ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు... ఇద్దరు సీఎంలకు కిషన్ రెడ్డి హితువు

తెలంగాణ జీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు రాష్ట్రాల సీఎంలకు ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే ఇద్దరు మంత్రులు మానసిక ప్రశాంతత కలిగి ఉండాలని.. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నోటుకు ఓటు కేసు గురించి పట్టించుకోవడానికి న్యాయస్థానాలు, ఏసీబీ ఉందని.. ఈ వ్యవహారంపై తాము ఇవ్వాల్సిన నివేదిక ఇచ్చామని తెలిపారు. కాగా జీజేపీ టీడీపీ పొత్తు విషయమై మాట్లాడుతూ తప్ప, ఒప్పులు తేలిన తరువాతే పొత్తుల విషయం చూద్దామని వ్యాఖ్యానించారు. అలాగే ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదని కిషన్ రెడ్డి... ఇద్దరు సీఎంలకు హితవు పలికారు. ఈనెల 21న యోగా దినం సందర్భంగా .. సంజీయ్యపార్కులో ఉ. 7 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు

బెల్లీ బటన్ టచ్ ఛాలెంజ్..

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఏదో ఒక ఛాలెంజ్ అంటూ ఎప్పుడూ బిజీగానే ఉంటాయి. అప్పుడెప్పుడో ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ కొన్ని రోజులు హడావిడి చేశారు. తరువాత ఫైర్ ఛాలెంజ్ కూడా అయిపోయింది. ఇంకేం ఛాలెంజ్ పెట్టాలా అని బాగా ఆలోచించారో ఏమో చైనా వాళ్లు ఓ కొత్తరకం ఛాలెంజ్ ను తీసుకొచ్చారు. అదే బెల్లీ బటన్ టచ్ ఛాలెంజ్. అంటే మీ చేతిని వెనకనుంచి ముందుకు తీసుకొచ్చి మీ బొడ్డును ముట్టుకోవడం. ఇప్పటికే చైనా నెటిజన్లు ఈ ప్రయోగం చేస్తూ తెగ బిజీ అయిపోయారట. అందులోనూ టీనేజ్ అమ్మాయిలే ఎక్కువమంది ఉన్నారట. అయితే ఈ ఛాలెంజ్ కు ఒక్కరోజులోనే కోటి 30 లక్షల మంది చూశారని.. దాదాపు 1,04,000 కు పైగా చర్చలు జరగడంతో ఫుల్లు క్రేజ్ వచ్చేసింది.

స్టీఫెన్ సన్ వాంగూల్మం.. ఏసీబీ దూకుడు

నోటుకు ఓటు కేసులో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో తీసిన ఆడియో, వీడియో రికార్డింగులు, ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లాయి. వాటికి సంబంధించిన నివేదిక కూడా రెండు మూడు రోజుల్లో రానుంది. మరోవైపు ఈ కేసులో తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం చాలా కీలకంగా మారనుంది. స్టీఫెన్ సన్ ఇచ్చే వాంగూల్మం బట్టి ఏసీబీ బరిలో దిగనుంది. అతను ఏ పేర్లు చెపుతాడో దాని బట్టి వారికి నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉంది ఏసీబీ. విచారణలో నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలనుండి సేకరించిన సమాచారాన్ని ఏసీబీ కోర్టుకు సమర్పించారు. దీనిలో కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ కు అర్హత లేదు... జేసీ

రేవంత్ రెడ్డి కేసుపై టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ కేసీఆర్ పై తిట్ల వర్షం కురిపించారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏం చేయలేడని అన్నారు. అసలు ఏసీబీ విడుదల చేసిన ఆడియో రికార్డింగుల్లో చంద్రబాబు ఎక్కడా డబ్బు గురించి కానీ.. ఓటు గురించి కానీ ప్రస్తావించలేదని.. ఈ రికార్డులను అడ్డంపెట్టుకొని పార్టీ ని దెబ్బతీయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడే ఆడియో టేపులను ఎందుకు విడుదల చేయలేదని.. చంద్రబాబు ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలన్నీ గుదిగుచ్చి ఒకచోట చేర్చి ఆడియో టేపులని నాటకాలాడుతున్నారని అన్నారు. మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టి తమ పార్టీలోకి చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు.

రేవంత్ రెడ్డి అప్రూవర్? కోర్టులో కేసుకు తెదేపా దీర్ఘాలోచన

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏసీబీ  దర్యాప్తు ముమ్మరంగానే జరుగుతుంది. దీనిలో భాగంగానే స్టీవెన్ సన్ తో చంద్రబాబునాయుడు మాట్లాడిన సంభాషణలు ఆడియో రికార్డింగులు.. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడిన ఆడియో, వీడియో రికార్డింగులు ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లాయి. ఈ రికార్డింగులకు సంబంధించిన నివేదిక కూడా ఇంకో రెండు మూడు రోజుల్లో రానుంది. కాగా మరోవైపు రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కు ఇచ్చిన 50. లక్షల డబ్బు గురించి.. మిగిలిన 4.5 కోట్లు గురించి... రేవంత్ బాస్ అని ఎవరిని సంభోదించారు అని సమాచారం తెలుసుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఆ నివేదిక కూడా వచ్చిన తరువాత.. స్టీఫెన్ సన్ స్టేట్ మెంట్ కూడా తీసుకేవండం ఆలస్యం ఏసీబీ చంద్రబాబుతో పాటు మరికొంత మందికి నోటీసులు జారీ చేసే ప్రయత్నలో ఉంది. ఏసీబీ కాని స్టీఫెన్ సన్ నుండి స్టేట్ మెంట్ తీసుకున్నట్టయితే ఏసీబీ చేతిలో మూడు ఆప్షన్ లు ఉన్నాయి. 1. స్టీపెన్ సన్ ఎవరి పేర్లు చెపుతాడో వారికి నోటీసులు 2. వాళ్ల ఇళ్లకి వెళ్లి సోదాలు 3. లేదా ప్రశ్నాపత్రాలే వాళ్లకి పంపించడం.   మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తమతో పాటు మరో 200 మంది ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురయ్యాయని ప్రధాని నరేంద్రమోడీకి విన్నవించగా కేంద్రం కూడా ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై గుర్రుగా ఉంది. ఈనేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పై లీగల్ యాక్షన్ తీసుకునే సమాలోచనలో పడింది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది సరైనది కాదని అందువల్ల న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే దీర్ఘాలోచనలో తెదేపా నేతలు ఉన్నారు. అంతేకాక హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని సెక్షన్ 8 ప్రకారం బాధ్యతలు గవర్నర్ కి అప్పగించాలని కూడా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది.   ఇదిలా ఉండగా కేంద్రంతో భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని వెతికే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వినికిడి.. ఒక వేళ తను అప్రూవర్ గా మారితే తెదేపా రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించాల్సిందే. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కేసు వల్ల ప్రస్తుత రాజకీయలు గరంగరంగా తయారవుతున్నాయి అనడంలో సందేహం లేదు. రోజుకో మలుపు.. రోజుకో వార్త.

చంద్రబాబుతో పోటీ పడలేకే... కంభంపాటి

ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుందని.. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా నేరమని మండిపడ్డారు. తెలంగాణ లో తెదేపాకు వస్తున్న ప్రజాదారణను చూసి ఓర్వలేక ఏలాగైనా దెబ్బతీయాలనే ఫోన్ ట్యాపింగ్ లాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. చంద్రబాబుతో పోటీపడలేక కేసీఆర్ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ ఏపీ ప్రభుత్వాన్ని నిందించడం ఆపేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే చాలా బాగుంటుందని హితవు పలికారు.

గోదావరిలో కారు బోల్తా.. 20 మంది మృతి

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తుఫాన్ వాహనం బోల్తాపడి గోదావరిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 22 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో 9మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. విశాఖజిల్లా అచ్యుతాపురం వాసులు తిరుపతి వెళ్లి వస్తుండగా వాహనం అదుపు తప్పి సుమారు 50 అడుగులు పైనుండి కింద పడటంతో వాహనం నుజ్జు నుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ల సాయంతో వాహనంలో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకుతీశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సీఎం పుష్కరాల నిమిత్తం పరిమిత సంఖ్యలో వాహనాలు అనుమతించాలని, మితిమీరిన వేగాన్ని నియత్రించాలని, కాలం చెల్లిపోయిన వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని రవాణా అధికారులకు కొన్ని ఆదేశాలను జారీ చేశారు.

చంద్రబాబుపై కేసు అంత ఈజీ కాదు..

రాష్ట్రం విడిపోయిన దగ్గర నుండి అటు తెలంగాణకు కాని ఇటు ఆంధ్రాకు కాని ఎదో విషయంలో వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఎన్ని గొడవలు, వివాదాలు జరిగినా అవన్నీ ఇప్పుడు  తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు వివాదం కింద దిగదుడుపే. రేవంత్ రెడ్డి అరెస్ట్ వల్ల ఒక్కసారిగా ఇరు రాష్ట్రాలలోని రాజకీయాలలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబును ఈ కేసులో ఇరికించాలని విశ్వ ప్రయత్నమే చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే రేవంత్ రెడ్డి అనే చిన్న పిచ్చుక ద్వారా చంద్రబాబు పై బ్రహ్మస్త్రాన్ని ఉపయోగించాలని చూస్తుంది. దానిలో భాగంగానే చంద్రబాబు పై ఒక్కో బ్రహ్మస్త్రాన్ని వదులుతుంది. మొదటి బ్రహ్మస్త్రంగా.. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన సంభాషణలు అంటూ ఓ న్యూస్ ఛానల్ లో కూడా విడుదల చేసింది. కానీ అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కలిసిరాలేదు. ఎందుకంటే బయటకు వచ్చిన ఆ సంభాషణల వీడియోలో చంద్రబాబు ఎక్కడా డబ్బు గురించి కానీ ఓటు గురించి కానీ ప్రస్తావించింది లేదు. అసలు చంద్రబాబు స్టీఫెన్ సన్ తో సంభాషించలేదని.. ఎక్కడెక్కడో చంద్రబాబు మాట్లాడిన మాటలన్నీ తీసుకొచ్చి గుదిగుచ్చి వీడియో చేసి తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని టీడీపీ నేతలు మొత్తుకుంటున్నారు. రెండోదిగా రేవంత్ రెడ్డి బాస్ ఉచ్చారణ... ఏసీబీ అధికారులు ఈ కోణంలో కూడా గట్టి ప్రయత్నమే చేశారు.. రేవంత్ రెడ్డి స్టీఫేన్ సన్ తో మాట్లాడినప్పుడు 'బాస్' అని ఉచ్ఛరించగా ఆ 'బాస్' ఎవరూ అనే తెలుసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి బాస్ అని మాత్రమే చెప్పాడు కాబట్టి ఆ బాస్ చంద్రబాబే అని గ్యారెంటీ లేదు.. సో ఈ రకంగా కూడా చంద్రబాబు పై కేసు పెట్టడం అంత ఈజీ కాదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబుకు పూర్తి మద్ధతు ఇవ్వడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుంది. కేసీఆర్ ఏమన్నా నీతిపరుడా. ఆయన చేసిన భాగోతం మాకు తెలుసు అని కేంద్రమంత్రులు మండిపడుతున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం.. అంతేకాక స్టింగ్ ఆపరేషన్ చేసేముందు ఎన్నికల కమిషన్ కు ముందుగానే చెప్పి చేయాలి. కానీ అలాకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి నిబంధనలేమి పాటించకుండా కేవలం టీడీపీ మీద అక్కసుతో తామే ఎరక్కపోయి ఇరుక్కుపోయిన పరిస్థితికి తెచ్చుకుంది. దీంతో ఎటు చూసినా ఈ కేసు ద్వారా చంద్రబాబును ఇరికించాలని చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కెదురు కావడం ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబును కేసులో ఇరికించడం అంత ఈజీ కాదని తెలుస్తోంది.

జెన్‌కో ఉద్యోగుల కేటాయింపు నిలిపివేయండి.. హైకోర్టు

తెలంగాణ జెన్‌కో, ట్రాన్ప్‌కోలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల బదిలీ పై తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఉద్యోగుల బదిలీల కేటాయింపు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ విషయంలో కోర్టుకు మళ్లీ తమ వాదనలు వినిపిస్తామని.. విభజన చట్టానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నాం తప్పా.. వారి మీద మాకేం కోపం కాని.. వ్యతిరేకత కాని లేదని టీ సర్కార్ తెలిపింది. మరోవైపు అసలు ఉద్యోగుల విభజన అనేది ఒక కమిటీ వేసి, ఆప్షన్లు ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్టు బదిలి అంటే కుదరదని ఏపీ స్థానికత ఉద్యోగులు తెలిపారు.

జితేందర్ సింగ్ తోమర్ పై బహిష్కరణ వేటు

ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ సర్టిఫికేట్ల వివాదంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిని పార్టీ నుండి బహిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం పై పార్టీ నేతలు సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ తోమర్ పార్టీకి చాలా అన్యాయం చేశాడని, నమ్మి అతనిని పార్టీలోకి తీసుకొని పదవి ఇచ్చినందుకు పార్టీకే దెబ్బతీయాలని చూశాడని అందుకే పార్టీనుండి బహిష్కరించాలనుకుంటున్నామని తెలిపారు. ఈ విషయంలో తోమర్ పై ఉదాశీనత చూపదలుచుకోలేదని.. తోమర్ చేసిన పనికి కేజ్రీవాల్ తీవ్ర కలత చెందారని తెలిపారు. ఇదిలాఉండగా నకిలీ పట్టాలు ఆరోపణలో తోమర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

కేసీఆర్ భాష మార్చుకోవాలి.. సోమిరెడ్డి

తెదేపా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎం కేసీఆర్, జగన్ ల వైఖరిపై మండిపడ్డారు. కేసీఆర్, జగన్ కుమ్మక్కయి ఎన్నికుట్రలు చేసినా చంద్రబాబుని కాని, టీడీపీని కానీ ఏం చేయలేరని విమర్శించారు. కేసీఆర్ ఒక అవినీతిపరుడు, ఆయన ఇంకో అవినీతి పరుడితో చేతులు కలిపాడు అని ఎద్దేవ చేశారు. హైదరాబాద్ తన సొంతం అయినట్టు సీమాంధ్రులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని.. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని సూచించారు. కాగా.. పాలమూరు ప్రాజెక్టుకు మేమేమి వ్యతిరేకం కాదని కానీ ప్రాజెక్టు నిర్మించాలంటే కృష్ణాబోర్డు అనుమతి తీసుకోవాలని సూచించారు.

చంద్రబాబు టెర్రరిస్టా? అశోకగజపతిరాజు

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో విడుదలైన చంద్రబాబు సంభాషణల వీడియోపై కేంద్ర పౌరవిమానయానమంత్రి అశోకగజపతిరాజు స్పందించారు. చంద్రబాబు ఏమైనా నక్సలైటా? టెర్రరిస్టా? అతని వాయిస్ రికార్డ్ చేయడానికి అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ పనికి రెండు రాష్ట్రాల్లో విభేధాలు తలెత్తడమే కాకుండా భవిష్యత్ రాజకీయాలకు చాలా నష్టమని అన్నారు. అసలు చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయాల్సినంత అవసరం తెలంగాణ ప్రభుత్వాని ఏముందని మండిపడ్డారు. ముందు ఈ విషయంపై స్పందించని తెలంగాణ ప్రభుత్వం తరువాత ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెపుతోంది కానీ.. టీఆర్ఎస్ సర్కార్ మాట ఎవరూ నమ్మడం లేదని... దీనికి సంబంధించిన ఆధారాలు ఏపీ పోలీసు అధికారుల కేంద్రానికి సమర్పించారని తెలిపారు.

ఫోరెన్సిక్ ల్యాబ్ కు రేవంత్ ఆడియో, వీడియో రికార్డులు

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో చేసిన సంభాషణలకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డులను ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించింది. దీనితో పాటు రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్, సెబాస్టియన్, ఉదయసింహల ఫోన్లు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇప్పటికే ఆడియో, వీడియో టేపుల్లో ఉన్న గొంతును ఏసీబీ అధికారులు గుర్తించారు. అయినా ఇందుకు సంబంధించిన నివేదిక ఫోరెనిక్స్ ల్యాబ్ నుండి రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ నివేదిక కూడా వచ్చిన తరువాత ఏసీబీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గవర్నర్ కు క్లాస్ పీకిన కేంద్రం!

తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని.. తనతో పాటు 120 మంది నేతల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని, గవర్నర్ కూడా ఈ విషయంలో ఏ పట్టించుకోవడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆధారాలను సీఎంతో పాటు ఢిల్లీ వెళ్లిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు కేంద్ర హోం కార్యదర్శి గోయల్‌కు సమర్పించారు. దీంతో కేంద్రం ఈ వ్యవహారంపై స్పందించి విచారణను చేపట్టడమే కాకుండా ఉమ్మడి రాష్ట్రల గవర్నర్ కు క్లాస్ పీకారని సమాచారం. ఈ సందర్భంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛగా, సజావుగా పనిచేసే వాతావరణం కల్పించాలని, రెండు రాష్ట్రాల సీఎంలు ఎవరి పని వారు చేసుకునేలా చూడాలని కేంద్రం గవర్నర్ కు ఆదేశించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

రేవంత్ కేసు.. ఎంపీ ఖాతా నుండి డబ్బు డ్రా?

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇవ్వడానికి తెచ్చిన రూ. 50 లక్షలు ఎక్కడి నుండి తీసుకొచ్చాడో తెలుసుకునే పనిలో పడింది ఏసీబీ. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కు ఇవ్వడానికి తీసుకొచ్చిన డబ్బు నోట్లపై బ్యాంకు లేబుల్స్ లేకపోవడంతో నోట్లపై ఉన్న నెంబర్ల ఆధారంగా ఆ డబ్బు ఓ చిన్న బ్యాంకు ద్వారా డ్రా చేశారన్న విషయం తెలుసుకున్నారు. అయితే ఆడబ్బు చంద్రబాబుకు అతి సన్నిహితుడైన ఓ ఎంపీ ఖాతా నుండి డ్రా చేసినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన 4.5 కోట్ల డబ్బుల గురించి దర్యాప్తు చేపట్టారు ఏసీబీ అధికారులు. మరోవైపు రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో మాట్లాడేటప్పుడు బాస్ అని అన్న నేపథ్యంలో అసలు ఆ బాస్ ఎవరు అనే విషయం తెలుసుకునేందుకు గట్టి ప్రయత్న చేస్తుంది ఏసీబీ. దీనికి సంబంధించి రేవంత్ కస్టడీలో ఉన్నప్పుడు విచారించగా రేవంత్ రెడ్డి మాత్రం నోరు విప్పలేదు. దీంతో ఏసీబీ రేవంత్ గతంలో మాట్లాడిన వీడియోలు ఏ ఏ సందర్భాలలో బాస్ అని మాట్లాడాడు.. ఎవరిని ఉద్దేశించి బాస్ అనే పదం ఉపయోగించాడో తెలుసుకునే పనిలో పడింది. మొదటి దర్యాప్తులో చేపట్టిన సమాచారంతో చంద్రబాబుకు, ఇతర మంత్రులకు నోటీసులు ఇవ్వడానికి ఏసీబీ కసరత్తు చేస్తోంది.

ఆంధ్రావాళ్లను తిట్టకుండా ఉండగలవా.. కేఈ

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఆంధ్రావాళ్లని తిట్టకపోతే కేసీఆర్ కు నిద్రపట్టదని.. ఒక నెల రోజులు ఆంధ్రావాళ్లను తిట్టకుండా ఉండగలవా? అని కేసీఆర్ ని ప్రశ్నించారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఇప్పుడే వెళ్లిపోవాలని కేసీఆర్ అంటున్నాడు.. కేసీఆర్ కనుకు తన వైఖరి మార్చుకోకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రాజ్యాంగంపై అవగాహన లేకపోతే ఇలానే మాట్లాడతారని వ్యాఖ్యానించారు. అసలు తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే కేసీఆర్ తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని పాలమూరు ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ, ట్రైబ్యునల్ అనుమతి లేదని.. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగం.. దానికి ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు.