చిరు మళ్ళీ దొరికిపోయాడు..!
posted on Nov 8, 2013 @ 11:09AM
కేంద్రమంత్రి చిరంజీవి తనలోని సమైక్యవాదాన్ని నిరూపించుకోవడానికి, చాటడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పదవిని పట్టుకొని వేలాడుతున్న ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా సీమాంధ్ర ప్రజలను మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి చిదంబరంను కలిసిన మెగాస్టార్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మార్గం లేదని అన్నాడు. హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగువారందరి భాగస్వామ్యం ఉందన్నాడు. సీమాంధ్ర సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని చిరంజీవి చెప్పుకొచ్చాడు.
మరి ఇంతలా సమైక్యవాదాన్ని మేడమ్ కు వినిపించామని అంటున్న చిరంజీవి అంతలోనే విభజన గురించి మాట్లాడాడు. సమైక్యానికి మించిన పరిష్కారం లేదన్న ఈ నేత విభజన చేయదలుచుకొంటే.. అంటూ హైదరాబాద్ గురించి మరోసారి ఆలోచించాలని కోరామని అన్నాడు! ఉద్యోగులు, విద్యార్థుల భయాలు తొలగించాలని సూచించామని, హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి భద్రత కల్పిస్తారో చెప్పాలని కోరామని, అందరికీ న్యాయం చేయాలని, తమ అనుమానాలు తీర్చాలని కోరినట్టు చెప్పాడు.
ఇక్కడ కామెడీ ఏమిటంటే.. సమైక్యతకు మించిన పరిష్కారం లేదంటూనే.. విభజన గురించి మాట్లాడటం. మనసా కర్మనా వాచా సమైక్యానికి కట్టుబడి ఉంటామన్న ఇలాంటి నేత మదిలోకి విభజన జరిగితే అనే ఐడియా ఎలా వస్తోంది?