సంక్షోభంలో యుపిఎ సర్కార్
posted on Sep 21, 2012 @ 6:22PM
అనుకున్నంతా జరిగింది....! ఆడ్డగోలు నిర్ణయాలతో ప్రజాజీవనాన్ని కష్టాల్లోకి యుపిఎ సర్కార్ నెట్టేస్తోందంటూ కళ్ళెర్రజేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర సర్కార్‌కు తన మద్దతు పూర్తిగా ఉపసంహరించుకుంది. డీజిల్ ధరను బాగా పెంచడంతో బాటు భారత్ భావిప్రయోజనాలకు విఘాతం కల్పిస్తూ ఎఫ్‌డిఐకి అనుమతి ఇవ్వడంపట్ల మమత మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు సామాన్యుడిని మరిన్ని సమస్యలకు గురి చేస్తాయనీ, కాబట్టి ఎఫ్‌డిఐకి అనుమతి ఇచ్చే విషయాన్ని పూనరాలోచించి తక్షణమే ఆ నిర్ణయాలను రద్దు చేసుకోవాలంటూ మమత హెచ్చరించింది. భాగస్వామ్య పార్టీలు హఠం చేసినప్పుడ్‌ల్లా నిర్ణయలు మార్చుకోటే పరసతి పోతుందనుకున్న సర్కార్ తన నిర్ణయానికే కట్టుబడిరది. అంతేకాకుండా పార్లమెంటులో తృణమూల్‌కు ఉన్న బలం 19 మంది ఎంపిలు కాగా, వీరు వైదొలగినా తమకు 307 మంది ఎంపిల బలం ఉంటుంది కాబట్టి తమ సర్కార్ కొచ్చిన ఇబ్బందేంలేదని యుపిఎ భరోసాగా ఉంది. నిజానికి 276 మంది ఎంపిలు కాంగ్రెస్ బలంకాగా, ఎస్పీ, బిఎస్పీ, జనతాదళ్ సెక్యులర్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు బయట నుంచి ఇస్తున్న మద్దతుతో ఆ బలం 307 అవుతుంది. ఇది అధికారంలో కొనసాగేందుకు అవసమైన ఎంపీల సంఖ్యకంటే 35 ఎక్కువ. కాబట్టి తమ సర్కార్‌కు ఢోకాలేదంటూ కాంగ్రెస్ నేతలు పైకి చెబ్తున్నా రాజకీయ చదరంగంలో అద్భుతంగా పావులు కదపగలిగే మేధాశక్తి ఉన్న మమత మళ్ళీ ఏం ఎత్తులు వేస్తుందో అనుకుంటూ భయంభయంగానే ఉన్నట్లు వార్తలోస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల భయాలను నిజం చేస్తున్నట్లుగా` మమతా బెనర్జీ ఇప్పటికే యుపిఎ భాగస్వామ్య పక్షాలతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరో సంవత్సరకాలంలో ఎన్నికలు ఎదుర్కోవలసి ఉన్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలకు మద్దతు పలికితే అందుకు పరిహారం వచ్చే ఎన్నికల్లో మనం చెల్లించుకోవలసి వస్తుందంటూ మమత హెచ్చరిస్తున్నారట ! ఇది నిజమేనని అంగీకరించిన ఇతర భాగస్వామ్య పక్షాలు మమతతో చేతులుకలిపి మద్దతు ఉపసంహరణ దిశగా ఆలోచనలు సారిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎటు నుంచి ఎటు వచ్చినా తమకే లాభం అనుకుంటూ బిజిపి పక్షాలు జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి !