పాపం ఆ తండ్రిని అర్ధం చేసుకోండి ప్లీజ్!

రాజేంద్ర‌ప్రాద్ అభిమాని విన్న‌పం రాజేంద్ర ప్ర‌సాద్ ఈ మ‌ధ్య తన  కూతురు చ‌నిపోయిన‌ప్ప‌టి నుంచి ఇలా మారిపోయారా? అంటే అవున‌నే తెలుస్తోంది.  మొన్న రాబిన్ హుడ్ సినిమా ఫంక్ష‌న్లో డేవిడ్ వార్న‌ర్ ని దొ*గ ము*కొడుకు అంటూ కామెంట్ చేసి ట్రోల్ అయ్యారు. ఇప్పుడు చూస్తే.. అలీని, త‌ర్వాత రోజాని అన‌డం వ‌ల్ల హాట్ టాపిక్ అయ్యారు.   అలీని అన‌రాని మాట‌లు అన్నార‌న్న‌ది ఒక అభియోగం కాగా.. దాన్ని నేనే హీరోయిన్ చేశాన‌ని రోజాను అన్న‌ట్టుగా ఆయ‌న చెప్పుకోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల పాలు చేస్తోంది. ఇదొక మాన‌సిక అవ‌స్థ‌. ఇన్నాళ్ల పాటు ఎంతో హుందాగా, మ‌రెంతో గౌర‌వంగా ఉన్న ఒక వ్య‌క్తి.. న‌ట కిరీటి బిరుదాంకితుడు.. ప్రొడ్యూస‌ర్స్ హీరో, మినిమం గ్యారంటీ హిట్ మేకర్, ఆపై సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ పెద్ద ఎత్తున హిట్స్ ఇచ్చిన వాడైన రాజేంద్ర ప్ర‌సాద్ ఆల్ ఆఫ్ ఏ స‌డెన్ గా ఇలా మారిపోవ‌డం వెన‌క ఒక అంతుచిక్క‌ని ర‌హ‌స్య‌మేదో దాగి ఉంద‌ని మీకేమీ అనిపించ‌డం లేదా? ఆయ‌న త‌న కూతురి మ‌ర‌ణంతో పూర్తిగా దెబ్బ తినేశారు. ఆ భ‌యంక‌ర‌మైన బాధ- నొప్పి- ఆవేద‌న నుంచి త‌న‌ను తాను బ‌య‌ట ప‌డేసుకోడానికి.. ఇలా చేస్తుంటారేమో అంటున్నారు మాన‌సిక నిపుణులు. ఒక మ‌నిషికి ఇదో అవ‌స్థ‌. ఈ అవ‌స్థ అంద‌రికీ అర్ధ‌మ‌య్యేది కాదు. కొంద‌రిక‌కి మాత్ర‌మే తెలుస్తుంది. నిజానికి రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసింది త‌ప్పే.. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆయ‌న అన్న‌మాట‌ల్లోనూ ఒక నిజ‌ముంది. కానీ స‌భా మ‌ర్యాద ప్ర‌కారం చూస్తే అది త‌ప్పు కూడా.  ఈ విష‌యాల‌న్నిటినీ బేరీజు వేసుకుని చూస్తే.. ఆయ‌న్ను మ‌నం ఒక బాధితుడిగా చూడాలి త‌ప్ప‌.. నిందితుడిగా బోనులోకి ఎక్కించ‌డం ఎంత వ‌ర‌కూ క‌రెక్ట్ అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చాలా మంది చెప్ప‌డాన్ని బ‌ట్టి  చూస్తే ఆయ‌న త‌నకు తెలీకుండా ఒక ఆందోళ‌న‌కు బందీ. ఆ బందిఖానా నుంచి చెర విముక్తి చేసుకోడంలో  భాగంగా త‌న‌కు తెలీకుండా ఇలా అయిపోయారు. ఆయ‌న్ను ఆద‌రించండి త‌ప్ప త‌క్కువ చేసి చూడొద్ద‌న్న మాట ఒకింత గ‌ట్టిగానే వినిపిస్తోంది. మీకు తెలుసో తెలీదో.. స‌ర‌సంలో ప్రియురాలు, యుద్ధంలో సైనికుడు, పొగిడేట‌పుడు క‌వి.. క‌ట్టు త‌ప్పుతార‌ట‌.  రారా పోరా ఒరే తురే అంటార‌ట‌. అలాగే ఇది కూడా.. అంటారు కొంద‌రు.  నాకెవ‌రూ లేక పోలేదు.. ఇదిగో ఎక్క‌డి నుంచో వ‌చ్చిన డేవిడ్ వార్న‌ర్ని నేను దొ*గ ము* కొడుకు అన‌ద‌గినంత చొర‌వుంది. అలీని.. ల‌*కొడుకు అనేంత చునువుంది. ఇక రోజాను నేనే హీరోయిన్ని చేశాన‌నేంత ద‌గ్గ‌రిత‌న‌ముంది. ఇక నాకు ఎన్టీఆర్ అవార్డు వ‌చ్చిన‌పుడు మీరు చ‌ప్ప‌ట్లు కొట్టకుంటే సిగ్గులేన‌ట్టే అనేంత అతి చ‌నువూ ఉందని  చెప్ప‌డంలో భాగ‌మే ఇదంతా. ఇది ఒక తండ్రి దీన మాన‌సిక గాథ‌. ఇందులో మీరు గుర్తించాల్సింది బంధుత్వాల‌ను ఆప్యాయ‌త‌ల‌ను. అంటే అన్నాడ్లే మా అన్న‌ద‌మ్ముడు, బాబాయ్ పెద‌నాన్న అంటూ అక్క‌డితో దీన్ని ముగించాలి. ఆయ‌న స‌రైన ప‌రిస్థితుల్లో ఉండ‌గా మ‌నం ఏమైనా అనుకోవ‌చ్చు. కానీ ఒక తండ్రికి  మాత్ర‌మే అర్ద‌మ‌య్యే తండ్రి భాష‌లోంచి ఆయ‌న్ను చూడండి. ఆ కోణంలోనే ఆయ‌న మాట‌ల‌ను తీస్కోండి. అంతే త‌ప్ప‌.. ఇందులో పెడ‌ర్దాలు తీయ‌వ‌ద్దు ప్లీజ్ అన్న‌ది ఆయ‌న్ను బాగా ఎరిగిన వారు అంటోన్న మాట‌. మీరేమంటారు???

బెంగళూరా? పంజాబా?.. నేడే ఐపీఎల్ ఫైనల్

కోహ్లీకి 18 సెంటిమెంట్ కలిసి వస్తుందా? క్రికెట్ అభిమానుల్లో.. ఐపీఎల్ పైనల్ ఉత్కంఠ పెంచుతోంది. ఈసారి కప్ కొట్టేది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా.. పంజాబ్ కింగ్సా? అనేది మోస్ట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.  ఐపీఎల్ మొదలై 18 ఏళ్లు అవుతున్నా.. ఈ రెండు టీమ్‌లూ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. కాబట్టి.. ఏ టీమ్ గెలిచినా.. కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికే.. క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పంజాబ్ కింగ్స్‌ని చిత్తుగా ఓడించి నేరుగా ఫైనల్ చేరుకుంది. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్.. ముంబై ఇండియన్స్‌పై అద్భుతమైన విజయం సాధించి.. ఫైనల్ చేరింది. రెండూ టీమ్‌లూ.. ఫైనల్ చేరుకునేందుకు సూపర్బ్ గా ఆడుతూ వచ్చాయ్.  అయితే.. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ.. పంజాబ్‌ని భారీ తేడాతో ఓడించింది. ఇది.. రాయల్స్‌కి కొంతవరకు అప్పర్ హ్యాండ్ తమదేననే ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ.. ఐపీఎల్ ఫైనల్‌లో ఏదైనా జరగొచ్చు. టీ20 క్రికెట్‌లో.. మ్యాచ్‌ని టర్న్ చేసే మూమెంట్స్ చాలా ఉంటాయ్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఆఖరి బంతి వరకు.. ఏ జట్టు గెలుస్తుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. దాంతో.. ఈసారి కప్పు కొట్టేది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా? లేక.. పంజాబ్ కింగ్సా? అన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఫీవర్ పెంచేస్తోంది. అయితే.. ఐపీఎల్‌‌లో ఇది 18వ సీజన్. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. ఆర్సీబీ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్న ఈ 18 సెంటిమెంట్.. బెంగళూరుని టైటిల్ విన్నర్‌గా నిలుపుతుందా?  లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు.. ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని.. ఆర్సీబీ కల ఈసారి నెరవేరుతుందా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. లీగ్‌ దశలో పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ పొజిషన్ సెంటిమెంట్ కూడా.. ఆర్సీబీకి పాజిటివ్ వైబ్ ఇస్తోంది.  ఇప్పటి వరకూ జరిగిన  ఐపీఎల్ హిస్టరీని పరిశీలిస్తే.. పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టు.. ఏకంగా 8 సార్లు టైటిల్‌ని గెలుచుకుంది. ఈ సెంటిమెంట్ ప్రకారం.. ఆర్సీబీకి కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పోర్ట్స్ అనలిస్టులు భావిస్తున్నారు. బలమైన బ్యాటింగ్ లైనప్ కూడా.. ఆర్సీబీకి ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, లివింగ్ స్టన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉండటం.. ఆర్సీబీకి పెద్ద బలమనే చెప్పాలి.  వీరికి.. ఎలాంటి టైమ్‌లోనైనా మ్యాచ్‌ని టర్న్ చేసే సత్తా ఉంది.  ఇక.. బ్యాలెన్స్‌డ్ బౌలింగ్ కూడా ఆర్సీబీకి కలిసొస్తోంది. యశ్ దయాల్,  జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ లాంటి పేసర్లు, సుయాష్ శర్మ లాంటి స్పిన్నర్లతో.. ఆర్సీబీ ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తోంది. ఇక వరుస విజయాలు, అద్భుతమైన ప్రదర్శన.. ఆర్సీబీలో కాన్ఫిడెన్స్‌ని పెంచాయి. ఇప్పుడు.. ఫైనల్స్ ఆడేందుకు కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఆర్సీబీ ప్లేయర్లలో ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయినప్పటికీ.. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ని ఓడించి ఫైనల్ చేరుకోవడం.. ఆ టీమ్‌లో కాన్ఫిడెన్స్‌  పెంచింది.  భారీ టార్గెట్లను ఛేదించే సామర్థ్యం.. పంజాబ్ కింగ్స్‌కు ఉంది. ఈ సీజన్‌లో అనేక సార్లు 200 పైగా పరుగులు చేసింది  ఈ టీమ్. దాంతో.. ఫైనల్‌లో ఎంత పెద్ద టార్గెట్‌నైనా ఛేదించగలమనే నమ్మకంతో ఉన్నారు పంజాబ్ ఫ్యాన్స్. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కూడా ఆ జట్టుకు ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. అతను.. టీమ్‌ని సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. జానీ బెయిర్ స్టో, జోష్ ఇంగ్లిష్ లాంటి పవర్ హిట్టర్లు, శ్రేయస్ అయ్యర్, నెహల్ వధేరా, మార్కస్ స్టోయినిస్ లాంటి బలమైన బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. కీలక సమయాల్లో వేగంగా పరుగులు చేసే సామర్థ్యం వీళ్లకు ఉంది.  ఆల్‌రౌండర్లు.. టీమ్‌కు ఉన్న మరో బలం. అర్ష్‌దీప్ సింగ్, చాహల్, హర్‌ప్రీత్ బార్ లాంటి బౌలర్లు.. కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్నవారు. పేస్, స్పిన్ కలయికతో.. పంజాబ్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లని ఇబ్బంది పెట్టగలరు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో భారీ ఓటమిని చవిచూసినా.. ముంబై ఇండియన్స్‌ లాంటి బలమైన టీమ్‌ని ఓడించి.. ఫైనల్ చేరడం పంజాబ్ కింగ్స్‌లో కాన్ఫిడెన్స్ పెంచింది. మొత్తంగా.. అటు ఆర్సీబీ, ఇటు పంజాబ్ కింగ్స్.. ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలనే  పట్టుదలతో ఉన్నాయ్. అయితే ఫైనల్‌లో ఏ టీమ్ మెరుగైన ప్రదర్శన చేస్తుంది.. ఎవరు ఒత్తిడిని ఎదుర్కొంటారనే దాని మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ ఫైనల్ చేరిన ఆర్సీబీ.. అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో పుంజుకున్న పంజాబ్ కింగ్స్.. ఫైనల్‌లో ఉన్నాయ్ కాబట్టి.. ఇదొక.. ఉత్కంఠభరితమైన ఫైనల్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

జగన్ కు లోకేష్ బంపరాఫర్!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు బంపరాఫర్ ఇచ్చారు. ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం కాదు.. వాటికి తగిన ఆధారాలు కూడా చూపించాలని చెబుతూనే.. జగన్ చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం చూపినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కు ఇది బంపరాఫరే.. ఎందుకంటే లోకేష్ సవాల్ ను స్వీకరించి.. ఆధారాలు చూపకపోతే జగన్ ఏం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సారీ చెబితే చాలు.    కేవలం తాను ప్రభుత్వంపై చేస్తున్న ఓ ఆరోపణకు సంబంధించి చిన్న ఆధారం బయట పెట్టడమే. అలా చేస్తే తాను రాజీనామా చేస్తానని నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సవాల్ చేశారు. ఇప్పుడు జగన్ కు తాను చెప్పింది అబద్దం కాదని.. తాను ఫేక్ చేయడం లేదని నిరూపించుకోవడానికైనా స్పందించి.. ఆధారాలు సమర్పించాల్సి ఉంది. లేకపోతే జగన్ రెడ్డి ఫేక్ పాలిటిక్స్ మరోసారి ఎక్స్ పోజ్ అవుతుంది.  ఇటీవలి కాలంలో జగన్ ఎప్పుడు మాట్లాడినా ఉర్సా క్లస్టర్ కంపెనీకి తెలుగుదేశం కూటమి సర్కార్ అతి ఉదారంగా నామమాత్రపు ధరకు ఎకరాలకు ఎకరాలు ఇచ్చేసిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. రూపాయికి ఇడ్లీలు కూడా రావనీ, అలాంటిది ఆ నామమాత్రపు ధరకు కూటమి సర్కార్ ఉదారంగా ఉర్సా కు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టేసిందనీ చేస్తున్న ఆరోపణలపైనే  ఎక్స్ వేదికగా లోకేష్  స్పందించారు.  ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపితే తాను రాజీనామా చేస్తాననీ, అలా చూపలేకపోతే జగన్ క్షమాపణ చెబితే చాలనీ సవాల్ విసిరారు.   ఉర్సా కంపెనీకి  ఎకరా కోటి రూపాయలు చొప్పున 3.5 ఎకరాలు.. ఎకరా 50 లక్షల రూపాయలు చొప్పున 56.5 ఎకరాల భూమిని ఉర్సా కు కేటాయించారు. ఈ మేరకు  జీవోల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే జగన్ మాత్రం వాస్తవాలతో సంబంధం లేకుండా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పిస్తున్నరు. ఈ నేపథ్యంలోనే జగన్ ఫేక్ రాజకీయానికి చెక్ పెట్టేలా లోకేష్ బహిరంగ సవాల్ విసిరి ఉర్సాకు ఉదారంగా భూములు కట్టబెట్టినట్లు ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తానంటూ చాలెంజ్ చేశారు. మరి లోకేష్ సవాల్ కు జగన్  ఎలా స్పందిస్తారో చూడాలి.  

ట్యాంకర్ ను ఢీ కొన్న కారు.. ఐదుగురు దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు సమీపంలో సోమవారం (జూన్ 2) రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  రాజమండ్రికి చెందిన ఒక కుటుంబం సోమవారం కాకినాడ బీచ్ సందర్శనకు వెళ్లింది.  తిరుగు ప్రయాణంలో  రంగంపేట మండలం వడిసలేరు వద్ద  రహదారి పక్కన నిలిపి ఉన్న ఒక ట్యాంకర్‌ను వారు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.  ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ఉన్నారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఐదేళ్ల చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.    ఈ రోడ్డు ప్రమాదంపై  ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  వడిశలేరు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలవ్వడం దురదృష్టకరమని పేర్కొన్న ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అలాగే ఈ ప్రమాదం పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలవ్వడం తనను కలిచివేసిందని పేర్కొన్నారు.  మృతుల కుటుంబసభ్యులకు   ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

తుని రైలు దగ్ధం కేసు.. మళ్లీ తెరపైకి!

తుని రైలు దగ్ధం కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమ నేలతపై వైసీపీ సర్కార్ ఎత్తివేసిన కేసుల పునర్విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించనుంది. ఈ కేసుల పునర్విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హెంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల డిమాండ్ తో 2016లో తునిలో ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలును దగ్ధం చేశారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. రైలు దగ్ధం సంఘటనను సీరియస్ గా తీసుకున్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడమే కాకుండా, ముద్రగడ సహా పలువురిపై కేసులు నమోదు చేసింది. అలాగే రైల్వే శాఖ కూడా విచారణకు ఆదేశించింది.   అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ కాపు ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసింది.  విజయవాడలోని 7 వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జ్, కోర్ట్ ఫర్ రైల్వేస్ ఈ కేసులను 2021 లో కొట్టివేశారు. అయితే రైల్వే శాఖ తర్వాత  ముద్రగడ సహా కొందరికి సమన్లు జారీ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసును తిరగతోడాలని నిర్ణయించింది.  ఈ కేసు కొట్టి వేత పై హైకోర్టుకు అప్పిలుకు వెళ్లాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశించింది.    

జగన్ అరెస్ట్.. సజ్జల చెబుతున్నది ఇదేగా?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు కావడం తథ్యం.. ఈ మాట అన్నది ఎవరో కాదు.. వైసీపీ హయాంలో  ముఖ్య సలహాదారుగా, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పి.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ కోటరీలో ముఖ్యభూమిక పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి. ఔను జగన్ అరెస్టు అవుతారని సజ్జల స్వయంగా చెబుతున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇష్టారీతిన కేసులు పెడుతోందనీ, ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో జగన్ పై కూడా కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. ఒక విధంగా జగన్ అరెస్టుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని సజ్జల పరోక్షంగా అయినా అంగీకరించేశారు. సజ్జల మాటలతో వైసీపీ నేతలు, కేడర్ కూడా జగన్ అరెస్టు అవ్వడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసి, అందుకు ప్రిపేర్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. వేరే ఎవరి దాకానో ఎందుకు స్వయంగా జగన్ కూడా అరెస్టు అనివార్యమన్న భావనకు వచ్చేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే జగన్ తనను అరెస్టు చేయడానికి పోలీసులు ఎప్పుడైనా రావచ్చునని చెప్పారు. అంతే కాదు తాను తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాననీ, అరెస్టు చేసుకోవచ్చుననీ సవాల్ కూడా విసిరారు. అయితే ఆ సవాల్ విసిరిన మరుసటి రోజే ఆయన బెంగళూరు చెక్కేశారు. దీంతో జగన్ లోనూ అరెస్టు భయం మొదలైందని అంటున్నారు.  అదలా ఉంచితే.. జగన్ పై కేసులు నమోదు చేస్తారని సజ్జల అనడంతో ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జగన్ ప్రమేయం ఉందని సజ్జల పరోక్షంగా అంగీకరించేసినట్లేనని వైసీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది. సజ్జల జగన్ అరెస్టు గురించి మాట్లాడటం ద్వారా.. మద్యం కుంభకోణం కేసులో జగన్ పాత్రను ఖరారు చేసినట్లైందని పార్టీ వర్గాలు అంటున్నాయి.   

పర్యావరణానికి పెద్దపీట.. 50శాతం పచ్చదనం లక్ష్యం.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో పర్యావరణానికి పెద్ద పీట వేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సంకల్పించింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిం చారు. సచివాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో గురువారం (జూన్ 5)న పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆ ఒక్క రోజే కోటి మొక్కలు నాటే బృహత్కార్యక్రమం చేపట్టాలన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిథులు చురుగ్గా పాల్గొనాలని,  విద్యాసంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలతో పాటు బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  గత ఏడాది రాష్ట్రంలో పచ్చదనం 29 శాతం ఉండగా, ఈ ఏడాది అది 30.5 శాతానికి పెరిగిందని చెప్పిన చంద్రబాబు,  రాష్ట్రంలో ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంత విస్తరణతో కలిపి 2033 నాటికి పచ్చదనాన్ని 37 శాతానికి, 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.  ఇందుకోసం  ఏటా   1.5 శాతం మేర పచ్చదనం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటడంతో సరిపోదనీ, అలా నాటఇన మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.   సీఆర్డీఏ పరిధిలోని అటవీ ప్రాంతంతో సహా మొత్తం పచ్చదనంపై శాటిలైట్ల సహాయంతో స్పష్టమైన సమాచారం సేకరించాలని, నాటిన ప్రతీ మొక్కకూ జియో ట్యాగింగ్ చేయాలని  ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించేందుకు సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం తీసుకునేలా ఒక విధానాన్ని రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.  రాష్ట్రాన్ని హరిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

కరవుతో పాక్ విలవిల.. స్వయంకృతాపరాధమేగా?

పాకిస్థాన్ నీటి కొరతతో విలవిలలాడుతోంది. ఇంత కాలంగా జలవనరుల విషయంలో భారత్ ఉదారతపై ఆధారపడి ఉన్న పాకిస్థాన్.. ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు అండదండలు అందిస్తూ భారత్ లో హింసను ప్రేరేపిస్తూ వచ్చింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ ఇక అమీతుమీ తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ సైనిక పాటవానికి ఆయువుపట్టులాంటి వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఆ దేశ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను సైతం లేపేసింది. అంతే కాకుండా సింధు జలాల ఒప్పందం  నుంచి వైదొలగింది. దీంతో పాకిస్థాన్ ఇప్పుడు నీటి కొరతతో  పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్ ను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించిన సమయంలో అదే జరిగితే నదిలో పారేది నీరు కాదు నెత్తురు అంటూ ప్రగల్భాలు పలగిన పాకిస్థాన్ ఇప్పుడు నీటి చుక్కకోసం అల్లల్లాడాల్సిన పరిస్థితిలో పడింది.  ఇప్పుడు పాకిస్థాన్ లో తాగునీరు, సాగునీరు కోసం వెంపర్లడాల్సిన పరిస్థితి ఉంది. ఆ దేశ వ్యవసాయరంగం కుదేలైంది.  ప్రధానంగా మంగ్లా, తర్బేలా డ్యామ్‌లలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.   ఇప్పటికే పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో ఖరీఫ్ సాగు  ప్రశ్నార్థకంగా మారింది.   పాకిస్థాన్ ఐఆర్‌ఎస్‌ఏ తాజా నివేదిక ప్రకారం, మొత్తం ప్రవాహంలో 21 శాతం నీటి కొరత  ఏర్పడింది.  రెండు ప్రధాన డ్యామ్‌లైన మంగ్లా, తర్బేలాలలో ప్రవాహ శాతం  50 శాతం వరకూ పడిపోయింది.  ఇది వేసవి పంటల సాగుపై అత్యంత తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. చీనాబ్ నదిలో ప్రవాహం కూడా గణనీయంగా తగ్గిపోయింది.   ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా అంగీకరించారు. న్యూయార్క్ వేదికగా జరిగిన హిమానీనదాల సదస్సులో  మాట్లాడిన ఆయన భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిం చిందని ఆక్రోశం వెలిబుచ్చారు.  అయితే ఆయన ఆరోపణలను, ఆక్రోశాన్ని భారత్ సమర్ధంగా తిప్పి కొట్టింది. వాస్తవానికి ఒప్పందాన్ని  ఉల్లంఘించినది పాకిస్థానే అని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్స హిస్తూ..  ఒప్పందానికి నైతికత లేకుండా చేసిందని ఘాటుగా రిటార్డ్ ఇచ్చింది.  ఉగ్రవాదానికి తోడ్పాటు నిచ్చి, ఉగ్రవాదులకు రక్షణఏ కవచంగా నిలిచినందుకు పాకిస్థాన్ ఇప్పుడు మూల్యం చెల్లించు కుంటోందన్న భావన ప్రపంచ దేశాలలో వ్యక్తం అవుతోంది.  

కేసీఆర్‌కి జగన్ అంటే అంత ప్రేమ ఎందుకో తెలుసా?

  రెండు పార్టీలు రెండు తెలంగాణ తల్లి విగ్రహాలు, రెండు జాతీయ గీతాలంటూ తీవ్రంగా కొట్టుకు ఛస్తున్నాయి కదూ. అయితే వీరు పెట్టుకుని నిజానికి పెట్టుకోవల్సింది వైయస్ విగ్రహానికి. వైయస్ ఆనాడు చంద్రబాబును ఏమీ చేయలేక.. చిన్నారెడ్డి అనే ఒక కాంగ్రెస్ నాయకుడి ద్వారా నలభై మంది వరకూ పోగేసి.. ఢిల్లీకి పంపారు. పర్పస్.. పాతబడిన తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి రీయాక్టివేట్ చేయడానికి. అలా ప్రాంతీయ వాదాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబును దెబ్బ తీసే యత్నం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఓడిపోవడం వైయస్ అధికారంలోకి రావడం తెలిసిందే.  అప్పటికి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి స్తాపించారు. కానీ ఏమంత ప్రోత్సాహకరంగా లేదు. ఈ విషయం పసిగట్టిన వైయస్, చిన్నారెడ్డి రూపంలో ఢిల్లీకి తెలంగాణ వాదం వినిపించేందుకు పంపారు. తర్వాతి కాలంలో కూడా ఆయన తెలంగాణ వాదులను చాలా రకాలుగా విమర్శించి వేధించేవారు. స్వయంగా కేసీఆర్ ను "నీకు బాబుగానీ మంత్రి పదవి ఇచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదంటూ" తీవ్ర అవమానకరమైన కామెంట్లు చేసేవారు. 'ఏవయ్యా రాజేంద్రా!' అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పటికీ చాలా మంది చెవుల్లో మారు మోగుతున్నాయి కూడా.  ఒక పక్క తెలంగాణ కోసం చిన్నారెడ్డిలాంటి వాళ్లను రెచ్చగొట్టిన వైయస్ సరిగ్గా అదే సమయంలో.. తెలంగాణ రాకుండా అడ్డుకున్నట్టు కూడా చెబుతారు. 2009 ఎన్నికల సమయంలో "తెలంగాణకు వెళ్లాలంటే వచ్చే రోజుల్లో పాస్ పోర్టు అవసరమంటూ" వివాదాస్పద వ్యాఖ్యలను చేసి.. తర్వాత గెలిచిన ఘన చరిత్ర వైయస్ ది. అంతగా తెలంగాణ వాదంతో ఆడుకున్న వ్యక్తి వైయస్. ఎప్పుడైతే వైయస్ మరణించారో అప్పుడు తెలంగాణ వాదానికి ఊపిరి తీసుకున్న పరిస్థితి.  ఒక సమయంలో వైయస్ ఉండగా తమకిక తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదన్న కోణంలో కొందరు తీవ్రంగా ఫీలయ్యేవారు కూడా. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో వైయస్ కి అంతటి గ్రిప్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఎంపీలను ఇచ్చే సీఎం కావడంతో.. ఢిల్లీ అధిష్టానం కూడా వైయస్ మాట జవదాటేది కాదు. ఇటు సీట్లు, అటు నోట్ల కట్టలతో వైయస్ ఢిల్లీ పెద్దల దగ్గర అంతగా తన మాట నెగ్గించుకునేవారు. అందుకే "వైయస్ చచ్చి ఏలోకాన ఉన్నారో కానీ.." అంటూ కేసీఆర్ తరచూ అంటుండేవారు.  అయితే ఇక్కడ వైయస్ తెలివి ఏంటంటే తెలంగాణ సెంటిమెంటు అడ్డు పెట్టుకుని.. ఢిల్లీ పెద్దలను గట్టిగానే గ్రిప్ లో పెట్టుకునేవారు. ఒక సమయంలో వైయస్ వల్లే విపరీతంగా బలిదానాలు జరిగాయన్న మాట వినిపించేది. వైయస్ మరణానంతరం కాస్త తెరిపిన పడ్డారు తెలంగాణ వాదులు. అంతగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దారుణంగా అడ్డుకున్నారు. వైయస్ మరణానంతరం.. అంటే 2014లో తెలంగాణ రావడంతో.. పాత కక్షలన్నీ మరచి పోయి.. వైయస్ ని కేసీఆర్ గౌరవించేవారని అంటారు. అంతే కాదు ఆయన కొడుకు జగన్ సైతం తెలంగాణ రాకను రాజకీయంగా అంగీకరించేవారు కాదు. దానికి తోడు ఈ ప్రాంతంలో కేసీఆర్ కి అడ్డుగా తన పార్టీని లేకుండా సమూలంగా తొలగించి.. ఏపీకి తన రాజకీయాలను పరిమితం చేశారు.  దీంతో వైయస్ అన్నా, ఆయన కొడుకు జగన్ అన్నా.. కేసీఆర్ కి వల్లమాలిన అభిమానం. ఒక దశలో జగన్, షర్మిళ ఆస్తి పంపకాల పంచాయితీ కూడా కేసీఆర్ దగ్గరకే వచ్చింది. అలా కేసీఆర్, జగన్ ఇరువురు నేతలు రెండు ప్రాంతాలను చీల్చుకుని.. వాటి ద్వారా అధికారంలోకి రావడంతో.. ఇద్దరి మధ్య సత్సంబంధాలతో పాటు.. కొన్ని కొన్ని ఒప్పందాలు జరిగి ఎవరికి సాగినంతగా వారు సాగించుకున్నట్టు చెబుతారు. వైయస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని వాడుకోవడం. ఆయన అడ్డుకోవడం వల్ల యువత బలవన్మరణాలకు పాల్పడ్డంతో ఉద్యమానికి మరింత ఊపొచ్చిందని నమ్ముతారు కేసీఆర్. దీంతో ఆయన వైయస్ ఫ్యామిలీ అంటే అంతటి అభిమానం చూపుతారని అంటారు

రాజ్‌భవన్‌లో మిస్‌వరల్డ్‌ విజేతలకు గవర్నర్‌ సన్మానం

    తెలంగాణ రాజ్‌భవన్‌లో  మిస్‌వరల్డ్‌-2025 విజేత ఓపల్‌ సుచాత, ముగ్గురు రన్నరప్‌‌లకు  గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తేనీటి విందు ఏర్పాటు చేశారు.ఈ విందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, సీఎస్‌, డీజీపీ, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, నిర్మాత దిల్‌రాజు దంపతులు హాజరయ్యారు. హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ సుందరీమణులతో గవర్నర్‌ ముచ్చటించారు.. ‘‘తెలంగాణ ప్రాంతాలు వికసిత్‌ భారత్‌ను సూచిస్తాయి. మీరు వెళ్లాక తెలంగాణ గురించి చెప్పడానికి చాలా విషయాలుంటాయి’’అని అన్నారు. తెలంగాణ ఆతిథ్యంపై మిస్‌వరల్డ్‌ సుచాత స్పందిస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు బాగున్నాయన్నారు. తెలంగాణ ఎప్పటికీ తన మనసులో నిలిచిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో మే 10 నుంచి 31 వరుకు ప్రపంచ అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీలో మిస్‌వరల్డ్‌గా ఎంపికైన థాయ్‌లాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత, మొదటి రన్నరప్‌ హాసెట్‌ డెరెజే(ఇథియోపియా), రెండో రన్నరప్‌ మయా క్లైడా(పోలాండ్‌), మూడో రన్నరప్‌ ఆరేలి జోచిమ్‌(మార్టినిక్‌) నిలిచిన విషయం తెలిసిందే.

పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతా : రాజాసింగ్

  గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతాని రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరి వల్ల భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగిందనేది ప్రజల ముందు ఉంచుతానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, నోటీసులు కాదు.. కావాలంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.  అటు ఇటు కానివాళ్లతో కలిసి పార్టీని బలోపేతం చేయలేమని తెలిపారు. ధర్మా కార్యక్రమాలు చేపట్టాలేమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ-బీఆర్ఎస్ పొత్తు ఆరోపణలను సమర్థిస్తూ, మంచి ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరతారని రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీపై గత కొంతకాలంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం ఆయనకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతోందని, రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వం ఈ మేరకు ఆదేశించినట్లు సమాచారం.

జలరవాణా-టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి జనార్థన్

  ఏపీలో జలరవాణా ద్వారా అధిక పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, జల రవాణా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని పున్నమి ఘాట్ నుండి"బోట్ మారథాన్" కార్యక్రమంను మంత్రి  జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ఇన్ లాండ్ వాటర్ వేస్, టూరిజం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. దీంతో అటు ప్రభుత్వానికి ఆదాయం కలగడంతో పాటు ఇటు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు. సాంప్రదాయ రవాణా మార్గాలైన రోడ్ మరియు రైల్ సరుకు రవాణా విధానాలతో పొల్చితే ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ తక్కువ ఖర్చుతో కూడిన విధానమన్నారు. రోడ్డు రవాణాతో పోల్చితే జల రవాణా ద్వారా దాదాపు 50 శాతం తక్కువ ఖర్చుతో సరుకును గమ్యస్థానానికి చేర్చవచ్చన్నారు. అదీ కాకుండ రహదారి మరియు రైల్ మార్గాలపై వాహనాల ట్రాఫిక్ ను కూడా తగ్గించవచ్చు అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు.                       దేశంలోనే రెండో అతి పెద్ద తీర ప్రాంతం కలిగిన మన రాష్ట్రంలో మొత్తం 1,555 కిలోమీటర్ల పరిధిలో నావిగేషన్ కు అనుకూలమైన జల మార్గాలు ఉన్నాయని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. వీటిలో 900 కిలోమీటర్ల వరకు జాతీయ జల మార్గాలు ఉండటం విశేషమన్నారు. ఈ జల మార్గాల ద్వారా పోర్ట్ కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. అంతేకాకుండ పర్యాటకానికి ఊతమిస్తుందన్నారు. పీపీపీ మోడల్ లో ఆయా ప్రాజెక్ట్ లను అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇన్ లాండ్ క్యూయిజ్ టూరిజంను ప్రోత్సహించడం మా వ్యూహమన్నారు. ఇందులో భాగంగా రీజనల్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే రూ. 201.50 కోట్ల నిధుల సహాయం కోసం కేంద్రంకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఈ నిధులతో ఆర్ఓ-ఆర్ఓ టెర్మినల్స్, వాహనాల కు రూ. 153 కోట్లు, క్రూయిజ్ నౌకలు, డ్రెడ్జర్లు, డాక్ ఫెసిలిటీలకు, జల ఆధారిత టూరిజం మౌలిక వసతుల కల్పన చేపట్టనున్నామని మంత్రి తెలిపారు.                 రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జల రవాణా మార్గాలను మూడింతలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ చర్యలు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తాయని అన్నారు.  రాష్ట్రంలోని జల రవాణా మార్గాలు.. జల రవాణాకు ఉన్న అపారమైన అవకాశాలపై ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించి అనంతరం అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు. కృష్ణా , గోదావరి సహా నదులు,  కాలువల్లో జలరవాణా చేపడతామని, జల రవాణా ద్వారా ప్రయాణికులను తక్కువ చార్జీతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతామని, జలరవాణా ద్వారా పలు మార్గాల్లో   బొగ్గు, సిమెంట్ , రవాణా ను చేపట్టనున్నామని తెలిపారు. మరీ ముఖ్యంగా జల రవాణా మార్గాలు పర్యావరణానికి అత్యంత అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్. శివప్రసాద్, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ సీఈ రాఘవరావు తదితరులు పొల్గొన్నారు.  

అమరావతి పాలనా భవనాల పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశం

  ఆంధ్రప్రదేశ్ అమరావతిలో పాలనా భవనాల నిర్మాణానికి రూ.3,673 కోట్ల చేపట్టే పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత సంస్థలను సీఆర్‌డీఏపై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రూ.882 కోట్లతో పాలనా భవనం నిర్మాణ టెండర్‌ను ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. రూ.1,467 కోట్లతో టవర్‌ 1, 2 నిర్మాణాలను షాపూర్జీ పల్లోంజి సంస్ధ చేపట్టనుంది. మరో రూ.1,393 కోట్లతో టవర్‌ 3, 4 నిర్మాణ టెండర్లు ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకుంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పాలన సులభం చేసేందుకే భవనాలన్నీ ఒక చోట కట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. న్యాయపరమైన సమస్యలు లేకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ‘‘ పెట్టుబడులు రావాలంటే 5 వేల ఎకరాలతో విమానాశ్రయం అవసరం. స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, అంతర్జాతీయ క్రీడానగరానికి 34 వేల ఎకరాలు సరిపోదు.3 ప్రాజెక్టులకు ప్రజాభిప్రాయం మేరకు భూ సేకరణ చేస్తాం. 24 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. ఇప్పటి వరకు భూ సమీకరణ నిబంధనలు 217చ.కి.మీ వరకే ఉన్నాయి. నిబంధనల పరిధిని పెంచేందుకు సీఆర్డీయే నిర్ణయం తీసుకుంది.’’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.  

జగన్ నిరూపిస్తే..మంత్రి పదవికి రాజీనామా చేస్తా : లోకేశ్

  విశాఖలో ఉర్సా కంపెనీకి  రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి నారా లోకేశ్‌ సవాల్‌ విసిరారు. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ - 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామని. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామని  లోకేశ్‌ స్పష్టం చేశారు. జగన్ ఆరోపణలు తప్పని తేలితే యవతకు క్షమాపణలు చెప్పాలని ట్వీట్టర్ వేదికగా తెలిపారు.. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి ? మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని తెలిపారు., యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారని మంత్రి పేర్కొన్నారు. . ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి కి కొత్తేమీ కాదని తెలిపారు.  

టీడీపీలో చేరి చంద్రబాబు వద్ద పని చేయడం సంతోషంగా ఉంది : ఎంపీ వేమిరెడ్డి

  దేవుడి దయవల్ల 2024లో ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరటం సీఎం చంద్రబాబు వద్ద పని చేయటం చాలా సంతోషంగా ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. టిడిపి మంత్రులు కూలీలు ఎలా పనిచేస్తారో అలా పని చేసి మహానాడుని విజయవంతం చేశారని ఆయన అన్నారు. నేను ఆశ్చర్యపోయాను వాళ్ల పనితీరును చూసి.. ఒకపక్క వర్షం పడుతూ ఉంది ఒక పక్కనుండి నియోజకవర్గంలో కార్యకర్తలకు రకరకాల ఇబ్బందులు ఉన్న మహానాడు విజయం అంతం చేశారని ఆయన తెలిపారు. మహానాడుకి సుమారు ఆరు ఏడు కిలోమీటర్లు వరకు జనాలు భారీ ఎత్తున వచ్చారు... స్థలం సరిపోక ఎక్కడికి ఎక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సభా వద్దకు చేరుకోలేక చాలామంది వెనుక తిరిగి వెళ్ళిపోయారు అది టీడీపీకి ఉన్న బలమని ఎంపీ వేమిరెడ్డి తెలిపారు. గత సీఎం జగన్ ఏనాడు కూడా ఇలా కార్యక్రమంలో కనీసం మీరు చేయండి అని కూడా  చెప్పేవాడు కాదని.. అంతా మీరే చూసుకోండి అని చెప్పేవారని ఆయన తెలిపారు.

రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇంకా తిరిగి రాని రూ.6181 కోట్ల

  రూ.2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లు పూర్తిస్థాయిలో తమకు చేరలేదని పేర్కొంది. ప్రజల వద్ద .ఇంకా రూ.6181 కోట్ల విలువైన నోట్లు చెలామణీలోనే ఉన్నట్లు గుర్తించింది. 2023 మే 19న ఆర్బీఐ అధికారికంగా 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే వాటిని రద్దు మాత్రం చేయలేదు. దీంతో ఇంకా ప్రజల వద్దే రూ.6181 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి.  అంతే కాదు వీటిని చెలామణీ కూడా చేసేస్తున్నారు.రూ.2 వేల నోట్ల ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో మార్పుకోవచ్చని వెల్లడించింది. కాగా 2023 మే 19న రూ. 2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన టెండర్‌గానే ఉన్నాయని ఆర్‌బీఐ ధ్రువీకరించింది. అంటే, ఈ నోట్లను ఇప్పటికీ లావాదేవీలకు ఉపయోగించవచ్చు. కానీ తీసుకునేవారు ఉండటం కష్టం. కేవలం కొత్తగా ఈ నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేశారు. 

ఇది జగన్ మార్క్ రాజకీయం!?

ఊరు మీద పడి అమాయకులను వేధిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న రౌడీ బ్యాచ్ కు పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందంటూ వైసీపీ గుండెలు బాదేసుకోవడం ఏమిటి అని జనం విస్తుపోతున్నారు. ఔను ఐతానగర్ లో ఇటీవల ముగ్గురు యువకులకు పోలీసులు ఇచ్చిన ఓపెన్ లాఠీ ట్రీట్ మెంట్ పట్ల జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐతానగర్ వాసులు  ఇక తమకు రౌడీల పీడ వదిలిందని ఆనందంతో ఉన్నారు. అంతలోనే వైసీపీ కులం రంగు పులుముతూ తెరమీదకు వచ్చేసింది. పలు కేసులు ఉన్న గంజాయి రౌడీ బ్యాచ్ కి పోలీసులు ఇచ్చిన ట్రీట్ మెంట్ అన్యాయం, దారుణం, దుర్మార్గం అంటూ  గగ్గోలు పెట్టేస్తోంది.     ఉగ్రవాదానికి మతం లేదన్నట్లుగానే..  రౌడీలకూ, క్రిమినల్స్ కు కులం ఉండదన్న విషయాన్ని విస్మరించి ఇప్పుడు వైసీపీయులు  కులం కార్డుతో రోడ్డెక్కుతున్నారు.  అలాంటి వారికి పోలీసులు చేసిన మర్యాద సరైనదే అని జనం ముక్తకంఠంతో చెబుతుంటే.. వైసీపీయులు మాత్రం ఘోరం జరిగిపోయినట్లు గుండెలు బాదేసుకుంటున్నారు.    ఇక అసలు విషయానికొస్తే గుంటూరు జిల్లా తెనాలి  ఐతానగర్ ప్రాంతంలో ...లడ్డు బ్యాచ్ అని ఒక గ్యాంగ్ ఉంది..  వీళ్ళు చేసే అరాచకాలకు  హద్దూపద్దూ లేకుండా పోయింది. ఈ గ్యాంగ్ త రెండు నెలల కిందట   ఓ వ్యాపారిపై అకారణంగా దాడి చేసి కొట్టారు..  రోడ్డుపై వెళ్లే వారినీ,  వచ్చే వారిని టార్గెట్ చేసుకొని కొట్టమే వీళ్ళ  ప్రవృత్తిగా మారిపోయింది..  దీంతో పాటు రౌడీ యిజానికి పాల్పడుతున్న ఈ గ్యాంగ్ పై   2018 నుండి  పలు కేసులు ఉన్నాయి.  కేసుల దారి కేసులదే అన్నట్లుగా వీరి తీరు ఇసుమంతైనా మారలేదు.  పైగా లడ్డు బ్యాచ్ , కిల్లర్ బాచ్ అని బిరుదులు కూడా తగిలించేసుకుని రెచ్చిపోతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఇటీవల అయితానగర్ ప్రాంతంలో  నివాసం ఉంటున్న  చిరంజీవి అనే కానిస్టేబుల్ పై వీరు  దాడికి పాల్పడ్డారు.  బీసీ సామాజికవర్గానికి  చెందిన ఈ కానిస్టేబుల్  ఎస్సీ మహిళను వివాహం చేసుకుని ఐతానగర్ లో నివసిస్తున్నారు.   ఈ కానిస్టేబుల్ చిరంజీవి  లడ్డు గ్యాంగ్ అరాచకాలను ప్రశ్నించాడు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. దాంతో చిరంజీవిపై క క్ష పెంచుకున్న ఈ గ్యాంగ్  దాడికి పాల్పడింది.  దీంతో పోలీసుల రంగంలోకి దిగారు.  ఈ రౌడీ గ్యాంగ్  లీడర్ లడ్డు పారారైపోగా,  మిగిలిన ముగ్గురు పోలీసులకు దొరికారు.  వాళ్లని దారిలో పెట్టడానికి భయం చెప్పాలన్న ఉద్దేశంతో  పోలీస్ మార్కు ట్రీట్ మెంట్ ఇచ్చి విక్రమార్కుడు సినిమా చూపించారు.    ఆ సందర్భంలో స్థానికులు అయితే ఈ రౌడీల పీడ విరగడయింది అన్న ఆనందం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యను అభినందించారు. అయితే వైసీపీ మాత్రం ఈ సంఘటనను తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడానికి రెడీ అయిపోయింది.   ప్రజా సంఘాల ముసుగు లో , కుల సంఘాల ముసుగులో రంగంలోకి దిగిపోయింది. ఈ సంఘటనకు కులం రంగు పులిమేసి రాజకీయం చేస్తోంది.    అది సరిపోదన్నట్లు ఇప్పుడు సాక్షాత్తూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగిపోయారు. ఐతానగర్ రౌడీషీటర్లకు పరామర్శ పేరుతో ఆయన తెనాలి పర్యటనకు రెడీ అయిపోయారు. మంగళవారం (జూన్ 3)న సదరు రౌడీ షీటర్లను పరామర్శించనున్నారు.   ప్రజలను వేధించి, ఇబ్బందుల పాలు చేస్తున్న రౌడీషీటర్లకు వత్తాసుగా రాజకీయ లబ్ధిని వెతుక్కోవడమేంటంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.