విభజనపై సుప్రీంను ఆశ్రయించిన ఎంపి
posted on Nov 14, 2013 8:22AM
తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న నేఫధ్యంలో కొందరునాయకులు న్యాయపోరాటానికి రెడీ అవుతున్నారు. విభజన ప్రక్రియను ఆపాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ బుధవారం సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కారణంగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్‌లో తెలిపారు.
కేంద్రంతో పాటు కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియను రాజకీయ కోణంలో చూస్తుందని పిటిషనర్ అయిన సి.ఎం. రమేష్ తెలిపారు. రాజ్యాంగ సవరణ ద్వారా 371(డి) ని తొలగించాలని సి.ఎం. రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా వుండగా సీమాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలల కన్వీనర్ చిరంజీవిరెడ్డి కూడా రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ బుధవారం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.