ఏపీలో బదిలీలపై నిషేధం ఎత్తివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీలపై ఉన్న నిషేధాన్ని నెల రోజులపాటు ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలరోజుల్లో మండల స్థాయి పదవులలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని స్థాయుల్లో ఉద్యోగులను బదిలీ చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా వున్నాయి.
1. ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ని కరువు లేని రాష్ట్రంగా మార్చాలని నిర్ణయం.
2. ఐటీ కంపెనీలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాయితీ. ఒక్కో ఉద్యోగికి 60 వేల రూపాయల చొప్పున రాయితీ. ఐటీ కంపెనీల విద్యుత్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ.
3. భూగర్భ జలాలు పెంచడానికి నీరు-చెట్టు కార్యక్రమం.
4. ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో అన్న ఎన్టీఆర్ క్యాంటిన్లు. తక్కువ ధరకే ఆహారాన్ని అందించే ఎన్టీఆర్ క్యాంటిన్లు.
5. మాఫియాకి అడ్డుకట్ట వేయడానికే మహిళలకు 25 శాతం ఇసుక రీచ్‌లు.
6. పాఠశాలల్లో హాజరు శాతం పెంచడానికి బయో మెట్రిక్ విధానం అమలు.
7. విశాఖ, వీజీటీఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి)లో మెట్రో రైలు ఏర్పాటు.