జగన్ ఈ పేరున్నోళ్లు..ఎందుకిలా ఉంటారు?

  ఏపీలో మాజీ సీఎం జగన్ పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది. తన తండ్రి మరణించినప్పటి నుంచీ ఆయన ఏదో ఒక రూపంలో రాజకీయం చేస్తూ జనం నోళ్లలో నానుతూనే వస్తున్నారు. ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు, ఇలా రకరకాలుగా హల్ చల్ చేస్తూనే వచ్చారు. అధికారంలోకి వచ్చాక అయ్యగారి అసలు స్వరూపం బయట పడింది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెట్టిన జ.. గన్ తర్వాత రాష్ట్ర రాజధాని నిర్మాణం నుంచి మొదలు పెడితే ఆర్ధిక పరిస్థితి చిందర వందర గందరగోళం చేయడం వరకూ ఆ రూటే సపరేటు.  క్విడ్ ప్రో కో అనే కొత్త విధానం ద్వారా ఏకంగా లక్ష కోట్ల అవినీతికి తెరలేపిన జగన్ తర్వాతి కాలంలో ఇవే కేసులతో జైలుకెళ్లి 16 నెలలు ఉన్నారు. బయటకొచ్చాక.. ఏపీ లో అనేకరకాల రాజకీయం చేసి.. అధికారం చేపట్టారు. ఆపై కొన్ని వందల కోట్ల రూపాయల మేర అవినీతి కార్యకలాపాలకు పాల్పడి.. భారీ ఎత్తున వెనకేసినట్టు చెబుతారు. శాండ్ వైన్ మైన్ అంటూ రంగమేదైనా రాబడి చూసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్. ఆ మాటకొస్తే తాను అధికారులతో నిర్వహించే మీటింగులు కూడా ఓట్లా నోట్లా ఇవేవీ రాకుంటే నో అనేస్తారని టాకు. జగన్ ఒక్కడే కాదు ఆయనతో పాటు ఆయన మంత్రి వర్గంలో పని చేసిన వారు కూడా ఏదో ఒక రకంగా అవినీతిలో భాగమయ్యి తలా పాపం తిలాపిడికెడుగా బిహేవ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా కలసి వరుస పెట్టున జైళ్లకెళ్తున్న దృశ్యాలు మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి.  ఇక్కడ తెలంగాణలో ఆ కొరత తీర్చడానికా? అన్నట్టు మరో జగన్ తయారయ్యాడు. అయితే ఆయన రాజకీయాల్లో లేరు కానీ వారికన్నా మించి అన్నట్టుగా చెలరేగిపోయినట్టు తెలుస్తోంది. కేవలం HCA అనే ఒక క్రికెట్ అసోసియేషన్ నుంచే ఆయన ఏకంగా 800 కోట్ల రూపాయల బీసీసీఐ నిధులను దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. ఇటు SRH నుంచి అదనపు టికెట్లను ఆశించడం నుంచి మొదలు పెడితే.. టీవీల కొనుగోళ్ల వరకూ అంతా అవినీతి మయంగా తెలుస్తోంది.  ఆ మాటకొస్తే తనకున్న రాజకీయ పలుకుబడి అండదండలను అడ్డు పెట్టుకుని అదిపనిగా.. ఈ జగన్మోహనుడు HCAలోకి రాంగ్ ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాదు.. పరి పరి విధాలా ఈ క్రికెట్ అసోసియేషన్ ని కంపు కంపు చేసినట్టు ఆరోపిస్తోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఈ తెలంగాణ జగన్ కేవలం HCAలో ఉన్నందుకే ఇంత పెద్ద మొత్తంలో మేస్తే.. ఆయనే గనక రాజకీయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తే పరిస్థితేంటన్న ప్రశ్న వినిపిస్తోంది. అసలా పేరే అలాంటిది.. ఎటు నుంచి ఎటు చూసినా.. అవినీతిలో అందనంత ఎత్తుకు ఎదగాల్సిందే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి సర్వత్రా.

పాలమూరు ప్రజలు అన్నం పెడితే..కేసీఆర్ సున్నం పెట్టారు : సీఎం రేవంత్‌రెడ్డి

  పాలమూరు జిల్లా అంటే మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబానికి చిన్నచూపని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలు లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ ప్రజలు ఓడించడానికి సిద్దమైతే కేసీఆర్ మహబూబ్​నగర్‌కు వలస వచ్చారని సైటైర్లు వేశారు. కేసీఆర్‌ను కడుపులో పెట్టుకొని చూస్తే జిల్లాకు ఆయన చేసిందంటని ప్రశ్నించారు. పదేళ్లు సీఎంగా ఉన్నా పైసా పనికూడా చేయలేదన్నారు. 2023లో కాంగ్రెస్ పాలమూరు జిల్లాలో 12 సీట్లు ఇచ్చారని, మరో రెండు గెలిచి ఉంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్న.. మా పాలమూరు ప్రాజెక్టులకు అడ్డం పడొద్దు. మీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సమానంగా అభివృద్ధి చేందాలనే ఆలోచనతో ఉన్నది నిజమే అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి మా ప్రాజెక్టులు పూర్తయ్యేలా ఉదారంగా ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న. మీరు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కల్వకుర్తి ప్రాజెక్టు మొదలుపెట్టారు. మీరు సీఎంగా ఉన్నప్పుడే బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులు వచ్చాయిని రేవంత్‌రెడ్డి తెలిపారు. మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవారు. మీ మేలు ఎప్పటికి మర్చిపోమన్నారు. మా విజ్ఞప్తులు మీరు వినకపోతే పోరాటాలు ఎలా చేయాలో పాలమూరుకు తెలుసు. మాకు పౌరుషం ఉంది. పోరాడి సాధించుకునే శక్తి ఉంది. ఈ పోరాటానికి నాయకత్వం నేను వహిస్తాను’ అన్నారు. అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించినా, ఇక్కడి సూర్యుడు అక్కడ ఉదయించినా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు  

ఫోన్ ట్యాపింగ్ నిందితుడి ఫ్లాట్లో.... ఏపీ లిక్కర్ స్కాం బాబులు

  తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ , ఏపీ లిక్కర్ స్కాం మధ్య లింకులు ఉన్నట్లు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. మాజీ ముఖ్యంత్రులు కేసీఆర్, జగన్‌ల జాయింట్ ఆపరేషన్‌తోనే ఈ కుట్రలు జరిగాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. దుబాయ్‌లోని పారామౌంట్ హోటల్ ఫ్లాట్ నెంబర్ 5801లో ఏపీ లిక్కర్ స్కాం నిందితులు చాణక్య, వరుణ్ సహా ఇంకొందరు విలాసవంతమైన జీవితం గడిపినట్లు సిట్ గుర్తించింది. ఆ ఫ్లాట్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్‌రావు ఆధీనంలో ఉన్నట్లు వెల్లడైంది. ఆ క్రమంలో రెండు స్కాంలు వైసీపీ, బీఆర్ఎస్‌ల జాయింట్ ఆపరేషనే అన్నది నిరూపితమైందంటున్నారు.  దుబాయ్‌లోని ఖరీదైన ప్రాంతంలో శ్రవణ్‌రావు మరొకరితో కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్‌లోనే లిక్కర్‌ స్కామ్‌ నిందితులు మకాం వేసినట్టు తేలడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. లిక్కర్‌ స్కామ్‌ సూత్రధారి రాజ్‌ కసిరెడ్డికి సన్నిహితంగా ఉంటూ వ్యవహారం నడిపిన చాణక్య బూనేటి,  వరుణ్ మరో నలుగురు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్‌ 27 వరకు ఆ ఫ్లాట్‌లోనే ఉన్నారని వెల్లడైంది. ఆ ఫ్లాట్‌ను డీలక్స్‌ హాలిడే హోమ్స్‌ సంస్థకు లీజుకిచ్చామని, ఆ సంస్థ ఎవరికి అద్దెకిచ్చిందో తమకు తెలియదని శ్రవణ్‌రావు తరపున ఐన్యూస్‌ యాజమాన్యంఇచ్చిన ప్రకటన అవాస్తవమని తేలింది.  యజమాని కోటా కింద శ్రవణ్‌రావే కొంతకాలం తీసుకుని, లిక్కర్‌ స్కామ్‌ నిందితులకు ఇచ్చారని.. స్వయంగా ఆయన వారితో కలిసి ఉన్నారని పక్కా ఆధారాలు సిట్ అధికారులకు లభించాయంట. దుబాయ్‌లోని పారామౌంట్‌ టవర్‌ హోటల్స్‌ అండ్‌ రెసిడెన్సెస్‌లో 35వ అంతస్తు వరకు హోటల్‌ ఉండగా ఆపై అంతస్తుల్లో నివాస ఫ్లాట్లు ఉన్నాయి. అందులో 5801 నంబర్‌ ఫ్లాట్‌ శ్రవణ్‌రావుకు సంబంధించింది. దీనిని రెంటల్‌ ఏజెన్సీకి లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఏడాదిలో ఒక నెల పాటు యజమాని ఆ ఫ్లాట్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. అంతకు మించితే నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్‌ 27 వరకు రెండు నెలల పాటు ఫ్లాట్‌ను ఉపయోగించుకున్న శ్రవణ్‌రావు ఒక నెల ఉచితంగా, మరో నెల కేవలం నిర్వహణ ఖర్చులు చెల్లించినట్టు తేలింది. టవర్‌ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. యజమానులు సహా ఎవరు ఫ్లాట్‌లోకి వెళ్లాలన్నా ఆధారపూర్వక వివరాలు ఇవ్వాలి. ఆ వివరాల మేరకు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్‌ 27 వరకు శ్రవణ్‌రావు, చాణక్య, మరో నలుగురు ఫ్లాట్‌లోనే ఉన్నారని తేలినట్టు సమాచారం. ఏపీ లిక్కర్‌ స్కామ్‌తో దుబాయ్‌ ఫ్లాట్‌కు లింకులు బయటపడటంతో జగన్, కేసీఆర్‌ల రాజకీయ వ్యాపారం బహిర్గతమైందంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏపీసీసీ ప్రెసిడెంట్, జగన్ చెల్లెలు షర్మిల ఫోన్ ట్యాప్ చేసి ఆ వివరాలు జగన్‌కు అందజేసినట్లు ఆరోపణలున్నాయి. ఒకవైపు చూస్తే తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూ సమన్వయంతో ముందుకెళ్తున్నారు. వారిద్దరు ఎప్పుడు భేటీ అయినా బీఆర్ఎస్, వైసీపీ వర్గాలు నానా రచ్చ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో తమ హయాంలో వైసీపీ, బీఆర్ఎస్ పెద్దలు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి, చీకటి వ్యవహారాల్లో లాలూచీ పడ్డారని తాజా ఉదంతాలు స్పష్టం చేస్తుండటంతో ఆపార్టీల ప్రతిష్ట మరింత దిగజారుతూ.. తెలుగు ప్రజల ఆగ్రహానికి గురవుతోంది.

టీడీపీకి రాజీనామా చేస్తూ అశోక్ గజపతి రాజు భావోద్వేగం

  కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తెలుగు దేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశారు. అలాగే పార్టీ పొలిట్ బ్యూరో పదవికి కూడా రిజైన్ చేశారు.  ఇటీవల రాష్ట్ర పతి ఆయన్ను గోవా గవర్నర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించవలసిందిగా ఆయ‌న‌ టీడీపీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు పంపించారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీలో ఎన్నో అవకాశాలు అందుకున్నట్లు చెప్పుకొచ్చారు.  ఇన్ని అవకాశాలు కల్పించిన పార్టీకి, సీఎం చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు ప్ర‌త్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి అశోక్‌ గజపతి రాజు పార్టీలో కొనసాగుతున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అశోక్‌ గజపతిరాజు రెండవసారి శాసన సభకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో కూడా విజయనగరం నుంచి విజయం సాధించారు. అయితే, 2004లో అశోక్‌ గజపతిరాజు ఓటమి పాలయ్యారు. కానీ, 2009లో తిరిగి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశారు.  

లోకేశ్‌ను క‌ల‌వ‌లేదు..క‌లిస్తే త‌ప్పేంటి : కేటీఆర్

  ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను క‌ల‌వ‌లేదు కానీ క‌లిస్తే త‌ప్పేంటి..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. శుక్రవారం ఖమ్మంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కుటుంబాన్ని పరామర్శించి  ఖ‌మ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ బీఆర్‌ఎస్ నేతలతో కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో డ‌బ్బున్న మ‌హిళ‌లు మ‌ధ్యాహ్నం కిట్టి పార్టీలు చేసుకుంటుంటారు.  ఆయన కూడా కిట్టి పార్టీ ఆంటీలాగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఎవ‌రో ఎక్క‌డో చెప్పింది విని అదే నిజ‌మ‌నుకుని భ్ర‌మించి, మ‌ళ్లీ ఓ ప‌ది మందిని పోగేసుకుని చిట్ చాట్‌ల పేరిట చిల్లర మాట‌లు మాట్లాడుతున్నాని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  శ‌వాల మీద పేలాలు ఏరుకోవ‌డం ఏంద‌య్యా..? నాక‌ర్థం కాదు. ఎవ‌డో దుబాయ్‌లో చ‌నిపోతే దాన్ని నాకు అంట‌గ‌ట్ట‌డం ఏంది ఏమ‌న్నా జ్ఞానం ఉందా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. నేను అర్ధ‌రాత్రి పోయి లోకేశ్‌ను క‌లిసాన‌ట‌. మేం ఏం జేసిన బాజాప్తా చేస్తాం. బేజాప్తా చేయాల్సిన క‌ర్మ మాకు లేదు. అయినా నాకు తెల్వ‌క అడుగుతా.. క‌ల‌వలేదు కానీ క‌లిస్తే త‌ప్పేంది..? అని రేవంత్‌ను కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప‌క్క రాష్ట్రం మంత్రి యువ‌కుడు నాకు త‌మ్ముడి లాంటోడు క‌లిస్తే క‌లుస్తా.. కానీ క‌ల‌వ‌లేదు. దానికేదో ఆయ‌న గొప్ప విష‌యం క‌నిపెట్టిన‌ట్టు. పాల‌న గురించి తెలుసుకోవాలంటే మ‌మ్మ‌ల్నే బీఆర్ఎసోళ్ల‌ను క‌లుస్తారు. దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను క‌లుస్తారు. ఆయ‌న న‌న్ను క‌లిస్తే నీకేం ఇబ్బంది. నీకేం బాధ అయితుంది. ఈ చిల్ల‌ర మాట‌ల‌తోని ఎన్నిరోజులు టైం పాస్ చేస్త‌వ్. ఎన్ని రోజులు ప్ర‌జ‌ల‌ను ఆగం చేసే ప్ర‌య‌త్నం చేస్త‌వ్ అని ముఖ్యమంత్రి కేటీఆర్ మండిపడ్డారు.  

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

  హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. గచ్చిబౌలి, కొండాపూర్ హైటెక్ సిటీ, జూబిలీహిల్స్, బంజారహిల్స్, యూసఫ్ గూడ, మధురానగర్, అమీర్‌పేట్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. డ్రైనేజీ రోడ్లపై పొంగి పొర్లుతోంది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తెలంగాణలో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వరకు ఉరుములు మెరుపులతో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నాది. శుక్రవారం వరంగల్‌, మహబూబాబాద్‌, యాదాద్రి, ఉమ్మడి నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం హనుమకొండ, వరంగల్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

పెద్దారెడ్డిని స్వగ్రామంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. తాడిపత్రి పర్యటనకు తాజాగా ఆయనకు అనుమతి నిరాకరించారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు తాడిపత్రిలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడానికి సిద్దమైన కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. దాంతో నాలుగు రోజుల క్రితం పెద్దారెడ్డి తన పర్యటనను ఎప్పటిలాగే మరోసారి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నెల 18న పర్యటనకు ఓకే అన్న అధికారులు పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మనపల్లి చేరుకోగానే హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించడంతో మళ్లీ తాడిపత్రితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ క్రమంలో తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.  తాడిపత్రిలో తాజాగా వైసీపీ ‘చంద్రబాబు రీకాలింగ్’ మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని  పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు వీలు లేదని, తాడిపత్రిలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున తిమ్మంపల్లి నుంచి వెళ్లేందుకు వీలులేదని పోలీసులు స్పష్టం చేశారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలు సమావేశానికి హాజరుకావొచ్చని పోలీసులు తెలిపారు. అలాగే కేతిరెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే స్వగ్రామమైన తాడిపత్రి సెగ్మెంట్లోని  తిమ్మంపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఎందుకు అనుమతించరని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లి తీరతానంటూ రోడ్డుపైనే మాజీ ఎమ్మెల్యే బైఠాయించారు. పోలీసుల తీరుపై పెద్దా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా తాడిపత్రిలోనూ అటు తిమ్మంపల్లిలోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు... ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టకుండా కోర్టు ఆంక్షలు విధించింది. అయితే తర్వాత హైకోర్టు ఆదేశాలతో సొంత ఇలాకాలోకి వెళ్లేందుకు పెద్దారెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తుంటే.. జేసీ వర్గీయుల తిరుగుబాటుతో పోలీసులు ఎప్పటికప్పుడు పెద్దారెడ్డికి అనుమతి నిరాకరిస్తున్నారు. ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుని, పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. అయితే ఆ రోజు తాడిపత్రిలో మంత్రుల ప్రొగ్రాం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో వైసీపీ నేతలు తమ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది ఏమి లేక పెద్దారెడ్డి అప్పుడు వెనుతిరిగారు.  తాజాగా మళ్లీ తాడిపత్రిలో ‘చంద్రబాబు రీకాలింగ్’ కార్యక్రమం చేపట్టడానికి పెద్దారెడ్డి తన స్వగ్రామం తిమ్మంపల్లి చేరుకున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి , వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వైరం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. పెద్దారెడ్డి ఎప్పుడు తాడిపత్రి రావడానికి రెడీ అయినా  జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం ఆయన్ని అడ్డుకోవడనికి ఎక్కడికక్కడ  మొహరిస్తోంది. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో పోలీసులు శాంతిభద్రల విఘాతం కలుగుతుందని మరోసారి పెద్దారెడ్డి పర్యటనకు చెక్ పెట్టారు.

మాజీ సీఎం కుమారుడు అరెస్ట్

  చత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ సీనియర్ నేత భూపేశ్‌ బఘేల్‌ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ సంబంధించి మనీ లాండరింగ్  కేసులో ఇవాళ తండ్రీకొడుకులిద్దరికీ చెందిన ఆస్తులపై భారీ బందోబస్తు నడుమ అధికారులు సోదాలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్ స్కామ్‌లో రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. లిక్క‌ర్ స్కామ్‌లో త‌మ‌కు కొత్త ఆధారాలు దొరికినట్లు ఈడీ చెబుతోంది.  అసెంబ్లీ స‌మావేశాల‌కు చివ‌రి రోజు కావ‌డంతో రాజ‌కీయ క‌క్ష‌తో ఈడీ సోదాలు చేప‌డుతున్నార‌ని మాజీ సీఎం భూపేశ్ భ‌గేల్ ఆరోపించారు.మార్చి 10వ తేదీన కూడా చైత‌న్య భ‌గ‌ల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. కాగా.. బర్త్‌డే రోజు నాడే చైతన్యను ఈడీ అధికారులు అరెస్టు చేయడం గమనార్హం. దీనిపై ఆయన తండ్రి భూపేశ్‌ స్పందించారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు నేడు చివరి రోజు. అదానీ సంస్థ కోసం చెట్లు కూలుస్తున్న అంశాన్ని మేం లేవనెత్తాం. వెంటనే మా ఇంటికి ఈడీని పంపించారు. నా కుమారుడి పుట్టిన రోజున మంచి బహుమతి ఇచ్చారు’’ అని మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మిథున్‌రెడ్డికి సుప్రీం షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్దం చేసిన సిట్

  రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. లిక్కర్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించడంతో.. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్  చేసిన మిథున్‌రెడ్డికి అక్కడా చుక్కెదురైంది. మరోవైపు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది. పరారీలో ఉన్న మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో  పిటిషన్ వేశారు.  మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ కావడంతో ఆయన తలదాచుకున్న ప్రాంతాల్లో సోదాలు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు సిట్ అధికారులు.  మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించడం, లొంగిపోవడానికి సమయమిచ్చేందుకు నిరాకరించడంలో ఆయన అరెస్ట్ ఖాయమైంది. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా.. రాజకీయ కక్షలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని మిథున్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ జరిపిన జస్టిస్ జెబి పార్థివలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం.. అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. సరెండర్ కావడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనాన్ని కోరగా.. దానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. తాజాగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

కవితక్క కథకళీ!

ఈ మ‌ధ్య క‌విత‌క్క కొత్త క‌థ మొద‌లు పెట్టారు. అదేంటంటే.. కాంగ్రెస్ తీసుకొచ్చిన బీసీ ఆర్డినెన్స్ బాగుంద‌ని..  బీఆర్ఎస్ కూడా త‌న దారికి రావ‌ల్సిందేనంటున్నారు. నిజానికి.. క‌విత ఇలా ఎందుకు అనాల్సి వ‌చ్చిదంటే.. ఆమెపై కావ‌చ్చు, ఆమె కుటుంబ స‌భ్యుల‌పై కావ‌చ్చు వ‌రుస పెట్టున న‌మోద‌వుతున్న కేసుల మోత అలాంటిది. తాజాగా చూస్తే హెచ్ సీ ఏలోనూ కవిత‌క్క హ‌స్త‌ముంద‌ని అంటున్నారు. అంత‌గా ఆమె, ఆమె కుటుంబ స‌భ్యుల అవినీతి  బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా న‌లు మూల‌లా విస్త‌రించింద‌ని చెబ‌తారు. మొన్న అరెస్ట‌యిన జ‌గ‌న్మోహ‌న రావు మ‌రెవ‌రో కారు.. హ‌రీష్ రావు కి సోద‌రుడి వ‌రుస అవుతారు. అంటే క‌విత‌కు బావ వ‌రుస‌. ఈ లెక్క‌న చూస్తే ఇందు గ‌ల‌దు అందు లేద‌న్న సందేహంబు వ‌ల‌దు- క‌ల్వ‌కుంట్ల వారి అవినీతి క‌థ‌.. ఎందెందు చూసిన అందందే క‌ల‌ద‌న్న మాట వినిపిస్తోంది. దీంతో క‌విత‌క్క కాంగ్రెస్ రాగం అందుకున్నారు. అందుకు బీసీ తాళం ఎంచుకున్నారు. తద్వారా  ఛాన్స్ దొరికిన‌పుడ‌ల్లా కాంగ్రెస్ కి తాన తందాన అన‌డానికి చిడ‌త‌లు సిద్ధం చేసుకున్నార‌ని స‌మాచారం. మొన్న‌టి వ‌ర‌కూ ప్రో బీఆర్ఎస్ రాగం ఆల‌పించిన క‌విత‌క్క కొత్త‌గా ఈ కాంగ్రెస్ రాగ‌మాలిక అందుకోవ‌డం వెనుక ఉన్న అస‌లు కథ ఇదీ.  ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో  చేసిన అవినీతి తెలంగాణ నాలుగు చెరగులా విస్త‌రించిన విష‌యం తెలిసిందే. స్వ‌యానా సొంత పార్టీయే ఆమెను సింగ‌రేణి కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తొల‌గించింది. ఇక బ‌య‌ట సంగ‌తి మాటేంటీ? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక ప‌క్క ఢిల్లీ రేంజ్ లో లిక్క‌ర్ కేసు మెడకు ఉచ్చులా త‌గులుకుని క‌నిపిస్తోంది. మ‌రొక ప‌క్క తెలంగాణ‌లోనూ ర‌క‌ర‌కాల కేసులు. తాజాగా హెచ్ సీ ఏ కేసు. ఒక‌టీ రెండు కాదు ఏకంగా 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్య‌వ‌హార‌మిది. ఇందులో కేటీఆర్ బావ‌మ‌రిదికే కాంట్రాక్టులు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ దిశ‌గా తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ సీఐడీకి కంప్ల‌యింట్ చేసింది. దీంతో బీఆర్ఎస్ పెద్ద‌ల‌తో మీకున్న సంబంధ‌మేంట‌న్న కోణంలో అరెస్ట‌యిన జ‌గ‌న్మోహ‌న‌రావును ఆరా తీస్తున్నారు విచార‌ణాధికారులు. బీసీసీఐ ఇచ్చిన 600 కోట్లు ఎటు మ‌ళ్లించార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ కేసు చూస్తుంటే తిరిగి  ఈడీ చేతుల్లోకి వెళ్లేలా క‌నిపిస్తోంది.  ఇక్క‌డ కూడా క‌విత‌క్క హ‌స్త‌మున‌న‌ట్టుగా స‌మాచారం.  ఇన్నేసి  కేసుల్లో పీక‌లోతు ఇరుక్కోవ‌డంతోనే స‌డేన్ గా తెలంగాణ వాదం వినిపించ‌డం, ఆపై బీసీల త‌ర‌ఫు పోరాటాలు.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఆర్డినెస్ కి  కవిత జైకొట్టి ప్రభుత్వం తన పట్ల ఒకింత సానుకూలంగా వ్యవహరించేలా చూసుకుందాని కవిత భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  ముందు ముందు  ఇంకెన్ని క‌విత‌క్క‌ క‌థ‌క‌ళి నృత్యాలు వెలుగులోకి వ‌స్తాయో ఇప్పుడిప్పుడే చెప్ప‌లేం అంటున్నారు కొంద‌రు.

గోదావరి నీటితో ద్వారంపూడి వ్యాపారం.. ప్రభుత్వ ఆదాయానికి పంగనామాలు

కాకినాడను తన అక్రమాలకు అడ్డగా మార్చుకుని వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నియంతలా చెలరేగిపోయారు. వైసీపీ ప్రభుత్వంలో గోదావరి జిల్లాల సీఎంగా ద్వారంపూడి చక్రం తిప్పారు. రేషన్ బియ్యం దగ్గర నుంచి డ్రగ్స్ వరకు ఆయన టీమ్ అన్ని రకాల దందాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ద్వారంపూడి అక్రమాలపై ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందే ధ్వజమెత్తారు. సదరు ద్వారంపూడి అక్రమార్జనలో గోదావరి నీటిని కూడా వదలలేదన్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.  కాకినాడ సిటీ  మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు  ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇప్పటికీ తన తీరుతో అధికారులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్లు తాగిస్తున్న చందంగా వ్యవహరిస్తున్నారు  గనులు, గ్రావెల్‌, ఇసుక ఒకటేంటి ఎక్కడపడితే అక్కడ వాలిపోయి ఆనాడు రూ. కోట్లలో వెనకేసుకున్నారు. కాకినాడలో ద్వారంపూడి చాలా కాలంగా నీళ్ల వ్యాపారం చేస్తున్నారు. కాకినాడ పోర్టుకు వచ్చే నౌకలకు నీళ్లు విక్రయిస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. కానీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి బకాయిలు మాత్రం కట్టడం లేదు. పదకొండేళ్ల నుంచీ ఎగవేస్తుండటంతో ఇప్పుడు ఆ బకాయి రూ.13.84కోట్లకు చేరింది. కాకినాడ నగరాన్ని ఆనుకుని ఎరువుల కర్మాగారం, ఆయిల్‌ ఫ్యాక్టరీలు, కాకినాడ సీ పోర్టు ఉన్నాయి. వీటి పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అవసరం. బాయిలర్ల కూలింగ్‌ దగ్గర నుంచి గ్రీన్‌ బెల్ట్‌ నిర్వహణ, ఉద్యోగులు, కార్మికుల అవసరాలకు నీళ్లు కావాలి. అలాగే కాకినాడ సీపోర్టులో కార్గో ఎగుమతి దిగుమతుల సందర్భంగా పనిచేసే కార్మికులకు, లోపలకు లారీలు వెళ్లి వచ్చే సమయంలో రేగే ధూళి నియంత్రణ, నిత్యం వచ్చిపోయే నౌకల్లో వివిధ అవసరాలకు నీళ్లు పెద్దఎత్తున అవసరం. ఈ నేపథ్యంలో పారిశ్రామిక, ఓడరేవు అవసరాలు తీర్చేలా జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగం నీటిపారుదలశాఖ ద్వారా గోదావరి నీటిని వివిధ ప్రైవేటు సంస్థలకు పైపులైన్ల ద్వారా కేటాయిస్తోంది. ఈ సంస్థలు నీటిని తీసుకుని వివిధ పరిశ్రమలకు విక్రయించుకుంటాయి. నీటి సరఫరా చేసినందుకు ఈ సంస్థల నుంచి నామ మాత్రపు చార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ద్వారంపూడి తన తనయ అంజని పేరుతో గోదావరి నీటిని ఎప్పటినుంచో తీసుకుంటున్నారు. అంజనీ ఏజెన్సీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో నిత్యం 0.25ఎంజీడీ నీటిని పైపులైన్ల ద్వారా తీసుకుంటున్నారు. ఈ నీటిని కాకినాడ పోర్టుకు సమీపంలోని శ్రీ విద్యా కాలనీలో శుద్ధి చేస్తున్నారు. ఇందుకోసం నీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని ద్వారంపూడి కాకినాడ సీపోర్టు, అందులోకి వచ్చే నౌకలకు విక్రయిస్తున్నారు. ద్వారంపూడి కంపెనీ తరహాలోనే నీళ్ల వ్యాపారం చేస్తున్న తక్కిన కంపెనీలు దాదాపుగా బాకీలు చెల్లిస్తున్నాయి. నాగార్జున ఎరువుల కర్మాగారం ప్రభుత్వానికి రూ.1.47కోట్లు బాకీ ఉంది. నోటీసులు జారీ చేయడంతో బాకీలు చెల్లించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. కానీ సదరు ద్వారంపూడి మాత్రం తననెవరూ ఏం చేయలేరనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల అధికారులు నీటి చార్జీల ఎగవేత గుర్తించి తక్షణం బాకీలు చెల్లించాలని గత నెల 27న నోటీసులు జారీ చేశారు. ద్వారంపూడికి 14రోజులు గడువు ఇచ్చారు. ఈ గడువు ఇప్పటికే ముగిసిపోయింది. కానీ ద్వారంపూడి కంపెనీ నుంచి మాత్రం చలనం లేదు. ఇదిలాఉంటే బాకీలు చెల్లించని నేపథ్యంలో ఈ కంపెనీకి గోదావరి ముడి నీటి సరఫరా నిలిపివేయాల్సి ఉన్నా కనీసం ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వం నుంచి ద్వారంపూడి కంపెనీ నీటిని లీటరు రూ.10 చొప్పున కొనుగోలు చేస్తోంది. అదే నీటిని శుద్ధి చేసి రూ.30 చొప్పున పోర్టు, నౌకలు, వివిధ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. ఇలా సరఫరా చేసినందుకు ఎప్పటికప్పుడు ఆయా కంపెనీల నుంచి ఠంచనుగా తమకు రావాల్సిన డబ్బులను వసూలు చేస్తూ ద్వారంపూడి ఏటా కోట్లలో సంపాదిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న గోదావరి నీటికి మాత్రం అసలు చార్జీలే చెల్లించడం లేదు. 2014, ఏప్రిల్‌ 18 నుంచి 2025, మే 31 వరకు ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి కట్టకుండా నీళ్ల దందా కొనసాగిస్తున్నారు. ఏడాదికి రూ.1.24కోట్ల చొప్పున 11ఏళ్లపాటు ద్వారంపూడి కంపెనీ చెల్లించాల్సిన బాకీలు పేరుకుపోయాయి.

జగన్ జనంలోకి.. మళ్లీ వాయిదా.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికి తత్వం బోధపడిందా? జనం  మూడ్ అవగతమైందా? అందుకే జనంలోకి రావాలన్న తన కార్యక్రమాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారా? అంటే పరిశీలకులు మాత్రమే కాదు.. వైసీపీ నేతలు సైతం ఔననే అంటున్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలతో జనంలోకి వెడితే ఆబోరు దక్కదన్న విషయం అర్ధమవ్వడంతోనే జగన్ తన జిల్లాల పర్యటనలను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారని అంటున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత జగన్ చాలా వరకూ బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. అడపాదడపా చుట్టపు చూపుగా మాత్రమే రాష్ట్రానికి వచ్చి పరామర్శ యాత్రల పేరుతో పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికే జగన్ జనంలోకి వస్తున్నానంటూ ప్రకటించిన రెండు మూడు ముహూర్తాలూ వాయిదా పడ్డాయి. తాజాగా వచ్చే ఏడాది వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాటి నుంచీ తాను ఇక జనంలోనే ఉంటానని ప్రకటించేశారు. అయితే ఆ ప్రోగ్రాం కూడా వాయిదాపడిందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఈ వాయిదా గురించి వైసీపీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రాకపోయినప్పటికీ.. జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు ఆఫ్ ది రికార్డ్ అంటూ.. జగన్ వచ్చే ఏడాది కూడా జనంలోకి వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.  అధకార తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ఇసుమంతైనా వ్యతిరేకత కానరావడం లేదనీ, పైపెచ్చు జగన్ పరామర్శ యాత్రలకు జనం నుంచి స్పందన కరవవ్వడం, ఆ యాత్రలకు జనసమీకరణ సైతం కష్టంగా మారడంతో జగన్ తన జనంలోకి కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. ప్రజలలో ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత లేని సమయంలో జనంలోకి వచ్చి సర్కార్ పై విమర్శలు చేయడం వల్ల ఈ మాత్రంగా ఉన్న పరపతి కూడా పలుచన అవుతుందన్న ఉద్దేశంతోనే జగన్ జనంలోకి కార్యక్రమాన్ని చేపట్టడం లేదని అంటున్నారు. అయితే ఆయన జనంలోకి కచ్చితంగా వస్తారనీ, అయితే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిన తరువాత ఆ కార్యక్రమం ఉంటుందనీ చెబుతున్నారు.    

రూ.2400 కోట్లు.. ఇద్దరు టెకీలకు మెటా మెగా ఆఫర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగాల కోతకు కారణమౌతుందంటూ ఒక వైపు ఆందోళన వ్యక్తం అవుతుంటే.. మరో వైపు ప్రతిభావంతుల కోసం టెక్ దిగ్జజాలు కాగడా పెట్టి గాలిస్తున్నాయి. అలా ప్రతిభావంతులకు అనూహ్య స్ధాయి వేతనాలతో కొలువులోకి తీసుకుంటున్నాయి. ఒక వైపు మెక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉద్యోగాల కోతతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలోనే.. ప్రతిభ ఉంటే కొలువులు వెతుక్కుంటూ కాళ్ల దగ్గరకు వస్తున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం మెటా ఇద్దరు ఏఐ ఇంజినీర్లను గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి వేతనాల ఆఫర్ చేసి మరీ కొలువులోకి తీసుకుంది.  ట్రాపిట్ బన్సల్‌ , రూమింగ్ పాంగ్‌ అనే ఇద్దరు ఏఐ  ఇంజనీర్లు మెటాలో రికార్డు స్థాయి వేతనాలతో ఉద్యోగులుగా చేరారు.  ఈ ఇరువురూ కూడా భారత సంతతికి చెందిన టెక్ నిపుణులే కావడం విశేషం. మెటా  తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగంలో పని చేసేందుకు భారత సంతతికి చెందిన   ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు ఏకంగా 2400 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఉద్యోగాలిచ్చింది. వీరిలో ట్రాపిట్ బన్సల్‌కు   ఎనిమిది వందల కోట్ల రూపాయల భారీ ఆఫర్ తో మెటాలో చేరారు.  అలాగే  రూమింగ్ పాంగ్ అనే మరో ఏఐ నిపుణుడిని అయితే  రూ.1600 కోట్ల రూపాయల వేతనంతో కొలువులోకి తీసుకుంది.  అంటే ఇద్దరు ఐటీ నిపుణులకు ఏకంగా 2400 కోట్ల  రూపాయలు వెచ్చించింది.   భారతీయ మూలాలున్న ట్రాపిట్ బన్సల్, ఐఐటీ కాన్పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి . 2022లో ఓపెన్ ఏఐలో చేరారు. రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, రీజనింగ్ మోడల్స్ అభివృద్ధిలో  లక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఓపెన్ఏఐలో ‘O1’ అనే రీజనింగ్ మోడల్‌ డెవలప్‌మెంట్‌లో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇక రూమింగ్ పాంగ్ అయితే యాపిల్‌ కంపెనీ నుంచి వచ్చి మోటాలో చేరారు. యాపిల్ లో   అత్యాధునిక ఏఐ సిస్టమ్‌ల డెవలప్ మెంట్ లో చాలా కీలకంగా వ్యవహరించారు.  

మహాలక్ష్మికి ‘ఉచిత’ కష్టాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  18 నెలలు పూర్తయింది. ఈ 18 నెలల కాలంలో ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఎన్ని అమలు చేసింది.. ఎన్నిటికీ ఎగనామం పెట్టింది? అంటే..  మంత్రులు, కాంగ్రెస్ నాయకులు  బట్టిపట్టిన అప్పగించే పాఠం ఉచిత బస్సు తోనే  మొదలవుతుంది.  కానీ.. గ్యారెంటీలు, హామీలు ఎంతవరకు అమలవుతున్నాయో వాస్తవంలో ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియదు. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో ఆశించిన ఫలితాలు అందుకోవడంలో  ఫెయిల్  అయిందనే అభిప్రాయమే గట్టిగా వినిపిస్తోంది.   ఇతర గ్యారెంటీలు,హామీల విషయం ఎలా ఉన్నా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే    అత్యంత ఆర్భాటంగా శ్రీకారం చుట్టిన మహాలక్ష్మి ‘ఉచిత’ ప్రయాణం పథకం పై కూడా పెదవి విరుపులే వినిపిస్తున్నాయి. ఆరంభలో ఎలా ఉన్నా.. మెల్లమెల్లగా  ఉచిత బస్సు’ సమస్యలను ఎదుర్కుంటోంది. పథకం ప్రయోజన పొందుతున్న మహిళల్లో సైతం  పెద్ద ఎత్తున  అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక పురుషుల సంగతి అయితే చెప్పనక్కరలేదు. బస్సులలో రద్దీ పెరిగి, మహిళలతోపాటుగా, పురుష ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో  ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. ప్రధానంగా  పథకం ప్రయోజనం పొందుతున్న మహిళల్లోనూ సగం మందికిపైగా అంటే దాదాపు 52 శాతం  మహిళలు నెగిటివ్ మార్కులు వేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఏమో కానీ.. ఉచిత కష్టాలు  ఎక్కువయ్యాయని మహిళలు అంటున్నారు.   రద్దీకి తగినట్టు బస్సులు లేకపోవడం, సీట్లు దొరకకపోవడం వంటి ఉచిత బస్సు కష్టాలను ఏకరవు పెడుతున్నారు.   అంతే కాదు, సీట్ల కోసం మహిళలు సిగపట్లు కారణంగా ప్రయాణం ఆలస్యం అవుతోందని.. ఫలితంగా పురుషుల దూషణలు భరించవలసి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సర్వే ఫలితం చెబుతోంది. కాగా ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులు  43 రోజుల పాటు నిర్వహించిన సర్వేలో 480 మంది మహిళలతో మాట్లాడినట్టు  సర్వేకు సారధ్యం వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ సహేరా ఫాతిమా, డాక్టర్‌ నాగలక్ష్మి కుందేటి తెలిపారు. అలాగే.. ఫలితాను విడుదల చేసిన సందర్భంగా వారు.. తప్పుల్ని వెతకడం కాదు..మార్గాలను సూచించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రజా రవాణా కోట్లాది మందికి జీవనాధారమనీ.. తెలంగాణ ఆర్టీసీలో రోజుకు 9వేల బస్సులు తిరుగుతుండగా,40 లక్షల మందికిపైగా సేవలు పొందుతున్నారనీ, వీరిలో అధికశాతం మహిళలే ఉన్నారని  పేర్కొన్నారు.  ప్రయాణంలో సీట్లు దొరక్క అసౌకర్యాన్ని ఎదురొంటున్నట్టు 52 శాతం మంది మహిళలు చెప్పారన్నారు.  అలాగే, 23 శాతం మంది మహిళలకు మాత్రమే భద్రతా టూల్స్‌ గురించి తెలుసని సర్వే సిబ్బంది చెప్పారు.ఆర్టీసీ సిబ్బందికి జెండర్‌ సెన్సిటివిటీపై శిక్షణ ఇవ్వాలని కోరారు. కాగా  ఈ సర్వేపై స్పందించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌, ఈథేమ్స్‌ అధ్యయనాన్ని స్వాగతిస్తున్నా.. సర్వే నివేదిక సూచించిన చాలా అంశాలు ఇప్పటికే అమలు దశలో ఉన్నాయన్నారు. మహిళల భద్రత, గౌరవం పెంపునకు ఆర్టీసీ కట్టుబడి ఉన్నదనీ,  బస్సుల సంఖ్య పెంపు, సిబ్బంది శిక్షణ, హెల్ప్‌లైన్‌లు, సీసీటీవీలు, ట్రాకింగ్‌ యాప్‌లు, షీటీమ్స్‌ సహకారం వంటివి ఉన్నాయన్నారు.  అదలా ఉంటే, నిత్యం బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులు బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచవలసిన అవసరం ఉందనీ..  అదే సమయంలో ఉచితానికి కూడా హద్దులు ఉండాలని సూచిస్తున్నారు. ఆర్థిక స్తోమతను కూడా పరిగణననలోకి తీసుకోవాలని.. అలాగే, మహిళల కోసం ప్రత్యేక ఉచిత బస్సులు నడిపితే..  టికెట్ చార్జీ చెల్లించేందుకు సిద్దమైన మహిళలకు కూడా సౌకర్యంగా ఉంటుందని, సాధారణ ప్రయాణీకులు సూచిస్తున్నారు.

దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షాలు

తీవ్రమైన ఉక్కపోతతో గత కొన్ని రోజులుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  శుక్రవారం (జులై 18) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ద్రోణికి తోడు రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో శుక్రవారం దక్షిణ కోస్తా, రాయల సీమలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, వర్షంతో పాటు ఉరుములు, పిడుగులు, ఈదురుగాలు ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, కర్నూలు, అలాగే గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలలో కూడా చెదురుమదురు వానలు కురుస్తాయని పేర్కొంది.  

చర్లపల్లి- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

తిరుమల ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న రద్దీ, ప్రయాణీకుల నుంచి వచ్చిన విజ్ణప్తుల మేరకు తిరుమతికి వివిధ ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లను నడపడానికి నిర్ణయించింది.  ఈ రైళ్లు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 15 వరకు ప్రతి శుక్రవారం ఎర్నాకుళం పాట్నా మార్గంలో నాలుగు రైళ్లు నడుస్తాయి.  అలాగే జులై 28నుంచి ఆగస్టు 18 వరకు  ప్రతి సోమవారం  పాట్నా-ఎర్నాకుళం మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయి. ఇక ఆగస్టు 3 నుంచి 24వరకు (ప్రతి ఆదివారం) తిరుపతి - చర్లపల్లి  మార్గంలో నాలుగు రైళ్లు, అలాగే ఆగస్టు 4నుంచి 25వరకు  ప్రతి సోమవారం  చర్లపల్లి - తిరుపతి  మార్గంలో  నాలుగు రైళ్లు నడుస్తాయి.  తిరుమలకు వెళ్లే ప్రయాణీకుల రద్దీ ని తట్టుకునేందుకు ఇవి దోహదపడతాయని భావిస్తున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

గత వారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  శుక్రవారం (జులై 18)   తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి  దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న బక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్   శిలాతోరణం వరకు సాగింది.  గురువారం (జులై 17) శ్రీవారిని మొత్తం 63,897 మంది భక్తులు దర్శించుకున్నారు.వారిలో  29,500 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.   శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు వచ్చింది. 

ఆంధ్రప్రదేశ్‌లో 66 ఏఎంసీలకు ఛైర్మన్లు ఖరారు

  వ్యవసాయ మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. 66 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లకు ఛైర్మన్లను ఖరారు చేసింది. వీటిలో 9 చోట్ల జనసేన, 4 చోట్ల బీజేపీ నేతలకు అవకాశం కల్పించారు. 66 ఛైర్మన్‌ పదవుల్లో 17 మంది బీసీలు, 10 ఎస్సీలు ఉన్నారు. ఎస్టీ, మైనార్టీలకు చెందిన వారు ఐదుగురు చొప్పున ఉన్నారు.  మొత్తం 66 ఏఎంసీ ఛైర్మన్‌ పదవుల్లో 35 చోట్ల మహిళలకు అవకాశం కల్పించారు. ఇది వరకే కొన్ని ఏఎంసీలకు ఛైర్మన్లను ఖరారు చేయగా.. తాజాగా మరో 66 మందిని ప్రభుత్వం ప్రకటించింది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు రైతులకు వారి ఉత్పత్తులకు సరైన రేటులు అందేలా, మార్కెట్ వ్యవస్థను నియంత్రించేలా పనిచేస్తాయి. ఈ కమిటీలు రైతులకు, వ్యాపారులకు మధ్య వారధిగా ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఈ నియామకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.  

రాజా సింగ్ రాజీనామా గోషామహల్ ఉప ఎన్నిక అనుమానమే

  గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామ చేసిన  నేపధ్యంలో, జూబ్లీ హిల్స్ నియోజక వర్గంతో పాటుగా గోషామహల్’నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతుందన్న వ్యూహగానాలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీకి రాజీనామా  చేసిన రాజా  సింగ్’ ఇంతవరకు  ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామ చేయలేదు. బీజీపీ అధ్యక్షుడికి రాసిన రాజీనామా లేఖను, అసెంబ్లీ స్పీకర్’కు పంపి, తనను అనర్హుడిగా ప్రకటించమని కోరాలని సూచన చేసారు. అయితే, రాజా సింగ్  ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించింది. రాజీనామా చేయాలనుకుంటే రాజా సింగ్’  నేరుగా అసెంబ్లీ స్పీకర్’కే టం రాజీనాం లేఖను సంర్పించాలని, బీజేపీ అధికార ప్రతినిధులు స్పష్టం చేసారు. అలాగే, రాజసింగ్’ రాజీనామను తిరస్కరించి సందర్భంలోనూ బీజేపీ అధ్యక్షుడు, అనర్హత వేటు అంశాన్ని ప్రస్తావించలేదు. రాజా సింగ్ పార్టీ కోర్టులోకి కొట్టిన బండిని, బీజేపీ  తిరిగి  ఆయన కోర్టులోకి తిప్పికొట్టింది.  అయితే,పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి  రాజా సింగ్ చేసిన రాజీనామాను, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించి వారం రోజులు పైగానే అయింది, అయినా, రాజా సింగ్ ఇంత వరకు ఎమ్మెల్యే పదవికి సంబంధించి పెదవి విప్పలేదు. మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు,పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసినా హిదుత్వ సిద్దాంతాన్ని వదలనని, వేరే పార్టీలో చేరనని  చెప్పారు. కార్యకర్తలకు ఉద్భోదలు చేసారు.,కానీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి మాత్రం ఇంత వరకు మాట్లాడ లేదు. రాజీనామా చేసే సంకేతాలు కూడా కనబడడం లేదు. మరోవంక  బీజేపీ కూడా వత్తిడి చేయడం లేదు. సో... రాజీనామా చేస్తారా ? స్వతంత్ర అభ్యర్ధిగా కొనసాగుతారా, అనేది ఇంకా స్పష్టం కాలేదు. అదొకటి అలా ఉంటే, ఒక వేళ రాజా సింగ్’ స్పీకర్ ఫార్మేట్’లో రాజీనామా సమర్పించినా, స్పీకర్’ను స్వయంగా కలిసి రాజీనామా ఆమోదించమని కోరినా,స్పీకర్’ వెంటనే రాజీనామాను ఆమోదిస్తారా? అంటే, అది కూడా జరగక పోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే, బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయం ఎటూ తేలకుండా వుంది. స్పీకర్’ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, న్యాయ స్థానాలు సూచించినా, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పడు రాజ్ సింగ్ రాజీనామాను తక్షణం ఆమోదిస్తే, స్పీకర్’, విమర్శలను ఎదుర్కోనవలసి వస్తుంది. అందుకే,  రాజా సింగ్ రాజీనామా చేసినా, స్పీకర్ ఆమోదించక పోవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపధ్యంలో గోషామహల్ నియోజక వర్గానికి, ఉప ఎన్నిక వచ్చే  అవకాశం ఇంచుమించుగా లేనట్లే అంటున్నారు. ఒక  విధంగా ఇది, రోగి కోరుకున్నది  వైద్యుడు ఇచ్చింది ఒకటే అన్నట్లుగా ఉందని  పరిశీలకులు పేర్కొంటున్నారు.  కారణాలు వేరైనా, ఎవ్వరూ కూడా ఉప ఎన్నికను కోరుకోవడం లేదు. అవును,అటు రాజా సింగ్ ఉప ఎన్నిక కోరుకోవడం లేదు, బీజేపీ పట్టుపట్టే పరిస్థితి లేదు.. అన్నిటికంటే ముఖ్యంగా అంతిమ తీర్పు ఇవ్వవలసిన స్పీకర్, తక్షణ నిర్ణయం తీసుకోక పోవచ్చని అంటున్నారు.అందుకే ..గోషామహల్ ఉప ఎన్నికపై ఆశలు పెట్టుకున్న మాధవీలత గోషామహల్ కాకపోతే జూబ్లీ హిల్స్’ అంటూ అటుగా చూస్తున్నారు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా గెలుస్తా, అసెంబ్లీలో అడుగు పెడతా అంటన్నారు.అయితే ఆమె ఏకపక్షంగా చేస్తున ప్రకటనల విషయంలో ఇప్పటికీ పార్టీలో వ్యతిరేకత వ్యక్త మవుతోంది. నిజానికి, పార్టీ నాయకత్వం కూడా ఇప్పటికే ఆమెను, హెచ్చరించినట్లు చెపుతున్నారు.మాధవీ లత విష్యం ఎలా ఉన్నా, రాజా సింగ్ రాజీనామా, గోషామహల్ ‘  ఉప ఎన్నిక  రెండూ అనుమానమే, అంటున్నారు.