తెహెల్కా ఎడిటర్‌పై లైగింక వేదింపుల ఆరోపణ

 

ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజంతో ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో సంచనాలు సృష్టించిన తెహెల్కా మేగజైన్‌ వ్యవస్థాపక ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ చిక్కుల్లో పడ్డారు. ఎంతోమంది బడా బడా నేతల బండారాలు బయట పెట్టిన తేజ్‌పాల్‌ ఇప్పుడు లైగింక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గోవాలోని ఓ ఫైఫ్ స్టార్ హోటల్‌లో పది రోజుల కిందట తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ సంస్థలోని ఓ మహిళా జర్నలిస్టు ఆయనపై ఆరోపణలు చేసింది.

అయితే ఈ విషయంపై వెంటనే స్పందించిన తేజ్‌పాల్‌ తెహెల్కా ఎడిటర్‌ పదవికి ఆరునెలలపాటు దూరంగా ఉంటున్నట్టుగా ప్రకటించారు. తన చర్యల పట్ట తేజ్‌పాల్‌ సదరు ఉద్యోగినికి క్షమాపణ చెప్పినట్టు కంపెనీ పేర్కొంది అయితే ఈ విషయం పై ప్రజాసంఘాలు మాత్రం గుర్రుగా ఉన్నాయి. ఇటీవల ప్రసార భారతి బోర్డు సభ్యుడిగా తేజ్‌పాల్‌ను ఎంపిక చేసిన కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.