ఉత్తర ప్రదేశ్ సీఎంగా స్మృతీ ఇరానీ..!
posted on Feb 24, 2016 @ 12:00PM
టీవీ నటిగా బుల్లితెర మీద మంచి పేరు సంపాదించుకొని.. అనేక సంచనాలు సృష్టించిని స్మృతీ ఇరానీ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అనంతరం నటనకు స్వస్తి చెప్పి రాజకీయ ప్రవేశం చేసి ఎంపీగా పోటీ చేసింది. అయితే ఎంపీగా గెలవకున్నా కానీ ఆమె కేంద్రమంత్రి అయ్యారు. అది కూడా మోడీ కేబినెట్‌లో కీలకమైన మానవవనరుల శాఖకు.. అందులోనూ.. మొదటి ప్రయత్నంలోనే.
అయితే గతంలో ఆమె ఆమోధీ నుండి పోటీ చేసి రాహుల్ గాంధీకి చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు మరో అవకాశం రానున్నట్టు తెలుస్తోంది. కొద్ది నెలల్లో ఉత్తర ప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల్లో యూపీ సీఎంగా స్మృతీ ఇరానీని అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోందట. ఇప్పటికే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా గెలిచి తమ జెండా ఎగరేయాలని చూస్తున్నారు. అందుకే అక్కడి ప్రజలకు సుపరిచితురాలైన, అనర్గళంగా మాట్లాడే స్మృతిని యూపీ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించనుంది. మరి అన్ని అనుకున్నట్లే జరిగితే… యూపీలో బీజేపీ గెలిస్తే స్మృతిని దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉందనటంలో సందేహం లేదు. ఏం జరుగుతుందో చూడాలి..