ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదుల.. అమ్మాయిలదే హవా
posted on Apr 19, 2016 @ 10:28AM
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకేసారి ప్రథమ, ద్వితియ సంవత్సరాల ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్లో 68. 08ఉత్తీర్ణత, సెకండియర్లో 73.78 ఉత్తీర్ణత పొందినట్టు మంత్రిగారు తెలిపారు. ఫస్టియర్లో అమ్మాయిల్లో 72.09 శాతం, అబ్బాయిల్లో 64.20 ఉత్తీర్ణత పొందగా.. సెకండ్ ఇయర్లో అమ్మాయిల్లో 76.43 శాతం, అబ్బాయిల్లో 71.12 శాతం ఉత్తీర్ణత పొందారు. కాగా ఈసారి పరీక్షల్లో అమ్మాయిలదే హవా.
ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 4,67,747 మంది జనరల్ కేటగిరీలో హాజరవగా, ఒకేషనల్ కి 32,655 మంది విద్యార్థులు హాజరైనట్లు మంత్రి తెలిపారు. జనరల్ విభాగంలో 1,85,538 మంది (58.29 శాతం) ఏ గ్రేడులో పాసయ్యారని, 82,109 మంది (25.85 శాతం) బీ గ్రేడ్ లో, 35,592 మంది (11.18 శాతం) సీ గ్రేడ్ లో, 15,061 మంది (4.73 శాతం) డీ గ్రేడ్ లో పాసయ్యారని వివరించారు.
రెండవ సంవత్సరం పరీక్షలకు 4,11,941 మంది జనరల్ కేటగిరీలో హాజరవగా, ఒకేషనల్ కి 32,655 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. జనరల్ విభాగంలో 1,74,649 మంది (57.46 శాతం) ఏ గ్రేడులో పాసయ్యారని, 84,407 మంది (27.77 శాతం) బీ గ్రేడ్ లో, 33,864 మంది (11.14 శాతం) సీ గ్రేడ్ లో, 11,014 మంది (3.62 శాతం) డీ గ్రేడ్ లో పాసయ్యారని వివరించారు.