హైదరాబాద్లో భారీ వర్షం..
గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న హైదరాబాద్ వాసులకు కాస్త ఊరట లభించింది. ఇవాళ మధ్యాహ్నాం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సైదాబాద్, చంపాపేట్, మల్లాపూర్, అంబర్పేట్, ఉప్పల్, బోడుప్పల్, ఈసీఐఎల్, కాప్రాలలో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు వాన కురవగా, మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఇంకొన్ని చోట్ల భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురిసింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.