మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్
posted on Dec 24, 2025 @ 3:01PM
పేరు మోసిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో పోలీస్ కస్టడీ నుండి తప్పిం చుకొని పరారైన ఈ నింది తుడు ప్రస్తుతం తమిళ నాడులో వరస నేరాలకు పాల్పడుతున్నట్లు గా తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. గతంలో హైదరాబాదులోని ప్రిజం పబ్ లో కాల్పులు జరిపి హల్చల్ సృష్టించిన బత్తుల ప్రభాకర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పిటి వారెంట్ మీద అతన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించి కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ నెలలో విజయ వాడ కోర్టులో హాజరు పరిచిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మార్గమ ధ్యంలో ఉన్న ఒక హోటల్ వద్ద ఆగారు.అదే సమయంలో బత్తుల ప్రభాకర్ మూత్ర విసర్జనకు అంటూ పోలీసుల కస్టడీ నుండి తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుండి అతడి కోసం గాలింపు సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల బయటకు వచ్చిన ఒక వీడియో పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. బత్తుల ప్రభాకర్ ప్రస్తుతం తమిళనాడులో ఉంటూ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ లను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ట్లుగా ఆ వీడియో ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బత్తుల ప్రభాకర్ చోరీ కి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ కాలేజీ లాకర్ నుండి 60 లక్షల వరకు నగదు కొట్టేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి హైదరాబాదులోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనానికి వచ్చిన ప్రభాకర్ అక్కడ పోలీసుల నుండి తప్పించుకొని ప్రిజం పబ్బులోకి వెళ్లి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని తీసుకొని కోర్టులో హాజరు పరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో విజయ వాడ నుండి తప్పించుకొని పారిపోయాడు. అలా తప్పించుకొని పారిపోయిన బత్తుల ప్రభాకర్ చెన్నైలో సెటిల్ అయ్యి అక్కడ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఆ విధంగా చోరీల ద్వారా సంపా దించిన డబ్బుతో బత్తుల ప్రభాకర్ జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నై కాలేజీ చోరీకి సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల చేతికి చిక్కడంతో బత్తుల ప్రభాకర్ జాడ కనుక్కున్నారు.
ప్రస్తుతం అతడిపై మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పరారీలో ఉన్న బత్తుల ప్రభాకర్ తమిళనాడులో ప్రత్యక్షమై చోరీలకు పాల్పడుతూ ఉండడంతో అతన్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పరారీలో ఉన్న నేరస్తుల్ని అదుపులోకి తీసుకునేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. నేర చరిత్ర కలిగిన బత్తుల ప్రభాకర్ పట్టుకోవడం పోలీసులకు ఒక సవాలుగా మారింది.