5 కోట్లు జరిమానా కడతాం.. ఒకేసారి కట్టలేం.. రవిశంకర్..
posted on Mar 11, 2016 @ 3:11PM
జైలుకైనా వెళ్తాను కానీ.. జరిమానా చెల్లించేది లేదని చెప్పిన శ్రీ శ్రీ రవిశంకర్ ఎట్టకేలకు ఒక మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో రవిశంకర్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల వల్ల పర్యావరణానికి హాని కలిస్తుందంటూ దీనికి 5 కోట్లు జరిమానా కట్టమంటూ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన రవిశంకర్ జరిమానా అస్సలు కట్టనని చెప్పిన ఆయన నాలుగు వారాల్లోగా అయిదు కోట్ల జరిమానాను చెల్లిస్తామని గ్రీన్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. కల్చర్ ఫెస్టివల్ ఆరంభం అయ్యేలోపు అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేమని ఇవాళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కోర్టుకు పేర్కొంది. తమది స్వచ్ఛంధ సంస్థ అని, ఇంత త్వరగా అంత మొత్తాన్ని సమీకరించలేమని పిటిషన్‌లో పేర్కొన్నారు.