విభజనతో భద్రతకు ముప్పు

 

రాష్ట్ర విభజనతో భద్రతాపరమైన సమస్యలతో పాటు నక్సలిజం, టెర్రరిజం పెరిగిపోతాయన్న సియం వాదనకు మరింత బలం చేకూరింది. ఈ మేరకు ఇంటలిజన్స్‌ బ్యూరో జీవోయంకు ఓ నివేదికను అందించింది. విభజన ప్రధానంగా భద్రత పరమైన అంశాలపై తీరని ప్రభావాన్ని చూపే అవకాశ ముందనే అభిప్రాయా లు వ్యక్తమవుతు న్నాయి. టెర్రరిజాన్ని పెంచిపోషించినట్లవుతుందనే ఆందోళనను కేంద్ర నిఘా విభాగం వ్యక్తం చేస్తోంది.

ఆంద్రప్రదదేశ్‌ రాష్ట్ర విభజనతో  హైదరాబాద్‌తో పాటు పలు రాష్ట్రాలపై భద్రతకు ముప్పువాటిల్లే అవకాశముందనే విషయాన్ని కేంద్ర ఇంటలిజెన్స్‌ బ్యూరో అధిపతి ఇబ్రహీం తన నివేదికలో వివరించారు. ఇప్పటికే జీవోయంకు ఈ నివేదిక అందిచామని ఈ విషయంపై కూడా ఆలొచించి నిర్ణయం తీసుకోవాలని కోరినట్టుగా సమాచారం.