భారత్ ప్రతీకారం..ఎనిమిది పాకిస్తాన్ జవాన్లు మృతి..

  పాక్ ఉగ్రవాదులు భారత్ జవాన్లు ను అతి కిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత జవాను తలనరికి తమ పైశాచికాన్ని ప్రదర్శించిన పాక్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఇప్పటికే భారత భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ పోస్టులపై విరుచుకుపడ్డాయి. బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర మధ్య ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ మిలటరీ పోస్టులపై దాడులు చేశాయి. మెషీన్ గన్స్, 120ఎంఎం హెవీ మోటార్లతో పాక్ పోస్టులను తునాతునకలు చేశాయి.ఈ దాడుల్లో దాదాపు ఎనిమిది పాకిస్తాన్ జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది. భారత్ దాడులతో ఒక్కసారిగా షాక్ కు గురైన పాకిస్తాన్ మిలటరి ఇరు దేశాల కమాండర్లు సంప్రదింపులు జరపాలని కోరింది.

యూకే వీసా కొత్త మార్పులు..భారత్ ఉద్యోగులపై ప్రభావం

  యూకే వీసా విధానంలో కొత్త మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మార్పులు నేటి నుండి అమల్లోకి రానున్నాయి. తమ దేశంలోకి వస్తున్న విదేశీ ఉద్యోగులను నిలువరించడానికే యూకే ఈ విధమైన మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం *నవంబర్ 24 తరువాత టైర్-2 ఇంటర్నల్ కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ) కోసం దరఖాస్తు చేసుకుంటే 30 వేల పౌండ్లు కట్టాలి. గతంలో ఇది 20,800 పౌండ్లు ఉండేది. * విదేశాల నుంచి తీసుకువచ్చే ఉద్యోగుల్లో టైర్ 2 సాధారణ ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని, శిక్షణ నిమిత్తం వచ్చే గ్రాడ్యుయేట్ ట్రయినీలైతే వేతనం రూ. 19.14 లక్షలుగా ఉండాలని నిర్ణయించారు. * ఇక ఒక్కో కంపెనీ సంవత్సరానికి 20 మందిని మాత్రమే తీసుకురావాలన్న నిబంధన కూడా నేటి నుంచి యకేలో అమల్లోకి రానుంది. అయితే ఈ మార్పుల వల్ల అందరి సంగతేమో కానీ.. భారత్ నుంచి వెళ్లే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగులపైనే అధిక ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి నవజ్యోత్ సింగ్ సిద్దూ భార్య...

  మాజీ క్రికెటర్, నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందు తాను వేరే పార్టీల్లోకి చేరుతారు అని అందరూ అనుకున్న తాను మాత్రం ఏ పార్టీల్లోకి చేరకుండా  ఆవాజ్-ఏ-హింద్ అనే కొత్త పార్టీ పెట్టాడు. నవజ్యోత్ సింగ్ కొత్త పార్టీ పెట్టినా కూడా పార్టీ గురించిన విషయాల గురించి మాత్రం ఇప్పటివరకూ పెద్దగా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు ఓ వార్త మాత్రం హల్ చల్ చేస్తుంది. అదేంటంటే... సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ మాత్రం తన భర్త పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన ఆమె కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. నవజ్యోత్ కౌర్ తో పాటు ఆవాజ్-ఏ-పంజాబ్ నేత ప్రతాప్ సింగ్ సైతం కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ వీరిని పార్టీలోకి స్వాగతించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన భావ సారూప్యత ఉన్న నవజ్యోత్ వంటి వారిని తమ పార్టీ అక్కున చేర్చుకుంటుందని, వారి రాకతో, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని అన్నారు. మరి దీనిపై సిద్దూ ఎలా స్పందిస్తారో చూడాలి.

24 గంటల్లోనే.. దెబ్బకు దెబ్బ తీసిన భారత సైన్యం

భారత్ మరోసారి తన సత్తా ఏంటో చూపించింది. నిన్న ముగ్గురు భారత సైనికులను చంపిన పాక్ సైన్యాన్ని దెబ్బకు దెబ్బ తీసింది. మచల్ సెక్టార్ వద్ద భారత సైన్యం పాక్ సైన్యంపై ఎదురుదాడికి దిగింది. ఈ దాడిలో కెప్టెన్ ర్యాంక్ అధికారితో సహా ముగ్గురు పాక్ సైనికులను మట్టుబెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత ఔట్ పోస్టులపై కాల్పులకు తెగబడుతున్న దాయాదీ సైన్యం నిన్న దొంగచాటుగా జరిపిన దాడిలో ముగ్గురు భారత జవాన్లను పొట్టనబెట్టుకుంది. వారిలో ఒక జవాను శరీరాన్ని గుర్తుపట్టడానికి వీల్లేనంతగా ఛిద్రం చేసి తమ క్రూరత్వాన్ని బయట పెట్టుకుంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత సైన్యం ప్రతీకార చర్య తప్పదని పాక్‌ను హెచ్చరించింది. చెప్పినట్లుగానే 24 గంటలు గడవకముందే అన్నమాటను నిలబెట్టుకుంది ఇండియన్ ఆర్మీ.

బిస్కెట్‌ డబ్బాల్లో పసికందులు..

  పశ్చిమబెంగాల్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పసికందులను బిస్కెట్‌ డబ్బాల్లో పెట్టి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అది కూడా ఆస్పత్రియాజమాన్యమే కావడం ఆశ్చర్యకరం. వివరాల ప్రకారం.. పశ్చిమ్‌బంగాలోని సోహన్‌ నర్సింగ్‌ హోం, సుబోధ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ సిబ్బంది అప్పుడే పుట్టిన పసికందులు చనిపోయారంటూ తల్లిదండ్రుల్ని నమ్మించి ఆ పసికందుల్ని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు సీఐడీ అధికారులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టిన అధికారులు ముగ్గురు పసికందుల్ని బిస్కెట్‌ కంటైనర్లరో పెట్టి తరలిస్తున్న ఎనిమిది మంది నిందితులను పట్టుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా వీరు ఈ దారుణానికి పాల్పడుతున్నట్టు తెలిసింది. నిందితుల్ని అరెస్ట్‌ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఏపీ ప్రభుత్వంపై ముద్రగడ ఫైర్...వారికి లేని రూల్స్ నాకెందుకు..

  కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన పాదయాత్ర కూడా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన పాదయాత్రను మాత్రం ప్రభుత్వం అడ్డుకుంటుంది. దీనిపై స్పందించిన ముద్రగడ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కాపు రిజర్వేషన్ల కోసం తాను చేపట్టిన సత్యాగ్రహ పాదయాత్రను ఎందుకు అడ్డుకున్నారని..గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి షర్మిలలు ప్రభుత్వ అనుమతులతోనే పాదయాత్రలు చేశారా? వారికి లేని రూల్స్ తనకు మాత్రమే ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని అన్నారు. అంతేకాదు రాజస్థాన్ లో గుజ్జర్లు, గుజరాత్ లో పటేళ్లు ప్రభుత్వాలు అనుమతి ఇస్తేనే ఉద్యమించారా? అని ప్రశ్నించారు. కాపు జాతిని తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని  విమర్శించారు.

రెండు రాష్ట్రాలకు నిరాశ మిగిల్చిన కేంద్రం..

  తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపుపై ఎప్పటి నుండో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఆశలపై కేంద్రం నీరు జల్లినట్టు తెలుస్తోంది. ఏపీలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 175కి పెంచుకునే వెసులుబాటును విభజన చట్టంలో కల్పించారు. దీంతో, తమ రాష్రంలో నియోజకవర్గాలను పెంచాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే ఈరోజు నియోజక వర్గాల పెంపు ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఈ రోజు రాజ్యసభ్యలో నియోజకవర్గాల పెంపుపై అడిగిన ప్రశ్నకు బదులుగా రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉండబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ స్పష్టం చేశారు. నియోజకవర్గాలను పెంచాలంటే ఆర్టికల్ 371ను సవరించాలని... ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పని కాదని కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో రెండు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది.

చందన బ్రదర్స్ యజమాని అరెస్ట్...

  ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ చందన బ్రదర్స్ యజమాని రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఫోర్జరీ కేసులో భాగంగా ఆయనను ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంద్ర తన సంతకాన్ని రామారావు ఫోర్జరీ చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీనారాయణ తనయుడు కన్నా ఫణీంద్ర  తనను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. మంత్రి కుమారుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి తనకు తానే బెదిరింపు లేఖ రాసుకొని పోలీసులకు పిర్యాదు చేశారని పోలీసులు కనిపెట్టి ఈరోజు ఆయనను అరెస్ట్ చేశారు.

బీమా ఉంటేనే రైలు ప్రయాణం..

  ఆదివారం నాడు యూపీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం వల్ల కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే రైలు ప్రయాణానికి బీమా తప్పనిసరి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అతి త్వరలో కేంద్రం చట్ట సవరణ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రైలెక్కే ప్రతి ఒక్కరి నుంచి 92 పైసలు వసూలు చేస్తూ, బీమా సదుపాయాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బీమాని కావాలనుకునే వారు మాత్రమే తీసుకుంటున్నారు తప్పా.. కొంత మంది తీసుకోకుండానే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో  ఆప్షనల్ విభాగంలో ఉండటంతో. ఇకపై అలా కాకుండా బీమా తప్పనిసరి చేయాలన్నది కేంద్రం ఆలోచన. ఈ బీమా ద్వారా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే రూ. 10 లక్షలు, ఆసుపత్రి ఖర్చులకు రూ. 2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ. 10 వేలు, సామాన్లు పోతే రూ. 5 వేలు బీమా పరిహారంగా అందజేస్తుంది.   ఇదిలా ఉండగా..ఇండోర్ - పాట్నా ఎక్స్ ప్రెస్ కు జరిగిన ప్రమాదంలో 148 మంది మరణించగా.. చాలామంది గాయాలపాలయ్యారు. అయితే ప్రమాదానికి గురైన వారిలో కొంతమందికి మాత్రమే బీమా ద్వారా ఆర్దిక సాయం అందింది.

డెబిట్‌ కార్డుల సర్వీస్ ఛార్జీలు ఎత్తివేత..

  పెద్ద నోట్ల రద్దు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు వెసలుబాట్లు కల్పించింది. ఇప్పుడు తాజాగా మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ కొన్ని ప్రకటనలు చేశారు. అందులో ఆన్ లైన్ టికెట్లు, డెబిట్‌ కార్డుల సర్వీస్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ బుకింగ్‌కు డిసెంబర్‌ 31 వరకు సేవా రుసుము రద్దు చేసిందని.. ట్రాయ్‌ యూఎస్‌ఎస్‌డీ ఛార్జీలను రూ.1.50 నుంచి 50పైసలకు తగ్గించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరత లేకుండా 1.5లక్షల తపాలా కార్యాలయాలు నగదు సరఫరా చేస్తున్నట్లు శక్తికాంత దాస్‌ ప్రకటించారు. సహకార బ్యాంకులకు నాబార్డు రూ.21వేల కోట్లు మంజూరు చేసిందన్నారు.

లోక్ సభకు మోడీ.. రేపటికి వాయిదా..

  పార్లమెంట్ ఉభయసభలకు ప్రధాని నరేంద్ర మోడీ రావాలని.. నోట్ల రద్దుపై ఆయన స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజులుగా ఉభయసభల్లో ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ప్రధాని మోడీ లోక్ సభకు వచ్చారు.  కానీ స‌భ ప్రారంభ‌మైన కొన్ని క్ష‌ణాల‌కే నోట్ల ర‌ద్దు దుమారంతో వాయిదా వేశారు. ప్రధాని రాకపై స్పందించిన ప్రతిపక్షాలు.. ప్ర‌ధాని మోదీ కేవ‌లం స‌భ‌కు వ‌స్తే స‌రిపోద‌ని, ఆయ‌న ప్ర‌తిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఎంత చెప్పినా ప్రతిపక్షాలు తమ ఆందోళనలు ఆపని నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేశారు.

కేసీఆర్ కొత్త ఇంటి విషయాలు... అవాక్కవ్వాల్సిందే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కొత్త ఇంట్లోకి ప్రవేశించనున్న సంగతి తెలిసిందే.  బేగంపేటలో మొత్తం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ భవంతి గురించిన విషయాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అంత కట్టుదిట్టమైన భద్రతతో ఈ కొత్త బంగళాను తయారు చేయించుకున్నారు కేసీఆర్. తాను వినియోగించే బాత్ రూమ్ ను సైతం బులెట్ ఫ్రూఫ్ గా తయారు చేయించారంటే మీరే అర్థం చేసుకోండి. ఇదంతా  రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సూచనల మేరకే కేసీఆర్ నిర్మించుకున్నారట. ఆ వివరాలు ఒకసారి చూద్దాం.. * సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ వినియోగించే రెండు పడక గదులను హై క్వాలిటీ గ్లాస్ తో ఫిట్ చేశారు. * ఎటువంటి బులెట్లు తగిలినా చెక్కు చెదరని అద్దాలతో బాత్ రూం * ఇంకా కనీసం 50 మంది భద్రతా సిబ్బంది అనునిత్యమూ భవంతికి పహారా * సుదూర ప్రాంతం నుంచి స్నిప్పర్ రైఫిల్ ద్వారా వచ్చే బులెట్లను అడ్డుకునేందుకే బులెట్ ప్రూఫ్ గ్లాస్ లు * వీటన్నింటితో పాటు అత్యాధునిక ఆయుధాలను చేతుల్లో కలిగుండే భద్రతా దళాలు, మందుపాతరలతో పేల్చినా ప్రమాదం జరగని కార్లు, జడ్ ప్లస్ సెక్యూరిటీని ఆయనకు కల్పించనున్నారు.