విజయ్ మాల్యా తీసుకెళ్లిన ఆ బ్యాగుల్లో ఏముందో..
posted on Mar 11, 2016 @ 2:57PM
ప్రస్తుతం దేశం మొత్తం విజయ మాల్యా గురించిన వార్తలతోనే నిండిపోయింది. రుణాలు చెల్లించకుండా బ్యాంకులకు టొకరా వేసిన విజయ్ మాల్యా ప్రస్తుతం దేశం విడిచి పోయాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు స్పందిచిన మాల్యా మాత్రం తాను ఎక్కడికి పారిపోలేదని.. ఒక అంతర్జాతీయ వ్యాపారస్థుడిగా పలు దేశాలు తిరుగుతుంటానని.. న్యాయానికి కట్టుబడే ఉంటానని చెపుతూ పలు ట్వీట్లు ట్వీటారు. అయితే తాను ఎక్కడి నుండి ట్వీట్లు ట్వీటారా అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే మాల్యా ప్రస్తుతం.. లండన్లోని తన సొంత ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది. అక్కడి నుండే తాను ఈ ట్వీట్లు చేశాడని వార్తలు వినిపిస్తున్నయి.
అయితే ఇక్కడ విజయ్ మాల్యా లండన్ వెళ్లిన పద్దతి చూస్తుంటే మాత్రం తాను నిజంగానే పారిపోయాడా అన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే మాల్యా మార్చి 2 అర్థరాత్రి 1.30 ఢిల్లీ నుంచి లండన్ ఫ్లైట్ ఎక్కినట్టు ఓ ఉన్నత అధికారి తెలిపారు. అయితే ఎప్పుడూ చుట్టూ జనంతో ఉండే మాల్యా.. ఆరోజు ఒంటరిగా వచ్చినట్టు.. అయితే ఆయన పక్కన ఓ మహిళ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఆరోజు మాల్యా తనలో పాటూ చాలా పెద్దవి..ఏడు లగేజీ బ్యాగ్‌లు తీసుకెళ్లారట. దీంతో ఇప్పుడు అందరి అనుమానాలు ఆ బ్యాగుల మీద పడ్డాయి. అంత పెద్ద బ్యాగుల్లో.. ఎప్పుడూ లేనిది ఇప్పుడే అంత లగేజ్ తీసుకెళ్లడానికి గల కారణాలు ఏంటి.. ఇంతకీ ఆ బ్యాగుల్లో ఏముంది అని పలువురు అనుకుంటున్నారు. మరి ఇంతకీ ఆ బ్యాగుల్లో ఏముందో..