పోర్న్ సినిమాలు చూస్తే రూ.2.22 లక్షల జీతం..
posted on Apr 18, 2016 @ 12:36PM
వారానికి 20 గంటలపాటు ఉద్యోగం చేస్తే రూ.2.22 లక్షల జీతం. ఇంతకీ ఏంటీ ఆ ఉద్యోగం.. ఎక్కడ అని అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్టంతా.. ఆ ఉద్యోగం ఏంటో తెలిస్తే ఖంగు తినాల్సిందే. డెన్మార్క్ లోని ఓ ప్రముఖ బార్ విచిత్రమైన జాబ్ ఆఫర్ చేసింది. వారానికి 20 గంటల పాటు పోర్న్ సినిమాలు చూస్తే ఏకంగా రూ.2.22 లక్షల జీతం ఇస్తామని ప్రకటన చేసింది. అంతేకాదు జాబ్ కు కావాలసిన అర్హతలు కూడా అందులో పేర్కొంది. బాగా ఓపెన్ మైండెడ్ అయి ఉండాలని, ఈ తరహా సినిమాలు చూడటంలో అనుభవం కూడా ఉండాలని.. ఏదో సరదాగా కాకుండా.. సీరియల్ ఉద్యోగం చేయాలని.. వాళ్లకు 'డీజే' లాగే 'పీజే' అనే టైటిల్ కూడా ఇస్తామని తెలిపారు. ఈ సందర్బంగా బార్ ఫౌండర్ క్రిస్టియన్ వాన్ హర్న్‌స్లెత్.. తామిచ్చిన ప్రకటనకు స్పందన అమోఘంగా ఉందని.. ఇదంతా కేవలం పబ్లిసిటీ మాత్రమే కాదని, తమ బార్ ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు.