కేటీఆర్‌కు బిగ్ షాక్..మరోసారి ఏసీబీ నోటీసులు
posted on May 26, 2025 @ 9:06PM
ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 28న హాజరుకావాలంటూ తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తాను యూకే, యూఎస్ వెళ్తున్నందున తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని చెప్పినట్లు మాజీమంత్రి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగానే నోటీసులు వచ్చాయన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జిషీటులో ఆయన పేరు చేర్చి 48గంటలు గడుస్తున్నా ఒక్క బీజేపీ నేత దీనిపై మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు.
అయితే కేబినెట్, ఆర్థిక శాఖల అనుమతి లేకుండా రూ.45 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని కేటీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆర్బీఐ రూల్స్ ఫాలో కాకుండా మౌఖిక ఆదేశాలతో నగదు బదిలీ చేసినట్లు ఆరోపించారు. రూ.10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపునకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి ఉండాలన్న రూల్ బుక్‌ను హెచ్‌ఎండీఏ ఫాలో కాలేదని.. చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు ఈ కారు రేసులో వ్యవహారంలో అప్పటి మున్సిపల్ మంత్రి బీఎల్‌ఎన్‌పై, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ అధికారి బీఎల్‌ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసులు పెట్టింది.