సీమాంధ్ర నేతలకి కాంగ్రెస్ ఎర

  రానున్నఎన్నికలలోగా రాష్ట్ర విభజన చేసినా చేయకున్నా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడం ఖాయం. రాష్ట్ర విభజనను పార్లమెంటు ఆమోదిస్తేనే గానీ అడుగు ముందుకు వేయలేదని తెలిసి ఉన్నపటికీ, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసమంటూ భారీ నిధులను కేటాయిస్తూ ప్రకటించవచ్చును. అయితే రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేవరకు అది మీడియా ప్రకటనలకి, కాగితాలకే పరిమితమవుతుంది. అయినప్పటికీ కాంగ్రెస్ వ్యూహం మాత్రం చక్కగా ఫలిస్తుంది.   వాటిని దక్కించుకోవడం కోసం భారీ కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకొంటూ ‘పార్ట్ టైం ప్రజాసేవ’ చేసుకొంటున్న సీమాంధ్రలో అన్నిరాజకీయ పార్టీల యంపీలు, మంత్రులు, శాసన సభ్యులు, రాజకీయ నేతలు పైరవీలు మొదలుపెడతారు గనుక, వారిని లొంగ దీసుకోవడం తేలికవుతుంది. ఈ సారి సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని గెలవడం అసాద్యం. స్థానిక మంత్రులు, యంపీలు, శాసన సభ్యుల వ్యక్తిగత పలుకుబడి, ప్రజాదరణ, కుల సమీకరణాలు, డబ్బు వగైరా అంశాలపైనే కాంగ్రెస్ విజయం ఆధారపడి ఉంటుంది. గనుక ముందుగానే వారికి ఈ కాంట్రాక్ట్ ఎరలు వేసి లోబరచుకొంటే వారి గెలుపుకోసం వారే తిప్పలు పడి గెలిస్తే, గండం గట్టేక్కవచ్చును. ఒకవేళ వారు గెలిచినా గెలువకపోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే తన ఏర్పాట్లు తను చేసుకొని తన జాగ్రత్తలో తను ఉంది.   తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతోనే సగం విజయం సాదించిన కాంగ్రెస్ పార్టీ, కొత్తగా ఏర్పాటు చేసిన మంత్రుల బృందం చేసే హడావుడితో తెలంగాణా ప్రజలకు తెలంగాణా ఏర్పడుతుందనే నమ్మకం కలిగిస్తూ చివరికి రాష్ట్ర విభజన చేయకుండానే ఎన్నికలకి వెళ్ళవచ్చును. ఆవిధంగా చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి మూడు ప్రయోజనాలున్నాయి.   1. కాంగ్రెస్ ను గెలిపిస్తేనే మిగిలిన ప్రక్రియ వేగంగా పూర్తవుతుందనే ప్రచారం చేసుకొని తెలంగాణాలో గెలిచే అవకాశం ఉంది.   2. ఇంత క్లిష్టమయిన సమస్యను ఇంత హడావుడిగా పరిష్కరించేకంటే, ఎన్నికలలో గెలిస్తే తాపీగా చేసే వెసులుబాటు దొరుకుతుంది.   3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు అవసరముంటుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేకపోయినా, భారీగా నిధులు మంజూరు చేసేయడం వలన సీమాంధ్ర ప్రజలు, నేతలు అందరూ కూడా చల్లబరచవచ్చును. కానీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోతే, సరిగ్గా ఇదే అంశం ఆ తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి శాపంగా మారుతుంది.

తీరం దాటనున్న 'ఫైలిన్'

      'ఫైలిన్' తుఫాన్ వేగం పెరిగింది. పారదీప్‌కు 375 కి.మీ దూరంలో , కళింగపట్నానికి 270 కి.మీ దూరంలో, గోపాలపూర్‌కు 345 కి.మీ దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. గోపాలపూర్ వద్ద ఈరోజు తుఫాను తీరం దాటే అవకాశం ఉంది.   తుఫాన్ కారణంగా అన్ని ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జాలర్లు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 'ఫైలిన్' తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సుమారు 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా. 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 6 గంటల్లో తీర ప్రాంతంలో 45-65 కి.మీ వేగంతో గాలలు వీచనున్నాయి. గాలులు క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నానికల్లా గాలుల తీవ్రత 100-150 కి.మీ పెరిగే అవకాశం ఉండగా... సాయంత్రానికి 210-220 కి.మీ మధ్య గాలుల వేగం పెరుగనుంది.

చంద్రబాబు డిమాండ్ నేరవేరినట్లేనా

  ముందు అన్నిసమస్యలకి పరిష్కారం చూపి, సీమంధ్ర ప్రజల భయాందోళనలు పోగొట్టి, ఆ తరువాత రాష్ట్ర విభజనపై అడుగు ముందుకు వేయమని కోరుతూ చంద్రబాబు డిల్లీలో నిరాహార దీక్ష చేసారు.   రాష్ట్ర విభజన కొరకు ప్రత్యేకంగా ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందం నిన్నమొదటి సారి సమావేశమయిన తరువాత, రాష్ట్ర విభజన సందర్భంగా ఎదురయ్యే అన్ని సమస్యలకి నిష్పక్షపాతంగా పరిష్కారాలు చూపుతామని, అదేవిధంగా సీమంధ్ర ప్రజలు, నేతలు లేవనెత్తుతున్నఅన్నిసమస్యలకి పరిష్కరించి, వారి భయాందోళనలు తొలగిస్తామని ప్రకటించారు.   ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్నహోం మంత్రి సుషీల్ కుమార్ షిండే మాట్లాడుతూ తమ బృందం రాష్ట్ర విభజనపై పూర్తి నివేదిక తయారు చేసిన తరువాతనే, అది క్యాబినెట్ ముందుకు, అక్కడి నుండి రాష్ట్రపతికి, శాసనసభకి, పార్లమెంటుకి వెళుతుందని తెలిపారు.   అంటే తెదేపా కోరుతున్నట్లుగానే ముందు సమస్యలను పరిష్కరించిన తరువాతనే పార్లమెంటు ఆమోదానికి వెళ్ళబోతోందన్న మాట. అంటే చంద్రబాబు డిమాండ్స్ కు కేంద్రం అంగీకరించినట్లే భావించవచ్చును. కానీ, అంటోనీ కమిటీ వంటి ఒక డమ్మీ కమిటీని సృష్టించి దానితో టీ-నోట్ వరకు ఎంతో చాకచక్యంగా వ్యవహారం నడిపించిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు మంత్రుల బృందంతో మాత్రం అదే విధంగా కధ నడిపించదని భావించలేము.

ఆర్టీసీ కదిలింది

      రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని డిమాండ్ తో చేపట్టిన సమ్మెను సీమాంధ్ర ఆర్టీసీ కార్మికులు విరమించుకున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకోవడంతో తిరిగి బస్ ల రాకపోకలు ఆరంభమయ్యాయి. ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే ఖాన్ ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. రాత్రి 10.30 గంటల సమయంలో చర్చలు ఫలించాయి. సమ్మెను విరమించుకుంటున్నామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరి వీరు సమ్మె చేసింది సమైక్య రాష్ట్రం కోరుతూనా?లేక వీరి డిమాండ్ల కోసమా?

టీ-నేతల డ్రామాని కొనసాగిస్తున్న సీమంధ్ర నేతలు

  ఇంతకు మునుపు టీ-కాంగ్రెస్ నేతలు ప్రజల బారి నుండి తమను తాము కాపాడుకోవడానికి అధిష్టానాన్నివిమర్శిస్తూ, తెలంగాణా ఈయకపోతే పార్టీ నామరూపాలు లేకుండా మాయమయిమ పోతుందని శాపనార్ధాలు పెడుతూ, పార్టీని వీడిపోతామని 'చాయ్ బిస్కట్ సమావేశాలు' పెట్టుకొంటూ, పార్టీకి నెలకో కొత్త డెడ్-లయిన్లు పెడుతూ రోజులు దోర్లించుకొంటూ పోయి చివరికి ఎలాగయితేనేమి తమ పదవులు కాపాడు కోగలిగారు. వారి అదృష్టం కొద్దీ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తెలంగాణా కూడా ఇచ్చేస్తోంది. ఇప్పుడు ఆ డ్రామా కొనసాగించడం సీమంధ్ర కాంగ్రెస్ నేతల వంతయింది. ఈ డ్రామాలో సన్నివేశాలు అన్నీ తెలంగాణా నేతల డ్రామాలోవే, కాకపోతే పాత్రదారులు మారారు.   1.రాష్ట్ర విభజన చేస్తే (తెలంగాణా ఈయకపోతే) పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది.   2.రాష్ట్ర విభజన చేయడం (తెలంగాణా ఈయకపోవడం) వలన అధిష్టానం చాలా తప్పు చేస్తోంది.   3.టీ-నోట్ పై అడుగు ముందుకు వేస్తే, (తెలంగాణాపై జాప్యం చేస్తే) శాసన సభలో టీ- బిల్లు పెడితే, ( పెట్టకపోతే) పార్లమెంటులో టీ-బిల్లు పెడితే (పెట్టకపోతే), న్యాయపోరాటంలో ఓడిపోతే, రాష్ట్ర విభజన జరిగిపోతే (తెలంగాణా ఏర్పాటు చేయక పోతే) రాజీనామాలు చేసేస్తాము. డెడ్-లయిన్లన్నమాట!   4. తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ సమావేశాలలో చాయ్, కారా బిస్కట్లు, సమోసాలు లైక్ చేస్తే, సీమాంద్రా కాంగ్రెస్ నేతల సమావేశాలలో కాఫీ, బ్రిటానియా బిస్కట్లు ఉండవచ్చును. కానీ రెండు ప్రాంతాల నేతలు ఒకే డ్రామాని కొనసాగిస్తున్నందున ఇరువురూ బిస్లిరీ నీళ్ళే తాగుతారు.

కాంగ్రెస్ కపట వైఖరి

  ఇంతవరకు సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులు టీ-నోట్ ఆమోదం పొందేవరకు ప్రజలను ఏవిధంగా మభ్యపెడుతూ వచ్చేరో, అదేవిధంగా ఇప్పుడు ‘రానున్నఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరగదు’, ‘శాసనసభలో బిల్లును అడ్డుకొంటాము’, ‘న్యాయ పోరాటం చేస్తాము’, నేను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర విభజన జరుగదు’, ‘పార్టీ కంటే ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం’ అని ముఖ్యమంత్రితో సహా సీమంధ్ర కాంగ్రెస్ నేతలు పలుకుతున్నచిలుక పలుకులు కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టేందుకే.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్నిఎంత దిక్కరిస్తున్నట్లు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అడ్డుతగులుతున్నట్లు వ్యవహరిస్తున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం రెండు సార్లు గట్టిగా చెప్పగానే రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఉద్యోగులను, కేవలం రెండే రెండు సమావేశాలతో చల్లార్చివేయగలిగారు. (దేవుడే పంపినట్లు పైలాన్ తుఫాన్ కూడా సమయానికి వచ్చి అందుకు సహాయపడింది.) అందుకే కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రమశిక్షణ గల నాయకుడని దిగ్విజయ్ సింగ్ పొగుడుతారు. ప్రదేశ్ సమన్వయ కమిటీలో కిరణ్ కుమార్ రెడ్డి సభ్యత్వం మళ్ళీ రెన్యువల్ అవుతోటుంది.   ఒకవైపు రాష్ట్రంలో పరిస్థితిని మెల్లగా అదుపులోకి తెస్తూనే మరో వైపు రాష్ట్ర విభజన ప్రక్రియను కూడా సమాంతరంగా ముందుకు నడిపిస్తోంది. అయితే మెల్లగా ముందుకు కదులుతూనే అసలు నిలుచున్నా చోట నుండి అంగుళం కూడా ముందుకు కదలనట్లు కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా నటించేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే దిగ్విజయ్, షిండే, చాకో నిత్యం మీడియా ముందుకి వచ్చి ఒకరికొకరు పొంతనలేని మాటలు మాట్లాడుతూ,అసలు కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేస్తుందా లేదా? అనే అయోమయ పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఒకరు ఎన్నికలలోగా రాష్ట్ర విభజన చేసేస్తామని అంటే మరొకరు మంత్రుల బృందం పని కానిచ్చేందుకు నిర్దిష్ట సమయం ఏమీ లేదని చెపుతూ రాష్ట్ర విభజన ఇప్పుడప్పుడే సాధ్యం కాదన్నట్లు మాట్లాడుతారు.   అదేవిధంగా ఇక్కడ సీమాంధ్రాలో తన నేతల చేత కూడా పరస్పర విరుద్దమయినా మాటలు, రోజుకొక రకమయిన వాదనలు చేయిస్తూ ప్రజలలో గందర గోళం సృష్టిస్తూ, మరో వైపు మెల్లగా తన పనికానిస్తోంది. శాస్త్రీయంగా, సామరస్య వాతావరణంలో జరుపవలసిన విభజన ప్రక్రియను ఇటువంటి కపటమయిన పద్దతిలో చేస్తోంది. ఇందుకు కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్వయంగా ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. అయినా తన ఏర్పాట్లు తను ముందే చేసుకొంది గనుక దైర్యంగా, చాటుగా ముందుకు సాగుతోంది.  

రాష్ట్ర విభజనపై బీజేపీ కూడా ద్వంద వైఖరి

  తెలంగాణా ప్రజల ఆకాంక్షలను తీర్చేఉద్దేశ్యంతో కాక, కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ, సీమంద్రాలో తన పార్టీని పణంగా పెట్టి మరీ తెలంగాణా ఏర్పాటు చేస్తోందనేది కాదనలేని నిజం. రాష్ట్ర విభజనతో కేసీఆర్, జగన్ లద్వారా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచేందుకు అవసరమయిన యంపీలను పొందాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఏదోవిధంగా ఈ పని పూర్తిచేయాలని గట్టి పట్టుదలతో ఉంది. కానీ సీమాంధ్ర నుండి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేఖత, ఒత్తిళ్ళ కారణంగా కొంచెం మెల్లగా పోవలసి వస్తోంది.   సరిగ్గా ఈ కారణం చేతనే బీజేపీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలాగే వ్యవహరిస్తోంది. మోడీ హైదరాబాదు పర్యటనలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడితే, వెంకయ్య నాయుడు సమన్యాయం పల్లవి అందుకొన్నారు. ఆ తరువాత ఆ పార్టీ నేత సుష్మా స్వరాజ్ తెలంగాణాకు తమ పార్టీ అనుకూలమని, పార్లమెంటులో బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కానీ ఈ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తమ పార్టీ ‘విద్వేషాలతో కూడిన విభజన కోరుకోవట్లేదని’ కొత్త మాట చెప్పి పార్టీ వైఖరికి మరో కొత్త ట్విస్ట్ ఇచ్చారు.   రాష్ట్రంలో బీజేపీ గెలుపోటముల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కనుక ఆ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలోకి రావడానికి అనువైన వైఖరినే తెలంగాణా విషయంలో కూడా అవలంబిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టే తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయడం వలన బీజేపీకి తెలంగాణాలో కొత్తగా ఒరిగేదేమీ ఉండదు.   ‘తెలంగాణా ఇచ్చిన ఘనత మాదే’ అంటూ టీ-కాంగ్రెస్ నేతలు అప్పుడే విజయోత్సవాల పేరిట డప్పుకి సిద్దపడుతుంటే, ‘మా పోరాటం వలనే తెలంగాణా వచ్చిందని’ తెరాస చాటింపు వేసుకొంటోంది. అందువల్ల ఇక అక్కడ బీజేపీకి జాగా లేదు. అటువంటప్పుడు బిల్లుకి మద్దతు ఇవ్వడం కంటే ఏవో కుంటి సాకులు చెప్పి తప్పుకొని తెలంగాణా బిల్లును నిలిపి వేయగలిగితే, అది కాంగ్రెస్-తెరాసల బంధాన్ని దెబ్బ తీస్తుంది.   తెలంగాణా ఏర్పాటుకి సహకరిస్తే అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయిన తమకు పెద్దగా తేడాలేదని ముందే కేసీఆర్ ప్రకటిస్తున్నారు. గనుక, తెలంగాణా ఏర్పాటుకి సహకరించి, కాంగ్రెస్-తెరాసలను స్వయంగా గెలిపించి తెరాసను కాంగ్రెస్ చేతిలో పెట్టడం కంటే, బిల్లుని ఆపి తెరాసను గెలిపిస్తే, ఒకవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే తెరాస మద్దతు తీసుకొని అప్పుడు తాపీగా తెలంగాణా ఏర్పాటు చేయవచ్చునని బీజేపీ వ్యూహం కావచ్చును. అందుకే బీజేపీ కూడా తెలంగాణపై రోజుకొక మాట మాట్లాడుతోంది.

భయపెడుతున్న 'పైలాన్ తుఫాన్'

      ఆంద్ర ప్రదేశ్ లోని సముద్ర తీర ప్రాంతాలను ఈ పైలాన్ తుఫాన్ వణికిస్తోంది. గత 120 సంత్సరాలలో ఇది 74 వ పెను తుఫాన్ గా వాతావరణ శాఖ పరిశోధకులు తెలియ చేస్తున్నారు. దీని ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్టణం జిల్లాల మీద ఎక్కువగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పలు చోట్ల సముద్రం ముందుకు చోచ్చుకోస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భయం గుప్పిట్లో తీర ప్రాంత ప్రజలు ఉన్నారు. విశాఖ వద్ద సముద్రం అల్లకల్లోలం గా ఉంది. రాష్ట్రానికి ఈ తుఫాన్ కారణంగా పెను ముప్పు పొంచి ఉంది. రేపు సాయత్రం ఒరిస్సాలోని గోపాలపూర్ వద్ద తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలియ చేస్తున్నారు. కళింగపట్నానికి 450 కిలోమీటర్ల దూరంలో పైలాన్ తుఫాన్ కేంద్రికృతమై ఉన్నట్లు సమాచారం.

చంద్రబాబు దీక్ష భగ్నం

    Video courtesy ETV2   తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమరణ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం భగ్నం చేశారు. రాష్ట్ర విభజన ఆపాలని, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని, ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా గత ఐదు రోజులుగా ఢిల్లీలోని ఏపీభవన్ లో నిరహార దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని వైద్యులు చెప్పడంతో ఉదయం నుండి ఏపీ భవన్ రహదారులు బంద్ చేసిన పోలీసులు బలవంతంగా బాబును రామ్ మనోహన్ లోహిలా ఆసుపత్రికి తరలించారు. బాబు తరలింపును అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. చంద్రబాబు నాయుడు దీక్ష దేశాన్ని ఆకర్షించిందని, ఆయన దీక్ష మూలంగానే కేంద్ర ప్రభుత్వం కదిలిందని, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు తెలుగు ప్రజల కొరకు పోరాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.

విభజన ప్రకటనలపై కిరణ్ ఆగ్రహం

      రాష్ట్ర విభజనపై హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటన పై పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కు ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభ్యంతరం చెప్పారని వార్తలు వచ్చాయి. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయం విషయంలో సుశీల్ కుమార్ షిండే ఒక మాట, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అయిన మీరు ఒక మాట చెబుతున్నారు. ఇద్దరూ వేర్వేరు ప్రకటనలు చేయడం ఏమీ బాగోలేదు. ఇది ప్రజలను ఆందోళన పరుస్తోంది. విభజనకు సంబంధించిన తీర్మానం రాష్ట్ర శాసన సభకు వస్తుందని మీరు చెప్పారు. ఇప్పుడు షిండే తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తుందని అంటున్నారు. మీరు చెప్పారని నేను ఏపీఎన్జీఓలకు నచ్చజెప్పాను. ఇప్పుడు ఇలా చేస్తే ఎలా” అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

బెయిలు షరతులు సడలింపుకు జగన్ కొత్త ఎత్తు

  హైదరాబాద్ విడిచి బయటకు వెళ్ళరాదనే షరతుకి అంగీకరిస్తూ రెండు వారల క్రితం బెయిలుపై జైలు నుండి విడుదల అయ్యి బయటకు వచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ షరతుని అదిగమించేందుకు ఇప్పుడు సరికొత్త ఎత్తు వేసారు. రాష్ట్రంలో నెలకొన్నఅనిశ్చిత పరిస్థితికి ప్రజలు చాలా ఆందోళన చెందు తున్నారని, ఇటువంటి సమయంలో బాధ్యతగల ఒక ప్రజాప్రతినిధిగా వారికి బాసటగా నిలవడం తన కర్తవ్యమని, అందువల్ల బెయిలు షరతులు సడలించి తనకు రాష్ట్రంలో పర్యటించేందుకు గాను అనుమతించాలని కోరుతూ ఆయన ఈ రోజు సీబీఐ కోర్టులో ఒక పిటిషను వేసారు.   ఆ వాదన ఎలా ఉందంటే ఆయన వచ్చి ప్రజలను ఓదార్చకపోతే వారు అలా బాధపడుతూనే ఉంటారన్నట్లుంది. ఒకవైపు కేంద్రం రాష్ట్ర విభజన ప్రక్రియ చేసుకుపోతుంటే, ఆయన నిరాహార దీక్షలు చేయడం, సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమాలు నడపడం కేవలం తన పార్టీని బలపరుచుకోవడానికేనని ప్రజలకి తెలుసు. ఆ క్రమంలోనే ఆయన పార్టీలోకి కాంగ్రెస్ శాసన సభ్యులు, యంపీలు వరుసకట్టి వస్తున్నారు.   సాధారణ ఎన్నికలకు కేవలం ఆరు నెలలు మాత్రమే సమయం మిగిలినందున, ఆయన ఇప్పుడు తన పార్టీని బలపరుచుకోవడానికి సీమంద్రా పర్యటనకి బయలుదేరాలనుకొంటున్నారు. అయితే అందుకు ఆయన చెపుతున్న కారణాలు మాత్రం వేరే విదంగా ఉన్నాయి.   తను చాలా బాధ్యత గల ప్రజాప్రనిధినని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లయితే, ఆయన ఎలాగు సమైక్యంద్రానే కోరుకొంటున్నారు గనుక, ముందుగా తెలంగాణాలో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకొని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఎక్కడ ఆగిపోతుందోనని తీవ్ర భయాందోళనలు చెందుతున్న తెలంగాణా ప్రజలను ముందుగా ఓదార్చితే బాగుటుంది. కానీ కేవలం సీమంద్రాలో ప్రజలనే ఓడార్చాలనుకొంటే, ఆ మిషతో పార్టీని బలపరచుకొనే ప్రయత్నంగానే భావించవలసి ఉంటుంది.

బాబు దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు సిద్దం

  గత ఐదు రోజులుగా డిల్లీలో ఏపీ భవన్ వద్ద చంద్రబాబు చేస్తున్నఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు రంగం సిద్దమయింది. ఆయన ఆరోగ్యపరిస్థితి క్రమంగా విషమిస్తుండటంతో అప్రమత్తమయిన హోం శాఖ , వైద్యులతో కూడిన ఒక అంబులెన్స్ ను కొద్దిసేపటి క్రితమే దీక్షావేదిక వద్దకు పంపింది. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సాయంత్రంలోగా ఎప్పుడయినా పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించవచ్చును.   ఆయన కోసం స్థానిక ఆసుపత్రిలోఒక గది (రూమ్ నెంబర్:6) ను కూడా సిద్దం చేసి ఉంచింది. పోలీసులు దీక్షా స్థలికి చేరుకోవడంతో అక్కడ ఉన్న తెదేపా నేతలు, కార్యకర్తలలో ఆందోళన మొదలయ్యింది. అయితే దీక్షను భగ్నం చేయడం అనివార్యమని అందరికీ తెలిసిన విషయమే.   తెలుగు ప్రజలకు న్యాయం జరిగే చ్వరకు డిల్లీ నుండి కదలనని భీషణ ప్రతిజ్ఞా చేసిన చంద్రబాబు మరి దీక్ష భగ్నం అయిన తరువాత డిల్లీలోనే మఖం వేసి తన ప్రయత్నాలు కొనసాగిస్తారా లేక రాష్ట్రానికి తిరిగి వచ్చి తన ఆత్మా గౌరవ యాత్రలు మొదలు పెడతారా తెలుసుకోవాలంటే మరో రెండు మూడు రోజులు వేచి చూడాలి.   ఏమయినప్పటికీ ఆయన దీక్ష వల్ల రాష్ట్ర విభజన సమస్య గురించి ఇప్పుడు జాతీయ నాయకులకు, జాతీయ మీడియాకు ఆసక్తి పెరిగింది. ఇంతవరకు ఈ వ్యవహారంలో వారు చూడని అనేక రాజకీయ కోణాలు ఆయన తన దీక్షా సమయంలో బయటపెట్టి, వారి మద్దతు కూడా గట్టగాలిగారు.

ఉద్యోగులు ఒక్కరుగా సమ్మె నుండి విరమణ

      సీమాంధ్ర ఉద్యోగులు ఒక్కరుగా సమేనుండి విరమిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలకు కరెంటు కష్టాలు తీరనున్నాయి. పిల్లలు స్కూళ్ళకు వెళ్లనున్నారు. ఇది మంచి పరిణామమే. అయితే సమ్మె విరమించిన ఉద్యోగస్తుల జె.ఏ.సి లు మాత్రం తమ సమస్యలపై ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించారని, రాష్ట్రం విడిపోకుండా చూసే భాధ్యత తనదని హామీ ఇచ్చినందున సమ్మె విరమిస్తున్నట్లు వారు చెబుతున్నారు. మరి మరో వైపు కేంద్రం నుండి పెద్ద సంఖ్యలో బలగాలు సీమాంధ్ర లో మోహరిస్తున్నాయి. మరో పక్క కేంద్ర హోమంత్రి షిండే అసెంబ్లీ కి తీర్మానం రాదనీ బిల్లు మాత్రమే వస్తుందని చెపుతున్న నేపధ్యంలో రాష్ట్ర విభజన జరగకుండా ముఖ్యమంత్రి ఎలా ఆపగలరొ ప్రజలకు ఏమి అర్ధం కాని గందరగోళ పరస్థితి నెలకొంది. ఉద్యోగస్తులు వారి సమస్యల విషయమై హామీ పొందారు సరే,కాని సామాన్య ప్రజానీకమైన రోజు కూలీలు మిగిలిన బడుగు బలహీన ప్రజలకు ఎవరు ఎలాంటి హామీ ఇస్తారని పలువురు సందేహ పడుతున్నారు. ఈ సమ్మె నేపధ్యం లో సామాన్య ప్రజానీకమే ఈ 72 రోజులుగా నానా యాతనలు పడ్డారే కానీ ఏ నేతలు కాదు. మరి ఏ ఒడంబడికల నేపధ్యంలో సమ్మె విరమించుకున్నారో సదరు ఉద్యోగస్తుల జె.ఏ.సి లు ఇన్నాళ్ళు సమ్మె ల తో అష్ట కష్టాలు అనుభవించిన ఈ సామాన్య ప్రజానీకానికి మాత్రం వివరించ వలసిన బాధ్యత ఉన్నదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

స్వరం మార్చిన వెంకయ్య

        తాము అధికారం లోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని బి.జె.పి ప్రకటించిన విషయం తెలిసిందే. మొన్న మహబూబ్ నగర్ లో జరిగిన బి.జె.పి బహిరంగ సభలో సుష్మ స్వరాజ్ ఈసారి కనుక తెలంగాణా ఇవ్వకుంటే తనే స్వయంగా ఉద్యమంలో పాల్గొంటానని హెచ్చరించారు. మొన్న కాంగ్రెస్ కేబినేట్ నోట్ తెలంగాణ పై నోట్ ఆమోదిస్తే ఆ నోటును బి.జె.పి ఆహ్వానించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ను గుజర్రత్ కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో నిర్వహించిన బి.జె.పి బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.ఇవన్ని ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా బి.జె.పి అగ్రనేతలలో ఒకరైన మాజీ మంత్రి వెంకయ్యనాయిడు తెలంగాణ పై తన స్వరం మార్చారు. మొన్నటి వరకు తెలంగాణ అంశం త్వరగా తేల్చాలని పట్టుబట్టిన ఆయన ముందు సీమాంద్ర ప్రాంత సమస్యలు పరిష్కరించి ఆతర్వాత రాష్ట్రాన్ని విభజించాలని సూచించారు. అసలు ఇప్పటి వరకు సీమాన్ధ్రులు విభజన అనంతరం తాము ఎడుర్కొనబోయే సమస్యలు ఏమిటో చెబుతున్న వాటిపై బి.జె.పి తన దృష్టిని సారించలేదు. హైదరాబాదు విషయం లోను ఎలాంటి అభిప్రాయాన్ని కాని సూచనను కానీ చేయలేదు. నదీ జలాల సమస్యలు,ఉద్యోగాల సమస్యల పై తమ వైఖరేమిటో బి.జె.పి ఇంతవరకు ఏవిధమైన స్పష్టతను తెలియ చేయ లేదు. మరి ఈ సమస్యలన్నిటి మీద వెంకయ్యనాయుడు ఐన ఒక సీనియర్ నేతగా తన నిర్ణయాన్ని తెలియచేస్తారా అంటే అది సందేహమే!ఒక పక్క సుష్మాస్వరాజ్ తెలంగాణ ఇవ్వకుంటే ఉద్యమిస్తానంటారు,మరోపక్క వెంకయ్య నాయుడు సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాకే విభజన చెయ్య మంటారు. ప్రతి రాజకీయ పార్టీకి తెలంగాణ అంశం ఒక ఆట వస్తువుగా తయారైంది . ప్రతి నేత ఇరుప్రాంత ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. మరిస్వరం మార్చిన బి.జె.పి నేత వెంకయ్య నాయుడు ను తెలంగాణ ప్రాంత నేతలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.