ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు
posted on Dec 23, 2025 @ 4:26PM
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పంచాయతీ కార్యదర్మి, సర్పంచ్‌కు చెక్ పవర్ ఉండేది. అయితే 2018లో సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టం సవరణ చేసింది. తాజాగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసి గతంలో మాదిరే చెక్ పవర్ కల్పించింది. కాగా, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి.
అన్ని గ్రామ పంచాయతీలో అధికారులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఉపసర్పంచులతో ప్రమాణస్వీకారాలు చేయించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాధ్యతలను అప్పచెప్పారు. గ్రామాల్లో ఇప్పటి వరకు కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలన సర్పంచులు, వార్డు సభ్యుల రాకతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది