ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు...
posted on Aug 1, 2014 @ 3:24PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
1. బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి.
2. ఈనెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలి.
3. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి.
4. ఆలయాల పాలకమండళ్ళను రద్దు చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలి.
5. ఇసుక రీచ్‌ల్లో 25 శాతం డాక్రా మహిళలకు అప్పగించాలి.
6. పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు పథకాల సమీక్ష జరపాలి.