్లమెంట్ వేదికగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే వైసీపీ ఎంపీలు తమ పదవులు రాజీనామా చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయలేదు కానీ.. అక్కడే ఉండి ఇంకా నిరసన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబునాయుడే  ఆమరణ నిరాహార దీక్షకి దిగాలని నిర్ణయించుకున్నారట. కేవలం రెండు రోజులు పర్యటిస్తేనే దేశవ్యాప్తంగా చర్చ జరగటం, జాతీయ మీడియా అంతా ఫోకస్ చేయడం, కేంద్రం భయపడి ప్రదర్శనలు ఆపేసింది. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గనుక రాజధానిలో ఆమరణ నిరాహార దీక్షకి దిగితే ఇప్పటికే కర్ణాటకలో ఎంతో కష్టపడి ఎన్నికలకి సిద్దమవుతున్న వేళ బీజీపీని ఇరుకున పెట్టచ్చు అనే యోచనలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది.   అంతేకాదు ఈ ఆమరణ నిరాహార దీక్షకి తన పుట్టిన రోజు నాడే ప్రారంభిస్తే ఇంకాస్త వేడి పుట్టించవచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో పుట్టినరోజు నుండి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆమరణ దీక్షకి దిగనున్నారట. చంద్రబాబు గనుక దీక్ష ప్రారంభిస్తే ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఆమరణ దీక్ష మొదలుపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రకి ఎక్కుతారు. అంతే కాకుండా మోడీ దుర్మార్గం దేశం అంతా తెలిపేందుకు ఈ దీక్ష మరింత సహాయం చేస్తుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలని, దీక్ష తీరు తెన్నులు మీద ఇప్పటికే ప్రత్యేక బృందం ఒకటి కసరత్తులు చేసిందట. మరి ఏకంగా చంద్రబాబే అక్కడికి వెళ్లి నిరాహార దీక్ష చేస్తే దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించక తప్పదు. మరి చంద్రబాబు పన్నిన వ్యూహంలో బీజేపీ చిక్కుకుంటుందా.. లేదా..? చూద్దాం ఏం జరుగుతుందో..

జగన్ పై పార్టీ నేతల అసహనం....మావోడికి ఆ సోయి లేదు...

  పాదయాత్ర అయినా... ప్రెస్ మీట్ అయినా.. జగన్ టార్గెట్ మాత్రం ఒక్కటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడిపై దుమ్మెత్తిపోయడమే. గతంలోనే చంద్రబాబు నాయిడిని కాల్చి  పారేయాలి... ఉరితీయాలని ఇలా ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన... ఇప్పుడు మరోసారి ఆయనపై వ్యక్తిగత దూషణలు చేసి నేనింతే అని రుజువు చేశారు. ఇక పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా నాలుగు సెటైర్లు వేశారు. 'పవన్‌' సినిమాకు తక్కువ...ఇంటర్‌వెల్‌కు ఎక్కువ...అని అన్నారు. దీంతో జగన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్‌కళ్యాణ్‌'పై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట.   ఎందుకంటే... జనసేన పార్టీ ఆవిర్భావం రోజు వరకూ పవన్ కళ్యాణ్ టీడీపీ కీలుబొమ్మ అని.. చంద్రబాబు-పవన్ ఒకటే అని గతంలో జగన్ పలుమార్లు విమర్సలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక జనసేన పార్టీ ఆవిర్భావం రోజు పవన్ ప్రసంగం విన్నవారు ఒక్కసారిగా షాకయ్యారు. కారణం..పవన్ టీడీపీ పై పెద్దఎత్తున ఆరోపణలు చేయడమే. దాంతో పవన్ టీడీపీకి వ్యతిరేకమయ్యారు. అంతేకాదు.. తాను అవసరమైతే....వచ్చే ఎన్నికల నాటికి వైకాపాను సమర్థిస్తాను తప్ప...'టిడిపి'వైపు ఉండనని తేల్చిచెప్పేశారు కూడా. అలాంటింది... పవన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేసి మరోసారి సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నాడని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. అంతేకాదు...అవసరానికి పనికి వచ్చే వాళ్లను.... ఆదుకునేవాళ్లను...తన నోటి దురదతో మరోసారి దూరం చేసుకుంటున్నాడని... 'చంద్రబాబు'కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 'పవన్‌'పై వ్యాఖ్యానించి...ఈయన ఒరగబెట్టేదేముంది...? వచ్చే ఎన్నికల నాటికి 'చంద్రబాబు' వ్యతిరేకులంతా..ఒకవైపు చేరితే...అంతిమంగా లాభపడేది...తమ పార్టీ...అని...ఆ సంగతి తెలుసుకోకుండా...ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న 'పవన్‌'ను విమర్శించి...'చంద్రబాబు' వ్యతిరేక ఓటు చీలిపోవడానికి మా నాయకుడే దారి చూపిస్తున్నారని అనుకుంటున్నారు. ఇదేం తెలివో...అర్థం కావడం లేదు..ప్రభుత్వ వ్యతిరేక ఓటు...'జగన్‌', 'పవన్‌'ల మధ్య చీలితే...చివరకు... లాభపడేది...'చంద్రబాబే' అన్న సోయి...మావోడి లేదు...ఏం చేస్తాం...అంతా మా ఖర్మ'...అంటూ ఆ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.   అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. అప్పుడెప్పుడో..లక్ష కోట్లు...తిన్నాడని...తండ్రి ముఖ్యమంత్రి అయితే....కొడుకు కూడా ముఖ్యమంత్రి కావాలా...? అని ప్రశ్నించిన 'పవన్‌'పై కోపం చల్లారకే...'జగన్‌' అసహనాన్ని ప్రదర్శించారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇప్పటికైనా జగన్ నోటి దురుసుకాస్త తగ్గించుకొని.. కాస్త రాజకీయాల గురించి.. అవగాహన తెచ్చుకుంటే పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడటం నేర్చుకుంటే బెటర్ అని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఏపీలో 105 దాటేసిన పొలిటికల్ టెంపరేచర్..

  ఈసారి సమ్మర్ సీజన్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతుంటే... ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ టెంపరేచర్ మాత్రం 105 దాటేస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది టైముంది. ముందస్తు ఎన్నికలు వస్తే తప్ప... వచ్చే సమ్మర్ సీజన్ వరకు ఎన్నికలు జరిగే ఛాన్సే లేదు. కానీ ప్రత్యేక హోదా పోరుతో ఏపీలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. స్పెషల్ స్టేషస్ ఇష్యూ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తోంది.   ఒకవైపు అధికార టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సైకిల్, బైక్ ర్యాలీలు చేపడితే.... మరోవైపు ప్రతిపక్ష వైసీపీ... తన ఎంపీలతో రాజీనామా చేయించి ఢిల్లీలో ఆమరణదీక్షలకు కూర్చోబెట్టింది. ఇక గుర్తొచ్చినప్పుడల్లా జనం మధ్యకొచ్చే జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హోదా పోరులోకి దిగారు. వామపక్షాలతో కలిసి జాతీయ రహదారులపై పాదయాత్రలకు పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ స్వయంగా బెజవాడ బెంజి సర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.   మొత్తానికి ఈ సమ్మర్ సీజన్ కూల్ కూల్ గా ఉంటుందంటూ భారత వాతావరణశాఖ చల్లని వార్త చెబితే... ఏపీలో మాత్రం పొలిటికల్ టెంపరేచర్ సెగలు పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో  రేగుతోన్న రాజకీయ సెగ.... దేశ రాజధాని ఢిల్లీని సైతం వణికిస్తోంది. దాంతో ఏం చేయాలో తోచక మోడీ సర్కార్ తప్పించుకొని తిరుగుతోంది.

హరీష్ తో ఎదురుదాడి... ఈటలకు చీవాట్లు

  కాగ్ నివేదికపై కాంగ్రెస్ కారు కూతలు కూస్తోందంటూ మంత్రి హరీష్ రావుతో ఎదురుదాడి చేయించినా... కాగ్  అక్షింతలతో కేసీఆర్‌‌ ఆత్మరక్షణలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో ఆర్ధిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందంటూ ప్రభుత్వాన్ని కడిగిపారేయడమే కాకుండా‌.... అన్ని రంగాల్లో లోపాలను ఎత్తిచూపడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అసలెక్కడ లోపం జరిగింది? కారణమెవరనే దానిపై పోస్టుమార్టం మొదలుపెట్టారు. ఇంతకాలం ఆదర్శ పాలన సాగిస్తున్నామని చెబుతుంటే... కాగ్‌ మాత్రం తమను ప్రజల ముందు దోషులుగా నిలిపిందని కేసీఆర్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.   ప్రభుత్వం చెబుతున్నట్లుగా తెలంగాణ మిగులు రాష్ట్రం కానే కాదని... ముమ్మాటికీ లోటు ఉందని ప్రభుత్వ లెక్కల్లోని డొల్లతనాన్ని ఎండగట్టిన కాగ్.... అప్పులను ఆస్తులుగా చూపడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. FRBM రూల్స్‌‌ ప్రకారం GSDPలో 3.5శాతానికి మించి అప్పులు తీసుకోకూడదనే నిబంధన ఉన్నా.... ప్రభుత్వం 4శాతానికి మించి అప్పులు చేసిందని కాగ్ కడిగిపారేసింది. ఇదే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందనే మాట వినిపిస్తోంది. అప్పులపై కాగ్‌ కొర్రీలు పెట్టడంతో భవిష్యత్‌లో అప్పులు పుట్టవని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. అసలే ఎన్నికలవేళ అన్ని వర్గాలను ఆకర్షించేందుకు కొత్త పథకాలు ప్రకటిస్తే... ఇప్పుడు కొత్త అప్పు పుట్టకపోతే సంక్షేమ కార్యక్రమాల అమలు కష్టమవుతుందని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.   దీనంతటికీ ఆర్ధిక లెక్కల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటమే కారణమని కేసీఆర్‌‌ సీరియస్‌‌ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఆర్ధికమంత్రి ఈటలను, ఆర్ధికశాఖ కార్యదర్శిని పిలిచి గట్టిగా చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. ఆర్ధికశాఖను నిర్వహించడంలో విఫలమయ్యారంటూ ఈటెలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ వ్యయాన్ని కేపిటల్ ఎక్స్ పెండీచర్ లో చూపించడం వల్లే ఇదంతా జరిగిందని గుర్తించిన కేసీఆర్.... ఇది ఆర్ధికశాఖ వైఫల్యానికి పరాకాష్ట అంటూ ఈటలకు చీవాట్లు టాక్ వినిపిస్తోంది. ఆర్ధికశాఖ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వం అప్రతిష్ట కావాల్సి వచ్చిందని కేసీఆర్ ఫైరైనట్లు చెబుతున్నారు. అసలు ఆర్ధికమంత్రిగా మీరేం చేస్తున్నారంటూ ఈటలను గట్టిగా మందలించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాగ్ ఎత్తిచూపిన లోపాలపై ఇంటర్నల్‌ ఆడిటింగ్‌‌‌కు ఆదేశించిన కేసీఆర్‌‌.... అన్నింటిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

ప్రతిపక్షాలు పిల్లులు, కుక్కలు, పాములా..!

మోడీకి భయపడి పిల్లులు, కుక్కలు, పాములు, ముంగిసలు ఒకటయ్యాయి... ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరనుకుంటున్నారా...? ఇంకెవరు మోడీ ప్రియ మిత్రుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఇక్కడ పిల్లులు, కుక్కలు, పాములు ఎవరో అర్దమయ్యే ఉంటది కదా. ప్రతిపక్ష పార్టీలపై అమిత్ షా ఎటకారంగా వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ముంబైలో జరిగిన బీజేపీ పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన... ప్రతిపక్షాలపై దుమ్మెత్రిపోశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణగల నేత అని.. మోడీకి భయపడి ప్రతిపక్షపార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చాయని అన్నారు. అంతేకాదు...బీజేపీ కేవలం 10 మంది సభ్యులతో ప్రారంభమైంది.. ఇప్పుడు పదకొండు కోట్ల మంది బీజేపీకి ఉన్నారు.. ఇప్పుడున్నది బీజేపీ స్వర్ణయుగం కాదని.. పశ్చిమ బెంగాల్, ఓడిస్సా లో కూడా ప్రభుత్లం ఏర్పరిచినప్పుడే బీజేపీకి అసలైన స్వర్ణయుగం వచ్చినట్టుని అన్నారు.   ఇంక రాహుల్ గాంధీపై విరుచుకుపడుతూ ‘‘ఇటీవల మనం రెండు లోక్‌సభ స్థానాలను కోల్పోతే, రాహుల్ గాంధీ స్వీట్లు పంచారు. నేను చూసిన ఇలాంటి మొట్టమొదటి నేత ఆయనే’’ అన్నారు. నేడు బీజేపీ పాలనలో 20 రాష్ట్రాలు ఉన్నాయన్నారు. బీజేపీకి ఇది ఆనందించవలసిన విషయమని చెప్పారు.   ఇక ఇప్పుడే అసలు రచ్చ మొదలైంది. ఎంత మాత్రం సొంత మెజార్టీతో అధికారంలో ఉంటే మాత్రం ప్రతిపక్ష పార్టీలను పిల్లులు, కుక్కలతో పోల్చుతారని..దీంతో వారి అహంకారం మరోసారి బయటపడిందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విభజన హామీలు అమలుచేయకపోగా... పార్లమెంట్ సమావేశాల్లో  ఏ ఒక్క అంశాన్ని చర్చకు రానివ్వకుండా డ్రామాలు ఆడితే... ప్రభుత్వ తీరు నచ్చక ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడం చేతకాక పారిపోయి ఇప్పుడు మమ్మల్ని పిల్లులు, కుక్కలు అంటూ మాట్లాడతారా అంటూ మండిపడుతున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. మరి ఇప్పటికే సామాన్యులు మోడీ ప్రభుత్వంపై మండిపడుతుంటే.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు..

ఆధార్ కు రక్తం, మూత్రం కూడా అడుగుతారేమో..!

  ఈ మధ్య  సంక్షేమ పథకాలకి అయితేనేమి, బ్యాంకులకు గానీ, ఫోన్ నెంబర్లుకు గాను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి ఆధార్ ను లింకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్ ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది విధానపరమైన నిర్ణయం అయినందున న్యాయపరమైన సమీక్ష అవసరం లేదని కేంద్రం వాదనలు వినిపించగా.. కేంద్రం వాదనలు విన్న న్యాయమూర్తులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించరాదని ఇండియాలో దారిద్ర్య రేఖకు దిగువన నిజంగా మగ్గుతున్న వారిని ఆదుకోవాలన్నదే తమ అభిమతమని.. సాంకేతికంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఆధార్ కార్యక్రమం నడుస్తోందని, కోర్టులు ఇందులో కల్పించుకోజాలవని అటార్ని జనరల్ కే కే వేణుగోపాల్ వాదించారు.  ఇక ఈ కేసును విచారిస్తున్నసుప్రీంకోర్టు  కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిర్ణయం పారదర్శకతతో కూడినదా? నిజాయితీతో ఉన్నదా? అన్న విషయాలను మాత్రమే కోర్టు విచారించగలుగుతుందని చెప్పారు. ఈ స్కీమ్ ను, ఆధార్ కార్డును వ్య‌తిరేకిస్తున్నవారి ప‌రిస్థితి ఏంట‌ని ఈ సందర్భంగా ధ‌ర్మాస‌నం కేంద్రాన్ని ప్ర‌శ్నించింది. ప్రస్తుతం వేలిముద్రలు, కనుపాపలు సేకరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టా? కాదా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని, భవిష్యత్తులో ఆధార్ బోర్డు రక్తం, మూత్రం, డీఎన్ఏ నమూనాలను కోరదన్న నమ్మకం ఏంటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

బయటపడిన అన్నాడీఎంకే నిజస్వరూపం..

  పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ.. నన్ను ఎవరూ చూడట్లేదులే అని ఫీల్ అవుతుందట.. అల అన్నాడీఎంకే అసలు నిజస్వరూపం బయటపడింది. కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే అసలు ఉద్దేశం తెలిసిపోయింది. ఒకపక్క ఏపీ రాష్ట్ర ప్రజలు తమకు అన్యాయం జరిగింది.. మాకు కాస్త న్యాయం చేయండిరా బాబు అంటూ ధర్నాలు, రాస్తా రోకోలు, దీక్షలు అంటూ రోడెక్కుతున్నారు. ఇక టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వంపై యుద్దానికి దిగారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పార్లమెంట్ కు కదిలికి వెళ్లారు. అయినా పాడిందే పాటరా అన్నట్టు.. సభ వాయిదాలు పడుతూ.. అవిశ్వాస తీర్మానం మాత్రం చర్చకు రావడం లేదు. దీనికి కారణం అన్నాడీఎంకే నేతల ఆందోళనలు. మొన్నటి వరకూ టీఆరఎస్ కూడా వారి బాటలోనే నడిచినా.. తరువాత మనసు మార్చుకొని ఏపీకి మద్దతుగా నిలుస్తామని చెప్పింది. కానీ అన్నాడీఎంకే మాత్రం తమ ధోరణిని వదలకుండా అలానే ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక స్పీకర్ గారికి ఇదే సాకు దొరికింది. ఇంతమంది అడ్డుగా ఉంటే చర్చ జరపడం కుదరదు అని.. సభను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ అవిశ్వాస తీర్మానంపై చర్చ మాత్రం జరగుకుండా చేస్తున్నారు.   మరి ఇప్పుడు వెల్ లో ఉండి కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే నేతల రాజకీయ డ్రామాలు బయటపడ్డాయి. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం చర్చకు రాకుండా, తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్టు ఆ పార్టీ ఎంపీలు చేస్తున్నదంతా డ్రామానే అనే విషయం వెలుగు చూసింది. తమిళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కావేరీ బోర్డును ఏర్పాటు చేయాల్సిందే అనే డిమాండ్ తో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు సైతం నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే పైకి మాత్రమే నిరాహార దీక్ష అని కలరింగ్ ఇచ్చి.. దీక్ష మధ్యలో పక్కకు వచ్చి, కడుపునిండా భోజనాలు లాగిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో అసలు నిజం బయటపడింది. దీంతో ఇప్పుడు ఈ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు పనిలో పనిగా పలువురు వ్యక్తులు మందు కూడా కొట్టేశారు. దీంకో ఢిల్లీలో అన్నాడీఎంకే నేతలు చేస్తున్నదంతా పొలిటికల్ డ్రామానే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తానికి అన్నాడీఎంకే వెనుక బీజేపీ ఉంది.. బీజేపీనే ఇదంతా చేయిస్తుంది అన్న రూమర్లను ఇప్పుడు నిజంగానే నిజం చేశారు అన్నాడీఎంకే నేతలు. మాకు తాగటానికి నీళ్లు లేవు అంటే వెంటనే నీటిని ఇచ్చినా.. ఆ కృతజ్ఞత కూడా లేకుండా.. మాకు కాస్త సహకరించడయ్యా బాబు అంటే పక్క రాష్ట్రాలతో మాకు పనేంటి అని విర్రవీగిన నేతలు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారో.. తాము చేసే డ్రామాలకు ఎలా కవరింగ్ ఇస్తారో చూద్దాం..

మోడీ నియంత్రణ కోల్పోతున్నారా..!

పాపం.. ప్రధాని మోడీకి తన గ్రాఫ్ పడిపోతుండటంతో.. టెన్షన్ బాగా పెరిగిపోయినట్టుంది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా తన మీద వస్తున్న వ్యతిరేకతను చూసి తట్టుకోలేకపోతున్నట్టున్నారు. అందుకే కొత్తగా తీసుకుంటున్న నిర్ణయాల్లో తడబడుతున్నట్టున్నారు. ఇప్పటికే జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు అంటూ తమకి ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని సామాన్య ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకొని బుక్కయ్యారు. అదేంటంటే... నకిలీ వార్త రాస్తే జర్నలిస్టుల గుర్తింపు (అక్రెడిటేషన్‌) రద్దు చేస్తామని ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇక అంతే ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున  దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ సందర్భంగా ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు గౌతమ్‌ లాహిరి మాట్లాడుతూ.. పత్రికలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదని.. నకిలీ వార్తలపై ఫిర్యాదులుంటే ప్రెస్‌ కౌన్సిల్‌ చూసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.   దీంతో ఇప్పటికే పరిస్థితి దారుణంగా ఉందని గ్రహించిన మోడీ... ఫేక్ న్యూస్ కట్టడి ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్నారు. ఆ ఆదేశాలను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  పీఎంవో సూచన మేరకు ఈ వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.   ఇక ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా... ప్రభుత్వాన్ని ఎప్పుడూ విమర్శిద్దామా అని చూసే ప్రతిపక్షాలకు మంచి పాయింట్ దొరికింది. ఫేక్ న్యూస్ ఆదేశాలను మోడీ వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ముఖ్యంగా మోడీ అంటేనే ఒంటి కాలిపై లేచే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ నిర్ణయంపై స్పందిస్తూ.. ఫేక్ న్యూస్ ఆదేశాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతాయని గ్రహించిన మోదీ సొంత ఆదేశాలపై యూటర్న్ తీసుకున్నారని కామెంట్ విసిరారు. ప్రభుత్వంపై మోదీ నియంత్రణ కోల్పోతున్నారన్న విషయం దీంతో తేటతెల్లమైందని విమర్శించారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..  ఏ మార్గం లేకపోవడం వల్లే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని.. నిత్యం ఓ రాజకీయ పార్టీ ప్రచారం చేస్తున్న ఫేక్‌న్యూస్ సంగతి ఏమిటి? అని పేరు ప్రస్తావించకుండా బీజేపీపై మండిపడ్డారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా దీనిపై స్పందిస్తూ.. ఫేక్‌న్యూస్ ముసుగులో తనకు నచ్చని కథనాలపై ప్రభుత్వం దాడి చేసే అవకాశమున్నదని విమర్శించారు. ఏది ఏమైనా ఒకప్పటి మోడీకి ఇప్పటి మోడీకి చాలా తేడా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు నియంతలా నామాటే వేదం.. నా మాటే శాసనం అన్నట్టు వ్యవహరించిన ఈయన.. ఇప్పుడు కాస్త మెత్తబడ్డారు. అందుకే వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఏం చేస్తారు మరి.. అప్పటిలాగా వ్యవహరిస్తే ఇప్పుడు వర్కవుట్ కాదు కదా.. ఎందుకంటే.. ఈ నాలుగేళ్లలో కావాల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు... అలాగే త్వరలో వివిధ రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి కదా...

విజయసాయిరెడ్డి జగన్ ను టార్గెట్ చేస్తున్నాడా...!

  ఉరుము ఉరిమి మంగలం మీద పడింది అన్న సామెత లాగ... పాపం విజయసాయిరెడ్డి చేసిన పని వల్ల ఇప్పుడు జగన్ కు మరిన్ని సమస్యలు వచ్చిపడేలా ఉన్నాయి. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారని... విజయ్ మాల్యాను చంద్రబాబు నాయుడు కలిశారా? లేదా? అని ప్రశ్నిస్తున్నానని..  దీనిపై బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని మీడియా ముందు రెచ్చిపోయాడు. అంతేకాదు విజయ్ మాల్యా నుంచి రాజకీయ విరాళాల రూపంలో రూ.150కోట్లు సేకరించారా? లేదా?’ అంటూ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు విజయ సాయిరెడ్డి. అయితే విజయసాయిరెడ్డికి ఇలా మాట్లాడటం అలవాటేలే అని కామెడీగా తీసుకున్నా ఇప్పుడు ఈ విషయం సీరియస్ అవుతోంది. చంద్రబాబుపై విజసాయిరెడ్డి చేసిన కామెంట్లపై రగిలిపోతున్న టీడీపీ నేతలు..  అసలు విజయ్ మాల్యాతో వైసీపీ నేతలు ఎవరెవరికి సంబంధాలున్నాయో అన్న విషయాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు.   ఈ నేపథ్యంలోనే సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అది కూడా జగన్ గురించే. లండన్ లో చదువుకుంటున్న జగన్ కూతురు ప్రస్తుత నివాసం.. విజయ్ మాల్యా ఇంట్లోనేనట..!విజయ్ మాల్యాతో వైఎస్ జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయన్న సంగతి తెలిసిందే కదా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు… టీడీపీ ఎంపీగా ఉన్న డీకే ఆదికేశవులునాయుడును.. తన వైపుకు తిప్పుకున్నారు. లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్న ఆదికేశవులు నాయుడు… విజయ్ మాల్యా వ్యాపార భాగస్వామి. ఆ సమయంలో విజయ్ మాల్యాకు..వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పటినుండి ఆ పరిచయం అలా కొనసాగిందట. అంతేకాదు అప్పట్లో కాంగ్రెస్ కు ..గత ఎన్నికలకు ముందు వైసీపీ కూడా.. విరాళాలు..యూబీ గ్రూప్ నుంచి అందాయట. ఇక ఈ పరిచయాలతోనే చదువు కోసం లండన్ కు వెళ్లిన తన కూతురిని విజయ్ మాల్యా నివాసంలోనే ఉంచారట. తన కుమార్తె బాగోగులు చూసుకునేందుకు… అక్కడే ఉంటున్న విజయ్ మాల్యా సహకారం కోరగా.. లండన్ లో తనకు ఉన్న ఓ ఇంటిని జగన్ కూతురి కోసం విజయ్ మాల్యా కేటాయించినట్టు చెబుతున్నారు.   ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డికి తెలుసు.. అయినా కూడా మాల్యా పేరు బాబుతో లింక్ చేసి... ఆ రచ్చలో జగన్ కు ఉన్న సంబంధాలను టీడీపీ ద్వారా ఇన్ డైరెక్ట్ గా బయటకు తీసుకురావాడనికే ఇలా చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క వైఎస్ జగన్ కూడా… విజయసాయిరెడ్డి తీరుపై అసహనానికి గురవుతున్నారట. తెర వెనుక ఏదో జరుగుతోందన్న ఆందోళనకు జగన్ గురువుతున్నారట. మరి నిజంగానే విజయసాయిరెడ్డి జగన్ ను ఇరికించేందుకే ఈ ప్లానే వేశారా...? విజయసాయిరెడ్డి అసలు టార్గెట్ చంద్రబాబా..? లేక వైసీపీ అధినేత జగనా..? అని వైసీపీ నేతలు జుట్టుపీక్కుంటున్నారు..ఏది ఏమైనా విజయసాయిరెడ్డి జగన్ కిందకే నీళ్లు తెచ్చేలా ఉన్నారని సామాన్యులు గుసగుసలాడుకుంటున్నారు..

పూనమ్ దగ్గర పెన్‌డ్రైవ్‌లు... చంద్రబాబు అపాయింట్‌మెంట్‌

  ఇప్పుడున్న ట్విస్ట్ లు చాలవన్నట్టు ఏపీ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో.. ఇక్కడ రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ఉండటానికి రకరకాల డ్రామాలాడుతుంది. దీంతో ఇదంతా వర్కవుట్ కాదులే అనుకొని ఏకంగా చంద్రబాబే రంగంలోకి దిగి ఢిల్లీ వెళ్లారు. అక్కడ వివిధ పార్టీల నేతలతో భేటీ అయి..  ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాలను అన్ని పార్టీల నేతలకు అందజేసి... ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని వివరించనున్నారు.   ఇదంతా ఒకఎత్తైతే ఇప్పుడు మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును సినిమా నటి 'పూనమ్‌కౌర్‌' కలుసుకోబోతోందని...ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇటీవల పవన్, కత్తి మహశ్ వివాదంలో పూనమ్ కౌర్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కత్తి మహేశ్ పూనమ్ కౌర్ గురించి..ఇంకా ఆమె వ్యక్తిగత విషయాలగురించి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక సినిమా నటుడు, పార్టీ అధ్యక్షుడికి ఆమెకు మధ్య సంబంధం ఉందని...ఆమెను అతను మోసం చేశాడని 'కత్తి' ఆరోపించారు. ఈ వివాదంపై అప్పట్లో...పూనమ్‌కౌర్‌ కూడా స్పందించి ట్విట్టర్‌లో కొన్ని వ్యాఖ్యలు చేసి...తరువాత డిలీట్‌ చేసింది. ఆ తరువాత ఏమైందో కానీ... అప్పటివరకూ మద్దతుగా నిలిచిన ఆమె.. పరోక్షంగా సినిమానటుడు, పార్టీ అధ్యక్షుడుపై విమర్శలు గుప్పిస్తోంది. 'కాన్సెప్ట్‌లు కాపీ...చేసి...బట్టలు మార్చినట్టూ...మాటపై నిలబడకుండా...జనాలను అమాయకులను చేస్తూ...అమ్మాయిలను అడ్డం పెట్టుకుంటూ...రాజకీయాలు చేస్తోన్న వారి గురించి భగవంతుడే నిజా నిజాలు తెలియజేయాలని కోరుకుంటున్నా...' అంటూ ఇటీవల ఆమె ట్వీట్‌ చేశారు.   ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె చంద్రబాబును కలవడానికి గల కారణం ఏంటబ్బా అని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇదే సందర్భంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఓ నటుడు గురించి చెప్పడానికే పూనమ్ చంద్రబాబును కలవనున్నారని అంటున్నారు. తనను మోసం చేసిన నటుడుపై చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని ఆమె చంద్రబాబునాయుడును కోరనున్నారట. ఇప్పటికే ఆమె సిఎం అపాయింట్‌మెంట్‌ అడిగారని...ఆమెకు 4వ తేదీన ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరికిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తనను మోసం చేసిన వ్యక్తి గురించి..అందరికీ తెలుసునని..ఆ వ్యక్తి వద్ద ఉన్న పెన్‌డ్రైవ్‌లు..తన వద్ద కూడా ఉన్నాయని..వాటిని సిఎంకు అందజేస్తానని ఆమె చెబుతున్నారట. ఒక వేళ ఆమె కనుక సిఎంను కలసి..పెన్‌డ్రైవ్‌లు ఇస్తే...రాష్ట్ర రాజకీయాలు కీలకమైన మలుపులు తిరుగుతాయని...రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే మీకు స్ట్రైక్ అయి ఉండొచ్చు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.

బాలయ్య హర్ట్....రాజకీయాలకు గుడ్ బై..!

  ఇప్పటికే ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకో ట్విస్ట్ తో.. రోజుకో కొత్త విషయంతో క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం బయటకువచ్చింది. అదేంటంటే... నందమూరి బాలకృష్ణ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీనికి పలుకారణాలు కూడా తెరపైకి వచ్చాయి.   2014 సార్వత్రిక ఎన్నికల్లో బాలయ్య హిందూపురం నుంచి ఎన్నికైన తర్వాత ఆయనకు తెలుగుదేశంలో మంత్రిత్వశాఖ లభిస్తుందని అందరూ ఊహించారు. కానీ వ్యూహాత్మకంగా చంద్రబాబు బాలయ్యను పక్కన పెట్టారు. ఇక ఆతరువాత ఎమ్మెల్యేగా కొనసాగుతూనే నియోజక వర్గాన్ని అభివృద్ది చేశారు. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆ అవకాశం కూడా లేనట్టు తెలుస్తోంది. మరోసారి హిందూపురం నుంచి గెలిచి, పార్టీలో చక్రం తిప్పాలని బాలయ్య భావిస్తున్నా...ఈసారి లోకేష్ ను హిందూపురం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అంతేకాక, తెదేపా అధిష్టానం బాలయ్యను తెలంగాణ టీడీపీ బలోపేతానికి కృషి చేయాలంటూ సూచించడంతో బాలయ్య నొచ్చుకున్నారట. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎంటో అందరికీ తెలిసిందే. దాంతో అక్కడ తెదేపా బలపడుతుందన్న నమ్మకం బాలకృష్ణకు లేదట. దానికితోడు.. ఆయనకు అక్కడ పెద్దగా ఫ్యాన్ బేస్ కూడా లేకపోవడం మైనస్ గా మారుతుందని భావిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో తాను రాజకీయాల్లో కొనసాగడం కంటే, చక్కగా సినిమాలు చేసుకుంటే మేలని బాలయ్య భావిస్తున్నారట. ఇప్పుడు హిందూపురాన్ని కూడా లోకేష్ కు కేటాయించేయడంతో, అల్లుడి మాట కాదనలేని బాలకృష్ణ, మనస్థాపంతో ఇక రాజకీయాలకు పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకున్నారట. మొత్తానికి నందమూరి కుటుంబంలో ఇప్పటికే పురంధరేశ్వరి, హరికృష్ణ చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా వారి జాబితాలో చేరిపోయినట్టున్నాడు. ఏదో అల్లుడు కాబట్టి ఆలోచిస్తున్నాడు.. కానీ లేకపోతే వాళ్లలాగ తన వ్యతిరేకతను బయటపెట్టేవాడేనేమో... చూద్దాం ఇందులో ఎంత నిజముందో...

చిడతలు వాయించినందుకే జగన్ కు ఆ ర్యాంకు... !

  వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌కు 35... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 36.. ఏంటీ నెంబర్లు అనుకుంటున్నారా...? ఏం లేందడీ.. ఈ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకులు ఎవరంటూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ జాబితాను విడుదుల చేసిన సంగతి తెలిసిందే కదా.  2017-18 సంవత్సరానికి గానూ అత్యంత శక్తిమంతమైన 100 మంది భారతీయుల జాబితాను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ విడుదల చేసింది. ఇక ఈ జాబితాలో ప్రధాని మోడీ గారు మొదటి స్థానంలో నిలిచారు. ఆ తరువాత.. స్థానంలో ఆయన ప్రియ మిత్రుడు అమిత్ షా నిలిచారు. అయితే ఇందులో ఆశ్చర్యం ఏం లేదనుకోండి. ఎందుకంటే...ఎలాగూ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ.. అందునా ప్రధాన మంత్రి.. ప్రధాని పదవిలో ఏ వ్యక్తి ఉన్నా శక్తివంతుడే..దీనిలో పెద్దగా చెప్పేదేమీ ఉండదు. గతంలో యూపీఏ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు సోనియాకు ఇదే ర్యాంకు వచ్చింది. అప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు దాన్నీ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు 'మోడీ' భక్తులు చెప్పుకుంటున్నారు అంతే తేడా.   అయితే ఇదే జాబితాలో జగన్‌కు 35... చంద్రబాబు నాయుడికి 36వ ర్యాంకు వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కంటే.. జగనే అత్యంత శక్తివంతుడని సదరు పత్రిక తెలిపింది. అంతేకాదండోయే ఎందకు శక్తివంతమయ్యాడో కూడా ఆ పత్రిక వివరించింది.  ప్రతిపక్షనేత రాష్ట్రంలో బలోపేతం అవుతున్నారని...అందుకే ఆయనకు ఆ ర్యాంక్‌ వచ్చిందని సదరు పత్రిక విశ్లేషించింది. 'జగన్‌' పాదయాత్ర చేస్తూ...ప్రజలను కలుస్తున్నారని..అదే సమయంలో కేంద్రంలోని 'బిజెపి'తో అంటకాగుతున్నందున...ఆయన బలం పెరిగిపోయిందని విశ్లేషించింది. దీనిబట్టి చూస్తే అందరూ అనుకుంటున్న డౌట్లను ఈ పత్రిక క్లియర్ చేసినట్టే కనిపిస్తోంది. ఒక పక్క ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం అంటూనే మోడీతో దగ్గరవ్వడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని.. డ్రామాలు ఆడుతున్నాడని..టీడీపీ నేతలు మండిపడుతూనే ఉన్నారు. ఇప్పుడు వారు చెప్పింది నిజం చేస్తూ ఆ పత్రిక కూడా అదే చెబుతుంది. దీన్నిబట్టి చూస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.. అధికారంలోకి ఉన్నవారికి చిడతలు వాయిస్తే...శక్తివంతమైన నాయకులవుతారన్న విషయం పత్రిక విశ్లేషణ బట్టి అర్ధమవుతోంది.

పవన్ కు జేపీ పంచ్.. కామన్ సెన్స్ ఉండాలి...

  జేఎఫ్సీ కమిటీ అన్నారు.. అందరి నిగ్గు తేల్చుతా అన్నారు... అసలు కేంద్ర ప్రభుత్వం అబద్దం చెబుతుందా.. రాష్ట్ర ప్రభుత్వం అబద్దం చెబుతుందా నిజాలు బయటపెడతా అన్నారు... అఖరికి సైలెంట్ అయిపోయారు... ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఇప్పటికే అర్ధమైపోయి ఉండొచ్చు. ఇంకెవరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జేఎఫ్సీ మీటింగ్ అంటూ హడావుడి చేసి జేపీ, ఉండవల్లి అరుణ కుమార్ వంటి నలుగురు పెద్ద తలకాయలను పక్కనపెట్టుకొని నాలుగు రోజులు హడావుడి చేశారు. ఇక ఒక మీటింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చింది ఏం లేదని..ఇంకా 75 వేల కోట్ల ఇవ్వాలని చెప్పి చెప్పారు. ఇక అంతే అప్పటినుండి ఇప్పటివరకూ కమిటీ అడ్రస్సే లేదు. ఎవరి పనిలో వాళ్లు మునిగిపోయారు. పవన్ అయితే అసలు తాను ఓ కమిటీ ఏర్పాటు చేశాననే సంగతే మర్చిపోయినట్టు ఉన్నాడు.   ఇక ఇలా అయితే వర్కవుట్ కాదని అనుకున్నారేమో జేపీ తానే ఓ కమిటీ ఏర్పాటు చేశారు.  ఇండిపెండెంట్ గ్రూప్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్(ఐజీఎఫ్) పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి తొలి మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన పవన్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జేఎఫ్సీ పై పవన్‌ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపడం లేదని, అది ఒక ఈవెంట్ గా జరిగింది అంటూ, జేపీ ఘాటు వ్యాఖ్యలే చేసారు. లెక్కలు తేల్చిన తర్వాత ఎలాంటి చర్యలు లేవని, అందుకే స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. జేఎఫ్‌సీ తొలిదశ అయితే... నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు...  ఈ బృందంలో మాజీ ఐఏఎస్ పద్మనాభయ్య, ప్రొ.గలాబ్, రాఘవాచారీ, శాంతాసిన్హా, హెచ్ఏ దొర, ఇతర ప్రముఖులుంటారని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లేఖపై కూడా నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందని చెప్పారు...   అయితే జేపీ కమిటీ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. జేపీ ఏర్పాటుచేయబోయే స్వతంత్ర కమిటీని స్వాగతిస్తున్నానని ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యలు, ప్రత్యేక హోదా, ఇతర సమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. ఇక పవన్ ట్వీట్ కు, జేపీ స్పందిస్తూ మరో ట్వీట్ చేసారు...ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం, కామన్ సెన్స్ తో ప్రవర్తిస్తే, అన్నీ పరిష్కారం అవుతాయి అనే నమ్మకం నాకు ఉంది అంటూ, ఒక పంచ్ వేసారు జేపీ. ఇప్పటికే పవన్ పై కన్ఫ్యూజన్ మాస్టర్ అనే ముద్ర పడింది. మరి కన్ఫ్యూజన్ రాజకీయాలు మానేసి..పవన్ ఓ క్లారిటీకి ఎప్పుడు వస్తాడో ఏమో.. లేకపోతే ఇలానే ఉండే ఆయన అభిమానుల్లో కూడా ఇదే కన్ఫ్యూజన్ ఏర్పడి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది..

భయపడేవాళ్లే దేశంలో అత్యంత శక్తివంతమైనవాళ్లట..!

2017-18 సంవత్సరానికి గానూ అత్యంత శక్తిమంతమైన వక్తి ఎవరో తెలుసా..? ఇంకెవరో కాదు...ప్రధాని మోడీ గారే. 2015-16, 2016-17 జాబితాలోనూ మోదీ తొలిస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.  ఈసారి కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.  ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2017-18 సంవత్సరానికి గానూ అత్యంత శక్తిమంతమైన 100 మంది భారతీయుల జాబితాను తాజాగా విడుదల చేసింది. 100 పేర్లతో విడుదల చేసిన ఈ జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఆ వెంటనే రెండో స్థానం ఎవరిదో తెలుసా...? ఆయన కూడా మరెవరో కాదు.. మోడీ ప్రియ మిత్రుడు అమిత్ షా. ఆయన రెండో స్థానంలో ఉన్నారు. షా ఇలా రెండో స్థానంలో నిలవడం ఇది రెండోసారి.   మరి ఈ విషయం తెలిసినా నెటిజన్లు ఊరుకుంటారా..? అప్పుడే మోడీ, షా ద్వయంపై సోషల్ మీడియా సాక్షిగా సెటైర్లు వేసుకుంటున్నారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై స్పందిస్తూ మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన నరేంద్ర మోడీ లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నా ఒక సాధారణ అవిశ్వాస తీర్మానంకు బయపడి పారిపోతున్నారు అని అంటున్నారు. ఇంకా కొంతమందైతే.. దాదాపుగా 15 రోజులుగా సభ సజావుగా లేదు అనే వంకతో సభ వాయిదా వేయిస్తూ అవిశ్వాసాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటుంటే.. మరికొంత మంది మాత్రం... సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాసం పెడితే తిరగబడతారేమో అని వారు భయపడుతున్నారు.. అటువంటప్పుడు వారు అత్యంత శక్తిమంతులు ఎలా అవుతారని కామెంట్లు విసురుతున్నారు. మరి కామెంట్ల సంగతి పక్కన పెడితే.. అందులో ఎంతో కొంత నిజం ఉందని చెప్పొచ్చు. అత్యంత శక్తివంతమైన మోడీ.. అవిశ్వాస తీర్మానానికి భయపడి.. దానిని చర్చకు రానివ్వకపోవడం నిజంగా హాస్యాస్పదం. మరి అలాంటివారు శక్తివంతులు ఎలా అవుతారో.. ఏమో..వారికే తెలియాలి..