కొత్త రాష్ట్రంలోనే కొత్త సంవత్సరం

 

ఈ సారి కొత్త సంవత్సర వేడుకలు కొత్త రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి. ఈ నెల 26న అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందన్న ఆయన తరువాత జరిగే పక్రియ అంతా చాలా వేగంగా అవుతుందన్నారు. 2014 జనవరి 1 వేడుకలు ఈ సారి తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు.

 

తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వరంగల్‌ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, భద్రాచలం డివిజన్‌ కూడా తెలంగాణలోనే ఉంటుందన్నారు.