వరుస అరెస్టులతో వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిపై కేసులు నమోదవుతాయో.. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో.. ఊహకు కూడా అందని పరిస్థితి నెలకొంది. దానికి తాజా పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహారణ. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీ లీడర్లను కేసులు వెంటాడుతున్నాయి. వెంటాడుతున్నాయి అనేకంటే.. వేటాడుతున్నాయనే చెప్పాలి. తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్‌తో మరోసారి వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో పిన్నెళ్లి సోదరులపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది.  ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ గతంలో చేసిన అనేక అక్రమాల కారణంగా జైళ్లో ఊచలు లెక్కిస్తూ బెయిలు కోసం కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. మరోవైపు అనేక మంది వైసీపీ నేతలు   ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. బెయిల్ దొరకని వారు పరారీలో ఉన్నారు. ఇలా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు.  క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం.. అడ్డుకున్న వారిని బెదిరించడం.. ఇలా అనేక ఆరోపణలపై కాకాణిపై కేసు నమోదైంది. అనేక సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ ప్రాంతానికి వెళ్లిపోయారు. కానీ పోలీసులు ఆయన లోకేషన్‌ను గుర్తించి.. ఏపీకి పట్టుకొచ్చారు. కోర్టు ముందు హాజరుపరిచారు.  కాకాణిపై ఇవి మాత్రమే కాదు..  పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో అక్రమ మైనింగ్  కేసుతో పాటు ఎ స్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేశారని ఓ కేసు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై మరో కేసు ఉంది. ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు, కావలిలో పోలీసులపై అసభ్యపదజాలంతో‌ అవమానకరంగా మాట్లాడంతో మరో కేసు, సోమిరెడ్డికి విదేశాల్లో 1000 కోట్లు ఉన్నట్లు నకిలి పత్రాలు సృష్టించిన విషయంలో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు. ఇలా అనేక కేసులు కాకాణిపై నమోదయ్యాయి.  ఇక పిన్నెళ్లి సోదరులది మరో కథ. ఓ డబుల్ మర్డర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి. పల్నాడు జిల్లా బొదిలవీడులలో వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే ఇద్దరిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో ఇద్దరు సోదురులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారు.  ఇవి మాత్రమేనా ఈ వివాదస్పద సోదరులపై మాచర్ల నియోజకవర్గంలో లెక్కలేనన్ని ఆరోపణలతో పాటు.. అనేక కేసులున్నాయి.  వీరు మాత్రమే కాదు.. ఇప్పటికే వల్లభనేని వంశీ, పేర్ని నాని, సజ్జల భార్గవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇలా ఎంతో మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకు గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు, అరాచకాలపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేతలంతా లీగల్‌ టీమ్‌ను రెడీగా ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ఇక్కడ అధికార పార్టీ ఆవేశంగా కాకుండా ఆలోచనతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది.  రాత్రికి రాత్రి అరెస్టులు చేయడం లేదు.. న్యాయపరంగా అన్ని అవకాశాలు ఇస్తున్నారు. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాలు ఇస్తున్నారు.  అంతే కాదు గతంలో వారు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు, ఆధారాలు ముందే బయటికి వస్తున్నాయి. ఇలా పక్కగా నేతలను లాక్ చేస్తున్నారు. ఇప్పటికే కాకాణి, పిన్నెళ్లి సోదరులకు ఉచ్చు బిగిసింది. ఇకపై కేసుల ఉచ్చులో చిక్కుకోబోయేది ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

మోదీ పాలనకు పదకొండేళ్లు!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన 11 ఏళ్ళు పూర్తిచేసుకుని,12 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. అవును.. 2014 మే 26న  నరేంద్ర మోదీ ప్రప్రథమంగా భారత ప్రధాని మంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు. మరో వంక మరో వారం పది రోజుల్లో.. అంటే  జూన్ 9 న మోదీ 3.0 ప్రభుత్వం  తొలి వార్షికోత్సవం జరుపుకునేందుకు సిద్దమవుతోంది.  గత ఏడాది  జూన్ 9 న నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన తొలి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. అలాగే..  నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధనిగానూ మోదీ చరిత్ర  సృష్టించారు.  అదలా ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోదీ  11 ఏళ్ల పాలనను అప్రకటిత అత్యవసర పాలనగా అభివర్ణించారు.  అలాగే  ఈ పదకొండేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించింది శూన్యమని తేల్చేశారు. మోదీ సర్కార్ కు ఖర్గే  జీరో మార్కులు వేశారు.  మరో  వంక బీజేపీ, ఎన్డీఎ భాగసామ్య పార్టీలు మోదీ పాలన భేష్  అని  మెచ్చుకుంటున్నాయి.  ఈ 11 ఏళ్లలో సాధించిన ఆర్థిక ప్రగతిని, ఇతర విజయాలను ఏకరవు పెడుతున్నాయి. నూటికి 200 మార్కులు ఇచ్చినా ఇవ్వవచ్చు అన్నట్లుగా  మోదీ పాలను ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నాయి.   అయితే.. రాజకీయ విమర్శలను, రాజకీయ ప్రశంసలను పక్కన పెడితే..  మోదీ  ఈ 11 ఏళ్ల పాలనలో మెరుపులూ, మరకలూ రెండూ ఉన్నాయి.  అయితే.. గతంతో పోల్చుకుంటే మోదీ పాలన భిన్నంగా సాగింది అనేది మాత్రం కాదన లేని నిజం.  నరేంద్ర మోదీ 2014 మే 26.. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు భారత దేశ ప్రధాన మంత్రిగా తొలిసారి  ప్రమాణాస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోదీ పాలన నిరాంటంకంగా కొనసాగుతోంది. వరసగా 2014, 2019, 2024 మూడు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కూడా మోడీ సారధ్యంలో బీజేపీ, ఎన్డీఎ  కూటమి అఖండ విజయం సాదించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశంలో సుస్థిర పాలన సాగుతోంది. నిజానికి మోదీ   పాలనకు  సుస్తిరత్వమే పునాది రాయి. సుస్థిర పాలనతోనే మోదీ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధికి బాటలు వేసింది.    సుస్థిర ప్రభుత్వం పునాదుల పైనే మోదీ ప్రభుత్వం తడబాట్లు సంకెళ్ళు లేకుండా..  దీర్ఘ కాలిక ప్రయోజనాలు లక్ష్యంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. నిజమే..  మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు అన్నీ సంపూర్ణ విజయాన్ని సాధించలేదు. వ్యవసాయ చట్టాల వంటి  కొన్ని కీలక నిర్ణయాలను అనివార్యంగా వెనక్కి తీసుకోవలసి వచ్చింది. అదే సమయంలో   కోవిడ్ వంటి వైపరీత్యాలను ఎదుర్కుంటూ కూడా ఆర్థిక ప్రగతిలో లక్ష్యాలను చేరుకుంది. మోదీ తొలి ప్రమాణ స్వీకారం (2014) నాటికి 11 స్థానంలో దేశ ఉన్న ఆర్థిక వ్యవస్థ..  ఈ11 ఏళ్లలో నాలుగో  స్థానానికి చేరుకుంది. అవును.. భారత ఆర్థిక వ్యవస్థ జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.  అమెరికా, చైనా, జర్మనీ తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా  అవతరించింది. నిజానికి ఇది సామాన్య విజయం కాదు.. ప్రతి భారతీయుడూ  గర్వించదగిన విజయంగా ప్రపంచ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాదు.. త్వరలోనే భారత దేశం మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, మన కంటే ఎక్కవగా ప్రపంచ దేశాల ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. మరో వంక, మోదీ  ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలు చేసిన సంక్షేమ, ఆర్థిక  చేయూత పథకాలు, ఒకటొకటి వెలుగు లోకి వస్తునాయి.  నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం.. మోదీ ప్రభుత్వం అమలు చేసిన పేదరిక నిర్మూలన పథకాల ద్వారా, దేశంలో ఇంతవరకు  దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు.  అలాగే మౌలిక సదుపాయాలరంగం,సాంకేతిక ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనలు, ముఖ్యంగా చంద్రయాన్ -3 మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.  అయుష్మాన్ భారత్ వంటి, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య పథకాలతో అత్యుత్త వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఒకటని కాదు.. ప్రతి ర్రంగంలోనూ   ప్రపంచ స్థాయిని మించిన స్థాయిని చేరుకుందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ విశ్వాసంతో అడుగులు వేస్తోంది. మెరుగైన ఫ తాలు సాధిస్తూ,  విశ్వగురు స్థానాన్ని చేరుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.  ఇక దేశ భద్రత విషయానికి వస్తే..  ఆపరేషన్ సిందూర్అందుకు  తిరుగులేని  ప్రత్యక్ష సాక్ష్యం. నిజానికి, 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో జరిగిన బాలకోట్ వైమానిక దాడి సందర్భంగా మన సైనిక శక్తి సామర్ధ్యాలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి.ఇక ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడికి  ప్రతిగా పాకిస్థాన్ కు బుద్ది చెప్పేందుకు  చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచం కళ్ళు తెరిపించింది.  మోదీ  నాయకత్వంలో నిర్మాణ మవుతున్న నయా భారత్, స్వశక్తి సామర్ధ్యం ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని   ఉగ్రస్థావరాలను, మట్టు పెట్టడంతో పాటుగా, పాక్ కవ్వింపు చర్యలకు జవాబుగా.. ఆ దేశంలో లోని 11 వైమానిక స్థావరాలను కూల్చివేయడం వరకూ మన సేనలు సాగించిన సాహసోపేతమైన చర్యలు భారతదేశ ప్రతిష్టను పెంచాయి.  నిజమే.. మోదీ  ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించింది.  స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎన్నో దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. కానీ, మోదీ ఒక విషయంలో మాత్రం ఓడిపోతూనే ఉన్నారు. విపక్షాల నుంచి ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నుంచి ఏ ఒక్క విషయంలోనూ మెప్పును అయితే పొందలేక పోయారు. ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి, దేశ  ప్రజలు వరసగా మూడు సార్లు గెలిపించడం ద్వారా, మోదీని మెచ్చుకున్నారు. చివరకు చిదంబరం,శశి థరూర్ వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం కొన్ని కొన్ని విషయాల్లో మోదీ భేష్ అంటున్నారు. కానీ, కాంగ్రస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం మోదీ పాలనలో మెచ్చుకో దగిన అంశం ఏదీ లేదని, 11 మోడీ పలాన్ టోటల్ ఫెయిల్యూర్, సంపూర్ణ వైఫల్యం అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ పెట్టిన ముహూర్తబలం గొప్పది.. నారా లోకేష్

ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ముహూర్త బలం చాలా గొప్పదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. తెలుగుదేశం మహానాడు ఈ రోజు ప్రారంభం అయిన సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం వేదికగా కార్యకర్తలు, నాయకులకు ఆహ్వానం పలికారు. ఆ ట్వీట్ కు ఓ వీడియో కూడా షేర్ చేశారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన ముహూర్త బలం గొప్పదన్న ఆయన, పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అని పేర్కొన్నారు.  ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుమట్టినా  ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే  తెలుగుదేశం కార్యకర్తలే తనకు నిత్యస్ఫూర్తి అని పేర్కొన్న నారా లోకేష్   పసుపు పండగ మహానాడుకు అందరికీ ఘన స్వాగతం పలికారు. 

మహానాడు మెనూ చూస్తే నోరూరాల్సిందే!

తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు మంగళవారం (మే 27) ప్రారంభమైంది. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత కడపలో తొలిసారిగా  మహానాడు జరుగుతోంది. ఎన్ని విధాలుగా ఇది తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన విషయం. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సారి మహానాడును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రత్యేకతలతో పాటు మహానాడు సందర్భంంగా ఈ సారి భోజనాల ఏర్పట్లు కూడా అత్యంత ఘనంగా ప్రత్యేకంగా చేస్తున్నారు. మహానాడుకు హాజరయ్యే ప్రతినిథులకు నోరూరించే విందు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు జరిగే మూడు రోజులూ ప్రత్యేక వంటకాలతో రుచికరమైన విందు ఏర్పాట్లకు సర్వం సిద్ధమైంది.  చాలా కాలం తరువాత  ఈసారి మహానాడులో మాంసాహార వంటకాలను కూడా వండి వడ్డిస్తారు.   మహానాడు జరిగే మూడు రోజులూ కూడా రోజుకు 30 రకాల ప్రత్యేక వంటకాలతో మెనూ సిద్ధమైంది. వీటిలో మచ్చుకు కొన్ని చెప్పుకోవాలంటే.. ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డూ, అలాగే పప్పు, దప్పళం, ఉలవచారు, పాలతాలికలు, చక్కెర పొంగలి, ఇంకా   ఆపిల్ హల్వా, వెజ్ జైపూరి, కడాయి వెజిటబుల్ కుర్మా ఇలా..  ప్రతిరోజూ దాదాపు 30 రకాల వంటకాలతో అతిథులకు పసందైన భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అసలీ మెనూ చూస్తేనే ఎవరికైనా నోరూరడం ఖాయం అన్నట్లుగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచీ వేలాదిగా తరలి వచ్చే ప్రతినిథులకు పసందైన విందు భోజనం ఏర్పాటు చేయడం కోసం రాష్ట్రంలోని దాదాపు వంద మంది ప్రావీణ్యత ఉన్న వంట వాళ్లు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.   మహానాడు మెనూ చూస్తేనే మాయా బజార్ లోని వివాహ భోజనంబు పాట గుర్తుకురాక మానదు. అయితే తెలుగుతమ్ముళ్లు మాత్రం వహానాడు భోజనంబు అని మార్చి పాడుకుంటున్నారు.   ఇక భోజనాల కోసం ప్రత్యేకంగా ఐదు భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండింటిని పూర్తిగా నాయకులు, కార్యకర్తల కోసం కేటాయించగా, ఒకటి మంత్రులు, ఎమ్మెల్యేల కోసం, మరోటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల కోసం, ఇంకోటి మహానాడుకు హాజరయ్యే  ప్రముఖులు, జీవితకాల సభ్యత్వం తీసుకున్న వారికి కేటాయించారు. ఒక్కో షెడ్డులో ఒకే సారి 3500 మంది భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.  ప్రతి రోజూ కనీసం 30 వేల మందికి సరిపడా వంటకాలను తయారు చేయిస్తున్నారు. ఇక మహానాడు చివరి రోజున దాదాపు 3లక్షల మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఉరకలేసే యువత, ఉత్సాహం నిండిన కార్యకర్తలే తెలుగుదేశం శక్తి, ఆస్తి.. చంద్రబాబు

తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉరకలేసే ఉత్సాహం. ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే  యువశక్తి  తెలుగుదేశం ఆస్తి అని పేర్కొన్న ఆయన  తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం కర్తవ్యమన్నారు. ప్రపంచ దేశాలలో తెలుగువారు ఎక్కడ ఉన్నా నంబర్ వన్ గా, వారు ఉన్న దేశానికే తలమానికంగా మారాలన్నదే మన సంకల్పమని, అందుకోసమే నిరంతరం శ్రమస్తున్నామనీ పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు, అవరోధాలు, అడ్డంకులూ ఎదురైనా తెలుగుదేశం ముందడుగు వేస్తూనే ఉందనీ, ప్రతి పరీక్షా సమయంలోనూ వజేతగానే తెలుగుదేశం పార్టీ నిలిచిందని చెప్పిన చంద్రబాబు అందుకు కార్యకర్తల దీక్షాదక్షతలు కారణమన్నారు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.   తెలుగుదేశం ఆవిర్భావం తరువాత తొలి సారిగా కడపలో మహానాడు నిర్వహించుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.  మహానాడు సందర్భంగా ప్రజాసేవకు పునరంకితం అవుతూ, యువగళానికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగు అన్నదాతకు అండగా నిలుస్తూ, స్త్రీశక్తికి పెద్ద పీట వేయాలని, పేదల సేవకు నిరంతరం శ్రమించాలని, తెలుగు జాతి విశ్వఖ్యాతి లక్ష్య సాధన దిశగా కార్యాచరణ ఉండాలని చంద్రబాబు ఉద్భోదించారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులే ముగియనుండటంతో తిరుమల వేంకటే శ్వరుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.  ముఖ్యంగా విద్యాసంస్థల సెలవులు ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో వారంతాం, వారం ప్రారంభం అన్న తేడా లేకుండా తిరుమల భక్త జన సంద్రంగా మారింది.  మంగళవారం (మే 27) ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లు అన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి18 గంటలకు పైగా సమయం పడుతున్నది.  ఇక సోమవారం శ్రీవారిని మొత్తం  83,542 మంది భక్తులు దర్శించుకున్నారు. వరిలో 34,265 మంది  తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల 9లక్షల రూపాయలు వచ్చింది.  

కవిత.. వాట్ నెక్ట్స్.. సర్వత్రా అదే చర్చ!

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుట్ల కవిత మనసులో ఏముందో..  ఆమె భవిష్యత్ రాజకీయ వ్యూహం ఏమిటో, ఏమో కానీ, ఆమె సంధించిన లేఖ మాత్రం సొంత పార్టీలో కంటే ప్రత్యర్ధి పార్టీలలోనే ఎక్కవ కలవరాన్ని సృష్టిస్తున్నట్లు ఉందని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   మరోవంక, కవిత నెక్స్ట్ మూవ్ ఏమిటి? ఆమె  అడుగులు  ఎటుగా పడుతున్నాయి.. అనే విషయంలో ఇటు మీడియాలో, అటు రాజకీయ పార్టీలలో విభిన్న కోణాల్లో జోరుగా  చర్చకు జరుగుతోంది. ఒకప్పుడు  వైఎస్సార్ కుమార్తె షర్మిల అన్న జగన్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు, ఆమె చుట్టూ ఎంత రాజకీయ చర్చ జరిగిందో.. ఇప్పుడు  కవిత తిరుగు బాటు (?) పై అంత కంటే ఎక్కువగానే రాజకీయ రచ్చ జరుగుతోంది. ఓ వంక షర్మిల బాటలోనే కవిత కూడా సొంత పార్టీ పెట్టి, అదే రూట్ లో కాంగ్రెస్ లో కలిపేస్తారనే  వాదన రోజు రోజుకూ బలాన్ని పుంజు కుంటోందని అంటునారు. మరో వంక కవిత అదే రూటులో వెళ్ళక పోవచ్చనే అభిప్రాయం కూడా రాజకీయ చర్చల్లో అంతే ప్రముఖంగా వినిపిస్తోంది.  అయితే.. కవిత నాయన కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలు, అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలోలో చేసిన   దయ్యాల  వ్యాఖ్యలు, దానిపై కేటీఆర్   స్పందించిన తీరు, బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవర్టులు ఉంటే ఉండవచ్చునని చేసిన మర్మగర్భ వ్యాఖ్యలు.. అలాంటి వారు  తమంతట తాముగానే బయట పడతారంటూ   కవిత పేరు ప్రస్తావించకుండానే ఆమె రేవంత్ రెడ్డి కోవర్ట్ కావచ్చనే విధంగా ఇచ్చిన సంకేతాలు, జరుగతున్న ఇతర పరిణామాలను గమనిస్తే.. ఆమె అడుగులు  అటుగా అంటే గాంధీ భవన్ వైపుగా పడుతున్నాయనే అనుమానాలను నిజం చేసేలా ఉన్నాయని అంటున్నారు. .  కవిత తన లేఖలో ప్రధానంగా  బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన తీరు తెన్నులు, మంచిచెడులు, మరీ ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగంలోని పాజిటివ్, నెగటివ్  అంశాలను  ప్రస్తావించారు. అందులో ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, ఆమె బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ అనుకూల ధోరణితోనే  కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషించినట్లు ఉందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా  కేసీఆర్ ప్రసంగంలో బీజేపీని అలా పైపైన ఒకటి రెండు పొడిపొడి మాటలతో వదిలేయడం, చిన్నిచిన్ని వాతలు మాత్రమే పెట్టి వదిలేయడం, తమ సహజ ధోరణిలో గట్టిగా  తిట్టక  పోవడం  కవితకు నచ్చలేదు. బీజేపీని కేవలం రెండు నిముషాలు మాత్రమే టార్గెట్ చేశారేంటి డాడీ  అంటూ ఆమె కేసీఆర్ కు వేసిన ప్రశ్నలో, కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీని, మోదీని బండకేసి ఉతికి ఆరేయ లేదనే బాధ వ్యక్తమైందని అంటున్నారు. అలాగే.. ఉర్దూలో ప్రసంగింక పోవడాన్ని, వక్ఫ్ బిల్లు ప్రస్తావన తేక  పోవడాన్ని కూడా కవిత తప్పు పట్టారు. అలాగే, దండకారణ్యంలో నక్సల్స్ ఏరివేత, నక్సలిజం నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ ని ఆపి నక్సల్స్ తో చర్చలు జరపాలని డిమాండ్ చేయడం బాగుందని, కేసీఆర్ ను కవిత మెచ్చు కున్నారు. ఇవేవీ కూడ బీజేపీకి రుచించే అంశాలు కాదు. బీజేపీతో కలిసి నడవాలని అనుకునే ఎవరూ  ఇలాంటి ఎజెండాను ముందు పెట్టరు.  అంటే..  కవిత భవిష్యత్ ఎజెండా బీజేపీ వ్యతిరేక ఎజెండాగా ఉంటుందని చెప్పకనే చెప్పినట్లు అయింది. మరో వంక ఆమె  కేసీఆర్ తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించక పోవడాన్ని మెచ్చుకున్నారు.  దీన్ని బట్టి చూస్తే, కవిత ఆలోచనలు కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నట్లు అర్థమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.  ఈ అన్నికంటే ముఖ్యంగా కవిత తెర పైకి తెచ్చిన సామాజిక తెలంగాణ  అంశం  రాహుల గాంధీ ప్రవచించిన, రేవంత్ రెడ్డి జపిస్తున్న కుల గణనకు దగ్గరగా ఉందని అంటున్నారు.  అలాగే..  రాష్ట్రంలో కవిత కథ నడుస్తున్న సమయంలోనే, ఢిల్లీలోని ఎఐసీసీ కార్యాలయంలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సామాజిక న్యాయ సదస్సు నిర్వహించడం..  అందుకోసం  ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను మూడో రోజు కొనసాగించడం.. మరో వంక కవిత అమెరికా నుంచి వచ్చి రెండు రోజులు అయినా ఇంతవరకు కేసీఆర్ ను కలవక పోవడం, ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని వస్తున్న వార్తలు గమనిస్తే, కవిత బీఆర్ఎస్  నుంచి అనివార్యంగా బయటకు రావలసి వస్తే ... కాంగ్రెస్ దగ్గరవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే..  ప్రస్తుతానికి కవిత ఎవరితోనూ చేతులు కలపక పోవచ్చని, అన్ని కోణాల్లో పరిస్థితిని సమీక్షించుకున్న తర్వానే  తుది నిర్ణయం ఉటుందని అంటున్నారు.

ద్రోహుల సమాచారంతోనే నంబాల ఎన్ కౌంటర్

మావోయిస్టుల సంచలన లేఖ పాకిస్థాన్‌తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్న   మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు తొలిసారిగా సంచలన లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు.   6నెలలుగా మాడ్ ప్రాంతంలోనే నంబాల ఉన్నట్లు ప్రకటించారు. కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవలే లొంగిపోయారని మావోయిస్టులు లేఖలో తెలిపారు.  వారు ఇచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పుకొచ్చారు. కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటే ఆయన ఒప్పుకోలేదని అన్నారు. కేశవరావు కోసం 35మంది ప్రాణాలు అడ్డుపెడితే ఏడుగురం సురక్షితంగా బయటపడ్డామని తెలిపారు. 27మంది ఎన్ కౌంటర్‌లో చనిపోయారని చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్నించారు. స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో ఈ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు. కాగా, మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు అంత్యక్రియలు  సోమవారం(మే 26) సాయంత్రం పూర్తి అయ్యాయి. మాడ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబర్ల కేశవరావు చనిపోయిన విషయం తెలిసిందే. కేశవరావు మృతదేహాన్ని అప్పగించాలంటూ బలగాలని కుటుంబ సభ్యులు కోరారు. కేశవ్‌రావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా భద్రతా బలగాలే అంత్యక్రియలు పూర్తిచేశాయి. అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్లకు పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగు రోజులుగా మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది. 

నాడు అవమానం.. నేడు సన్మానం!

ఆయన జాగీరులో అడుగు పెట్టాలంటే భయపడాలి... ఆయన అనుమతి లేనిదే చెట్టు ఆకు రాలేదు.. కోడి కూయదు అనే చెందగా మారింది గత ఐదేళ్ల కాలంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసింది చట్టం.. చెప్పింది న్యాయం. ఇదే పెద్దిరెడ్డి జాగీరులో అడుగడుగునా సాగిన అరాచకాలు.  గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారు. ఆ అరెస్టు నేపథ్యంలో అనేక మంది ప్రత్యక్షంగా... పరోక్షంగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. చంద్రబాబుకు సంఘీభావంగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సామన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు  సైకిల్ యాత్ర చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామకృష్ణ, రామసూరి, ఆది నారాయణ, సుందరరావు రమేష్ సైకిల్ యాత్ర చేస్తూ పుంగనూరు నియోజకవర్గంలోకి 2023 అక్టోబర్ 22న వచ్చారు. పుంగనూరు సుగాలిమిట్ట వద్దకు చేరుకోగానే పెద్దిరెడ్డి అనుచరులు వారిపై దాష్టీకానికి పాల్పడ్డారు. సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు టీ తాగడానికి నిలవడంతో వారిని బూతులతో తిడుతూ టీడీపీ జెండాలను, వేసుకున్న పసుపురంగు షర్టులను తీయించారు.  తీవ్రంగా అవమానించారు. అదే పుంగనూరు నియోజకవర్గంలోని సుగలిమిట్ట వద్ద..  ఎక్కడైతే పసుపు సైనికులకు అవమానం జరిగిందో అక్కడే వారికి ఇప్పుడు సన్మానం జరిగింది.   పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి సైకిల్ యాత్ర చేస్తున్న వారి సైకిళ్ల కి పాలాభిషేకం చేశారు. అవమానం ఎదుర్కొన్న ఐదుగురికీ పూలమాలలు వేసి శాలువలతో సత్కరించారు. అవమానం జరిగిన చోటే ఘనంగా సన్మానించి.. సగౌరవంగా మహానాడుకు పంపారు.  

కడప గడపలో ఎదురొడ్డిన నిలిచిన పసుపు జెండా

43 ఏళ్ళ ప్రస్థానానికి జనం అండ  సీమ దత్త పుత్రుడు గా ఎన్టీఆర్ చిరస్మరణీయుడు చంద్రబాబు నేతృత్వంలోనూ ఆయన వెంటే కడప జనం.  మరోత్సాహంతో కడపలో తెలుగుదేశం మహానాడు. కడపలో మూడు రోజుల పాటు పసుపు పండగ  సీమ నడిబొడ్డు కడప గడ్డన ఎదురొడ్డి పోరాడిన తెలుగుదేశం పార్టీకి ఆపార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నాలుగు దశాబ్దాలకు పైగా కడప జనం అండగా నిలిచారు. జెండా ఎత్తి పోరు సాగించారు. జిల్లా రాజకీయాల్లో అప్పట్లో కాంగ్రెస్ నేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ప్రాబల్యం నడుస్తూ వచ్చినా  తెలుగుదేశం పార్టీ మొక్క వోని  విశ్వాసంతో ముందుకు సాగింది. పడుతూ లేస్తూ వచ్చి హీరోలా నిలిచింది. ప్రజాబలమే   కొండంత అండగా 43 ఏళ్ల ప్రస్థానం సాగించిన తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కడప జిల్లాలో కార్యకర్తలే పట్టు సడలకుండా  జెండా ఎగరేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల దాకా పదిసార్లు ఎన్నికలు జరిగితే ఇందులో ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ నే పైచేయి సాధించి విజయం  సాధించింది. చంద్రబాబు నాయుడు పగ్గాలు పట్టిన తరువాతా పార్టీకి కడప ఎప్పటిలాగే వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి,  తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత 1999 ఎన్నికల్లో కూడా  తెలుగుదేశం జిల్లాలో హవా కొనసాగించింది. ఈ  ఎన్నికల్లో మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది స్థానాలు గెలుచుకొని ఉమ్మడి కడపలో తన సత్తా ఏంటో చాటింది . వైయస్ రాజశేఖరరెడ్డి , వైయస్ జగన్మోహన్ రెడ్డి లు సొంత గడ్డపై ఎదురొడ్డి పోరాడుతూ పార్టీ కార్యకర్తలు, ప్రజల  గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు కడప జిల్లాలో జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలలో ఉత్సహాన్ని నింపింది.  జీరో నుంచి హీరోగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన పట్టు సాగిస్తూ వచ్చినా 2004 నుంచి  2019 ఎన్నికల వరకు  పార్టీ ఫలితాలు తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. 2019 ఎన్నికల్లో అటు పార్లమెంటు గాని ఇటు అసెంబ్లీలో గాని ఒక్క సీటు కూడా రాకుండా జీరో స్థాయికి ఫలితాలు పడిపోయాయి.అయినా  కార్యకర్తలు, పార్టీ  ఏ మాత్రం విశ్వాసం కోల్పోకుండా పని చేయడం జరిగింది . గత ఏడాది  జరిగిన ఎన్నికల్లో జీరో పలితాలు  నుంచి హీరోగా ఎగిరింది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిలో ఏడు స్థానాల్లో కూటమి జయకేతనం ఎగురవేసింది. వాటిలో   ఐ దు స్థానాలలో తెలుగుదేశం జయభేరి మోగించింది.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది . ఈ ఫలితాలతో జిల్లా తెలుగుదేశం పార్టీ  ప్రతిష్టాత్మక ఫలితాలను భవిష్యత్తులోనూ సాధించాలన్న పట్టుదలతో కడపలో మహానాడును  తలపెట్టి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు వై సిపి పట్టును సడలించే  ప్రణాళిక తో మహానాడు మహానాడు జరుపుకుంటోంది. 1983 నుంచి 2024 దాకా  తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక 1983 నుంచి   2024 వరకు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలాన్ని, గెలుపు ఓటములను పరిశీలిస్తే.. ఇప్పటివరకు పదిసార్లు జరిగిన ఎన్నికల్లో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. డీలిమిటేషన్ కు ముందు 11 అసెంబ్లీ స్థానాల్లో 1983లో మొత్తం  6 స్థానాలు గెలుచుకుంది. 1985లో జరిగిన ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకోగా 1989లో 2  స్థానాలకే పరిమితమైంది.  1994 లో తిరిగి పైకి లేచి 8 స్థానాలు గెలుచుకుంది. 1999లో తొమ్మిది స్థానాలు  సొంతం చేసుకుంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగించడంతో టిడిపి కేవలం రెండు స్థానాలకే  పరిమితమైంది. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీకి  కోలుకోలేని దెబ్బ తగులుతూ వచ్చింది .2009 ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం అయింది .డీ లిమిటేషన జరిగి 10 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన ఉమ్మడి జిల్లాలో 2014 లో కూడా ఒక్క అసెంబ్లీ స్థానానికే  పరిమితం కాగా 2019లో ఒక్క అసెంబ్లీ స్థానం కానీ ,ఒక్క పార్లమెంటు స్థానం గాని గెలుచుకొని దుస్థితిలోకి పార్టీ వెళ్లిపోయింది. ఆ తర్వాత జిల్లాలో పార్టీ కోలుకోవడం  కష్టమే అనుకుంటూ వచ్చినా టిడిపి మాత్రం జగన్ సొంత జిల్లాలోనే  వైసీపీకి  గట్టి  దెబ్బ కొట్టి కూటమితో కలిసి  ఎన్నికల్లో దిగి పార్టీ పరంగా ఐదు కూటమి పరంగా ఏడు స్థానాలు సాధించింది .దీంతో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ,బద్వేలు, రాజంపేటలో మాత్రమే వైసిపి అభ్యర్థులు గెలిచారు .ఈ ఫలితాలతో ఉత్సాహంలో ఉన్న టీడీపీ శ్రేణులలో జోష్ ను మరింత పెంచేందుకు   మహానాడుకు కడప వేదికైంది. కంచు కోటలా ఆ రెండు స్థానాలూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కంచు కోటల్లా  మారాయి 1983 నుంచి 1999 దాకా జమ్మలమడుగు, రైల్వే కోడూరు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి వరుస విజయాలను సాధించిపెట్టాయి. అయితే 2004, 2009, 2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. అయితే 2024 ఎన్నికలలో మళ్లీ ఇక్కడ జెండా ఎగురేసింది.  కాకపోతే తెలుగుదేశం కంచు కోటలైన జమ్మలమడుగు లో బిజెపి , రైల్వే కోడూరులో జనసేన గెలవడం జరిగింది.  సీమ దత్త పుత్రుడు గా ఎన్టీఆర్  సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు రాయలసీమ దత్తపుత్రుడుగా పేరుగాంచారు . ఆయనకు  రాయలసీమ ప్రజలు నీరాజనాలు పట్టారు.  ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడపలో చారిత్రాత్మకమైన అభివృద్ధి జరిగింది. ముద్దనూరు దగ్గర రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించారు. నందలూరు దగ్గర  వందలాది మందికి ఉపాధి కల్పించే ఆల్విన్ ఫ్యాక్టరీని ఆయన హయాంలోనే నిర్మించారు. ఇవే కాదు తెలుగు గంగ ప్రాజెక్టుకు  అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు గాలేరు -నగరికి రూపకల్పన చేసి ప్రకటించారు. ఇలా రాయలసీమకు చారిత్రాత్మకమైన సీమ కడగండ్లు తీర్చే అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. అంతేకాదు రాయల సీమలోని  అనంతరం జిల్లా హిందూపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి గా ప్రాతినిధ్యం వహించారు. ఒంటిమిట్టకు వెలుగు తెచ్చిన  చంద్రబాబు  జిల్లాలో చారిత్రక పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో   విలువ తీసుకొచ్చారు. రాష్ట్రం విడిపోయాక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్టలో జరిపే లాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించేవారు. రాష్ట్రం విడిపోయాక ఒంటిమిట్ట కు ఆ భాగ్యం దక్కింది. ప్రాజెక్టుల పరంగా చూస్తే గాలేరు-నగరి  మొదటి దిశలో మిగిలి ఉన్న పనులను 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు దాదాపు పూర్తి చేశారు.  ముస్లిం మైనార్టీల కోసం కడప సమీపంలో హజ్ హౌస్ ను నిర్మించారు. కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినప్పటికీ ఆ తర్వాత 2019లో ఎన్నికల్లో ఓటమి  పాలు కావడంతో ఆ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కొనసాగ లేకపోయింది .ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్న  ఎన్టీ రామారావు ,చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

ఏపీ పూర్తి స్థాయి డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా నియమకం

  ప్రస్తుత ఇన్‌చార్జి డీజీపీగా కొన‌సాగుతున్న హరీశ్‌కుమార్ గుప్తాను పూర్తిస్థాయిలో ఏపీ పోలీస్ బాస్‌గా నియమిస్తూ కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. నేటీ నుంచి రెండేళ్ల పాటు ఆయన డీజీపీగా కొనసాగనున్నారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో హరీశ్‌కుమార్ గుప్తాను ప్ర‌భుత్వం ఇన్‌చార్జి డీజీపీగా నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ప‌నితీరు సంతృప్తిక‌రంగా ఉండ‌డంతో ఆయ‌న‌నే పూర్తిస్థాయి డీజీపీగా నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం  నిర్ణ‌యించింది.  రిటైర్‌మెంట్ వ‌య‌సుతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు హరీశ్‌కుమార్ గుప్తా ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారు.  నూతన పూర్తి స్థాయి డీజీపీగా ఎంపికైన ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. జమ్మూకశ్మీరుకు చెందిన ఆయన.. న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. 1993 డిసెంబరులో ఖమ్మం ఏఎస్పీగా తొలుత విధుల్లో చేరారు. తర్వాత మెదక్‌, పెద్దపల్లి ఏఎస్పీగా పనిచేశారు. కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల అదపు ఎస్పీగా.. అనంతరం కృష్ణా, నల్లగొండ జిల్లాల ఎస్పీగా విధులు నిర్వహించారు. సమర్థ అధికారిగా పేరుతెచ్చుకున్న ఆయన.. గుంటూరు రేంజ్‌ ఐజీ, శాంతిభద్రతల ఐజీగానూ పనిచేశారు.  

కేటీఆర్‌‌కు బిగ్ షాక్..మరోసారి ఏసీబీ నోటీసులు

  ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 28న హాజరుకావాలంటూ తనకు ఏసీబీ  నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తాను యూకే, యూఎస్ వెళ్తున్నందున తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని చెప్పినట్లు మాజీమంత్రి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగానే నోటీసులు వచ్చాయన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జిషీటులో ఆయన పేరు చేర్చి 48గంటలు గడుస్తున్నా ఒక్క బీజేపీ నేత దీనిపై మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు.  అయితే కేబినెట్, ఆర్థిక శాఖల అనుమతి లేకుండా రూ.45 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆర్బీఐ రూల్స్ ఫాలో కాకుండా మౌఖిక ఆదేశాలతో నగదు బదిలీ చేసినట్లు ఆరోపించారు. రూ.10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపునకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి ఉండాలన్న రూల్ బుక్‌ను హెచ్‌ఎండీఏ ఫాలో కాలేదని.. చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు ఈ కారు రేసులో వ్యవహారంలో అప్పటి మున్సిపల్ మంత్రి బీఎల్‌ఎన్‌పై, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ అధికారి బీఎల్‌ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసులు పెట్టింది.  

గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతు..సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

  అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాకినాడ జిల్లా రామచంద్రపురం మండపేటకు చెందిన యువకులు శురుల్లంక  గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి పలువురు యువకులు హాజరయ్యారు. వీరిలో 11 మంది సరదాగా స్నానం చేసేందుకు సమీపంలోని కమినిలంక వద్ద గోదావరి నదిలోకి దిగారు. అయితే, వారు దిగిన ప్రాంతంలో నది లోతు ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిలో ముగ్గురు అతి కష్టం మీద సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు.గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్‌, సాయి, సతీష్‌, మహేశ్‌, రాజేశ్‌, రోహిత్‌, మహేశ్‌గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నదిలో యువకులు గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గల్లంతైన వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాలింపు చర్యల వివరాలను చంద్రబాబుకు కలెక్టర్‌ వివరించారు. అలాగే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కూడా కోనసీమ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీని వీలైనంత త్వరగా కనుగొనేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది.   

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం అలర్ట్

  దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 1,009 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌  డైరెక్టర్ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాస్కులు ధరించాలని జగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  డేటాబోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం..  ఈ ఉదయం 8గంటల వరకు రాష్ట్రాల వారీగా కొవిడ్‌ యాక్టివ్‌ కేసుల వివరాలు పరిశీలిస్తే.. కేరళలో అత్యధికంగా 430 క్రియాశీల కేసులు ఉండగా.. మహారాష్ట్ర (209), దిల్లీ (104), గుజరాత్‌ (83), తమిళనాడు (69), కర్ణాటక (47) ఏపీ 4, మధ్యప్రదేశ్‌ 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.  

మహానాడుకు వెళ్తూ కార్యకర్త కొట్టుకెళ్లి టీ తాగిన లోకేష్.. కార్యకర్త భావోద్వేగం

  చిత్తురు జిల్లా కుప్పం వచ్చి గత రెండురోజులుగా బిజీ బిజీగా ఉన్న రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ వీరాభిమానినని, శాంతిపురంలో టీకొట్టు నడపుతూ జీవనం సాగిస్తున్నాటీడీపీ వీరాభిమాని చెంగాచారికి కలిశారు. కుప్పం నుంచి కడప మహానాడుకు బయలుదేరిన యువనేత లోకేష్ సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా టీకొట్టు వద్దకు వెళ్లాడు. అన్నా... చాలా దూరం వెళ్లాలి... టీ ఇస్తావా అని అడిగాడు లోకేష్. చెంగాచారికి కొద్దిసేపు నోటమాట రాలేదు. తమ అభిమాననేత నేరుగా తమ కొట్టుకురావడంతో సంభ్రమాశ్చార్యానికి లోనయ్యాడు. యువనేత లోకేష్ కు టీ గ్లాసు అందించాడు.  వ్యాపారం ఎలా ఉందని అడగ్గా చెంగాచారి స్పందిస్తూ... సర్... నేను 1994 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్నా. చంద్రబాబు గారంటే అభిమానం. నేను టిడిపికి చెందిన వాడినన్న కోపంతో గత అయిదేళ్లుగా నా టీ అంగడిని మూయించేశారు. గత ఏడాది జూన్ 12న చంద్రబాబు గారు సిఎంగా ప్రమాణ స్వీకారం చేశాక 17వతేదీ మళ్లీ టీకొట్టు ప్రారంభించా. నాకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒకబిడ్డకు పెళ్లయింది... మరో కూతురికి పెళ్లి చేయాలి. మీరు మా అంగడికి రావడం నమ్మలేక పోతున్నా చిన్నయ్యా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. చెంగాచారి భుజం తట్టిన యువనేత లోకేష్... ఇప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నీ వెంట నేనున్నా... ఏ అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ముందుకు సాగారు. కార్యకర్తకు యువనేత లోకేష్ ఎంతటి ప్రాధాన్యత నిస్తారనడానికి ఇదొక మచ్చుతునక.  

వైసీపీ ప్రభుత్వంలో సాయం అడగడానికి భయపడాల్సి వచ్చేది : దిల్ రాజు

  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో సపోర్ట్ చేశారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సాయం అడగడానికి భయపడాల్సి వచ్చేదని ఆయన అన్నారు. పవన్ వచ్చిన తర్వాత నిర్మాతలు ఏపీకి పక్కింటి వెళ్లొచ్చినట్లు వెళ్లొస్తున్నారని ఆయన తెలిపారు. ఓ అప్లికేషన్ లేదా ఫోన్‌లో మాట్లాడితే సినిమా టికెట్ల ధరలు పెరిగిపోతున్నాయన్నారు. టాలీవుడ్‌లో కొందరు ఎంతకు దిగజారిపోతున్నారో వారు చేస్తున్న పనులు చూస్తుంటే తెలుస్తుందని ఆయన అన్నారు.ఇటీవల థియేటర్ల విషయంలో నెలకొన్న కాంట్రావర్సీపై ఆయన స్పందించారు.  తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే.. వాటిలో 30 థియేటర్లు తనవేనన్నారు. పవన్ కళ్యాణ్ మా పెద్దన్న ఆయన తిడితే మేము పడతామని దిల్‌రాజు అన్నారు. పవర్ స్టార్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. మీడియా వల్ల జరిగిన మిస్ కమ్యూనికేషన్ కారణంగానే పవన్ కల్యాణ్ హార్ట్ అయ్యాడని ఆయన పేర్కొన్నారు. తాను హాలిడేకు వెళ్లి వచ్చేసరికి మే18న ఎగ్జిబిటర్లు మీటింగ్ పెట్టుకున్నారని, చివరి పావుగంట మాత్రమే మీటింగ్ కు వెళ్లానని చెప్పారు. వారు అక్కడ సినిమాలపై పర్సంటేజిలపై తమకున్న డిమాండ్లను చెప్పారని, వారి సమస్యల్ని పరిష్కరించేందుకే తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంతలోనే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్  అనే వార్తలొచ్చాయని అసహనం వ్యక్తం చేశారు.  డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో పూర్తిస్థాయి సమావేశం జరగకుండానే ఇలాంటి న్యూస్ ను వ్యాప్తి చేయడంపై ఆవేదన చెందారు. ఇదే అంశంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్  తనతో మాట్లాడారని, థియేటర్లు మూసివేయరని ఆయనకు అప్పుడే చెప్పానని వెల్లడించారు. ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించిన జాయింట్ మీటింగ్ లోనే థియేటర్ల అంశంపై స్పష్టత వచ్చిందని, ఈలోపే కొందరు ప్రభుత్వాలకు తప్పుడు సమాచారం అందించడం వల్ల ఇది వివాదం రూపుదాల్చిందని దిల్ రాజు పేర్కొన్నారు. మే 30న భైరవం, జూన్ 5న కమల్ హాసన్ సినిమా, జూన్ 12 పవన్ కల్యాణ్   సినిమా, జూన్ 20 కుబేర సినిమాలు ఉన్నాయి... జులై, ఆగస్టులో కూడా కొత్త చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా థియేటర్లు మూసివేసుకుంటారా? అని ప్రశ్నించారు. అలా చేస్తే ఎగ్జిబిటర్లకే కదా నష్టం అని అన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..ఎల్లో అలెర్ట్‌ జారీ

  తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, అల్లూరి జిల్లాల్లో  తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. తెలంగాణలో ఈ నెల 29 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని.. నైరుతి విస్తరణకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని తెలిపింది. మంగళవారం పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది.  నైరుతి రుతుపవనాల కారణంగా రాయలసీమలో  భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్నాది. ఈ మేరకు ఒకరోజు ముందుగానే ఇవాళ కడపలో ఓ మోస్తారుగా వర్షం కురుస్తోంది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, వేటపాలెంలలో భారీ వర్షం కురిసింది. గంటకుపైగా కురిసిన వర్షానికి పట్టణంలోని రహదార్లు చిత్తడిగా మారాయి. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులతో వాన పడుతుండటంతో ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముంబాయిలో భారీ వర్షంతో జనజీవనం  అతలాకుతలం అయింది. ఆత్రే చౌక్ మెట్రో స్టేషన్‌లోకి భారీగా వర్షపు నీరు చేరింది. స్టేషన్ మెట్లపై నుంచి నీరు జలపాతంలా ఉధృతంగా కిందికి ప్రవహిస్తున్న దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీంతో స్టేషన్ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయి చెరువును తలపించింది. 

వంశీ పిటిషన్ ను తోసిపుచ్చిన నూజివీడు కోర్టు.. మళ్లీ విజయవాడ జిల్లా జైలుకే!

గన్నవరం మాజీ  ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీకి  మరోసారి నిరాశే ఎదురైంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను  నూజివీడు కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తనపై నమోదైన అభియోగాలను రద్దు చేయాలని కోరుతూ వంశీ దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. వంశీ పిటిషన్ పై సోమవారం నూజివీడు కోర్టు విచారిం చింది. ఇరు పక్షాల వాదనలూ విన్న మీదట వంశీ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా కోర్టులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఉండగా పోలీసు కస్టడీలో ఉండగా అస్వస్థతకు గురైన వంశీని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు చికిత్స అందించిన తరువాత తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా వంశీ ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి విడుదల చేసిన బులిటిన్ మేరకు వంశీకి ఫిట్స్ ఉన్నాయి. అలాగే నిద్రలో శ్వస అగిపోవడం అనే సమస్య కూడా ఉంది. ఈ సమస్యకు చికిత్స చేయడానికి ముందు స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ టెస్ట్ చేయడానికి అవసరమైన పరికరాలు జీజీహచ్ లో లోకపోవడంతో  ఆ టెస్ట్ చేయించుకోవడం కోసం మరో  ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు ఆ బులిటిన్ పేర్కొంది. 

తరచు ఎన్నిక‌లతో ప్రజా ధ‌నం వృధా : డిప్యూటీ సీఎం పవన్

  దేశం ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  చెన్నైలో జరుగుతున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ సెమినార్‌లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతు జమిలీ ఎన్నికలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. తరచూ ఎన్నికలతో కేంద్రంపై భారం పడుతుందని ఆయన తెలిపారు.భారత్‌కు ఉన్న సామర్ధ్యం రీత్యా ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ఆచరణ సాధ్యమే అని తెలిపారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ప్రధాని మోదీనే అని పవన్ పేర్కొన్నారు. త్వరల్లో తమిళనాడులో ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు ఖాయమని అన్నారు. అవసరం అయితే ఇక్కడ ప్రచారం చేసేందుకు తాను వస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ క్రమంలో సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని అన్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై వైసీపీకీ ఓ విధానం లేదని అన్నారు. 2019లో వైసీపీ గెలిచింది కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ద్వారనే అని ఆయన తెలిపారు. పవన్‌సై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై ప్రశంసలు కురిపించారు. పవన్ ఏపీ నుంచి ఓ శక్తిలా ఇక్కడికి వచ్చారని ఆయను సుస్వాగతం మీరు రావడం నాకే కాదు మొత్తం తమిళనాడుకే చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.