మరోసారి సమ్మెకు సై
posted on Nov 14, 2013 8:11AM
కాంగ్రెస్ అధిష్టానం విభజన దిశగా వడివడిగా అడుగులు వేస్తుండటంతో ఏపిఎన్జీవోలు మరోసారి సమ్మెకు సిద్దపడుతున్నారు. యుపీఏ ప్రభుత్వం, సీడబ్ల్యుసి గత జులై 30న రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె సరైన్ మోగింది. దాదాపు అన్ని ప్రభుత్వ సంఘాలకు సమ్మెకు మదతునివ్వడంతో దాదాపు 72 రోజుల పాటు రాష్ట్రంలో పాలన స్తంభించింది.
అయితే ప్రస్థుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని జాతీయ పార్టీ నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మరో మారు సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఏర్పాటుకు సంభందించిన బిల్లు అసెంబ్లీకి వస్తే వెంటనే మరో మారు సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు ఏపిఎన్జీవోలు.