చెప్పి మరీ ట్రాఫిల్ రూల్స్ ఉల్లంఘించిన ఎంపీ.. 2 వేలు జరిమానా
posted on Apr 19, 2016 @ 10:09AM
ఢిల్లీలో వాతావరణ కాలుష్య నివారణకు కేజ్రీవాల్ ప్రభుత్వం సరి-బేసి విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 15 నుండి మలిదశ అమలు చేయగా.. నిబంధనను ఉల్లంఘించి ఆరోజే 5 గంటల వ్యవధిలో 500 వాహనాదారులు జరిమానా కట్టాల్సి వచ్చింది. అయితే వారు తెలియక నిబంధనలు ఉల్లంఘించామని.. ఇంకొందరు అత్యవసర పరిస్థితి ఉన్నందున రావాల్సి వచ్చిందని పలు కారాణాలు తెలిపారు. కానీ ఇక్కడ ఓ ఎంపీ గారు మాత్రం కావాలనే నిబంధనలు ఉల్లంఘించి జరిమానా కట్టాల్సివచ్చింది. బీజేపీ ఎంపీ విజయ్ గోయల్ ఆప్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసమే బేసి-సరి విధానం అమలు చేస్తోందంటూ మండిపడ్డారు. అంతేకాదు ఆ నిబంధనను ఉల్లంఘిస్తానని చెప్పి ఒకరోజు ముందే ప్రకటించారు. దీనిలోభాగంగానే ఆ తర్వాత పార్లమెంటుకు వెళుతుండగా రైసినా రోడ్డు వద్ద ఆయనకు రూ.2 వేల అపరాధ చలానా రాశారు. అలాగే అనుమతి లేకుండా నడపడం, వాహన బీమా లేకపోవడంతో మరో రూ.1500 కూడా విధించారు.
మరోవైపు.. రాజకీయ ప్రయజనాల కోసం ఆప్ ప్రభుత్వం ఈ విధానంపై ప్రకటనలకు భారీగా ఖర్చు చేస్తున్నందుకు నిరసనగానే తాను నిబంధనలను ఉల్లంఘించాననీ, అలాగే, చోదక అనుమతి, బీమా పత్రాలు తన చోదకుల వద్ద ఉన్నాయనీ, అత్యల్ప ప్రయత్నం పథకానికి తాను విజయవంతంగా నిరసన తెలపగలిగినట్లు బీజేపీ ఎంపీ ట్వీట్ చేయడం గమనార్హం.